14, మార్చి 2023, మంగళవారం

భగవద్గీత


* భగవద్గీత.


1. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సమ మామకా: పాణ్ణవాశ్చైవ కిమకుర్వత సంజయ॥

ఓ సంజయా! ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధము చేయవలెనని కాలం బలంగా కలిగిన వాళ్లు అయిన నా కుమారులు, మరియు నా తమ్ముడు పాండురాజు కుమారులు, ఏమి చేస్తున్నారు. వివరంగా చెప్ప అని ధృతరాష్ట్రుడు సంజయుని అడగడంతో గీతాశాస్త్రము ప్రారంభం


వ్యాసుల వారు భగవద్గీతను ధర్మ అనే పదంతో మొదలుపెట్టారు. ధర్మము అందరూ ఆచరించవలసినది. ధర్మాచరణము అందరికీ అత్యంత ఆవశ్యకము, ధర్మం, రక్షింపబడిన నాడు ఆ ధర్మం మనలను రక్షిస్తుంది. అందుకే ధర్మో రక్షతి రక్షితః అని ఆర్యోక్తి. గీతలో కృష్ణ ధర్మస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఉద్ఘాటించారు. ధర్మమును స్థాపించడానికి ప్రతియుగంలో నేను జన్మిస్తాను అని చెప్పారు. కాబట్టి ధర్మము మానవాళికి అత్యంత ముఖ్యమైన సంపద. అందుకే ఈ భరతభూమి ధర్మక్షేత్రమై విలసిల్లింది. అటువంటి భరతభూమిలో కురుక్షేత్రము ఉంది. కురు మహారాజు పేరిట కురువంశము వర్ధిల్లింది. ఆ కురుమహారాజు యజ్ఞం: చేయడానికి ఆ క్షేత్రమును దున్ని చదునుచేసాడు. అందుకని ఈ ప్రదేశమునకు కురుక్షేత్రము అని పేరు వచ్చింది అని చెబుతారు. క్షత్రియ కులమును సమూలంగా నిర్మూలించిన పరశురాముడు, వారి రక్తముతో ఇక్కడే తన తండ్రికి శరణము విడిచాడనీ, ఆ క్షత్రియుల రక్తం ఐదుపాయలుగా పారిందనీ, దాని పేరే శమంతక పంచకము అనీ అది ఈ కురుక్షేత్రములో ఉందని చెబుతారు. అటువంటి కురుక్షేత్రములో పాండవులు, కౌరవులు రాజ్యం కోసం యుద్ధం చేయడానికి

ఈ శ్లోకం ధృతరాష్ట్రుడు సంజయుని అడగడంతో మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రమును ధరించిన వాడు. అంటే కురు సామ్రాజ్యమునకు రాజు. ఈ కురు సామ్రాజ్యము ధృతరాష్ట్రుడు సంపాదించలేదు. అది అతని పిత్రార్జితము. తనది కాని దానిని తనని అనుకునేస్వభావము కలవాడు. ఈ గుణము మనలో చాలా మందికి ఉంది. మనం పుట్టక ముందు ఈ భూమి ఉంది. మనం పోయిన తరువాత కూడా ఈ భూమి ఉంటుంది. కాని మనం ఈ భూమి మీద బతికిన 100 సంవత్సరాల పాటు ఈ భూమి వాది అని అనుకుంటున్నాము. మనది కాని భూమి మీద విపరీతమైన మమకారము పెంచుకుంటాము. ఉన్న భూమిని కాపాడుకోడానికి, లేని నానా తంటాలు పడుతుంటాము. అనేకమైన అడ్డదార్లు తొక్కుతుంటాము. సెంటు భూమి కొరకు అయిన వారిని కూడా కడతేరేవాళ్లు ఉండటం మనం చూస్తున్నాము. అజ్ఞానము. ఈ అజ్ఞానము పోగొట్టే భగవద్గీత.


రాష్ట్రునికి సారథి, అంతరంగినుడు, జ్ఞాని సమ్మక్ జయతి

సంజయః అని అంటారు. అంటే ఇంద్రియములను మనసును జయించిన వాడు. నువ్వు, నేను

నిన్నది ఉన్నట్టు చెప్పగలిగిన ధైర్యశాలి. వ్యాసుని అనుగ్రహమును పొందినవాడు. అందుకే సంజయునికి శ్రీకృష్ణుని ముఖతా గీతను వినే మహద్భాగ్యం కలిగింది..


విశ్వరూప దర్శనమును పొందగలిగాడు.

కురుక్షేత్రము అంటే కురు రాజుల యొక్క అధీనంలో ఉన్న విశాలమైన కురుభూమి. అక్కడ ఎంతో మంది మునులు, ఋషులు తమ ఆశ్రమాలు నిర్మించుకొని తపస్తు చేసుకుంటున్నారు. పూర్వము బ్రహ్మగారు ఇంద్రుడు, అగ్ని ఇక్కడ తపసు చేసారనీ, కురు వంశ మూల పురుషుడు. అయిన కురుమహారాజు ఈ ప్రదేశములో ఎన్నో ధర్మకార్యాలు చేసాడని ప్రతీతి. ( ప్రస్తుతము ఇది పంజాబు రాష్ట్రంలో ఉంది)


ఇప్పుడు పాండవులు, కౌరవులు, వారి మిత్రపక్షరాజులు అందరూ కలిసి యుద్ధం చేయడానికి ధర్మ క్షేత్రము అయిన కురుక్షేత్రంలో సిద్ధం అయ్యారు. వారి సైన్యములు అంతా కలిపి 18 అక్షకుడీలు, ఒక అక్షౌహిణి అంటే 21,870 రథములు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రములు ,,రంతా కలిసి ఒక అక్షౌహిణి అంటారు. ఇటువంటి అక్షౌహిణీలు పాండవులు. 7, కౌరవుల పక్షాన 11 నిలిచిఉన్నాయి. మరి ఇన్ని లక్షల మంది యుద్ధం చేయాలంటే విశాలమైన భూమి కావాలి కదా. దాని కొరకు ఈ కురుభూమిని ఎన్నుకున్నారు. అప్పటివరకు |హూమ ధూమముతోనూ, వేదఘోషలతోనూ, వర్ణకుటీరములతోనూ శోభిల్లిన కురుభూమి: యుద్ధపరోషలతో, ఆయుధ విన్యాసాలతో, అస్త్ర శస్త్ర ప్రయోగాలతో, సైనికుల అరుపులతో కురుక్షేత్రంగా మారి పోయింది.


మన శరీరం కూడా ఒక కురుక్షేత్రమే అందులో మంచి ఆలోచనలు పాండవుల అయితే దుర్మార్గముతో కూడిన ఆలోచనలు కొరవ సేనలు. నాటి మధ్య జరిగే ఘర్షన కురుక్షేత్ర సంగ్రామము.


కామెంట్‌లు లేవు: