28, జులై 2023, శుక్రవారం

Hindu jagho




 *హిందువులను మీ గుళ్ళలోనే తగలబెడతం.* ఇది కేరళలో నినాదం దీనిపై ఏ సెక్యులర్ మేధావులు పెదవి విప్పరు, కేవలం బిజెపి మాత్రమే ఆరుస్తుంది దానిని మతతత్వ పార్టీ అంటారు. మనమేమో మన ధర్మం గురించి పోరాడే వారికీ  రాజకీయ సపోర్ట్ ఇవ్వం ఎంతసేపు ఎవడు ఎం ఫ్రీగా ఇస్తాడు ఎవడు ఓటుకు నోటు ఇస్తారు అని ఆలోచిస్తారు.   @ఖాన్ గేస్, కమ్యూనిస్ట్ సెక్యులర్ పార్టీలు.. హిందువులకు డెడ్ లైన్ 2024 ఎన్నికలు..!

Music saved


 

fake note.

 



👆🏻*In the last 2-3 days these 500 notes with the star ✳️ symbol have started circulating in the market. Such a note was returned from IndusInd Bank yesterday. This is a fake note. Even today, a friend received 2-3 such notes from a customer, but immediately returned them. The customer also said that someone gave this note in the morning due to a lack of attention. Take care there has been an increase in the number of hawkers carrying fake notes in the market.   Appeal - Please be a conscious citizen. So spread this message to more and more of your brothers so that they are spared loss and foiled by the worthless thieves. Thank you*

శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయ చరిత్ర:

 *నిత్యాన్వేషణ:*


శ్రీ చాళుక్య కుమారరామ శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయ చరిత్ర:




ఈ దేవాలయం సామర్లకోట అనే పట్టణం (కాకినాడ కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది) లో ఉంది.. రైల్వే స్టేషన్ కి బాగా దగ్గర.. చుట్టూ పచ్చటి పంటపొలాలు, గోదావరి జలాలతో చాలా ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది ఈ చాళుక్య కుమార భీమేశ్వర స్వామి వారి దేవాలయం..

భీమేశ్వర స్వామి వారి దేవాలయం పంచారామాల్లో ఒకటి.. చరిత్ర గురించి చెప్పాలంటే స్థానికంగా తెలిసిన కథనాల ప్రకారం చూస్తే....  ఆ గుడి పేరు చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. మీరు సరిగ్గా గమనిస్తే ద్రాక్షారామం భీమేశ్వరాలయం నిర్మాణం, శిల్పాలు, శైలి కూడా సామర్లకోట మాదిరే ఉంటుంది, అందుకు కారణం రెండిటినీ నిర్మించిన రాజు ఈ భీముడు గారే..


ఈ మందిరం నిర్మాణం శా.శ. 892 లో ప్రారంభమై సుమారు శా.శ. 922 వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్మిర్మించారు.


ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇక్కడి అమ్మవారు బాలాత్రిపురసుందరి. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు. 1147 - 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి. తెలుగు భాషకి సంబంధించిన అత్యంత ప్రాచీన శిలాశాసనాలలో ఇది ఒకటిగా భావిస్తున్నారు.


ఇక ఆధ్యాత్మిక పరంగా చుస్తే సామర్లకోట పరమశివుని పంచ ముఖాల్లో ఒకటైన వామదేవ ముఖానికి సంబంధించిన క్షేత్రం.. కుమారస్వామి ప్రతిష్టించిన వామదేవ స్వరూపుడు కనుక కుమార భీమేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు శివయ్య..ఇది యోగలింగం.. శివలింగం ఎత్తు 14 అడుగులు, ఇప్పటికీ పెరుగుతూనే ఉంది, కనుక శిరస్సు పైన శీల కొట్టారు అని చెప్తారు.. దేవాలయం అత్యంత పురాతనమైనది కనుక భారత పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంది..


సామర్లకోట, ద్రాక్షారామం దేవస్థానాల్లో శివుడికి పాలతో అభిషేకం చేయరు, ఎందుకంటే అక్కడి లింగాలకి పాల వల్ల కొంచెం నష్టం జరుగుతుంది.. సామర్లకోట క్షేత్రం రైల్వే జంక్షన్ కూడా కనుక, అన్ని ప్రధాన రైళ్ళు ఈ మార్గంలో ఆగుతాయి, మీకు వీలైతే సందర్శించండి..

గయా క్షేత్రం

 🕉 మన గుడి : 




⚜ బీహార్ : గయ


⚜ గయా క్షేత్రం



💠మన దేశంలో అత్యంత పుణ్యప్రదమైన తీర్థ క్షేత్రాలలో 'గయ' ఒకటి. 

ఈ పవిత్ర స్థలంలో కాలు పెడితేనే సమస్త పాపాలు పటాపంచలై సద్గతులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

వేదాల్లోనూ, పురాణాలలోను గయకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. సమస్త దేవతలు ఈ క్షేత్రాన్ని పరమ మోక్షదాయకంగా తీర్థ క్షేత్రంగా భావించారు. 


💠 “గయ' తీర్దం సకల తీర్ధాలకి ప్రాణప్రదమైందని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. 

పల్గూ నది పశ్చిమ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం, అత్యంత పవిత్రమైనదిగా విరాజిల్లుతోంది. పల్గూనదిని విష్ణుమూర్తి జలరూపంగా భావిస్తారు. మోక్ష సాధనకు గయ తీరానికి మించింది లేదు. ఇతర మోక్ష మార్గాలకన్నా గయ పిండదానానికి ఎన్నో విశిష్టతలున్నాయి.


💠 విష్ణుపాదోద్భవం పల్గూనది. గయాసురుడి శరీర క్షేత్రమే గయాతీర్థం ఈ క్షేతం ఇంతలా ప్రాచుర్యం పొందడానికి, ఇంత మహిమాన్వితం పొందడానికి ఓ పురాణగాథ

ప్రచారంలో ఉంది.


⚜ పురాణగాథ ⚜


💠 పూర్వం గయాసురుడనే రాక్షసుడు ఇక్కడ శ్రీమహావిష్ణువు గురించి ఘోర తపస్సు చేశాడు. గయాసురుడి భక్తికి, అతని తపసుుకు మెచ్చిన శ్రీమహావిష్ణువు ఇక్కడ ఈ క్షేతంలో అవతరించాడు. 

ఎవరైతే ఇక్కడ తర్పణ చేస్తారో, ఎవరైతే

పిండదానం చేస్తారో వారి పితృదేవతలంతా మోక్షం పొందుతారని, వైకుంఠం చేరుకుంటారని గయాసురునికి శ్రీమహావిష్టువు వరమిచ్చాడు. 


💠 అలాగే బ్రహ్మదేవుడు స్వయంగా ఇక్కడ యజ్ఞ వేదిక ఏర్పాటుచేసుకుని తపస్సు చేశాడు. ఆ కారణంగా ఈ క్షేతం మరింత పవిత్రత నొందింది. 

బ్రహ్మదేవుడు ఇక్కడ యజ్ఞం చేయడం వల్ల, అప్పటినుంచి ఈ క్షేత్రం త్రిమూర్తులతోపాటు సమస్త దేవతలకు నిలయంగా భాసిస్తోంది. 

శ్రాద్ద కర్మలకు అత్వంత పవిత్రమైన క్షేతంగా కొనియాడబడుతున్న ఈ క్షేత్రంలో బహ్మదేవుడు కృతయుగంలో తొలుత ఇక్కడ పిండ ప్రదానం చేశాడని ఒక కథ ఉంది. 


💠 అలాగే పిండ ప్రదానానికి సంబంధించి మరో పురాణగాథ కూడా ప్రచారంలో ఉంది.

 శ్రీ రాముడు అరణ్యవాసం చేస్తుండగా ఆయన తండ్రి దశరథ మహారాజు మరణించాడు. తన జ్యేష్ట పుత్రుడైన శ్రీరాముని చేత పిండ ప్రదానం అందుకుంటాను అని దశరథుడు శ్రీరాముడికి కలలో కనిపించి చెబుతాడు.

 

💠 ఈ నేపధ్యంలో శ్రీరాముడు ఇక్కడ తన తండ్రి దశరథునికి పిండ ప్రధానం చేస్తాడు. అదే సర్వ ప్రథమ పిండ ప్రధానమని భావిస్తారు.


💠 పిండప్రదానానికి ముందు స్నానమాచరించడానికి శ్రీ రాముడు వెళ్ళిన సమయంలో మహారాజైన దశరథుని హస్తాలు రెండు సీతముందు కనిపించి తాను చాలా ఆకలిగా ఉన్నానని రామునికి బదులుగా పిండం ప్రదానం చెయ్యమని సీతను అడుగగా సీతాదేవి పిండములు తీసి ఆచేతులలో ఉంచింది. శ్రీరాముడు తిరిగి వచ్చి యధావిధిగా పిండములు ప్రదానము చేసే సమయములో అతని తండ్రి ఆ పిండాలను స్వీకరించక పోయినప్పుడు శ్రీరాముడు ఆశ్చర్యానికి గురికావడమే కాక బాధపడ్డాడు. 


💠 సీతాదేవి జరిగిన ఉదంతం వివరించి , శ్రీరాముడు నమ్మటంలేదు అని సాక్ష్యానికి ఫలగు నదిని, సమీపంలో నిలిచియున్న బ్రాహ్మణుని, ఆవుని, రావిచెట్టుని, తులసిమొక్కని పిలిచింది. 

రావిచెట్టు తప్ప మిగిలిన వారు సాక్ష్యం చెప్పలేదు. 

ఆవు శ్రీ రామునికి భయపడి, ఫల్గూ నది శ్రీరాముని నుండి అధిక వరాలు పొందడానికి, 

బ్రాహ్మణుడు శ్రీరాముని నుండి అధిక దక్షిణ పొందాలని నిజం చెప్పలేదు.

తులసి మొక్క కూడా మనకి ఎందుకులే

అని ఊరుకొని నిజం చెప్పలేదు.


💠 సీతాదేవి ఆ నలుగురిని శపించిందని పురాణకథనం వివరిస్తుంది.

ఫాల్గు నది ఇంకిపోతుంది అని, 

ఆవు ముందు నుండి ఎప్పటికీ నివాళులర్పించబడదని, 

గయలోని బ్రాహ్మణులు ఎప్పుడూ సంతోషంగా ఉండరని - వారు ఎల్లప్పుడూ ఆహారం కోసం ఆరాటపడుతారని మరియు గయలో ఇకపై తులసి మొక్కలు పండించబడవని చెప్పి వారిలో నలుగురిని శపించింది. 


💠 శాపకారణంగా ఫల్గూనదిలో నీరు ఇంకి పోయింది.

నిజం చెప్పిన రావిచెట్టును మాత్రం శాశ్వతంగా జీవించమని వరమిచ్చింది.

 ఈ రావిచెట్టు ఆకులు ఎప్పుడూ రాలవని ఎప్పుడూ పచ్చగానే ఉంటాయని ఇక్కడివారు చెప్తున్నారు. అక్షయ వృక్షం అంటే ఎప్పటికీ క్షయం పొందని వృక్షం అని అర్ధం. కరువు సమయంలో కూడా ఈ వృక్షం పచ్చగా ఉంటుంది.


💠 వేదభూమి అయిన గయాక్షేత్రం హిందువులకు బౌద్ధులకు గొప్ప పవిత్రమైన యత్రాస్థలం.గయాక్షేత్రం నందు పితృదేవతలకు శ్రాద్ధవిధులను నిర్వర్తించి పిండప్రదానం చేస్తే పితృఋణాన్ని తీర్చుకుని ఇహపర సాధనలో మోక్షం పొందుతారని గట్టి నమ్మకం. 

వారణాసిలో మొదలైన శ్రాద్ధవిధులు గయా శ్రాద్ధవిధులతో పూర్తి అవుతుంది. 


💠 గయ క్షేత్రం పితృగయగా మరియు బుద్ధగయగా రెండు భాగాలుగా ఉంటుంది. 

హిందువుల పురాతన ఆలయాలకు పితృగయ ప్రసిద్ధి. బుద్ధ ఆశ్రమాలు, బౌద్ధ ఆలయాలకు బుద్ధగయ ప్రసిద్ధి. శ్రీమంగళగౌరి మహాశక్తిపీఠం గయాక్షేత్రం నందు కలదు. 


💠 పవిత్రమైన మంగళగౌరి ఆలయం సతీదేవి ఛాతీ భాగం పడిన ప్రదేశమని విశ్వసించబడుతుంది.

నదీతీరంలో చాలా ప్రసిద్ధిచెందిన విష్ణుపద్ ఆలయం ఉంది. 

అక్కడ విష్ణుపాద ముద్రలు ఉంటాయి. 

గయాసురుని చాతి మీద శ్రీ మహావిష్ణువు పాదము ఉంచిన ప్రదేశం ఇదే.



💠 రైలు మార్గం: దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ గయా.

ఎంతోపుణ్యం చేసికున్నవారికి

 శుభోదయం🙏

             చొప్పకట్ల.

ఒకసుభాషితం!


"జనకుని పూజలంగడు బ్రసన్నునిజేయు నతండు పుత్రు డే

వనితమెలంగు భర్తృవశవర్తినియై యది సత్కళత్ర మేజనుడు విపత్తి సౌఖ్యసదృశక్రియు డాతడుమిత్రు డీ

త్రయం

బును జగతిన్ లభించు గడుపుణ్యముఁజేసినయట్టివారికిన్-

          భర్తృహరి సుభాషితములు.


భావము:తండ్రినిపూజించేకొడుకు, భర్తమాటవినేభార్య .కష్టసుఖాలలో మనలను విడువని స్నేహితుడు.ఎంతోపుణ్యం చేసికున్నవారికిగాని లభించరు.🙏🙏🙏🌷👏👏👏🌷👏👏👏👏🌷👏👏👏👏👏👏🌷👏👏🌷🌷🌷

Lightning


 

ఉన్మత్త నటనం

 ఉన్మత్త నటనం


కొత్త ఢిల్లీకి చెందిన సుందరేశన్ కు నటరాజ స్వామి అంటే చాలా మక్కువ. నటరాజ తత్వం తన మనస్సుకు సంతోషాన్ని ఇచ్చే అంశం అయితే, నటరాజ విగ్రహాలు తన కళ్ళకు, మనస్సుకు కూడా సంతోషాన్ని కలిగించే విషయం.


కోనేరిపురం నటరాజ విగ్రహం విశేషము ఏమి? తిరువాలంకాడు నటరాజ మూర్తి ఎటువంటిది? చిదంబర నటరాజ స్వామి ఆకృతిలో ఉన్న పవిత్రమైన విషయం ఏమి? ప్రపంచంలోనే అతి పెద్ద నటరాజ విగ్రహం ఉన్నది నెయ్ వేలిలో. ఇటువంటి ఎన్నో విషయాలు అతనికి కొట్టిన పిండి.


సుందరేశన్ కు, ఆ కదలాడే నటరాజ స్వామిపై ఉన్న కదలని భక్తితో పాటు, మౌనంలో ఎటువంటి కదలిక కూడా లేకుండా ఉండే కంచి పరమాచార్య స్వామి వారు అంటే కూడా అమితమైన భక్తీ.


సుందరేశన్ మహాస్వామివారి ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. “నువ్వు మకిళన్ జేరి నటరాజుని చూశావా?” అని అడిగారు స్వామివారు. అ ప్రశ్న బాణంలా తగిలింది.


‘నాకు నటరాజ స్వామిపై ఉన్న ఆసక్తి గురించి మహాస్వామివారికి నేనెప్పుడూ చెప్పలేదు. అది స్వామివారికి ఎలా తెలిసింది?’


లేదన్నాడు సుందరేశన్.


“ఈ మకిళన్ జేరి, పణన్గుడి అనే గ్రామం దగ్గర ఉంది. ఆ ఊరి యొక్క విశేషం ఏమిటో తెలుసా? నటరాజ స్వామి ఒక విష్ణు ఆలయంలో స్థిర నివాసం ఉన్నాడు. ఆ నటరాజ విగ్రహం చిదంబరంలో ఉన్న విగ్రహం కంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. వెళ్లి దర్శించు. వచ్చిన తరువాత నీవు గమనించిన విశేషం ఏమిటో నాకు చెప్పు” అన్నారు స్వామివారు.


సుందరేశన్ మరుసటిరోజే మకిళన్ జేరి వెళ్ళాడు. తనతోపాటు ఆలయ అర్చకుని వెంటబెట్టుకుని విష్ణు ఆలయానికి వెళ్ళాడు. అది పరమాచార్య స్వామివారి ఆజ్ఞ అని తెలియగానే ఆ అర్చకుడు సుందరేశన్ ని నటరాజ స్వామివద్ద వదిలేశాడు.

విగ్రహం చుట్టూ ప్రతి ఇంచి అలంకరింపబడిన గుండ్రని లోహ వలయం, విరబోసుకున్న వెంట్రుకలు, ఒక చేతిలో ఢమరుకం, ఒకచేతిలో పవిత్ర జ్వాలలు, చిరుమందహాసంతో ఉన్న మోము, ఒక కాలు గాలిలోకి ఎత్తి, మరొక కాలు స్థిరంగా నిలిపి - సుందరేశన్ ఆ విగ్రహంలోని ఆణువణువు పరిశీలించాడు. ఏదైనా విశేషం ఉంటే తెలుపమని స్వామివారి ఆదేశం కదా?


ఓహ్! ఆ దత్తూర పుష్పం. అవును అదే, ఇక్కడ వాలిపోయి ఉంది. అది తలపై నిటారుగా కదా ఉండాలి? కిందకు వాలిపోయి నుదురు మీద పడుతున్నట్టుగా ఉంది. ఎందుకలా?


పది అడుగుల దూరంలో నిలబడి గమనించసాగాడు సుందరేశన్. విగ్రహం వెనుకవైపు చూడదలచి వెనుకకు వెళ్లి చూసి ఆ సౌందర్యానికి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆనందతాండవంలో శరీర భ్రాంతి లేని స్థితిని చూపడానికి సృష్టించిన విగ్రహం ఇది.


సుందరేశన్ పరమాచార్య స్వామివారు ముందర నిలబడ్డాడు.


“మకిళన్ జేరి నటరాజు శరీర భ్రాంతి లేని తాండవం చేస్తున్నట్టు కనబడడం లేదూ?”


“అవును అచ్చంగా అలాగే ఉంది. తలపై ఉన్న దత్తూర పుష్పం వాలిపోయి, తల ముందువైపు నుండి పడిపోయేలాగా ఉంది”


“భేష్! చాలా సునిశితంగా పరిశీలించావు. నటరాజ స్వామి వివిధ క్షేత్రాలలో వివిధ రకములైన తాండవాలు చేశాడు. మకిళన్ జేరిలో చేస్తున్నది ఉన్మత్త నటనం, ఇది అపూర్వ నటనం”


దీన్ని వింటున్న భక్తులు కూడా శరీర భ్రాంతి వదిలి ఆశ్చర్యపోయి వింటున్నారు. కాని మహాస్వామివారు, శరీర స్పృహతోనే శివానందంలో ఓలలాడుతున్నారు.


[కుంభకోణం దగ్గరలోని నన్నిలం దగ్గర ఉంది మకిళన్ జేరి. ఇప్పుడు అక్కడ ఉన్న విష్ణు ఆలయంలో నటరాజ మూర్తి లేదు. స్థానికుల కథనం ప్రకారం, చిన్న ఆలయం కావడంతో, చోరీ భయంతో  ప్రభుత్వంవారు అ మూర్తిని అకడి నుండి తొలగించారు. దాన్ని ఎక్కడ ఉంచారో వారికి తెలియదు]


--- సుందరేశన్, కొత్త ఢిల్లీ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 7


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

సౌశీల్యం

 *సౌశీల్యం*

*శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు*


మనకు శీలసంపత్తి కలుగవలెనంటే వేదోక్తములైన ఆచార-అనుష్ఠానములను పాటించాలి. సదాచారము, సద్గుణములు అలవరచుకోవాలి.


వీనికి అలవాటుపడితే మనస్సులో దురాలోచనలు ప్రవేశించుటకు సమయము కానీ, అవకాశము కానీ ఉండదు. రెండవది మనం కర్మానుష్ఠానములను చేయునప్పుడు అహంకారానికి దారితీసే కర్తృత్వభావము అసలే ఉండరాదు.


కర్మానుష్ఠానము చేయవలెననే సంకల్పమూ, చేసే శక్తి, వసతులూ అన్నీ ఈశ్వరునివే.


ఈ విధంగా మన పూర్వ వైదిక మతాచార్యులు తాము ఆచరించి మనకు మార్గనిర్దేశనంచేశారు. ఒక అద్దంలో మనబింబం చూచుకోవాలంటే, అదిశుభ్రంగా ఉండాలి. అది గాలిలో ఉంటే బింబం మసమసకగా ఉంటుంది. అంతేకాదు అద్దం నిశ్చలంగా ఉండాలి. కదులుతూ ఉంటే బింబమూ చెదరుతూ ఉన్నట్లు అగపడుతుంది. మన చిత్తం దర్పణంలాంటిది.


అనేక జన్మలనుంచి మనం తెచ్చుకొన్న మలిన సంస్కారదూషితమైన ఈ చిత్రాన్ని ఎంత శ్రమ పడితే శుభ్రంచేయగలం?


అనేక జన్మసంపర్గమైన చిత్తమాలిన్యాన్ని ఎన్నో సత్కార్యములు చేస్తేకాని పోగొట్టుకొనలేము. అంతే కాదు, ఒక్కరోజు సత్కార్యంచేసి ఊరకుంటే చాలదు. ఈ సదాచారములను అనుదినం అనుష్ఠించాలి.


అప్పుడు చిత్తనైర్మల్యం స్థిరంగా ఉండగలదు. అందుచేత ఆత్మసాక్షాత్కారం కావాలంటే అమనస్కమైన చిత్తరాహిత్యం, ఆ చిత్తరాహిత్యానికి సౌశీల్యం, సౌశీల్య సంపాదనకు వైదిక కర్మానుష్ఠానం, సదాచార సంపత్తీ ఉండాలి. ఆత్మలాభానికి శీలం ఎంతో ముఖ్య మైనదన్న విషయం ఏనాడూ మరువరాదు.

వైదిక ధర్మ ప్రభావం

 వైదిక ధర్మ ప్రభావం


ఆచార్యపురుషులకు, తదనుయాయులకు ఆత్మబలం సచ్చరిత్రం, నీతీసంపదా ఉన్నట్టయితే వారి మతములకు సుస్థిరత్వం ఏర్పడుతుంది. అట్టి ఆచార్య పురుషుల వల్లనే వైదిక మతము అనేక గండములు గడచి నేటికి సుస్ధిరంగా వుంటున్నది.


గౌతమబుద్దుడు కపిలవస్తు నగరంలో అవతరించి, 2500 ఏండ్ల గడచినవి. వారి త్యాగనిరతీ, వైరాగ్యనిష్ఠ ప్రజల మనస్సులను లోగొన్నవి. బుద్ధుని జీవితగాథ విన్నప్పుడు దేశమంతటా కానవచ్చే బుద్ధవిగ్రహాలను కన్నప్పుడు మనకు శాంత్యానందములు, కరుణా లభిస్తూవుంటవి. బౌద్ధము నాస్తిక మతమైన కారణాన దానికే దేశంలో నిలువనీడ లేకపోయిందనే అభిప్రాయ మొకటి ఈ వరకు ఉంటూవచ్చేది. కాని, సంస్కృతంలో పాళీభాషలో వున్న బౌద్ధధర్మ గ్రంథాలను, అశోకుని శిలాశాసనాలను పరికిస్తే బుద్ధదేవుని మహానుభావం మనకు తెలిసివస్తుంది. అట్టి మహనీయుని పుట్టుకచే ఈ దేశం ధన్యమయినదనిపిస్తుంది. ''ప్రాగ్దిశాజ్యోతి'' అనే గ్రంథంలో ఎడ్విను ఆర్నాల్డు కవి బుద్ధుని దివ్యజీవనాన్ని కీర్తించాడు. ఈ బౌద్ధమతం తమిళ దేశంలోను వ్యాపించింది. బౌద్ధధర్మాలనేకం తమిళ గ్రంథాలలో కానవస్తున్నవి. ఇంతగా గౌరవాస్పదమైన బౌద్ధమతం మనదేశంలో ఏల నిలువ జాలకపోయిందా అని ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది.


తమిళ సాహిత్యంలో ఎక్కడ చూచినా జైనమత ప్రచారం కనిపిస్తుంది. దీనినిబట్టి బౌద్ధముకంటే జైనధర్మానికే తమిళనాడులో ప్రాబల్యం లభించిందనుకోవాలి. ఉత్తర భారతంలో గుజరాతు మొదలైన ప్రాంతాల్లో జైనమతస్థు లధికంగా ఉంటున్నారు. బౌద్ధ జైనములు రెండూ అహింసనే పరమధర్మంగా చెపుతున్నా, బౌద్ధులు ఇతరులు చంపిన మృగముల మాంసం తినేవారు. జైనులు మాంససేవనం చప్పగా నిషేధిస్తారు. జైన విగ్రహాలు, ధర్మశాసనాలుకూడా మన దేశమంతటా కనిపిస్తున్నవి. సాంఖ్యమతమనేది కూడా పురాతనమే. బౌద్ధ, జైనములందు కంటే సాంఖ్యమతంలో జ్ఞానులు, ఋషులు ఎక్కువగా ఉన్నా, వారివారి విగ్రహాలుగాని, వారి మతాన్ని ప్రచారంచేసే గాధలు, గీతములుగానీ ఎక్కడా వినరావు మరి తత్త్వశాస్త్ర గ్రంథాలలో చూడబోతే, బౌద్ధ, జైనముల కంటే సాంఖ్యమతానికి ఎక్కువ ప్రస్తావము కనిపిస్తుంది.


వైదికమతాలలో శైవ వైష్ణవాలు తమిళదేశంలో బహుళప్రచారాన్ని పొందినవి. వైష్ణవసిద్దాంతానికి శ్రీమధ్వమునీ శ్రీ రామానుజులు ఆచార్యపురుషులు, రామానుజుల వైష్ణవాన్ని, శైవసిద్ధాంతమూలకమైన శైవాన్ని అవలంబించినవారు తమిళనాడులో విరివిగా ఉన్నారు. వైష్ణవాలయాలన్నిటా రామానుజులకు, నమ్మాళ్వారులకు, మనవాళమునికి వేదాంత దేశికులకు, మరియెందరో ఆళ్వారులకు అర్చా విగ్రహాలు వెలసినవి. శైవాలయాల్లో అట్లే అప్పయ్య, సుందరయ్య, సంబంధయ్య, మాణిక్యవాచకయ్యవార్ల విగ్రహాలు పూజలందుకొంటున్నవి. అంతేకాదు; శేవదివ్యస్థలాల్లో అరువత్తిమూడు నాయనార్ల విగ్రహాలుకూడా నెలకొన్నవి. వైష్ణవాలయాలలో ప్రబంధాలను, శైవాలయాలలో తిరిమరైలను గానంచేసేవారి కోసం వృత్తులు ఏర్పాటైవున్నవి. మరి అద్వైత స్థాపనాచార్యులైన శంకరుల విగ్రహాలు చూడబోతే శైవ వైష్ణవాచార్య విగ్రహాల్లో వెయ్యోవంతుకూడా కనుపించవు. అద్వైతాచార్యులలో ముఖ్యులైన సురేశ్వరాచార్యులకు, అప్పయ్యదీక్షితులకు ఎక్కడా విగ్రహములే కానరావు. పురావస్తుశాఖాధికారి ఒకరు చెప్పినట్లు శాసనాలు, విగ్రహాలు మెదలైన పురావస్తువులను బట్టి దేశచరిత్ర తిరిగి రచించి నట్లయితే, అద్వైతమతప్రసక్తే ఎక్కడా కనుపించకపోవచ్చు.


బౌద్ధమతం వైదిక మతాన్ని ఖండించింది. జైనమేమో బౌద్ధాన్ని ఖండించింది. ఇట్లే మతాచార్యులందరూ వారి వారి కాలములందు ప్రచారంలో ఉన్న మతాలను ఖండిస్తూ, తమ మతాలను స్ధాపింపజూచారు. శైవం, వైష్ణవం మొదలైన ఈ మతాలన్నిటికీ వేర్వేరు లక్షణాలు స్ఫుటంగా కనిపిస్తూ ఉంటవి. శైవవైష్ణవాలు రెండూ ప్రతిమార్చనను అంగీకరించినవే అయినా, వైష్ణవం ఈశ్వరునకు సుగుణమూర్తిని కల్పిస్తే, శైవం ఈశ్వర సంకేతమాత్రమయిన లింగం చాలునంటుంది. ఇస్లాము, క్రైస్తవమతస్థులు, ఆర్య సమాజికులూ ప్రతిమార్చన మొదలైనవే పనికిరాదంటారు. హిందువులు అంగీకరించే వేద ప్రామాణ్యాన్ని బౌద్ధులు, జైనులు అంగీకరించరు. ఈ మతాచార్యులందరిచుట్టూ శిష్యగణం విస్తారంగా పోగవుతూ వుండేది.


నేడు మతస్థులస్థితిని పరిశీలించిచూస్తే మానవలోకంలో సగంమంది క్రైస్తవమును, ఇంచుమించు తక్కినసగం బౌద్ధమును అవలంబించియున్నారు. ఈ రెంటికీ చెందనివారు తక్కినమతాల నాశ్రయించి ఉన్నారు. మరియెన్నో మతాలు పుట్టి పెరిగి నశించిపోయినవి. ఈ మతాలిలా యెందుకు పుట్టుతున్నవి? ఎలా నశిస్తున్నవి? ప్రతిమతమూ తనకే సత్యదర్శనమైనదనీ, తన్ను మించిన పరమధర్మంలేదనీ చెప్పుకుంటూ వుంటుంది. నిజానికి సత్యమనేది ఒక్కటే. అది యిన్నివిధాల వుండదు. మరి ప్రతిమతానికి ప్రజలు అసంఖ్యాకంగా ఎగబడుతూనే వుంటారు. మతాల ఉత్కృష్టతను, వాని నవలంభించిన జనుల సంఖ్యను బట్టి నిర్ణయించుదామా అంటే సత్యం తమనొసటనే పొడిచిందని చెప్పుకొన్న మతములు క్షీణించిపోవుట ఎందువల్ల?


సత్యబలంవల్ల మతములు ప్రజారంజకములవుతున్నవా? ప్రజారంజకములైన మతములే సత్యమతము లవుతున్నవా? ప్రజలు సత్యంకోసం మతాన్ని అవలంబిస్తా రనుకొందామా? అంతరించిపోయిన మతాలన్నీ అసత్యమతములనుకుందామా? ఇలా ఎన్నో ప్రశ్నలుదయిస్తున్నవి. ఇవన్నీ పరిశీలించిచూస్తే, ఒక్కవిషయం స్పష్టమవుతుంది. ప్రజారంజనమునుబట్టి, సంఖ్యాబలాన్ని బట్టి మతాలకు స్థిరత్వంగాని ప్రమాణ్యంగా ని నిలభించదని, మనకండ్లయెదుటనే గాంధిధర్మంకోసమని వేలాది ప్రజలు ఉపవాసంచేసి, బంధిఖానాలు నింపి, ప్రాణాలుకూడా అర్పించారు. మరి ఆ గాంధిధర్మమును, ఆ గాంధీజీ ప్రాయోపవేశాలను పట్టించుకోక ఎగతాళి చేసిన వారినీ మనమే చూచాము. అంతేకాదు, ఆ గాంధి ధర్మానుయాయుల సంఖ్య నానాటికి దిగనాసిల్లటంకూడా మనమే చూస్తున్నాము.


కాబట్టి సత్యప్రతిపాదనంవల్లనే మతాలు సుస్థిరములు, ప్రబలములు అవుతవని చెప్పలేము. మతములు ఏకారణంవల్ల పతనమైనవో తెలిసికొంటే వాని వృద్ధికిగల రహస్యంకూడా తెలిసిపోతుంది. మహాబలిపురంలో గుట్టలను ఆలయాలుగా మలిపించిన మహేంద్రవర్మ అనే రాజు ''మత్తవిలాస'' మనే ప్రహసనం రచించాడు. దానిలో బౌద్ధధర్మచ్యుతులైన భక్షువుల స్వేచ్ఛాచారాన్ని గూర్చిన ప్రస్తావనకనిపిస్తుంది. పురుషులతో పాటు స్త్రీలకు గూడా భిక్షుదీక్షలివ్వడం అపాయకరమని బుద్ధుడు ముందే ఊహించాడు. కాబట్టి తమ సచ్చరిత్రంవల్ల ఇతరులకు మార్గదర్శకులు కాదగిన భిక్షుమండలి ధర్మభ్రష్టమగుటవల్లనే బౌద్ధమతానికి పతనంకలిగిందని ఏర్పడుతున్నది. దీనినే వ్యతిరేకలక్షణతో చెపితే మతపరిరక్షణ కొర కేర్పడిన వారు నిష్కళంక చరిత్రులై తత్వజ్ఞులై ఉదారబుద్ధితో ఆచరణ ప్రచారములు ఎప్పటికప్పుడు చేస్తూవుంటే, మతములు సుస్థిరంగా వర్థిల్లుతవని చెప్పవచ్చు. మతకర్తల మహానుభావం వల్లనే మతాలకు ఆదిలో చోదనలభించుట నిజమే అయినా, తదనంతరం వచ్చే ఆచార్యపరంపరకు ఉత్సాహశక్తి, నియమనిగ్రహాలు, సచ్చరిత్రమూ అలవడాలి. తదనుయాయులకు శ్రద్ధా భక్తులుండాలి. అప్పుడే ఆ మతాలకు సుస్థిరత్వం, ప్రజారంజనం లభిస్తుంది. ప్రజాసామాన్యాన్ని ఆకరించేది ఆచార్యపురుషుల మహానుభావమే. కాని, మత పరమార్థం కాదు. ఎవరో పండితులు మాత్రమే ఆ పరమార్థాన్ని విచారించగలుగుతారు. చిరప్రతిష్ఠితములైన, మతములు గూడా మహనీయులైన ఆచార్యపురుషులు కరవగుటవల్లనే క్రమంగా క్షీణించిపోతవి.


కనుక ఏమతమయినా తదనుయాయులు భక్తిశ్రద్ధలతో ధర్మాచరణం చేస్తూవుంటే సుప్రతిష్ఠితమై వర్ధిల్లుతుంది. ప్రజాబాహుళ్యం ఎగబడి సందడి చేసినంతమాత్రాన చేకూరేది వాపేగాని బలుపుగాదు. నిజానికి సాంఖ్యాద్వైతమతాలకు సందడి చాలాతక్కువ. అనాదియైన వైదికమతానికి కర్తలెవరో ఎరుగము. అయినా, అది నేటికీ బహుజనుల కాలంబమై నిలిచి వున్నదంటే త్యాగధనులు, సచ్చరిత్రులు, భక్తులు అయిన ఆచార్యపురుషు లెందరో దానికాలంబమై ఆచరణ ప్రచారములు చేస్తూవుండటమే కారణం. కనుక, మనయీమతం చిరకాలం ఇలాగే వర్ధిల్లి లోకాన్ని ఉద్ధరించాలనే అభిలాష మనకుండాలి. అట్టి అభిలాషతో మనం సదాచారులమై, ధర్మపరాయణులమై, మనోవాక్కాయములచే సత్కర్మాచరణం చేస్తూవుండాలి.


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

తాటిచెట్టు

 ఒక తాటిచెట్టు గుండ్రంగా ఉంది, దానిని ఒక లత అల్లుకుంది. 

లత వేగంగా పెరిగి నెలరోజుల్లో చెట్టు మొత్తాన్ని అల్లుకుంది. 

"ఇన్ని నెలలూ ఈ తాటి కాస్త ఎదగలేదు" అంది లత నవ్వుతూ. 

"నా జీవితంలో పదివేల లతలను చూశాను. నీకంటే ముందు ఉన్న ప్రతి లత ఇప్పుడు నువ్వు చెప్పిన మాటనే చెప్పింది. నీకు ఏం చెప్పాలో తెలియడం లేదు" అని తాటిచెట్టు తిప్పికొట్టింది. 

మన మతం అన్ని ఇతర విశ్వాసాలతో సంబంధం ఉన్న చెట్టు లాంటిది.



మన మతంలో వివిధ కులాలకు వేర్వేరు విధులు, మతపరమైన ఆచారాలు ఉన్నప్పటికీ, ఆచారాల ఫలం అందరికీ ఒకేలా ఉంటుంది.

భీమేశ్వరుని గుడి

 సామర్లకోట భీమేశ్వరాలయము 


సామర్లకోటలో భీమేశ్వరుని గుడి 

          ప్రఖ్యాతి గాంచిన భవుని నెలవు 

పరివేష్టితంబైన ప్రాకారశోభలో 

         మధ్యలో వెలసిన మందిరమ్ము 

రెండంచలందున నిండుగా నుండియున్ 

         శివలింగ మత్యంత చెలువు నుండు 

పంచ శైవారామ ప్రముఖమ్ము నందున 

         విఖ్యాతి నొందియు వెల్గు నిద్ది

అల "కుమార భీమారామ" మనెడు దీని 

ఘనుడు చాళుక్యభీముడు కట్టె దొల్లి

అపర కైలాస మియ్యది యవని పైన

ధన్యమగు జన్మ నరునకు దర్శనమున.

నిత్యాన్వేషణ

 *నిత్యాన్వేషణ:*


శ్రీ చాళుక్య కుమారరామ శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయ చరిత్ర:


ఈ దేవాలయం సామర్లకోట అనే పట్టణం (కాకినాడ కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది) లో ఉంది.. రైల్వే స్టేషన్ కి బాగా దగ్గర.. చుట్టూ పచ్చటి పంటపొలాలు, గోదావరి జలాలతో చాలా ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది ఈ చాళుక్య కుమార భీమేశ్వర స్వామి వారి దేవాలయం..

భీమేశ్వర స్వామి వారి దేవాలయం పంచారామాల్లో ఒకటి.. చరిత్ర గురించి చెప్పాలంటే స్థానికంగా తెలిసిన కథనాల ప్రకారం చూస్తే....  ఆ గుడి పేరు చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. మీరు సరిగ్గా గమనిస్తే ద్రాక్షారామం భీమేశ్వరాలయం నిర్మాణం, శిల్పాలు, శైలి కూడా సామర్లకోట మాదిరే ఉంటుంది, అందుకు కారణం రెండిటినీ నిర్మించిన రాజు ఈ భీముడు గారే..


ఈ మందిరం నిర్మాణం శా.శ. 892 లో ప్రారంభమై సుమారు శా.శ. 922 వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్మిర్మించారు.


ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇక్కడి అమ్మవారు బాలాత్రిపురసుందరి. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు. 1147 - 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి. తెలుగు భాషకి సంబంధించిన అత్యంత ప్రాచీన శిలాశాసనాలలో ఇది ఒకటిగా భావిస్తున్నారు.


ఇక ఆధ్యాత్మిక పరంగా చుస్తే సామర్లకోట పరమశివుని పంచ ముఖాల్లో ఒకటైన వామదేవ ముఖానికి సంబంధించిన క్షేత్రం.. కుమారస్వామి ప్రతిష్టించిన వామదేవ స్వరూపుడు కనుక కుమార భీమేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు శివయ్య..ఇది యోగలింగం.. శివలింగం ఎత్తు 14 అడుగులు, ఇప్పటికీ పెరుగుతూనే ఉంది, కనుక శిరస్సు పైన శీల కొట్టారు అని చెప్తారు.. దేవాలయం అత్యంత పురాతనమైనది కనుక భారత పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంది..


సామర్లకోట, ద్రాక్షారామం దేవస్థానాల్లో శివుడికి పాలతో అభిషేకం చేయరు, ఎందుకంటే అక్కడి లింగాలకి పాల వల్ల కొంచెం నష్టం జరుగుతుంది.. సామర్లకోట క్షేత్రం రైల్వే జంక్షన్ కూడా కనుక, అన్ని ప్రధాన రైళ్ళు ఈ మార్గంలో ఆగుతాయి, మీకు వీలైతే సందర్శించండి..

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం :30/150 


మేఘజో బలచారీ చ 

మహీచారీ స్తుతస్తథా I 

సర్వతూర్యవినోదీచ 

సర్వవాద్య-పరిగ్రహః ॥ 30॥  


* మేఘజః = మేఘమునుండి ఆవిర్భవించినవాడు, 

* బలచారీ = బలముతో సంచరించువాడు, 

* మహీచారీ = భూమియందు సంచరించువాడు, 

* స్తుతః = స్తుతి చేయబడినవాడు, 

* సర్వతూర్యవినోదీ = సమస్తమైన తూర్యవాద్యములచేత వినోదించువాడు, 

* సర్వవాద్య పరిగ్రహః = సమస్త వాద్యములను ఉపయోగించువాడు. 


*మేఘజః - విశేషం* 


    మేఘాల నుంచీ 

  - ఉరుముల ద్వారా శబ్దమూ, 

  - మెరుపులతో కాంతీ వస్తాయి. 

  - వర్షం కురుస్తుంది. 


1. వేదం శబ్ద స్వరూపం. 

    వేదం ద్వారా తెలియబడేది పరమాత్మ. 

2. కాంతి తేజస్సు. 

3. వర్షం ప్రాణికోటికి జీవనాధారం. 


    కాబట్టి, 

పరమశివుడు 

  - ప్రామాణికమైన వేదం ద్వారా తెలియబడుతూ, 

  - తేజోరూపుడై, 

  - ఆనందామృతమును అనుగ్రహించే ఈశ్వరుడు. 


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

మూడూ త్వరగా నశిస్తాయి

 🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️


                *_సుభాషితమ్_*


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*నదీ తీరే చ యే వృక్షాః*

*పరగేహేషు కామినీ౹*

*మంత్రిహీనాశ్చ రాజానః*

*శీఘ్రం నశ్యన్త్యసంశయమ్॥*


*≈భావం≈*

నదుల ఒడ్డున పెరిగే చెట్లు, అజ్ఞాత వ్యక్తి ఇంట్లో నివసించే స్త్రీ, మంత్రులు లేని - ఒకవేళ ఉన్నా సరైన సలహాలు చేయగల మంత్రులు లేని రాజు, రాజ్యం ఈ మూడూ త్వరగా నశిస్తాయి.