20, జులై 2023, గురువారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 120*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

. ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 120*


🔴 *రాజనీతి సూత్రాణి - ప్రథమధ్యాయము* :

‘’

📕 *నీతి శాస్త్రప్రయోజనం, రాజు, శత్రువు, మిత్రులు* 📕


1. తచ్చ రాజ్యతంత్రసమాయత్తం నీతిశాస్త్రేషు (రాజ్యంతంత్రం అంతా నీతి నీతిశాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది.) 


2. రాజ్యతంత్రెన్ష్యాత్తౌ తంత్రాన్వాపౌ (తంత్రావాపాలు రెండూ రాజ్యతంత్రం మీద ఆధారపడి ఉంటాయి. తన రాష్ట్రంలో జరిగితే వ్యవహారం తంత్రం. పరరాష్ట్రంలో జరిగేది ఆవాపం.) 


3. తంత్రం స్వవిషయకృతేష్వాయత్తమ్ (తన రాజ్యావ్యవహారాలకు సంబంధించినది. తంత్రం.) 


4. ఆవాపో మండనివిష్ట (ఇతర రాజ్యాలకు సంబంధించినది ఆవాసం.) 


5. సంధివిగ్రహయోనిర్మండలః (సంధికి గాని విగ్రహానికి గాని కారణమైనది "మండలం".) 


6. నీతిశాస్త్రానుగో రాజా (నీతిశాస్త్రాన్ని అనుసరించేవాడే రాజు.) 


7. అనంతరప్రకృతిః శత్రుః (సరిహద్దురాజ్యం రాజు శత్రువు.) 


8. ఏకాంతరితం మిత్రమిష్యతే 

(మధ్య ఒక రాజ్యం అడ్డున్న రాజ్యానికి రాజైనవాడు మిత్రుడు. వీళ్లిద్దరూ సహజ శత్రుమిత్రులు.) 


9. హేతుతః శత్రుమిత్రే భవిష్యతః (చిన్నకారణాన్న పట్టి కూడా శత్రువులు, మిత్రులూ అవుతుంటారు.) 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

అప్పారావు మీద జోకు

 ✍ హలో కులాసా" అన్నాడు అప్పారావు

 " అరె, మళ్ళీ ఎలా వచ్చావురా; నువ్వా మధ్య చచ్చిపోయావుగా, మళ్ళీ

 ఎలా వచ్చావు? నువ్వు చావలేదా?" అన్నాడు రెడ్డి జేబు గట్టిగా పట్టుకొని.

 "చావకేం నిక్షేపంలా చచ్చాను. నా దహనానికి దానికీ నువ్వేగా అప్పిచ్చావు

 మా అన్నయ్యకి"

 " మరి, మరి మళ్ళీ ఎలా వచ్చావు?"

 "నేను రాలేదు. నువ్వే వచ్చావు..నువ్వు చచ్చిపోయి గంటయ్యింది" అన్నాడు

 అప్పారావు.

 ( ముళ్లపూడి వారు అప్పారావుమీద చెప్పిన భలే జోకు)


♦..

గువ్వలచెన్నా

 

. కుడి యెడమల కీర్తి గన్న గువ్వల చెన్నా!

క. అనుభవము లేని విభవము లను

భావ్యయ కానీయాలు నార్యాను మతిన్

గనని స్వభావము ధర్మముఁ

గొనని సిరియు వ్యర్థ మెన్న గువ్వలచెన్నా!


క. అడుగునకు మడుఁగు లిడుచును

జిడిముడి పాటింత లేంక చెప్పిన పనులున్

వడిఁజేసి నంత మాత్రాన

కొడుకగునా లంజకొడుగు గువ్వలచెన్నా!


క. వెలకాంత లెందజైననుఁ

గులకాంతకు సాటిరారు కువలయమందున్

బలువిద్య లెన్ని నేర్చినఁ

గులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా!


క. నీచునకు ధనము గల్గిన


వాచాలత గల్గి పరుషవాక్కు లఱచుచున్


నీచ కృతి యగుచు మది


సంకోచము లేకుండఁదిరుగు గువ్వలచెన్నా!

నవ గ్రహముల

 *🕉️ నవ గ్రహముల జననము 🕉️*


1) సూర్యుడు : శ్రీ కశ్యప  బుషికి దక్షుని పుత్రికయగు అదితికిని "వివస్వంతుడు (సూర్యుడు)" జన్మెంచెను(ప్రభవ నామ సంవత్సర మాఘ మాస శుద్ద సప్తమి)కశ్యపుని కొడుకు కనుక "కాశ్యపుడు" అని 

అదితి కొడుకు కనుక "ఆదిత్యుడు" అని

అండమున మృతము లేనివాడు కనుక "మార్తాండుడు" అని నామములు వచ్చెనుసూర్యునకు సంజ్ఞాదేవికిని "వైవస్వతుడు" "యముడు" "యమున" లు జన్మించెను

సూర్యుని తీక్షతను భరించలేక సంజ్ఞాదేవి తన నీడను (ఛాయను) తనకు బదులుగా వెల్లి పుట్టింటికి వెల్లిపోయెను

తరువాత ఛాయకు "శని" భగవానుడు జన్మించెనుయముడు ధర్మరాజు అను నామముతో పితృలోకపాలకుడయ్యెను శని గ్రహ పదవిని పొందెను

వైవస్వతుడు రాబోవు మన్వంతరాలలో మనువు కాగలడు


2) చంద్రుడు : అత్రి మహర్షి అనసూయల సంతానం

అత్రి మహర్షి తపస్సు చేయుచుండగా అతని వీర్యము భూమిపై పడెను సోమరూపైన వీర్యమును బ్రహ్మ లోక హితార్థమై తన రథమెక్కించుకొని భూమి చుట్టు ఇరవైఒక్క మారలు ప్రదక్షిణలు గావించెను ఆయన తేజస్సుచే జగదాధారభూతములైన సర్వౌషదులు మొలకెత్తెను(నందన నామ సంవత్సర కార్తీక శుద్ద చతుర్థశి)సోముని బ్రహ్మ భూమికి రాజును చేసెను

చంద్రుని పుత్రుడు బుధుడు


3) కుజుడు : శివుని నిండి వెలువడిన తేజము పార్వతీ దేవి గ్రహించి గర్భవతి అవగా ఆమే అఆ తేజమును భరింపలేక భూదేవికి ఇచ్చెను ఆమే ఆ తేజమును ధరింపగా "కుజుడు"(అంగారకుడు) జన్మించెను(అక్షయ నామ సంవత్సరం వైశాఖ బహుళ విదియ)రుద్రుని తేజము విష్ణువు సంరక్షణ భూదేవి ఓర్పు లభించినవాడు కనుక గ్రహమండలమున స్థానమునొందెను


4) బుధుడు : సోమునకును రోహిని తారకు బుదుడు జన్మించెను(సౌమ్య నామ సంవత్సరం భాద్రపద శుద్ద ఏకాదశి)బుదునికి వైరజకిని పురూరవుడు జన్మించెను


5) బృహస్పతి : సురూప ఆంగీరసులకు "బృహస్పతి" జన్మించెను(సౌమ్య నామ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ద ద్వాదశి)ఇతని భార్య "తారాదేవి" ఇతడిని దేవతలకు గురువుని చేసెను కనుక ఇతడిని"గురుడు" అనెదరు


6) శుక్రుడు : భృగు ప్రజాపతికిని ఉషనలకు సంతానం

"ఉశనుడు" జన్మించెను(మన్మథ నామ సంవత్సరం శ్రావణ శుద్ద దశమి)కుచేలుని ధనమును హరించుటచే పరమేశ్వరుడు కోపించి అతడిని చంపుటకు రాగా ఉశనుడు తన యోగ శక్తితో శివుని ఉదరమున ప్రవేశించెను పరమేశ్వరుడు అతడినొ శిశ్నము ద్వార బయటకు విడిచెను అతడు శుక్రము రూపమున విసర్జింపబడెను కనుక అతడిని "శుక్రుడు" అనెదరుఅత్యంత మహా మంత్ర శక్తిని పోందినవాడు కనుక రాక్షసులు శుక్రుడిని వారి గురువుగా పొందిరి

నాటి నుండి "శుక్రచార్యునిగా" పెరుపొందెను

గ్రహమండలమున స్థానంపొందెను


7) శని : సూర్యునికి ఛాయ దేవికిని కలిగిన సంతానమే "శని" ఇతని వృత్తాంతంము సూర్యుని వృత్తాంతమునందు చెప్పబడెను(వికారి నామ సంవత్సరం మార్గశిర కృష్ణ నవమి)ఇతడు మానవ జీవితాలలో అత్యంత ప్రభావము చూపువాడు

త్రిమూర్తుల సైతం ముప్పుతిప్పలు పెట్టినటువంటివాడు

గ్రహమండలమున స్థానం పొందెను


8) రాహువు : కశ్యప మహర్షికి సింహికకును "రాహువు" జన్మించెను ఇతడు రాక్షల లక్షణములు కలవాడు కనుక రాక్షసునిగా పరిగణిస్తారు(రాక్షస నామ సంవత్సరం కృష్ణ చతుర్థశి)క్షీర సాగర మథనంలొ లబించిన అమృతాన్ని మహావిష్ణువు "మోహిని"అను రూపముతో పంచుతున్నపుడు రాహువు దేవతల రూపం దాల్చి అమృతమును గ్రహించెను సూర్యచంద్రులు చూసి విష్ణువుకి చెప్పగా తన చక్రముతో రాహువు తల ఖండించెను అమృత ప్రభావంతో తల మొండెము జీవముతో ఉండుటచేత పాము శరీరం అతకబడింది


9) కేతువు : విష్ణువుచే ఖండింపబడిన రాహువు శరీరముకు పాము తల తగిలించి కేతువు అని నామం పెట్టిరి ఇతని భార్య పేరు చిత్రలేఖరాహు కేతువులు ఇరువురు గ్రహమండలమున ఛాయగ్రహములుగా గుర్తింపునొందిరి...


నవ గ్రహ దేవతల జన్మ వృత్తాంతములు చదివిన ఆపదలు తొలిగి మహా యశస్సు పొందెదరు

ఆయుష్యు ఆరోగ్యం సంకల్ప సాఫల్యము కలుగును

నవ గ్రహముల అనుగ్రహము కలిగి సర్వత్రా శుభమగును.

(అని బ్రహ్మ పురాణమందు చెప్పబడెను).

మంత్రజపం

 *మంత్రజపం-అందలి దోషాలు*


హరితత్త్వ ధేథితి అన్న గ్రంథంలో మంత్రాలకు ఎనిమిది రకాల దోషాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది.  అవి అభక్తి, అక్షరభ్రాంతి, లుప్తత, ఛిన్నత, హ్రస్వత, దీర్ఘత, కథనము, స్వప్నకథనం 


*1.అభక్తి:-* ఒక గురువు ఇచ్చిన మంత్రాన్ని మరొక గురువు దగ్గరకు తీసుకొని వెళ్ళి చూపించిండం, ఆ గురువేమో ఇంతకంటే గొప్ప మంత్రం  నేను ఇస్తాను అని వేరొక మంత్రం ఇవ్వడం! మొదలైన దోషములే అభక్తి. గురువు ఇచ్చిన మంత్రాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. అజ్ఞానం వలన, అతి ఉత్సాహం వలన శిష్యులు అలా వేరొక గురువు వద్ద చెప్పినా ఆ గురువు ఆ మంత్రాన్ని తరచి తరచి చూడకూడదు. అదే అభక్తి. గురువు యందు మంత్రం యందు భక్తి లేకపోవడమే ఇంకొకరి వద్దకు వెళ్ళడం. 


*2.అక్షరభ్రాంతి:-* గురువు గారు "ఓం హ్రీం ఓం" అని మంత్రం ఇచ్చారు. అయితే శిష్యుడికి అది సరిగా వినబడకపోవడం వలన "ఓం శ్రీం ఓం" అనుకున్న . అదే అక్షరభ్రాంతి. ఈ విధమైన అక్షరభ్రాంతి లేకుండా ఉండటం కోసమే గురువు జాగ్రత్తలు తీసుకోవాలి. 


*3.లుప్తత:-* గురువు గారు "శ్రీరామ చంద్ర పరబ్రహ్మణే నమః" అని మంత్రం ఇస్తే శిష్యుడు "శ్రీ రామ బ్రహ్మణే నమః" అని జపం చేస్తాడు. అంటే గురువు ఇచ్చిన మంత్రం సరిగా జ్ఞాపకం పెట్టుకోక పోవడం వలన ఇలా జరుగుతుంది. దీని గురించి మళ్ళీ గురువును అడగలేడు. ఇది న్యూనత లోపం వలన జరుగుతుంది. అసలు మంత్రం మర్చిపోయి సొంత కవిత్వం పెట్టడం లుప్తత. కొన్ని తగ్గించి, కొన్ని తీసేసి, కొన్ని వదిలిపెట్టి మంత్రాన్ని ఉఛ్ఛరించడం లుప్తత. 


*4.ఛిన్నత:-*  వత్తులు ఉండవలసిన చోట వత్తులు లేకుండా పలకడం ఛిన్నత. ఉదాహరణకు ఛిన్నమస్తా అనవలసిన చోట చిన్నమస్తా అని పలకడం ఛిన్నత.


,*5.హ్రస్వత:-* ధీర్ఘం ఉండ వలసిన చోట దీర్ఘం తీసివేసి హ్రస్వంగా పలకడం హ్రస్వత . ఉధా :  ఓం రాం రామాయ నమః అనడానికి బదులు | ఓం రం రామాయ నమః| అని పలకడం.


*6.దీర్ఘత:-* హ్రస్వంగా పలకవలసిన చోట దీర్ఘాన్ని చేర్చడం ఉదా : ఓం నమః శివాయ అనవలసిన చోట ఓం నామా శీవాయా అనడం. 


*7.కథనం:*- గురువు ఇచ్చిన మంత్రాన్ని ఇతరుల వద్ద చర్చించడం లేక ఆ మంత్రాన్ని వేరొకరికి చెప్పడం, లేక ఇంకో గురువు వద్ద ఆ మంత్రాన్ని గురించి అడగటం మొదలైనవి కథనం కిందకి వస్తాయి. మంత్రం గురు శిష్యుల మధ్యనే ఉండాలి తప్ప మూడో వ్యక్తికి చెప్పకూడదు. 


*8.స్వప్న కథనం:-* గురువు ఇచ్చిన మంత్రాన్ని జపం చేస్తూ చేస్తూ అలాగే నిద్రలోకి జారిపోయి ఆ నిద్రలో కలవరిస్తూ ఉంటారు కొంత మంది. లేకపోతే కలలో బయటకు చెప్పేస్తారు. అదే స్వప్న కథనం ఇది కూడా దోషమే.



హర హర మహాదేవ శంభో శంకర

మనసంస్కృతి

 మనసంస్కృతి సకలశ్రేయోకాంక్షి!


సర్వే భవంతు సుఖినః

సర్వే సంతు నిరామయా

సర్వే భద్రాని పశ్యంతు

మా కశ్చిధ్తుఃఖభాగ్భవేత్....


భావము :

              అందరూ సంతోషముగా ఉందురు గాక, అందరూ ఆరోగ్యవంతులు అగుదురు గాక! అందరూ శుభములనే అనుభవింతురు గాక, ఎవ్వరూ బాధపడకుందురు గాక...


                 ఈ శ్లోకము శాంతి శ్లోకము. మన జీవితం సమాజంతో ముడిపడి వున్నది. మనము సంతోషముగా వున్నా ఎదుటివారి కష్టములో ఉన్నా, దుర్మార్గులుగా ఉన్నా మనము శాంతిని కోల్పోతాము. శాంతి పోయి భయము వస్తుంది.    

            మన భారతదేశ సంస్కృతి మనకు నేర్పేది ఇది. అదే "వసుదైక కుటుంబము" అందరూ సుఖ శాంతులతో, క్షేమంగా , శాంతితో జీవించటము. ఇలా అందరి మంచి కోరుకోవటం వలన మనస్సు యొక్క సంకుచిత తత్వం పోయి విశాలమవుతుంది. అపుడు మనకు తెలియకుండానే సమస్త లోకా: సుఖినోభవంతు అనే భావన మనలో కల్గుతాయి.


ఇదిసనాతన ధర్మానికి, భారతీయ సమాజ విలువలకు పట్టు గొమ్మ🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

నన్నయగారి నాటకీయత !

 శుభోదయం🙏


శు భో ద యం🙏🙏


నన్నయగారి  నాటకీయత ! 


             ఉ:  ధారుణి  రాజ్య సంపద  మదంబున  కోమలి కృష్ణఁ  జూచి ,రం


                    భోరు  నిజోరుదేశమున  నుండగఁ బల్చిన  నిద్దురాత్ము    దు


                    ర్వార  మదీయ  బాహు పరివర్తిత  చండ  గదాభిఘాత   భ


                    ఘ్నోరుతరోరుఁ జేసెద ,సుయోధను  నుగ్ర   రణాంతరంబునన్ !


                       ఆం:మ: భారతము--సభాపర్వము-- నన్నయ భట్టారకుఁడు.


                     ఇది నన్నయగారి పద్యరత్నం. మాయాజూదంలో  పాండవుల నోడించి  వారిధర్మపత్ని  పాంచాలి ని వస్త్రాపహరణోద్యోగమునపరాభవింప

ప్య

యత్నించు నపుడామె "నన్ను రక్షింపగలవారెవ్వరు సభలోలేరా" యనివిలపిం ప సాగినది. ఆయదనున  సుయోధనుడు తనయూరువుల

నధిష్ఠింపుమని ద్రౌపదికి సైగచేసెను. అదిజూచి  మహా కృధ్ధు డై  భీముడు పైవిధముగా  ప్రతిజ్ఙయొనరించెను. 


                    భావము: రాజ్య సంపద మదంతో  ఉచితానుచితములెరుంగక  అసహాయురాలగు  ద్రౌపదిని  తనతొడపై కూర్చుండుటకు ఆహ్వానించిన  దుర్మార్గుడైన యీదుర్యోధనుణ్ణి  రాబోయే  భారతయుద్దంలో ప్రచండమైన  నాగదాభిఘాతములతో

తొడలు  ముక్కలగునట్లుసేతునుగాక!  అని భీకరమైన  ప్రతిజ్ఙచేసెను.


                        పైపద్యము  వీర రౌద్ర  భయానక  రసములకు ప్రతీకయై  భీముని కోపావేగమునకు అద్దముపట్టినది.


                         నాటకము  దృశ్యప్రబంధము పాత్రచిత్రణము ,వాచకము  ఆహార్యము  అభినయములు  నాటకీయతలోని భాగములు. భీముని మహారౌద్రమూర్తిగా  చిత్రించి , ఆవెనుక  నాతనికి తగిన  మాటలను  ఆరభటీవృత్తిలో సమకూర్చి, గదత్రిప్పుట,మొన్నగు(కన్నులెర్రబడుట  కటములదరుట :మొ ) అభినయమును సమకూర్చి," దుర్వార మొదలుగా దీర్ఘసమాస ఘటనముచే రసానుకూలమును రాగానుకూలముగను (మారు నట్లు) రచించి  నాటకీయతకు ప్రాణముపోసెను. నిపుణుడైన నటునిచే

నీపద్యమును జదివించిన చక్కగా రంగస్ధలపద్యమువలె రాణింపక మానదు. 


                          ఈవిధముగ  యెడ నెడ  నన్నయగారుకూడ  తనభారతమున  నాటకీయతకు స్థానమును కల్పించి తన రచనా

సామర్ధ్యమును  అభివ్యక్త మొనరించెను.


                                                                     స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శ్లోకానికి మంత్రానికీ తేడా

 శ్లోకానికి మంత్రానికీ తేడా ఏమిటి?


మంత్రానికి కనీసం నాలుగు రకాలుగా అర్థం చెప్పుకోవచ్చు.


· వేదాలలో ... మొత్తం ఋగ్వేదం ఎనిమిది అష్టకాలు లేదా పది మండలాలుగా విభజించబడింది. ఆ ఒక్కొక్క మండలం లేదా అష్టకం కొన్ని సూక్తాలుగా విభజించ బడ్డాయి. ఆ ఒక్కో సూక్తానికి విడివిడిగా దేవత, ఛందస్సు, ఋషి, వంటి కొన్ని లక్షణాలు చెప్పారు. ఆ విధంగా ఏర్పరచిన సూక్తాలలోని అతి చిన్న విభాగాన్ని ఋక్ లేదా ఋచ్ అంటారు. ఆ ఋక్కులకే మరో పేరు మంత్రం. అదే విధంగా యజుర్వేదంలో యజుస్సులు, సామవేదంలో సామలు వుంటాయి. వీటినే వేదం మంత్రాలు అంటారు.


· దైవారాధనలో ... ఏదైనా వ్యక్తిగత దేవతను ఉద్దేశించిన పవిత్ర అక్షర/శబ్ద సూత్రం. ఉదా. ఓం విష్ణవే నమః, ఓం శివాయ నమః.


· తంత్రశాస్త్రంలో ... ఒక ఆధ్యాత్మిక పద్యం లేదా మాంత్రిక సూత్రం (కొన్నిసార్లు వ్యక్తీకరించబడింది), మంత్రం, ఆకర్షణ (spell) (ఉదా. ఆధునిక కాలంలో మానవాతీత శక్తులను పొందేందుకు శక్తి ఉపాసకులు ఉపయోగించారు; ప్రాథమిక మంత్రాలు సంఖ్య 70 మిలియన్లు మరియు ద్వితీయ అసంఖ్యాకమైనవి).


· రాజనీతి, ఇతర రంగాలలో ... సంప్రదింపులు, తీర్మానం, వ్యక్తిగత సలహా, ప్రణాళిక, ప్లాన్, రహస్యం, మొదలైనవి. రాజులకు మంత్రులు, గూఢచారులతో చర్చలు, సమావేశాలు జరపడానికి ఆలోచనా మందిరం లేక మంత్రాలయం అనే ప్రత్యేక సమావేశ మందిరాలు వుండేవి.


శ్లోకం అనగా ఒక ప్రత్యేకమైన ఛందస్సు (అనుష్టుప్) లక్షణాలు కలిగిన ఒకరకమైన సంస్కృత పద్యం. దీనిలో 8 అక్షరాలు కలిగిన నాలుగు పాదాలు లేదా 16 అక్షరాలు కలిగిన రెండు వరుసలు వుంటాయి. ప్రతి పాదంలో 5, 6 మరియు 7వ అక్షరాలకు లఘు/దీర్ఘ అక్షర నియమాలు వుంటాయి.


ఋగ్వేదంలో, రామాయణంలో, భగవద్గీతలో చాలా పద్యాలు ఈ శ్లోక ఛందస్సులోనే వున్నాయి.


కానీ ఈ కాలంలో ఏ ఛందస్సులోనున్న పద్యాన్నైనా సరే సామాన్య పరిభాషలో శ్లోకం అని వ్యవహరిస్తున్నారు.


శ్లోకాన్ని ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అనే నియమేమీ లేదు. అన్ని రకాల విషయాలకూ వాడుతున్నారు.


మంత్రాలు, శ్లోకాలు, (శ్లోకాలు కాని) పద్యాలకూ ఉన్న సంబంధం ఈ క్రింది విధంగా చూపవచ్చు.



సంస్కృతంలో ‘కాదంబరి’ అనే ప్రముఖ గద్య కావ్యం వుంది. చాలా పెద్ద కావ్యం. దాని పరిమాణాన్ని చెప్పడానికి కూడా అందులో పద్యాలు లేకపోయినా సరే xxxx శ్లోకాలు వున్నాయి అని చెబుతారు. (ఒక శ్లోకంలో మొత్తం 32 అక్షరాలు వుంటాయి కాబట్టి, ఆ గద్య కావ్యంలోని మొత్తం అక్షరాల సంఖ్యను 32 తో భాగించగా వచ్చిన సంఖ్య xxxx).

తండ్రిని సేవించడమే ధర్మము

 .                      🕉️

             _*.                      🕉️

             _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*పితాధర్మః పితాస్వర్గః*

*పితా హి పరమంతపః౹*

*పితా ప్రీతి హి మాపన్నే*

*సర్వాః ప్రీయన్తి దేవతాః॥*


తా𝕝𝕝 తండ్రిని సేవించడమే ధర్మము... తండ్రిని సర్వవిధముల సుఖింపజేయడమే స్వర్గం... ధర్మవర్తనుడైన తండ్రిని అనుసరించడమే తపస్సు... తండ్రిని ప్రసన్నముగా ఉంచితే సమస్తదేవతలు మనకు ప్రసన్నులు అవుతారు.


తండ్రిసేవె సుతుని ధార్మికధర్మమ్ము

సతత తండ్రిసుఖమె స్వర్గ మరయ

తండ్రి అడుగుజాడె తపమగు సుతునకు

అరయ తండ్రి తృప్తి సురల తృప్తి

.

విలువైన జీవితాలను

 పిల్లలంటే కేవలం చదువులు, మార్కులు, ర్యాంకులు ఇంతేనా అంతకుమించి తెలుసుకోవాల్సింది ఏమి లేదా!. ఎప్పుడైనా గమనించారా! పిల్లలను మనం ఎలా పెంచుతున్నాం.


వారికి చదువులు, మార్కుల కంటే ప్రధానంగా తెలుసుకోవల్సినవేంటో గమనించారో. అసలు చదువు, మార్కులు ఇలాంటివేమి లేకుండానే మన పెద్దలు ఎంతో చాకచక్యంగా సమర్ధవంతంగా జీవించడమే గాక సమాజంలో నెగ్గుకొచ్చారు. అయినా మనం వాటిని గమనించకుండా పిల్లలను ఓ యంత్రాల్లా ఇలానే బతకాలంటూ.. నిర్దేశించేస్తున్నాం. వారు నేర్చుకోవాల్సి అతి ముఖ్యమైన, విలువైన జీవిత పాఠాలను నేర్పించలేకపోతున్నాం


అవే వాళ్ల చివరి ఫోటోలు.

సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం మన హైదరాబాద్‌లో జులై 08, 2014న ఒక దారుణమైన సంఘటన జరిగింది. మీలో ఎవరికైనా గుర్తుందా? . తొమ్మిదేళ్ల క్రితం హైదరాబాద్ వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన దాదాపుగా 46 మంది విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్ కోసం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు.. అక్కడ సాయంత్రం 5:30 గంటలకు బియాస్ నదీ తీరాన ఫోటోలు తీసుకుందామని వెళ్లారు.. అప్పుడు నదిలో నీళ్లు లేవు. కేవలం రాళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ నది ప్రవహించే చోటున మధ్యలో ఒక పెద్ద బండరాయి వీళ్ళను ఆకర్షించింది. దానిపై నిలబడి, ఫోటోలు దిగుదామని వెళ్లారు. సరిగ్గా 6 గంటల సమయంలో ఒక సైరన్ మ్రోగింది.. అదేంటో వీళ్లకు అర్థం కాలేదు.. వీళ్ళున్న ప్రాంతానికి ముందు ఓ డ్యామ్‌ గేట్లు ఎత్తివేసి, నదీ జలాలను విడుదల చేశారు.. ఆ నదీ ప్రవాహం వీళ్ళ వైపుగా రావడాన్ని ఒడ్డున ఉన్న కొందరు చూశారు.. వీళ్ళను అలర్ట్‌ చెయ్యడానికి కేకలు వేశారు.. కానీ, వీళ్ళు పట్టించుకోలేదు.. ఆ నీళ్ళ మధ్యన నిలబడి, ఫోటోలు దిగుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు.. (వాళ్ళ చివరి ఫోటోలు అవే).

అంతంతా చదువులు చదివిన పిల్లలేనా.

అంతలో నీటి మట్టం స్థాయి అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.. ఒడ్డుకు దగ్గరలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు చిన్నగా వచ్చేశారు.. అందులో ఒక అమ్మాయి తన చెప్పులు బండ మీద మర్చిపోయాను అని చెప్పుల కోసం మళ్ళీ నది మధ్యలోకి వెళ్లి పోయింది.. ఉన్నట్లుండి, నది ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. నీటి మట్టం ఎత్తు దాదాపుగా 5 అడుగుల వరకూ చేరుకుంది.. రాళ్ళ మీద నిలుచున్న విద్యార్థులు నిస్తేజంగా నిలబడిపోయారు.. అందరూ చూస్తుండగానే నీటి ప్రవాహంలో కళ్లెదుటే కొట్టుకునిపోయారు.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.. ఇక్కడ మనం గమనించవలసింది, విజ్ఞాన్‌ ఇజనీరింగ్‌ కాలేజ్‌ లాంటి టాప్‌ కాలేజ్‌లో చదివిన వీళ్లకు, ప్రకృతి ఎంత శక్తివంతమైనది అని తెలియకపోవడం.. వీళ్ళలో ఎవరికీ ఈత రాకపోవడం.. "చెప్పుల" కోసం ప్రాణాలను పోగొట్టుకోవడం..చూస్తే ఇంత పెద్ద చదువులు చదవిన పిల్లలేనా అనే సందేహం రావడం లేదా!.

ఇక్కడ ఎందరు పిల్లలకు ఈత వచ్చు? ఈత అని మాత్రమే కాదు.. ఉన్నట్లుండి మీ ఇంట్లో ఎలక్ట్రికల్‌ షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడితే, ఏమి చెయ్యాలి అన్నది ఎందరు పిల్లలకు తెలుసు? అంతెందుకు ఎవరైనా పెద్దలకు సడెన్‌ హార్ట్‌ ఎటాక్‌ వచ్చి..ఊపిరి ఆడకపోతే తక్షణమే ఎలా స్పందించాలో తెలుసా?..లేదా చెయ్యి తెగి.. రక్తం ధారగా కారుతున్నపుడు ఏమి చెయ్యాలి అన్నది ఎందరు పిల్లలకు తెలుసు? చెప్పగలరా. కనీసం అలాంటి సమయాల్లో ముందుగా చేయాల్సిన ప్రథమ చికిత్స ..ఎలా చేయాలో తెలుసా? . ముఖ్యంగా పిల్లలకు మనం నేర్పిస్తున్నది ఏమిటో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా!. కేవలం చదువు..చదువు.. చదువు, మార్కులు, ర్యాంకులు, ఇజనీరింగ్‌, మెడిసిన్‌ సీట్లు, GRE, G-MAT, IELTS, TOEFL, US, UK.. డాలర్లు.. ఇవే చెబుతున్నాం. ఆ చదువులు కూడా వాళ్లని షాపింగ్‌మాల్స్‌లో బ్రాండెడ్‌ డ్రెసెస్‌ వేసుకోవడం, పిజ్జాలు, బర్గర్లు, చికెన్ టిక్కా ముక్కలు, బిర్యానీలు తినమని మాత్రమే చెబుతోంది.


కామన్‌సెన్స్‌ నేర్పిస్తున్నామా.

ఆ చదువు సమస్య వస్తే ఎలా ఎదుర్కొని నిలబడాలో చెప్పడం లేదు. అసలు ప్రకృతి అందాలు చూడటమే కాదు. అది కన్నెర్రజేస్తే ఎలా ఉంటుందో చూపించాలి. అలాగే రాజ్యాంగంలోని మన హక్కుల గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించాలి.. ఎదుటి వాడు దాడి చేస్తే రక్షించుకోవడం నేర్పించాలి.. సమాజంలో ఉన్న అన్ని రకాల మనుషులతో సమయస్పూర్తిగా మెలగడం అలవాటు చెయ్యాలి. అప్పుడే వాళ్ళకి మంచి , చెడు గురించి అవగాహన వస్తుంది.. అన్నింటికంటే ముందు "common sense" (ఇంగిత జ్ఞానము) అనేది లేకుండా పిల్లలను పెంచుతున్నాం. దాన్ని నేర్పకుండా.. చదువుకో, మార్కులు తెచ్చుకో, ర్యాంకులు సంపాదించు.. అంటూ ఒక యంత్రంలా తయారు చేస్తే, ఇదుగో. ఫలితాలు.. ఇలాగే ఉంటాయి.. గమనించండి. ఆలోచించండి. ఈ దిశగా కూడా ప్రయత్నం చేయండి.. కొంతమందికి అయినా అవగాహన కల్పించి మన విద్యార్థుల విలువైన జీవితాలను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం.

జంతు వాద్యం - జైలు

 జంతు వాద్యం - జైలు


ఒకసారి ఘటం మ్యాస్ట్రో విక్కు వినాయకరం గారి అబ్బాయి శ్రీ సేల్వగణేశ్ న్యూఢీల్లి కచేరిలో కంజీర వాయించారు. మరుసటి రోజు పత్రికలలో ఆయన అద్భుతమైన ప్రదర్శన గురించి చాలా గొప్పగా వచ్చింది. దాన్ని చూసిన అప్పటి పర్యావరణ శాఖ మంత్రి ఆ కంజీర జంతువుల చర్మంతో చేయబడినది అని తెలుసుకుని జంతువుల హక్కులు కాపాడాలని సేల్వగణేశ్ ను వెంటనే అరెస్ట్ చెయ్యవలసిందిగా పోలీసులను ఆదేశించారు.


ఆ వార్త విన్న వెంటనే వినాయకరం గారి ఇంట్లో భయాందోళనలు మొదలయ్యాయి. అదిగాక, కంజీరను జంతువు చర్మంతోనే చేస్తారు. ఎన్నో ఏళ్లుగా వాటిని ఇలాగే చనిపోయిన జంతువుల చర్మంతో తయారుచేస్తారు. సమయాభావం వల్ల వాళ్ళ న్యాయవాదిని కూడా కలవలేకపోయారు.


వినాయకరం గారికి వెంటనే మహాస్వామివారు గుర్తుకు వచ్చి, భోరున ఏడుస్తూ కంచికి కాలినడకన వస్తాన మమ్ములని కాపాడమని మొక్కుకున్నారు. కంచికి వెళ్తూ దారిలో టి త్రాగడం కోసమని ఒక దుకాణంలో ఆగారు. టి తాగుతూ అక్కడున్న రేడియోలో నుండి వస్తున్నా వార్తను విని ఆశ్చర్యపోయారు.


ఏవో కారణాల వల్ల ఆ పర్యావరణ శాఖ మంత్రిని ఆయన పదవి నుండి తొలగించినట్టు ఆ వార్తా సారాంశం. దాంతో ఆయన కుమారున్ని అరెస్టు చెయ్యలేదు.


జంతువుల చర్మంతో చేసిన వాయిద్యములనే మంగళ వాయిద్యములు అంటారు. శుభకార్యాలలో వీటిని తప్పక వాయించాలి. వీటిని చనిపోయిన జంతువుల చర్మంతో తయారుచెయ్యాలి కాని, వాటిని తయారుచెయ్యడం కోసం జంతువులను చంపరాదు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

1500 years


 

పంచాంగం 20.07.2023

 ఈ రోజు పంచాంగం 20.07.2023 Thursday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస శుక్ల పక్ష: తృతీయ తిధి బృహస్పతి వాసర: ఆశ్లేష నక్షత్రం సిద్ది యోగ: తైతుల కరణం ఇది ఈరోజు పంచాంగం. 


తదియ ఈ రోజు పూర్తిగా ఉంది.

ఆశ్లేష పగలు 10:54 వరకు.

సూర్యోదయం : 05:55

సూర్యాస్తమయం : 06:49

వర్జ్యం : రాత్రి 12:25 నుండి 02:14 వరకు.

దుర్ముహూర్తం: పగలు 10:13 నుండి 11:05 వరకు తిరిగి మధ్యాహ్నం 03:23 నుండి 04:14 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం : ఉదయం 06:00 నుండి 07:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

Pravachan


 

19, జులై 2023, బుధవారం

సీతమ్మ మాయమ్మ

 ॐ సీతమ్మ మాయమ్మ - శ్రీరాముడు మా తండ్రి 


సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి 

                            ॥సీతమ్మ॥ 


వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్దన

తాత(తాతా)  భరతాదులు సోదరులు మాకు ఓ మనసా 

                            ॥సీతమ్మ॥ 


పరమేశ వశిష్ట పరాశర నారద శౌనక శుక 

సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు 

ధరణిజ భాగవతాగ్రి సరులెవరో (భాగవతాగ్రేసరులెవరో)  వారెల్లరు (ను)  

వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసా 

                            ॥సీతమ్మ॥