14, జూన్ 2022, మంగళవారం

సువర్ణావకాశం 2

  సువర్ణావకాశం 2

(గమనిక: ఇది కేవలం 60 సం. దాటిన పురుషుల కోసం వ్రాసిన  వ్యాసంఇతరులు  చదవడం నిషిద్ధం. )

రోజుల్లో మనం అనేక ప్రకటనలు చూస్తున్నాము "సువర్ణావకాశం" బంపర్ ఆఫర్ మంచి తరుణం మించిన పోవును ఇప్పుడు అవకాశాన్ని వినియోగించుకోండి అని అనేక వ్యాపార ప్రకటనలను నిత్యం చూస్తున్నాము. వాటిని చూసి రోజూ ఎంతోమంది మోసపోతున్నట్లు కూడా మనం  తెలుసుకుంటున్నాము. బంపర్ ఆఫర్ ఇప్పుడే కొనండి ఆలస్యం చేస్తే మంచి అవకాశం కోల్పోతారు అని మభ్యపెట్టి అనేక నాసిరకపు సామాన్లు అమ్ముతున్నారుఅమాయక మహిళలు ఎందరో మోసపోయారని మనకు తెలుస్తున్నదిఇదంతా ఐహికమైన, నిత్యం మనం చూస్తున్న విషయం ఇక విషయానికి వస్తే 

మానవ జన్మ:

మిత్రులారా 84 లక్షల జీవరాశులలో మనిషి కూడా ఒక జీవి. అటువంటి మానవజన్మ ఈనాడు మనకు లభించింది. అందునా మగవాడుగా పుట్టటం ఇంకా శ్రేష్టం (ఇక్కడ స్త్రీలు తక్కువ వారని కాదు స్త్రీలకు పురుషులతో పోలిస్తే అనేక ఇబ్బందులు ఉంటాయివారి శరీరం సున్నితం, సుకుమారం గా ఉండి ఉంటుంది కాబట్టి పురుషులు చేయగలిగే కఠినమైన పనులు వారు చేయలేరు. జ్ఞానసాధన అంటేనే ఎంతో నిష్ఠతో, కఠినమైన తప్పస్సుతో ఆచరించవలసింది. కాబట్టి అది స్త్రీల కంటే పురుషులు కొంతవరకు సాదించటానికి శరీరం  సహకరిస్తుంది. ఐనా అనేకమంది స్త్రీలు తమ అకుంఠిత భక్తితో పాతివ్రత్యం తో మోక్షం పొందినట్లు మన పురాణ,ఇతిహాసాలు తెలుపుతున్నాయి) ఇప్పుడు మీరు 60 సంవత్సరాల వయస్సు గడిపి జీవితంలో చివరి అంకంలో వున్నారు.అంటే  శని దేవుడు మీ జాతక చక్రంలో రెండు భ్రమణాలు చేసి వున్నారు. నాలుగు భ్రమణాలు చేయడం అనేది నాకు తెలిసి శ్రీ రామానుజ చార్యులు వారికి మాత్రమే జరిగింది ఆచార్యులు 120 వసంతాలు జీవించినట్లు చరిత్ర చెబుతున్నది. (జ్యోతిష శాస్త్ర రీత్యా శని దేవుడు మారక కారకుడు అంటే మారక స్థానంలో శని ప్రవేశిస్తే జాతకునికి మారకం (మరణం) సంభవిస్తుందని శాస్త్ర  ఉవాచ. జాతక చక్రంలో అతి తక్కువ వేగంతో చలించే గ్రాహం శని శని ఒక సారి తను ఉన్న గది నుండి భ్రమించి తిరిగి అదే స్థలానికి రావడానికి 30 సంవత్సరాల సమయం పడుతుందికొందరు 30 సంవత్సరాల కన్నా ముందే చనిపోతారు అంటే శని మొదటి భ్రమణంలో మారకాన్ని ఇచ్చాడన్నమాట. అతి ఎక్కువగా శని దేవుడు 4 సార్లు జాతకుని జాతకచక్రంలో తిరుగగలడు అంటే 30 x 4= 120 సంవత్సరాలు అతి దీర్ఘ ఆయుష్షు ) అతి దీర్ఘ ఆయుష్షు అతికొద్ది మంది జాతకంలో ఉంటే ఉండవచ్చు కానీ అది చాలా దుర్లభము. 60 దాటినాయి అంటే క్షణంలోనైనా పిలుపు రావచ్చుమీరు నేను అనుకున్నది దేహం అని అనుకుంటున్నారా అయితే అది మిధ్య క్షణంలో నయినా అది రాలిపోవచ్చు  అది కేవలం ఈశ్వరునికి ఎరుకమనం మన అజ్ఞానంతో రేపు అది చేస్తా రేపు ఇది చేస్తాం అని ఐహికమైన వాంఛల మీద మనస్సు లగ్నం చేస్తూ ఈశ్వరుని మరుస్తున్నాంమీరు ఆనందంగా 60 సంవత్సరాలు గడిపారు ఇక మీదనన్న మిగిలిన శేష జీవితాన్ని పరమేశ్వరుని సాన్నిధ్యంలో గడిపి జన్మ సార్థకం చేసుకోవాలని యోచించండిఅదే మనకు పరమేశ్వరుడు ఇచ్చిన  సువర్ణావకాశం. అవకాశం కనుక సరిగా వినియోగించుకో పోతే మరల ఎన్ని జన్మలకు తిరిగి అవకాశం వస్తుందితిరిగి మానవజన్మ ఎత్తాలంటే అవకాశం (PROBABILITY ) 84లక్షలు ఇష్టు ఒకటి అంటే మీరు ఆలోచించండి. ఐహిక వాంఛలతో, భోగ విలాసాలతో అపురూపమైన మానవ జన్మను వృధా చేస్తే చివరికి మీకు మిగిలేది నిరాశ మాత్రమే "పునరపి జననం పునరపి మరణం" మరల మరల పుట్టి చనిపోతూ ఉండటమే. కాబట్టి మిత్రమా మేల్కొని నీ గమ్యాన్ని తెలుసుకో

ప్రయాణికుడు

60 సంవత్సరాలు దాటాయి అంటే మీరు ఒక ప్రయాణికుడు అని అనుకోవాలిమీరు పూర్తిగా ప్రయాణ సన్నాహాలు లోనే ఉండాలి. కొంతమంది ఇప్పుడు రైల్వే స్టేషన్ కి వచ్చి ఉన్నారుకొంతమంది స్టేషన్ కి  వెళ్లే మార్గంలో ఉన్నారు, కొంతమంది ఎక్కవలసిన రైలు స్టేషనులో ప్లాట్ఫారం మీదకు వచ్చి వున్నట్లే, కొంతమంది రైలులో కూర్చొని రైలు సిగ్నల్ కోసం వున్నట్లుగా భావించాలి. ఏ క్షణంలో నయినా మీరు కూర్చున్న రైలుకు జెండా ఊపడం ప్రయాణం మొదలు కావడం జరగవచ్చుమీరు ఇంకా ఇల్లు, సంసారం, సంఘం అంటూ కూర్చుంటే ప్రయోజనం లేదుఎప్పుడైతే స్టేషనుకు ప్రయాణం అయ్యారు ఇప్పుడు ఇంటికి తాళం వేశామా, అన్ని తలుపులు వేశామా, చిన్నవాడు ఒంటరిగా ఉన్నాడు వాడు తిండి ఎలా తింటాడో ఇలాంటి అనేక సందేహాలు ఎలా వస్తాయో ఇప్పుడు ప్రయాణంలో కూడా రావచ్చుకానీ ఇప్పుడు వెళ్లే ప్రయాణం ఒకవైపే అంటే నిష్క్రమణే మరల తిరిగి రావడం అనేది ఉండదుకాబట్టి ప్రయాణం పూర్తిగా సాఫీగా జరగాలంటే ఒక్కటే మార్గం

ఈశ్వరానుగ్రహం

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారుఅది ఎంతవరకు నిజమో కానీ  నేను ఒక్కటి మాత్రమే సంపూర్ణంగా విశ్వసిస్తాను దైవానుగ్రహం కోసం ప్రార్ధించడానికి కూడా దైవానుగ్రహం కావలి అదేంటి అని అనవచ్చు కానీ ఇది నిజం మనకు దైవానుగ్రహం లేకుంటే మనస్సు ఎప్పుడు కూడా దేవుని మీదకు వెళ్ళదుఅందుకేనేమో మన మహర్షులు వినాయక చవితి నాడు సిద్ది వినాయకుడిని పూజించటానికి ముందు పసుపు గణపతి పూజ చేయాలని నియమం పెట్టారు అని నాకనిపిస్తుందినిజానికి మనం పూజించేది వినాయకుడిని కదా ఆయనే విఘ్నధిపతి కదా మరి ఇంకా పసుపు వినాయకుడిని ఎందుకు పూజించాలి అనే సందేహం మనకు వస్తుందికానీ అందులోని మర్మం ఏమిటంటే చేసే సిద్ది వినాయక పూజ అనే దైవ కార్యం కాబట్టి దైవకార్యం నిర్విఘ్నంగా జరగాలంటే ముందుగా విఘ్నాధిపతి అయిన విగ్నేశ్వరుని అనుగ్రహం కావాలని మన మహర్షులు సూచించారు. కాబట్టి ఆయన పూజ కూడా నిర్విఘ్నంగా సాగటానికి మనం పసుపు గణపతి పూజ చేస్తాం

దేముడిని ఏమి కోరాలి

దేముడిని ఏమి కోరుకోవాలన్నది ఒక పెద్ద ప్రశ్న నిజానికి మనం దేముడిని రెండు విషయాలు ముందుగా కోరుకోవాలి అవి ఏమిటంటే భగవంతుడా నిన్ను సదా పూజించే మనస్సు నాకివ్వు. ఇక రెండోది  నేను సదా నీ సేవ చేయడానికి నాకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షు  ఇవ్వుమీ మనస్సు, శరీరం సహకరిస్తేనే కదా మీరు దైవ ప్రార్ధన, , పూజ చేయగలరు

జీవన విధానంలో మార్పు

నిన్నటిదాకా గడిపిన జీవితం ఒక ఎత్తు రోజు నుంచి గడిపిన జీవితం ఒక ఎత్తు. నిన్నటిదాకా నీవు డబ్బు వెంట పరుగులు నీ   గమ్యం ఎప్పుడు ఒక్కటే అదేమిటంటే డబ్బు ఎలా సంపాదించాలి, భార్య పిల్లలను ఎలా పోషించాలి అనేదేకానీ ఇప్పుడు నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వారు వాళ్ళ కాళ్ళ మీద నిలపడగలుగుతున్నారు. వారికి వారి వారి కుటుంబాలు ఏర్పడ్డాయి లేకపోతే ఏర్పడుతున్నాయినీకు చీకు చింత లేదు. కావాల్సినంత సమయం వున్నది. ఇన్నాళ్లు నీవు గత జీవితంలో బాహ్య పటాటోపాలు, కపట వేషధారణ, ఎవరినో చూసి పోల్చుకునే  విధానం. నా హోదా, నా సంపద మొదలైన విషయాలను పక్కన పెట్టి ఇప్పుడు కేవలం నేను ఈశ్వరుని సేవకుడు అనే భావంతో మెలగాలి. అంటే ఒక సేవకునికి ఉండే లక్షణాలు  అలవరచుకోవాలి. అవి ఏమిటంటే వినయ, విధేయత, సాధారణ జీవనం. నిగర్వం, నిరాడంబరత, సత్సీలం, సదాచారం. నిరంతర ఈశ్వర జాస  అలవరచుకోవాలి. నా కుటుంబం, నా బంధువులు, నా మిత్రులు అనే నా అనేవి కొద్దీ కొద్దిగా తగ్గించుకోవాలి నేను కేవలం నేను అనే తలపుల లోనే ఉండాలి ఇక్కడ నేను అంటే ఎవరు అనే విచారణ  చేయాలి. దేహం నేను కాదు కేవలం నా దేహం నాకు (ఆత్మకు) ఒక ఉపాధి స్థానం అంటే ఒక డ్రైవరుకు కారు ఎలా ఉపాధి స్తానంలో ఆలా కాబట్టి దేహాన్ని నేను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా చూసుకుంటాను కానీ దేహ వ్యామోహానికి లోను కాను అని దృఢ సంకల్పం చేయాలిఎట్టి పరిస్థితిలోను దేహ వ్యామోహానికి లోనే కాను అనే సంకల్పం  చేయాలి. మొహాన్ని వీడటం అంటే అంత సులభం కాదు కఠిన అభ్యసంతోటె అది సాధ్యం. . 

దేహ నియంత్రణ

ఎప్పుడైతే నాకు దేహం ఒక ఉపాధి స్థానం అని నీవు భావిస్తావో అప్పుడు నీవు దేహాన్ని ఒక యంత్రాన్ని బాగుచేసే వాని చేతిలో పరికరం లాగా మాత్రమే  చూస్తావు. దేహ సౌందర్యం తో నీకు సంబంధం లేదు కానీ కేవలం దేహాన్ని పరి శుభ్రంగా పెంచుకోవడానికి మాత్రమే చూస్తావుదేహం ఎప్పుడైతే బాహ్యంగా పరిశుభ్రంగా ఉంటుందో అప్పుడు దేహంలోని మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుందిఅదే దేహం చెమటతో నిండి, నోరు పాచితో ఉంటుందో అప్పుడు నీ మనస్సు నీ వశం కాకుండా దేహం మీదకు పదే పదే వస్తుందిఅప్పుడు ద్యానమ్  చేయలేవు. కాబట్టి దేహాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం సాధకుడు చేయాల్సిన మొదటి పని.

ముండనం

కేశాలను  పెంచుకోకూడదు. తరచూ ముండనం (గుండు) చేయించాలిముండకోపనిషత్ ముండనం గూర్చి వివరిస్తుంది. "తలలు బోడులైన తలపులు బోడులవునా?" అని ఒక వాక్యం నానుడి ఉంది దీని అర్థం శిరస్సు ముండనం చేయించుకున్న మనస్సు వాంఛలను వదులునా అనికానీ ఎప్పుడైతే శిరస్సు బోడి అవుతుందో అప్పుడు చాలావరకు దేహ వాంచ  తగ్గుతుంది ఎందుకంటే మనిషికి అందాన్ని ఇచ్చేవే తలవెంట్రుకలు వాటిని పట్టె తానూ అందంగా వున్నాను అనే భ్రాంతిలో వుంటారు. కొందరు నెరసిన వెంట్రుకలకు రంగు వేసుకుంటే ఇంకా తాను యవ్వనంలో వున్నానని సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. అటువంటివారి మనస్సు ఎప్పుడు ఐహికమైన వాంఛల మీదనే ఉంటుంది. దైవజాస అస్సలు కలుగదు. అదే ముండనం చేసుకున్న సాధకునికి చక్కటి ఆహ్లాదకరమైన దైవ చింతన కలిగి . మనస్సు ఆధ్యాత్మికత వైపు మళ్ళుతుంది. సాధారణంగా గుండు చేయించుకోవడానికి ఎవ్వరు  ఇష్టపడరు. కానీ సాధకుడు తన గమ్యమైన మోక్షాన్ని చేరుకోవాలంటే తప్పకుండా ముండనం  చేసుకోవలసిందే. దీనిని నేను ఒక చిన్న ఉదాహరణ తో వివరిస్తాను. ఒక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కావలసిన లక్షణం సరిగా పాఠాలు చదువుకొని అవగాహన చేసుకోవటం మాత్రమే అతని వస్త్రధారణతో  ఏరకంగాను అతని చదువుకు సంబంధం ఉండదు కదా మరి మా పాఠశాలలో చదివే విద్యార్థులు తప్పనిసరిగా రకం వస్త్రాలనే (UNIFORM) ధరించాలని పాఠశాల యాజమాన్యం సూచిస్తే తప్పకుండ మనం మన పిల్లలకు అదేవిధంగా వస్త్రధారణ చేసి పాఠశాలకు పంపుతామునిజానికి విద్యార్థి చదువుకు అతని వస్త్ర ధారణకు ఎలాంటి సంబంధం లేదు కానీ పలనా విద్యార్థి ఫలానా పాఠశాలలో చదువుతున్నాడని వస్త్ర ధారణ చెపుతుందిఅదే విధంగా సాధకులమైన మనమందరము బ్రహ్మ జ్ఞ్యాన సముపార్జకు పాటు పడుతున్నామని ముండనం వలన కొంతవరకు సాధారణ ప్రజానీకానికి తెలువవచ్చు

ముండనం ప్రారంభంలో

 కొత్తగా ముండనం చేసుకునే సాధకునికి అనేక విమర్శలు, సందేహాలు, వస్తాయి. మొట్ట మొదట ప్రతి వారు కూడా శారీరిక సౌందర్యం మీదనే మొహంతో వుంటారు కాబట్టి ముండకము చేసుకోవటానికి సాధకుని మనస్సు అంగీకరించదుకర్మ పరికత్వత చెందితే తప్ప ఆధ్యాత్మిక జీవనం మనుషులకు అలవడదునూటికి తొంబయి మంది తమ సాధారణ జీవనానికి విఘాతం కలిగే విధంగా ఉండటానికి అంగీకరించరువారు చూపే కారణాలునా భార్య పిల్లలు నేను గుండు చేసుకుంటే వప్పుకోరుమీ జుట్టు మంచిగా వుంది చక్కగా రంగు వేసుకోండి సినిమా హీరోల వుంటారు అని నా భార్య అన్నదినేను నా భార్య మాటకు విలువ ఇస్తాను అంటారు. వాళ్లకి నేను చెప్పేది ఒక్కటే ఆర్యా  ఒక తాగుబోతు తన భార్య అనుమతి తీసుకొని తాగుతున్నాడా? అదే విధంగా ఒక జూదరి తన భార్య అనుమతి తీసుకొని జూదం ఆడి సమస్త ఆస్తుల్ని కోల్పోతున్నాడా లేదేవారు ఒక దుర్వ్యసనానికో లేక దుస్సంగత్యానికో పాలుపడి వారి భార్యలు యెంత వద్దన్నా వారి వారి పనులు చేస్తున్నారు, తత్ ద్వారా వారి భార్య పిల్లలకు అనేక విధాలుగా దుఃఖాన్ని చేకూరుస్తున్నారు. మరి సాధక మిత్రమా నీవు నీ కుటుంబ బాధ్యత ఏమాత్రం వీడకుండా నీ కుటుంబాన్ని పోషిస్తూ నిన్నునీవు  ఉద్దరించుకోవటానికి ముండనం చేసుకోవటానికి ఎందుకు సంకోచిస్తున్నావు. ఒక్క సారి ఆలోచించునీవు నీ ధర్మాన్ని నిర్వహిస్తూ (భార్య పిల్లలను పోషిస్తూ) నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రయత్నిస్తున్నావుఇందులో లేశమాత్రము తప్పులేదునిన్ను ఎవరైనా కాదంటే వారి మాటలు గణనలోకి తీసుకోకు. నిన్ను చూసి ఎవరో ఏమో అనుకుంటారని చిన్నతనంగా అనుకోకు. నీవు చేసేది కేవలం నీ ఆధ్యాత్మిక ప్రగతికోసం మాత్రమే అని  భావించు. నీకు స్వార్థపర ప్రపంచంతో ఎలాంటి   నీ జీవనం నీది నీ ముక్తిమార్గం  నీది. అబ్బ వచ్చాడండి అపర రమణ మహర్షి ఈయనట జ్ఞ్యాని అట మోక్షసాధన చేస్తాడట మనమందరము దేముడిని కొలవటం లేదా అది కేవల ఎచ్చులకే కాక జ్ఞ్యానం లేదు ఏమి లేదు అంతా బూటకం అని నిందించేవారు కూడా సమాజంలో   అటువంటి కు విమర్శలను దేముడు నీకు పెట్టె పరీక్షలుగా భావించి మౌనంగా నీ పని నీవు చేసుకుంటూ వేళ్ళు. నీకు తోడుగా సర్వేశ్వరుడు సర్వకాల సర్వావస్థలాల్లో ఉంటాడునీవు చేయవలసిందల్ల  ఈశ్వరుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మటమే. .  

మొదట్లో సమస్యలు

సమాజంలో మనం ఎలా కనపడితే అలాగే చూస్తుందినీవు నిన్నటిదాకా చక్కగా క్రాపు చేయించుకొని రంగు వేసుకొని అందంగా కనబడే రోజు గుండుతో కనపడేసరికి సమాజం నిన్ను ఆలా స్వీకరించటానికి ఇష్టపడదు . ప్రశ్నల పరంపర: ఒక మిత్రుడు అడుగుతాడు రావుగారు మీరు తిరుపతికి వెళ్ళారా, లేదు అయితే యాదగిరి గుట్ట లేదు అయితే ఇంకెక్కడికి వెళ్లారుఅయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు కేవలం నేను ఆధ్యాత్మిక జీవనం చేయదలచుకొన్నాను అందుకే నాటి నుండి ముండనం చేసుకొని వుండదలచుకున్న అంటే ఊరుకోండి మాస్టారు మీ గురించి నాకు తెలియదా మీకు ఆధ్యాత్మిక జీవనం ఏమిటీ. అని చులకన చేస్తారు. ఇక మీ శిఖ (పిలక) చూస్తే అయ్యో మీ నాన్నగారు పోయారా లేక అమ్మగారు పోయారా అని అడుగుతారుఎందుకంటె మన సమాజంలో గుండు పిలక కేవలం పితృ కర్మలు చేసేటప్పుడే వుంచుకుంటారనే   అభిప్రాయం వుంది కాబట్టి. ఇటువంటి అనేక సమస్యలను సాధకుడు ఎదుర్కోవలసి వస్తుంది. మిత్రమా శిఖ లేకుండా చేసే ఏకర్మ కూడా అంటే దైవకార్యం కానీ పితృకార్యం కానీ ఫలించదుమనం కేవలం పితృకర్మలు చేసేటప్పుడే శిఖ ధరించాలనే అభిప్రాయంలో వున్నాం ఎలాగైతే భగవద్గీత శవ యాత్రలో  వాహనం వద్ద వినిపించేదానిగా ఎలా అనుకుంటున్నారో ఆలానిజానికి ప్రతి పురోహితుడు విధిగా శిఖ ధరించి ఇతరులకు మార్గదర్శకం వాహించాలి. కానీ వారే పాటించటం లేదు. మన ధర్మాన్ని  ఉద్దరించటానికి శంకరులు మరల రావాలేమో

శిఖ ప్రాధాన్యత

పూర్తిగా ముండనం (గుండు) కేవలం సన్యాసులు మాత్రమే చేయించుకోవాలి. సంసార జీవనం చేస్తున్నవారు తప్పనిసరిగా శిఖ(పిలక) ధరించాలి మన శాస్త్రాల్లో బ్రాహ్మణుడు గోపాదం అంటే ఆవు యొక్క అరికాలు (డెక్క ) పరిమాణంలో శిఖను ధరించాలని పేర్కొన్నాయిపరిమాణం ఎంతైనా శిఖ మాత్రం తప్పనిసరిగా ఉంచుకొని మాత్రమే గుండు చేయించుకోవాలి. ఒకసారి భార్గవ శర్మ గుండు చేయించుకోవడానికి మంగలి షాప్ కి వెళ్లి మంగలితో పిలక ఉంచవలసిందిగా చెపితే ప్రక్కన వున్న తెలిసిన వాడు మీకెందుకు సార్ పిలక  రోజుల్లో పురోహితులు కూడా గుండు పిలక పెట్టుకోవడం లేదు అని పరిహాసంగా అనడం జరిగింది దానికి అది మన సంప్రదాయం అందుకే నేను ఇలా వుంచుకుంటున్న అని సమాధానం చెప్పడం జరిగింది.   మన ఆచార సాంప్రదాయాలు రోజు రోజుకు అణగారి పోతున్నాయి. ఇప్పటికైనా మేల్కొని మనం మన సాంప్రదాయాలని పాటించక పొతే భవిష్యత్తులో మన సంప్రాయాలు మన ముందు తరాలకు ఆచరించటం అటుంచి వారికి తెలియనే తెలియవు. వారు పురాతన చిత్రాల్లో మాత్రమే చూడగలుగుతారు అనటంలో సందేహం లేదు

ఒకసారి బ్రాహ్మణ సంఘము వారు వనభోజనాలు ఏర్పాటు చేస్తే శర్మ అక్కడకు వెళ్ళాడు నిర్వాహకులలో  ఒకరు " మీరా ఎవరో పంతులు అనుకున్న" అని అంటే ఆర్యా నేను పంతుల్నే మీరు కాదా? ఇది బ్రాహణ వనభోజనాలు అనుకున్న కాదా ఏమిటి అని అనటం జరిగిందిబ్రాహ్మణ సంఘ  నిర్వహణ మండలి సభ్యులు కూడా ఒక్కరుకూడా గుండు పిలక వున్నవారు కనపడలేదు అంతేకాదు కనీసం బ్రాహ్మణ వనభోజనాలు కదా పంచకట్టుకొని వద్దామని ఒక్కరు కూడా అనుకోలేదు. కానీ  వీరు బ్రాహ్మణులను ఉద్ధరిస్తారని చెప్పుకుంటారు. ఇతరులకన్నా బిన్నంగా బ్రాహ్మణునికి రెండు ధర్మాలు ఉన్నాయి అని  నేననుకుంటా. అవి ఒకటి తన స్వధర్మాన్ని ఆచరించటం రెండు ఇతరులతో వారి, వారి స్వధర్మాలను ఆచరించాలని  చెప్పటం. మొదటిదే కనపడటంలేదు ఇక రెండోదాని ప్రశస్తే లేదు. ముందు ప్రతివక్కరు తమ ధర్మాన్ని పాటించాలిఅప్పుడే ధర్మం నిలబడుతుంది. ధర్మాన్ని ఆచరించే వారికి ధర్మం ఎప్పుడు రక్షగా ఉంటుంది. హిందువు అయిన ప్రతివారు వారి  కుటుంబ పద్దతి ప్రకారం పంచ కట్టుకోవటం   విధిగా దైవతార్చన వేళ  పంచకట్టుకోవాలి. అన్న నియమం కుటుంబ పెద్దలు ఆచరించి ఆచరింప చేయాలి. శోచనీయమైన విషయం ఏమిటంటే పౌరోహితం చేసే బ్రహ్మణోత్తములు, అర్చన చేసే అర్చకస్వాములు పంచ కట్టు మార్చి ధవళ వస్త్రాన్ని లుంగిలాగా కట్టి కార్యక్రమాలు  చేయిస్తున్నారు.

తిరుపతి వెళితే: చాలామంది తిరుపతి వెళ్ళినవారు పూర్తిగా గుండు చేయించుకునే ఆచారం మనకు వున్నదినిజానికి తిరుపతి వెళ్ళినకూడా తప్పకుండ శిఖ ను ఉంచుకొనే గుండు చేయించుకోవాలికేవలం సన్యాసులు మాత్రమే పూర్తిగా గుండు చేయించుకోవటానికి అర్హులు విషయాన్ని గమనించాలి

మీరు నిజంగా మోక్ష సాధకులు అయితే తప్పకుండ పైవిధంగా ఉండటానికి ప్రయత్నించండిమన మార్గంలో ఎన్ని అవాంతరాలు వచ్చిన మనం వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగాలి

క్రమబద్ద జీవనం

సాధకుని రోజు ఎప్పుడు ఉషోదయ కాలంతోటే మొదలైతుందిఅంటే సూర్యోదయం కన్నా 90 నిమిషాల ముందు అంటే సుమారు ఉదయం 4 గంటల సమయంలో నిద్ర లేవాలి. ఎప్పుడు 6,7 గంటలకు నిద్రలేచే అలవాటు వున్నవారు ఇలా 4 గంటలకు నిద్ర లేవాలంటే చాలా కష్టంగా ఉంటుందికానీ మనం మన గమ్యం వైపు నడవాలంటే తప్పకుండ అబ్యాసం చేయాలి. కొంత కాలం అబ్యాసం చేస్తే తరువాత మీరు మీకు తెలియకుండానే నిద్రనుంచి మేల్కొంటారు. ముందుగా రాత్రి భోజనం త్వరగా ముగించి తొందరగా నిద్రకు ఉపక్రమిస్తే తప్పకుండ ఉషోదయకాలంలో నిద్ర లేవగలుగుతాడు. సాధకుడు తన సెల్ఫోనులో వెంకటేశ్వర సుప్రభాతాన్ని అలారంగా పెట్టుకున్నాడు దాని ద్వారా నిద్ర లేస్తూనే స్వామి సుప్రభాతం వింటూ లేస్తాడు కాబట్టి ఉభయ తారకంగా ఉంటుదని అతని భావం. మీరు మీకు నచ్చిన రీతిలో ఏర్పాటు చేసుకోండికానీ ఎట్టి పరిస్థితిలోను నిద్ర ఉదయం 4గంటలవరకే పరిమితం చేయండి

నిద్ర లేవంగానే మలమూత్ర విసర్జన చేసి చక్కగా దంతధావన చేసి ధ్యానానికి ఉపక్రమించండిస్నానం చేస్తే మంచిదే కానీ స్నానానికి ఎక్కువ సమయం కాకుండా చూసుకోండి

ఉదయం 4గంటల సమయం

నిజంగా సమయం యన్తో పవిత్రమైనదిగా గోచరిస్తుంది. ఎందుకంటె మీకు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎక్కడో దూరంగా పిట్టల శబ్దాలు వినపడతాయిమీకు 5గంటలనుండి శబ్దాలు వినపడతాయికాబట్టి 4నుండి 5 గంటల సమయం చాలా విలువయినది. శ్రీ కృష్ణ పరమాత్మా  చెప్పినట్లు ప్రపంచం మొత్తం నిద్రిస్తుంటే యోగి మాత్రం మేల్కొంటాడు. స్వామి చెప్పింది నిజం యోగి సమయాన్ని ఎట్టి పరిస్థితిలో వదులుకోరు. ఉదయం 4 గంటల సమయంలో చేసే ధ్యానం చక్కటి ఫలితాన్నిస్తుంది

ముక్తికి మార్గం

ఇటీవల కొంతమంది కలియుగంలో ముక్తికి కేవలం నామస్మరణ చాలు పూర్వం ఋషులు కష్టపడ్డట్లు కఠోర తపస్సు చేయనవసరం లేదు అంటూ రోజులో రెండు మూడు నిముషాలు దైవజ్యానం చేస్తూ తనకు తానుగా తరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు, ప్రచారం చేస్తున్నారు. అది అస్సలు  నమ్మకండి. ఒక్కవిషయ గుర్తుంచుకోండి ప్రకృతి ధర్మం అన్ని యుగాలకు ఒకే విధంగా ఉంటుందిఎప్పుడు అది మారదుప్రకృతి ధర్మం అంటే ఏమిటంటే మనకు జగత్తులో కనిపించే నియమాలు ఉదాహరణకు సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది, నీరు పల్లంలోకే ప్రవహిస్తుంది, నిప్పు ముట్టుకుంటే  కాలుతుంది. మేఘాలు వర్షిస్తాయినదులు సముద్రంలోనే కలుస్తాయి. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడుఇలాంటివి అనేక నియమాలు ప్రకృతిలో మనం చూస్తున్నాము.  ఇప్పుడు చెప్పిన ప్రకృతి నియమాలు సృష్టి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అదే విధంగా వున్నాయి.ఒక యుగంలోకాని, ఒక కాలంలో కానీ ప్రకృతి తన ధర్మాన్ని మార్చుకోలేదు, భవిష్యత్తులో కూడా మార్చుకోదుఅటువంటప్పుడు పురుషుని (భగవంతుని) నియమాలు ఎలా  మారుతాయి. ప్రకృతికి నియంత భగవంతుడే కదా. కాబట్టి మిత్రమా కేవలం నామ స్మరణ చేస్తే మోక్షం రాదు మాట కేవలం కఠినమైన తపమొనర్చలేని ఆర్భకులు పలికిందే కాని మరొకటి కాదు

ఉపనిషట్ మంత్రం చుడండి 

ఉత్తిష్ట జాగ్రత ప్రాప్య వరాన్నిబోధత 

క్షురస్య ధార నిశిత దురత్యయా దుర్గం పాదస్తత్కవయో వదన్తి 

తా|| లేవండి! (అజ్ఞానమనే నిద్రనుండి), మేల్కొనండి! ఉత్తమ గురువులను సమీపించి ( జ్ఞానాన్ని) తెలుసుకోండి. మార్గం మంగలి కత్తి అంచు మీద నడవటం వలె చాలా కష్టమైనది మరియు తీక్షమైనది, కనుక చాలా కష్టంచే దాటదగినది, కష్టంచే పొందదగినదని పండితులు చెబుతారు. కాబట్టి మిత్రమా మోక్ష మార్గం అంటే సులువు అయినది కాదు అది అత్యంత కఠినమైనది. మరియు దుర్భరమైనది ఎంతో కష్టపడితే మాత్రమే మనం మోక్షగాములము  కాలేము. కోటికి ఒక్కడు మాత్రమే జ్ఞ్యాన మార్గాన్ని  ఎంచుకుంటాడు. చాలా మంది తమకు తెలిసిన మిడి మిడి జ్ఞ్యానమే జ్ఞ్యానం అని అనుకోని దానినే ప్రచారం చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించ  ప్రయతినిస్తారు. తత్ ద్వారా ధన ధాన్యాదికములను పొంది ఐహికమైన సుఖబోగాలను అనుభవిస్తుంటారు. జ్ఞ్యాన మార్గాన్ని ఎంచుకొన్న వారిలో కోటికి ఒక్కడు మాత్రమే కైవల్యాన్ని పొందగలదు

సద్గురువులు

మధ్య సద్గురువుల ప్రభంజనం సమాజంలో బాగా కనపడుతున్నది. యేవో కొన్ని పురాణాలూ, ఇతిహాసాలు, ఒకటి రెండు ఉపనిషత్తులు చదివి వారికి కలిగిన జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞ్యానంగా భావిస్తూ ప్రచారం చేసుకుంటూ వారు దైవ భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని దండిగా విశేష కానుకలను తీసుకొంటూ ఉపదేశాలు చేస్తూ సామాన్యులను మభ్యపెడుతూ వారు అనేక సుఖభోగాలను అనుభవిస్తున్నారుమిత్రమా అలంటి వారి వలలో చిక్కుకొని నీ అమూల్య  జీవితాన్ని,కాలాన్ని వృధా  చేసుకోకు. ఇలాంటి సద్గురువులు గడ్డాలకు మీసాలకు కూడా రంగులు వేసుకొని ఖరీదైన కంకణాలు, కిరీటాలు ( బంగారపు) ధరిస్తూ తామే అపార దేవతా స్వరూపమని ప్రచారం  చేసుకొంటున్నారుమిత్రమా వీరు చేసేది దైవ దూషణ, దైవ ధిక్కారం అంతకంటే ఇంకొకటి  కాదు. ఇలాంటి వారిగూర్చి బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు ఎప్పుడో పేర్కొన్నారు

సద్గురువు:

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మరి నిజమైన సద్గురువు  ఎవరు. సద సత్యాన్వేషణ చేసే మహానుభావుడే నిజమైన సద్గురువుమరి ఆయనను ఎలా తెలుసుకోవాలిఒక ఉదంతం చెపుతాను పరికించండిపూర్వం ఒక జిజ్ఞాసపరుడు తనను ఉద్ధరించే సద్గురువు ఎవరైనా దొరుకుతాడా అని విచారిస్తూ  వెళుతుంటాడు. ఎందరినో అడుగుతాడుకానీ సద్గురువు  దొరకలేదు. కీనీ ఒక గ్రామంలో ఒకతను ఆర్య సద్గురువు జ్ఞ్యాని అంటే మాకు తెలియదు కానీ ఇక్కడి సమీపపు అడవిలో వున్న శివాలయంలో ఒకతను  ఉంటున్నాడు. అతనికి సరైన దుస్తులు కూడా లేవు ఎప్పుడు పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు. మేమంతా అతనొక పిచ్చివాడుగా అనుకుంటాముమీరు వెతికే జ్ఞ్యని, సద్గురువు అతనేనేమో ఒకసారి వెళ్లి చుడండి అన్నాడు. అదివిన్న జిగ్న్యాసకు పట్టరాని ఆనందం కలిగి ఇక తనకు జీవన్ముక్తి కలిగించే సద్గురువు దొరికాడని భావించి శివాలయానికి ఆత్రుతతతో చేరుతాడుఅక్కడి దృశ్యం చూసి మన జిజ్ఞాస పరుడికి మతి పోయింది ఎదుకంటే అక్కడి మనిషి శివాలయంలోని శివలింగానికి తన కాళ్ళు రెండు దట్టించి తన్ని పడుకొని వున్నాడు అది చూసిన మన జిజ్ఞాసపరుడు ఇలా అనుకుంటాడుఈయనను నేను అనవసరంగా జ్ఞ్యాని అని అనుకున్నా నిజానికి యితడు దేముడిగురించి ఏమాత్రం విశ్వాసం లేని ఒక మూర్కుడో లేక పిచ్చివాడా అయ్యివుంటాడు అని అనుకోని వచ్చే కోపాన్ని అణచుకొని ఆర్య మీరు ఏమిచేస్తున్నారో తెలుస్తుందా  అన్నాడు. లేదు నాయనా నేనేమి చేస్తున్నాను కేవలం నేలమీద పడుకొని ఉన్నానే అని అన్నాడుమీరు నేలమీద  పడుకున్నారు. అది సరే మీ కాళ్ళు పవిత్రమైన శివలింగాన్ని తాకుతున్నాయి అది చూసుకున్నారు అని కొంచం ఉగ్రస్వరంతో అన్నాడుదానికి ప్రశాంత్ వదనంతో అతను నాయనా నేను చూడలేదు నాయనా దయచేసి శివలింగం లేని చోట నా కాళ్ళు పెట్టి పో నాయనా నాకు ద్రుష్టి సరిగా ఆనదు అన్నాడుఅప్పుడు మన జిజ్ఞాసపరుడు అతని కాళ్ళను లింగంనుంచి తీసి ప్రక్కన పెట్టాడుఆశ్చర్యం అక్కడ ఇంకొక లింగం ఉద్బవించింది. దానిమీద  మరలా అతని పాదాలు వున్నాయి. మన జిజ్ఞాసపరుడు ఇంకొక చోటికి అతని పాదాలను మార్చాడు అక్కడ ఇంకొక లింగం అట్లా మన జిజ్ఞాసపరుడుఎన్ని చోట్లకు అతని పాదాలను మార్చాడో అన్ని లింగాలు వచ్చాయిదాన్ని చూసిన జిజ్ఞాసపరుడు వెంటనే అతని పాదపద్మాలను పట్టుకొని మహానుభావా తమరు ఎవరు ఏమిటి వింత నేను ఆజ్ఞనంతో మిమ్మలను గుర్తించలేక పోయాను నన్ను క్షమించండి అని వేడుకుంటే ప్రసన్నవదనుడై శివాలయంలోని జ్ఞ్యాని నాయనా నీవు నీకు వున్న జ్ఞనంతో శివ లింగంలోనే భగవంతుని చూస్తున్నావుకానీ నాకు అంతట శివుడే కనపడుతున్నాడు మరి  శివుడు లేని చోట నా కాళ్లను ఎలా ఉంచగలను  అన్నాడు. అప్పుడు అతని మాటలకు మన జిజ్ఞాస పరుడు నిశ్చేష్టుడు అయి  అతనిని గురువుగా స్వీకరించి బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు.. కాబట్టి మిత్రమా బ్రహ్మ జ్ఞ్యానులు ఎప్పుడు బ్రహ్మ్మములోనే సంచరిస్తూ ఈ ఐహిక ద్వైత ప్రపంచాన్ని గూర్చి  ఏమాత్రము  విచారించారు. ప్రపంచాన్ని కళ్ళతో చూస్తారు, చెవులతో వింటారు, కాళ్లతో నడుస్తారు కానీ కానీ ఏది వారి మనసును చేరదు వారి మనస్సు సదా బ్రహ్మము మీదనే లఘ్నత చెంది ఉంటుంది.  వారు జీవించటానికి తింటారు కానీ తినే పదార్ధం  ఏది వారి మనస్సును ఆకట్టుకోదు, స్త్రీ పురుష, బాల, యవ్వన, వృద్ధ వత్యాసాలు వారికి వుండవు. అరిషడ్వార్గం పూర్తిగా వారికి స్వాధీనమై ఉంటుంది.  ఎటువంటి మనోవికారాలు వారికి వుండవు. ఒక్క మాటలో చెప్పాలంటే అటువంటి వారు నడిచే దేవుళ్ళు.  మన సహజమైన స్వభావాన్ని వారికి కూడా అంటకట్టి వారు కూడా కోరికలకు బానిసలు అనే తలంపులో ఉంటాము.  నిజానికి అటువంటి వారు  పూర్తిగా బ్రహ్మ జ్ఞ్యానం కలిగి  వుంటారు.  సదా నిధిజాసలో వుంటూ వారి జీవితాన్ని పూర్తిగా భగవంతునికి అంకితం చేస్తారు. 

"బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవ" 

బ్రహ్మను తెలుసుకున్న వాడు స్వయముగా బ్రహ్మయే అవుచున్నాడు. అనగా బ్రహ్మ జ్ఞ్యాని వేరు, బ్రహ్మ వేరు కాదని అర్ధం.  బ్రహ్మ జ్ఞ్యాని సంపూర్ణ బ్రహ్మ స్వరూపమే, అతనికి ఈ ద్విఏత   జగత్తు పూర్తిగా బ్రహ్మ స్వరూపంగా గోచరిస్తుంది.  బంగారము, మట్టి రెండు మట్టిగానె గోచరిస్తుంది. ఒక ఘటం (కుండ ) వేరుగా మృత్తిక (మట్టి) వేరుగా చూడడు అంతా ఒక్కటిగానే కనపడుతుంది.  మరి అటువంటి సత్పురుషులు ఐహిక మినట్టి వస్తువుల పట్ల మమకారం చూపుతారా? అంటే చూపరు.  వారి జీవిత లక్ష్యం కేవలం బ్రహ్మము అంటే బ్రహ్మమే కాక వేరొకట్టి కాదు.  మిత్రమా అటువంటి సద్గురువును చేరు 

కాబట్టి మిత్రులారా సద్గురువులను గుర్తించటానికి ఒక్కటే   మార్గం. వారు మన సాంఘిక నియమాలకు లోబడి వుండరు. ఏకాంతంగా ఉంటారువారికి ఎలాంటి ప్రచారాలు వుండవుప్రలోభాలకు  లొంగరు. సిరి సంపదలు వారికి తృణ సమానం. వారికంటూ ప్రపంచంలో ఏదీ ఉండదువారికి నీవు ఏది( అంటే ధన కనక వస్తు వాహనంఇవ్వవలసిన పని లేదు  వారికి నీవు సేవ చేసి ప్రసన్నం చేసుకోవాలివారికి ధనికుడు, పేదవాడు మన్నన ఛీత్కారాలు అన్ని సమానమే. మిత్రమా నీకు అటువంటి సద్గురువు ఎక్కడైనా కనిపించాడా? కనిపిస్తే వెంటనే అతని శరణు వేడు నీ జన్మ సార్థకత చేసుకో

సద్గురు తానే వస్తాడు

ఇటీవల చాలామంది తనకు తాను ఒక సాధకుడిగా భవిస్తూ తనను ఉద్దరించడానికి ఒక సద్గురువు తనవద్దకే వచ్చి తనను ఉద్ధరిస్తాడనే భ్రాంతిలో   వున్నారుమిత్రమా  మోక్ష సాధన అనేది ఎవరికి వారుగా శోధన చేసిసాధన చేసి, శ్రమించి, కష్టించి  సాధించాల్సింది. ఎవరు నీ దగ్గరకు రారు నిన్ను ఎవ్వరు ఉద్దరించరు ఆలా అని ఎవరైనా అంటే అది కేవలం నీ వద్ద నుండి కానుకల రూపంలో ధనాన్ని సేకరించే మార్గం తప్ప వేరొకటి కాదునిజమైన గురువుకి నీ సిరిసంపదలు, పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు  అంతే కాదు ఆయనకు నీతోకూడ పనిలేదు. నిన్ను ఉద్ధరించే గురువు ఎవరో కాదు నీకు నీవే అది మరువకు  మిత్రమా

ఆయనను పూజిస్తే మోక్షం ఇస్తాడట

ఇది ఒక విచిత్ర వాదం ఒక వ్యక్తిని అది హిందూ ధర్మాన్ని గూర్చి తెలియని ఇతర మతస్తుని సద్గురువుగా భావించి, గుడులు కట్టి పూజించటమే కాకుండా అయన నీకు కూడా మోక్షాన్ని ఇస్తాడు అని ఇటీవల కొందరు  భావించి ప్రచారం   చేస్తున్నారు. మిత్రమా ఇటువంటి ప్రలోభాలకు లొంగకు నీ అమూల్య కాలాన్ని వృధా చేయకు

విగ్రహారాధన:

దేవాలయాలకు వెళ్లి విగ్రహారాధన చేస్తే మోక్షం లభిస్తుందా అని కొందరు  అడుగుతారుమిత్రమా భక్తి మార్గం జ్ఞాన మార్గానికి ప్రాథమిక విద్యగా   ఉపకరిస్తుంది భక్తి  వలన అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుందిఐహిక వాంచితాలు నెరవేరుతాయిభక్తి మార్గం నుంచి జ్ఞాన మార్గాన్ని చేరుకోవాలి ఎలా అయితే పాఠశాల చదువు అయిన తర్వాత కళాశాల చదువుకు వెళ్లినట్లు .  

ధ్యానం ఎలా చేయాలి

సాధకుడికి తలెత్తే సందేహాలు ధ్యానం ఎందుకు చేయాలి, ఎలాచేయాలి, ధ్యానం అంటే ఏమిటి ఇలాంటి, ధ్యానం తప్ప ఇంకో మార్గం లేదా అనే అనేక ప్రశ్నలు జిజ్ఞాసువుల తలల్లో మెదులుతాయి

ధ్యానం అంటే ." చిత్తవృత్తి నిరోధమే యోగం." అన్నారు   యోగాన్ని ఆచరించే వాడే యోగి.మరి ధ్యానం అనేక ద్యాననపద్ధతులు వున్నాయిమీకు ఎటువంటి పద్దతి అనుసరణీయమో తెలుసుకొని సంబంధిత గురువుని చేరి అభ్యసించాలిఒక మంచి సద్గురువు వద్దకు వెళ్లి గురువుకి సేవ చేసి గురుకృపకు పాత్రులై మోక్షపదాన్ని చేరుకోవాలి.  

\

 

 

 

 

బ్రహ్మవేత్తలు

 శ్లోకం:☝️

*భూతానాం ప్రాణినః శ్రేష్ఠాః*

    *ప్రాణినాం బుద్ధిజీవినః*

*బుద్దిమత్సు నరాః శ్రేష్ఠాః*

    *నరేషు బ్రాహ్మణాః స్మృతాః*

*బ్రహ్మణేషు చ విద్వాంసో*

    *విద్వత్సు కృత బుద్ధయః*

*కృతబుద్దిషు కర్తారః*

    *కర్తృషు బ్రహ్మవేదినః*

   - మనుస్మృతి


భావం: సమస్త భూతములలోనూ ప్రాణులే శ్రేష్ఠములు; ప్రాణులలో బుద్ధితో కూడినవి శ్రేష్ఠములు; బుద్దిగలవానిలో మానవులు శ్రేష్ఠులు; నరులలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు; బ్రాహ్మణులలో విద్వాంసులు శ్రేష్ఠులు; వారిలో కృతబుద్ధులైనవారు శ్రేష్ఠులు; కృతబుద్ధులలో కర్తలు అనగా ఆచరణశీలురు శ్రేష్ఠులు; అట్టి కర్తలలో బ్రహ్మవేత్తలు శ్రేష్ఠులు.

గీత.. సారాంశాన్ని

 గీతలోని మొత్తం 18 అధ్యాయాల సారాంశాన్ని కేవలం 18 వాక్యాలలో ఇక్కడ ఇస్తున్నాను.



వన్ లైనర్ గీత -


మీరు దీన్ని అందరికి ఫార్వార్డ్ చేసి సర్క్యులేట్ చేస్తారా? 

ప్రతి ఒక్కరూ దీన్ని 4 రోజుల్లో 100 మందికి ఫార్వార్డ్ చేయాలని అభ్యర్థించారు. 

మీ రాష్ట్రంలోనే కాదు, ఇది మొత్తం భారతదేశానికి ఫార్వార్డ్ చేయాలి.



వన్ లైనర్ గీత



*అధ్యాయం 1 - తప్పుడు ఆలోచన మాత్రమే జీవితంలో సమస్య .*


*అధ్యాయం 2 - సరైన జ్ఞానం మన సమస్యలన్నింటికీ అంతిమ పరిష్కారం.*


*అధ్యాయం 3 - నిస్వార్థత మాత్రమే ప్రగతికి మరియు శ్రేయస్సుకు మార్గం.*


*అధ్యాయం 4 - ప్రతి చర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు .*


*అధ్యాయం 5 - వ్యక్తిత్వం యొక్క అహంకారాన్ని త్యజించండి మరియు అనంతం యొక్క ఆనందాన్ని ఆనందించండి .*


*అధ్యాయం 6 - ప్రతిరోజూ ఉన్నత చైతన్యానికి కనెక్ట్ అవ్వండి.*


*అధ్యాయం 7 - మీరు నేర్చుకున్న వాటిని జీవించండి .*


*అధ్యాయం 8 - మిమ్మల్ని మీరు ఎప్పటికీ వదులుకోవద్దు .*


*9వ అధ్యాయం - మీ ఆశీర్వాదాలకు విలువనివ్వండి .*


*అధ్యాయం 10 - చుట్టూ ఉన్న దైవత్వాన్ని చూడండి .*


*అధ్యాయం 11 - సత్యాన్ని యథాతథంగా చూడడానికి తగినంత శరణాగతి కలిగి ఉండండి.*


*అధ్యాయం 12 - మీ మనస్సును ఉన్నతంగా గ్రహించండి.*


*అధ్యాయం 13 - మాయ నుండి విడిపోయి దైవానికి అనుబంధం .*


*అధ్యాయం 14 - మీ దృష్టికి సరిపోయే జీవన శైలిని గడపండి.*


*అధ్యాయం 15 - దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి .*


*అధ్యాయం 16 - మంచిగా ఉండటమే ప్రతిఫలం.*

*అధ్యాయం 17 - ఆహ్లాదకరమైన వాటిపై హక్కును ఎంచుకోవడం శక్తికి సంకేతం .*


*అధ్యాయం 18 - విడువండి, దేవునితో ఐక్యతకు వెళ్దాం.*


(ఈ సూత్రంలో ప్రతి ఒక్కదానిపై ఆత్మపరిశీలన)



|| 

ॐ తత్సత్ ||



P. S. - దీన్ని 100 మందికి ఫార్వార్డ్ చేసి, గీత ప్రాముఖ్యతను వివరించవలసిందిగా నేను మిమ్మల్ని పదే పదే కోరుతున్నాను.

13, జూన్ 2022, సోమవారం

అభ్యాసంతో

 ఎవరో ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడని అనుకుందాం. ఆ తప్పుని అతనికి ఎత్తి చూపి తను తప్పు చేశాడని నిరూపించి, తర్వాత క్షమించడం క్షమ అనిపించుకోదు. 


ఆ క్షమించిన విషయం సైతం ఆ వ్యక్తికి తెలియకుండా జరిగిపోవాలి. వారిలో తప్పు చేశామనే భావనే రాకూడదు. అది సరైన క్షమ. వారి తప్పును ఎత్తి చూపిస్తున్నావంటే వారిని ఇంకా క్షమించడం లేదని తెలుసుకోవాలి. తప్పు చేశామనే భావన పెద్ద శిక్ష. 


సాధనతో సంపాదించుకున్న జ్ఞానం ఈ భావన నుంచి తప్పించి జీవితాన్ని విశాల దృక్పథంతో చూసేలా చేస్తుంది. అదే అసలైన జ్ఞానం.


అవతలి వ్యక్తుల తప్పులను ఎత్తిచూపడమే పనిగా పెట్టుకునేవారు లోకంలో కోకొల్లలు కనిపిస్తుంటారు. వారంతా ఒకసారి తమ తప్పులను గుర్తించగలిగితే, ఎదుటివారిని అర్థం చేసుకోగలుగుతారు. 


అంటే, తప్పును సమర్థించాలని కాదు, తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయాలే కానీ, దాన్ని చేస్తున్న వ్యక్తిని తప్పుబట్టకూడదు. అలా చేసేంతటి సహనశీలత కొందరిలో ఉండకపోవచ్చు. కానీ, అభ్యాసంతో అన్నీ సాధ్యమే! మన మనసు పారదర్శకంగా ఉంటే, అవతలి వ్యక్తి మనసూ అంతే పారదర్శకంగా కనిపిస్తుంది. మనలో మాలిన్యాలు ఉంటే, ఎదుటివారిలోనూ అవే కనిపిస్తాయి.


క్షమించడానికి ప్రయత్నిద్దాం. ప్రయత్నే ఫలే అన్నారు పెద్దలు. వారు చెప్పిన సూక్తులు ఇప్పటిదాకా వమ్మైన దాఖలాలు లేవు కదా.

సీతారాముల అన్యోన్యత

 ॐ  సీతారాముల అన్యోన్యత - ఆదర్శం 


    ఉత్తమమైన మనస్సుగల రాముడు సీతయందే మనస్సు నిలిపేవాడు. ఆమె తన హృదయమునందు రామునే సర్వదా నిలుపుకొనేది. ఈ విధముగ అన్యోన్యాసక్తులై సీతారాములు అనేక ఋతువులపాటు (చాలాకాలం) విహరించారు. 


    తండ్రి అంగీకరించిన సంబంధమవడంతో రామునకు సీతపై ప్రేమకలిగింది. ఆమెయొక్క సద్గుణాలచేతా, లోకోత్తర సౌందర్యముచేతా అతని ప్రేమ ఇంకా వృద్ధి చెందింది. 


    సీత హృదయంలో భర్తయైన రాముడు రెండింతలుగా మసలుచున్నాడు. లోలోపల నున్న భావమును గూడ ఒకరి హృదయము మరొకరి హృదయంతో చెప్పుచుండెడిది.


    సౌందర్యమున దేవతా స్త్రీవలె ఉన్నదీ, లక్ష్మీవలె అపూర్వ సౌందర్యం గలదీ, మిథిలానగర సంజాతయు, జనకుని కూతురూ ఐన సీత రాముని హృదయంలో ఇంకా ఎక్కువగా మసలుతోంది. 


విశేషం 


    తండ్రి అంగీకరించి చేసిన సంబంధమవడంతోనూ, ఆమెకు గల రూపసద్గుణాలచేతనూ రామునకు సీతపై గాఢానురాగం కలుగగా, 

    సీతకు మాత్రమూ అట్టి బాహ్యనిమిత్తాలతో పనిలేకుండానే, భర్త అనే ఒక్క కారణంచేతనే రామునిపై రెట్టింపు ప్రేమయుండేది. 

    ఆ ప్రేమ ఎంత ఉత్కృష్టమైనదంటే, వారిరువురూ నోటితోకాక హృదయాలతోనే మాట్లాడుకొనేవారు, 

    ఒకరి హృదయంలో ఉన్న భావము నొకరు అనాయాసంగా గ్రహించి తదనుగుణంగ ప్రవర్తించేవారు. 

    వారి ప్రేమ ఒకరిపై ఒకరికి రెట్టింపు రెట్టింపు ఉన్నదట. వారి ప్రేమ కొలవడానికి గానీ, ఎవరికి ఎవరిపై ఎక్కువ ప్రేమయో చెప్పుటకు సాధనమేదీ లేదని భావము. 


    The high-minded Sree Raama, whose heart was set on his spouse and who stood enthroned in her heart, enjoyed life with her for much time. 

    Seetha was dear to Sree Raama as a partner made available to him by his father. Nay because of her manifold virtues and comeliness of form his affection for her grew all the more. 

    Her husband too, because of his excellences and lovely exterior, gained a doubly secure footing in her heart. 

    Seetha, the princess of Mithila and daughter of Janaka, who compared with goddesses in bodily charm and was beauty incarnate as it were, 

    could vividly read in minute detail with her mind even that which existed in the inmost heart of Sree Raama.


రామస్తు సీతయా సార్థం విజహార బహూనృతూన్ I 

మనస్వీ తద్గతస్తస్యా నిత్యం హృది సమర్పితః ॥ 

ప్రియా తు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి I 

గుణాద్రూపగుణాచ్చాపి ప్రీతిర్భూయోఽభ్యవర్ధత ॥ 

తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే I 

అన్తర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా ॥ 

తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజా I 

దేవతాభిః సమా రూపే సీతా శ్రీరివ రూపిణీ ॥ 

          - బాలకాండ 77/28,29,30,31 


గమనిక: 


    మా తల్లిదండ్రులు 


లక్ష్మీ సమానురాలైన లక్ష్మీ కనకదుర్గా సుందరి - 

బ్రహ్మశ్రీ వేదమూర్తులైన బొడ్డపాటి కుటుంబరావు గారల


     వివాహము 1947లో ఈ రోజే జరిగి, ఈ నాటికి 75 సంవత్సరాలైంది. 


    2007లో అరవై వసంతాల వైవాహిక జీవితాన్ని పూర్తిచేసుకుని, 

    మా నాలుగో మేనమామ ఉపనయనము, మా తల్లిదండ్రుల వివాహముల ఆనాటి సంయుక్త శుభలేఖని, 

    భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి సమక్షంలో చదివించుకుని, 

   దండలు మార్చుకుని, 

   సీతారామ కళ్యాణం చేయించారు. 

 

    వాళ్ళ దాంపత్యం సీతారాముల జీవితంలాగా ఆదర్శవంతమైనది. 

    మాకు వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. 

    వారి 

  - దైవీ సంబంధమైన ఆ జీవనమూ, 

  - కుటుంబ నిర్వహణా విధానమూ, 

   మా జీవితాలలో మాకు ఎల్లప్పుడూ మార్గదర్శనం. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

భక్తి సోపానములు

 శ్లోకం:☝️

*శ్రవణం కీర్తనం విష్ణోః*

    *స్మరణం పాదసేవనం l*

*అర్చనం వందనం దాస్యం*

    *సఖ్యమాత్మనివేదనం ll*


భావం: భగవత్కథా శ్రవణము, ఈశ్వర మహిమా సంకీర్తనము, భగవన్నామస్మరణ, విష్ణు పాదసేవ, పూజ, నమస్కరించుట, సేవచేయుట, స్నేహము, ఆత్మనివేదనము - ఈ తొమ్మిదీ భక్తి సోపానములు 🙏

జ్యేష్ఠ పూర్ణిమ

 జ్యేష్ఠ పూర్ణిమ


సకల శూభాలూ చేకూర్చే పూర్ణిమ 


జ్యేష్ఠ మాసం శుక్ల పక్ష పౌర్ణమి విశిష్టమైన రోజు. ఈ రోజుకు ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం జూన్ 13 సోమవారంనాడు పౌర్ణమి వస్తుంది. ఈ రోజున నదుల్లో స్నానం చేయడం, దానాలు చేయడం మంచిది. అంతేకాకుండా ఈ రోజు వట పూర్ణిమ ఉపవాసం కూడా పాటిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమ అనేక శుభాలు చేకూరుస్తుందని శాస్త్ర వచనం. ఈ శుభ తిథిన కొన్ని పద్దతులు పాటిస్తే ఆనందంతో పాటు శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. అంతేకాకుండా లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా పొందవచ్చని జ్యోతిషశాస్త్రం ప్రస్తావించింది.


పౌర్ణమి రాత్రి మధ్యలో మహాలక్ష్మీ, విష్ణువులను ఆరాధించాలి. అంతేకాకుండా రాత్రిపూట ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమను అదృష్ట తిథిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున లక్ష్మీ స్తోత్రాలు, కనకధార స్తోత్రాలు పఠించడం వలన సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. స్తోత్రాలు, మంత్రాలు పఠించడం ద్వారా లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది. సాయంత్రం లక్ష్మీదేవిని ధ్యానించడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి.


ఆర్థిక పరమైన సమస్యలనుంచి బయటపడటానికి పౌర్ణమి తిథినాడు చంద్రోదయం తర్వాత ముడిపాలు, బియ్యం, చక్కెరను నీటిలో కలపి, అనంతరం *ఓం శ్రీం హ్రాం స్రౌం సః చంద్రమాసే నమః* అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలిగిపోవడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. భార్యభర్తలు కలిసి అర్ఘ్యం సమర్పిస్తే వారి అనుబంధం మరింత బలపడుతుంది. చిరకాలం కలిసే ఉంటారు. అలాగే ఎముక, కంటి వ్యాధులు కూడా నయమవుతాయి.


జ్యేష్ఠ పూర్ణిమ తిథి నాడు 11 గవ్వలకు పసుపురాసి లక్ష్మీదేవి విగ్రహం పాదాల వద్ద ఉంచాలి. అనంతరం పసుపు లేదా కుంకుమతో తిలకం దిద్ది పూజించాలి. తర్వాత లక్ష్మీ చాలీసా పారాయణం చేయాలి. మరుసటి రోజు వీటిని ఎరుపు వస్త్రంలో కట్టి బీరువాలో ఉంచాలి. ఇలా చేయడం ద్వారా ఐశ్వర్యం, కీర్తి వృద్ధి చెందుతాయి.


జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి పాయసం నైవేద్యంగా సమర్పించి పెళ్లి కాని ఐదుగురు యువతులకు ఆహారంగా ఇచ్చి దక్షిణ సమర్పించాలి. తర్వాత ఇంట్లో అందరూ లక్ష్మీదేవి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం ప్రతి కుటుంబ సభ్యుడికి లభిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.


జ్యేష్ఠ పూర్ణిమ రోజున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి విష్ణువు, లక్ష్మీదేవిని సక్రమంగా పూజించండి. సువాసన వెదజల్లే ధూపం వేసి, గులాబీ పూలతో అర్చించండి. దీంతోపాటు విష్ణు సహస్రనామం పఠిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా రుణ భారం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. విష్ణువు, లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు.🙏

12, జూన్ 2022, ఆదివారం

బతికించే భాష!*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

 *సరదాగా  చదువుకోండి.*              

   *హాయిగా నవ్వుకోండి.*               

😀😀😀😀😀😀😀😀😀😀😀

           *సుందర తెలుగు....*


         ఆసాంతం చదవండి....


      *చచ్చినట్టు’ బతికించే భాష!*


తెలుగువాడికి సాటి ఇంకొకడు లేడు. అందరిదీ ఒక దారైతే మనవాడిది ఇంకోదారి! 


అందరూ పొగ  *పీలిస్తే* తెలుగువాడు పొగ *తాగుతాడు.* 


-ఇంతేకాదు తెలుగువాడు దెబ్బలు ‘తింటాడు’. దెబ్బలు ఏమైనా తినే పదార్థాలా? అంటే ఉలకడు పలకడు. 


      సంస్కృతం అమరభాష అంటారు. దాని సంగతేమో కానీ తెలుగు మాత్రం కచ్చితంగా అమరభాషే! ఇందుకు ఉదాహరణలు ఉన్నాయి. 

*ఎవరి మీద అయినా ప్రేమ వచ్చినా, కోపమొచ్చినా ‘సచ్చినోడా’ అని తెలుగువాడు పిలుస్తాడు. ‘సచ్చినోడు’ ఎలా పలుకుతాడని ఆలోచించడు. 


*చచ్చినా ఒప్పుకోను అంటాడు. చస్తే ఎలా ఒప్పుకుంటాడు? చచ్చినాక ఒప్పుకుని చూపించిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? 


*ఆశ చావడం లేదంటాడు. చెట్లకే ప్రాణం ఉందని చెప్పుకుని చావనివాళ్లు ఇంకా ఉన్నారు. అలాంటి వాళ్లు ఆశకు ప్రాణం ఉంటుందని ఎలా ఒప్పుకుని ‘చస్తా’రు? 


*తెలుగువాడు కంటి చూపుతో చంపేస్తాడు. అతడి శక్తి అలాంటిది. 


ఇలాంటి అతీత శక్తులు యావత్‌ ప్రపంచంలో తెలుగువాడికి మాత్రమే ఉన్నాయి. 

ఎంత గొప్ప! ఎంత చిత్రం !


 *మత్తు పానీయాలైన సారా, బ్రాందీ, విస్కీలను ‘సేవిస్తున్నా’ నంటాడు. అదే సమయంలో మంచినీళ్లు తాగుతున్నానంటాడు తప్ప సేవిస్తున్నాననడు. 

ఇదేం చిత్రమో! 


*ఇంకా చిత్రమేంటంటే మందు ‘కొడుతున్నా’నంటాడు. కొట్టడానికి మందేమన్నా మనిషా? పశువా? 


*బాతాఖానీ కొట్టకు అంటాడు. దీని పరిస్థితీ ఇదే. 


*అనారోగ్యకరమైన నిషా పానీయాన్ని ఆరోగ్యప్రదాయిని అయిన మందు పేరుతో పిలుస్తాడు! అంతా ‘మందే’ అనుకునేవాడు తప్ప ఇంకెవ్వడైనా ఈ పని చేయగలడా? 


*తెలుగువాడు ఎందులోనైనా ఆటను చూడగలడు. మాట్లాడతానంటాడు. పోట్లాడతానంటాడు. 


*మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటాడు. మనసు పూర్తిగా కాకుండా అందులో ఏభై శాతమో, డెబ్భైఅయిదు శాతమో ఉంచి కోరుకుంటాడా ఏంటి? 


ఇంకోమాట! 


*హృదయపూర్వకంగా అభినందిస్తున్నానంటాడు. కాసేపు హృదయాన్ని పక్కనబెడితే, అభినందించే అవకాశం ఉందా? ఉంటుందా? 


*తెలుగువాడి ‘న్యాయమే’ వేరు. 


బడాయి గానీ మాట మాట్లాడితే ‘మనస్సాక్షిగా’ అంటాడు. మనసుకు ఏమన్నా రూపం ఉందా? మాట ఉందా? వచ్చి సాక్ష్యం చెప్పడానికి! 


*అగ్నిసాక్షిగా పెళ్లాడాను అని కూడా అంటాడు. అగ్ని ఏదో చిటపటలాడుతుంది కానీ ఎవరైనా సంసారంలో చిచ్చుపెడితే అదొచ్చి అడ్డుపడుతుందా ఏంటి? 


*కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడంటాడు! పోసుకోమనండి చూద్దాం! 


*పెళ్లికాని ఆడపిల్లను గుండెల మీద కుంపటి అంటాడు. ఇది ఎంత తప్పు! గుండెల మీద కుంపటి పెట్టుకున్న మొనగాళ్లు యావత్‌ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? 


*మాటేగా ఏదైనా అంటాడు. గుండె మీద బరువు తగ్గించుకున్నానంటాడు. గుండెల మీద బట్టల బరువు తప్ప ఇంకేం బరువు ఉంటుంది! 


*నవ్వితే నవరత్నాలు రాలతాయంటాడు. రత్నాలా పాడా? మరీ గట్టిగా నవ్వితే పళ్లు రాలిపోతాయేమో! చిటికెలో పని అయిపోతుందంటాడు. 


*అతిశయం కాకపోతే చిటికె వేస్తే శబ్దం అవుతుంది కానీ పని ఎలా అవుతుంది !

 

*ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్‌ అని గురజాడ చెప్పినా మనవాళ్లు వినరు. 


*అప్పు తీసుకునేటప్పుడు ‘నీ డబ్బు వడ్డీతో సహా పువ్వుల్లో పెట్టి ఇస్తా’నంటారు. వడ్డీ ఇస్తే ఇవ్వచ్చుగానీ పువ్వుల్లో పెట్టి ఇచ్చినవాడు ఎవడైనా ఉన్నాడా? ఇది అప్పిచ్చిన పిచ్చివాడి చెవిలో పువ్వు పెట్టడం కాదూ! 


*ఎవరో చిన్నచూపు చూస్తున్నారని తెలుగువాడు ఆక్షేపిస్తాడు. దూరపు చూపు, దగ్గరి చూపు ఉంటాయి తప్ప చిన్న చూపు, పెద్ద చూపు అని ఎక్కడైనా ఉంటాయా? 


*వంట చేయడాన్ని చేయి కాల్చుకోవడం అంటాడు. ఇదే నిజమైతే ఆడవాళ్ల చేతులన్నీ ఏమైపోయేవి !

 

 *సంగీతమంటే చెవి కోసుకుంటానని ఒక్కొక్కరు వంకర్లు తిరిగిపోతుంటారు. అయితే అతడు ఎంతసేపు పాటలు వింటున్నా కోసుకున్న చెవి కిందపడదే అని నిరాశ పడ్డవాళ్లూ ఉన్నారు. 


*తప్పు చేసినవాడు అడ్డంగా దొరికిపోయాడు అంటారు. దొరికినవాడెవడైనా అడ్డంగా దొరుకుతాడా? నిలువుగా దొరుకుతాడు తప్ప. 


*అన్నట్టు గిట్టనివాణ్ని అడ్డమైనవాడు అని తిడతారు. అదేంటి? దాని భావ మేంటి? పండితార్థం ఏమైనా పిండితార్థం ఒకటుంది. 


*పశువా అని తిట్టినట్టు. మనుషులు నిలువుగా ఉంటారు. పశువులు అడ్డంగా ఉంటాయి. అదీ సంగతి! 


*ఎవడి మీదైనా కోపం వస్తే ఏ మొహం పెట్టుకుని వచ్చావంటాడు తెలుగువాడు. ఎవడికైనా ఒకటే ముఖం ఉంటుంది కానీ బ్రహ్మలాగా నాలుగు ముఖాలు, రావణబ్రహ్మలాగా పది ముఖాలు ఉండవు కదా! 


*ఫలానావాడు తలలు మార్చేరకం అనేది కూడా తెలుగువాడి వాడుక. ఇదెలా సాధ్యం? వినాయక వృత్తాంతంలోలాగా తలలు మార్చేశక్తి సామాన్య మానవులకు ఉంటుందా ?


*తెలుగువాడు బండ చాకిరీ చేస్తానంటాడు. బండ దాని మొహం! ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటుంది కానీ అది చేసే చాకిరీ ఏముంటుంది? 


*ఏముంది ఎడమ చేత్తో చేస్తానంటాడు. ఎడమ చేత్తో చేసే పనులేంటో అందరికీ తెలుసు. దానితో అన్ని పనులూ అతివేగంగా చేస్తానంటే ఎలా కుదురుతుంది? 


*అన్నం ఉడకలేదా అంటాడు. ఇదేంటి? ఉడికితే కానీ అన్నం కాదు కదా! 


*జోకులు పేల్లేదు అంటాడు. జోకు ఏమైనా బాంబా? పేలడానికి! 


*వీపు విమానం మోత మోగుతుందని అంటాడు. విమానం మోత మోగితే ఆ వీపు అసలు ఉంటుందా? మనిషి అసలు ఉంటాడా? 


*లేస్తే మనిషిని కానంటాడొకడు. మరి లేచినవాళ్లందరూ ఏంటి? అలాంటప్పుడు కూర్చుని ఉంటేనే మేలు కదా! 


*శక్తిని కూడా భక్తికి ముడి పెట్టడం తెలుగువాడికి రివాజు. 


*ఉన్న పూజలు చాలక బడితెపూజ ఒకటి.


  *జంతువుల్లో కూడా దేవుళ్లను చూసుకుని భారతీయులు ఆరాధిస్తారు. ఇందుకు తెలుగువాడు కూడా మినహాయింపు కాదు. ఎటొచ్చీ మనుషుల్లో జంతువుల్ని చూడటం అతగాడి ప్రత్యేకత. 


*గిట్టనివాళ్లను పంది, కుక్క, గాడిద అని తిట్టే తెలుగువాడు, ఇష్టమైనవాణ్ని పులి, సింహం, గుర్రం అని అభిమానంగా చూస్తాడు. పిలుస్తాడు.


*ఏదైనా కళ్లారా చూస్తే తప్ప నమ్మకూడదు. తెలుగు భాష ఇందుకు ఇంపు అయిన మినహాయింపు. 

*గుండె జారిపోయింది అంటారు. ఇప్పటివరకు ఎవరికైనా జారిపోయిందా? లేదే! 


*నీ నోరు పడిపోను అని తిట్టిపోస్తారు. ఎవరి నోరు అయినా ఎప్పుడైనా పడిపోవడం చూశామా? 


*పాడమని అడిగితే గాయకులు గొంతుపోయింది అంటారు. గొంతు ఎక్కడికి పోతుంది? పోతే ఎవరు తీసుకురాగలరు? 


*నోరు పారేసుకోవడం అంటారు. అది ఎలా సాధ్యం? 


*మా ఆయనకు నోట్లో నాలుకలేదని ఓ ఇల్లాలు వాపోతుంటుంది. నోట్లో నాలుక లేకుండా మనిషి ఎలా ఉంటాడు? 


*‘వాసన చూడు’ అంటారు. వాసనను పీలుస్తారు కానీ ఎలా చూస్తాం? 


*రుచి చూడటం కూడా అంతే. ఎవరు చూడగలరు? 


 *పత్రికలు చదివి చదివి వాటిలోని పడికట్టు మాటలను కంఠస్థం చేసేశాడు తెలుగువాడు. 


*ఫలానావాడు బాధకు గురయ్యాడు అంటాడు. మధ్యలో గురి ఎందుకు? బాధపడ్డాడు అనొచ్చుగా. 


*దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడంటారు. దిగ్భ్రాంతి చెందాడు అనడు. దిగ్భ్రాంతిని ఎలా వ్యక్తం చేస్తాడంటే చెప్పడు. 


*తప్పు చేస్తే పాపం అంటాడు సరే. ఎదుటివాడు కష్టాల్లో ఉంటే అయ్యో ‘పాపం’! అంటాడు. తెలుగు భాష ఏమన్నా పుణ్యానికి వచ్చిందా ఏంటి?


 *దేశ భాషలందు తెలుగు లెస్స* అని శ్రీకృష్ణ దేవరాయలు చెప్పాడని గొప్పగా చెబుతాం. ఇంగ్లీషు మాటలు తెలుగులో కలవని రోజుల్లో అన్న మాటలివి. తెలుగంతా ఇంగ్లీషు మయం అయిన ఈ రోజుల్లో అయితే ‘ప్రపంచ భాషలందు తెలుగు లెస్స’ అనక తప్పదు.


*తమిళుడు తన భాషలో మాట్లాడుతుంటే తమిళుడికి తప్ప ఇంకొకరికి అర్థం కాదు. 


*బెంగాలీ తన భాషలో మాట్లాడుతుంటే బెంగాలీకి తప్ప ఇంకొకరికి అర్థం కాదు. 


~తెలుగు తప్ప భారతీయ భాషలన్నీ అంతే. 


మరి తెలుగువాడో.. తెలుగు అని చెప్పి మాట్లాడుతుంటే అన్ని భాషలవాళ్లకూ ఎంతో కొంత అర్థమవుతుంది. ఇందుకు ఇంగ్లీషు, ఉర్దు, తమిళం, కన్నడం, హిందీ లాంటి సమస్త భాషలూ ఇందులో ‘గూడు’ కట్టుకునో ‘భవనం’ కట్టుకునో ఉంటాయి. 


*ఇంగ్లీషు మాత్రం ఇంతకన్నా పొడిచిందేముంది? ఇది తెలుగువాడి వ్యూహం. అందువల్ల తెలుగు మనుగడకు ఎట్టి పరిస్థితిలో ఢోకా రాదు. 

*తెలుగు భాష జిందాబాద్‌!*

*(సేకరించినది)*. 

💐💐💐💐💐💐💐💐💐💐

హాస్యానందం

 ఆలు -మగల హాస్యానందం!

😊

"ఏఁవోయ్ .... "


"ఆఁ .... "


"పులుసులో చిలగడ దుంపలు వేసావా, ఘుమఘుమలాడుతోంది?"


"కళ్ళు మూసుకుని పూజ్జేసుకుంటూ మళ్ళీ లౌకికాలు ఎందుకు?"


"కళ్ళు మూసుకున్నాను గానీ ముక్కు మూసుకోలేదుగా?"


"బానే ఉంది. ముందు పూజ కానివ్వండి".


"నైవేద్యానికి ముక్కల పులుసు బ్రహ్మాండంగా ఉంటుందనుకో. భగవంతుడికి ప్రీతికరమైనది".


"మరే .... మీకు కలలోకొచ్చి చెప్పాడాయన!"


"కలలోకే రావాలేఁవిటే రాజ్జం? మనకు ఇష్టమైనవన్నీ ఆ భగవంతుడికి నైవేద్యాలే. అలా నైవేద్య రూపంలో పెడితే మనం తినేవి పూర్తిగా వంటబడతాయ్ .... భక్తిగా తింటాం కాబట్టి".


"ఓహో .... అలాగా?"


"ఆంజనేయ స్వామికి అప్పాలు, వెంకన్నకు దధ్యోజనం, చక్ర పొంగలి, శివుడికి పాయసం, విఘ్నేశ్వరుడికి లడ్లు, కుమారస్వామికి తేనె, పాలు .."


"ఇంకా ....?"


"అసలు మహా నైవేద్యం అంటేనే మనకు ఇష్టమైనవి మనఃస్పూర్తిగా తినడానికేనే .... ఆ భగవంతుడి పేరు చెప్పి కళ్ళకద్దుకుని ఆరగించడఁవే".


"మరి అమ్మ వారికి ఇష్టమైనవి చెప్పలేదెందుకో?"


"దుర్గమ్మకు పులిహోర, శ్రీ మహా లక్ష్మీకి పూర్ణాలు ...."


"అవేఁవీ కావు .... "


"మరి .... ?"


"అమ్మ వారికి వడ్రాణ్ణం, గాజులు, కమ్మలు, వంకీలు, బుట్టలు, చంద్రహారం, జడలో చామంతి బిళ్ళ  ...."


"ఆపుతావా దండకం? నీకిష్టమైనవాటన్నిటికీ అమ్మవారి పేరు చెబుతావా?"


"మీకిష్టమైన వాటికి భగవంతుడి పేరు చెప్పుకోవడం లేదేంటి మరి?"


"నన్ను కాసేపు పూజ్జేసుకోనిస్తావా? అసలు నిన్ను కదిలించడం నాదీ బుధ్ధి తక్కువ".


"మీరా, నేనా కదిలించింది? శ్రావణ మాసానికి ఏం చేయించుకున్నావని అమ్మాయడుగుతోంది".


"శ్రీ మహా విష్ణోరాఙ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్యః బ్రహ్మణః ద్వితీయ పదార్ధే శ్వేత వరాహ కల్పే వైవశ్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య నైఋతి ప్రదేశే ...."


"నైఋతి ఇక్కడ కాదు, ఈశాన్య ప్రదేశే .... అని చెప్పుకోవాలి".


"నీతో ఇంకొంచెం సేపు మాట్లాడితే ప్రవర కూడా మరచిపోతాను".


🤫

దంతిల కోహల శాపవిముక్తి*

 _*ఆదివారం మే 22, 2022*_


     _*🚩వైశాఖ పురాణం🚩*_

 _*🌴22 వ అధ్యాయము🌴*_



🕉🌞🕉️🌞🕉️🌞🕉️🌞


*దంతిల కోహల శాపవిముక్తి*


☘☘☘☘☘☘☘☘


నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాస మహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తిమహారాజు ఇట్లు అడిగెను. మహామునీ ఇహపరసౌఖ్యముల నిచ్చు వైశాఖమహిమల నెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపములేని ధర్మము , శుభకరములగు విష్ణుకథలు , చెవులకింపైన శాస్త్రశ్రవణము యెంతవిన్నను తృప్తి కలుగదు. ఇంకను వినవలయుననిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిధివై నా ఇంటికి వచ్చితివి. నీవు చెప్పిన ఈ అమృతోపదేశమును విని బ్రహ్మపదవిని ముక్తిని నా మనసుకోరుట లేదు. కావున నా యందు దయయుంచి ఇంకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించెను.


శ్రుతకీర్తి మాటలను విని శ్రుతదేవమహాముని మిక్కిలి సంతసించి ఇట్లనెను. వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరియొక కథను చెప్పుదును వినుము.


పంపాతీరమున శంఖుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశియందుండగా గోదావరీ ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరధీ నదిని దాటి ముళ్లురాళ్లు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు యెండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి యొక వృక్షము నీడలో కూర్చుండెను.


అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అచటకు వచ్చెను. అతడు దయా హీనుడు. సర్వప్రాణులను హింసించువాడు. సూర్యునివలె ప్రకాశించుచు రత్నకుండలములను ధరించిన శంఖుని పీడించి వాని వద్దనున్న కుండలములను గొడుగును , పాదుకలను కమండలమును లాగుకొనెను. తరువాత నా బ్రాహ్మణుని పొమ్మని విడిచెను.


శంఖుడును అచటినుండి కదలెను. ఎండకు కాళ్లు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచు , చెట్లనీడలయందు వెదకి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెళ్లుచుండగా బోయవానికి వానియందు దయకలిగెను. వాని పాదుకలను తిరిగి వానికీయవలెనను ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవేయని వాని యభిప్రాయము. ఆ కిరాతుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగలించిన పాదుకలను వానికి తిరిగి ఇచ్చెను. ఇట్లుచ్చుటవలన నాకు కొంతయైన పుణ్యము కలుగునుకదాయని భావించెను.


శంఖుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవయని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున నితడు దుర్బుద్దియగు కిరాతుడైనను పాదుకలనిట్లిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడయి వైశాఖమున ఇట్టి బుద్ధికలిగించెనని పలికెను. ఇప్పుడీ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని. నా కిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగ నుండుమని వానిని యాశీర్వదించెను.


కిరాతుడును శంఖుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీనుండి దోచుకున్నదానిని నీకు తిరిగి ఇచ్చితిని. ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును. వైశాఖము శ్రీహరి సంతోషించుననియనుచున్నావు. నీవీ విషయమును వివరింపుమని శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని పలుకులకాశ్చర్యపడెను. లోభముగల ఈ కిరాతుడు నీవిట్లు నానుండి దొంగలించిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖమహిమ నడుగుట శ్రీహరి మహిమయేయని వైశాఖమును మరలమెచ్చెను. దుర్బుద్దివై నా వస్తువులను లాగుకొన్నను యెండలో బాధపడునాయందు దయ కలిగి నా పాదుకలను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును. కాని వైశాఖమాసదాన ధర్మములు వెంటనే ఫలించును సుమా ! పాపాత్ముడవైనను , కిరాతుడవైనను దైవవశమున నీకిట్టిబుద్ది కలిగినది. నీకింత మంచిబుద్ది కలుగుటకు వైశాఖమాసము శ్రీహరి దయకారణములు సుమా. శ్రీహరికిష్టమైనవి , నిర్మలము సంతుష్టికరము అయినచో అదియే ధర్మమని మనువు మున్నగువారు చెప్పిరి. వైశాఖమాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి ఇష్టములు. వైశాఖమాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మకార్యములకు సంతుష్టినందడు. తపస్సులు , యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత ఇష్టములు కావు. ఏ ధర్మము వైశాఖధర్మమునకు సాటిలేదు. వైశాఖధర్మముల నాచరించినచో గయకు , గంగానదికి ప్రయాగకు , పుష్కరమునకు , కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రభాసమునకు శమంతమునకు గోదావరికి కృష్ణానదికి సేతువునకు యెచటికిని యేపుణ్యక్షేత్రమునకు పవిత్రనదికి యెచటికిని పోనక్కరలేదు. వైశాఖవ్రత వివరణ ప్రసంగము గంగానది కంటె పవిత్రమైనది. ఈ నదిలో స్నానము చేసినవారికి ఈ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను యెన్ని దానములు చేసినను యెన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తిపూర్ణములగు వైశాఖధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటిగావు. కావుననే ఈ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకల నీయవలెనని నీకు అనిపించినది. ఈ మాసమంత గొప్పది కావుననే దీనికి మాధవమాసమని పేరు వచ్చినది. పాదుకలనిచ్చుటచే నీకు పుణ్యము కలుగును. నిశ్చయము అని శంఖుడు వ్యాధునకు వివరించెను.


ఇంతలోనొక సింహము పులిని చంపుటకై వేగముగ బోవుచు మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై బడెను. సింహమునకు , గజమునకు భయంకరమగు యుద్దము జరిగెను. రెండును యుద్దము చేసి చేసి అలసి నిలుచుండి శంఖుడు కిరాతునికి చెప్పుమాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖమహిమను వినుట చేతను గజసింహరూపములను విడిచి దివ్యరూపముల నందిరి. వారిని దీసికొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్యరూపమును ధరించిన వారిద్దరును కిరాతునికి వైశాఖవ్రతమహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించిరి.


కిరాతుడు శంఖుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేల నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి. గజసింహములుగా నున్న మీకీ దివ్యరూపములు కలుగుటయేమనియు ప్రశ్నించిరి. అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము. దంతిలుడు , కోహలుడునని మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యౌవనములోనున్న  మా ఇద్దరిని జూచి మా తండ్రియగు మతంగ మహర్షి *'నాయనలారా ! విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రముల నేర్పరచుడు. జనులకు విసనకఱ్ఱలతో అలసటవోపునట్లుగా విసరుడు. మార్గమున నీడనిచ్చు మండపములను యేర్పాటు చేయుడు. చల్లని నీటిని అన్నమును బాటసారులకిచ్చి వారి యలసటను పోగొట్టుడు. ప్రాతఃకాలమున స్నానము చేసి శ్రీహరి పూజింపుడు. శ్రీహరికథలను వినుడు, చెప్పుడు అని మాకు బహువిధములుగ జెప్పెను. ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మముల నాచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగ సమాధానముల నిచ్చితిమి. ధర్మలాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్షమునకు కోపించెను. ధర్మవిముఖుడైన పుత్రుని , వ్యతిరేకమునబలుకు భార్యను , దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడువవలయును. దాక్షిణ్యము వలన , ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులున్నంత కాలము నరకముననుందురు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగను , కోహలుడు గజముగను చిరకాలము అడవిలో నుండుడని మమ్ము శపించెను. పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు. అప్పుడే మీరిద్దరును కలిసికొందురు. ఆ సమయమున కిరాతుడు శంఖుడను బ్రాహ్మణునితో వైశాఖధర్మములను గూడి చర్చించుటకు విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాపవిముక్తి , ముక్తి కలుగునని శాపవిముక్తిని అనుగ్రహించెను. శాపవిముక్తిని పొంది నా యొద్దకు వచ్చి వెళ్లుదురనియు మా తండ్రిగారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగనే జరిగినది. కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానముల నెక్కి వెళ్ళిపోయిరి.


వాని మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మితుడయ్యెను. శంఖుడును కిరాతునితో ఓయీ ! వైశాఖ మహిమను ప్రత్యక్షముగ జూచితివి గదా ! వైశాఖమహిమను వినుటవలననే దంతిలకోహలులకు శాపవిముక్తి ముక్తి కలిగినవి కదాయని పలికెను. కిరాతునిలోనున్న హింసాబుద్ది నశించెను. వాని మనస్సు పరిశుద్దమయ్యెను. అతడు పశ్చాత్తప్తుడై శంఖునకు నమస్కరించి ఇట్లనెను.


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను.


*వైశాఖ పురాణం ఇరవైరెండవ అధ్యాయం సంపూర్ణం*

            🌷 *సేకరణ*🌷

          🌹🌷🌞🌞🌷🌹

                *న్యాయపతి*

             *నరసింహా రావు*


🙏🌞🙏🌞🙏🛕🙏🌞🙏🌞🙏

ఎటునుండి చదివినా ఒకేరకంగా

 ఎటునుండి చదివినా ఒకేరకంగా వుండే పదాలను రాస్తారా?అంటే వికటకవి లాగా.ఆధారాలనుబట్టి పదాలు వ్రాయాలి.అన్నీ మూడు అక్షరాల పదాలే!


1.కాబట్టి

2.కంటివ్యాధి

3.బంతి

4.ఇంటికుండేది

5.చిరునిద్ర

6.ఒయ్యారము

7.ముల్లు

8.బంగారు

9.రవిక

10.ఒకమూలిక.దగ్గుకు వాడుతుంటారు.

11.అగడ్త,కాలువ వంటిది

12.కుండ

13.తామర

14.ఒక కాయగూర

15.నాట్యం,కపట

 ప్రవర్తన

16.కన్ను

17.ఆడగుర్రం, నీటిలో వుండు ఒక అగ్ని

18.శరీరభాగం

19.పుష్కలము

20.వస్త్రం

21.ఒకరుచి

22.ఇంద్రుని ఉద్యానవనం

23.కాంతి

24.చిన్నపిడత

25.సంతోషము

26.కుప్ప,ప్రోగు

27.పిడక కాల్చిన బూడిద గడ్డ

28.గుండ్రము,వర్తులము

29.ప్రక్కవైపు

30.బతుకమ్మను ఈపూలతో చేస్తారు.


నిదానంగా అన్నీ ఒకఆర్డర్ లో.3అక్షరాలే..ఎటుచదివినా

ఒకటే ఆన్సర్ రావాలిఅర్ధమైందికదా..పదండి మరి!

ఉపశమనము

 శ్లోకం:☝️

*మిత్రే నివేదితే దుఃఖే*

    *దుఃఖినో జాయతే లఘు |*

*భారం భారవహస్యేవ*

    *స్కన్ధయోః పరివర్తతే ||*


భావం: భుజం మీద బరువు మోసేవాడు ఆ బరువును రెండు భుజాల మధ్యకు మార్చుకుంటే భారము కొంచం తగ్గినట్టుగా, మంచి మిత్రునికి బాధ చెప్పుకుంటే ఆ బాధపడేవాని మనసు తేలికపడి ఉపశమనము కలుగుతుంది. 

    అనగా...  మన దుఃఖాన్ని (బాధలను, కష్టాలను) మన ఆత్మీయులకు (మిత్రులు, బంధువులకు) చెప్పుకుంటే మనసు తేలికపడి కొంత ఉపశమనము కలుగుతుంది అని భావము.

 Establishment of Supreme Court Bench 

in AP for South India is our prime aim🙏


🌹భగవద్గీత🌹         


పదునైదవ అధ్యాయము

పురుషోత్తమ యోగము

16వ శ్లోకము


ద్వావిమౌ పురుషౌ లోకే 

క్షరశ్చాక్షర ఏవ చ ౹

క్షరః సర్వాణి భూతాని 

కూటస్థోఽక్షర ఉచ్యతే ౹౹  (16)


ద్వౌ , ఇమౌ , పురుషౌ , లోకే ,

క్షరః , చ , అక్షరః , ఏవ , చ ౹

క్షరః , సర్వాణి , భూతాని , 

కూటస్థః , అక్షరః , ఉచ్యతే ౹౹ (16)


లోకే = ఈ జగత్తునందు

క్షరః , చ = క్షరుడు (నశ్వరుడు) అనియు

అక్షరః = అక్షరుడు (నాశరహితుడు) అనియు 

ఇమౌ , ద్వౌ , పురుషౌ , ఏవ = ఈ రెండువిధములగు పురుషులే గలరు

సర్వాణి , భూతాని = సకల ప్రాణులశరీరములును

క్షరః = నశ్వరములు

చ = మఱియు

కూటస్థః = జీవాత్మ

అక్షరః = నాశరహితుడు , అని

ఉచ్యతే = పేర్కొనబడుచున్నది


తాత్పర్యము:- ఈ జగత్తునందు క్షరుడు (నశ్వరుడు), అక్షరుడు (వినాశరహితుడు) అని రెండు విధములుగా గలరు. సకలప్రాణుల శరీరములు నశ్వరములు. జీవాత్మ నాశరహితుడు. (16)

   

      ఆత్మీయులందరికి శుభ శుభోదయం

               Yours Welwisher

Yennapusa Bhagya Lakshmi Reddy

Advocate AP High Court Amaravathi

ధ్వజస్తంభం

 జూన్ 10 ..1982@శ్రీ pvrk ప్రసాద్ IAS: తిరుమల కొండమీద వేంకటేశ్వరుని    ఆలయంలో                                                                                                                ధ్వజస్తంభం మాను పుచ్చిపోయింది! 

 

శ్రీవారి ఆలయంపై వున్న ఆనంద నిలయం విమానాన్ని పాలిష్‍ చేయడం సహా అనేక మరమ్మత్తు పనులు చేపట్టాం. 


అకస్మాత్తుగా ఒక రోజు ఇంజనీర్ వచ్చి, ఖంగారు ఖంగారుగా చెప్పాడు.

"ధ్వజస్థంభం పుచ్చిపోయింది."


...  మెల్లగా బంగారు తొడుగులు తీస్తుంటే,  ఆ మాను క్రిందకంటా పుచ్చిపోయి ఉంది.                                     మరి ఎలా నిలబడింది ? 

ధ్వజస్థంభంపై నున్న  బంగారు తొడుగులు ఆధారంగా మాత్రమే. ...


పుచ్చిపోయిన ధ్వజస్థంభంతో స్వామికి సేవలా? … అపచారం జరిగిపోతోంది.  

నాకు ఆందోళన ... ఆదుర్దా ... ఆరాటం ... భయం ... 

రికార్డుల ప్రకారం చూస్తే, పాత మాను ఎప్పుడు పెట్టారో ఆధారాలు లభించలేదు... 

మాకు లభ్యమైన గత 180-190 సంవత్సరాల రికార్డ్సులో ఎక్కడా ఈ ధ్వజస్తంభం ప్రస్తావనే లేదు. అంటే ఇది ఎంతపాతదో? ఇప్పుడేమిటి చేయాలి? ... 


50-75 అడుగుల ఎత్తయిన టేకు మ్రానుని  సంపాదించి  ప్రతిష్టించాలి.  

ఆ మ్రానుకి తొర్రలు ఉండకూడదు. 

కొమ్మలు ఉండకూడదు. 

ఎలాంటి పగుళ్ళు వుండకూడదు.

దానికి వంపు ఉండకూడదు. నిటారుగా ఉండాలి. 

... నిస్పృహ వస్తోంది. ఇది జరిగేదేనా?  


అయినా ఆశ చావలేదు. క్షణాల మీద మన రాష్ట్ర ప్రభుత్వ అటవీశాఖ అధికారుల్ని సంప్రదించాను. ‘‘ఇలాంటి లక్షణాలుండే టేకు చెట్లు మన రాష్ట్రంలో దొరకడం అసాధ్యం’’ అని తేల్చారు. కర్నాటకలోగానీ, కేరళలోగానీ పడమటి కనుమల అడవుల్లో దొరకవచ్చు అని కూడా స్పష్టం చేశారు. 

... ఇవన్నీ వినేసరికి నాకు నీరసం వచ్చేసింది.  ఈ లోపల ధ్వజస్థంభం క్రింద నిధి ఉందని మీడియా మిత్రుల ప్రచారం !! 


ఒక నిర్వేదం చుట్టుముట్టేసింది... దిక్కు తోచని ఆ స్థితిలో ఆ శ్రీనివాసుడే శరణ్యం అనుకున్నాను…

అలా ఆలోచిస్తూనే ఆ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఇక ఆలయం నుండి బయల్దేర బోతుండగా, బెంగుళూరు నుంచి హెచ్‍. ఎస్‍. ఆర్‍. అయ్యంగార్‍ అనే భక్తుడు నాకోసం టెలిఫోన్‍ కాల్‍ చేశారు. అసహనంగానే ఆ ఫోన్‍ అందుకొని నేను మాట్లాడగానే, ఆయన ప్రవాహంలాగా చెప్పుకుంటూ పోతున్నాడు.... ‘‘అయ్యా, మీరు ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నారని రేడియాలో విన్నాను. అలాంటి ధ్వజస్తంభానికి మాను కావాలంటే కనీసం 280-300 సంవత్సరాల వయసున్న టేకు చెట్టు కావాలి. కర్నాటకలోని దండేలి అడవుల్లో మాత్రమే అది దొరికే అవకాశంవుంది.... ఇక్కడి అటవీశాఖ ఛీఫ్‍ కన్సర్వేటర్‍ నాకు చాలా మిత్రుడు.... మీరు అనుమతిస్తే, నేను నా మిత్రుడి సహాయంతో అడవుల్లో గాలించి అలాంటి చెట్టుని ఎంపిక చేయిస్తా. మీరు లాంఛనప్రాయంగా ఒక లెటర్‍ ఆయనకి వ్రాయండి. మిగతా సమన్వయం బాధ్యత అంతా నాకు వదిలేయండి…..’’


అంతే, మరుక్షణం నేను అక్కడే ఆలయంలో కూర్చునే, కర్నాటక ఛీఫ్‍ సెక్రటరీతో, ఛీఫ్‍ కన్సర్వేటర్ తో  లాంఛనప్రాయంగా టెలిఫోన్‍లో మాట్లాడి, వాళ్ళ హామీ కూడా తీసుకున్నాను. ఇదంతా అయ్యేసరికి రాత్రి 11 గంటలు దాటింది....  

……..

బెంగుళూరులో అయ్యంగార్‍ ప్రోద్బలంతో ఛీఫ్‍ కన్సర్వేటరూ, వారి సిబ్బందీ గాలింపు జరిపి, ఒక వందచెట్లు పరీక్షించాక, దండేలి ప్రాంతంలోని కొండవాలుల్లో ఒక పదహారు టేకుచెట్లు వరకూ మాకు పనికి రావచ్చని తేల్చారు. సరిగ్గా అదే వారంలో కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ గుండూరావు సకుటుంబంగా తిరుమలకు రావడం, నేను ఈ ధ్వజస్తంభం విషయం వారికి చెప్పడం, ఆయన వెంటనే ‘‘నూతన ధ్వజస్తంభం మానుని టిటిడికి కర్నాటక విరాళంగా తీసుకోండి’’ అని ప్రకటించడం జరిగిపోయాయి. 


ఆ వారాంతంలో నేను, మా ఇంజనీర్లతో కలిసి వెళ్ళి, అయ్యంగార్‍, ఛీఫ్‍ కన్సర్వేటర్‍ వెంటరాగా, ఆ 16 టేకు చెట్లు పరీక్షించాం. చివరకి వాటిల్లో మా కంటికి కనుపించినంతవరకు ఆరు చెట్లు మాత్రమే నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా వున్నాయి. వాటిల్లో రెండు మా అవసరానికి మించిన ఎత్తులో వున్నాయి. నేను టిటిడి అవసరాలు దృష్టిలో వుంచుకొని, మొత్తం ఆరు చెట్లూ మాకే కావాలన్నాను.


అద్భుతం ! బెంగుళూరుకు తిరిగివచ్చి, ముఖ్యమంత్రిని, ఛీఫ్‍ సెక్రటరీని కలిసి మాట్లాడితే, ఆ ఆరు చెట్లూ విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతే, చెట్లు నరకడం ఆరంభమైంది. కానీ అప్పుడే ఎదురైంది - మరో జటిలమైన సమస్య.... ఆ ఎత్తుపల్లాల అడవుల్లో కొన్ని కిలోమీటర్ల దూరం వస్తేగాని మెయిన్ రోడ్డు రాదు. అంతదూరం వాటిని మోసుకుంటూ తేవటం ఎలా ?


విచిత్రం! ఆ అడవిలో సోమానీ వారి పేపర్‍ మిల్లుకోసం కలప నరికే వాళ్ళకి తెలిసింది మా హడావుడి అంతా. ఆ మిల్లు యాజమాన్యం, సిబ్బందీ వచ్చేశారు. ‘‘అయ్యా! ఈ పని మాకు వదిలేయండి. ఇది శ్రీనివాసునికి మా సేవగా భావించండి’’ అంటూ ఆ కార్యభారం వాళ్ళు తలకెత్తుకున్నారు. ఇంక చెప్పేదేముంది. 


వారం రోజుల్లో చెట్లు నరకటం, వాటిని సోమానీ మిల్లు సిబ్బంది - తాళ్ళు, కప్పీలు, గొలుసులు వగయిరా సామగ్రి వుపయోగించి రోడ్డు మీదకు చేర్చటం పూర్తయిపోయింది. ఈ లోపల అయ్యంగార్‍ మళ్ళీ చొరవ తీసుకుని, ఒక 16 చక్రాలుండే పొడవాటి ట్రక్‍ని మాట్లాడాడు.

రెండురోజుల్లో ఆరుమానుల్నీ తీసుకుని ఆ ట్రక్‍ బెంగుళూరు వచ్చింది. అక్కడ విధానసౌధ దగ్గర చిన్న పూజా కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి వాటిని టిటిడికి విరాళంగా ఇస్తున్నట్లు లాంఛనప్రాయంగా ప్రకటించి, నా చేతికి అప్పగించారు. వేలాది ప్రజల సమక్షంలో జరిగిన ఆ అప్పగింతలో ఆ మానుల్ని తాకగానే అనిర్వచనీయమైన ఆనందంతో నా ఒళ్ళు పులకించింది. (ఎందుకలా?)....... 


ఆ మర్నాడు సాయంత్రం నాలుగు గంటలకే ట్రక్‍ తిరుపతి చేరుకుంది. వూరి బయట డెయిరీ ఫారం దగ్గర వేలాది స్త్రీ, పురుషులు గుమికూడారు. ఆ మానులు రాగానే హారతులిచ్చారు. ‘గోవిందా, గోవిందా’ అనుకుంటూ తన్మయత్వంతో నినాదాలు చేశారు. మరో గంటలో ఆ ట్రక్‍ ఘాట్‍ రోడ్డు మొదలుకి (అలిపిరి) చేరుకుంది. 

అక్కడిదాకా అంతా ఆనందమే. డ్రైవర్‍ ట్రక్‍ దిగాడు. కొండకేసి చూశాడు. ఘాట్‍రోడ్డు 18-19 కిలోమీటర్ల దూరం.... ఏడెనిమిది సంక్లిష్టమైన మలుపులు.... నా దగ్గరకు వచ్చాడు.


‘‘సర్‍, ఇది నా జీవితంలో ఒక గొప్ప సాహసం. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్‍ ఆపకుండా కొండమీదకు నడపగలగాలి. అలా నడిపితేనే నాకు సంతృప్తి. మధ్యలో ఘాట్‍రోడ్డు పిట్టగోడలు దెబ్బతినొచ్చు.... ట్రెయిలర్‍ తగిలి బండరాళ్ళు దొర్లిపడొచ్చు.... ఎన్నిరోజులు పడుతుందో తెలీదు. ఏమైనా కానీ, నేను ఇది చేసి తీరాలి.....’’ 

నేను హామీ ఇచ్చాను - ‘‘బండలు విరిగిపడినా, పిట్టగోడ కూలిపోయినా, నీకు బాధ్యతలేదు. అదంతా మేం చూసుకుంటాం....’’ (అక్కడికేదో అంతా మేమే చేస్తున్నట్లు, మా శక్తితోనే అంతా నడిచిపోతున్నట్లు ఆత్మవిశ్వాసం. నిజమా?)

ఈ లోపల తిరుమలకి వెళ్లే  ట్రాఫిక్ ని కూడా (క్రిందకి దిగే) పాత ఘాట్ రోడ్డు మీదకి మళ్లించాము.  


మొత్తంమీద ఆ సంధ్యా సమయంలో అరుణ కాంతుల వెలుగులో ఆ టేకుమానులు భగవంతుని ముంగిట్లో ధ్వజస్తంభాలుగా మారటం కోసం ఆ ట్రక్‍మీద ఘాట్‍ రోడ్డులో ప్రయాణం సాగించాయి....

భయపడినట్లుగానే ట్రక్‍ మలుపుతిరిగినప్పుడల్లా కొన్నిచోట్ల ట్రెయిలర్‍ పైన మానులు కొండని కొట్టుకుని బండలు పడ్డాయి...

కొన్ని మలుపుల్లో లోయవైపున్న పిట్టగోడకూలిపోయింది....

మరికొన్ని మలుపుల్లో ట్రెయిలర్‍ వెనకాల ఒకవైపు చక్రాలు పిట్టగోడని గుద్దేసి, లోయ మీంచి దూకేశాయి....

వెనకాల కారులో వెళ్తున్న నాకూ, మా ఇంజనీర్లకీ ఈ ఫీట్లు చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది. ఒకటి రెండు మలుపుల్లో సగం ట్రెయిలర్‍ లోయ అంచుమీంచి గెంతినట్లే అయింది.                            

‘‘ఆఁ ఆఁ..’’ అనుకుంటూ వెనకాల కార్లలో మేం ఆందోళనతో వూగిపోతున్నాం.

ఏ మలుపులో నయినా ట్రెయిలర్‍ క్రిందపడిపోతే.... ! ఇలాంటి ఆలోచనలు నాలో టెన్షన్‍ పెంచేస్తున్నాయి. క్షణాలు- నిముషాలు - గంటలు దొర్లిపోయాయి. "గోవిందా ... గోవిందా ..."

... గంటలు కాదు.   ఒక గంట దొర్లేలోపలే, అంటే 55 నిమిషాల్లోనే ఫీట్లు చేసుకుంటూ, మా సంభ్రమాశ్చర్యాలమధ్య ధ్వజస్తంభాల మానులతో ట్రక్‍ తిరుమలకి చేరిపోయింది. 


ఒక్కసారిగా వందలాది భక్తులు, టిటిడి ఉద్యోగులు ఆనందోత్సాహాలతో చేస్తున్న ‘‘గోవిందా-గోవిందా’’ పిలుపులతో తిరుమల గిరులు ప్రతిధ్వనించాయి.

నా కళ్లని నేనే నమ్మలేకపోతున్నాను.

నాలో ఆనందపు అలలు పొంగి ఆకాశాన్ని తాకుతున్నంత ఉద్వేగం కలిగింది. నాకు తెలీకుండానే నా కంట్లోంచి ఆనంద (భక్తి) బాష్పాలు రాలుతున్నాయి. ఆ ఆనంద రసానుభూతిలో కొన్ని క్షణాలపాటు చేష్టలుడిగి అలా వుండిపోయాను!!


ఏమిటా అద్భుతం! సూర్యాస్తమయం ఆరంభమయ్యే సమయంలో అలిపిరిలో బయల్దేరిన ట్రక్‍, సూర్యుడు పశ్చిమాద్రిన పూర్తిగా అస్తమించే సమయానికి కొండకి చేరిపోయింది. ఇంకా విచిత్రం, ట్రక్‍ యజమాని మా వెనకాలే కారులో వచ్చి నమస్కారం పెడుతూ అన్నాడు - ‘‘స్వామి వారికి ఇంత గొప్ప సేవ చేసే అవకాశం లభించడం నా అదృష్టం. అందుకే నేను ఒక్క నయాపైసా కూడ రవాణా ఛార్జీలు తీసుకోవటం లేదు’’. (అతనికా ప్రేరణ ఎక్కడ్నుంచి కలిగింది?) 


- అయ్యంగార్‍ ని, ట్రక్‍ యజమానిని, డ్రైవర్‍ ని వేదపండితుల ఆశీర్వచనాలమధ్య, ప్రత్యేక దర్శనంతో, శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించాం. 


మరి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం ఎలా? ఎలా? - అలా రోజంతా నేనూ, మా ఇంజనీర్లు, అధికారులూ తలలు బద్ద్లయ్యేలా అర్ధరాత్రిదాకా చర్చలు జరిపి, ఇక జరిపే శక్తిలేక మర్నాటికి వాయిదా వేసుకుని వెళ్లిపోయాం. నాకు ఒక పట్టాన నిద్ర రాలేదు. మూడు వారాల పాటు అష్టకష్టాలు పడి టేకు మానులు తీసువచ్చాక, వాటి ప్రతిష్ఠ ఎలా చేయాలీ అన్నదానిమీద ఇంత తర్జనభర్జన ఎందుకు జరుగుతోంది? ఇంతమంది ఇంజనీర్లు, మేధావులం కలిసి కూడా ఈ చిన్నపని చేయలేకపోతున్నామా? ఎందుకు చేయలేకపోతున్నాం... ? 

అలా ఆలోచిస్తుంటే, అప్పుడే మళ్లీ స్ఫురించింది - ‘‘ఏ శక్తి ఇంతపని చేయించిందో, ఆ శక్తి మిగతా పనికూడా చేయించదా?... ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేసే ప్రాప్తం నాకుంటే నా చేతుల మీదుగా జరుగుతుంది. లేకపోతే లేదు..’’ 


ఈ ఆలోచన రాగానే మనసు కుదుటపడింది. ప్రశాంతంగా నిద్రపోయాను. 

అందుకు భిన్నంగా జరగలేదు. ఉదయం చర్చల్లో కూర్చున్న కొద్దిసేపట్లోనే ఎవరో అన్నారు - ‘‘ఎందుకండీ ఇదంతా, మానుని మహద్వారంలోంచి మోసుకువచ్చేటప్పుడే దాని తలభాగం వీలైనంత ఎత్తుకి లేపి వుంచుతూ, మొదలు భాగం నేలమీదకే వుంచుతూ, ఏతాం ఆకారంలో తీసుకువద్దాం. అది సరిగ్గా మంటపం క్రిందకు వచ్చేసరికి, దాన్ని ఆ రంధ్రంలోంచి పైకి దోపుదాం. మన పాపనాశనం డామ్‍ కడుతున్న ఇంజనీరింగ్‍ సిబ్బంది, అక్కడి కళాసీల సహాయం తీసుకుందాం..’’- 


బ్రహ్మాండమైన ఆలోచన. (ఎక్కడిదీ ప్రేరణ?) ఆగమేఘాల మీద ఇంజనీర్లు కొలతలు వేసి, మహద్వారంలోపల్నుంచి బలిపీఠం వరకు నేలని లోతుగా తవ్వుకుంటూ వెళితే, ఈ ప్లానుని అమలు చేయటం సాధ్యమవుతుందని తేల్చారు. పైగా మహద్వారానికీ, బలిపీఠంకీ మధ్య ఎంత తవ్వినా, ఏం చేసినా యాత్రికుల వరుసలకి  ఏమాత్రం అవరోధం వుండదనికూడా స్పష్టం చేశారు. 

ఇంక ఆలస్యం చేయలేదు. ముహూర్తం చూసి, హెచ్‍సిఎల్‍ ఇంజనీరింగ్‍ సిబ్బంది, కళాసీల సాయంతో ధ్వజస్తంభానికి ఎంచుకున్న టేకు మానుని సన్నిధి వీధిలోంచి, గొల్లమండపంలోంచి, మహద్వారంలోంచి ఆలయంలోకి ప్రవేశపెట్టాం. అక్కడ్నుంచి మానుశిఖర భాగం మంటపం పై కప్పును చూస్తూ లేచేలా ఎక్కడికక్కడ సర్వే బాదులతో స్టాండ్‍లు ఏర్పాటు చేశారు. మెల్లగా కళాసీలు మానుని ముందుకు తోస్తుంటే, అది అలా అలా లేచి సరిగ్గా మంటపం పై కప్పులో రంధ్రాన్ని క్రిందనుంచి చేరుకుంది. మహద్వారం దగ్గర్నుంచి బలిపీఠం దాకా నేలమీద గోతిలో మాను మొదలుని ముందుకు తోసుకు వెళ్తుంటే, ఇంజనీర్ల నైపుణ్యం ఫలించి, ఆ మాను శిఖరం మంటపం పైన రంధ్రం లోంచి పైకి, ఆకాశాన్ని చూస్తూ లేచి నిటారుగా నిలబడింది. మంటపం ఏ మాత్రం దెబ్బతినకుండా ఆ సాయంత్రానికల్లా దండేలీ అడవుల్లోని టేకుచెట్టు తిరుమలేశుని ఆలయంలో ధ్వజస్తంభంగా ప్రతిష్ఠకు సిద్ధంగా నిలబడింది. 

అద్భుతం ! … ఏమా శ్రీనివాసుడి కరుణ….. ?


అప్పుడే ఓ చిన్న కొసమెరుపు !  

ధ్వజస్తంభం క్రింద శాస్త్రానుసారంగా నవరత్నాలు, నవ ధాన్యాలు వగైరా వుంచాలన్నారు. అవి రెండు పెట్టెల్లో పెట్టి ధ్వజస్తంభం క్రింద పునాది భాగంలో పెట్టాం. అకస్మాత్తుగా నాకు ఏదో తోచింది. వెంటనే నా మెడలో శ్రీనివాసుని డాలర్‍తో వున్న గోల్డ్ చైన్‍ తీసి ఒక పెట్టెలో వేశాను. క్షణాల్లో చుట్టూ చేరివున్న అర్చకులు, మిరాసీదార్లు, విఐపిలు, ఇతర భక్తులు కూడా ముందుకు వచ్చారు - శ్రీవారి ధ్వజస్తంభానికి తమ భక్తి పూర్వక బహుమానం ఇవ్వటానికి. అంతే! ఉంగరాలు, చైన్‍లు వగయిరా ఆభరణాలతో మరో పెట్టె నిండిపోయింది. అలా ఆ పెట్టెల్ని నిక్షిప్తం చేసి, వాటిపై కాంక్రీట్‍ పోశాక, దానిపైన ధ్వజస్తంభాన్ని సరిగ్గా 90 డిగ్రీల కోణంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపజేశాం. (పాత ధ్వజస్తంభం మానుని పాపనాశనం డామ్‍లో వేదోక్తంగా విశ్రమింపజేశాం) ఒక నెల రోజులకి నూతన ధ్వజస్తంభానికి ప్లాట్‍ఫారమ్‍ నిర్మాణం, పైన బంగారు ప్లేట్లు తొడగటం, శిఖర భాగాన పతాకాన్ని నిలబెట్టడం, ధ్వజస్తంభానికిముందు బలిపీఠం నిర్మించడం పూర్తయ్యాయి. 


ఒక మినీ బ్రహ్మోత్సవం తలపెట్టి (మిగతా అన్ని మరమ్మతులు, బంగారు ప్లేట్లకు మెరుగు పెట్టడాలు వగయిరా అన్నీ పూర్తిచేశాక), ఆ బ్రహ్మోత్సవంలో భాగంగా ఆస్థాన పండితుల ఆశీర్వచనాల మధ్య, వేద మంత్రోచ్చారణలతో తిరుమల గిరులు ప్రతిధ్వనిస్తుండగా 1982 జూన్‍ 10న ధ్వజస్తంభాన్ని, బలిపీఠాన్ని పవిత్రం చేశారు. 

ఇది జరిగిన ఆరో రోజున (జూన్‍ 16న) నేను మరొకరికి పదవీబాధ్యతలు అప్పగించి, బదిలీ అయి వెళ్లిపోయాను. 


ఆ ఉదయం అలా బదిలీ అయి వెళ్లిపోతూ, దండకారణ్యం నుంచి వచ్చి ఆలయంలో స్థిరపడిన టేకు చెట్టు (ఇప్పుడది ధ్వజస్తంభం) కేసి చూశాను. పతాక భాగంలో గంటలు నన్ను చూసి పలకరిస్తున్నట్లుగా చిరు సవ్వడులు చేస్తూ వూగుతున్నాయి. ఏదో వింత అనుభూతి ...! 


అక్కడే వున్న ఒక వృద్ధ పండితుడు చిరునవ్వు నవ్వి, ఒక శ్లోకం చదివారు : 

‘‘నాహం కర్తా హరిః కర్తా

తత్పూజా కర్మ చాఖిలం

తదాపి మత్కృతా పూజా

తత్ప్రసాదేన నా అన్యథా’’


“నేను కాదు కర్తని. చేసేది చేయించేది అంతా ఆ శ్రీహరే. నా ద్వారా ఏ సత్కార్యం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరేమీ కాదు.”


Pvrk prasad

 ------- -———— ————-  ఈ సంఘటన జరిగి సరిగా 40 సంవత్సరాలు June 10, 1982