**పురాతన శివాలయానికి పూర్వవైభవం**....
**ఆ పరమశివుడికే దారి చూపించిన శ్రీ నృసింహ సేవా వాహిని**......
**ఎంత ధన్యులమో కదా ఆ శివయ్యే మన సేవలకోసం ఎదురు చూడడం **.....
**మరో భక్త కన్నప్పలా సేవల్లో తరించిన శ్రీ నృసింహ సేవా వాహిని*
చర్ల మండలo లోని శివలింగాపురం గ్రామంలో గుట్టపై కొలువై ఉన్న అతి పురాతన శివాలయంలో గత 10 సంవత్సరాల నుండి ధూప దీప నైవేద్యాలకు కూడా నోచుకోక కనీసం గుట్టపైకి వెళ్లడానికి దారి కూడా లేదు. ముళ్ళు కంచెలతో గుట్టంతా అపరిశుభ్రంగా ఉన్నది.చర్లలోని మన నృసింహ సేవా వాహిని బృందం ద్వారా విషయాన్ని తెలుసుకున్న మన సంస్థ వ్యవస్థాపకులు డా.కృష్ణ చైతన్య స్వామి వెంటనే స్పందించి ఈ రోజు ఉదయం భక్తులు, మరియు గ్రామస్తులు సహాయ సహకారాలతో గుట్ట పరిసర ప్రాంతాలన్నీ శుభ్రపరిచి, ఆలయానికి రంగులు వేయించి,స్వామి వారికి అభిషేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగినది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇంత మహిమాన్వితమైన శ్రీ చక్ర శివాలయంలో మా నృసింహ సేవా వాహిని బృందం ఆధ్వర్యంలో సేవలందించడం
మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, నేటి నుండి పరమశివుని వైభవం దశ దిశలా వ్యాప్తి చెందేలా మనమందరం కృషి చేయాలనీ,ధర్మ పరిరక్షణ మనందరి భాద్యత అని అన్నారు. అలానే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఆలయంలో ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలను స్వామికి సమర్పించాలని, మున్ముందు ఆలయం లో ఎటువంటి ఆటకం లేకుండా సంస్థ ఆధ్వర్యంలో సహకారం అం అందిస్తామని తెలియజేశారు. ఇంత చక్కని కార్యక్రమం చేసిన మన నృసింహ సేవా వాహిని బృందానికి భక్తులు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అవకాశం ఉంటే మీరు ఒకసారి దర్శించి తరించండి.
**నిజంగా ఆది దేవుడికే మార్గం చూపిన మన నృసింహ సేవావాహిని సంస్థ ఎంత ధన్యతనొందెనో కదా **
భగవద్ సేవలో....మీ
డా. కృష్ణ చైతన్య
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి