శ్లోకం:☝️
*మిత్రే నివేదితే దుఃఖే*
*దుఃఖినో జాయతే లఘు |*
*భారం భారవహస్యేవ*
*స్కన్ధయోః పరివర్తతే ||*
భావం: భుజం మీద బరువు మోసేవాడు ఆ బరువును రెండు భుజాల మధ్యకు మార్చుకుంటే భారము కొంచం తగ్గినట్టుగా, మంచి మిత్రునికి బాధ చెప్పుకుంటే ఆ బాధపడేవాని మనసు తేలికపడి ఉపశమనము కలుగుతుంది.
అనగా... మన దుఃఖాన్ని (బాధలను, కష్టాలను) మన ఆత్మీయులకు (మిత్రులు, బంధువులకు) చెప్పుకుంటే మనసు తేలికపడి కొంత ఉపశమనము కలుగుతుంది అని భావము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి