14, మార్చి 2023, మంగళవారం

*స్త్రీ మూర్తిని

 🌿🌼🙏యావత్తు సృష్టిని.. ఒక్క గంటలో తయారు చేయగల్గిన దేవుడు.. *స్త్రీ మూర్తిని తయారు చేయడానికి మాత్రం వారం రోజులు కష్ట పడ్డడంట.* ఎందుకో తెలుసుకోవాలంటే మనసు పెట్టి చదవాలి 🙏🌼🌿


🌿🌼🙏మగాడితో సహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు. 🙏🌼🌿


🌿🌼🙏ఒక రోజూ రెండు రోజులూ కాదు. ఏకంగా వారంరోజులు తీసుకున్నాడు..స్త్రీ సృష్టికోసం. మిగిలిన పనులన్నీ మానుకుని..తన నాథుడు స్త్రీ సృష్టికోసం ఇంతగా తలమునకలైపోవడం చూసిన దేవత అడిగింది... "స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని?". 🙏🌼🌿


🌿🌼🙏అప్పుడు దేవుడు.. "ఏం చెయ్యను మరి...

ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా... ఇష్టాయీష్టాలకతీతంగా ఉండాలీ..

సృష్టి. వివక్ష తగదు. మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. 🙏🌼🌿


🌿🌼🙏చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసులవరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా... ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా...ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. 

అడిగేవారు ఉండరూ ఉండకపోవచ్చు...రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి. ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే...." అన్నాడు.🙏🌼🌿


🌿🌼🙏"ఏంటీ? ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా?" అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది. "ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం" అని ప్రశ్నించింది. 🙏🌼🌿


🌿🌼🙏అప్పుడు దేవుడు.."ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు. 

కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. 

అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు, ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు. 🙏🌼🌿


🌿🌼🙏ఇష్టం,  కష్టం, ప్రేమ, కోపం, తాపం, అంటూ అన్ని భావోద్వేగాలనూ ఆమె చవిచూడాలి. 

అవసరమైతే దిగమింగాలి. కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు. 

ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమానురాగాలను...." అన్నాడు.🙏🌼🌿


🌿🌼🙏"ఓహో. ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది. అప్పుడు దేవుడు.. "ఎందుకాలోచించదు? 

అన్ని విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు..." అన్నాడు.🙏🌼🌿


🌿🌼🙏దేవత ఆమె చెక్కిళ్ళను తాకి "ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ? కన్నీరు కారుస్తోందిగా....ఏంటిది? " అని అడిగింది.🙏🌼🌿


🌿🌼🙏అప్పుడు దేవుడు.. "అదా...కన్నీరది. 

ఆ కన్నీటిలో ఆనందమూ ఆవేదనా దుఃఖమూ దిగులూ ఆశ్చర్యమూ భయమూ అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి. 🙏🌼🌿


🌿🌼🙏ఆ కన్నీటికున్న  శక్తి అనంతం....

పైగా మరో జీవీకి ప్రాణంపోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది" చెప్పాడు. 🙏🌼🌿


🌿🌼🙏దేవత ఆశ్చర్యపోతూ "మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే. .." అని చెప్పింది. 🙏🌼🌿


🌿🌼🙏అయితే దేవుడు.. "అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా..వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటివరకూ తెలియనట్టే ఉంటుంది..." అవసరమైనప్పుడు..*ఆ శక్తి ముందూ.. ఎవరూ నిలబడలేరు..🙏🌼🌿

అని చెప్పి భూమ్మీదకు పంపాడు స్త్రీని...!!


🌿🌼🙏ఇదంతా చదువుతుంటే.. మన జీవితంలో జరిగిన ఎన్నో ఘటనలు జ్ఞప్తికి వస్తున్నాయి కదా..🙏🌼🌿


🌿🌼🙏అందుకనే ఏమో *స్త్రీని పుడమి తల్లి తో పోల్చారు*.. 🙏🌼🌿


శ్రీమాత్రే నమః

కామెంట్‌లు లేవు: