కలియుగ ఋష్య శృంగులు..
1983 జులై నెలలో కర్నూలు లో ముగ్గురు కంచి స్వాములు చాతుర్మాస దీక్ష చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి వారిని చూడడానికి వేలాదిగా జనం వచ్చారు.
స్వామి వారలు రాక పూర్వమే కర్నూలులో వర్షాభావ పరిస్థితి నెలకొని ఉంది. నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందంటే 300 అడుగులు తవ్వినా నీటి జాడ లేదు.ముగ్గురు స్వాములు స్నానానికి సమీపంలో నదికెళ్తే మోకాలు లోతు నీరు కూడ లేదు.పరమాచార్య వారు చాతుర్మాస దీక్ష లో భాగంగా వ్యాస పూజ చేసారు.
వ్యాస పూజ జరిగి 12గంటలు కూడ గడవక ముందే నీరు ఎక్కడ నుంచి వచ్చిందో నది కట్టలు తెగే లాగ నీరు ప్రవహించింది. మరునాడు కర్నూలు లో కుంభ వృష్టి కురిసింది. జగద్గురువులు పాదం మోపిన ఫలితమని పట్టణ ప్రజలు ఆనందించారు.
***వాల్మీకి రామాయణం బాలకాండలో ఋష్య శృంగుని వర్ణన...
తత్ర చానీయ మానేతు
విప్రే తస్మిన్ మహాత్మని
వవర్ష సహసా దేవో
జగత్ ప్రహ్లాదయం స్తదా.
*మహాత్ముడుగు ఆ ఋష్య శృంగుడు అంగ దేశం లో కాలిడగానే సర్వ ప్రపంచానికి సంతోషం కలిగించేలా వెంటనే వర్షం కురిసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి