14, మార్చి 2023, మంగళవారం

ఒక్క ఉత్తముడు చాలు.

 శ్లోకం:☝️

*కిం జాతైర్బహుభిః పుత్రైః*

  *శోకసంతాపకారకైః ।*

*వరమేకః కులాఽఽలంబీ*

  *యత్ర విశ్రామ్యతే కులం ॥*


భావం: తమ చెడు ప్రవర్తనతో దుఃఖాన్ని, శోకాన్ని మిగిల్చే బహు సంతానం కన్నా కుటుంబాన్ని ఉద్ధరించి వంశానికి ఆనందాన్ని కలిగించే ఒక్క ఉత్తముడు చాలు.

నూరుగురు సంతానం ఉన్నా ధృతరాష్ట్రుడికీ, గాంధారికీ శోకమే మిగిలింది.

ఒక్క భగీరథుడు గంగని భామిమీదకి దింపి మొత్తం సగరవంశాన్ని ఉద్ధరించాడు.

కామెంట్‌లు లేవు: