13, సెప్టెంబర్ 2023, బుధవారం

మాయ మాటలు

 ప్రభుత్వ  నిధులతో చర్చ్ లు -


చంద్రబాబు చర్చ్ లకు డబ్బులు ఇస్తాం అన్నారు .. ఇచ్చారు


2002 నుండీ లక్ష రూపాయలు చర్చ్ కట్టుకునేదానికి ఇస్తాం అంటూ చట్టం చేసారు. జీవో దీని మీద మొట్టమొదట విడుదల చేసింది చంద్రబాబు గారు.


మధ్యలో ఉన్న పాలనా కాలములో కాంగ్రెస్ వాళ్ళు ( అంటే మన రాజన్న ) దీని ఎంత వాడుకుని రాష్ట్రం ని చర్చ్ ల మయం చేసారో అది మాత్రం అడక్కూడదు.. ఆ ఊసెత్తకండి.


2016 లో చంద్రబాబు చర్చ్ కు మూడు లక్షల చొప్పున ఇస్తామని అంటూ ఆయన చట్టం చేసారు.


2018 లో చంద్ర బాబు చర్చ్ కు మూడు లక్షల నుండి అయిదు లక్షల చొప్పున ఇస్తామన్నారు.


అరే అయన అపుడు ఇచ్చి ఇపుడు మేమీయక పోతే బాగోదు కదా - అందుకే ఇస్తున్నాం అంటూ ఇపుడు వైకాపా వాళ్ళ వీరంగం. నిజమే ఇలా దారుణాలు చేయబట్టే వాళ్లకు మడత కుర్చీ వేశారు మొన్న ఎన్నికల్లో . 


ఇంకా మీరు కూడా మాకూ అదే కావాలి అంటూ చెబుతున్నారా ? సరి సరి


మా రాష్ట్రములో హిందువు అని చెప్పుకునేవారు వీరి మాయ మాటలు నమ్ముతూనే ఉంటారు కాబట్టి .. వారి వారి వ్యక్తిగత స్వార్థాలకు వీరికి వోట్ వేస్తూనే ఉంటారు, మా కులం వాడు , మావాడు.. మాకు లాభం ఉంది ఇతని ద్వారా అంటూనే ఉంటారు .. అంత వరకూ వీళ్ళ భద్రతకేమీ లోటు ఉండదులెండి

కామెంట్‌లు లేవు: