25, సెప్టెంబర్ 2023, సోమవారం

సోమవారం, సెప్టెంబరు 25, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


సోమవారం, సెప్టెంబరు 25, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - శుక్ల పక్షం

తిథి:ఏకాదశి రా1.37 వరకు  

వారం:సోమవారం (ఇందువాసరే)

నక్షత్రం:ఉత్తరాషాఢ ఉ9.16 వరకు

యోగం:అతిగండ మ1.56 వరకు

కరణం:వణిజ మ2.43 వరకు తదుపరి భద్ర రా1.37 వరకు

వర్జ్యం:మ1.01 - 2.31

దుర్ముహూర్తము:మ12.16 - 1.04 &

మ2.40 - 3.28

అమృతకాలం:రా10.00 - 11.30

రాహుకాలం:ఉ7.30 - 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00

సూర్యరాశి: కన్య

చంద్ర రాశి : మకరం 

సూర్యోదయం:5.52

సూర్యాస్తమయం: 5.53


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

*గణేశ పంచరత్నమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*_సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం_*

*_దరేదరోదరం వరం వరే భవక్త్ర మక్షరం_*

*_కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం_*

*_మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం_*


  *గణేశ పంచరత్నమ్* - 3


*సమస్త లోకాలకు శుభం కలిగించే వానికి, లోకాన్ని గజాసురుని బారినుండి కాపాడిన వానికి, పెద్ద ఉదరముతో, గజముఖముతో జనులను ఆశీర్వదించే వానికి, కరుణను కురిపించే వానికి, తప్పులను క్షమించి, శుభము, యశస్సు కలిగించే వానికి, తనకు నమస్కరించే వానికి సర్వ శుభాలు కలుగ జేసే విఘ్నరాజునికి నా నమస్కారములు*.....


🧘‍♂️🙏🪷 ✍️🙏

మన ఆరోగ్యం


మన ఆరోగ్యం….


*మీరు పెద్దయ్యాక ఎక్కువగా మాట్లాడండి*


 * రిటైర్ అయినవారు (సీనియర్ సిటిజన్లు) ఎక్కువగా మాట్లాడాలని వైద్యులు చెబుతున్నారు, ఎందుకంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా నిరోధించడానికి ప్రస్తుతానికి మార్గం లేదు.  ఎక్కువ మాట్లాడటం ఒక్కటే మార్గం*


 *సీనియర్ సిటిజన్లతో ఎక్కువగా మాట్లాడటం వల్ల కనీసం మూడు ప్రయోజనాలు ఉన్నాయి*


 *మొదట: మాట్లాడటం మెదడును సక్రియం చేస్తుంది మరియు మెదడును చురుకుగా ఉంచుతుంది, ఎందుకంటే భాష & ఆలోచన ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి, ముఖ్యంగా త్వరగా మాట్లాడేటప్పుడు, ఇది సహజంగా వేగంగా ఆలోచించే ప్రతిబింబం మరియు జ్ఞాపకశక్తిని పెంచుతుంది.  మాట్లాడని వృద్ధులు జ్ఞాపకశక్తిని కోల్పోయే అవకాశం ఉంది*


 *రెండవది: మాట్లాడటం వల్ల చాలా ఒత్తిడి తగ్గుతుంది, మానసిక అనారోగ్యాన్ని దూరం చేస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది.  మనం తరచు ఏమీ అనకుండా గుండెల్లో పెట్టుకుని ఊపిరి పీల్చుకుంటాం._నిజమే!  కాబట్టి!  సీనియర్లు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇస్తే బాగుంటుంది*


 *మూడవది: మాట్లాడటం వలన చురుకైన ముఖ కండరాలు & అదే సమయంలో, గొంతు వ్యాయామం & ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది, అదే సమయంలో, ఇది కళ్ళు & చెవులు క్షీణించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు మైకము & వంటి గుప్త ప్రమాదాలను తగ్గిస్తుంది.  చెవిటితనం*


 *క్లుప్తంగా చెప్పాలంటే, పదవీ విరమణ పొందినవారు, అంటే సీనియర్ సిటిజన్లు * అల్జీమర్స్ రాకుండా ఉండాలంటే వీలైనంత ఎక్కువ మాట్లాడటం మరియు వ్యక్తులతో చురుగ్గా సంభాషించడం ఒక్కటే మార్గం.  దీనికి వేరే చికిత్స లేదు.*

  

 *కాబట్టి, ఎక్కువగా మాట్లాడుదాం మరియు బంధువులు మరియు స్నేహితులతో ఎక్కువగా మాట్లాడేలా ఇతర సీనియర్లను ప్రోత్సహిద్దాం*


 * సహాయకరంగా మరియు ఆరోగ్యంగా ఉండవచ్చు;  వృద్ధ పౌరుల జీవితంపై సంభావ్య ప్రభావం కారణంగా*

 కాబట్టి సీనియర్ సిటిజన్లకు ☝🏻 షేర్ చేయండి.✍️

                                -సేకరణ.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

భగవత్కృప

 శ్లోకం:☝️

*దుర్లభం త్రయమేవైతత్*

 *దేవానుగ్రహహేతుకమ్ ।*

*మనుష్యత్వం ముముక్షుత్వం*

 *మహాపురుషసంశ్రయః ॥*


భావం: మానవజన్మ, ముక్తికాంక్ష మరియు మహానుభావులతో సహవాసం (సత్సంగం) - ఈ మూడు విషయాలు భగవత్కృప వలన మాత్రమే లభిస్తాయి.🙏

మహాభారతములో - ఆది పర్వము*

 *మహాభారతములో - ఆది పర్వము*


*ప్రథమాశ్వాసము*


           *5*


*ఉదంకుడు పౌష్యుడు శాపప్రతిశాపాలు ఇచ్చుకొనుట*


కుండలములు తీసుకుని రాజు వద్దకు వెళ్ళగా రాజు ఉదంకుని భోజనం చేసిన తరువాత వెళ్ళమని చెప్పాడు. రాజు కోరిక మేరకు ఉదంకుడు పౌష్యుని ఇంటిలో భోజనం చేస్తుండగా అన్నంలో ఒక వెంట్రుక వచ్చింది. అందుకు ఉదంకుడు కోపించి చూడకుండా భోజనం పెట్టినందుకు గుడ్డి వాడివి కమ్మని శపించాడు. పౌష్యుడు కోపించి "ఇంత చిన్న దోషానికి అంత పెద్ద శిక్షా. నేను నీకు ప్రతి శాపం ఇస్తున్నాను. నీవు సంతాన హీనుడవు కమ్ము" అన్నాడు. తన అపరాధం గ్రహించిన  ఉదంకుడు మహారాజుతో అయ్యా ! నాకు సంతానం కావాలి కనుక నీ శాపాన్ని ఉపసంహరించు " అని కోరగా పౌష్యుడు " మనసు నవనీతం మాట వజ్రాయుధం ఇది బ్రాహ్మణ స్వభావం. క్షత్రియులకు ఇవి రెండు విపరీతములే కనుక నా శాపం ఉపసంహరించ లేను కనుక నీవు ఉపసంహరించు" అన్నాడు. అందుకు ఉదంకుడు "కొంతకాలం తరువాత నా శాపం ఉపసంహరింపబడుతుంది " అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు.

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* *🌸 సాంఖ్య యోగః 🌸*

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

*🌸 సాంఖ్య యోగః 🌸*


*2-అధ్యాయం, 37వ శ్లోకం*


 *హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్య సే మహీమ్ |* 

 *తస్మా దుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః || 37* 


 *ప్రతిపదార్థం* 


వా = ఒక వేళ; హతః = (నీవు ) చంపబడినచో; స్వర్గమ్ = స్వర్గమును; ప్రాప్స్యసి = పొంద గలవు;వా లేక (అట్లు గాక ); జిత్వా =( నీవు యుద్ధమున ) జయించినచో; మహీమ్ = భూమండల, రాజ్యమును; భోక్ష్య సే = అనుభవించెదవు; తస్మాత్ = అందు వలన; కౌంతేయ = కుంతీకుమారా ! (అర్జునా !); యుద్ధాయ = యుద్ధము చేయట కొరకు; కృత నిశ్చియః = తిరుగు లేని నిశ్చయము గలవాడవై; ఉత్తిష్ఠ = లెమ్ము (కటి బద్ధుడవు కమ్ము )


 *తాత్పర్యము* 


 ఓ అర్జునా! రణరంగమున  మరణించినచో నీకు వీర స్వర్గము ప్రాప్తించును. యుద్ధమున జయించినచో రాజ్య భోగములను అనుభవింప గలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్దమునకు లెమ్ము.


 *సర్వేజనా సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

Ganesh


 

కేదారేశు భజించితిన్




 శ్రీ మహాద్రి పార్శ్వేచ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రాః సురాసురైర్యక్ష మహోరగొద్ద్యె కేదారమీశం శివమేక మీడే


ॐ ఓం నమః హరాయ 


కేదారేశు భజించితిన్ శిరమునన్ గీలించితిన్

పుష్పంబు భవత్పదద్వయముపై

 శుభోదయం🙏


"ఒక పుష్పంబు భవత్పదద్వయముపై

 నొప్పంగ సద్భక్తి రం

 జకుడైపెట్టిన,పుణ్యమూర్తికి పునర్జన్మంబులేదన్న, బా

యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచున్ పెద్ద  నై

 ష్ఠికుడై యుండెడువాడు,నీవగుట తా

 చిత్రంబె? సర్వేశ్వరా!


సర్వేశ్వర శతకం-చిమ్మపూడి అమరేశ్వరుడు.


భావం: ఓసర్వేశ్వరా!నీపాదాలపై భక్తితో ఒకపువ్వుంచి

ప్రార్ధించినవాడికి పునర్జన్మమేలేదని పురాణాలుప్రవచిస్తున్నాయ్.అలాంటిది ముక్కాలములయందూ మూడుసంధ్యలా ,మహానిష్ఠతో నిన్నర్చించేవాడు నీలోసమైక్యమైతే యిక నాశ్చర్యపడవలసినదేమున్నది?అనిభావం.


          ఈశ్వరార్చనకు ఫలితం జన్మరాహిత్యమేనని,ఈశ్వరసాయుజ్యమేనని చెప్పే యీపద్యం.కాకతిరాజులకు

సమకాలికుడైన చిమ్మపూడి రచించుట విశేషం.🙏🙏🙏👌👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఒక్కడే కొడుకు.

 *Rapeti Mahalakshmi Naidu    Raghuram Colony  Anakapalli*

                

      *😀డబ్బే జీవితమూ కాదు😂*

           

*ఒక జడ్జి తన వృత్తినుండి పదవీవిరమణ అయ్యాక తన భార్యతో తనలోని భావాలను ఇలా పంచుకుంటున్నారు.*


*”లక్ష్మీ! నేను లాయర్ గా ఉన్నప్పుడు కాని, జడ్జిగా ఉన్నప్పుడు కాని ఈరోజు నేను చూసిన నా చివరికేసు లాంటిది చూడనే లేదు” అని అన్నాడు.*


*“ఏంటా కేసు?” అని ఆమె అడగగా…*


*”ఒక తండ్రి, తన కొడుకు తనకు నెలకు డబ్బులు ఇవ్వడం లేదని కేసు“ అన్నాడు.*


*కొడుకుని పిలిచి, “ఏంటయ్యా, నీ తండ్రికి నెలకు సరిపడ డబ్బులు ఎందుకు ఇవ్వడంలేదు?” అని అడిగాను.*


*”మా తండ్రిగారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పదవివిరమణ పొందిన వ్యక్తి. నెలనెలా ఆయనకు పెన్షన్ వస్తున్నది. బాగానే డబ్బులు ఉన్నవ్యక్తి. నాపైన ఇలాఎందుకు కేసుపెట్టాడో అర్థం కాలేదు” అన్నాడు.*


*ఆ తండ్రి, “అవును నాకు డబ్బుకు లోటులేదు కాని, నా కొడుకు నెలకు 100 రూపాయలు కానివ్వండి, స్వయంగావచ్చి అందించేలా తీర్పుఇవ్వమని" అడిగాడు.*


*తీర్పు చెప్పాక, ఆ తండ్రిని కలిసాను. “ఎందుకయ్యా ఇలా అడిగావు” అని*


*”మాకు ఉన్నది ఒక్కడే కొడుకు. మీరు ఇచ్చే తీర్పు కారణంగా అయినా నెలకు ఒక్కసారి మా దగ్గరకువచ్చి, మాతో గడిపివెళ్ళగలడని ఆశ, వాడంటే మాకు ప్రాణం।” అని అన్నాడు.*


*ఇలా చెబుతూ, ఆయన కళ్ళు తడిచాయి.*


*డబ్బే ప్రధానం అనుకుంటారు. అంతకంటే ఎక్కువగా మనకోసం ఎదురుచూసే వారుంటారు అని గుర్తించలేము.*


*నాకెందుకో అప్పటి కన్నవారికి, నేడు ఉన్న తల్లితండ్రులకి చాలాతేడా కనిపిస్తుంది.*


*మా పిల్లలు డబ్బు సంపాదించకపోయినా పర్లేదు, మా కళ్ళ ముందు ఉంటే చాలు! సరిపడా సంపాదన చాలు! అనుకునేవారు.*


*నేడు పిల్లలు అంటే వారు విధేశాలకు వెళ్ళిపోవాలి, లక్షలు సంపాధించాలి అని కోరుకుంటున్నారు.*


*అందుకే ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు అనేవాటికి విలువ లేకుండా పోయింది.*


*అనురాగం, ఆప్యాయత అందని ద్రాక్షపళ్ళు కాకూడదు. కనిపెంచిన తల్లిదండ్రులకు.*


 *🌹లోకా సమస్తా సుఖినోభవన్తు!🌹*

. కొత్త పార్లమెంట్

 

కొన్ని స్నిప్పెట్‌లు... కొత్త పార్లమెంట్.


 *కాంగ్రెస్ నియంత్రణలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో లోక్‌సభ స్పీకర్‌గా మీరా కుమార్ ఎన్నికయ్యారు.  కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆమోదించారు.*

 సంవత్సరం: 2012

 PM: మన్మోహన్ సింగ్

 పార్టీ: కాంగ్రెస్

 *విస్తీర్ణం: 35,000 చదరపు మీటర్లు*

 *ఖర్చు : ₹.3000 కోట్లు*

 ( **సూచిక ద్రవ్యోల్బణం- 2020కి మొత్తం - ₹. 3900 కోట్లు)*


 బీజేపీ ప్రభుత్వంలో ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

 గ్రౌండ్ బ్రేకింగ్, మరియు నిర్మాణం ప్రారంభం


 సంవత్సరం: (అక్టోబర్) 2020

 భవనం: కొత్త పార్లమెంట్ భవనం

 ప్రధానమంత్రి: నరేంద్ర మోదీ

 పార్టీ: బీజేపీ

 *విస్తీర్ణం: 65,000 చదరపు మీటర్లు*

 *ఖర్చు: ₹ 970 కోట్లు*

 (2012 - 2019 మధ్య ద్రవ్యోల్బణ సూచికను విస్మరించండి)


 ప్రాజెక్ట్ పూర్తి - *20 మే 2023*

 ప్రారంభోత్సవం- *28 మే 2023*



 రెండు వేర్వేరు ప్రభుత్వాల క్రింద వేర్వేరు కథనాల నైతికత.


 కాంగ్రెస్ పాలనలో బ్రోకరేజీ, అవినీతి లేకుండా ఏ పనీ జరగలేదు.


 మోదీ పాలనలో ఈ ప్రాంతం రెట్టింపు అయింది

 అయితే ఖర్చు పావు వంతు.


 *ఎందుకంటే , బ్రోకరేజ్ లేదు, * *కమీషన్ లేదు, స్కామ్ లేదు*.


 *బీజేపీ పాలిత భారత్* అవసరానికి ఈ రాజకీయ, ఆర్థిక పాఠం చాలు.


*మన దేశం కోసం* 

🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹

రామాయణమ్ 335

 రామాయణమ్ 335

...

ఏమి చేయవలెనో నిర్ణయించండి!..

.

మీరంతా ఏకాభిప్రాయముతో ముక్త కంఠముతో కర్తవ్యమును తెలిపిన అది ఉత్తమమైన ఆలోచన అగును .

.

అటులగాక మీలో మీరు అభిప్రాయ భేదములతో ఉండి చివరకు ఒక అభిప్రాయమునకు వచ్చిన అది మధ్యమము ...(దీనిగురించి..మధ్యమము.. modern వివరణ క్రింద చూడండి)

.

ఎవరికి వారు అభిప్రాయ భేదము లతో ఉండి ఐకమత్యములేక ఏకాభిప్రాయమునందు ప్రీతి చూపక చేయు మంత్రాంగము అధమము .

.

అందుచేత ఉత్తమమైన బుద్ధిగల మీరంతా ఆలోచన చేసి ఇప్పటికిప్పుడు మన కర్తవ్యము తెలుపుడు ,దానినే నేను అంగీకరించి అమలు పరచెదను.

.

ఆ రాముడు సామాన్యుడు కాడు సముద్రమును సుఖముగా దాటగలడు అవసరమయినచో సముద్రమును ఎండించి వేయ గలడు లేక దారి మళ్ళించి వేయగలడు ,సముద్రమును చీల్చి దారి చేసుకొనగలడు .

.

తమ రాజైన రావణుని మాటలు శ్రద్ధగా విన్న మంత్రులు తమతమ అభిప్రాయములను ప్రకటింపచేస్తున్నారు ....అయితే వారెవరికీ రాముని శక్తిసామర్ధ్యముల పట్ల కనీస అవగాహన కూడా లేదు ...వారు ఈ విధముగా పలుక జొచ్చిరి.

.

NB

.

There is a concept called as Six thinking hats 

This is a system designed by Edward de Bono ,a Professor of psychology. 

.

This  tells about a tool for group discussion and individual thinking. 

.

He assigns six different colors for six thought streams .

He calls them as hats. Black ,red,green,blue,yellow ,

and white hats ...difference of opinion is natural and inevitable....but how to arrive at  the best !! 

.

"Six Thinking Hats"   this he christened as ...

Parallel Thinking .

.

This process provides a way  for groups to plan thinking.

.

This method was  trialled within the U. K's civil service.

.

ఈ రకమైన మంత్రాంగము మధ్యమము అని వాల్మీకి మహర్షి చెప్పారు...

.

ఇలాంటి మంత్రాంగము ,ఆలోచనా విధానాల గురించి మన సాహిత్యములో ఎంతో ఉంది. 

.

వూటుకూరు జానకిరామారావు

బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం, బీచుపల్లి క్షేత్రము

 https://beechupallybrahmanasatram.com/

బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం, బీచుపల్లి క్షేత్రము,  NH - 44

జోగుళాంబ గద్వాల జిల్లా -509133.

==================

మహాలయ పక్షాలు - 

బ్రాహ్మణ సమారాధన

==================

తేదీ 30-09-2023 నుండి 14-10-2023 వరకు మహాలయ పక్షాలు పురస్కరించుకుని పితృ దేవతలకు మహాలయ పక్షాలలో నదీ పరీవాహక ప్రాంతానికి వచ్చి కార్యక్రమం చేసుకోవడం వీలుకాని వారికి, స్వంత ఇంట్లో కూడా చేసుకోలేని పరిస్థితులు ఉన్నవారికి కూడా బ్రాహ్మణ సమారాధన అనే పితృ మోక్ష సేవా కార్యక్రమం అందరికి ట్రస్టు బోర్డు అవకాశము కల్పించినది.  మీరు, మీ సన్నిహితులు ఈ సదవకాశం వినియోగించు కొనగలరని మనవి.


Rs. 1,000/-లు (ఒక్కరి పేరున మాత్రమే) పంపిన వారికి మన సత్రంలో మహాలయ పక్షాలలో బ్రాహ్మణ సమారాధనను మీరు సూచించిన వారి పేరుపై తిథి లేదా తేదీ రోజున సమారాధన చేయుటకు నిర్ణయించనైనది.


మీరు సత్రం QR Code లో డబ్బులు వేసినట్లుగా మరియు అన్నదానం చేసే వారి పూర్తి వివరములు మరియు పోస్టల్ పూర్తి చిరునామా Watsup No. 9440722088 ద్వారా తెలియజేసినచో మీకు రశీదుని Post/WhatsApp ద్వారా పంపడం జరుగుతుంది.


కావున అందరు పితృ యజ్ఞంలో పాల్గొన వలసినదిగా కోరుచున్నాము.

Sri Anjaneya Brahamana Nityannadana Trust Beechupally

A/c No. 62022201804

IFC SBIN0020187

Branch: Wanaparthy

                     ఇట్లు:-   ట్రస్ట్ బోర్డు బ్రాహ్మణ సత్రం,బీచుపల్లి క్షేత్రము

పంచాంగం 25.09.2023 Monday,

 ఈ రోజు పంచాంగం 25.09.2023 Monday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష: దశమి తదుపరి ఏకాదశి తిధి ఇందు వాసర: ఉత్తరాషాఢ నక్షత్రం అతిగండ యోగ: గరజి తదుపరి వణిజ తదుపరి భద్ర కరణం ఇది ఈరోజు పంచాంగం 

దశమి ఉదయం 07:54 వరకు తదుపరి ఏకాదశి రా.తె 05:00 వరకు.

ఉత్తరాషాఢా పగలు 11:51 వరకు .

సూర్యోదయం : 06:09

సూర్యాస్తమయం : 06:06

వర్జ్యం : పగలు 03:29 నుండి 04:56 వరకు.

దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:31 నుండి 01:19 వరకు తిరిగి మధ్యాహ్నం 02:55 నుండి 03:43 వరకు.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.


యమగండం : పగలు 10:30 నుండి 12:00 వరకు.  


ఈ రోజు స్మార్తానాం ఏకాదశ్యుపవాస: , వామన జయంతి , పరివర్తనైకాదశి 


శుభోదయ:, నమస్కార:

24, సెప్టెంబర్ 2023, ఆదివారం

భారత్ గౌరవ్‌ - ఊలా రైల్‌

 భారత్ గౌరవ్‌ - ఊలా రైల్‌


### సప్తమోక్ష క్షేత్ర యాత్ర లో టిక్కెట్‌ ధరల తగ్గింపు ###


### మిడిల్‌, అప్పర్‌ బెర్తులు మాత్రమే కలవు ###


 టిక్కెట్ పై 20 శాతం వరకు డిస్కౌంట్‌ కలదు 

 బుకింగ్‌ ఆఖరు తేదీ -సెప్టెంబర్‌ 28, సోమవారం 


అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అక్టోబర్‌ 12వ తేదీ వరకు జరిగే ఈ యాత్రలో 

ద్వారక, పుష్కర్‌, మాతృగయ, కురుక్షేత్ర, హరిద్వార్‌, బృందావనం, మధుర, ఉజ్జయిని - నాగేశ్వర-ఓంకారేశ్వర  క్షేత్రాల్లో మీకు దర్శనం చేయించి తిరిగి మీ గమ్యస్థానాలకు చేరుస్తుంది..


#%# సమయానుకూలతను బట్టి జైపూర్‌, ఆగ్రా నగరాల సందర్శన కూడా ఏర్పాటు చేయడమైనది #%#


అక్టోబర్‌ 1న చెన్నైలో బయలుదేరి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, బాపట్ల, గుంటూరు, మిర్యాలగూడ, హైదరాబాద్‌, కాజీపేట, రామగుండం స్టేషన్లో ప్రయాణికుల్ని ఎక్కించుకొనును. 


ఈ రైలులో ప్రయాణించే వారికి క్షేత్ర సందర్శన సమయంలో భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయబడును. ఏసీ తరగతుల వారికి ఏసీ రూమ్‌లు, స్లీపర్‌ క్లాసుల వారికి నాన్‌ ఏసీ రూములు ఏర్పాటు.

రైల్వే స్టేషన్‌ నుంచి ఆలయాలకు, మరలా స్టేషన్‌ చేర్చడానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయబడును..


రైలులో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కిచెన్‌లో ఆహారం తయారీ 


ఉదయం - కాఫీ / టీ / పాలు / అల్పాహారం

మధ్యాహ్నం - రుచికరమైన బ్రాహ్మణ భోజనం

సాయంత్రం - స్నాక్స్‌ /టీ/కాఫీ/పాలు

రాత్రి - అల్పాహారం అందించబడును


మన రైలులో పది మంది పురోహితుల బృందం ఆధ్వర్యంలో పూజ, పితృతర్పణ కార్యక్రమాల నిర్వహణ


బృందావనంలో ప్రత్యేక పూజలు, పుష్పగిరి పీఠాధిపతి  అభినవోద్దండ శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారిచే 

''మహా సుదర్శనహోమం'' వేదాశీర్వచనం


భద్రత

----

1. యాత్రికుల సేవల కోసం వంద మంది రైల్వే సిబ్బంది, ప్రత్యేక వాలంటీర్లు

2 . క్షేత్ర దర్శనాల్లో ఒక్కో బోగి నుంచి ఇద్దరు వాలంటీర్ల సహాయం

3. రైలులో సీసీ కెమెరాలు, మైక్‌ ఏర్పాటు చేయడమైనది.

4. రైలులో లగేజీ ఉంచి సందర్శనకు వెళ్ళవచ్చును, సెక్యూరిటీ సౌకర్యం కలదు.

5. ఈ రైలులో ప్రయాణించే వారికి ప్రయాణ ఇన్స్యూరెన్స్‌ వర్తించును.

6. ఆరోగ్య పర్యవేక్షణకు మెడికల్‌ అసిస్టెంట్‌


బుకింగ్‌ విధానం

---------

1. ఆధార్‌ కార్డు పంపించాలి.

2. బుకింగ్‌ అమౌంట్‌ జిపే, ఫోన్‌ పే, అకౌంట్‌ పే

3. బుకింగ్ సమయంలో మీకు బెర్తు నెంబరు కేటాయించబడును.

4. సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగులకు ''ఎల్టీసీ'' వర్తించును.


ఈ పన్నెండు రోజుల యాత్రకుగాను ఒక్కరికి

3rd AC........Rs.50,000/- గాను

స్లీపర్ క్లాస్..........38000/-లుగాను నిర్ణయించడమైనది.

ఈ ధరలపై 40 శాతం వరకు డిస్కౌంట్‌ కలదు


వెంటనే సంప్రదించండి..

రమేష్‌ అయ్యంగార్‌, 83310 08686, 83320 08686