20, మే 2022, శుక్రవారం

ఆయుర్వేదం నందు ఔషధ సేవన

 ఆయుర్వేదం నందు ఔషధ సేవన కాలముల గురించి సంపూర్ణ వివరణ  -


  ఆయుర్వేదం నందు ఔషధాలను సేవించు విధానమును రోగాలకు బట్టి 10 రకాలుగా వర్గీకరించబడినది. ఈ విధముగా ఔషధాలను సేవించినచో ఆయా ఔషధాలు బలంగా పనిచేసి రోగి తొందరగా కోలుకుంటాడు. మరియు ఔషధాలను సూర్యోదయానికి ముందు , సూర్యాస్తమయం తరువాత సేవించిన మంచిఫలితాలు పొందగలరు. ముఖ్యంగా ఔషధసేవన గురువారం నందు మొదలు పెట్టిన త్వరగా రోగం నుంచి విముక్తి పొందవచ్చు.


  ఆయుర్వేదం వర్గీకరించిన 10 రకాల ఔషధసేవన కాలాలు  -


 * అనన్నౌషధ కాలము  -


        తినినట్టి ఆహారం పూర్తిగా జీర్ణం అయిన తరువాత ఔషధాన్ని సేవించుట . రోగి బలవంతుడుగా ఉన్నప్పుడు కఫరోగం నందు దీనిని ఉపయోగించవలెను .


 * అన్నాదౌష్యధ కాలము  -


        ఆహారమును భుజించుటకు ముందు ఔషధమును తినినవెంటనే ఆహారమును భుజించుట . దీనిని అపానవాతం ప్రకోపించినప్పుడు ఉపయోగించవలెను .


 * మధ్యోషధ కాలము  -


         ఆహారం తినునప్పుడు మధ్య సమయం నందు తినునట్టి ఔషధం . దీనిని సమాన వాతం ప్రకోపించినప్పుడు ఉపయోగించవలెను .


 * అంతౌషధ కాలము  -


         ఆహారం భుజించుతూ ఉన్న సమయంలో చివరలో ఔషధం సేవించటం . దీనిని వ్యానవాతం ప్రకోపించినప్పుడు మధ్యాహ్న భోజనం చివర సమయంలో , ఉదాన వాతం ప్రకోపం చెందినపుడు రాత్రి భోజనం యొక్క చివరలో ఔషధం సేవించవలెను .


 * కబాలాంతరౌషధ కాలము -


          ఆహారం భుజించునప్పుడు మొదటిముద్ద తిని వెంటనే ఔషధమును భుజించిన పిదప మరలా ఒక ముద్ద అన్నము తినునట్టి ఔషధం . దీనిని ప్రాణవాతం ప్రకోపం చెంది ఉండునప్పుడు ఉపయోగింపవలెను.


 * గ్రాసగ్రాసౌషధ కాలము  -


          ప్రతి అన్నపు ముద్దతోను ఔషధం చేర్చి భుజించటం. దీనిని ప్రాణవాతం ప్రకోపం చెందినపుడు ఉపయొగింపవలెను.


 * ముహురౌషధ కాలము -


           అన్నము తిన్నను , తినకున్నను ఔషధమును అనేక పర్యాయాలు తీసుకోవడం . దీనిని విషదోషం , వాంతులు , ఎక్కిళ్లు , దప్పిక, శ్వాస , దగ్గు అను రోగములు కలవారికి ఉపయోగించవలెను .


 * స్నానౌషధ కాలము -


           ఆహారంతో కూడా చేర్చి తినునట్టి ఔషధము . నోటికి రుచిలేకపోవుట వంటి రోగముల యందు అనేక రకాల ఆహార పదార్ధములతో చేర్చి ఉపయోగించవలెను .


 * సాముద్గౌషధ కాలము -


           మొదట ఔషధమును తిని వెంటనే ఆహారంను భుజించి మరలా ఔషధమును సేవించుట . దీనిని ఆక్షేపక వాతము , ఎక్కిళ్లు , కంపవాతం అనగా పార్కిన్సన్స్ వ్యాధి నందు ఉపయోగించవలెను .


 * నిశౌష్యథ కాలము  -


           రాత్రి పడుకునే సమయం నందు తినునట్టి ఔషధము . దీనిని మెడకొంకులకు పై భాగమున పుట్టు రోగములు నందు ఉపయోగింపవలెను .


         పైన చెప్పిన విధముగా 10 రకములుగా ఔషధసేవన పద్ధతులు కలవు. ఔషధంతో పాటు ఔషధసేవన కాలం కూడా రోగాన్ని తగ్గించడంలో ప్రముఖపాత్ర వహించును.


   

    

         మరింత విలువైన సమాచారం కోసం నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

వైశాఖ పురాణం

 _*


     _*🚩వైశాఖ పురాణం🚩*_

🌴_*19 వ అధ్యాయము*_🌴


🕉🌹🌷🌹🕉️🌹🌷🌹🕉️


*పిశాచత్వ విముక్తి*


☘☘☘☘☘☘☘☘


నారదుడు అంబరీషునకు వైశాఖ మహత్మ్యము నింకను వివరించుచున్నాడు. శ్రుతకీర్తి శ్రుతదేవునికి నమస్కరించి ఇంకను వైశాఖ మహాత్మ్యమును దయఉంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించెను.


శ్రుతదేవుడిట్లనెను , రాజా ! జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలిసికొనవలయునను బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభలాభములు నీకు మున్ముందు కాలమున నుండుటచేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకు గాక మరెవరికి చెప్పుదును వినుము.


వైశాఖమున సూర్యుడు మేషరాశియందుండగా ప్రాతఃకాల స్నానమునాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరికథను విని యధాశక్తి దానములను చేసినవారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు.


వైశాఖపురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్దగా వినక మరియొకదానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని. రౌరవమను నరకమును పొంది పిశాచమై యుండును. అందులకుదాహరణగ క్రింది కథను చెప్పుదురు.


ఈ కథ పాపములనశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా వినుము.


పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమను పుణ్యక్షేత్రము కలదు. అచట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు , తపోనిష్టుడు అనువారు అచటనుండిరి. వారిద్దరును మహాజ్ఞానులు. సర్వసంగపరిత్యాగులు ఉపనిషత్తులను బాగుగ చదివినవారు. అందలి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు. మిక్కిలి పుణ్యశాలురు. వారు అచట బృగుప్రస్రవణమను తీర్థసమీపమున నుండిరి.


వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయందాసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో , తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలనెవరైన చెప్పిన శ్రద్దగావినును. వీరెవరును లేనిచో విష్ణుకథలను తలచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును. శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్లు తన పనులను మాని వానిని వినుచుండును. అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్లు శ్రీమహావిష్ణు కథలను వివరించును. దూరముననున్న తీర్థములలో స్నానము చేయుటకన్న దూరమున నున్న క్షేత్రములను దర్శించుట కన్న కర్మానుష్ఠానము కన్న వానికి విష్ణుకథలయందు ప్రీతి యెక్కువ. ఎవరైన చెప్పుచున్నచో తాను వినును , వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును. చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానము చేసి శ్రీహరి కథలను తలచును.


విష్ణుకథాశ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసికొనును. విష్ణుకథా సమాసక్తునకు సంసారబంధముండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ది కలుగును. విష్ణుభక్తి పెరుగును. విష్ణువుపై నాసక్తియు సజ్జనులయందిష్టము పెరుగును. నిరంజనము నిర్గుణమునగు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా ! దుష్టులు కర్మలనెన్నిటిని చేసినను వ్యర్థములే. గ్రుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి ?  కావున చిత్తశుద్దిని సాధింపవలయును. చిత్తశుద్దివలన శ్రీహరి కథాసక్తి కలుగును. అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణుకథాశ్రవణము , ధ్యానము , మననము , ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేనిచోట గంగాతీరమైనను విడువదగినది. తులసీవనము శ్రీహరి ఆలయము , విష్ణుకథ లేనిచోట మరణించినవాడు తామసమను నరకమును పొందును. శ్రీహరి ఆలయము గాని కృష్ణమృగము గాని , విష్ణుకథగాని , సజ్జనులు గాని లేని చోట మరణించివారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మింతురు. సత్య నిష్ఠుడీవిధముగ నాలోచించి విష్ణుకథా శ్రవణము ప్రసంగము , మననము , స్మృతి మున్నగునవి ముఖ్యములని తలచును.


ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజాజపాది కర్మలనిన ఇష్టము. వానినెప్పుడును మానక పట్టుదలతో చేయుచుండును. శ్రీహరి కథలను వినడు , చెప్పడు. ఎవరైన చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాదికర్మకలాపము పొడగునని దూరముగ పోవును. అతని ననుసరించి యుందువారును స్నానాదికర్మలనాచరించి తమ ఇంటి పనులను చేసికొనుట యందిష్టము కలవారై యుందురు. ఇట్లెంతకాలము గడచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము , చింతనము స్మృతి మున్నగు వానిని యెరుగడు.


ఇట్టి యహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవుటచే పిశాచమై చిన్న కర్ణుడను పేరనుండెను. జమ్మిచెట్టునందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు , నిరాశ్రయుడు యెండిన పెదవులు , నోరు కలవాడై యుండెను. ఇట్లు బాధపడుచు కొన్నివేల సంవత్సరముల కాలముండెను. వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి దప్పిక కలిగి అవి తీరునుపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను , జలము ప్రళయాగ్నివలెను ఫల పుష్పాదులు విషముగను వుండెడివి.


ఈ విధముగ కర్మపరాయణుడగు తపోనిష్ఠుడు పలువిధములుగ బాధలనుపడెను. నిర్జనమైన ఆ యడవియందతడు మిక్కిలి బాధపడుచుండగా నొకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనసపురమునకు పోవుచు నా ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధల ననుభవించుచున్న చిన్నకర్ణుని జూచెను. దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడకుమని ధైర్యము చెప్పివాని బాధకు కారణము నడిగెను. అతడును నేను కర్మనిష్ఠుడనువాడను. దుర్వాసమహాముని శిష్యుడను. కర్మపరతంత్రుడనై శ్రీ హరి కథా శ్రవణాదులను చేయనివాడను. మూఢుడనై కర్మలనే ఆచరించుటవలన నిట్టి వాడనైతినని తన వృత్తాంతమునంతయును వానికి చెప్పెను. నా అదృష్టవశమున మీ దర్శనమైనది. నన్ను మీరే రక్షింపవలయునని పలు విధముల ప్రార్థించెను. వారి పాదములపై బడి దుఃఖించెను.


సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను రెండు గడియలకాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి సోదకముగ సమర్పించెను. ధారపోసెను.  ఆ మహిమవలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచరూపము పోయి దివ్య దేహము కలిగెను. కర్మనిష్ఠుడు - సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను దెలిపి శ్రీహరి పంపగా వచ్చి దివ్యవిమానము నెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖమాస మహాత్మ్య మహిమకు విస్మయపడుచు తన గమ్యమగు పైఠీనపురమునకు పోయెను.


శ్రుతకీర్త మహారాజా ! కావున శ్రీహరి కథల ప్రసంగము , శ్రవణము , ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె సర్వక్షేత్రములకంటె ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె పవిత్రమైనది. గంగాతీర వాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కాని శ్రీహరి కథయును గంగాతీరవాసులకు ఇహము , పరము , నిశ్చితములు సుమా అని శ్రుతకీర్తికి శ్రుతదేవుడు భగవత్ స్వరూపము నీవిధముగ వివరించెను.


*ఏ కోవశీసర్వభూతాంతరాత్మ, ఏకంరూపం బహుధాయః కరోతి |*

*తమాత్మస్థం యేనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం ||*

*ఏకోదేవస్సర్వభూతేషు గూఢస్సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా |*

*కర్మాధ్యక్షస్సర్వభూతాధివాసస్సక్షి చైషకేవలోనిర్గుణశ్చ ||*

*ఏకోనారాయణో నద్వితీయోస్తి కశ్చిత్ ఏకఏవశివో నిత్యస్తతోన్యత్ఫకలం మృషా |*

*బహునాత్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేదభిన్నస్తు క్రీడ తే పరమేశ్వరః ||*


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి భగవంతుని తత్త్వమును వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను.


*వైశాఖ పురాణం  పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం*       

     

           🌷 *సేకరణ*🌷

         🌹🌷🌹🌹🌷🌹

               *న్యాయపతి*

            *నరసింహా రావు*


🙏🙏🌷🙏🙏🌹🙏🙏🌷🙏🙏

కాశీమశీదులో శివలింగం

 చరిత్ర 

కాశీమశీదులో శివలింగం


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

19-05-2022 ; సెయింట్ లూయీస్ ; యు ఎస్ ఎ


క్రీ. శ. 1823-26 మధ్య కలకత్తాలో తూర్పు ఇండియా వర్తక కంపెనీవారి అధికారిగా నుండి పరిపాలనలో ప్రధాన క్రైస్తవమతాధి హిందూ దేశమంతా తిరిగిచూసిన హెబరుగారు (Bishop Heber) తమ గ్రంథములో ఒక చిత్రమైన చరిత్రాంశాన్ని వుదాహరించారు.


1659–1707 మధ్య హిందూ దేశాన్ని పరిపాలించిన ఔరంగ జేబుచక్రవర్తి చాలా హిందూ దేవాలయాలను పడగొట్టించి వాటిపై మశీదులు కట్టించినాడని ప్రతీతి. దేవాలయ స్తంభాలతోటీ, రాళ్ళతోటీ, దూలాలతోటీ నిర్మించబడిన మశీదులు ఇప్పటికీ కాశీలో కనబడుతున్నాయి.


ఒకశివాలయాన్ని పడగొట్టి మశీదుకట్టడంలో ఆ దేవాలయంలో నుండిన అందమైన గొప్ప శివలింగాన్ని అలాగే అట్టే వుండనిచ్చి మశీదుకట్టారు. ఈశివలింగం నలభై అడుగుల ఎత్తుగల ఏకాండీశిల. దీని మీద అందమైన చెక్కడపుపని వుండేది. ఇది పూర్వం రెండు రెట్లు ఎత్తువుండేదనిన్నీ, క్రమ కమంగా భూమిలోకి దిగబడిపోతూ వున్నదనిన్నీ, అది భూమి మట్టానికి రాగానే అన్ని కులాలూ ఒక్కటైపోతాయనిన్నీ ప్రజలు అనుకుంటూ వుండేవారు.


ఈ శివలింగం మశీదులో చిక్కుపడినా హిందువులు దీనిని అతిపవిత్రంగా ఎంచి, మశీదు అధికారులను మంచి చేసుకొని, లోపలికి వెళ్ళి దీన్ని పూజిస్తూవుండేవారు. భక్తులు ఇచ్చేకానుకలలో సగంవంతు తమకు చెల్లే పద్ధతిని మశీదువారు దీనికి వప్పుకున్నారు.ఈ శివలింగం చుట్టూవున్న చెక్కడపుడని మహమ్మదీయులకు అసహ్యంగా కనబడినా పై చెప్పిన కారణంవల్ల దానిని ఏమీ చేయకుండా వుంచారు. ఇలాగా ఒక నంద సంవత్సరాలు ఈ శివలింగానికి మశీదులోనే అర్చనలు జరిగాయి. 


ఇలా వుండగా ఒక మాటు మొహరం పండుగ ఊరేగింపుల సందర్భంలో హిందువులకూ, మహమ్మదీయులకూ తగాదాలు వచ్చి దెబ్బలాటలు జరిగాయి. అది మతకలహంగా పరిణమించింది. ముసల్మానులు కొందరు ఆవేశపరులై హిందువులు అతి పవిత్రంగా పూజించే యీ శివలింగాన్ని పగులగొట్టారు. అంతట హిందువులు ఉగ్రులై దీనికి ప్రతిక్రియగా ఒక మశీదును తగులబెట్టారు. దానిమీద తురకలు  ఒక ఆవును చంపి, దాని రక్తాన్ని విశ్వేశ్వర ఆలయందగ్గర గంగానదీ జలంకన్నా అతిపవిత్రమని ఎంచి యాత్రికులందరూ స్నానపానములుచేసే 'ఇననకూప' మనే ఒక పురాతనమైన నూతిలో కలిపారు.


అంతట కత్తిపట్టగల ప్రతి హిందువూ రోషావేశంతో కత్తులూ కఠారులూ పుచ్చుకుని కనబడిన తురక వాడి పైనబడి దౌర్జన్యం చేయసాగారు. కాశీలో హిందువులే బహుసంఖ్యాకు లైనందువల్ల తురకలను రూపుమాపుతారేమో నన్నంత భయం కలిగింది.


కుంపినీఅధికారులు శీపాయీలను బయటికి తెచ్చి నిలపకపోతే ఇటు సూర్యు డటు పోయేలోపల ఊళ్ళో మశీదు లన్నింటినీ హిందువులు నేలమట్టం చేసేవారే. అయితే,హిందువుల దౌర్జన్యాన్ని అణచడానికి శీపాయీ లెంతవరకు తోడ్పడతారో అనేదికూడా అనుమానాస్పదమైన విష యంగా అధికారులకు తోచింది. కారణం ఏమిటంటే, అక్కడి శీపాయీలలో చాలామంది హిందువులు, సగంమంది బ్రాహ్మణులే. నిజంగా వాళ్ళమనసులోని సంగతి చెప్పాలంటే ఒక్కొక్కడికి ఈ మహమ్మదీయులరక్తాన్ని చూరగొనాలనే వుందని చెప్పాలి.


ఈ తురకలపైకి పోతూవున్న జనంలో ముఖ్యులు బ్రాహ్మణులూ, యోగులు, గోసాయీలూ, బై రాగులూ మొదలైన సనాతనధర్మపరులే. వీళ్ళు తమవంటినిండా విభూతి పూసికొని 'మొగాల పైన గోపీచందనం అద్దుకొని చావుకు తెగించినందుకు తార్కాణంగా తల వెండ్రుకలు విరబోసికొని, జందెములు చేతపట్టుకొని తమతోడిహిందువులతోనూ, దేవుళ్ళతోనూ యుద్ధం చెయ్యబూనిన వారిని శాపనార్థాలు పెడుతూ వీరంతా ముందువరసలోనే వున్నారు. అయినప్పటికీ శీపాయీలు చలించలేదు. తాము ఎవరి వుప్పు తింటున్నారో ఆ కుంపినీవారి వుత్తర్వులను శిరసావహించి తమ రక్తబంధు వులు ఎదురైనాసరే తుపాకీ పేల్చడానికి ఒట్టు పెట్టుకొని సైన్యపుకొలువులో చేరిన ఈ శిపాయీలు అవసరమైతే బ్రాహ్మడి పైనకూడా తుపాకీని పేల్చడానికి సంసిద్ధులైనారు.


పైన చెప్పిన శివలింగం వుండే మశీదు ద్వారం దగ్గర కావలి కాస్తూవున్న శిపాయీలలో ఒకడు అక్కడ క్రిందపడి వున్న శివలింగాన్ని చూసి ఇలాగ అన్నాడు. “అయ్యో ! మనమెన్నడూ అనుకోనిసంగతిని చూశాము. శివలింగం శిరస్సు నేలపైకి ఒరిగింది. ఇంక కొద్దికాలంలోనే మన మంద రమూ ఒకే కులంవాళ్ళ మైపోతాము. అప్పుడు మనమతం ఏమవుతుంది?" అన్నాడు. “బహుశఃకిరస్తానీమతం అవుతుం దేమో!" అని రెండవవాడన్నాడు.


కంపెనీవారు ఇలాగ బందోబస్తు చేసినందువల్ల అల్లరి సద్దు అణగింది.

ఈ కల్లోలం అణగిన తరు వాత మళ్ళీ ఆ సంగతి తలుచుకునేటప్పటికి కాశీలోని హిందువుల గుండెలు నీరైనవి. వారికి తీవ్రమైన విషాదం కలిగింది. “పవిత్రమైన కాశీ క్షేత్రం అపవిత్రమైపోయింది. అతి పవిత్రమైన గంగాజలములో గోవుర క్తం కలిసింది. ఈ కాశీమాహాత్మ్యం పోయింది. ఇంక ఇక్కడ మోక్షం దొరకదు” అనే ఆలోచనలతో వేలకొద్ది బ్రాహ్మణులు ఉపవాసం చేస్తూ ముఖాలపైన విభూతి రేఖలతో పై మీద బట్టలు కూడా లేకుండా దుఃఖసూచకంగా గంగానదీ తీరాన్నివున్న ముఖ్యఘట్టాలకు నడిచి వెళ్ళి అక్కడ చేతులు కట్టుకుని తలలు వంచుకొని కూచుని మళ్ళీ ఇళ్ళకు పోకుండా అక్కడనే పడివుండి ఒక మెతుకైనా తినకుండా ప్ర్రాణాల పై ఆశవిడిచి ప్ర్రాయోపవేశం చెయ్యడానికి నిశ్చయించారు. 


ఇలాగ రెండుమూడు రోజులు గడిచినవి. ఇది చూసేటప్పటికి చాలమంది మనస్సులు కరగినవి. వీళ్ళను ఓదార్చి సానుభూతి చూపిస్తే వీళ్ళకు కొంత మనశ్శాంతి కలుగుతుందని కొందరికి తోచింది. ఈ సంగతిని వీరు కాశీలోని మేజిస్ట్రేటుల చెవిని వేశారు. అంతట కుంపినీ వారి ఆంగ్లేయోద్యోగులందరూ గంగానదీ తీరానికి వెళ్ళి అక్కడి ఘట్టాలలో ఇలాగ వుపవాసం చేస్తూవున్న బ్రాహ్మణులను చూసి వగచి, తాము నివారిం చడానికి ఎంతోకష్టపడి ప్రయత్నంచినా లాభంలేక తమవశం తప్పిందని, జరిగినదానికోసం వారందరూ ఇలాగ నిష్కారణంగా బాధపడడము బాగా లేదనిన్నీ, జరిగిన అక్రమాలకు కొంత ప్రతిక్రియ జరిగించేవున్నారుకదా అందుకోసం మళ్ళీ ఇలాగ బాధ అనుభవించడం ఎందుకనిన్నీ చెప్పి, వాళ్ళను బుజ్జగించగా, వారందరూ చాలా దుఃఖించి తరువాత కొంత ఊరట చెందారు.


ఇంతటి అకృత్యం జరిగినా గంగ గంగ కాకపోదనిన్నీ, కాశీలోని గృహస్థులందరూ పూనుకొని సంప్రోక్షణ మొదలైన ప్రాయశ్చిత్ తకర్మలు జరిగిస్తే వైదికధర్మానికి కలిగిన కళంకాన్ని తొలగించవచ్చుననిన్నీ న్యాయాధికారులు ఓదార్చగా వారు చెప్పిన సలహా బాగానే వున్నదని ఆఖరికి వారందరూ నిశ్చయించి, ఉపవాసాలు మాని ఇళ్ళకు వెళ్ళారు.


ఆ సమయంలో ఈ రాయబారం నడిపిన దొరలలో ఒకరైన 'బర్డు’ గారు ఆ దృశ్యం ఇప్పటికీ తనకు కన్నులకు కట్టినట్లు వున్నదని కొన్ని సంవత్సరాల తరువాత 1824 లో బిషప్ హెబరుగారికి ఈ సంగతులన్నీ చెప్పాడు.


Bishop Heber's Journal - Vol. 1 Pp. 428-32.

( కథలు - గాథలు బై దిగవల్లి వేంకట శివరావు గారి గ్రంథం నుండి )

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

19-05-2022 ; సెయింట్ లూయీస్ ; యు ఎస్ ఎ

హనుమజ్జయంతి

 ॐ         హనుమజ్జయంతి ప్రత్యేకం - 

       (ఈ నెల 25వ తేదీ హనుమజ్జయంతి) 


1. హనుమ - జననం - పొందిన వరాలు 


    హనుమంతుని తండ్రి పేరు కేసరి. 

    అంజన ఆ కేసరి యొక్క భార్య. 

    అంజన యొక్క కుమారుడు ఆంజనేయుడు. 

    హనుమంతుడు, అంజనాదేవి గర్భాన -  వాయుదేవుడు - శివతేజస్సును ప్రవేశపెట్టడం వలన జన్మించాడు. 

    అందుచేత పవనతనయుడు, మారుతి నందనుడు వంటి పేర్లు కలిగియున్నాడు. 


జయంతి: 

వైశాఖ బహుళ దశమి 


హనుమ పొందిన వరాలు: 

     

    శిశువుగా ఉన్నప్పుడే, ఆకలి కలిగియున్నప్పుడు,

    సూర్యుని ఫలమనుకొని, పొందుటకు ఎగరడం, 

    సూర్యునివద్డ హనుమను చూచి, రాహువు ఇంద్రునికి ఫిర్యాదు వంటి సందర్భాలలో,       

    ఇంద్రుడు వచ్చి వజ్రాయుధం ప్రయోగించడం సంభవించింది. 

    అప్పుడు ఆ వజ్రాయుధం ఆంజనేయుని దౌడ(హనుమ)కు తగిలి, స్వామి నిర్జీవుడై పడిపోవడం జరిగింది. 

    అదిచూసి, వాయుదేవుడు సకల జీవరాశి నుంచి బయటకు వచ్చి సమ్మె చేశాడు. 


    అది తెలిసిన బ్రహ్మదేవుడు, దేవతలతో వచ్చి, 

    ఆంజనేయుని పునర్జీవితుని చేశాడు. 

    వాయువుకి సంతోషం కలిగించడానికీ, 

   భవిష్యత్తులో దేవతల గొప్పకార్యాన్ని మారుతి నిర్వహించడానికీ, 

   దేవతలందఱినీ మారుతికి వరాలిమ్మన్నాడు బ్రహ్మదేవుడు. 

    అప్పుడు, 


1. ఇంద్రుడు: 

    బంగారు పద్మహారమునిచ్చి, 

    హనుమ అని నామమిడి, 

    తన వజ్రాయుధము వలన ఏ హానీ కలుగదన్నాడు. 


2. సూర్యుడు: 

    తన తేజస్సులో నూఱోవంతు ఇస్తున్నాననీ, 

     శైశవ దశనించీ విద్యార్జన స్థితి రాగానే, 

    సకల శాస్త్ర జ్ఞానాన్నీ కలిగిస్తాననీ, 

    తద్వారా వాక్చతురుడు కాగలడనీ, 

    శాస్త్రజ్ఞానమందు హనుమతో సరితూగగలవాడు మరొకడుండడనీ అన్నాడు. 


3. వరుణుడు: 

    తన పాశము వలనగానీ, జలములవలనగానీ, 

    లక్షలకొలది సంవత్సరాల వరకూ మృత్యుభయం ఉండకుండా వరమిచ్చాడు. 


4. యముడు: 

    తన దండము వలన మృత్యువు కలగదనీ, 

    ఎల్లప్పుడూ ఆరోగ్యభాగ్యాలతో వర్ధిల్లుతాడనీ, 

    యుద్ధమునందు విషాదగ్రస్తుడు కాడనీ మారుతికి వరాలొసగాడు. 


5. కుబేరుడు:  

    సమరమునందు తన గద ఆంజనేయునికి ఎట్టి ఆపదను కలిగించదన్నాడు. 


6. శంకరుడు: 

    తన వలన గానీ, శూల పాశుపతాస్త్రాది తన ఆయుధాల వలనగానీ హనుమ వధ్యుడు కాడని వరమనుగ్రహించాడు. 


7. విశ్వకర్మ: 

    తాను నిర్మించిన దివ్యశస్త్రములలో ఏ ఒక్కటైననూ రణమందు వధింపజాలదనీ, 

    చిరంజీవి అవుతాడనీ హనుమకి వరాలిచ్చాడు. 


8. బ్రహ్మ: 

    ఏ బ్రహ్మదండంచేతనూ వధ్యుడు కాడనీ, 

    దీర్ఘాయువనీ మారుతికి వరాలిచ్చి, 


 వాయుదేవునితో మారుతిని గూర్చి 

  - శత్రువులను గడగడలాడించగలడనీ, 

  - మిత్రులకు అభయప్రదాత అవుతాడనీ, 

  - యుద్ధంలో శత్రువులకు అజేయుడై వర్ధిల్లుతాడనీ, 

  - కోరుకొన్న రూపాలను పొందగలడనీ, 

  - ఇష్టానుసారంగా అంతటా - వేగంగానూ, నెమ్మదిగానూ సంచరింపగలడనీ, 

  - చిరస్థిరకీర్తితో వర్ధిల్లగలడనీ, 

  - యుద్ధమునందు అతడొనర్చే వీరోచిత సాహసాద్భుత కృత్యాలన్నీ రావణ సంహారానికి కారకాలవుతూ, అవి రామునకు ప్రియము గూర్చుతాయనీ, 

    లోకాలకు రోమాంచమునూ సంతోషాన్నీ కలిగిస్తాయనీ పేర్కొన్నాడు. 


    ఆ విధంగా సకల వరాలూ పొందిన శిశువైన మారుతిని, వాయుదేవుడు అంజనాదేవి వద్దకు తీసుకువచ్చి, ఆమెకు అప్పగించి, వరాలగూర్చి వివరించి వెళ్ళాడు.


    జాంబవంతుడు హనుమ శక్తిని పొగిడి సముద్రలంఘనం చేయించాడు. 


    మనం కూడా స్వామిని స్తుతిస్తే సకల శుభాలూ కలిగిస్తాడు.   

    ప్రతిరోజూ ఆరాధిస్తూ, 

    సకల శాస్త్ర పారంగతుడూ, సర్వశక్తిమంతుడూ అయిన హనుమని సేవిద్దాం. 

    మన జీవిత లక్ష్యాలని నెరవేర్చుకొందాం. 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

19, మే 2022, గురువారం

పరులను అవమానించడం

 శ్లోకం:☝️

*క్షత్రియం చైవ సర్పం చ*

    *బ్రాహ్మణం చ బహుశ్రుతం l*

*నావమన్యేత వై భూష్ణుః*

    *కృశానపి కదాచన ll*


భావం: పరులను అవమానించడం అసలు తగదు. అందునా -  పరాక్రమం గల రాజునీ, పామునూ, బాగా పాండిత్యం గల బ్రాహ్మణునీ, బాగా బ్రతికి - చెడినందువల్ల అవస్థలు పడేవాడినీ, ఎన్నడూ అవమానించరాదు. ఎందుకంటే - వీరు తాత్కాలితంగా ఏమీ చేయకలేకున్నా, తమ శక్తి సామర్థ్యాలకు పదునుపెట్టి అవతలివారి అంతు చూడగలరు. కావున వీరి విషయంలో  అమర్యాద కూడదు.

ఆలోచించండి

 దయచేసి ఓ తురక రచయత పంపిన మెసేజుకి బదులుగా చెంప ఛెళ్ళుమనేలా ఈ పోస్టుని తిరిగి పంపండి..ఇది ఓ కర్తవ్యంగా భావించండి.


మానవత్వానికే మచ్చతెచ్చే అనేక హీన కార్యాలకి ఏ మతస్థులు పూనుకున్నారు?...దానికి కారణం ఎవరు?


ఐదుసార్లు మసీదుకెళ్తేనో ..బురఖాలు దుస్తులు ధరిస్తేనో, గుళ్ళల్లోనో, చర్చిల్లోనో ప్రార్ధనలు చేస్తేనో ఎవరూ సాంప్రదాయవాదులు కాలేరు..


చీరలు కట్టుకున్నా వేరే దుస్తులు ధరించినా మా ఆడవాళ్ళ ఔన్నత్యం..మాతృత్వ సున్నితత్వం మిగతావారి కెక్కడివి?


ఇప్పటికీ మేము అరుంధతీ మాత, సతీ సావిత్రి, అహల్యాబాయ్ హోల్కర్, ఝాన్సీ లక్ష్మీ బాయ్, నేటి తరానికి చెందిన సరోజినీ నాయిడు, సుధామూర్తి లాంటి వారిని గొప్పగా చెప్పుకుంటాం....


_ప్రపంచంలోని వేరే ఏ మతంలోనైనా గొప్ప ఖ్యాతి గాంచిన ఐదుగురు ఆడాళ్ళ పేర్లు చెప్పండి దయచేసి?_


తండ్రి మాటవిని రాజ్యాన్ని వదిలేసిన రాముణ్ణి అనుక్షణం తలుచుకుని గర్వ పడతాం..

రాజ్యం కోసం తండ్రులని, అన్నదమ్ములని చంపి, ఖైదు చేసిన చరిత్రలు ఎవరివి? అవన్నీ మేము రాసినవా?


మేము రోజు గుడికెళ్ళం...కానీ...ఇంటికో తులసి చెట్టు, ఈశాన్యంగదిలో దేవుడు, వందలో కనీసం అరవై శాతం మంది ఫోన్లలో లాక్ స్క్రీన్ కి దేవుడు..రింగ్ టోన్ లో శ్లోకం..ఇలా చెప్పలేనన్ని విధాలుగా మా దేవుడు సన్నిహితంగా ఉండేలా మేం చూసుకుంటూనే ఉన్నాం. అసలు మనుషలలోనే దేవుడిని చూడమన్న గొప్ప మతం కదండీ మాది.. మన మతం కాకపోతే చంపెయ్యండి అన్న మాటలు మా గ్రంధాల్లో ఎక్కడైనా చూపగలరా?


మారిన జీవన విధానాలకోసం కొన్ని సాంప్రదాయాలను పాటించడం కుదరట్లేదు..అయినా మా రామాయణ భారతాలు తరతరాలుగా మా పిల్లలకి మననం అవుతూనే ఉంటాయి...మీకా స్వేఛ్ఛ లేదని మామీద ఎందుకు అసూయ పడతారు? 


ఎవరి పిల్లలు పన్నెండేళ్ళకే తుపాకులు పట్టుకున్నారని వార్తల్లో చదువుతున్నాం? ఎవరి పిల్లలు..పరమతస్తులపై ద్వేషాన్ని, విషాన్నీ కక్కుతున్నారు? చరిత్రలఖ్ఖర్లేదు ...ఇటీవలి వార్తలు తియ్యండి చాలు..


ఏమతాన్ని చూసైనా అసూయ పడాల్సిన ఖర్మ హిందువులకేం పట్టిందండి? అన్ని మతాల సారం, సాంప్రదాయపద్ధ్తతులూ అన్నీ మాదగ్గరే ఉంటే!


ఉదాహరణకి విగ్రహారాధన కి మీరు వ్యతిరేకం..మా చిదంబరం గుళ్ళో మేము పాటించేదే కదండీ ఆ పద్ధతి?


ఇహ చివరగా..


మీ మతాలని విమర్శిస్తూ ఎవరైనా పోస్ట్ పెడితే పరిణామం దారుణంగా ఉంటుంది....మావాళ్ళు ' పోన్లే..ఎంత తలకుమాసినవాడైనా మనమంచికే చెప్పాడు ' అనుకుని క్షమించి అందరికీ ఫార్వార్డ్ చేస్తారు..


ఎవరు మానవత్వానికి దగ్గరగా ఉన్నారు? ఎవరు మారణహోమానికి నిత్యం అంగలార్చుతున్నారు? 

_ఎవరిని చూసి ఎవరు అసూయ పడి విషాన్ని కక్కుతున్నారు?_


*ఆలోచించండి. మీరే కాదు..మావాళ్ళూ ఆలోచించాల్సిందే..*

విష్ణుపురం శాస్త్రి గారి అనుభవాలు

 విష్ణుపురం శాస్త్రి గారి అనుభవాలు


1940లో పరమాచార్య స్వామివారు కాశీయాత్రను ముగించుకుని విష్ణుపురం విజయం చేశారు. పరమాచార్య స్వామివారు సవారి వెళ్తున్నప్పుడు, ఒక ప్రముఖ వ్యక్తి సమీపించి పరమాచార్య స్వామివారికి బోధన చేసిన గురువుని సామి శాస్త్రిగారు అని సంబోధించాడు. 


స్వామివారు ఎంతో ఆవేదనతో అతణ్ణి “ఏమన్నావు? ఏమన్నావు?” అని అడిగారు.

ఆ భక్తుడు కాస్త కంగారుపడి “నేను ఏమి అపచారం చేశాను? పరమాచార్య స్వామివారు అంత క్షోభ పడుతున్నారు?” అని పరిపరివిధాల ఆలోచిస్తున్నాడు.

మహాస్వామి వారు అతనితో, “వారి గురించి నీకు ఏమి తెలుసు? నేను సైతం ఎన్నడూ వారిని పేరు పెట్టి పిలవలేదు; విష్ణుపురం శాస్త్రిగారు అనే అనేవాణ్ణి” అన్నారు. గురువులపై అంతటి గౌరవం వారికి.


ఈ సూచన కేవలం ఆ భక్తుడికి మాత్రమే కాదు, మనకు కూడా!


శ్రీ పరమాచార్య స్వామివారికి శిక్షణ ఇచ్చేందుకు కుంభకోణంలోని శ్రీమఠం పక్కనే మా తాతగారికి కూడా వసతి ఏర్పాటు చేశారు. మా నాన్నగారు కూడా తరచూ అక్కడకు వెళ్లి కొన్ని రోజులు ఉండేవారు.


మఠం పైన ఉన్న మేడమీద వర్షపు నీరు వెళ్ళడానికి గొట్టాలు ఉన్నాయి. వర్షం పడినప్పుడు, పరమాచార్య స్వామివారు మా నాన్నగారితో పాటు మేడపైకి వెళ్ళేవారు. ఇద్దరూ ఆ గొట్టాలను తీసి అక్కడ నిల్చున్న నీటితో ఆటలాడుకునేవారు. సూర్యుడు ఉండగా వర్షం కనుక పడితే, మహాస్వామి వారు వర్షంలో తడుస్తూ, “గంగ స్నానం, గంగా స్నానం!” అని అరుస్తూ, నాట్యం చేస్తూ ఆనందపడేవారు.


***********************************


అప్పట్లో పరమాచార్య స్వామివారి యాత్ర అంటే, స్వామివారితో పాటు పెద్ద రాజ పరివారం వెళ్ళేది. మూడు ఏనుగులు, అయిదు గుర్రాలు, ఇరవైరెండు ఆచ్చాదన ఉన్న ఎడ్లబండ్లు, పదిహేను గోవులు, రెండు సవారి గుర్రాలు (ఒకటి నల్లనిది, ఒకటి పంచకల్యాణి - ముఖము, కాళ్ళు తెల్లగా ఉండేది), రెండు గుర్రపు బగ్గీలు, సవారి ముందర పెద్దగా శబ్దం చేస్తూ బాకా. అయిదుగురు లోపలి వలయం కాపలావాళ్ళు, బయటి వలయం కాపలావాళ్ళు అయిదుగురు. వీరు కాకుండా, ఎందఱో వేదపండితులు, వ్యక్తిగత సహాయకులు, మేనేజరు, కోశాధికారి, ప్రముఖులు మరియు మేళ తాళాలు.


పరమాచార్య స్వామివారు విజయం చేస్తున్నారని తెలిస్తే, ఊరు మొత్తం కోలాహలంగా, సందడిగా, పండుగ వాతావరణంతో ఉండేది. ఇప్పుడు ఇవన్నీ కేవలం ఊహించి మాత్రమే దర్శించాలి.


***********************************


పరమాచార్య స్వామివారికి శ్రీమద్భాగవతం అంటే అమిత ఆసక్తి. ఒకసారి, రామమూర్తి అయ్యర్ భాగవతం చదువుతూ ఉంటే, స్వామివారు వింటున్నారు.

అప్పుడు, భాగవత ప్రవచనాలకు ప్రసిద్ధుడైన నీడమంగళం శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారు అక్కడకు వచ్చి ఢిల్లీలో భాగవత సప్తాహం ముగుంచుకుని వస్తున్నాను అని స్వామివారికి తెలియజేశారు.


“విద్వాంసులు కూడా వచ్చి విన్నారా?” అని అడిగారు స్వామివారు.

“అవును వచ్చారు”


“వారు ఏమన్నారు?”


ఒక పండితుడు అన్నాడు, “అందులో రాస పంచాధ్యాయి కనుక లేకపోయి ఉంటే, శ్రీమద్భాగవతం అద్భుత గ్రంథం అయ్యుండేది”.


అందుకు స్వామివారు చిన్నగా నవ్వి, “రాస పంచాధ్యాయిని పఠనము-శ్రవణము-మననము చేసిన తరువాతనే, నాకు సన్యాసం సిద్ధించిందని నిర్ణయించుకున్నాను నేను” అన్నారు.


విషయాన్ని అర్థం చేసుకోకుండా కేవలం చిన్నపిల్లలు మాట్లాడినట్టు ప్రవచనం చేసేవారికి ఇది ఒక పాఠం అని మనం అర్థం చేసుకోవాలేమో.


***********************************


పరమాచార్య స్వామివారు విష్ణుపురానికి ఏడెనిమిది సార్లు విజయం చేసుంటారు. శంకర జయంతి, నవరాత్రి వంటి ముఖ్యమైన సందర్భాల్లో స్వామివారు అక్కడ మకాం చేశారు.


మా ఊరి ముఖద్వారం వద్ద, వీధుల్లో మరియు దారుల కూడళ్ళలో స్వామివారిని స్వాగతించడానికి క్రమానులను ఏర్పాటుచేసేవారం. వాటిపై గీతలోని ముఖ్య శ్లోకాలను పెద్ద పెద్ద అక్షరాలతో రాసేవాళ్ళం. 


మహాస్వామివారు మేనాలో రావడంతో వాటిపై రాసినది స్వామివారికి కనిపించేది కాదు. రాత్రి పూజ అయిపోగానే, ఒక పెట్రోమాక్స్ గ్యాస్ లైటు తీసుకుని ఒక్కొక్క శ్లోకం చదువుతూ వెళ్ళేవారు. ఈ గీతా శ్లోకాలను ఎవరు నిర్ణయించారు అన్నప్పుడు మా గుండెల్లో చిన్న వణుకు. మెచ్చుకుంటారా? మందలిస్తారా? అని. 


చివరగా స్వామివారే అన్నారు, “అంతా బావుంది! నేను ఎలా ఉండాలో మీరు నాకు గుర్తు చేశారు” అని.


ఈ మాటలు వినగానే, మాకు దిగులు పట్టుకుంది. కాని తరువాత మాకు అర్థం అయ్యింది అది ఆరోపణ కాదు, అది కేవలం సరదాగా చేసిన స్వీయ విమర్శన మాత్రమే అని. ఆత్మ పరిశోధన చేసుకునే ఆత్మబలం అది. 

 

--- శ్రీమతి మోహన పంచపకేశన్, మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

*పితృ దోషము

 *పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం*


పితృ దోషం' ...

మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ...

అలాగే... 

తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.

మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.

అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు -

 మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే.

అదే

" పితృ దోషము "

ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం.

అందుకే ఈ పోస్టు పెడుతున్నాను.

పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.

ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.

వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.

పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము...

చిన్న వారు అకాలమరణం పొందడం 

శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.

అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం మన ప్రమేయం లేకుండా

ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం

మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం

ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం కారణం

దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం.మోక్ష నారాయణ శ్రద్ద పూజ చేయవలయును.సంప్రదించవలసిన నెంబర్లు 9440544759/9491298422.


*సర్వేజనా సుఖినోభవంతు*

*గురుభ్యోన్నమః*

18, మే 2022, బుధవారం

నేను

 ‌‌‌    *నేను*


*పురుగు, పక్షి, పాము, చెట్టు... అన్నీ జీవిస్తున్నాయి. మరి మనమెందుకలా "నేను" అనే అహం లేకుండా హాయిగా జీవించలేకపోతున్నాం?*


*బుద్ధి కలిగి ఉండటం మనిషికి వరం, శాపం కూడా. "నేను"  అనే అహం లేకుండా చేసుకుంటే ఆ బుద్ధి వరం.*

             *"నేను" అనే అహం ను మేరుపర్వతమంత పెంచుకుంటే ఆ బుద్ధి  శాపం.*

         

               *చిన్న ‘నేను’ నుంచి పెద్ద ‘నేను’ వరకు సాగే అతిపెద్ద జీవనమే అత్యంత అద్భుతమైన సాధన. చిన్న "నేను" అర్జునుడు. పెద్ద  "నేను"  శ్రీకృష్ణుడు.  అతి పెద్ద జీవనగమనం కురుక్షేత్ర యుద్ధం.*


 *అత్యంత అద్భుతమైన సాధన భగవద్గీత.    శ్రీరాముడు సాధారణ మనిషిలా భూమిపై జీవించాడు. మనిషిగా తన కర్తవ్యం నిర్వహించి, దేవుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆదర్శప్రాయుడు అయ్యాడు.*


*జీవితం అవకాశం ఇస్తుంది. అంతే. దాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. కారణజన్ముడికైనా, అకారణ జన్ముడికైనా- బాధలు, కష్టాలు ఒకటే. విధిరాత మారదు. జీవితాన్ని భయపెట్టేవాడికి విధిరాత భయపడుతుంది.*


*మనలో ఉండే అద్భుతమైన, అసాధారణమైన, అసామాన్యమైన గుణగణాలు చూసి లోకం మోకరిల్లుతుంది.*


            *పుట్టుకతోనే నోట్లో బంగారు చెంచాతో పుట్టినవాడినైనా జీవితం తడిగుడ్డ పిండినట్లు పిండక మానదు. ఇంతకంటే మహాసాధన జీవితానికి ఉండదు.*


 *మానవుడిగా పుట్టడం, ప్రకృతితో కలిసి జీవించడం, సత్యానుభవం కోసం తహతహలాడటం... ఎన్నో జన్మల పుణ్యం. ఏ ఉపనిషత్తూ ఈ విషయాన్ని కాదనలేదు.*


*వచ్చి ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళకూడదు. కొద్దో గొప్పో దివ్య శక్తి సంపన్నుడు కావాలి.ఆ శక్తిని ఆత్మలో నిక్షిప్తం చేసి తిరుగు పయనం కావాలి. అదే అతడి శాశ్వత సంపద.*


*వేదాలు పదేపదే చెప్పే విషయం. దేవుడు, మనిషిని పూర్తిగా తన పనిలో ఉంచుకోవాలని నిత్యం అనుకుంటాడు. మనిషి తాను శరీరం తప్ప మరేమీ కాదన్న భ్రమలో ఉంటూ దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు.*


*శరీరం ఒక ఊబి అంటాడు అరవిందుడు. అందులో కూరుకుపోతే బయటకు రావడం చాలా కష్టం. ఎన్నో జన్మలు అందులోనే ఉన్నాం. ఇప్పుడైనా శరీరాన్ని  (శరీర భావాన్ని) వదిలి ఆత్మ వైపు తిరగడం (ఆత్మావలోకనం)  అత్యవసరమని మనిషి గ్రహించి, ఆత్మజ్ఞానం పొందిన రోజునే అతడు దివ్యశక్తి సంపన్నుడవుతాడు.*


*ఏ అవకరం లేని,‌ ఆరోగ్యవంతమైన శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు. ఈ శరీరం నాదని సంతోషంగా చెప్పుకొంటున్నాం. ఈ శరీరాన్ని మనకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా వారికి మనం ఏం ఇవ్వాలి? మా పని మేం చేశాం, నీ ధర్మం నువ్వు నెరవేర్చు  అన్నట్లుగా ఉంటుంది ఈ భూమ్మీద మనిషి జన్మ రహస్యం.*


*శరీరాన్ని చూసి ఆనందపడవచ్చు. అందంగా ఉన్నదైతే మురిసిపోవచ్చు. శరీరాన్ని పోషించి సుఖపెట్టవచ్చు. కాని, ఈ శరీరం దేనికి అని ఎప్పుడైనా నిజాయతీగా ప్రశ్నించుకోవాల్సిందే.*


*మానవ శరీరం రావడం అదృష్టం. శరీరం గురించి తెలుసుకుంటూ దాని పరిమిత భావాన్ని పోగొట్టుకోవాలి. శరీరం  "నేను"  కాదని తెలుసుకోవాలి. శరీర ప్రయోజనం తెలుసుకోవాలి. శరీర బంధం తాత్కాలికమని గ్రహించాలి.*

*విష్ణువు యముని ఊరడించుట*

 _*బుధవారం మే 18, 2022*_


    _*🚩వైశాఖ పురాణం🚩*_

_*🌴18 వ అధ్యాయము🌴*_


🕉🌷🕉️🌷🕉️🌷🕉️🌷


*విష్ణువు యముని ఊరడించుట*


☘☘☘☘☘☘☘☘


నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తితో నిట్లనెను.


యముని మాటలను విని బ్రహ్మ ఇట్లనెను. ఓయీ ! నీవెందులకు విచారింతువు. నీవు చూచినదానిలో నాశ్చర్యమేమున్నది ? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలని ఫలము జీవితాంతముండును. శ్రీహరి నామమునుచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖవ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది ? గోవిందనామము నొక్కసారి పలికినను నూరు అశ్వమేధ యాగముల అనంతరము అవబృధస్నానము చేసిన వచ్చునంత పుణ్యము కల్గును. ఎన్ని యజ్ఞములను చేసినవారైనను పుణ్యఫలముల ననుభవించి మరల జన్మింపక తప్పదు కాని శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ వుండదు. శ్రీహరి నామము నుచ్చరించినవారు  కురుక్షేత్రమునకు పోనక్కరలేదు. సరస్వతి మున్నగు తీర్థముల యందు మునగనక్కరలేదు. చేయరాని పనులను చేసిన వారైనను యెంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరానిదానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుజ్యమునందుదురు. ఇట్టి శ్రీమహా విష్ణువునకిష్టమైనది వైశాఖమాసము.  వైశాఖ ధర్మములను విన్నచో సర్వపాపములును హరించును. విష్ణుప్రియమగు వైశాఖ వ్రతము నాచరించినవారు శ్రీహరి పదమును చేరుటలో నాశ్చర్యమేమున్నది ? మనలందరిని సృష్టించి సర్వ జగన్నాధుడు శ్రీమహా విష్ణువు అట్టివానిని సేవించినవారు విష్ణులోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది ? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికిష్టమైన వైశాఖమాస వ్రతమును చేసిన వారియందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా ! యమధర్మరాజా ! శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడును అశుభముండదు కదా ! జన్మమృత్యు జరావ్యాధి భయము కూడ నుండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తికొలది ఆచరింప యత్నించినచో నతడు పనిని పూర్తిచేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి / సేవకుడు పాపమునందడు. వానికెట్టి దోషమును లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు. అని బ్రహ్మ యముని బహువిధములుగ ఊరడించెను.


అప్పుడు యముడు బ్రహ్మమాటలను విని స్వామీ ! నీ యాజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని. అన్నిటిని పొందితిని. ఇది చాలును. నేను మరల నా పూర్వపు ఉద్యోగములోనికి వెళ్లజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖవ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నాయధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్దము చేసిన పుత్రునివలె సంతృప్తి పడుదును. కృపాకరా ! నాయీ కోరిక తీరునట్టి యుపాయమును చెప్పుము. అప్పుడు నేను మరల నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించెను.


అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా ! విష్ణుభక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదము. జరిగినదంతయు శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చెయుదము. సర్వలోకములకు కర్తయగు ఆ శ్రీమన్నారాయణుడే. ధర్మపరిపాలకుడు. మనలను శిక్షించు దండధరుడు మనల నాజ్ఞాపించు నియామకుడు. శ్రీహరిమాటలకు మనము బదులు చెప్పదగినది యుండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుటచే అతనికిని బదులు చెప్పజాలము. మనము శ్రీహరి యెద్దకే పోవుదుమని యమధర్మరాజును వెంట నిడుకొని క్షీరసముద్రము కడకరిగెను. జ్ఞానస్వరూపుడు నిర్గుణుడును సాంఖ్యయోగములతో కూడినవాడును పురుషోత్తముడునగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ, యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించిరి.


శ్రీహరియు వారిద్దరిని జూచి *"మీరిద్దరు నెందులకిచటకు వచ్చితిరి. రాక్షసుల వలన బాధ కలిగినదా ? యముని ముఖము వాడియున్నదేమి ? అతడు శిరము వంచుకొని యేల నుండెను ? బ్రహ్మ ! ఈ విషయమును చెప్పుమని"* యడిగెను.


అప్పుడు బ్రహ్మ మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరును వైశాఖ వ్రతమును పాటించి విషులోకమును చేరుచున్నారు. అందువలన యమలోకము శూన్యమై యున్నది. అందుచే నితడు దుఃఖపడుచున్నాడు. ఆ దుఃఖము నాపుకొనలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండమును గూడ ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై యేమి చేయవలయునో తెలియక నా యొద్దకు వచ్చెను. నేనును యేమి చేయుదును. స్వామీ నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణు గోరి వచ్చితిమి. దయయుంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడుమని బ్రహ్మ పలికెను. శ్రీమహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని , బ్రహ్మను జూచి యిట్లనెను. నేను లక్ష్మీదేవినైనను , నా ప్రాణములను , దేహమును , శ్రీవత్సమును , కౌస్తుభమును , వైజయంతీమాలను , శ్వేతద్వీపమును , వైకుంఠమును , క్షీరసాగరమును , శేషుని , గరుత్మంతుని దేనినైనను విడిచెదను గాని నా భక్తుని మాత్రము విడువను. సమస్త భోగములను , జీవితములను విడిచి నాయందే ఆధారపడియున్న యుత్తమ భక్తునెట్లు విడిచెదను ?


యమధర్మరాజా ! నీ దుఃఖము పోవుటకొక యుపాయమును కల్పింపగలను. నేను కీర్తిమంతుమహారాజునకు సంతుష్టుడనై పదివేల సంవత్సరముల ఆయుర్దాయము నిచ్చితిని. ఇప్పటికెనిమిదివేల సంవత్సరములు గడచినవి. ఆ తరువాత వేనుడను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములగు సదాచారములను నశింపజేయును. పెక్కు దురాచారములను ఆచరణలో నుంచును. అప్పుడు వైశాఖమాస ధర్మములును ఆచరించువారు లేక లోపించును. ఆ వేనుడును తాను చేసిన పాప బలమున నశించును. అటుపిమ్మట నేను పృధువను పేరున జన్మించి ధర్మసంస్థాపన చేయుదును. అప్పుడు మరల వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింప జేయగలను. అప్పుడు నాకు భక్తుడైనవాడు నన్నే ప్రాణములకంటె మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖధర్మములను తప్పక పాటించును. కాని అట్టివాడు వేయిమందిలో నొకండుండును. అనంత సంఖ్యలోను జనులలో కొద్దిమంది మాత్రమే నాయీ వైశాఖధర్మముల నెరిగి పాటింతురు. మిగిలిన వారు అట్లుగాక కామవివశులై యుందురు. యమధర్మరాజా ! అప్పుడు నీకు కావలసినంతపని యుండును. విచారపడకుము. వైశాఖమాస వ్రతమునందును నీకు భాగము నిప్పింతును. వైశాఖవ్రతము నాచరించువారందరును నీకు భాగము నిచ్చునట్లు చేయుదును. యుద్దములో నిన్ను గెలిచి నీకీయవలసిన భాగమును రాకుండ జేసిన కీర్తిమంతుని నుండియు నీకు భాగము వచ్చునట్లు చేయుదును. నీకురావలసిన భాగము కొంతయైన వచ్చినచో నీకును విచారముండదు కదా ! *(ఇచట గమనింపవలసిన విషయమిది. కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుట యేమని సందేహము రావచ్చును. వైశాఖవ్రతము చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండ విష్ణులోకమునకు పోవుటయనగా నరకమునకు పోవలసినవారు యముని భాగము కాని వారు యముని భాగము కాకుండ విష్ణులోకమునకు పోవుచున్నారు. ఇందులకు కారణమెవరు ? రాజైన కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకొనుటయనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమునాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ ధర్మము నాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ వ్రతము నాచరించు కీర్తిమంతుడును యమునకు తానును భాగము నిచ్చునట్లు చేయును. ఇందువలన యమధర్మరాజు మనస్సున కూరట కలుగునని శ్రీహరి యభిప్రాయము)* వైశాఖ వ్రతము నాచరించువారు ప్రతిదినమునను స్నానము చేసి నీకు అర్ఘ్యము నిత్తురు. వైశాఖవ్రతము చివరినాడు జలపూర్ణమైన కలశమును , పెరుగన్నమును నీకు సమర్పింతురు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నియు వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతమాచరించువారు ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యము నీయవలయును మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును , పెరుగన్నమును యమునకు నివేదింపవలయును. యముని పేరుతో దానమీయవలయును. అట్లు చేయనివారి పూజాదికర్మలు వ్యర్థములగునని భావము.


కావున వైశాఖవ్రతము నారంభించు ప్రతివారును ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యమునీయవలెను. వైశాఖపూర్ణిమయందు జలకలశమును దధ్యన్నమును ముందుగా యమునకిచ్చి తరువాత శ్రీమహావిష్ణువు కర్పింపవలయును. అటు తరువాత పితృదేవతలను , గురువును పూజింపవలయును , తరువాత శ్రీమహావిష్ణువునుద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన యన్నమును దక్షిణగల తాంబూలమును ఫలములనుంచిన కంచుపాత్రను సద్బ్రాహ్మణునకు /పేదవాడగు వానికి నీయవలయును బ్రాహ్మణుని తన శక్తికి దగినట్లుగ గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వివరముల నీయగలడు. వైశాఖవ్రతము నాచరించువారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వ్రతధర్మములను పాటించునప్పుడు యధాశక్తిగ నాచరించుట మరింత ముఖ్యము.


ఇట్లు వైశాఖవ్రతము నాచరించినవారు జీవించినంతకాలము అభీష్టభోగముల ననుభవించుచు పుత్రులు , పుత్రికలు , మనుమలు. , మనుమరాండ్రు మున్నగువారితో సుఖముగ శుభలాభములతో నుండును. మరణించిన తరువాత సకుటుంబముగ శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యధాశక్తిగ వైశాఖవ్రతమును దానధర్మముల నాచరించి సకల భోగభాగ్యములను సర్వసంపదల ననుభవించి తనవారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.


కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడునగు వేనుడు రాజయ్యెను. అతడు సర్వధర్మములను నశింపజేసెను. వైశాఖమాస వ్రతాదులును లోపించినవి. ఇందువలన మోక్షసాధనము సర్వసులభమునగు వైశాఖధర్మము యెవరికిని దెలియని స్థితిలోనుండెను. పూర్వజన్మ పుణ్యమున్నవారికి మాత్రమే వైశాఖధర్మములయందాసక్తి నిశ్చల దీక్ష శ్రీహరిభక్తి యుండును. అట్టివారికి ముక్తి ఇహలోక సుఖములు , సులభములు తప్పవు. కాని పురాకృతసుకృతమువలననే ఇది సాధ్యము సుమా అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను. శ్రుతదేవమహామునీ ! పూర్వపు మన్వంతరముననున్న వేనుడు దుర్మార్గుడనియు ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేనుడు మంచి వాడనియు వింటిని. మీ మాటలవలన కీర్తిమంతుని తరువాత వేనుడు రాజగునని చెప్పిరి. దీనిని వివరింపుడని యడిగెను.


శ్రుతదేవుడును రాజా ! యుగములనుబట్టి , కల్పములనుబట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగ చెప్పబడి యుండవచ్చును. ఆ కథలును ప్రమాణములే మార్కండేయాదిమునులు చెప్పిన వేనుడొక కల్పమువాడు. నేను చెప్పిన వేనుడు మరియొక కల్పమువాడు మంచి చెడుకలవారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకొందుము. అట్లే కీర్తిమంతుని మంచితనము , గొప్పతనము తరువాత వేనుని చెడ్డతనము దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా యని పలికెను. అని నారదుడు అంబరీషునకు వివరించెను.


*వైశాఖ పురాణంలోని పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం*


              🌷 *సేకరణ*🌷

           🌹🌷🌞🌞🌷🌹

                *న్యాయపతి*

             *నరసింహా రావు*

🙏🌷🙏🌷🙏🛕🙏🌷🙏🌷🙏

సతతం కార్యః

 👌 *సుభాషితమ్* 👌

⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️


*శ్లోకం*


యత్నో హి సతతం కార్యః 

తతో దైవేన సిద్ధ్యతి!

దైవం పురుషకారశ్చ కృతాన్తేనోపపద్యతే!!


"తమ ఇష్టసిద్ధికి నిరంతరం ప్రయత్నం చేయవలసినదే. 


అప్పుడు దైవానుగ్రహం ఫలిస్తుంది. 


దైవానుగ్రహం, మానవ ప్రయత్నం, కాలం వల్లనే సిద్ధిస్తాయి".


⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️

యస్యస్మరణ మాత్రేణ*

 శ్లోకం:☝️

*యస్యస్మరణ మాత్రేణ*

    *విద్రవంతి సురారయః l*

*సహస్రార నమస్తుభ్యం*

    *విష్ణు పాణి తలాశ్రయః ll*

    - శ్రీ సుదర్శన శతకం


భావం: ఎవ్వని స్మరించిన మాత్రముననే అసురరాక్షసాదులందరూ భయపడి పరుగులు పెట్టుదురో, అట్టి మాహాత్మ్యము గల శ్రీమన్నారయణుని పాణి తలమున అలంకరించి ఉండు ఓ సహస్రార దేవా ! ఓ సుదర్శన దేవా! నీకు నమస్కారములు.🙏

17, మే 2022, మంగళవారం

దశవాతార శ్లోకం

 శ్లోకం:☝️దశవాతార శ్లోకం

*వేదానుద్ధరతే*

    *జగన్నిహతే*

        *భూగోళం వుద్-భిభ్రతే*

*దైత్యం దారయతే*

    *బలిం చలయితే*

        *క్షత్రక్షయం కుర్వతే l*

*పౌలస్త్యం జయతే*

    *హలం కలయతే*

        *కారుణ్యమాతన్వతే*

*మ్లేచ్చాన్మూర్చయతే*

    *దశాకృతి కృతే*

        *కృష్ణాయ తుభ్యం నమః ll*


భావం: మత్స్యముగా వేదములనుద్ధరించినవాడు, ఆది కూర్మముగా మందర పర్వతమును వీపుపై భరించినవాడు, వరహమై భూమిని కాపాడినవాడు, బలి చక్రవర్తిని అణచినవాడు, పరుశు రాముడై క్షత్రియుల గర్వము అణచినవాడు, బలరామునిగా నాగలితో హస్తినాపురమును ఎత్తినవాడు, శ్రీకృష్ణునిగా లోకాలను రక్షించినవాడు, కల్కి అవతారముతో దుష్టులను సంహరించేవాడు యైన శ్రీ మహావిష్ణువుకు, ఆ అవతారములను ధరించిన సాక్షాత్ విష్ణుస్వరూపమైన శ్రీ కృష్ణునకు నమస్కారము.🙏

ఆవకాయ

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

కం//

శ్రేష్టంబిది పచ్చళ్ళన,

టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,

ఇష్టముగ ఆవకాయను

సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!



(ఈ పై పద్యం లోని ఆఖరి రెండు పాదాలూ, కవి మిత్రులు 'ఆత్రేయ' గారి అనుమతితో వారి ఒక పద్యమునుంచి 'లేపిన'వి.)



కం//

ఊరిన ముక్కను కొరకగ,

ఔరా! అది ఎంత రుచిని అందించునయా,

కూరిమితొ నాల్గు ముక్కలు

నోరారా తినని నోరు నోరవ్వదుపో!


కం//

బెల్లము వేసిన మధురము,

పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,

వెల్లుల్లి వేయ మధురము,

పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!



ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:


కం//

చెక్కందురు, డిప్పందురు,

ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్.

డొక్కందురు, మామిడి దిది

పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!



ఆవకాయ ఉపయోగాలు:


కం//

ఉదయమె బ్రెడ్డున జాముకు

బదులుగ ఇదివాడిచూడు, బ్రహ్మాండములే,

అదియేమి మహిమొ తెలియదు,

పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!



కం//

ఇందువల దందు బాగని

సందేహము వలదు; ఊట సర్వ రుచిహరం

బెందెందు కలపి చూసిన,

అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!



ఆవకాయ అవతరణ:


కం//

“చప్పటి దుంపలు తినుచును,

తిప్పలు పడుచుంటిమయ్య, దేవా, దయతో

గొప్పగు మార్గం బొక్కటి

చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్”


అంటూ,


కం//

ముక్కోటి దేవులందరు

మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా

చక్కనిది ఆవకాయన

ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!



కం//

చారెరుగనివాడును, గో

దారిన తా నొక్కమారు తడవని వాడున్,

కూరిమిన ఆవకాయను

ఆరారగ తిననివాడు, ఆంధ్రుడు కాడోయ్!


 *సేకరణ: వాట్సాప్*.

దొంగతనం

 దొంగతనం 

మనయూరిలోనో మన కాలనీలోనో ఎక్కడో ఎవరింట్లోనో దొంగతనం జరిగింది అని తెలిసిన వెంటనే మనం జాగరూకులవటం సర్వ సాధారణం వెంటనే మన ఇంటి గడియలను సరి చేసుకుంటాము, ఇనపపెట్టె సరిగా ఉన్నదా లేదా అని చూసుకుంటాము. మనం తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము.  నిజానికి ఒకసారి ఒక ఇంట్లో దొంగతనం చేసిన వాడు వెంటనే ఆ సమీపంలోని ఇంకో  ఇంట్లో దొంగతనం చేయడు, కొంతకాలం అందరు మరచిన తరువాత తిరిగి తన పని మొదలు పెడతాడు.  కానీ మనం మాత్రం వెంటనే స్పందించి మన జాగ్రత్తలో మనం ఉంటాము. ఎక్కడికైనా వీళ్ళవలసి వస్తే మన పెట్టెలో వున్నవిలువైన వస్తువులను బ్యాంకు లాకరులో ఉంచి వెళ్ళటం కద్దు. 

బౌతికంగా జరిగే దొంగతనాలను మనం మన జాగ్రత్తలతో కొంతవరకు ఆపగలుగుతున్నాము.  కానీ ఇంకొక దొంగ అనాదిగా అందరి ఇళ్లలో పడి మనుషులను ఎత్తుకొని పోతున్నాడు. మనం నిత్యం మనుషులను మోసుకొని పోవటం చూస్తున్న అయ్యో పాపం అని వూరుకుంటున్నాం కానీ ఆదొంగ నా  ఇంటికి వస్తాడని నన్ను కూడా ఎత్తుకొని పోతాడని మాత్రం మనం తలవం. ఇంట్లో పడిన దొంగమీద పొలిసు స్టేషనులో ఫిరియాదు చేస్తాము వాడిని కోర్టులు విచారించి శిక్షిస్తాయి. కానీ ఈ రెండో రకం దొంగ మీద ఎలాంటి ఫిరియాదులు లేవు, చేయలేరు వాడిమీద ఫిరియాదుచేస్తే పోలీసులు తీసుకోరు, కోర్టులు వాడిని దండించవు. ఎందుకంటె ఈ దొంగ మన లోకపు వాడు కాదు వాడు వేరే లోకం వాడు అంటే యమలోకం వాడు.   కానీ ఒక్కటిమాత్రము నిజం వాడు ప్రతి వాని జీవితంలో ఆఖరుకి వస్తాడు. ప్రతి మనిషిని తీసుకొని  పోతాడు. వాడికి స్త్రీ పురుష భేదం లేదు చిన్న పెద్ద విచక్షణ లేదు. వాడు నిర్దయుడు. మరి ఈ దొంగనుంచి మనలను మనం కాపాడుకోవటం ఎలా, ఎలా అని మన మహర్షులు అనాదిగా ఎంతో కాలం ప్రయత్నించి మనకు ఒక చక్కని ఉపాయం చెప్పారు అదేమిటో యిప్పుడు చూద్దాం. 

మనం  పెట్టెలో ద్రవ్యాన్ని వుంచామనుకోండి ఆ పెట్టెని దొంగ ఎత్తుకొని పొతే పెట్టెతోపాటు ఆ ద్రవ్యం కూడా పోతుంది కాబట్టి తెలివయిన వాడు పెట్టెని ఇంట్లో భద్రంగా ఉంచి తాళం వేసి అందులోని విలువైన ద్రవ్యాన్ని మాత్రం బ్యాంకు లాకరులో ఉంచుతాడు దొంగ పెట్టెని తస్కరించినా ద్రవ్యం మాత్రం మనదగ్గరే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఆలోచనే మన ఋషులు చేశారు పెట్టెలోని ద్రవ్యాన్ని (ఆత్మను) బ్యాంక్ లాకరులో (ఈశ్వరుని సన్నిధిలో) ఉంచితే దొంగ పెట్టెని (దేహాన్ని) ఎత్తుకొని పోయిన ద్రవ్యం (ఆత్మ ) పరమేశ్వరుని సన్నిధిలో క్షేమంగా ఉంటుంది (మోక్షప్రాప్తి) కానీ ఇది చెప్పినంత సులువు కాదు సాధించటం మరి ఎలా సాధ్యం. (ఇక్కడ దేహం పెట్టెతో దేహి ద్రవ్యంగా పోల్చి చెప్పటం జరిగింది) . 

రోజులో కేవలం 24 గంటలు ఈశ్వర సన్నిధిలో ఉంటే మాత్రమే అది సాధ్యం..  నీకేమైనా పిచ్చి పట్టిందా రోజుకు ఉండేది కేవలం 24 గంటలు మాత్రమే కదా ఆ 24 గంటలు ఈశ్వరుని సన్నిధిలో ఎలా ఉంటాము అది పూర్తిగా అసాధ్యం అని మీరు  అనవచ్చు. కానీ మనసుపెట్టి పనిచేస్తే అది పూర్తిగా సాధ్యం. ఇప్పుడు సమస్య ఏమిటంటే నేను రోజు నా నిత్యవృత్తులకోసం పనిచేయాలి అలాంటప్పుడు ఎల్లప్పుడు ఈశ్వర సాన్నిధ్యంలో ఉండటం ఏల కుదురుతుంది.  దీనికి మన జ్ఞ్యానులు ఇలా చెప్పారు మీరు ఉషోదయ కాలంలోనే నిద్ర లేవండి.  మీ కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత వెంటనే సంకల్పం చేయండి యేమని అంటే ఈ రోజు నేను తీసుకునే శ్వాస (ఉచ్వాస నిశ్వాస) రెండు కూడా ఈశ్వర జపంగా అనుకుంటూ చేస్తాను.  (ఈ జపాన్ని అజపాజపం అంటారు) మరుసటి రోజు అదే సమయానికి నిన్న చేసిన అజపాజపమును ఈశ్వరార్పణ గావించాలి తిరిగి మరుసటి రోజుకి అజపాజపానికి సంకల్పం చేయాలి.  ఇలా చేస్తే ఒక రోజు నీవు తీసుకున్న ఉచ్వాస నిశ్వాసలు ఈశ్వర జపంగా మారి ఈశ్వరార్పణం చెందుతాయి.  చూసారా మీరు ఏరకంగా జపంచేయకుండా జప ఫలితాన్ని పొందారు. అంటే మీరు రోజులోని 24 గంటలు ఈశ్వర జపం చేశారన్నమాట. 

ఇక జీవన వ్యాపారాల గూర్చి తెలుసుకుందాము. మనం నిత్యం అనేక జీవన వ్యాపారాలు అంటే పనులు చేస్తుంటాము అంటే మన ఇంద్రియాలతో అనేక వ్యాపారాలు (వృత్తులు అంటే పనులు) చేస్తుంటాము. చూస్తుంటాము, వింటుంటాము, మాట్లాడుతుంటాము, తింటుంటాము తాగుతుంటాము ఇలా అనేకానేక పనులు చేస్తుంటాము మరి అవి అన్నీకూడా ఈశ్వరపరంగా మనం చేయము కదా మరి వాటి సంగతి యెట్లా?. ఉషోదయకాలంలో ఒక సంకల్పం చేయాలి అదేమిటంటే ఈ రోజు నేను చూసేది పూర్తిగా భగవత్ రూపాన్నే, వినేది ఈశ్వర వాణినే,  మాట్లాడేది ఈశ్వర పరమైనదే నేను తినే తిండి తాగే నీరు కేవలం ఈశ్వర తీర్ధ ప్రసాదాలు మాత్రమే నేను స్నానం చేస్తున్నాను అంటే ఈశ్వరునికి అభిషేకం చేస్తున్నాను అని, నేను మల, మూత్ర విసర్జన చేస్తున్నాను అంటే ఈశ్వరుని మాలిన్యాన్ని తొలగిస్తున్నాను అని నేను నిద్రిస్తున్నాను అంటే ఈశ్వరుడు నిద్రిస్తున్నాడు అని, నాకు ఎవరిదగ్గరినుండి ఐనా ద్రవ్యం వచ్చిందంటే అది ఈశ్వరుడు  ప్రసాదించింది. నాకు కలిగే సుఖము, దుఃఖము కేవలము అది ఈశ్వరుని అనుగ్రహంగా భవిస్తూ జీవితాన్ని  గడపాలి. రోజులో ఒక్క క్షణం కూడా ఇది నేను, ఇది నాకు అనే భావన మనసులోకి రానియ్యకూడదు. ఇలా చేసినవాడు నిత్య  ముక్తుడు అవుతాడు.ఇలా చేస్తే నీకుతెలియకుండానే నీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఆహార విహారాదులలో పూర్తిగా మార్పు వస్తుంది.  నీవు తినేది ప్రతిదీ ఆ ఈశ్వరుని ప్రసాదంగా ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు ఈశ్వరుని ప్రసాదానికి అర్హమైన పదార్ధాన్ని మాత్రమే భుజిస్తావు అంటే పూర్తిగా సాత్విక ఆహారమే   తత్ ద్వారా నీకు తెలియకుండానే నీవు సాత్వికునిగా మారుతావు, నీవు చూసేది పూర్తిగా ఈశ్వర స్వరూపంగా ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు నీకు ఏ మనిషి మీద లేక వస్తువు మీద మోహము కలుగదు.  ఉదాహరణకు నీకు ఒక అందమైన స్త్రీ కనపడినది అనుకో ఆమెను  నీ దృష్టిలో ఈశ్వరుని స్వరూపం భావిస్తావు అంటే ఆ తల్లి మీద నీకు కేవలము ఈశ్వరుని మీద కలిగే ప్రేమే ఉంటుంది తప్ప తత్ భిన్నంగా ఐహికమైన మొహం కలుగదు.  అంటే ఆ స్త్రీ సాక్షాతూ ఈశ్వరుడే.  నీ మనస్సు ప్రశాంతంగా పరి శుద్ధంగా ఉంటుంది.  అన్ని వస్తువులలోను, అందరిలోనూ నీకు కేవలం ఈశ్వరుడే కనపడతాడు.  నీవు ఎలాంటి పరిస్థితిలోను ఆవేశానికి, కోపానికి గురికావు నీ వదనం ప్రశాంతంగా ఉంటుంది.  నిన్ను పొగిడే వాడు నిన్ను దూషించే వాడు నీకు ఒకేవిధంగా కనపడతాడు.  ఎవరి పట్ల మమకారం కానీ ద్వేషం కానీ కలుగవు. నీకు తెలియకుండానే నీ జీవన సరళి మారుతుంది నీవు పూర్తిగా సాత్వికుడిగా మారతావు, తరువాత సుద్ధసత్వ గుణం కలిగి ఈశ్వర సన్నిదానాన్ని (మోక్షాన్ని) పొందుతావు.ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడే సాధన మొదలిడు. 

గమనిక ఇది వ్రాసిన వాడు కూడా ఒక దొంగే వాడు ఇది చదివిన వాళ్ళను ఏమార్చి వాళ్ళ మనస్సులను దోచి ఈశ్వరుని పరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.  తస్మాత్ జాగ్రత్త. 

ఓం తత్సత్