13, సెప్టెంబర్ 2023, బుధవారం

వినాయక చవితి ఎప్పుడు?

 వినాయక చవితి ఎప్పుడు?

శాస్త్ర ఆధారంతో

**********************

అందరికి షేర్ చెయ్యగలరు

జ్యోతిష్య,గృహ వాస్తు,దేవాలయ ఆగమశాస్త్ర పండితులు.

దైవజ్ఞ చక్రాల రాఘవేంద్రశర్మ సిద్దాంతి

సెల్ 9110577718

కావలి

***********************

💐భాద్రపద శుక్లచతుర్థీ వినాయకచతుర్థీ | సామధ్యాహ్న వ్యాపినీ గ్రాహ్యా ! తదా చోక్తం బృహస్పతినా 

 చతుర్థీ గణనాధస్య మాతృవిద్దా ప్రశస్యతే|

మధ్యాహ్న వ్యాపినీ చేత్స్యాత్ పరతశ్చేత్ పరేహని॥ 

💐దిన ద్వయేపి వర్తేత మధ్యాహ్నేచేత్ చతుర్థికా | తదా పూర్వైవ కర్తవ్యాన పరాతు కదాచన || 

నవర్తతే చతుర్థీ చేన్మధ్యాహ్నే తుదినద్వయే |  

 💐బ్రహ్మపురాణే : 

భాద్రేమాసి సితే పక్షే చతుర్థీ యాశివ స్మృతా |

తస్యాం దన్తిం సముద్దిశ్య స్నాన దానాదికం చ యత్ 

💐వినాయక చవితి 18 తేదీనే ఆచరించాలి.

ఎందుకంటే చవితి తిధి మధ్యాహ్నం వరకు  ఉండాలి.సూర్యోదయం తరువాత ఉన్నాలేకున్నా

సంబంధం లేదు.

💐భాద్రపదమాసంలో శుక్లపక్షమంలో చవితి

తిధి మధ్యాహ్న వ్యాప్తికి ఉన్నరోజే వినాయక చవితి.

💐పూర్వ సిద్దాంతం ప్రకారం

18 తేదీ సోమవారం  ఉదయం తదియ 10-4 నిముషాల వరకు ఉన్నది తదుపరి ఉదయం10-5 నుండి మరుసటి రోజు అనగా 19తేదీ మంగళవారం ఉదయం 10-32 వరకు చవితి ఉన్నది.

💐ఐతే ఇదివరకే చెప్పినట్టు 19 తేదీ చవితి ఉదయం ఉన్నది కానీ మధ్యాహ్నం లేదు.

మధ్యాహ్నం పూట చవితి ఉంటేనే ఆరోజు వినాయక చవితి చెయ్యాలి.

💐అదీకాక 18 తేదీ తదియతో కూడిన చవితి ఉంది కనుక విశేషఫలము.

**************

18 తేదీనే వినాయక చవితి ఆచరించాలి


మీ చక్రాల

కామెంట్‌లు లేవు: