23, జనవరి 2022, ఆదివారం

చింతామణి నాటకానికి గ్రహణం

 *తెలుగు నాటకరంగానికి' బ్లాక్‌ డే….!!


*నూరేళ్ళ చింతామణి నాటకానికి గ్రహణం…!!


*ప్రజాస్వామ్యంలో కూడా ఫ్యూడల్ మనస్తత్వం..!!


*నాటకాన్ని నిషేధించినవారు..కాళ్ళకూరివారి చింతామణి 

 ని అసలు చదివారా?


*నాటక ప్రదర్శనలో బలవంతంగా 'జొప్పించిన' బూతు

 ను నిషేధించాలా? లేక సందేశాత్మక నాటకాన్ని  నిషేధిం

 చాలా?


*కాళ్ళకూరి వారి చింతామణి లో "బూతెక్కడ " వుంది?


*సంస్కరణ వాదానికి అద్దంపట్టిన చింతామణిని 

 నిషేధించి సమాజానికి మనం ఇచ్చే మెసేజ్ ఏమిటి?


*నేటి సినిమాలు,సీరీయళ్ళలోని బూతులు,ద్వంద్వార్ధాలు

కాళ్ళకూరి చింతామణిలో లేవు కదా?


*రోగం ఒకచోట ..వైద్యం ఇంకోచోటనా? నిషేధం అర్థంలేని నిర్ణయం కాదా?


నిజానికి చింతామణి నాటకంలో వున్నదేంటి..?


ఇక చదవండి...ఆలోచించండి..!!  


*చింతామణి కూడా ఓ సంస్కర్త..!!


ఈతరం వారు మిస్సవుతున్న నాటకరాజం….

కాళ్ళకూరి వారి “చింతామణి “.!!


“చింతామణి “, పేరు వినగానే నొసలు చిట్లించుకుంటాం.

రామ ! రామ ! అంటూ చెవులు మూసుకుంటాం.ఆ పేరు వింటేనే ఏదో పాపం చేసినట్లు ఫీలవుతాం.వాస్తవానికి చింతామణి ఓ సంస్కర్త.వేశ్యాకులంలో పుట్టి వేశ్యావృత్తిని స్వీకరించినా చివరకు  తప్పును తెలుసుకొని తన్నుతాను

సంస్కరించుకుంటుంది.వేశ్యాలోలత్వం మంచిది కాదని సమాజాన్ని మేల్కొలుపుతుంది.వేశ్యగా తాను సంపాదిం

చిన ధనరాశుల్ని తిరిగి వాపసు చేస్తుంది.యోగినిగా మారి

పోయి భగవధ్యానంలో తరిస్తుంది.


*ఎవరీ చింతామణి ?


కాళ్ళకూరు నారాయణరావు రాసిన “చింతామణి"నాటకం

లోని నాయిక పేరే చింతామణి.సమాజసంస్కరణ కోసం ప్రధానంగా వేశ్యపాత్రను సృష్టించడం ఆరోజుల్లో కొత్తేం కాదు.గురజాడ అప్పారావుగారితో నాటకాల్లో ఈ ధోరణి అలవడింది. కన్యాశుల్కంలో జగమెరిగిన జాణ “మధుర

వాణి”పాత్రను సృజించి అప్పట్లో ఓ కొత్త ట్రెండ్ ను ప్రవేశ పెట్టారు గురజాడ.అప్పటినుండి వేశ్య పాత్రల్ని జొప్పించి

నాటకాలు రాయడం అలవాటుగా మారింది.కాళ్ళకూరి వారు కూడా గురజాడ వారి బాటలో మరో అడుగు

ముందుకేసి “చింతామణి “ పాత్రను ఓ సంస్కర్తగా,ఆదర్శ నారిగా తీర్చిదిద్దారు.అప్పట్లోసమాజంలో వేళ్ళూనుకున్న వ్యభిచార దురాచారాన్ని ' కాంతాసమ్మితంగా ‘ రక్తికట్టించి ప్రేక్షకుల పై బలమైన ముద్ర వేశారు.జనాన్ని ఆలోచించేలా చేశారు.


కాళ్ళకూరు వారి చింతామణి ఏ సంఘ సంస్కర్త కంటే ..

తక్కువ కాదు.చింతామణి తన కులవృత్తిని స్వీకరించినా,

చివరకు బుద్ధి వికసించి,బురదలోని పద్మంలా ప్రకాశించిం

ది.ఒక మంచి నాటకం ప్రజల ఆలోచనా విధానంలో

మార్పు తెస్తుందనడానికి చింతామణి నాటకం ఓ చక్కని ఉదాహరణ.మనుషుల్లో సహజంగావుండే వేశ్యా వ్యామో

హం పట్ల కళ్ళు తెరిపిస్తుందీ నాటకం.అంతే కాదు వేశ్యా సంపర్కం పట్ల జుగుప్సను,విముఖతను కూడా కలిగి

స్తుందీ నాటకం!


 “జీవితమే ఓ నాటక రంగం...మనమంతా పాత్రధారులం “అని   ప్రముఖ నాటక కర్త షేక్స్పియర్ అన్నమాటలు చింతామణి నాటకానికి బాగా వర్తిస్తుంది.జీవితమనే 

నాటక రంగంలో చింతామణి ఒక  పాత్ర మాత్రమే.ఆ పాత్ర

ద్వారా సమాజంలో పాతుకుపోయిన ఓ దురాచారానికి చరమగీతం పాడాలని ఆశించాడు ఈ నాటక రచయిత కాళ్ళకూరి .


చింతామణి నాటకం అనేసరికి బూతులబుంగ,ముతక 

హాస్యం,అన్న ఓ అపప్రథ వుంది.నిజానికి ఈ నాటకం ఆద్యంతం ఎక్కడా బూతు లేదు.అర్వపల్లి సుబ్బారావు, గండికోట జగన్నాథం లాంటివృత్తి కళాకారులు కొందరు సందర్భాన్ని బట్టి,ప్రదర్శన ప్రాంతాన్ని బట్టి మూలంలో లేని బూతు సంభాషణల్ని,ముతక హాస్య, సన్నివేశాల్ని జొప్పిం

చారు.దీంతో చింతామణి అంటే ఓ చవకబారు నాటకం,

సంస్కారవంతులెవరూ చూడ కూడదన్న అపోహ నెల

కొంది.నిజానికి కాళ్ళకూరి వారి చింతామణి నాటకం ప్రదర్శన యోగ్యమైంది.పండిత,పామర జన రంజకమైంద

నడంలో ఎటువంటిసందేహం లేదు.


*ఇతివృత్తం…!!


బిల్వమంగళుడు,రాధ ఆదర్శ దంపతులు.దామోదరుడు బిల్వమంగళుడి మిత్రుడు.తండ్రి వార్థక్యంవల్ల బిళ్వ మంగ

ళుడు వ్యాపారభారాన్ని నెత్తినేసుకుంటాడు.అదే నగరంలో చింతామణి అనే వేశ్య వుంటుంది!ఆమె తల్లి  శ్రీహరికి డబ్బు పిచ్చి.చింతామణి  అందచందాల్ని వలగా విసిరి విటుల్నిఆకర్షించి వారివద్దనుంచి 💰 డబ్బు గుంజేది.

భవానీ శంకరం,సుబ్బిశెట్టి వంటి వారు ఇలా చింతామణి

 మోజులో పడి తమ సర్వస్వం కోల్పోతారు.


వ్యాపారంలో లక్షలు గడిస్తుప్న బిల్వమంగళుడిపై చింతా

మణి దృష్టిపడుతుంది.బిల్వ మంగళుడు సదాచార సంప

న్నుడు.నగరంలోమర్యాదస్తుడు.పెద్దమనిషి.బిల్వమంగళుడ్ని ఎలాగోఅలాగుతన దగ్గలకు తీసుకువస్తే కొంత సొమ్ము 

ముట్టజెబుతానంటూ చింతామణి భవానీ శంకరాన్ని

ప్రలోభ పెడుతుంది.భవానీ శంకరం మొత్తానికిబిల్వమంగ

ళుడ్ని తీసుకువచ్చి చింతామణి కి పరిచయం చేస్తాడు.

చింతామణి అందచందాలు,నాట్య విన్యాసాలు చూసి ముగ్ధుడైపోతాడుకట్ చేస్తే..చింతామణి మాయలో పడి ఉన్నదంతా చింతామణికిమర్పించుకుంటాడు . బిల్వ

మంగళుడు.సమాజంలో పరువు ప్రతిష్టలు దిగజారిపో

తాయి.పండంటి కాపురం కూలి పోతుంది.భార్య రాధ 

పరిస్థితి అత్యంత దయనీయంగా తయారవుతుంది.


డబ్బులేదని తమ ఇంటికిరావద్దంటుంది చింతామణి

తల్లి శ్రీహరి.ఉన్నదంతా మీకే ఊడ్చి ఇచ్చానుగాఅంటా

డు బిల్వమంగళుడు.అయినా డబ్బులేకండా రావడానికి వీల్లేదంటూ తెగేసి చెబుతుంది శ్రీహరి.ఇక చేసేది లేక డబ్బుకోసం ఇంటికొస్తాడు  బిల్వమంగళుడు.


వేశ్యా వ్యామోహం  వదులుకోమంటాడు  తండ్రి.  బిల్వ

మంగళుడు ‌తండ్రి మాటల్ని పెడచెవిన పెడతాడు.దీంతో మిగిలిన ఆస్తుల్ని కోడలు రాధ పేర రాసి మరణిస్తాడు బిల్వమంగళుడి తండ్రి.చివరకు తనపేర వున్న ఆస్తిని కూడా  భర్తకే రాసి ఇచ్చేస్తుంది రాధ.


*కామాతురాణాం…..!!


తన తండ్రి ఇంట్లో శవంగా పడివున్నా పట్టించుకోడు.

దహన సంస్కారాలను చేయకుండా ఆస్తిపత్రాలను

తీసుకొని అంత రాత్రి పూట చింతామణి దగ్గరకు బయ

లుదేరుతాడు.వర్షం జోరుగాకురుస్తుంటుంది నది ఒడ్డున వున్న చింతామణిని చేరాలంటే నావ అవసరంవుంటుం

ది.అయితేఅంత రాత్రి నావ ఎక్కడ  దొరుకుతుంది?

అందుకే నదిలో దూకి ఈదటం మొదలుపెడతాడు.

ప్రవాహవేగం  ఎక్కువగా వుండి కొట్టుకుపోయే పరిస్థితి కలుగుతుంది.ఇంతలో ఓ ఆధారందొరుకుతుంది.దాన్ని పట్టుకొని ఒడ్డుకు చేరతాడు.తీరా చూస్తే తాను పట్టుకున్న ఆధారం ‘శవం ‘అని తెలుస్తుంది.”కామాతురాణాం..న భయం..న లజ్జ “ అని ఊరికే అన్నారా? బిల్వమంగళుడి

పరిస్థితీ అదే.


ఈలోగా….,


ఈలోగా అక్కడ చింతామణి కి జ్ఞానోదయంఅవుతుంది.

వేశ్యావృత్తిని మానేస్తుంది.దైవారాధనలోకాలం గడుపు

తుంటుంది.ఈ విషయం బిల్వమంగళుడికి తెలీదు!.

ఆస్తిపత్రాలతో చింతామణి ఇంటికి చేరుకుంటాడు... బిల్వమంగళుడు.!


*అక్కడి వాతావరణమే వేరు.!!


బిల్వమంగళుడికి చింతామణి ఇంటి వాతావరణం వేరు

గా కనిపిస్తుంది .గతంలో మాదిరిగామల్లెలు,పన్నీరు, సుగంధాలు కనబడవు.కేవలం  బదులు అగరొత్తుల వాసన మాత్రం వస్తుంటుంది.రసిక,సంగీత నాట్యాలకు బదులు వైరాగ్య భరితమైన మీరా భజనలు వినిపిస్తుం

టాయి.బిల్వమంగళుడికిదేం అర్థం కాదు.మతి పోతుంది.

అసలు తానొచ్చింది చింతామణి ఇంటికేనా? అన్న అను

మానం కలుగుతుంది.


చింతామణి వుండే గదిలోకి వెళతాడుబిల్వమంగళుడు.

అక్కడ చింతామణిని చూసి అవాక్కవుతాడు.పట్టు చీర 

కట్టుకొని ఒంటినిండా భరణాల్ని ధరించి,సిగలోమల్లెచెండు 

తురిమి,తనను సరస సల్లాపాలతోతనను కవ్విస్తూ,సుఖ

భోగాలతో అలరించే అపూర్వఅందాలరాసి...నారచీర

కట్టి,నుదుట విభూతితో,ఏక్ తారను మీటుతూ మీరా భజన ఆలపిస్తుంటుంది. చింతామణిని ఇలా చూసి జీర్ణించుకో లేక పోతాడు.బిల్వమంగళుడు.అయితే ….

బిల్వమంగళుడ్ని దగ్గరకు పిలిచి ఓదారుస్తుంది చింతా

మణి.తనలో కలిగిన ఈ ఆథ్యాత్మిక మార్పును తెలియ

జేస్తుంది!అశాశ్వతమైన శారీరక ఆనందం కంటే ఆత్మానం

దం గొప్పదనిచెబుతుంది.బిల్వ మంగళుడికి కనువిప్పు కలుగుతుంది.బిల్వమంగళుడికి సోమగిరి యోగితో పరిచయం కలుగుతుంది. ఆ యోగి దగ్గర శ్రీకృష్ణ మంత్రో

పదేశాన్ని పొంది సన్యాసిగా మారిపోతాడు.ఆయోగి వెంటే 

వెళ్ళిపోతాడు బిల్వమంగళుడు.” దైవభక్తే మానవజీవితా

నికి మోక్ష సాధన “, అన్న సందేశంతో నాటకంముగుస్తుం

ది.వేశ్యావ్యామోహం పట్ల ప్రేక్షకులకు / పాఠకులకుఛీత్కా

రం కలుగుతుంది.


*చింతామణి వ్యక్తిత్వం..!


చింతామణి అందాల రాసి.సకల విద్యలు నేర్చిన నెరజా

ణ.సంగీత,సాహిత్యాల్లో నిష్ణాతురాలు.నాట్యంలోమయూ

రి.లోకానుభవానికి కొదవే లేదు.అయినా కులవృత్తి రీత్యా

సానికాక తప్పలేదు!కులవృత్తి లోకాచారమే కదా ! అని సరిపెట్టుకుంది.వేశ్యాకులంలో పుట్టినా సంస్కారవంతు

రాలు.కాబట్టే మంచీ చెడులవిచక్షణను గుర్తెరిగి ప్రవర్తిం

చేది.


తన వ్యామోహంలో పడి సర్వంసమర్పించుకొని,ఉత్తచేతు

లతో మిగిలిన భవానీ శంకరాన్ని బయటకు గెంటేయ మం

టుంది తల్లి శ్రీహరి.అయితే చింతామణి ఇందుకు ఓపట్టా

న అంగీకరించదు.తల్లికి నచ్చజెప్పబోతుంది.అయినా భవానీ శంకరాన్ని ఇంటినుంచి బలవంతంగా గెంటేస్తుంది శ్రీహరి.నిజానికిచింతామణి కి వేశ్యా కుల సహజ లక్ష

ణాలు అంతగా ఒంటబట్టలేదు.వేశ్యకు కూడా నీతి వుం

టుందని చింతామణి నిరూపించింది.


“తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి నీకే సమర్పించు

కున్నాను.”గదా! 


అని భవానీ శంకరం అన్నప్పుడు…


“నేను మాత్రంవనీకేం తక్కువ చేశాను ? నీకోసం 

నా చుట్టూ తిరిగే విటుల్ని పంపివేశాను. మా అమ్మ

కసురుకుంటున్నానీకే లోబడి వున్నాను కదా “,

అంటుంది. 


“నీవు లోటు చేశావని యే ఛండాలుడన్నా డని” 

భవానీ శంకరం  అంటాడు


తసుకున్న డబ్బుకు న్యాయం చేయడం చింతామణికి వృత్తితో పెట్టిన విద్య.అందుకే చింతామణి ప్రియవస్య,

సర్వాంగ సుందరి అంటాడు భవానీ శంకరం.


 *పాండిత్యం..!!


చింతామణి పాండిత్యంలో కన్యాశుల్కం లోని మధుర

వాణి కంటే మిన్నగా కనిపిస్తుంది. బిల్వమంగళుడు చింతామణి కోసం సర్పం,సంపెంగ పూవు,శివుడు రాహు

వు రూపాలన్న  దంతపు పెట్టెను తెచ్చి తెరవకుండా,

వీటి ఆధారంగా లోపల ఏముందో కనిపట్టమంటూ ‘

సవాలు విసురుతాడు.అలా తెలుసుకోగలిగితే మరో మంచి బహుమతి కూడా ఇస్తానంటాడు.చింతామణి 

ఈ సవాలును స్వీకరిస్తుంది.పెట్టెలపై వున్న గుర్తులను బట్టి లాజిక్ వెదుకుతుంది.


"దంతపు పెట్టెపై మొదట సర్పం వున్నది.సర్పం దేనినిని హరింప గలదు?  మారుతమును….మారు తము దేని

కొరకు వచ్చును.? పరిమళము కొరకు వచ్చును.?

పరిమళము దేనియందు..వుండును? పుష్పాదుల

యందు...అందువల్ల పెట్టెలోని వస్తువు పుష్పాదులలో

నిది కావలెను.


ఇక రెండవ గుర్తు సంపెంగ పూవు.‌సంపెంగ దేనినిహరింప 

గలదు?తుమ్మెదను.తుమ్మెద దేని కొరకు వచ్చును? మకరందము కొరకు.మకరందము దేనియందుండును? పుష్పమందు.అందు వల్ల పెట్టెలోని వస్తువు పుష్పమగుట నిశ్చయము.కానీ ...ఏ పుష్పమో? తేలాలి.


మూడవ గుర్తు శివుడు.శివుడు ఎవరిని వారించును? మన్మథుని. మన్మథునికే పుష్పము కావలెను? అరవింద

ము.అశోకము,చూతము,మల్లిక,నీలోత్పలము, అందువల్ల పెట్టెలోనిది పుష్పమే కావలెను.


ఇక నాల్గవ గుర్తు రాహువు.రాహువు ఎవరికి శత్రువు? సూర్యునకు.సూర్యునికే పుష్పము ప్రియము? ఇంకే

ముంది? కమలమే.కావున పెట్టెలో వున్నది కమలమే “అంటుంది చింతామణి.

   

చింతామణి పాండిత్యానికి అబ్బురపడతాడు బిల్వమంగ

ళుడు! పెట్టెతెరచి అందులో వున్న  వజ్రకమలాన్ని తీసు

కోమని ఇస్తాడు. ఇక బహుమతిగా ఏం కావాలో కోరుకో

మంటాడు.

   

"నాకెప్పటి నుంచో కామ శాస్త్రం చదువుకోవాలని వుంది.

ఇప్పటి దాకా సరైన బోధకులు నాకు దొరకలేదు.మీరది తీర్చిన చాలును “అంటూ పీటముడి వేస్తుంది .చింతా

మణి. నిజానికి  బిల్వమంగళుడికి సమస్త శాస్త్రాలు తెలు

సన్న విషయం చింతామణి కి ముందే తెలుసు. అతన్ని లోబరుచుకోడానికే బహుమతి మిషతో కామశాస్త్రం నేర్పమంటుంది.దీనివల్ల ఎలాగూ బిల్వమంగళుడు తనకు కామదాసుడవుతాడు.


*జ్ఞానోదయం..!!


వేశ్యగా తన బతుకు పట్ల తనకే  హేయభావం ఏర్పడు

తుంది. దీంతో చింతామణికి జ్ఞానోదయం కలుగుతుంది.‍‍‌” 


"పాపిని,భ్రష్టురాలను,నతిబానిసనై బహు నీచ వృత్తిలో  లేపులు మావులుంబడిచరించిన మాటయె నిక్కువ,మింక పాపపు దారి త్రొక్కును.భవచ్చరణాబ్ది యుగంబు సాక్షిగా నాప ప్రేమ నిల్పియదు నందన కృష్ణా తరింప జేయవే "

అంటూ తనను తాను తిట్టుకుంటూ కష్ణారాధనకు…..

అంకితమవుతుంది.


చింతామణి సహజ సంస్కారం వల్ల ఆథ్యాత్మిక చింతన పొంది ,తన వల్ల నష్టపోయిన వారందరికీ ధనాన్ని తిరిగి ఇచ్చివేస్తుంది.భవానీ శంకరం,బిల్వమంగళుడు,సుబ్బి శెట్టి,వంటి వారిలో పరివర్తన  కలుగజేస్తుంది. 


*సంస్కరణ..!!


చింతామణి ముందుగా తన్ను తాను సంస్కరించుకుంటుం

ది.తన వల్ల కష్టాలు పడిన వారందరూ తనవలె పరివర్తన చెందాలని కోరుకుంటుందివేశ్యావవ్యామోహం,వేశ్యా సంప

ర్కం వల్ల వాళ్ళకు   కలిగిన కష్టాన్ని,నష్టాన్ని లోకంలోతిరిగి 

ఓ ఆర్నెల్లు ప్రచారం చేయాలని కోరుతుంది.చింతామణి

మాటను మన్నించి సుబ్బిశెట్టి,భవానీ శంకరం,వేశ్యావ్యా

మోహ వ్యతిరేక ప్రచారానికి పూనుకుంటారు!

బిల్వమంగుళుడు కృష్ణ దర్శనానికి మధురానగరానికి బయలుదేరి వెళ్తాడు.


కాళ్ళకూరి వారి చింతామణి పాత్ర ఉదాత్తమైంది. కేవలం జాతివల్ల గాక,నీతివల్ల మాత్రమే మనుషుల్ని,వారి మన

స్తత్వాల్ని గ్రహించాలని చింతామణి పాత్ర ద్వారా లోకానికి చాటి చెప్పాడు  రచయిత.


ఈ నాటకం గొప్పదనమేమంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఓ మూల ఈ నాటకం నిరంతరం ప్రదర్శింపబడుతూ

నే వుంటుంది.ఈ నాటకంలోని 


*అత్తవారిచ్చిన అంటుమామిడి తోట…”


*వగలును,వలపులు వర్షించి తొలినాడె తిరగని పిచ్చి యెత్తించినాను “


వంటి పద్యాలు ఎన్నిమార్లు విన్నా..'వన్స్ మోర్లు".. పడాల్సిందే.మరో మాట అర్వపల్లి సుబ్బారావు (సుబ్బిశెట్టి ) బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి (చింతామణి ) కనకం (శ్రీహరి ) షణ్ముఖ (బిల్వమంగళుడు )కాంబి

నేషన్లో చింతామణి నాటక ప్రదర్శనను తిలకించడం 

ఓ మధురానుభూతి. ఈ నాటక ప్రదర్శనను ఎన్నో…

మార్లు చూడటం నా అదృష్టం.రాత్రి 9గం.లకు నాటకం మొదలైతే..అదిపూర్తయ్యేసరికి తెల్లారేది..ఎన్నిసార్లు చూసినా తనివి తీరని నాటకం చింతామణి !!

                                                                                *ఎ.రజాహుస్సేన్ !!

  నంది వెలుగు..!!

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అంతర్వేది

 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అంతర్వేది


తూర్పు గోదావరి జిల్లా లో వున్న  పుణ్యక్షేత్రం అంతర్వేది మూడు పాయలుగా చీలిన గోదావరి నది పాయ వశిష్ఠ గోదావరి అంతర్వేదిలో వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. అంతర్వేది త్రికోణాకారపు (లంక) దీవిలొ వుంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యతీర్థం భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రం.... పురాణాలలో కూడా దీని ప్రస్థావన ఉంది. అతి ప్రాచీన ఆలయం ఇది. ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువుతీరాడు....

గోదావరీ నదికి ఇటువేపు ఉన్న "సఖినేటి పల్లి" మండలానికి చెందిన "అంతర్వేది" తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో వుంది. గోదావరి దాటి అంతర్వేది చేరుకోవచ్చు. సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇది దక్షిణ కాశిగా పేరుపొందింది. కాశీకి వెళ్ళలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్ళి వస్తే చాలని అంటారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించవచ్చు

ఇక్కడి స్థలపురాణం: సూతమహాముని అంతర్వేదిని గురించి శౌనకాది మహర్షులకు చెప్పినట్లు తెలుస్తుంది. ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్టమహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది.

రక్తావలోచనుని కథ:  హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరం కోరుతాడు. రక్తావలోచనుని శరీరం నుంచి పడిన రక్తపు బిందువులు ఇసుక రేణువులమీద పడితే ఆ ఇసుకరేణువుల నుంచి బలవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలనే వరం పొందుతాడు. ఆ వరగర్వంతో యఙ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఒకసారి విశ్వామిత్రుడికి, వశిష్టుడికి జరిగిన సమరంలో రక్తావలోచనుడు విశ్వామిత్రుని ఆఙ్ఞపై వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు పుత్రులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్ధించగా విష్ణుమూర్తి లక్ష్మీసమేతుడై నరహరి అవతారంతో రక్తలోచనుడుని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడి శరీరం నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు. నరశింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తి నుపయోగించి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా చేస్తాడు. అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు.ఈ రక్తకుల్య లోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రవరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వపాపాలు హరిస్తాయని చెబుతారు. ఇంకో కథ ప్రకారం హిరణ్యకశిపుని సంహరించిన స్వామి అనంతరం తన శరీరాన్ని అంతరిక్షంలోకి విసిరేసినపుడు అది ఈ ప్రాంతంలో పడిందని అందుకే అంతర్వేది అని పేరు వచ్చిందని కూడా ప్రచారంలో వుంది.

త్రేతాయుగంలో... శ్రీరాముడు సీతా సమేతుడే లక్ష్మణ, హనుమంతులతో కూడి వశిష్ఠాశ్రమాన్ని, లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి, సేవించినట్లు అక్కడే కొన్ని రోజులు నివసించినట్లు అక్కడి శిలా శాసనాలవల్ల కూడా తెలుస్తోంది. ఓం నమో వేంకటేశాయ

 Share to your group

పూజా పునస్కారాలు

 ఒక తల్లి తన నిత్యపూజ అయిన తర్వాత విదేశాల్లో వుండే తన కుమారునికి వీడియో చాట్ చేసి తన కుమారుని కి ఖాళీ గా ఉన్నాడా లేడా అని కనుక్కుని తన వీడియో చాట్ లో జరిగిన సంభాషణలు. మీ మన కోసం....


     తల్లి...నాయనా .పూజా పునస్కారాలు ఐనాయా?

కుమారుడు...ఇలా చెప్పారు.

అమ్మా!నేను ఒక జీవ శాస్త్రవేత్తని.అది కూడా అమెరికాలో  మానవ వికాసానికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నాను. మీరు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినే వుంటారు.అలాంటి నేను పూజ లు అవి ఏం బాగోదు.

   తల్లి మందహాసం తో కన్నా!నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసు కన్నా.కానీ అతను కనిపెట్టినవి అన్ని మన పురాతన ధర్మంలో ఉన్నవేకదా నాన్నా.....అన్నది.

కొడుకు వ్యంగ్యంగా అలాగా అమ్మ నాకు తెలీదే అని అన్నాడు.

అపుడు ఆ తల్లి నీకు అంత ఆసక్తిగా వుంటే చెపుతా విను అని కొంచెం మృదువుగా తన సంభాషణ కొనసాగించింది. ..


నీకు దశావతరాలు అది మహా విష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు కదా.....

కొడుకు ఆసక్తిగా అవును తెలుసు దానికి ఈ  జీవ పరిణామానికి ఏమిటీ సంభంధం అని ప్రశ్నించాడు.

 అప్పుడు ఆ తల్లి...హా సంభంధం ఉంది. ఇంకా నువు నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా చెపుతాను విను.

     మొదటి అవతారం మత్స్య అవతారం.అది నీటిలో ఉంటుంది.అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది.ఇది నిజమా కాదా.

  కొడుకు కొంచెం అలెర్ట్ గా వింటున్నాడు.

   తర్వాత రెండవది కూర్మ అవతారం. అంటే తాబేలు.దీనిని బట్టి సృష్టి నీటి నుండి భూమి మీదకు ప్రయాణించిన ట్టుగా గమనించాలి.అంటే ఉభయచర జీవులు లాగా తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం జరిగింది.

 మూడవది వరాహ అవతారం అంటే పంది.ఇది అడవి జంతువు లను అంటే బుద్ధి పెరగని జీవులు అదే డైనోసార్ల ని గుర్తు కు తెస్తుంది.

  ఇక నాలుగో అవతారం నృసింహ అవతారం. అంటే సగం మనిషి సగం జంతువు.దీన్ని బట్టి మనకు జీవ పరినామం అడవి జంతువు నుండి బుద్ధి వికసితమై న జీవులు ఏర్పడ్డాయి అని తెలుస్తుంది.

ఇక ఐదో అవతారం వామన .అంటే పొట్టివాడు అయిన ఎంతో ఎత్తుకు పెరిగిన వాడు.నీకు తెలుసుకదా మానవులు మొదట హోమో erectes మరియు  హోమో సేపియన్స్ అని వున్నారు అని వాళ్లలో హోమో సేపియన్స్ మనుషులు  గా వికాసం చెందారు.

  కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండిపోయాడు.

తల్లి కన్నా ఆరో అవతారం పరశురాముడు. ఈ పరశురాముడు గండ్రగొడ్డలి ని పట్టుకు తిరిగేవాడు.దీని వల్ల ఎం తెలుస్తుందంటే ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు తయారు చేసుకొన్నాడు. మరియు అడవులు గుహలో నివసించే వాడు మరియు కోపిష్ఠి ఆటవిక న్యాయం కలిగినవాడు.

 ఇక ఏడో అవతారం రామావతరం.మర్యాద పురుషోత్తముడైన రాముడు మొదటి ఆలోచన పరుడైన సామాజిక వ్యక్తి. అతను సమాజానికి నీతి నియమాలు .సమస్త కుటుంబ బంధుత్వనికి అది పురుషుడు.

 ఇక ఎనిమిదవ ది కృష్ణ పరమాత్మ. రాజనీతిజ్ఞుడు పాలకుడు ప్రేమించే స్వభావి.అతడు సమాజ  నియమాలను ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో తెలిపినవాడు. వాటితో సమాజము లో వుంటూ సుఖ దుఃఖ లాభ నష్టాలు అన్ని నేర్పినవాడు.

కొడుకు ఆశ్చర్యం విస్మయం తో వింటున్నాడు.

ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ

 తర్వాత తొమ్మిదో అవతారం బుద్ధ అవతారం.ఆయన నృసింహ అవతారం నిండి మానవుడిగా మారిన క్రమం లో మర్చిపోయిన తన  సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు.ఇంకా అతను మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కొంటు చేసే ఆవిష్కరణ లకు మూలం.

ఇక వచ్చేది కల్కిపురుషుడు.అతను నీవు   ఏ మానవునికై వేతుకోతున్నావో  అతనే ఇతను. అతను ఇప్పటివరకు వరసత్వానిగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్ఠమైన వ్యక్తి.గా వెలుగొందుతాడు.

కొడుకు తన తల్లివంక అవాక్కాయి చూస్తున్నాడు

   అపుడా ఆ కొడుకు ఆనంద భాష్పలతో అమ్మ...హిందు ధర్మం ఎంతో అర్థవంతమైన  నిజమైన ధర్మం. అని అన్నాడు

    ..

. ఆత్మీయులారా !!

                 మన వేదాలు ,గ్రంథాలు,పురాణాలు,ఉపనిషత్తులు,

ఇత్యాది అన్ని ఎంతో అర్థవంతమైనవి. కానీ మనం చూసే దృష్టి కోణం మారాలి.మీరు ఎలాగ అనుకొంటే అలా వైజ్ఞనికమైనవి కావచ్చు.లేదా ధర్మ పరమైనవి కావచ్చు. శాస్ట్రీయత తో కూడిన ధర్మాన్ని నేడు మూఢచారాలు పేరిట మన సంస్కృతి ని మనమే అపహాస్యం చేసుకొంటున్నాం.ఇకనైనా మేలుకోండి రుషులు ఏర్పరచిన సనాతన ధర్మాన్ని పాటించుదాం.

మనంమారుదాం. యుగంమారుతుంది...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

నేతాజీ జయంతి

 నేతాజీ జయంతి శుభాకాంక్షలు. 


    జై హింద్ నినాదంతోనూ, 

   "ఆజాద్ హింద్ ఫౌజ్" అనే భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసీ, 

    భారత స్వాతంత్ర సమరంలో ఎంతో ఉత్తేజ పరచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి జాతి ఇప్పటికీ ఎంతో నేర్చుకోవలసి ఉంది.  

    

అందుకు ప్రబల ఉదాహరణ


    ఆ రోజుల్లో మహాత్మాగాంధీ మాటకి తిరుగుండేదే కాదు. 

    భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆయన మాటను ధిక్కరించి నిలబడడమే ఎంతో సాహసం. 

    కాంగ్రెస్ సాధారణ సభ్యత్వం నాలుగు అణాలు. గాంధీ కాంగ్రెస్సులో తనకు నాలుగణాల సభ్యత్వం కూడా లేదంటునే, నేతాజీకీ ప్రత్యర్థిగా భోగరాజు పట్టాభి సీతారామయ్యని నిలబెట్టి, "పట్టాభి ఓటమే నా ఓటమి" అని ప్రకటించినా, 

    అటువంటి పరిస్థితులలో దానికి ఎదురీది, గెలిచిన నేతాజీని చూసి మనమెంతో నేర్చుకోవాలి కదా! 

    గెలిచి చూపించి, రాజీనామా చేసిన ఆయన ధైర్యమూ, త్యాగమూ మన యువతకు అలవడితే, మన జాతి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం. 


    అడుగు ముందుకేద్దాం. 

    నేతాజీ మనకిచ్చిన మార్గంలో పయనించి, దేశ ఔన్నిత్యాన్ని నిలబడదాం. 


                జై హింద్

BRAHMINS KITCHEN

 *ONLY BRAHMINS KITCHEN* *(OBK)*


*హైదరాబాద్ లో ఇంటి వద్దకే ప్రతీరోజూ బ్రాహ్మణ భోజనం*


బ్రాహ్మణుల వంట శుచిగా పంపించబడును

 

*మల్కాజిగిరి/ఆనందబాగ్/సఫిల్ గూడా/నేరెడ్ మెట్/సైనిక్ పురి/AS రావు నగర్ / రాధిక థియేటర్ / ఈస్టు మారేడుపల్లి / వెస్ట్ మారేడుపల్లి/ ముషీరాబాద్ / చిక్కడపల్లి / RTC X రోడ్స్ / గాంధీ నగర్/ విద్యా నగర్ / నల్లకుంట / సాకేత్ / దమ్మాయిగూడా* మొదలగు సమీప ప్రాంతాల్లో ప్రతిఇంటికి ప్రతిరోజూ శాఖాహార భోజనం *నెలవారీ పద్ధతిలో మాత్రమే* సప్లై చేయబడును... *కాయకూర, పప్పు, సాంబారు, పచ్చడి* ఉదయం క్యారెజి వస్తుంది.


మా ఇంటి (బలరాంనగర్, సఫిల్ గూడ) నుండి *మూడు కిలోమీటర్ల వరకు సరఫరా మాత్రం ఉచితం* గా పంపబడును...


మా ధరలు ఈ క్రింది విధంగా ఉంటాయి...


పచ్చడి (60-80 గ్రాములు)

పప్పు (100-120 గ్రాములు)

కాయగూర (100-120 గ్రాములు)

పులుసు (100-120 గ్రాములు)


పై వన్నీ కలిసి ధర రూ. 80/-


పై వాటికి అన్నం (400 గ్రాములు) కలిపి కావాలంటే ధర రూ. 100/-


*ఈ పై ధరలు 3 కీలోమీటర్ల వరకు మాత్రమే...*


ఒకవేళ మీకు సాయంత్రం చపాతీలు కావలస్తే, మేము సరఫరా చేయగలం, కానీ అవి మధ్యాహ్న భోజనంతో పాటే ఇచ్చేస్తాము... వాటి ధర రూ. 60/-  (మూడు చపాతీ, ఒక కూర)


మీరు మీ ఇంటి స్థానం (location) పంపినట్లైతే, మీ ఇల్లు ఉన్న దూరం google ద్వారా చూసి మూడు కిలోమీటర్ల పైన ఎంతదూరం ఉంటే అన్ని కిలోమీటర్లు ₹.10/- తో గుణించి పై ధరకు కలపటం జరుగుతుంది...

ఇది కూడా మొత్తము దూరం మా ఇంటి వద్ద నుండి 8 నుంచి10 కిలోమీటర్ల లోపు మాత్రమే మా సేవలు అందుబాటులో ఉంటాయి...


మీకు అవసరం ఐతే కాల్ చెయ్యండి,  లేకుంటే *దయచేసి మీ వద్ద ఉన్న *బ్రాహ్మణ* సమూహాలలో ఈ పోస్టు షేర్ చెయ్యమని ప్రార్థన...🙏🙏🙏


శాఖహరులకు మాత్రమే సంప్రదించ వలసిన చరవాణి /  ఫోను నెంబర్లు  7382754039 / 9966066021

Star Enterprises



To see more posts like this and join ALL INDIA BRAHMIN FEDERATION, click here 👇👇


https://kutumbapp.page.link/XHzm1mv1XfRpkggy5

22, జనవరి 2022, శనివారం

తిరుమల 7 కొండలు

 తిరుమల 7 కొండలు..పరమార్ధం

తిరుమల 7 కొండలు..


1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి.


ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానం లో ఉంటుంది.


అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు.


1. వృషభాద్రి - అంటే ఎద్దు. వ్రుశాభానికి ఋగ్వేదం లో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములున్టాయ్. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)


వాక్కు అంటే - శబ్దం

శబ్దం అంటే - వేదం

వేదం అంటే - ప్రమాణము


నా కంటితో చూసిందే నిజమంటే కుదరదు. నిజం కానివి చాలా ఉంటాయ్. సుర్యోదయం, సూర్యాస్తమయం అని అంటున్నారు. నిజం గా దాని కన్నా అభద్దం ఉంకోటి లేదు. సూర్యుడికి కదలిక ఏమి ఉండదు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి తిరగడం మీరు చూసారా. భూమి సూర్యుడికి అభిముఖంగా వెళ్ళినప్పుడు చీకటి. తిరగనది సూర్యుడు. మీ కన్ను భ్రమకి లోనైట్ట లేదా. కాబట్టి వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.


2. వృషాద్రి - అంటే ధర్మం


ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు etc. దాని వల్ల ఇహం లోను, పరలోకం లోను సుఖాన్ని పొందుతాడు.


అవి చెయ్యడమే వృషాద్రి ని ఎక్కడం.


3. గరుడాద్రి - అంటే పక్షి - ఉపనిషత్తుల జ్ఞా నాన్ని పొందడం.

షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి.


పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. 


ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ 6 లేని వాడు భగవానుడు.


భ == ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు & అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.

అన్ == ఉన్నవాడు, కళ్యాణ గుణ సహితుడు, హేయగుణ రహితుడు.


అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.


4. అంజనాద్రి - అంజనం అంటే కంటికి కాటుక.

కాటుక ఎప్పుడు పెట్టుకుంటాం? అందానికి, చలవకి.


కంటికి అందం ఎప్పుడు? - ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే.


అప్పుడు అంజనాద్రి దాటతాడు.


5. శేషాద్రి - ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగ ద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీత లో గీత చార్యుడు చెప్పాడు,


తుల్య నిందా స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు) 


తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. (ఇక్కడ రమణ మహర్షి కొన్ని ఉదాహరణలు గురుంచి చెప్పారు ) ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.


6. వేంకటాద్రి - వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వాళ్ళలా కనవడుతారు అది మన కర్మ. రామ కృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చి వాడు ఒకలా ఉంటారు.


ఆయనకే అర్పణం అనడం & అటువంటి స్థితి ని పొందడం వెంకటాద్రి ఎక్కడం.


7. నారాయణాద్రి - అంటే తుల్యావస్థ ని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారయానాద్రి.


వేంకటాచలం లో 7 కొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఈ కారణాలు తెలుకుకోవడం 7 కొండలు ఎక్కడం


🙏సర్వేజనా సుఖినోభావంత్🙏

కూరగాయల రసాలు -

 వ్యాధుల చికిత్సలో ఉపయోగించవలసిన పచ్చి కూరగాయల రసాలు - 


 ప్రియమితృలకు నమస్కారం ,


      ఇప్పుడు నేను చెప్పబోయే పచ్చికూరగాయలు మరియు ఆకుకూరల పచ్చి రసాలు మీరు వ్యాధి నివారణ కొరకు తీసుకునే ఔషదాలు కు అనుబంధంగా తీసుకుంటూ ఉంటే మరింత తొందరగా మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. 


 * ఉబ్బసం , తీవ్ర జ్వరాల కొరకు - 


      పచ్చి క్యారెట్ , తొటకూర , కూరాకు ( endive ) రసాలను కలిపి తీసుకొనిన చాలా బాగా పనిచేస్తుంది .


 * మొటిమలు మరియు కాలిన బొబ్బలకు - 


        క్యారెట్ మరియు బీట్ రూటు రసాలను కలిపి వాడవలెను. ( పచ్చిరసం మాత్రమే ).


 * గాస్ట్రిక్ సమస్య కొరకు - 


        తోటకూర మరియు క్యారెట్ పచ్చిరసాలను రెండు పూటలా రెండు గ్లాసుల 

మోతాదుగా తాగవలెను .


 * గొంతు మీద వచ్చు కాయ ( goiter) కొరకు 


         క్యారెట్ మరియు వాటర్ క్రెస్ రసములను వాడవలెను .


 * గుండె సమస్యల కొరకు - 


         క్యారెట్ మరియు బీట్ రూట్ రసమును వాడవలెను.


 * మూలవ్యాది కొరకు - 


         క్యారెట్ మరియు కొత్తిమీర ఆకు కూర రసంని తాగించవలెను . 


 * అజీర్ణ వ్యాధి కొరకు - 


         క్యారెట్ మరియు తోటకూర రసం తాగవలెను .


 * ఎక్కువుగా ఉన్న రక్తపోటు కొరకు - 


         తోటకూర మరియు బీట్రూట్ మరియు క్యారెట్ రసంని వాడవలెను .


 * నిద్రసరిగ్గా పట్టనందుకు - 


          పడుకునే ముందు తోటకూర రసంని తాగవలెను .


 * మూత్రపిండాల బాధల కొరకు - 


           క్యారెట్ మరియు parsly అని కొత్తిమీర వంటి ఆకురసం తాగవలెను . జలోదరం అనగా పొట్ట నిండా నీరు చేరు రోగం కు కూడా ఇదే రసాల్ని వాడవలెను .


 * కాలేయ సమస్యల కొరకు - 


        క్యారెట్ , బీట్ రూట్ మరియు దోసకాయ   

రసాలని వాడవలెను .గాల్ బ్లాడర్ సమస్యలకు కూడా ఈ రసాలని తాగవలెను .


 * నరాల బాధల కొరకు - 


        తోటకూర మరియు లెట్యూస్ పచ్చి రసాలని తాగవలెను .


 * అధిక బరువు తగ్గించుట కొరకు - 


        తోటకూర , క్యారెట్ మరియు క్యాబేజ్ రసాలని తాగవలెను .


 * హృదయంకి నల్ల రక్తం తీసుకుని పోవు సిరలని బాగు చేయుట కొరకు - 


          క్యారెట్ , బీట్ రూట్ మరియు తోటకూర రసంలని తాగవలెను .


 * క్షయ వ్యాధి నివారణ కొరకు - 


          పచ్చి బంగాళా దుంపలు రసం పిండి ఒక గిన్నెలొ పోసి దానిలో పిండిపదార్థాలు అడుగుకు పేరుకొనునట్లు చేసి పైన రసముని ఒక గ్లాసుడు , అంతే పరిమాణంలో మరొక గ్లాసుడు బీట్రూట్ రసంని కలిపి దానిలో ఒక చెంచాడు ( tea spoon ) ఆలివ్ ఆయిల్ చేర్చి నురుగు వచ్చేవరకు చిలికి ఆ రసంని రోజుకి రెండు మూడు సార్లు ఇచ్చుచుండవలెను .


 * అల్సర్ , పెద్ద పేగుల్లో వాపు ( colitis) సమస్య నివారణ కొరకు - 


       క్యారెట్ లేదా క్యాబిజి రసం తీసికొనవలెను 


 * సిరలకు సంబందించిన వ్యాధి కొరకు - 


        క్యారెట్ , స్పినాచ్ మరియు turnip tops రసమును తీసుకొనుచుండవలెను .


 * ఎడినోయిడ్స్ , టాన్సిల్స్ వ్యాధుల కొరకు 


         టమోటా మరియు బీట్రూట్ రసాలు లేక క్యారెట్ మరియు బీట్రూట్ రసాలు కలిపి తాగవలెను .


 * రక్తహీనత కొరకు - 


          క్యారెట్ మరియు తోటకూర మరియు పాలకూర లేక క్యారెట్ మరియు బీట్రూట్ రసాలని కలిపి తాగవలెను .


 * సంధివాతం - 


          తోటకూర మరియు క్యారెట్ రసాలు తాగవలెను . 


 * ఉబ్బసం , రొమ్ము పడిశం , జలుబు నివారణ కొరకు - 


      ఒక ఔన్స్ ముల్లంగి తురుము , ఒక ఔన్సు నిమ్మరసం తో కలిపి రోజుకి రెండు సార్లు అరచెంచా చొప్పున తీసుకుంటూ క్యారెట్ , ముల్లంగి రసాలు తీసుకోవాలి . 


        మీగడ, ఐస్క్రీమ్ , గుడ్లు, పిండిపదార్థాలు చక్కెర బుజించరాదు . 


 * కాన్సర్ , శరీరం పైన కలిగెడి కాయలు , ఉబ్బు , వాపులు , శరీరంలో నీరు చేరుట , ఉపిరితుత్తులలో సమస్యల కొరకు - 


      క్యారెట్ , లెట్యుస్ , తోటకూర రసాలను సేవించాలి . 


 * రక్తప్రవాహంలోని దోషాల కొరకు - 


      క్యారెట్ , బీట్రూట్ రసాలను కలిపి సేవించాలి . 


 * మలబద్దకం సమస్య నివారణ కొరకు - 


        క్యాబేజి , తోటకూర , పాలకూర రసాలు కలిపి కాని లేక తోటకూర రసంని నిమ్మరసం కలిపికాని సేవించవలెను . 


 * మధుమేహము కొరకు - 


        తోటకూర , క్యారెట్ , తీగ చిక్కుడు రసాలని సేవించాలి . 


 * చర్మవ్యాధులు కొరకు - 


         క్యారెట్ , బీట్రూట్, తోటకూర రసాలని కలిపి సేవించాలి . 


 * కంటిజబ్బులు - 


         క్యారెట్ మరియు parsly అనగా కొత్తిమీర వలే ఉండు ఆకుకూర రసాలని సేవించవలెను . 


 * మూత్రావయవాలలో రాళ్లు , పిత్తాశయంలో రాళ్లు కరుగుట కొరకు - 


       క్యారెట్ , బీట్రూట్ , దోసకాయ రసాలను సేవించవలెను . 


 గమనిక - 


           పైన చెప్పిన సమస్యలకు ఔషదాలు వాడుకుంటూ పచ్చి కూరగాయలు , ఆకు కూరల రసాలని సేవించాలి . ఫలితం తొందరగా వస్తుంది.


            మంచి ఫలితాలు పొందవలెను అనుకుంటే రోజుకి కనీసం 180ml రసాన్ని లొపలికి తీసుకోవాలి . శీఘ్రంగా ఫలితం రావాలి అనుకునే వారు రోజుకి రెండు లేదా మూడుసార్లు సేవించవచ్చు . అయితే బీట్రూట్ రసం , parsly రసం మరియు water kres రసములను మరియు మితముగా తీసికొనవలెను . 6 ఔన్సుల మించి వాడరాదు. పైన చెప్పిన రసాల్లో ఏవైనా ఎక్కువ తీసుకోవాలి అంటే 180 ml వరకు తీసుకోవచ్చు . ఎక్కువ మోతాదులో తీసుకోవలసిన అవసరం వస్తే క్యారెట్ రసం గాని , తొటకూర రసంతో గాని తీసుకోవలెను . 


    గమనిక -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు 550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

మనుష్యధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన శ్రీరాముడు

 *రాముడిలో ఏమంత గొప్పదనం ఉంది?*

  మాయలు మంత్రాలు చూపించలేదు.

విశ్వరూపం ప్రకటించలేదు.  జీవితంలో ఎన్నో కష్టాలు... జరగరాని సంఘటనలు...  చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు...  పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు...  తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు...  కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు...  

అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షస       వధ చేశాడు...  

అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు.  లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా  అహం దశరథాత్మజః - దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించాడు.  అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది?  కారణం..


ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు. లోకానికి ఒకేఒక్కడుగా నిలిచాడు.


తండ్రి మాట కోసం వనవాసానికి సీత, లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య. పెద్దకుమారుడినైనా తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయానని బాధపడతాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది. తాను దశరథుడినని, పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది. కానీ, రాముడు ఇందుకు ఒప్పుకోడు. శాస్త్రప్రమాణాలు అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచుతాడు. నిజంగా నీవు దశరథుడవే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు. నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్నసమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి ఒక్కడే.


*స్నేహధర్మం*


మాయలేడి కారణంగా సీతమ్మను వదలి, పర్ణశాలను దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణులు. ఇదే అదనుగా భావించిన రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు. ఇదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగిస్తాడు. విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకుని, రావణుడిని ముప్పుతిప్పలు పెడతాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికివేస్తాడు. రెక్కలు తెగిన ఆ పక్షిరాజు  నేలకూలుతాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం పూర్తిగా చెప్పి, రాముడి చేతిలోనే ప్రాణం విడుస్తాడు. తనకు క్షేమం కలిగించటానికి ప్రాణాలకు తెగించిన జటాయువును ఆప్తమిత్రుడుగా స్వీకరించి, అతడికి ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహిస్తాడు రామయ్య. తాను క్షత్రియుడు. చేస్తున్నది వనవాసం. మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి, స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడా మహనీయుడు.


*యుద్ధధర్మం*


వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. తమ్ముడి భార్య కోడలితో సమానం. మామగారు తండ్రితో సమానం. తండ్రిలాగా కాపాడాల్సిన తమ్ముడి భార్యను కామంతో వాలి కోరుకున్నాడు. అంతేకాదు.. వాలి వనచరుడు. క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడటం క్షత్రియధర్మం. అంతేకాదు, ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంటుంది. దాన్ని ధరించిన సమయంలో వాలి ఎదుట ఎవరు నిలిచినా వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టే రాముడు చెట్టుచాటున దాగి, వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. ఇది యుద్ధధర్మం. వాలి వధ ఘట్టంలో రాముడు క్షత్రియ, యుద్ధ ధర్మాలను పాటించాడు.


రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడుగుతాడు. అప్పుడు రామచంద్రుడు

*"మరణాంతాని వైరాని నివృత్తం నఃప్రయోజనం క్రియతామద్య సంస్కారః మమాప్యేష యథాతవ!"* "విభీషణా! శతృత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు. నాకూ అన్నగారే’ అంటాడు... ఇదీ రాముడి ధర్మవర్తన. దయాధర్మం


సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి రాజ్యబహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు. సముద్రతీరంలో అపారమైన వానరసేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయిస్తాడు విభీషణుడు. మరో ఆలోచన లేకుండా విభీషణుడికి అభయం ఇస్తాడు రామయ్య. అంతేకాదు, రావణుడిని చంపి విభీషణుడిని లంకా రాజ్యానికి రాజును చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ, సుగ్రీవుడు మొదలైన వారికి ఇదంతా ఇష్టం లేదు. ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి, విభీషణుడిని నమ్మవద్దని చెబుతారు. అతడు రావణాసురుడి దూత అంటూ హెచ్చరిస్తారు. అంతా విన్న రాముడు విభీషణుడే కాదు... చివరకు రావణుడే తనను ఆశ్రయించినా.. అతడికి కూడా అభయం ఇస్తానంటాడు. ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించటం క్షత్రియధర్మం. దయాధర్మం కూడా. వనవాసంలో ఉన్నా, చివరకు యుద్ధభూమిలో ఉన్నా దయాధర్మాన్ని రామయ్య విడిచిపెట్టలేదు.


*మనుష్యధర్మం*


రామరావణ సంగ్రామం ముగుస్తుంది. రావణుడు నేలకు ఒరుగుతాడు. ముల్లోకాలూ ఎంతో ఆనందిస్తాయి. వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవుతారు. రాముడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపంగా స్తుతిస్తారు. ‘నీది విష్ణు అంశ. వాస్తవానికి నువ్వు నిరాకారుడివి. అయినా సాకారుడిగా ఉన్నావు. సృష్టి, స్థితి, లయలు నీవే నిర్వహిస్తావు...’ అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు. తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు. ‘ఆత్మానం మానుషం మన్యే... దశరథాత్మజః’ అంటూ తాను కేవలం దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే. సాధారణ వ్యక్తిని మాత్రమే’ అంటాడు. ఇదీ రామయ్య పాటించిన మనుష్యధర్మం. రామయ్య ఎక్కడా మాయలు, మంత్రాలు ప్రకటించలేదు. తాను దైవాన్నని చెప్పుకోలేదు. సాధారణ పౌరుడిలాగే రాజ్యభోగాలతో పాటు సుఖదుఃఖాలూ అనుభవించాడు. మనుష్యధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన అవతారమూర్తి శ్రీరాముడు.


*సోదరధర్మం*


రావణ వధ జరిగింది. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావలసిందిగా విభీషణుడుకి వర్తమానం పంపించి, విశ్రాంతిగా కూర్చున్నాడు రామయ్య. దూరôగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన వైపే వస్తోంది. ఆమె ఎవరై ఉంటుంది? రాముడి ఆలోచన సాగుతుండగానే ఆమె  ఎదురుగా వచ్చి నిలుచుంది. అమ్మా! నీవెవరు? ఎందుకిలా వచ్చావు? రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే నీకు భయంగా అనిపించటం లేదా? నా వల్ల ఏదైనా సాయం కావాలా? అంటూ రామయ్య ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు. అందుకామె సమాధానం ఇస్తూ, రామచంద్రమూర్తీ! నన్ను మండోదరి అంటారు. నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను. రామా! నీవు ధర్మమూర్తివనీ, ఏకపత్నీవ్రతుడవనీ,  సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలచవనీ విన్నాను. నా భర్త అనేకమంది స్త్రీలను చెరపట్టాడు. నీవంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని చూడాలనే కుతూహలంతో వచ్చాను. పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే నీ ఔన్నత్యం అర్థమైంది. రామా! ధన్యురాలను. ఇక సెలవు. అంటూ నిష్క్రమించింది. ఇదీ.. పరస్త్రీల పై రామయ్య చూపించే సోదరధర్మం.


పవిత్ర జీవితం కోసం, ముక్తి కోసం సాధన చేసే యోగులు రామునిలా జీవించాలని అనుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు. ఎలాగైనా ఉండొచ్చు. నిరీక్షించి.. కాలపరీక్షను ఎదుర్కోవడం వివేకవంతుల లక్షణం. రాముడూ అదే చేశాడు. ఎప్పుడూ ప్రణాళిక బద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేం. మన ప్రమేయం లేకుండా చికాకులు కలుగుతాయి. వాటికి కుంగిపోతే జీవితం గతి తప్పుతుంది. గుచ్చుకున్న ముల్లును నెమ్మదిగా తొలగించి ముందుకెళ్లాలి. అలా చేయగలిగితే అద్భుతమైన అనుభూతి మిగులుతుంది. ఏ విషయాన్నైనా సక్రమంగా నిర్వర్తించే సామర్ధ్యం పెరుగుతుంది. రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆరాధన కోసం కాదు. మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది అందులోని పరమార్థం. త్యాగం, ధర్మం, దయ, పరాక్రమం రామునిలోని గొప్ప లక్షణాలు. వీటిని పెంపొందించుకోవాలని చెప్పేదే రామాయణం.


🙏🙏.   🍌

21, జనవరి 2022, శుక్రవారం

కరోనా ఎందుకొస్తోంది

 *అసలు కరోనా ఎందుకొస్తోంది?" అన్న ప్రశ్న ఎవరినడిగినా ఒకటే చెబుతారు.*  

*'వైరస్' వల్ల వస్తున్నది'*


*'మరి వైరస్ అందర్నీ కాటేయడం లేదేంటి?'*

*'ఇంట్లో జాగ్రత్తగా ఉంటే రాదు'*

 

*'మరి ఇంట్లో ఉన్నవాళ్లకు కూడా చాలామందికి వస్తోంది కదా ?'*

*'గాలిలో వస్తోంది'*


*అదే గాలిని అందరూ పీలుస్తున్నారు కదా? మరి అందరికీ రావడం లేదెందుకు?*

*రోగ నిరోధక శక్తి లేనివాడికి వస్తోంది*


*'రోగ నిరోధక శక్తి ఎందుకు తగ్గుతోంది?*

*'తెలియదు'*


*ఇప్పుడు ఇంకో కోణం చూద్దాం.*


*'మా మామయ్య కూరగాయలకని మార్కెట్టుకి వెళ్ళొచ్చాడు. అక్కడ సోకింది'*

*మరి అక్కడే ఉంటూ, రోజంతా కూరగాయలు అమ్ముతున్న వాడికి ఎందుకని రావడం లేదు?*

*నో ఆన్సర్*


*'మా బాబాయి పాలప్యాకెట్ కని బయటకెళ్ళి వైరస్ అంటించుకున్నాడు'*

*మరి రోజంతా అదే షాపులో పాలప్యాకెట్లు అమ్ముతున్న వాడికి ఎందుకని రాలేదు?'*

*మళ్ళీ నో ఆన్సర్*


*'మా నాన్న వద్దంటున్నా వినకుండా బయటకెళ్ళి మామిడిపండ్లు కొన్నాడు. అక్కడ సోకి ఉంటుంది'*

*'రోజంతా ఎండలో రోడ్డుపక్కన కూచుని పండ్లు అమ్ముతున్న ఆమెకు ఎందుకని కరోనా సోకలేదు?'*

*మళ్ళీ నో ఆన్సర్*


*చివరకు ఇలా జవాబు వస్తుంది.*


*కాయకష్టం చేసేవాళ్లకు రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్లకు రాదు*


*ఏతావాతా తేలిందేమిటి?* *ఎవడికైతే రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటున్నదో వాడికి కరోనాయే కాదు. ఏ వైరసూ సోకదు. ఏ బాక్టీరియా సోకదు. ఏమీ కాదు*


*ఆయుర్వేద సృష్టికర్తలైన ఋషులు వేల ఏళ్ళనాడే ఏమేం చేస్తే, ఎలా బ్రతికితే, రోగనిరోధకశక్తి బాగుంటుందో చెప్పారు.*


*వినేవారేరీ? వింటే, జనం పోగుచేసుకుంటున్న చెడుకర్మను ఎవడ నుభవిస్తాడు? మంచి చెప్పినా ఎవడూ వినడు. విన్నట్టు విని వదిలేస్తాడు గాని ఆచరించలేడు.* 


*ఇప్పుడు విషయంలో కొద్దాం.*


*నేనింతవరకూ ఓవెన్ ను కొనలేదు. ఎందుకో తెలుసా? దానివల్లనే అమెరికాలో పెద్దప్రేగు కాన్సర్ వస్తున్నదని తెలిసింది గనుక.*


*నేనమెరికాలో ఉన్నపుడు ఒక విషయం గ్రహించాను. అమెరికాలో పొట్ట కేన్సర్లు చాలా ఎక్కువ.*

*ఎందుకని?*

*వినండి మరి.*


*స్టోర్స్ లో ఉన్న మాంసం ఎన్నో రోజులనుంచీ డీప్ ఫ్రిజ్ లో ఉంటుంది. మైనస్ డిగ్రీలలో ఉంటుంది. దాన్ని తెచ్చి, ఓవెన్లో పడేసి ఒకేసారి 160 ఫారెన్ హీట్ దాకా వేడిచేసెసి తింటారు. ఒకేసారి అంత టెంపరేచర్ తేడా వస్తే ఆ మాంసంలో ఏమౌతుంది? పైగా, మంటపైన. అక్కడ ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది. ఓవెన్ లో ఏ ఆక్సిజన్ ఉంటుంది?* 


*ఒక ఉదాహరణ చెప్తాను, వినడానికి అసహ్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం.* 


*చనిపోయిన దేహాన్ని మార్చురీలోని కోల్డ్ స్టోరేజిలో ఉంచడానికి, మాంసాన్ని, కూరగాయలను ఫ్రిజ్ లో ఉంచడానికి తేడా ఏంటి?*


*ఈరోజుల్లో, ఏ పూటకా పూట, ఏ రోజు కూరగాయలను ఆరోజున వేడివేడిగా వండుకుని, ఏపూట అన్నం ఆపూట వేడిగా వండుకుని ఎవరు తింటున్నారు?*


*చెప్పనా? రోజుకూలీలు తింటున్నారు. కాయకష్టం చేసుకునేవాళ్ళు తింటున్నారు. వాళ్ళు ఏ రోజుకు ఆ రోజున కూరగాయలు తెచ్చుకుంటారు. మంట మీద వండుకుని తింటారు. ఓవెన్ వాడరు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు.*


*సుఖానికిపోయే సంపన్నులు, ఫ్రిజ్ లో వారాల తరబడి ఆహారాన్ని మురగబెట్టుకుని తినేవాళ్లు, ఓవెన్లు వాడేవాళ్లు రోగాల పాలౌతున్నారు.*


*ఇన్ని సౌకర్యాలున్నప్పటికీ వంట చెయ్యదానికి బద్ధకిస్తూ, పొద్దున్నే ఒకేసారి అన్నీ వండిపారేసి, వాటినే రాత్రికి పెట్టుకుని తినేవాళ్లు రోగాలపాలౌతున్నారు.*


*జొమాటోలో ఆర్డర్ చేసి తెప్పించుకుని లొట్టలేసుకుంటూ మింగే తిండిలో ఏముంటుందో మీకు తెలుసా? అదెప్పటి ఆహారమో మీకు ెలుసా?*


*ఈ రోజున మిగిలిపోయిన ఫుడ్ ని ఏ హోటలువాడూ పారెయ్యడు. రేపు, ఎల్లుండి, ఎంతవరకూ దానిని ఉంచగలిగితే అంతవరకూ ఫ్రిజ్ లో ఉంచి, ఓవెన్లో ఇన్ స్టంట్ గా వేడిచేసి మీకు పంపిస్తాడు.*


*ఆ కుళ్లిపోయిన వేడివేడి ఆహారాన్ని లొట్టలేసుకుంటూ మీరు మింగుతారు. ఇక మీకు రోగాలు రాక ఏమౌతాయి మరి?*


*ప్రతిరోజూ చెమటపట్టేలా వ్యాయామం ఎవరు చేస్తున్నారు? ఏసీ జిమ్ముల్లో అమ్మాయిలూ అబ్బాయిలూ ఎగరడం కాదు. చక్కటి ఎండలో, ఆరుబైట గాలిలో ఎవరు వ్యాయామాలు చేస్తున్నారు?*


*ఆ చేసే వ్యాయామాలు మాత్రం ఏమిటి? కండలు పెంచే జిమ్మువ్యాయామాలు. అవి రోగనిరోదకశక్తిని పెంచగలవా? లేవు. ఏడాది పాటు పెంచిన కండలు, ఒక్క జ్వరంతో కరిగి వేలాడటం మొదలుపెడతాయి.* 


*మరెందుకవి? మనదైన యోగాభ్యాసాన్ని శుద్ధంగా చేస్తున్నవారెందరు?*


*అసలు కనీస వ్యాయామ మంటూ ఏదో ఒకదాన్ని ఏడుస్తున్నవారెందరు? ఎవరూ లేరు.*


*పొద్దున్న పదింటికి నిద్ర లేవడం, ఆ సోఫాలోనో, బెడ్ మీదనో రోగిష్టిలాగా పడుకుని, టీవీనో, మొబైల్ నో చూస్తూ, ఫోన్లో సొల్లు వాగుతూ ఉండటం.*

*టైమైతే జొమాటో ఆర్డర్ పెట్టడం, తిని మళ్ళీ మొబైల్లోకి చూస్తూ పడుకోవడం.*

*లేకపోతే ఆ ఫ్రిజ్ లో కుక్కిన పదిరోజులనాటి చెత్తను మింగడం. ఇది మన దినచర్య. ఇక రోగాలు రాక మరేమొస్తాయి?*


*"ఏదో రోగం వచ్చినపుడు కూడా ప్రకృతిసిద్ధమైన మందులు వాడకుండా, సింథటిక్ ముందులు వాడటం.*

*అక్కడకూడా డబ్బులు పారేసి పెద్దఆస్పత్రిలో చేరి దేహాన్ని వారికి అప్పజెప్పడం.* 

*అదృష్టం బాగుంటే ప్రాణంతో తిరిగి రావడం, లేదా శవంగా బయటకు రావడం.*

*దహనం కూడా ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో. ఇదీ మన బ్రతుకు.*


*వినడానికి అసహ్యంగా ఉంటుందని ముందే చెప్పాను.*


*ఎప్పుడైనా చూశారా మీరు? మామూలుగా దహనం చేసిన శవం బూడిద ఎలా ఉంటుందో? తెల్లగా ఉంటుంది. ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో వచ్చే బూడిదను ఎప్పుడైనా చూశారా? నల్లగా ఉంటుంది. ఆక్సిజన్ లేకుండా పెనం మీద అట్టు మాడినట్లు శవం అందులో మాడిపోతుంది. అది అసహజ ప్రక్రియ.* 


*బ్రతికున్నపుడూ అసహజంగా బ్రతకడం, చావులో కూడా అసహజమే.*


*సినిమాలు చూసి, ఫుడ్ కంపెనీల యాడ్స్ మాయలో పడి, మోడరన్ లైఫ్ ఉచ్చులో ఇరుక్కుని మనుషులు vari arogyamnu vare నాశనం అవుతున్నారు.* 


*అసలు మన దేశంలో ఫ్రిజ్ ఎందుకు? అవసరమా?*

*మనకు ఓవెన్లెందుకు? అవసరమా?* 

*మనకు జొమాటోలెందుకు? అవసరమా?*

*రోజంతా కదలకుండా పందుల్లాగా పడుకుని టీవీలు, మొబైళ్ళు చూడటం మనకెందుకు? అవసరమా?* *అర్ధరాత్రిళ్ళు, తెల్లవారు ఝామున నానాచెత్త తిండి తినడం అవసరమా?*


*ఏదీ అవసరం లేదు. ఇదేదీ సహజం కాదు. మరి ఇన్ని అసహజమైన, ప్రకృతి విరుద్ధమైన పనులు ప్రతిరోజూ చేస్తూ, మన రోగనిరోధకశక్తి గట్టిగా ఉండాలంటే ఎలా ఉంటుంది?*


*పోనీ మనసన్నా శుద్ధంగా ఉంటున్నదా? ఓర్వలేనితనం, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, కోపాలు, అహంకారాలు, గర్వాలు, ధనమదం, కులగర్వం, ఆశ, నాటకాలు, వేషాలు, పొగరు, లెక్కలేనితనం, అన్నీ నాకే తెలుసన్న మదం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో మన మనస్సులో ఉన్న దయ్యాలు.*


*ఒళ్ళూ కుళ్లిపోతూ, మనసూ కుళ్లిపోతూ, పైకిమాత్రం 'అంతా భలేబాగుంది' అనుకుంటూ బ్రతుకుతున్న ఇలాంటి స్థితిలో కరోనా ఎందుకు? గట్టిగా ఒక చిన్న గాలివీస్తే చాలు మనం నేలకూలిపోవడానికి.*


*ఏవిధంగా మనం ఆరోగ్యవంతులం అసలు?*

*మనల్ని చంపడానికి కరోనాయే అవసరం లేదు. చిన్న సూది గుచ్చుకుంటే కూడా, కుప్పకూలిపోయి, ప్రాణాలు పోయే రోజులున్నాయి.* 


*బుద్ధి కర్మానుసారిణి. ఎవడాపగలడు? ఎవడెన్ని చెప్పినా, ఎంత మంచిని చెవిలో వినిపించినా, ఎవడూ వినడు. ఆచరించడు.* 


*ఏ ఒక్కటీ కాదనలేని వాస్తవం. ఈ మెసేజ్ వల్ల కొందరైనా, కొంతైనా మారాలని, కనీసం మారే ప్రయత్నం చెయ్యాలని ఆశిద్దాం.*

అమ్మ తొలి గురువు

 ఒక బాలుడికి జట్కాబండిలో ప్రయాణించడం చాలా ఇష్టం. రోజూ బడికి జట్కాలోనే వెళ్లేవాడు.


పెద్దయ్యాక ఏం కావాలనుకున్నారని స్కూల్లో టీచరు అడిగారు.

ఒకరు డాక్టరని,

ఇంకొకరు ఇంజినీరని,

మరొకరు లాయరని

అన్నారు.


ఈ బాలుడు మాత్రం జట్కావాలా అవుతానన్నాడు.


టీచరు, పిల్లలు ఘొల్లున నవ్వారు. 


ఇంటికెళ్లేలోపే ఇది బాలుడి తల్లికి తెలిసి, ప్రశాంతవదనంతో


బాబూ! పెద్దయ్యాక ఏమవుతావని అడిగింది.


స్కూళ్లో చెప్పిందే చెప్పాడు.


తల్లి:

"అలాగే అవుదువుగానీ, ఇలా రా"

అంటూ పూజామందిరం తలుపులు తెరిచి,

"ఒక్క గుర్రంతో నడిపే బండి కాదు! నాలుగు గుర్రాలు నడిపే బండీకి నువ్వు జట్కావాలావి కావాలి, అదిగో ఆ శ్రీకృష్ణుడి లాగా" అని బోధించింది ఆ తల్లి


ఆ 4గుర్రాల పేర్లు

*ధర్మ, అర్థ, కామ, మోక్షాలనీ*,

ఆ *బోధించే జట్కావాలా జగద్గురువైన శ్రీకృష్ణుడనీ* చెప్పింది.

"నువ్వు కూడా జగత్తుకి

ఈ నాలుగింటిని బోధించే గురువువి కావాలి, సరేనా!" అంటూ అతడిఆలోచనను మలుపు తిప్పింది.


ఆ బిడ్డడే పెద్దయ్యాక వివేకానందుడయ్యాడు.


పెంపకం అంటే అదీ!

పిల్లలు తెలియక తప్పు చేసినా,

తప్పు మాట్లాడినా

దానిని సరిదిద్దాల్సింది తల్లే!


*అందుకే అమ్మని తొలి గురువు, తొలి దైవం అంటారు.*


 అమ్మ మాటలో ఎంతో మహత్తు వుంది కదా 🕉️🚩🕉️

సూక్ష్మ శరీరయానం



 మనం నానో టెక్నాలజీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం కానీ ఇదే విషయం సనాతన ధర్మం ఎన్నో ఏళ్లనుంచే చెప్తుంది..


హిమాలయాల్లో వందల సంవత్సరాలు జీవించే వ్యక్తులు ఉన్నారని విన్నాము కదా ఇదిగో సాక్ష్యం..

ఇలా ధ్యానంలో కూర్చుని ఎండ వాన చలి నుండి తట్టుకుని ఎలాంటి పరిస్థితిలోనైనా జీవించే శక్తి మన రుషులు, మునుల సొంతం.


ఇవాళ సైన్స్ పురోగతి సాధిస్తున్న అంశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది నానో టెక్నాలజీ. దీని మీద పాశ్చాత్య దేశాలు బిలియన్ల కోట్లు పెట్టి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దురదృష్టం ఏమిటీ అంటే ఈ నానో టెక్నాలజీ కొన్ని వేల సంవత్సరాలనాడే మన దేశంలో వుంది. ఇప్పటికీ వుంది. హిమాలయాల్లో సజీవంగా వుంది. వివరాల్లోకి వెళ్తే...


  మన ఋషులు,యోగులు, సాధువులు కొన్ని వేల ఏళ్ళ క్రితమే సూక్ష్మ శరీరయానం గురించి చెప్పారు. మనం పుస్తకాల్లో చదువుకున్న తపస్సునే ఇప్పుడు ధ్యానం అంటున్నారు. ఈ ధ్యానం ద్వారా అమోఘమైన సిద్ధులు సంప్రాప్తిస్తాయి. అందులో ఒకటి సూక్ష్మ శరీరయానం. దీన్ని నానో టెక్నాలజీలో అడ్వాన్స్డ్ స్టేజ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చేస్తున్న పరిశోధనల లక్ష్యం కూడా అదే. మన ఋషులు, యోగులు కోరుకున్నదే తడవుగా కోరుకున్న చోటికి ప్రయాణం చేసేవారు. 


వీటన్నింటికీ సమాధానం ఒకటే అదే సూక్ష్మ శరీర యానం. అదే నానో టెక్నాలజీ. నాగసాదువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం. ఎన్నో ఏళ్ళుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కన్పిస్తుంటే దాన్ని మనం నమ్మం.


అమెరికా వాడు, రష్యా వాడు, చైనా వాడు, జపాన్ వాడు,జర్మనీ వాడు చెప్పే సోది అంతా విని చంకలు ఎగరేస్తుంటాం. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలు చదవండి. వాటిని అనుసరించి, అమలు చేసే ప్రయత్నం చెయ్యడి. ప్రపంచానికి మళ్ళీ మనం పాఠాలు చెప్పొచ్చు.


అనేక మంత్రరహస్య గ్రంథాలున్నాయి

అనేక శాస్త్రాలున్నాయి!

వేదాలు, ఉపనిషత్తులు పురాణఇతిహాసాలున్నాయి!

ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలను, పురాణ గ్రంథాలను చదవండి.. వాటిని అధ్యయనం చేయండి, సద్గురువులను ఆశ్రయించండి, వారిని అనుసరించి, వారి అడుగుజాడలలో నడవండి! ప్రపంచానికి మళ్ళీ మనం పాఠాలు నేర్పించవచ్చు, జయహోభారత్!!

SANATAN DHARMA

 SANATAN DHARMA IS FREEDOM OF FAITH


By Francois Gautier

1) Believe in God ! – Aastik – Accepted

3) You want to worship idols – please go ahead. You are a murti pujak.

4) You dont want to worship idols – no problem. You can focus on Nirguna Brahman.

5) You want to criticise something in our religion. Come forward. We are logical. Nyaya, Tarka etc. are core Hindu schools.

6) You want to accept beliefs as it is. Most welcome. Please go ahead with it.

7) You want to start your journey by reading Bhagvad Gita – Sure !

8) You want to start your journey by reading Upanishads – Go ahead.

9) You want to start your journey by reading Purana – Be my guest.

10) You just don’t like reading Puranas or other books. No problem my dear. Go by Bhakti tradition . ( bhakti- devotion)

11) You don’t like idea of Bhakti ! No problem. Do your Karma. Be a karmayogi.

12) You want to enjoy life. Very good. No problem at all. This is Charvaka Philosophy.

13) You want to abstain from all the enjoyment of life & find God – jai ho ! Be a Sadhu, an ascetic !

14) You don’t like the concept of God. You believe in Nature only – Welcome. (Trees are our friends and Prakriti or nature is worthy of worship).

15) You believe in one God or Supreme Energy. Superb! Follow Advaita philosophy

16) You want a Guru. Go ahead. Receive gyaan.

17) You don’t want a Guru.. Help yourself ! Meditate, Study !

18) You believe in Female energy ! Shakti is worshipped.

19) You believe that every human being is equal. Yeah! You’re awesome, come on let’s celebrate Hinduism! “Vasudhaiva kutumbakam” (the world is a family)

20) You don’t have time to celebrate the festival.

Don’t worry. One more festival is coming! There are multiple festivals every single day of the year.

21) You are a working person. Don’t have time for religion. Its okay. You will still be a Hindu.

22) You like to go to temples. Devotion is loved.

23) You don’t like to go to temples – no problem. You are still a Hindu!

24) You know that Hinduism is a way of life, with considerable freedom.

25) You believe that everything has God in it. So you worship your mother, father, guru, tree, River, Prani-matra, Earth, Universe!

26) And If you don’t believe that everything has GOD in it – No problems. Respect your viewpoint.

27) “Sarve jana sukhino bhavantu ” (May you all live happily)

This is exactly the essence of Hinduism, all inclusive . That is why it has withstood the test of time inspite of repeated onslaught both from within and outside, and assimilated every good aspects from everything . That is why it is eternal !!!

There is a saying in Rigveda , the first book ever known to mankind which depicts the Hinduism philosophy in a Nutshell -” Ano bhadrah Krathavo Yanthu Vishwathah”- Let the knowledge come to us from every direction “


⭐️⭐️⭐️

ఈ అర్జుని ఎవరు ?

 అర్యా ! అర్జునుడు తెలుసు మరి ఈ అర్జుని ఎవరు ?

............................................................


(1) వృద్ధకాశి - తమిళనాడులోని కడలూరు జిల్లాలోని విరుదాచలానికే వృద్ధకాశి అనిపేరు. వారణాసి (కాశి) క్షేత్రానికన్నా పురాతమైనది కాబట్టి వృద్ధకాశి అనే పేరువచ్చింది. ఇదో శైవక్షేత్రం. కాశిలో జీవితచరమాంకం గడపటానికి చేతకానివారు వృద్ధకాశికి చేరుతారు. అంత్యకాలంలో అంబ వీరిని తనఒడిలో చేర్చుకొంటుందని శివయ్య ముక్తి మంత్రము ఉపదేశిస్తాడని కనుక ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.


(2) సుందోపసందులు - హిరణ్యకశ్యపుడి వంశంలోని నికుంభుడనే వాని కొడుకులు, అన్నదమ్ములు. బ్రహ్మను గురించి ఘోరతపస్సు చేసి తమకు కామరూపవిద్య అనగా కోరినరూపంలోకి మారగలిగే శక్తి, కామగమనత్వం అనగా ఇష్టం వచ్చి న చోటుకు వేగంగా వెళ్ళగలిగే విద్యలతోపాటు సకల మాయాశక్తులను, అంతేకాకుండా అన్యులచే (ఇతరులచే ) మరణం లేకుండా వరాలు పొందారు.


 వరగర్వంతో రెచ్చిపోయి లోకాలలో విధ్వంశం సృష్టిస్తూవుంటే బాధితులు విష్ణువు వద్దకు వెళ్ళిమోరపెట్టుకొన్నారు. విష్ణువు వారికి అభయమిచ్చి విశ్వకర్మచేత మాయ సౌందర్యవతిని సృష్టింపచేసి,


ఆ అందాలరాసిని వారివద్దకు పంపాడు. ఆమె అందానికి మోహితులైన అన్నదమ్ములు ఆమెను పెండ్లిచేసుకోటానికి సిద్ధపడి ఆ సంగతిని ఆమెనే అడిగారు. అప్పుడా వయ్యారి మీలో మీరు యుద్ధం చేసుకొని జయించి వచ్చినవాడిని పెండ్లాడుతానని చెప్పింది. అంతట ఆ అన్నదమ్ములు ముష్టియుద్ధానికి తలపడి ఒకరినొకరు కొట్టుకొని చనిపోయారు. ఇతరుల చేతిలో వారికి మరణంలేదు కనుక వారిలో వారే కొట్టుకొని మరణించారు.ఇదే విష్ణుమాయ.


(3) 

(అ) భీషణుడు - బకాసురుని తమ్ముడు.

(ఆ) భీషణుడనేవాడు కాశిరాజు భటుడు.వీరబాహువు వద్ద దాసుడుగా హరిశ్చంద్రుడు కాటికాపరిగా వున్నపుడు,

చంద్రమతి హరిశ్చంద్రుల కుమారుడు లోహితుడు, విశ్వమిత్రుడు పంపగా వచ్చిన తక్షకునిచే కాటుకు గురై మరణించగా

చంద్రమతి ఆ చనిపోయిన బాలుడిని స్మశానికి తెస్తుంది. శ్మశానంలో ఖననంచేయటానికి సుంకం కట్టాలని కాటికాపరి తెలియచేస్తే సొమ్ము తీసుకురావటానికి చంద్రమతి వెళుతుండగా ఆదేశాన్ని పాలించే కాశీరాజు కొడుకును ఎవరోచంపి చంద్రమతి దగ్గరపడేస్తారు. అప్పుడు భీషణుడనే రాజభటుడు చంద్రమతిని బంధించి రాజుసమక్షంలో నిలుపుతాడు.


(4) ఇలబల - తృణబిందువుకు అలంబసకు జన్మించిన స్త్రీ. కుబేరుని పెండ్లాడుతుంది


(5) అంజనీపర్వుడు - ఘటోత్కచుని కొడుకు. తండ్రితోపాటుగా భారతయుద్దంలో పాల్గొన్నాడు. గొప్పవీరుడు కనుక కురుసేనలు భీతిల్లాయి. అశ్వత్థామ అంజనీపర్వుడి విల్లును తుంచి, రథాన్ని కూలదోశాడు. అంజనీపర్వుడు కత్తిచేతబట్టి అశ్వత్థామపై కురికాడు. అశ్వత్థామ వాడి ఖడ్గాన్ని తుత్తునీయులుగా చేశాడు. కోపించిన ఘటోత్కచ తనయుడు అకాశమార్గానికి ఎగిరి అశ్వత్థామపై ఆయుధవృష్టిని కురిపించాడు. అపుడు అశ్వత్థామ వాడి శరీరంలో 30 బాణాలు నాటాడు. ఆ బాధను భరించలేక అంజనీపర్వుడు భూమిపై దిగి యుద్ధం కొనసాగించాడు. అశ్వత్థామ ఒకపదునైన బాణంతో వాడి తలకొట్టి చంపేశాడు.


(6) అర్జుని - బాణాసురుడి కూతురు. ఉషకు సోదరి. ఉష శ్రీకృష్ణుని మనుమడైన అనిరుద్ధుని ప్రేమించి పెండ్లాడుతుంది.


బాణసురుడెవరంటే

మరీచుని కుమారుడు కశ్యపుడు,

కశ్యపుని కుమారులు హిరణ్యాక్షుడు, 

హిరణ్యకశ్యపులు.

ఆ 

హిరణ్యకశ్యపుని కనిష్ఠ (చిన్న) పుత్రుడు ప్రహ్లాదుడు

ప్రహ్లాదుని కుమారుడే విరోచనుడు

విరోచుని కుమారుడే బలిచక్రవర్తి

ఆ 

బలి కొడుకే ఈ బాణాసురుడు

ఆ బాణాసురుని భార్య పేరు కండల. వీరి కూతురే అర్జుని.


(7) ఇంద్రసేన - ద్రౌపతికి మరోపేరు.


(8) బోయవనిత ఆమె ఐదుగురు కొడుకులు - వారణావతానికే ప్రయాగ అని పేరు. పాండవులు వారణావతాన్ని చూడటానికి వచ్చినపుడు పురోచనుడనే గ్రహనిర్మాణకారుడు ( హౌసింగ్ ఇంజనీర్ ) లక్క,నేయి, మట్టితో గృహనిర్మాణం చేశాడు. వారికి సేవలు చేయటానికి ఒక వృద్ధబోయను నియమించాడు.ఆమెకు ఐదుగురు కొడుకులు. కృష్ణచతుర్ధశినాడు ఆ లక్కఇంటికి నిప్పుపెడతారని కనుక జాగ్రత్తగా వుండాలనే వార్తను విదురుడినుండి పాండవుల వద్దకు ఖనకుడు తెస్తాడు. ఖనకుడు లక్కఇంటి నుండి బయటకు సొరంగాన్ని త్రవ్వాడు, ఆ సొరంగాన్ని చూచి భీముడు సంతసించాడు. చతుర్ధశి రోజున బోయస్త్రీ, ఆమెకొడుకలు కల్లు తాగి ఆ లక్కఇంటిలో నిద్రిస్తారు. పురోచనుడు లక్కఇంటికి నిప్పు పెట్టినపుడు పాండవులు తప్పించుకొన్నారు. అమాయకులైన బోయలు ఆ అగ్నికి ఆహుతైనారు.

...................................................................... జి.బి.విశ్వనాథ.డిప్యూటి కలెక్టర్ (Rtd) 9441245857, అనంతపురం.

నాగు అంటే

 నాగు అంటే చిరంజీవి నటించిన సినిమా కాదు, ఇది రైతులు చెల్లించాల్సిన వడ్డిపేరు.

........................................................


ఎదైనా కాయకుకాని పండుకు కాని ధాన్యానికి కాని అవి కాసే కాయలనుండి పూవులనుండి లేదా ఆకులనుండి పేర్లు ఏర్పడటం సహజం.ఉదా॥ మామిడిచెట్టుకు మామిడికాయల వలన, గోధుమకు గోధుమగింజల వలన తమలపాకుల చెట్టుకు తమలపాకుల వలన పేర్లు కలిగాయి. వరికి వడ్లని వరి గింజలకు (ధాన్యానికి) బియ్యమని పిలుస్తాము. ఇలా పిలవడం కాస్తావిచిత్రంగానే కనబడుతుంది.


సంస్కృతంలో పెంపుదలకు వృద్ధి అని అంటారు. ఆ వృద్ధినుండి తెలుగులో జొరబడిందే వడ్డి. మీ అసలు వడ్డి ఆణాపైసలతో సహా తీర్చేస్తానండి. డబ్బును వడ్దికి ఇవ్వడమంటే పెంపుదల చేసుకోవడమే కదా !


వరిమొక్కలు (సస్య) నాటితే అవి మొదల్లదగ్గర పిలకలు పుట్టి బాగా వృద్ధిచెందుతాయి.అలా వృద్ధిచెందిన వరిమొక్కలు బాగా దిగుబడిని ఇస్తాయి.

ఈ పెంపుదలను సూచించే వడ్డి ఏకవచనం కాగా జనబాహుళ్యంలో బహువచన రూపంగా వడ్లు అయింది.


ఇక వడ్డి విషయానికి వస్తే బారువడ్డి, చక్రవడ్డి, ధర్మవడ్డిల గురించి మనకు తెలుసు. వడ్డి చెల్లించని వ్యక్తికాని దేశంకాని వుందంటారా ?


ఇక నాగు అంటే చిరంజీవి నటించిన నాగు చిత్రంకాదు లేదా పామని కాదు. గతంలో రైతులు నాగు అనే వడ్డిని చెల్లించేవారు. ఎట్లాగంటే 


ఈ పద్ధతి రాయలసీమలో అమలులో వుండేది.


గతంలో రైతులు వ్యవసాయదారులు పూర్తిగా మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చినవారే. వారు పండించిన పంటంతా వారి కుటుంబఅవసరాలకు తెచ్చిన బుుణాలకు వడ్డిలకు సరిపోయేదే. మిగులుబాటు ఉండనేవుండదు.


ముంగారుకాలంలో పొలాలలో సేద్యంచేసి దుక్కులుగా మార్చిన తరువాత అదునులో విత్తనం వేసుకోటానికి వారివద్ద విత్తనంకాయలు లేదా ధాన్యాలు వుండేవి కావు. అలాంటపుడు రైతులు మోతుబరి వద్దనో ఆ వూరి శెట్టివద్దనో విత్తనపుకాయలు లేదా ధాన్యాన్ని అప్పుగా తెచ్చుకొనేవారు. అందుకు నాగును అంటే బుుణంగా తెచ్చుకొన్న విత్తనపుకాయలు లేదా గింజలకు వడ్డి చెల్లించేవారు. అనగా తెచ్చుకొన్న కాయలకు సగభాగాన్ని అసలుతో కలిపి చెల్లించేవారు. దీనినే నాగు అనేవారు.


 ఉదా॥ మా నాన్న 10 బస్తాల వేరుశెనగకాయలను నాగుగా తెచ్చి పండిన తరువాత బుుణదాతకు 15 బస్తాలకాయలను ఇచ్చేవాడు.అంటే అదనంగా ఇచ్చిన 5 బస్తాలు నాగు అన్నమాట. అంతేకాకుండా రైతు ఒక ప్రాంసరినోటు కూడా హామీగా వ్రాయించి ఇవ్వాలి.


నిజంగా ఈ నాగు ఓ కాలనాగేనన్న మాట. విత్తనపుకాయలు ఇచ్చిన వ్యక్తి కల్లంలోకి మనిషి పంపేవాడు. మొదటవాడికి నాగుతోపాటు అసలు చెల్లించాలి. కొసరు కింద ఆ వచ్చినవాడికి అంతోఇంతో ఇవ్వాలి.

విధివక్రికరించి పంటలు పండకపోతే ఈ ముంగారులో మేము తీసుకొన్న అసలు + ఇవ్వాల్సిన నాగు 15 బస్తాలు వచ్చే యేడుకు అసలు అవుతుంది. అపుడు ఈ15 బస్తాలు + నాగు 7 1/2 బస్తాలు కలిపి, 22 1/2 బస్తాలు చెల్లించాల్సివచ్చేది.

బుుణదాతలు నిర్ధాక్షిణ్యంగా వసూలు చేసేవారు. 

రైతు కుదేలైపోయేవాడు.

............................................................... జి.బి.విశ్వనాథ.డిప్యూటి కలెక్టర్ (ప.వి) 9441245857, అనంతపురం.

జీవితాన్ని ఎంజాయ్ చెయ్యండి.*

 *వయస్సు దాటుతున్న వేళ*

  💦💧💥🌹🌟💎


 *1. ఈ సమయం  ఇన్నాళ్ళూ  సంపాదించినదీ,  దాచుకున్నదీ  తీసి  ఖర్చు  పెట్టె  వయసు.తీసి  ఖర్చు  పెట్టి  జీవితాన్ని  ఎంజాయ్  చెయ్యండి.*  


 *దాన్ని  ఇంకా  దాచి  అలా  దాచడానికి  మీరు  పడిన  కష్టాన్ని,  కోల్పోయిన ఆనందాలనూ*  *మెచ్చుకునేవారు  ఎవరూ  ఉండరు  అనేది  గుర్తు పెట్టుకోండి* 


 *2. మీ  కొడుకులూ,  కోడళ్ళూ  మీరు  దాచిన  సొమ్ముకోసం  ఎటువంటి  ఆలోచనలు చేస్తున్నారో? ఈ  వయసులో  ఇంకా  సంపాదించి*  *సమస్యలనూ,  ఆందోళనలూ  కొని తెచ్చుకోవడం  అవుసరమా?* 

 *ప్రశాంతంగా  ఉన్నది  అనుభవిస్తూ జీవితం  గడిపితే  చాలదా?* 


 *3. మీ  పిల్లల  సంపాదనలూ,  వాళ్ళ  పిల్లల  సంపాదనల  గురించిన  చింత  మీకు  ఏల?*  *వాళ్ళ  గురించి  మీరు  ఎంత  వరకూ  చెయ్యాలో  అంతా  చేశారుగా?*  *వాళ్లకి  చదువు,  ఆహారం, నీడ మీకు  తోచిన  సహాయం  ఇచ్చారు.  ఇపుడు  వాళ్ళు  వాళ్ళ  కాళ్ళమీద  నిలబడ్డారు.ఇంకా  వాళ్ళకోసం  మీ  ఆలోచనలు  మానుకోండి. వాళ్ళ  గొడవలు  వాళ్ళను  పడనివ్వండి.* 


  *4. ఆరోగ్యవంతమైన  జీవితం  గడపండి.   అందుకోసం  అధిక  శ్రమ  పడకండి. తగిన  మోతాదులో  వ్యాయామం  చెయ్యండి. (నడక, యోగా   వంటివి  ఎంచుకోండి) తృప్తిగా  తినండి.  హాయిగా  నిద్రపోండి.*   *అనారోగ్య  పాలుకావడం  ఈ వయసులో  చాలా  సులభం,  ఆరోగ్యం  నిలబెట్టుకోవడం  కష్టం.  అందుకే  మీ  ఆరోగ్య  పరిస్థితిని  గమనించుకుంటూ  ఉండండి. మీ వైద్య  అవుసరాలూ,  ఆరోగ్య  అవుసరాలూ   చూసుకుంటూ  ఉండండి.  మీ డాక్టర్  తో  టచ్  లో  ఉండండి.  అవుసరం  అయిన  పరీక్షలు  చేయించుకుంటూ  ఉండండి.*  *(ఆరోగ్యం  బాగుంది  అని  టెస్ట్ లు  మానేయకండి)* 


 *5. మీ  భాగస్వామికోసం  ఖరీదైన  వస్తువులు  కొంటూ  ఉండండి.  మీ  సొమ్ము  మీ  భాగస్వామితో  కాక  ఇంకెవరితో  అనుభవిస్తారు?* *గుర్తుంచుకోండి ఒకరోజు  మీలో  ఎవరో  ఒకరు  రెండో  వారిని  వదిలిపెట్టవలసి  వస్తుంది.  మీ డబ్బు  అప్పుడు  మీకు  ఎటువంటి  ఆనందాన్నీ  ఇవ్వదు.  ఇద్దరూ  కలిసి  అనుభవించండి.* 


 *6. చిన్న  చిన్న  విషయాలకు  ఆందోళన  పడకండి. ఇప్పటివరకూ  జీవితం  లో  ఎన్నో  ఒత్తిడులను  ఎదుర్కొన్నారు.   ఎన్నో  ఆనందాలూ,  ఎన్నో  విషాదాలూ  చవి  చూశారు.  అవి  అన్నీ  గతం.* 

 *మీ  గత  అనుభవాలు మిమ్మల్ని  వెనక్కులాగేలా  తలచుకుంటూ  ఉండకండి,  మీ భవిష్యత్తును భయంకరంగా  ఊహిచుకోకండి.  ఆ  రెండిటివలన  మీ  ప్రస్తుత  స్థితిని   నరకప్రాయం  చేసుకోకండి. ఈరోజు  నేను  ఆనందంగా  ఉంటాను అనే  అభిప్రాయంతో  గడపండి.   చిన్నసమస్యలు  వాటంతట  అవే  తొలగిపోతాయి .* 


 *7. మీ  వయసు*  *అయిపొయింది  అనుకోకండి.  మీ  జీవిత  భాగస్వామిని  ఈ  వయసులో  ప్రేమిస్తూనే  ఉండండి. జీవితాన్ని  ప్రేమిస్తూనే  ఉండండి. కుటుంబాన్ని  ప్రేమిస్తూనే  ఉండండి. మీ  పొరుగువారిని  ప్రేమిస్తూ  ఉండండి.* 


  *"జీవితంలో ప్రేమ, అభిమానం, తెలివితేటలూ  ఉన్నన్ని నాళ్ళూ   మీరు  ముసలివారు  అనుకోకండి.* *నేను  ఏమిచెయ్యగలనూ  అని  ఆలోచించండి.  నేను  ఏమీ  చెయ్యలేను  అనుకోకండి"* 


 *8. ఆత్మాభిమానం  తో  ఉండండి  (మనసులోనూ బయటా  కూడా) హెయిర్  కట్టింగ్  ఎందుకులే*  *అనుకోకండి.  గోళ్ళు  పెరగనియ్యిలే అనుకోకండి.  చర్మసౌందర్యం  మీద  శ్రద్ధ   పెట్టండి.  పళ్ళు  కట్టించుకోండి. ఇంట్లో  పెర్ఫ్యూమ్ లూ,  సెంట్లూ ఉంచుకోండి. బాహ్య  సౌందర్యం  మీలో అంతః సౌందర్యం  పెంచుతుంది అనే  విషయం  మరువకండి.  మీరు  శక్తివంతులే!* 

  

 *9. మీకు  మాత్రమె  ప్రత్యేకం  అయిన ఒక  స్టైల్స్ ఏర్పరచుకోండి.  వయసుకు  తగ్గ  దుస్తులు  చక్కటివి  ఎంచుకోండి. మీకు  మాత్రమె  ప్రత్యేకం  అయినట్టుగా  మీ  అలంకరణ ఉండాలి.  మీరు  ప్రత్యేకంగా  హుందాగా ఉండాలి.* 


 *10. ఎప్పటికప్పుడు  అప్ డేట్  గా  ఉండండి. న్యూస్ పేపర్లు  చదవండి. న్యూస్ చూడండి.  పేస్  బుక్ , వాట్సాప్ లలో  ఉండండి. మీ  పాత  స్నేహాలు  మీకు  దొరకవచ్చు.*  


 *11. యువతరం ఆలోచనలను  గౌరవించండి.* 

 *మీ  ఆదర్శాలూ  వారి  ఆదర్శాలూ  వేరు  వేరు  కావచ్చు. అంతమాత్రాన  వారిని  విమర్శించకండి* .


 *సలహాలు  ఇవ్వండి,* *అడ్డుకోకండి. మీ  అనుభవాలు  వారికి  ఉపయోగించేలా  మీ  సూచనలు  ఇస్తే  చాలు. వారు  వారికి  నచ్చితే  తీసుకుంటారు.  దేశాన్ని  నడిపించేది వారే!* 


 *12. మా  రోజుల్లో ...  అంటూ   అనకండి.  మీరోజులు  ఇవ్వే!* 

 *మీరు  బ్రతికి  ఉన్నన్ని  రోజులూ   " ఈరోజు నాదే"  అనుకోండి* 


 *అప్పటికాలం  స్వర్ణమయం  అంటూ  ఆరోజుల్లో   బ్రతకకండి.*  

 *తోటివారితో కఠినంగా  ఉండకండి.* 


 *జీవితకాలం  చాలా  తక్కువ.  పక్కవారితో కఠినంగా   ఉండి* *మీరు  సాధించేది  ఏమిటి?*  *పాజిటివ్  దృక్పధం,*  *సంతోషాన్ని  పంచే  స్నేహితులతో  ఉండండి.*  *దానివలన  మీ  జీవితం  సంతోషదాయకం  అవుతుంది.*  *కఠిన  మనస్కులతో  ఉంటె   మీరూ  కఠినాత్ములుగా  మారిపోతారు.*  *అది  మీకు  ఆనందాన్ని  ఇవ్వదు.  మీరు  త్వరగా  ముసలివారు  అవుతారు.* 


 *13. మీకు  ఆర్ధికశక్తి  ఉంటె,  ఆరోగ్యం  ఉంటె   మీ  పిల్లలతో  మనుమలతో  కలిసి ఉండకండి. కుటుంబ సభ్యులతో  కలిసి  ఉండడం  మంచిది  అని  అనిపించవచ్చు.  కానీ  అది  వారి  ప్రైవసీకి  మీ  ప్రైవసీకి కూడా  అవరోధం  అవుతుంది.వారి  జీవితాలు  వారివి.*  

 *మీ  జీవితం  మీది. వారికి  అవుసరం  అయినా,  మీకు  అవుసరం  అయినా  తప్పక  పిల్లలతో  కలిసి  ఉండండి.* 


 *14. మీ  హాబీలను  వదులుకోకండి.*  *ఉద్యోగజీవితం  లో  అంత  ఖాళీ  లేదు  అనుకుంటే  ఇప్పుడు  చేసుకోండి.* 

 *తీర్థ  యాత్రలు  చెయ్యడం,  పుస్తకపఠనం, డాన్స్, పిల్లినో, కుక్కనో  పెంచడం,  తోట పెంపకం, పెయింటింగ్ ...  రచనా  వ్యాసంగం   ...  ఏదో  ఒకటి  ఎంచుకోండి.* 


 *15. ఇంటిబయటకు  వెళ్ళడం  అలవాటు  చేసుకోండి.  కొత్త  పరిచయాలు  పెంచుకోండి.* *పార్కుకి  వెళ్లండి, గుడికి  వెళ్ళండి,  ఏదైనా  సభలకు  వెళ్ళండి.  ఇంటిబయట  గడపడం  కూడా  మీ  ఆరోగ్యానికి  మేలు  చేస్తుంది.* 


 *16. మర్యాదగా   మాట్లాడడం  అలవాటు  చేసుకోండి.  నోరు  మంచిది  అయితే  ఊరు  మంచిది  అవుతుంది.*  *పిర్యాదులు  చెయ్యకండి. లోపాలను  ఎత్తిచూపడం  అలవాటు  చేసుకోకండి. విమర్శించకండి. పరిస్థితులను  అర్ధం  చేసుకుని  ప్రవర్తించండి. సున్నితంగా  సమస్యలను  చెప్పడం  అలవాటు  చేసుకోండి.* 


 *17. వృద్ధాప్యం  లో  బాధలూ,  సంతోషాలూ  కలిసి  మెలసి  ఉంటాయి.  బాధలను  తవ్వి  తీసుకుంటూ ఉండకండి.* *అన్నీ  జీవితంలో  భాగాలే* 


 *18. మిమ్మల్ని  బాధపెట్టిన  వారిని  క్షమించండి* 

 

 *మీరు  బాధపెట్టిన  వారిని  క్షమాపణ  కోరండి* 


 *మీ తోపాటు  అసంతృప్తిని  వెంటబెట్టుకోకండి.* 


 *అది మిమ్మల్ని విచారకరం  గానూ,* 

 *కఠినం గానూ   మారుస్తుంది* 

 *ఎవరు  రైటు అన్నది  ఆలోచించకండి.* 


 *19. ఒకరిపై పగ  పెట్టుకోవద్దు* 

 *క్షమించు,  మర్చిపో,  జీవితం  సాగించు.* 


 *20. నవ్వండి నవ్వించండి. బాధలపై  నవ్వండి* 

 *ఎందరికన్నానో  మీరు  అదృష్టవంతులు.* 

 *దీర్ఘకాలం  హాయిగా  జీవించండి.* 


 *ఈ వయసు వరకు  కొందరు  రాలేరు  అని  గుర్తించండి.* 

 *మీరు  పూర్ణ  ఆయుర్దాయం  పొందినందుకు   ఆనందించండి.*


💦💧🌹💥💖🌟💎