12, సెప్టెంబర్ 2023, మంగళవారం

సంపాదన లేకుండా

 ಸುಭಾಷಿತ . 617 .


ಅನಾದಾಯೀ ವ್ಯಯಂ ಕುರ್ಯಾದಸಹಾಯೀ ರಣಪ್ರಿಯಃ | ಆತುರಃ ಸರ್ವಭಕ್ಷೀ ಚ ನರಃ ಶೀಘ್ರಂ ವಿನಶ್ಯತಿ ||


ಸಂಪಾದನೆ ಮಾಡದೆ ವೆಚ್ಚ ಮಾಡುವುದು , ಸಹಾಯವಿಲ್ಲದಿದ್ದರೂ ಯುದ್ಧಾಶಕ್ತಿ ಹೊಂದಿರುವುದು , ರೋಗಿಯಾಗಿಯೂ ಪಥ್ಯ ಅಪಥ್ಯವೆನ್ನದೆ ಎಲ್ಲವನ್ನೂ ತಿನ್ನುವುದುಹೀಗೆ ಮಾಡುವ ಮನುಷ್ಯ ಬೇಗ ನಾಶವಾಗುತ್ತಾನೆ . 


ಸುಭಾಷಿತರತ್ನಭಂಡಾರ .

సంపాదన లేకుండా వ్యయం చేసేవాడు, అసహాయుడై యుద్ధాసక్తి కలవాడు, రోగియై పథ్య అపథ్యము లేకుండా అన్నీ తినేవాడు త్వరగా నశిస్తాడు.

తొమ్మిది తలుపులు

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


 𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*నవద్వారమిదం వేషం* 

*త్రిస్థూపం పఞ్చసాక్షికమ్I*

*క్షేత్రాధిష్ఠితం విద్వాన్యో* 

*వేద స పరః కవిఃII*

                   ~విదుర నీతి


𝕝𝕝తా𝕝𝕝 

ఈ ఇంటికి తొమ్మిది తలుపులు, మూడు స్తంభాలు, ఐదుగురు పరిచారకులు ఉన్నారు మరియు ఆత్మ చేత నడపబడుతుంది.... ఇది తెలిసిన పండితుడు తత్త్వజ్ఞానం గల గొప్ప జ్ఞాని.

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్యచరిత్ర🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.      *🌹శ్రీ వేంకటేశ్వర దివ్యచరిత్ర🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు.


 ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. 


అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. 


ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు.

అప్పటినుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు. 


తరువాత అన్నమయ్య తన భార్యలతో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. వారు ముందుగా తమ వూరిలో చెన్నకేశవుని అర్చించారు. మార్గంలో నెందలూరు సౌమ్యనాధుని, ఒంటిమిట్ట రఘురాముని, కడప వేంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవుని దర్శించుకొన్నారు. తరువాత నవనారసింహ క్షేత్రం అయిన అహోబిలం చేరుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఆనందించారు. 


ఆ క్షేత్రాన్ని, తీర్ధాన్ని, దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్తుతించాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆదివణ్ శఠకోపయతులవద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మస్వరూపమునర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకొన్నాడు. ఇంకా అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకొన్నాడు. అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాజొచ్చాయి.


*రాజాశ్రయం*

విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీకృష్ణదేవరాయలుకు తాత), టంగుటూరు కేంద్రంగా ఆ సీమ ("పొత్తపినాడు") పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి "మూరురాయర గండ" అనే బిరుదుండేది. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విన్న దండనాధుడు తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో హరిదాసకూటాలలో ప్రసిద్ధమయ్యింది. తరువాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట.


*అంత్య కాలం*

రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న "మరులుంకు" అనే అగ్రహారంలో నివసించేవాడు. ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. అంతఃకలహాలలో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితంపట్ల విరక్తుడై నిత్యసంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు. అతని కీర్తనలలోని మహాత్మ్యం కథలు కథలుగా వినిన ప్రజలు అతని సంకీర్తనా సేవకు జనం తండోపతండాలుగా రాసాగారు.


ఈ సమయంలోనే పురందర దాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ వయోవృద్ధులు. భక్తశ్రేష్టులు. విష్ణుసేవాతత్పరులు. సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొన్నారు. "మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే" అని పురందరదాసు అన్నాడట.


 అప్పుడు అన్నమాచార్యుడు "సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే" అన్నాడట.


95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (1503 ఫిబ్రవరి 23) పరమపదించాడు.


 రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.


ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.


అన్నమయ్య కీర్తనలు, రచనలు 

అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడినా అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. కొన్నియెడల తమిళ, కన్నడ పదాలు కూడా చోటు చేసుకొన్నాయి. అతని తెలుగు వ్యావహారిక భాష. మార్గ, దేశి సంగీత విధానాలు రెండూ అతని రచనలలో ఉన్నాయి. అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాలవంటివి ఉన్నా గాని అవి "అంగాంగి విభాగం లేక, అఖండ గద్య ధారగా, గేయగంధులుగా" ఉన్నాయి. శివకవుల పదాలగురించి ప్రస్తావన ఉన్నాగాని అవి లభించడంలేదు. మనకు లభించేవాటిలో అన్నమయ్యవే తొలిసంకీర్తనలు గనుక అతను "సంకీర్తనాచార్యుడు", 'పదకవితా పితామహుడు" అయ్యాడు.


అన్నమయ్య "యోగ వైరాగ్య శృంగార సరణి" మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు. (వాటిని కొందరు కరగించుకొని ఉండవచ్చును.)

సంకీర్తనా లక్షణమనే సంస్కృత గ్రంథం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో "శృంగార మంజరి" అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో "వేంకటేశ్వర శతకము" ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంథాలు లభించలేదు. ఐ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో అన్నమయ్య రచనలు " ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిద్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన ద్విపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే"

అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.


ఉదాహరణలు

"అదివో అల్లదివో శ్రీహరి వాసము     పదివేల శేషుల పడగల మయము"


"అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల

పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల "


"కులుకక నడవరో కొమ్మలాలా        జలజల రాలీని జాజులు మాయమ్మకు"


"క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని       నీరజాలయమునకు నీరాజనం"


"జోఅచ్యుతానంద జోజో ముకుంద         రావె పరమానంద రామ గోవింద "


"చెల్లఁబో తియ్యనినోరఁ జేఁ దేఁటికి యీ-

పల్లదపుఁగోరికలపాలు సేయవలెనా"


ఉదయాద్రి తెలుపాయె ఉడురాజు కొలువిడె

అదనెరిగి రాడాయెనమ్మా నా విభుడు


*కవి కుటుంబం*

అన్నమయ్య వంశం తెలుగు సాహిత్యానికి ఆభరణం. అన్నమయ్య తండ్రి మహాపండితుడు. తల్లి సంగీతకళానిధి. అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. "సుభద్రా కళ్యాణం" మంజరి ద్విపద కావ్యం రచించింది. ఈమె కుమారుడు నరసింహుడు సంగీత సాహిత్య కళా కోవిదుడని చిన్నన్న వ్రాశాడు ("పాడఁజెప్పఁగ వర్ణపద్ధతినీడు, జోడులేఁడని సభ సొచ్చి వాదించి, పరఁగిన ధీశాలి ప్రతివాదదైత్య నరసింహుఁడనఁగల్గె నరసింహగురుఁడు"). కవికర్ణ రసాయనం అనే కావ్యాన్ని వ్రాసిన సంకుసాల నృసింహకవి ఇతడేనని కొందరి అభిప్రాయం. నరసింగన్న భార్యలు వాచ్చారమ్మ, అనంతమ్మ. వారి పుత్రులు నారాయణుడు, అప్పలార్య, అన్నలార్య.


తిరుమలాచార్యుడు తండ్రి వలెనే సంకీర్తనా యజ్ఞం నిర్వహించాడు. ఇతని ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలతో పాటు మరికొన్ని లఘురచనలు లభించాయి. వెంకటేశ్వర వచనములు, శృంగార దండకము, చక్రవాళ మంజరి, శృంగార వృత్త శతకము, వేంకటేశ్వరోదాహరణము, నీతి సీసశతకము, సుదర్శన రగడ, రేఫఱకార నిర్ణయం, ఆంధ్ర వేదాంతం (భగవద్గీత తెలుగు అనువాదవచవం), శ్రీ వేంకటేశ ప్రభాత స్తవము (ద్విపద), సంకీర్తనా లక్షణ వ్యాఖ్యానం (అలభ్యం) వంటివి రచించాడు. ఇతని భార్య తిరుమలమ్మ. వారి కొడుకులు చిన తిరుమలయ్య, అన్నయ్య, పెదతిరువెంగళ నాథుడు, చినతిరువెంగళనాధుడు (చిన్నయ్య లేదా చిన్నన్న), కోనేటి తిరువేంగళనాధుడు. చినతిరుమలయ్య తన తండ్రి, తాతలవలెనే ఆధ్యాత్మ, శృంగార సంకీర్తనలు రచించాడు. ఇంకా అష్టభాషా దండకం, సంకీర్తన లక్షణం (తండ్రి, తాతల సంస్కృత రచనలకు అనువాదం) వ్రాశాడు.


చినతిరుమలయ్య, అతని భార్య పెదమంగమ్మల కొడుకు తిరువేంగళప్ప అమరుక కావ్యానువాదము, అమరకోశానికి బాల ప్రబోధిక వ్యాఖ్య, ముమ్మటుని కావ్య ప్రకాశికకు సుధానిధి వ్యాఖ్య, రామచంద్రోపాఖ్యానం (అలభ్యం) వంటి రచనలు చేశాడు. పెద తిరుమలయ్య కొడుకు చిన్నన్న జనుల మన్ననలు పొందిన పరమ భక్తుడు, మహాగాయకుడు, భజన సంప్రదాయ ప్రచారకుడు, ద్విపద కవితకు విశేషంగా ప్రచారాన్ని కలిగించాడు. ఇతడు రచించిన అన్నమాచార్యుని జీవిత చరిత్రయే మనకు అన్నమయ్య జీవితానికి సంబంధించిన ప్రధాన ఆధార గ్రంథము. అంతే గాక ఇతడు పరమయోగి విలాసము, అష్టమహిషీ కళ్యాణము, ఉషా పరిణయము అనే ద్విపద కావ్యాలను రచించాడు. అన్నమయ్య, అక్కలమ్మల కుమార్తె తిరుమలాంబను తిరుమల కొండయార్యునికిచ్చి పెళ్ళి చేశారు. వారి కొడుకు రేవణూరి వెంకటాచార్యుడు శకుంతలా పరిణయము, శ్రీపాదరేణు మహాత్మ్యము.


ఇలా తాళ్ళపాక కవులు తెలుగు భాషకు, ప్రత్యేకించి పదకవితకు, ద్విపద కవితకు ఎనలేని సంపదను ఒనగూర్చారు. "చిన్నన్న ద్విపద కరగును, పన్నుగ పెద తిరుమలయ్య పదమునకెరగున్, మిన్నంది మొరసె నరసింగన్న పద్య గద్య శ్రేణిన్" అని తెనాలి రామకృష్ణుని చాటువు.


*దొరికిన పెన్నిధి*

 

తిరుమల సంకీర్తనా భండారంలో లభించిన రాగిరేకులలో ఒకటి

1922లో, 14,000 అన్నమయ్య కీర్తనలు, ఇతర రచనలు లిఖించిన 2,500 రాగిరేకులు తిరుమల సంకీర్తనా భాండాగారం (తరువాత పెట్టిన పేరు)లో లభించాయి. ఇది తిరుమల హుండీకి ఎదురుగా ఉన్న ఒక రాతి ఫలకాల గది.


 *వేద రక్షకా గోవిందా, వేద* *స్వరూపా గోవిందా, వేదోద్ధారా* *గోవిందా, వేద పురుష గోవిందా; |* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా. |* 


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.🙏*

*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం🪐* . *23వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *23వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*చంద్రగ్రహ జననం - 5*


మహా పతివ్రత అయిన శీలవతి వాక్కు ఫలించింది. ఘడియలూ , గంటలూ , రోజులూ గడిచిపోతున్నాయి. సూర్యోదయం కానేలేదు. లోకాలు నిరంతర అంధకారంలో మునిగిపోయాయి. నిత్య నైమిత్తిక కర్మలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రాణుల దైనందిన కార్యకలాపాలు ఆగిపోయాయి. విశ్వచాలన వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. నిశాచరులైన రాక్షసులు ఆనందంగా ఉన్నారు గానీ , దేవతలు భీతిల్లిపోయారు. ఇంక మానవులకు జీవితం దుర్భరంగా మారింది. ఎందుకు సూర్యుడు ఉదయించలేదో తెలియని ఇంద్రుడు వ్యాకులపాటులో మునిగిపోయాడు.


నారదుడు ఇంద్రుడ్ని కలుసుకున్నాడు. సూర్యోదయం కానందుకు కారణమైన శీలవతి శాపం గురించి వివరించాడు. శాపం ఉపసంహరించమని శీలవతిని ఆదేశిస్తానన్నాడు. ఇంద్రుడు.


*"శీలవతి మహాపతివ్రత , ఆమెకు భర్తే సర్వస్వం. కుష్ఠురోగీ , వృద్ధుడూ , దుర్మార్గుడూ అయిన భర్తను ఆమె ప్రత్యక్ష దైవంగా భావించి సేవిస్తోంది ! ఎలాంటి వాడైనా సరే భర్తను ఆమె త్యాగం చేయదు !"* అన్నాడు శీలవతిని గురించి బాగా తెలిసిన నారదుడు. 


*"గత్యంతరం ఏమిటి నారదా ?”* ఇంద్రుడు అడిగాడు.


*"ఏముందీ ! బ్రహ్మ , విష్ణువు , మహేశ్వరుడూ ఉన్నారు గదా ? వారిని ఆశ్రయించాల్సిందే !"* నారదుడు సూచించాడు.


ఇంద్రుడు నారదుడితో కలిసి బ్రహ్మను సందర్శించి , సమస్య వివరించాడు. పరమేశ్వరుణ్ని వెంటబెట్టుకుని , శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్తామన్నాడు బ్రహ్మ.


పరమేష్ఠీ , పరమేశ్వరులూ , ఇంద్రుడూ , నారదుడూ శ్రీమహావిష్ణువు సన్నిధికి చేరుకున్నారు. విషయం వివరించారు.


శ్రీమహావిష్ణువు సాలోచనగా పంకించాడు. *"మహేంద్రా ! శీలవతి పరమసాధ్వి! ఆమె శాపాన్ని నిర్వీర్యం చేసే శక్తి మాకెవ్వరికీ లేదు ! మాండవ్యుడు తన శాపాన్ని ఉపసంహరిస్తే , శీలవతి కూడా తన శాపాన్ని ఉపసంహరిస్తుంది ! అయితే , మాండవ్యుడికి ప్రస్తుతం శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి లేదు.”*


*"మరి తరుణోపాయం , దేవా !"* ఇంద్రుడు ఆందోళనతో అడిగాడు.


*“శీలవతి నివాసప్రాంతానికి సమీపంలోనే మరొక మహాపతివ్రత ఉంది. ఆ సాధ్వి పేరు అనసూయ. మన బ్రహ్మ మానసపుత్రుడైన 'అత్రి' ధర్మపత్ని ఆమె. అనసూయను కలుసుకో ! లోక క్షేమం కోసం శీలవతి శాపాన్ని ఉపసంహరించేలా చేయమని అభ్యర్ధించు ! వెళ్ళి... రా ! విజయోస్తు"* అన్నాడు విష్ణువు.


*“మహేంద్రా ! శీలవతిని అంగీకరింపజేసే బాధ్యత తనదే అని అనసూయకు మా మాటగా చెప్పు !”* పరమేశ్వరుడు హెచ్చరించాడు.


*"ఔను ! మహేంద్రా ! మా మాట కూడా అదే సుమా !"* బ్రహ్మ కల్పించుకుని అన్నాడు. *"త్రిమూర్తులు ఆదేశమని చెప్పు !"*


ఇంద్రుడు త్రిమూర్తులకు నమస్కరించి కదిలాడు. నారదుడు ఆయనను అనుసరించాడు.


ఇంద్రుడికీ , నారదుడికీ అనసూయ అత్రి దంపతులు సాదరంగా స్వాగతం పలికారు. సూర్యుడు కనిపించని కారణంగా భూలోకంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్ని అత్రి , అనసూయలకు వివరించారు. ఆ సరికొత్త అవాంతరానికి కారణం శీలవతి శాపం అని తెలిసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు.


*"సాధ్వి శీలవతి చేత ఆమె శాపాన్ని ఉపసంహరించే బాధ్యత మీరు స్వీకరించాలి. వదినా !"* నారదుడు వరుస కలుపుతూ అన్నాడు.


*"ఈ అభ్యర్థన మాది కాదు జననీ , త్రిమూర్తులది. వారు ముగ్గురూ మీకు ప్రత్యేకంగా ఆదేశం పంపించారు నా ద్వారా !"* ఇంద్రుడు వివరించాడు..


*"అనసూయా ! శీలవతిని కలిసి ప్రయత్నిస్తావా ?"* అత్రి ప్రశ్నించాడు. *"శాపం వెనక్కి తీసుకుంటే లోకానికి ఆమె ద్వారా ఎనలేని మేలు జరుగుతుందని వివరించు. నచ్చజెప్పు. ఎంత త్వరితంగా సూర్యుడు ఉదయిస్తే అంత మంచిది !"*


*"సూర్యుడు ఉదయిస్తే - శీలవతి భర్త అస్తమిస్తాడు కదా స్వామీ ! ఏ భార్యా భర్త మరణాన్ని కోరి తెచ్చుకోదు !”*


*“అయితే మాతా , శీలవతికి నచ్చజెప్పలేరా ?”* ఇంద్రుడు ఆందోళనతో అడిగాడు.


*"మీరు ఆ మహత్కార్యం చేయగలరని త్రిమూర్తులు గాఢంగా విశ్వసిస్తున్నారే !”* 


*“శీలవతికి నచ్చజెప్పుతాను... అయితే దానికో నిబంధన ఉంది..."* అనసూయ సాలోచనగా అంది.


*"నిబంధనా ? ఏమిటది ? చెప్పండి !"* ఇంద్రుడు ఆత్రంగా అడిగాడు.


*“నా సహాయం కోరుతూ , మీ ద్వారా ఆదేశం పంపించిన ఆ దేవదేవులు త్రిమూర్తులు ముగ్గురూ స్వయంగా నా ఆశ్రమానికి వచ్చి , నన్ను కోరాలి ! వారు స్వయంగా కోరితే ప్రయత్నిస్తాను !"* అనసూయ అంది.


అనసూయ మాట ఆశ్రమంలో ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని ఏర్పాటు చేసింది. అత్రి , ఇంద్రుడూ , నారదుడూ క్షణకాలం అనసూయ వైపు చూసి , అయోమయంగా పరస్పరం ఒకర్నొకరు చూసుకొన్నారు.


ముందుగా నారదుడు తేరుకున్నాడు. *"నారాయణ ! అదెంత పని , వదినా ! మన మహేంద్రుడు సంకల్పిస్తే త్రిమూర్తులు క్షణంలో ఈ లోగిలిలో వాలుతారు !"*


నారదుని సూచనను అర్థం చేసుకున్న ఇంద్రుడు ఆకాశం వైపు తల ఎత్తి చేతులు జోడించి , ధ్యానించడం ప్రారంభించాడు. అనసూయ లోపలి కక్ష్యలోకి వెళ్లింది. అత్రి ఆమెను ఆతృతగా వెంబడించాడు. *“అనసూయా , ఏమిటిది ? దేవదేవులు స్వయంగా కోరాలనడమేమిటి ? త్రిమూర్తులను రప్పించి ఏం చేస్తావు ?”* ఆత్రుతగా అడిగాడు అత్రి.


*"వాళ్ళని ఆడిస్తాను !"* అంది అనసూయ నవ్వుతూ. పూజా ద్రవ్యాలతో , పళ్లెంతో , జలకలశంతో అనసూయ ఇవతలకి నడిచింది. అత్రి ఆమె వెనకే నడిచాడు. అయోమయంగా చూస్తూ...


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 36*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 36*


 ఇక రెండవ దృశ్యం. ఇది నరేంద్రుడు జన్మించిన సమయంలో శ్రీరామకృష్ణులు చూసింది. ఆ సమయంలో కాశీ నుండి ఒక దివ్యకాంతి బయలుదేరి కలకత్తాలో జన్మ నెత్తినట్లు ఆయన చూశారు. 'నా ప్రార్ధన సఫలీకృతమయింది; నా సొంతమయిన అతడు ఒక రోజు ఇక్కడకు వస్తాడు' అంటూ ఆనందంతో ఆయన నృత్యం చేశారు.


ఇక శ్రీరామకృష్ణ - నరేంద్రుల సమావేశంలో జరిగిన సంఘటనలు పరికిద్దాం. సురేంద్రుని ఇంట్లో కలుసుకొన్నప్పుడే ఆతణ్ణి గుర్తించారు శ్రీరామకృష్ణులు. అప్పుడు అతడి శరీర లక్షణాలు ఇత్యాదులను నిశితంగా పరిశీలించారు. శ్రీరామకృష్ణులు తమ శిష్యులను పరీక్షించే

విధాలలో ఇది ఒకటి. నరేంద్రుని అవయవాల అమరికను గురించి శ్రీరామకృష్ణులు చెప్పడం కద్దు. "ఇదుగో చూడు, నీ అంగ లక్షణాలు గొప్పగా ఉన్నాయి. కాని ఒక్క విషయం. 


నువ్వు నిద్రిస్తున్నప్పుడు బుస్సుబుస్సు మంటూ భారంగా శ్వాసిస్తావు. ఇలాంటి వారికి ఆయుస్సు తక్కువ అని యోగులు చెబుతారు.” మళ్లీ, "నువ్వొక మెట్ట వేదాంతివి కావని నీ కళ్లు చెబుతున్నాయి. నీలో నిరాడంబర భక్తీ, ప్రగాఢ జ్ఞానము జతచేరి ఉన్నాయి" అనీ చెప్పారు. మొదటి రోజు పరీక్ష సంతృప్తి కలిగించడంతో నరేంద్రుణ్ణి దక్షిణేశ్వరం రమ్మని ఆయన ఆహ్వానించారు.


నరేంద్రుడు దక్షిణేశ్వరం వెళ్లాడు. అతణ్ణి ఒంటరిగా తీసుకొనిపోయి, "నువ్వు ఫలానా ఋషివి" అని చెప్పారు. నరేంద్రునికి ఆ మాట అర్థం కాలేదు.


కనుక రెండవసారి వెళ్లినప్పుడు అతడికి ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించి, అతణ్ణి ఉన్నత స్థితులకు అధిరోహింపజేసి, అతడి నుండి నిజాన్ని తెలుసుకోదలచి అతణ్ణి స్పృశించారు. కాని నరేంద్రుడు అందుకు సిద్ధంగా లేడు. "మహాశయా! నాకు తల్లితండ్రులున్నారు" అంటూ కేకపెట్టాడు. దాంతో శ్రీరామకృష్ణులు వదలి పెట్టారు.


మూడవసారి అతడు దక్షిణేశ్వరం వచ్చినప్పుడు మాత్రమే శ్రీరామకృష్ణులు పూర్తిగా విజయం సాధించగలిగారు. ఆ రోజు అతణ్ణి స్పృశించినప్పుడు నరేం ద్రుడు పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోయాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు అతణ్ణి ఉన్నత భావనాభూమిలో నిలిపి, అతడి అంతరాంతరాళాల్లో దాగివున్న అనేక విషయాలు తెలుసుకొన్నారు.


శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “నరేంద్రుడు బాహ్యస్మృతిని కోల్పోయిన తరుణంలో అతడు ఎవరు, ఎక్కడ నుండి వచ్చాడు, ఎందుకోసం జన్మించాడు.ఇక్కడ (ఈ ఇలలో) ఎంత కాలం ఉంటాడు మొదలైన ప్రశ్నలు అతణ్ణి అడిగాను. అతడు కూడా అంతర్ముఖుడై సముచితంగా జవాబులిచ్చాడు. నేను అతణ్ణి గురించి చూసినవాటినీ, తలచినవాటినీ ఆ జవాబులు ధ్రువీకరించాయి. వాటి నన్నింటినీ బహిర్గతం చేయరాదు. కాని అతడి జవాబుల నుండి ఒక విషయం స్పష్టమయింది. తాను ఎవరో తెలుసుకొన్న తరువాత అతడు ఈ లోకం నుండి నిష్క్రమిస్తాడు; అప్పుడే దృఢ సంకల్పంతో యోగమార్గంలో తన దేహాన్ని త్యజిస్తాడు. నరేంద్రుడు ధ్యానసిద్ధుడు, మహాత్ముడు."


శ్రీరామకృష్ణుల పరిశోధన ముగిసింది. కాని నరేంద్రుడు? అతడి మనస్సు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అతడి పరిశోధన మొదలయింది.🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం -20*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం -20*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


          *కిరన్తీ మంగేభ్యః కిరణ నికురుంబామృతరసం*

          *హృది త్వా మాధత్తే హిమకర శిలామూర్తి మివ యః |*

          *స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ*

          *జ్వరప్లుష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధార సిరయా ||*


ఇది అమృతేశ్వరీ మంత్రం. ఆవిడే అన్నపూర్ణ లలిత. ఆవిడ ఎలా వుంది? 

ఆర్ద్రంగా ఉందట. అంటే దయ, హృదయంలో తేమ, కలిగియుందట. అమ్మవారి నామాల్లో *నిత్యక్లిన్నా* అనే నామానికి అర్ధం ఎప్పుడూ ఆర్ద్రత కలిగియుండేది అని. అలాగే శ్రీ సూక్తంలో కూడా *ఆర్ద్రాం* అని చెప్తాము.


ఇప్పుడు శంకరులు అమ్మవారి ఆర్ద్రతను చంద్రకాంత శిలలతో పోల్చారు. 


హిమకర శిలామూర్తిమ్ ఇవ యః = ఆర్ద్రంగా ఉండటమే కాక కిరణాలను కూడా వెదజల్లుతున్నదట


కిరన్తీ మంగేభ్యః = కిరణములేకాక జ్ఞానాన్ని కూడా ప్రసరింపజేస్తున్నది.


కిరణ నికురుంబామృతరసం =  ఈ విధంగా హృదయంలో ధ్యానిస్తే(హృది త్వా మాధత్తే)


శకుంతాధిప ఇవ = గరుడుని వలె


స సర్పాణాం దర్పం శమయతి = సర్పముల దర్పమును పోగొట్టుతారు అమ్మవారు. సర్ప దర్పము అంటే విషము.ఇక్కడ అన్వయం విషపూరిత వ్యాధులు (వైరల్ రోగాలు,ఇప్పటి కొరోనా వైరస్ లాగా) పోగొట్టుతుంది అని.

అంతే కాక ఈ విధంగా ధ్యానం చేసి సిద్ధిని పొందిన వారు


 జ్వరప్లుష్టాన్ దృష్ట్వా సుఖయతి = రోగిని చూస్తే ఆ రోగికి ఉపశమనం కలుగుతుంది.


సుధాధార సిరయా = సిర అంటే గోవు పొదుగుకు వున్న పాలను వర్షించే చన్ను. మనలోని ప్రధాన నాడి సుషుమ్న. అది అమృతత్త్వాన్ని సాధించే నాడి. ఈ నాడిలోని అమృత ధార  పైన చెప్పిన సిర వలె ఈ అమృత సిద్ధిని పొందిన మహానుభావుల దృష్టి ద్వారా వాక్కు ద్వారా ఇతరుల వ్యాధులను పోగొట్టుతుంది. శ్రీ కంచి మహాస్వామివారి వలె.


ఈ అమృతేశ్వరి మంత్రం ఆరోగ్యాన్నిస్తుంది. కరువు కాటకాలు వున్న చోట్ల జపిస్తే వర్షాలు ధారాళంగా పడుతాయి.


ఒకప్పుడు సంగీత త్రిమూర్తులలోని ముత్తుస్వామి దీక్షితార్, కాంచీపురం మండలంలో కరవును పారద్రోలటానికి ఆనందామృత వర్షిణీ, హరాదిపూజితే, శివా భవానీ అని గానం చేస్తూ, చివరిలో "సలిలం వర్షయ  వర్షయ.. అనగానే కుంభవృష్టి కురిసి ఆ ప్రాంతం సస్య శ్యామలం అయిందట. అంత శక్తి కలదీ మంత్రం/శ్లోకం.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

Saambaar


 

Gearless


 

River


 

Lemon sharabat


 

Kaarappodi


 

12-09-2023 రాశి ఫలితాలు

 12-09-2023

రాశి ఫలితాలు

*****

మేషం

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు రకములుగా  ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవచింతన పెరుగుతుంది. సన్నిహితులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి.

--------------------------------------

వృషభం

అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల  సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు.

-------------------------------------

మిధునం

స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులు  కొంత నెమ్మదిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

-------------------------------------

కర్కాటకం

దైవ సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు. పాతబాకీలు  వసూలవుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో  పరిచయాలు కలుగుతాయి.  వ్యాపారమున మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.

-------------------------------------

సింహం

ఇంటాబయట కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ధన పరంగా చికాకులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వృత్తి వ్యాపారాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.

--------------------------------------

కన్య

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు  నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు.  దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారమున  ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారతారు. నూతన వాహన యోగం ఉన్నది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

-------------------------------------

తుల

చిన్ననాటి మిత్రులను ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగ  ప్రయత్నాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు  చేసుకుంటారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో  ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

--------------------------------------

వృశ్చికం

దూరప్రయాణాలలో వాహనం ఇబ్బందులు ఉంటాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు తప్పవు. వ్యాపారాలు  కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.

---------------------------------------

ధనస్సు

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు  ఉంటాయి.

---------------------------------------

మకరం

గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్త్తృతమవుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

కుంభం

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో  చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు

-------------------------------------

మీనం

ఆస్తి తగాదాలు మరింత చికాకు  కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.  నిరుద్యోగ ప్రయత్నాలు  నత్తనడకన సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------

పండితుడు తత్త్వజ్ఞానం

 🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*నవద్వారమిదం వేషం* 

*త్రిస్థూపం పఞ్చసాక్షికమ్I*

*_క్షేత్రాధిష్ఠితం విద్వాన్యో* 

*వేద స పరః కవిఃII_*

 

*_విదుర నీతి_*


*తా𝕝𝕝 ఈ ఇంటికి తొమ్మిది తలుపులు, మూడు స్తంభాలు, ఐదుగురు పరిచారకులు ఉన్నారు మరియు ఆత్మ చేత నడవబడుతుంది.... ఇది తెలిసిన పండితుడు తత్త్వజ్ఞానం గల గొప్ప జ్ఞాని......*


🧘‍♂️🙏🪷 🙏🏼🙏

ఇష్టపడే వారిని మరువరాదు

 *1902*

*కం*

మనలను కోరెడువారలు

మనమెంచెడివారికన్న మాన్యులు నెపుడున్.

మనమది కోరిక కన్నను

మనమదినే మెచ్చుజనుల మరువకు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనం కోరుకునే వారి కన్నా మనల్ని ఇష్టపడే వారే గొప్ప వారు. మన మనస్సు కోరుకునే వారి కన్నా మన మనస్సు నే ఇష్టపడే వారిని మరువరాదు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మంగళవారం, 12 సెప్టెంబరు 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


మంగళవారం, 12 సెప్టెంబరు 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

నిజ శ్రావణ మాసం - బహళ పక్షం

తిథి: త్రయోదశి  రా2.01 వరకు 

భౌమ వాసరః

నక్షత్రం: ఆశ్లేష రా12.00 వరకు

యోగం:శివం తె3.12 వరకు

కరణం:గరజి మ1.03 వరకు తదుపరి వణిఙ రా2.01

వర్జ్యం:ఉ11.38 - 1.24

దుర్ముహూర్తము:ఉ8.16 - 9.05 &

రా10.46 - 11.33

అమృతకాలం:రా10.14 - 12.00

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి:  సింహం

చంద్రరాశి : కర్కాటకం 

సూర్యోదయం:5.50 || సూర్యాస్తమయం:6.04


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*