2, అక్టోబర్ 2023, సోమవారం

శర్మద గారికి ఘనసన్మానము






 నిన్న మేడిపల్లి-హైదరాబాద్ లో బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారు జరిపిన జ్యోతిషసభలో మన ఆత్మీయ సభ్యులు శ్రీ శర్మద గారికి జరిగిన ఘనసన్మానము యొక్క చిత్రం.

 మేడిపల్లి-హైదరాబాద్ లో బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారు జరిపినజ్యోతిషసభలో *జ్యోతిష ప్రముఖ* అను బిరుదముతో ఘనసన్మానము చేయటమైనది.

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -63🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -63🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*🌷తిరుపతి గంగమ్మ జాతర:🌷*


ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్కసారక్క జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది.ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది.


అన్ని గ్రామాలకూ ఉన్నట్టే తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మకు ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.


పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. 

యుక్తవయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట.


 దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. 


వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు.


తమిళ సంప్రదాయం ప్రకారం చిత్రినెల చివరి మంగళవారం రోజున చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి, వడిబాలు కడతారు.


 సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కులపెద్దల నుంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాల సారెను తీసుకువస్తారు. ఈ పసుపుకుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు వూరి ప్రజలెవరూ పొలిమేరలు దాటరాదంటూ చాటింపు వేస్తారు.


మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. అలనాడు పాలెగాణ్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు.


 • ఈ క్రమంలో వెుదటిరోజున బైరాగివేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగివేషం వేసిందని భక్తుల నమ్మిక. 


• రెండోరోజు బండవేషం. మానవుడు కష్టనష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు.


 • మూడోరోజు తోటివేషం. దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు.


 • నాలుగోరోజు దొరవేషం. డప్పులు, వాయిద్యాల సందడి మధ్య దొరవేషదారులు వూరంతా వూరేగుతారు. 


స్థలపురాణం ప్రకారం శనివారంనాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరిస్తుంది.


నాలుగోరోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్య వాచకాలు చెబుతుందట.


 దీనిని గుర్తుచేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. ఆరోరోజు సున్నపుకుండల వేషం వేస్తారు. ఏడోరోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. 


గోపురాన్ని పోలిన సప్పరాలను(వెదురు బద్దలతో) తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాల వేషం వేస్తారు.


ఇక చివరిరోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తారు. 


బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రినుంచే పడిగాపులు కాస్తారు.


పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది.


గంగమ్మతల్లి తిరుమల వేంకటేశుడికి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో తితిదే నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర నాలుగోరోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపుకుంకుమలూ శేషవస్త్రాలూ గంప, చేట తదితర మంగళద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు.


 పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారట. ఈ విషయం తెలిసినవారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు.


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం🪐* . *41వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *41వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*బుధగ్రహ జననం - 4*


విద్యార్థులు కళ్ళు మూసుకుని వేదసూక్తాన్ని వల్లెవేస్తున్నారు. బృహస్పతి అరమోడ్పు కళ్ళతో ఏకాగ్రతగా ఆలకిస్తున్నాడు.


చంద్రుడు కళ్ళు మూసుకోలేదు. వల్లె వేయడం లేదు. ఆలకించడమూ లేదు. అతని చూపులు ఆశ్రమ వాతాయనం మీదే ఉన్నాయి. వాతాయనం ముందు వయ్యారంగా నిలుచుని , తన వైపే చూస్తున్న తార మీదే ఉన్నాయి. తనను చూస్తున్న తార కళ్ళు నవ్వుతున్నాయి. పెదవులూ నవ్వుతున్నాయి...


*"చంద్రా !"* బృహస్పతి కంఠస్వరం చంద్రుణ్ణి ఉలిక్కిపడేలా చేసింది.


చూపుల్ని తిప్పి , ఆందోళనగా చూశాడు చంద్రుడు గురువుగారి వైపు. 


బృహస్పతి కళ్ళు తీక్షణంగా అతన్నే చూస్తున్నాయి. *"నీ మనసు పాఠం మీద లేదు..."*


*"క్షమించండి గురువుగారూ..."* చంద్రుడు సిగ్గుపడుతూ అన్నాడు.. *"విద్యార్జనలో ఏకాగ్రత అవసరం !"* బృహస్పతి మందలింపుగా అన్నాడు. *"జాగ్రత్త సుమా !"*


*"తారా ! ఇవాళ ఇంద్రసభకు వెళ్తున్నాను. "* పూజ ముగించిన బృహస్పతి అన్నాడు. *"ఎప్పుడు తిరిగొస్తారు ?"* తార ఆయన వైపే చూస్తూ అంది.


*"రాత్రి భోజనం వేళకు వచ్చేస్తాను ! ఆ... చంద్రుడు విద్యార్థుల్ని చూసుకుంటాడు..."* 


*"ఎవరో ఒకరు చూసుకోవడం మంచిది. లేకపోతే ఒకటే అల్లరి చేస్తారు. చిన్నపిల్లలు కదా !"* తార నవ్వుతూ అంది. 


*"నువ్వు జాగ్రత్త సుమా... పుంజికస్థల చేత పనులు చేయించుకో..."* నీరసంగా కనిపిస్తున్న తారను చూస్తూ అన్నాడు బృహస్పతి. 


*"అలాగే.... మీరు జాగ్రత్త స్వామీ !”* అంది తార.


నైవేద్యం పెట్టిన ఫలాలను అల్పాహారంగా స్వీకరించి , బృహస్పతి వెళ్ళిపోయాడు. తార వాతాయనం ముందు నిలబడి చూస్తోంది. విద్యార్థులందరూ వరుసలుగా కూర్చుని , ఏవో మంత్రాలు పఠిస్తున్నారు. చంద్రుడు వాళ్ళ ముందు నిలబడి - గురువుగారి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు.


తారలో రకరకాల ఆలోచనలు తేనెపట్టులోంచి తేనెటీగల్లా లేస్తున్నాయి. ఆలోచనల్లోంచి తేరుకున్న ఆమె పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. వాతాయనం ముందు నుంచి కదిలింది.


తార నీళ్ళ పాత్రల ముందు నిలుచుంది. నవ్వుతూ ఒక పాత్రను అందుకుంది. వెలుపలికి వెళ్ళి పాత్రలోని నీటిని చెట్టుపాదులో పోసింది. ఆ పాత్రను అక్కడే పెట్టి ,

 *"పుంజికా !"* తార బిగ్గరగా పిలిచింది. ?“ఓ పుంజికస్థలా ! ఎక్కడున్నావ్ ? ఇలారా !"* క్షణంలో పుంజికస్థల అక్కడికి వచ్చింది. *"అమ్మా... పిలిచారా ?"*


*"ఆ ! నీళ్ళు ఎందుకో కలుషితంగా ఉన్నాయి. పాదుల్లో పోసేశాను. నదికి వెళ్ళి నీళ్ళు తీసుకురా ! పిల్లలందరికీ త్రాగటానికి కావాలిగా. అన్ని పాత్రల నిండా ఉండాలి. నీళ్ళు !"*


*“సరే... అలాగే తీసుకొస్తాను..."* అంటూ పుంజికస్థల పాత్రను అందుకుంది. తమ దగ్గరగా వస్తున్న గురుపత్నిని చూస్తు విద్యార్థులు మంత్రపఠనం ఆపారు. విద్యార్థుల చూపుల్ని గమనించిన చంద్రుడు తల తిప్పి తార వైపు చూశాడు. తార అతని వైపు చూడడం లేదు.


విద్యార్థుల ముందు నిలబడి తార చిరునవ్వుతో చూసింది. *"ఇవాళ గురువుగారు లేరు కదా ! మీరు ఒక పని చేయాలి. వంటచెఱకు అయిపోవస్తోంది. అరణ్యంలోకి వెళ్ళి వంటచెఱకూ , సమిధలూ ఏరి తీసుకురండి. సనాతనుడు మీకు నాయకత్వం వహిస్తాడు. అతను చెప్పినట్టు నడుచుకోండి !"*


*"ఇవాళ మాకు నాయకుడిగా చంద్రుణ్ణి నియమించారమ్మా గురువుగారు !"* సనాతనుడు లేచి నిలుచుని , వినయంగా అన్నాడు. 


*"నాకు తెలుసు ! చంద్రుడు ఆశ్రమంలో , తోటలో కొన్ని పనులు చేయాలి. ఆ పనులు మీరూ , నేనూ చేయలేం. మీరు అరణ్యానికి వెళ్ళండి !”*


విద్యార్థులు ఉత్సాహంగా లేచారు.


చంద్రుడు అనుమానిస్తూ తార వైపు చూశాడు. *"గురువుగారు నన్ను..."*


*"ఏ పనికి నియోగించారో నాకు తెలుసు చంద్రా ! గురుశుశ్రూష ఎంత ముఖ్యమో , గురుపత్నీ సేవ కూడా అంతే ముఖ్యం !"* అంటు తార ఉత్సాహంగా అరణ్యం వైపు ఉరకలు పెడుతున్న విద్యార్థుల్ని చూస్తూ ఉండిపోయింది.


చంద్రుడు ఆమె వైపే చూస్తున్నాడు. ఎదురుగా చూస్తే ఎంత అందంగా ఉందో , ప్రక్కవాటంగా కూడా అంతే అందంగా , ఆకర్షణీయంగా ఉంది ఆమె. ఎందుకో తెలీదు గానీ , అందరు విద్యార్థులూ పిలుస్తున్నట్టు ఆమెను 'అమ్మా' అని పిలవాలనిపించడం లేదతనికి , ఆశ్రమంలో ఆడుగు పెట్టిన నాటినుంచీ !


తార తటాలున అతని వైపు తిరిగింది. చిరునవ్వు ఆమె పగడాల పెదవుల్ని కొద్దిగా విడదీసి , ముత్యాల్ని కొద్దిగా చూపించింది. *“చంద్రా.... నువ్వు నన్ను అందరిలాగా . 'అమ్మా !' అనడం లేదు ! ఎందుకు ?”*


చంద్రుడి గుండె దడదడ కొట్టుకుంది. తార ఎదుటివారి ఆలోచనల్ని చదువుతుందా ?


*"చెప్పు ! ఎందుకు ?"* తార నవ్వుతూ అడిగింది.


ఏం చెప్పాలో తేల్చుకోలేని చంద్రుడు నాలుకతో తడి ఆరుతున్న పెదవుల్ని తడుపుకున్నాడు.


*"చెప్పు ! ఎందుకు ?"* తన వెనక వైపు నుంచి బిగ్గరగా వినిపించిన ప్రశ్న , తారనే చూస్తున్న చంద్రుణ్ణి ఉలిక్కిపడేలా చేసింది. చంద్రుడు భయాందోళనలతో వెనుదిరిగి చూశాడు. ఎవ్వరూ లేరు ! ఇందాక వెనకబాటుగా తనని ఉద్దేశించి ఆ ప్రశ్నను పలికిందెవరు ?


*“చెప్పు ! ఎందుకు ?”* తార అడిగిన ప్రశ్న మళ్ళీ చంద్రుడి చెవుల్ని పగలేసింది. ప్రశ్న అడిగిన చిలక చెట్టు మీద రెక్కల్ని టపటపలాడించింది. 


తార కిలకిలా నవ్వింది. 

*“నువ్వు సమాధానం చెప్పేదాకా అది అలా అడుగుతూనే ఉంటుంది !"*


చంద్రుడు కంగారుగా చూశాడు. తార చెయ్యి చాపి , చంద్రుడి చేతిని పట్టుకుంది.


*"ఇక్కడొద్దులే ! అక్కడ తోటలో చెబుదువుగానిలే రా !"* అంటూ లాగింది. చంద్రుడు గుటకలు మింగాడు.


*"రా , చంద్రా !”* తార లాగుతూ అంది.


*"రా, చంద్రా !"* అంది చెట్టు మీది చిలక.


చంద్రుడు ఉలిక్కిపడి కదిలాడు. తామరతూడులాగా నాజూకుగా ఉన్న తార చెయ్యి ప్రణయపాశంలా అతన్ని లాగుతోంది. *'రా , చంద్రా !', 'రా , చంద్రా !'* అంటూ వల్లె వేస్తున్న పిలుపు అతన్ని వెంటాడుతోంది. ఎందుకో అతని అడుగులు తడబడ్డాయి.


*"రా !”* తార తలతిప్పి వాలుగా చూస్తూ , చిరునవ్వుతో అంది , లాగుతూ. 


వెనక చిలక , ముందు చిలకల కొలికి ! చంద్రుడు అప్రయత్నంగా నవ్వుకున్నాడు..


అర్ధరాత్రి దాటింది. నిద్రపట్టని చంద్రుడు అటూ , ఇటూ దొర్లుతున్నాడు. తనను తోటలోకి తార లాక్కెళ్లినప్పటి దృశ్యాలు మూసుకున్న కళ్ళ ముందు పునర్దర్శనమిస్తున్నాయి. చంద్రుడికి.


*'రా !"* అంటూ తనను చెయ్యి పట్టి తీసుకెళ్తున్న తార వయ్యారాల నడక కాస్సేపట్లో పరుగుగా మారింది. ఒక గుబురు పొదరిల్లు సమీపంలోని చెట్టు నీడలో ఆగింది తార. నవ్వుతూ అతని వైపు చూసింది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చంద్రుడికి కనిపిస్తున్నాయి , సమ్మోహనకరంగా.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 52*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 52*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


ప్రకృతికి నియమాలున్నాయి. మొక్కలలో పువ్వులు ముందు పూస్తాయి, పిదప పిందె వస్తుంది - ఇది అలాంటి నియమాలలో ఒకటి, కాని ఈ నియమాలు కొన్ని చోట్ల, కొన్ని సమయాలలో ఉల్లంఘనమవడమూ కద్దు. గుమ్మడి మొక్కలలో మొదట పిందె వస్తుంది. ఆ తరువాతే పువ్వు పూస్తుంది. ఈశ్వరకోటులైన తమ శిష్యులకు దీనిని ఉదాహరణగా పేర్కొనేవారు శ్రీరామకృష్ణులు. 


సాధారణంగా ఆధ్యాత్మిక సాధనలు, తపస్సు అనుష్ఠించి భగవదనుభూతి పొందుతారు. ఇది నియమం కాని ఈశ్వరకోటుల విషయంలో ఈ నియమం మారుతుంది. వారు ముందుగానే ఆధ్యాత్మిక అనుభూతులను పొందివుంటారు. పిదప తపస్సు ఇత్యాదులు ఒనరించి తద్వారా ఆధ్యాత్మిక అనుభవాలు సంతరించుకొని, ముందుగానే తాము పొంది వున్న ఆధ్యాత్మిక అనుభూతులతో వాటిని పోల్చి చూసుకొంటారు.


ఈశ్వరకోటులలో అగ్రతాంబూలం నరేంద్రునిదే. అతడు ఇప్పటికే కొన్ని అత్యున్నత అనుభవాలు పొందడం చూశాం. కాని అతడూ ఆధ్యాత్మిక సాధనలు అనుష్టించాడు. శ్రీరామకృష్ణులు అతడికి అనేక సాధనలలో శిక్షణలిచ్చారు.


ఆధ్యాత్మిక సాధనా శిక్షణలలో మొదటి మెట్టు మంత్రదీక్ష. సామాన్యంగా గురువు శిష్యుని అర్హతకు తగిన ఒక మంత్రాన్ని ఉపదేశించడం ద్వారా దీక్ష ప్రసాదిస్తాడు. అంటే ఆధ్యాత్మిక జీవితానికి మార్గం చూపుతాడన్నమాట. ఈ మంత్రం సిద్ధమంత్రమై ఉండాలి. సిద్ధమంత్రం అంటే జాగృతం కలిగించే మంత్రం అని అర్థం. అంటే గురువు ఆ మంత్రాన్ని జపించి తద్వారా, ఆ మంత్రానికి చెందిన దేవత అనుగ్రహం పొందినవాడై ఉండాలి. అలాంటి గురువు ఒసగే మంత్రదీక్ష మాత్రమే ఫలవంతమవుతుంది. 


ఎందుకంటే మంత్రంతోపాటు ఆ మంత్రాన్ని జపించడానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తాడు కనుక. అందుకే గ్రంథాల్లో చదివి, ఆ మంత్రాలను జపించ కూడదు, గురువు ద్వారా పొందిన మంత్రాన్నే జపించాలని వక్కాణిస్తారు. ఈ మంత్రదీక్షకి ప్రత్యేక నియమ నిబంధనలు ఉన్నాయి.


కాని పరిపూర్ణ స్థితిని సంతరించుకొన్న గురువు నియమాలను ఉల్లంఘించి, తాను అభిలషించే రీతిలో దీక్ష నివ్వడం కద్దు. ఆధ్యాత్మిక శక్తిని శిష్యునిలో ప్రసరింపజేయడమే దీక్ష ఉద్దేశం. దీనిని వారు తమకు నచ్చిన రీతిలో నెరవేరుస్తారు. ఇలాంటి దీక్షను తంత్రశాస్త్రాలు శాంభవీదీక్ష అని పేర్కొంటాయి. శ్రీరామకృష్ణులు నరేంద్రునికి ఇలాంటి దీక్షనే ప్రసాదించారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 41*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 41*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


  *తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా*

  *నవాత్మానం మన్యే నవరస మహాతాణ్డవనటమ్ |*

  *ఉభాభ్యామేతాభ్యా ముదయవిధి ముద్దిశ్య దయయా*

  *సనాథాభ్యాం జజ్ఞే జనక జననీమ జ్జగదిదమ్ ‖*


ఇదొక అద్భుతమైన శ్లోకం. మూలాధార చక్రములో శివ శక్తులు ఎలా వున్నారో చెప్తున్నారు ఇందులో. కుండలిని శక్తికి మూలాధారం ప్రధానం. తీగకు పాదు వలె. మనిషిలో ఏ స్పందనైనా ముందు మెదడులో మొదలై విద్యుత్ వేగంతో మూలాధారానికి వెళ్లి, అక్కడ నుండి మళ్ళీ పైకి ప్రయాణించి మెదడును చేరుతుందని యోగశాస్త్రాలు చెప్తున్నాయి.


తవాధారే మూలే = నీదైన ఈ మూలాధార చక్రంలో

 శరీరం నాది కాదు అమ్మదే అనే భావనతో


సహ సమయయా లాస్యపరయా = ఇక్కడ అమ్మవారు *సమయ* అనే పేరుతో లాస్యం చేస్తూ ఉంటారట. లాస్యం కోమలంగా పద ఘట్టనం లేకుండా ఉంటుంది. 


నవాత్మాన మన్యే = శివుడు నవాత్మకుడు. 

మన శరీరము ఈ విశ్వము కూడా నవాత్మకమే. వీటిని వ్యూహములని కూడా అంటారు. వ్యూహమునకు వ్యుత్పత్తి  *ఊహ వితర్కే* విశేషముగా విచారింపబడునది. *వ్యూహో నా బలవిన్యాస నిర్మాణ నికురుంబయో: ఇతి రుద్రః* అని అమరం.

రుద్రుని  వ్యూహములు

కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, కల, జీవ. వ్యూహములు ఈశ్వర విభూతులూ, అంశలు. అవతార విశేషముల వంటివే వ్యూహములు.   సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేస్తూ జీవుల గతులను నిర్దేశించే నవగ్రహాలు, నృత్యంలో నవరసములు, నవావరణాలు ఇవన్నీ ఇలాటివే.


నవరస మహాతాండవ నటమ్ = స్వామి, నటరాజుగా నవరసాలొలికిస్తూ మహాతాండవ నృత్యం చేస్తూ వుంటారు. తాండవమనేది ఉద్ధృతంగా ఉంటుంది. ఈ తాండవాన్ని *ఆర్భటీ వృత్తి* అంటారు. వృత్తి అంటే వర్తించేది.ఒక నడక/నడవడి. వీటిని కావ్య వృత్తులంటారు. ఇవి కైశికి, ఆర్భటి, సాత్వతి, భారతి. 

అమ్మవారి లాస్యము కైశికి వృత్తి. ఈ కౌశికీ, ఆర్భటీ వృత్తుల సమన్వయమే శరీరం.


 జనకజననీమ జ్జగదిదమ్ =  శరీరం లోనే కాదు, విశ్వంలో కూడా ఈ రెండిటి సమన్వయం అవసరం.


ఉభాభ్యా మేతాభ్యా ముదయవిధి ముద్దిశ్య దయయా

సనాథాభ్యాం జజ్ఞే = ఈ విధంగా వీరిద్దరూ ప్రపంచానికి తల్లి తండ్రులుగా వున్నారు. కనుక మేము అనాథలం కాము, సనాధలము.


ఈ శ్లోకంలో అమ్మవారి నామాలు *లాస్యప్రియా లయకరీ లజ్జా  రంభాది  వందితా* , *మహేశ్వర మహాకల్ప  మహా తాండవ సాక్షిణి* దర్శించవచ్చు.


మూలాధార చక్రం భూమి తత్త్వం. భూమిపై  జీవించే మానవులు అరిషడ్వార్గాలకు లోనయి ధర్మమును పాటించక భ్రష్టత్వం పొందుతుంటే పార్వతీ పరమేశ్వరులు తమ తాండవ/లాస్యములతో వారికి జ్ఞానేచ్ఛను కలిగించి యోగసాధనకు ప్రోత్సహిస్తారని భావం.


పరమేశ్వరుడు స్థాణువు. *స్థిరః స్థాణుః* అని శివ సహస్ర నామాలు ప్రారంభం. అమ్మవారు ఆయనను కార్యోన్ముఖులను చేస్తుందట. ఆయన నవరసాలతో కూడిన మహా తాండవ నృత్యం చేస్తుంటే ఆవిడ విలాసంగా చూస్తూ తరువాత తన మృదువైన లాస్యంతో ఆయన ఉద్ధృతిని తగ్గిస్తుందట. ఈ మహా తాండవాన్ని మహాప్రళయం కాలంలో ఆయన ప్రదర్శించి సర్వ జగత్తును మహాగ్నిలో భస్మీపటలం  చేస్తుంటే ఆమె సాక్షిణిగా చూస్తూ వుంటుందట. అనంతరం తన కరుణారస దృష్టులతో చల్లదనాన్ని వర్షించి ఆనందభైరవిగా తన లాస్యంతో పునః సృష్టికి ఆయనకు సహకరిస్తుంది. ఆయన ఆనంద భైరవుడు ఆమె ఆనందభైరవి. 


ఈ స్తోత్రము మొదలుపెట్టినప్పుడు అందమే ఆనందం అని అన్నాను. ఏమిటి ఈ రెండూ? 

ఒకటి నుండి ఈ 41 వ శ్లోకం వరకు *ఆనంద లహరి* గా పిలుస్తారు. వీటిలో, సచ్చిదానంద తత్త్వమును ప్రతిపాదించే దివ్యమైన మంత్ర, తంత్ర, యోగ, ఉపాసనా రహస్యములు అనేకం చెప్పబడ్డాయి. అందుకని ఆనందలహరి. వీటివలన కలిగిన సంస్కారంతో మిగిలిన 59 శ్లోకాలను పఠించి అర్థం చేసుకోవాలి. వీటిని *సౌందర్యలహరి* అంటారు. వీటిలో అమ్మవారి కేశముల నుండి పాదముల వరకు సౌందర్య వర్ణన ఉంటుంది. ఇవన్నీ వేదాంతపరమైన అనేక విషయములను సూచిస్తాయి. ఏది ఆనందమును కలిగిస్తుందో అది అందము. కాళిదాసు రఘువంశ కావ్యంలో చెప్పినట్లు , *వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే  జగతః పితరౌ వన్దే పార్వతీ పరమేశ్వరౌ* 🙏🏻


 *తాండవం నటనం నాట్యం లాస్యం నృత్యం చ నర్తనే* అని నృత్య రీతులు.

*తాడ్యతే భూమిఃఅనేన ఇతి తాండవం* దీని చేత భూమి కొట్టబడును. పాదఘట్టనలు

*నట్యతే నటనం* నటించుట నటనం

*నటస్య కర్మ నాట్యం* నటుడు చేసేది నాట్యం 

*లసనం లాస్యం* లలితముగా లావణ్యముతో క్రీడించుట లాస్యము.

*నృతీ గాత్ర విక్షేపే నృత్యం నర్తనం* గాత్రమునకు చేయు నృత్యము నర్తనం.



           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు -  భాద్రపద మాసం - కృష్ణ పక్షం  - తృతీయ -   భరణి -  ఇందువాసరే* *(02-10-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/qW183jlFWHA?si=ND5UeSoEFaJXVcuG


🙏🙏

భక్తిసుధ

 🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

        *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_*


*వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం౹*

*వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం౹*

*వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం౹* 

*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹* 


*శివస్తుతి - 1*

ఆనందానికి మూలము (శంభు), ఉమాపతి, దేవతలకు అధిపతి, జగత్తుకు కారణమైన వాడు, సర్పములు ఆభరణములుగా కలవాడు, జింకను చేత కలవాడు, జీవ గణములకు అధిపతి (పశుపతి), సూర్య చంద్రులు, అగ్ని మూడు నేత్రములుగా కలవాడు, విష్ణువునకు ప్రియుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

పరమేశ్వర స్తుతికి భాషా భేదాలు లేవు



పరమేశ్వర  స్తుతికి  భాషా భేదాలు లేవు


                

               ఉ:  హెడ్డున  మూను , స్కిన్నుపయి  నెంతయు  డస్టును, ఫైరు నేత్రమున్ ,


                      సైడున గ్రేటు బుల్లు , బహు చక్కని  గాంజెసు    హైరు లోపలన్ ,


                      బాడికి  హాఫెయౌచు  నలపార్వతి ,  మౌంటెను   డాటరుండ ,   ఐ


                       షుడ్డు  డివోటు ,దండములు   సోకగ  ప్రేయరు సేతు  నెప్పుడున్;


                                      ఆదిభట్ల నారాయణ  దాసుగారు.


                    బహు భాషా  కోవిదులైన  దాసుగారు  పరమేశ్వరుని  మణిప్రవాళ  శైలిలో  యీవిధంగా  నుతించారు. ఇందులో  ఆంగ్లపదాలను బహురమ్యంగా  తెలుగు పదాలకు జోడించి  తమభాషాచాతుర్యాన్ని  ప్రకటించారు.


                      సిరసున  చంద్రుడు , శరీరమునభస్మము , అగ్ని నేత్రము ,(మూడవకన్ను)  వాహనంగా నంది. తలపై గంగ , అర్ధనారీశ్వరియై పార్వతి. (హిమవంతుని పుత్రి) నేను ఒరుల నేల తలచెదను  శంకరునకే  నమస్కృతులు  చేసి  ప్రార్ధింతును.

అనిదీని భావము. 


                    ఇలా అన్సభాషాపదాలను తెలుగు పదాలతోకలిపి వ్రాయటం  శివకవులతో ప్రారంభమైనది.పాల్కురికి సోమనాధుడే

ఈవిధానమునకు ఆద్యుడు. తరువాత తరువాత తక్కిన కవులందరూ ఈపద్దతిని అనుసరిస్తూ  ఈవిధానానికి  "మణిప్రవాళశైలియని" పేరు నిర్దేశించారు.


                                                  బాగుందికదా  తరువాత  మరికొన్ని!


                                                                        స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🙏🌷🌷🌷

సుభాషితమ్

 🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

        *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_*


*వందే సర్వజగద్విహారమతులం వందేఽంధకధ్వంసినం౹*

*వందే దేవశిఖామణిం శశినిభం వందే హరేర్వల్లభం౹* 

*వందే నాగభుజంగభూషణధరం వందే శివం చిన్మయం౹*

*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹* 


శివస్తుతి - 2


జగత్తు అంతా విహరించే వాడు, సాటి లేని వాడు, అంధకాసురుని నాశనము చేసిన వాడు, దేవతలలో ఉత్తమమైన వాడు, చంద్రుని ధరించిన వాడు, విష్ణువునకు ప్రియుడు, సర్పములు, నాగరాజు ఆభరణములుగా కలవాడు, చిదానందుడు, శుద్ధ ప్రకాశుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

⚜ శ్రీ ఉత్తర గురువాయూరప్పన్ ఆలయం

 🕉 మన గుడి : నెం 195


⚜ ఢిల్లీ : మయూర్ విహార్ ఫేజ్-1


⚜ శ్రీ ఉత్తర గురువాయూరప్పన్ ఆలయం


💠 ఇది తూర్పు ఢిల్లీలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి పశ్చిమం వైపు ఉన్న అరుదైన విష్ణు దేవాలయాలలో ఒకటి. 

అంతేకాకుండా, శివుడు, గణపతి, అయ్యప్ప, చొట్టనిక్కర భగవతి (దేవి), మరియు నాగదేవత ఉత్తర గురువాయూరప్పన్ ఆలయంలో పూజించబడే ఇతర దేవతలు.


💠 శ్రీ ఉత్తర గురువాయూరప్పన్ దేవాలయం, మయూర్ విహార్, తూర్పు ఢిల్లీలో ఉన్న ఒక ప్రధాన పుణ్యక్షేత్రం.

1983లో ప్రారంభమైనప్పటి నుండి రాజధాని నగరం మరియు పొరుగు ప్రాంతాల నివాసితులకు సేవలను అందిస్తోంది. 

ఈ ఆలయం కేవలం మతపరమైన కార్యక్రమాలను ప్రోత్సహించడమే కాకుండా సమాజం యొక్క సామాజిక-సాంస్కృతిక అవసరాలను తీర్చడానికి కేంద్రంగా కూడా పనిచేస్తుంది.


⚜ శ్రీ ఉత్తర గురువాయూరప్పన్ అంటే ఎవరు?


💠 ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీ గురువాయూరప్పన్ (విష్ణువు).

గురువాయూరప్పన్ చిన్నశిశువు రూపంలో శ్రీ కృష్ణుడిగా పూజించబడ్డాడు మరియు గురువాయూర్ ఉన్నికణ్ణన్ (గురువాయూర్ చిన్ని కృష్ణ) అని పిలుస్తారు. 


💠 గురువాయూరప్పన్ అంటే గురువాయూర్ ప్రభువు అనే పదం గురు అనే పదం నుండి వచ్చింది.

ఇది దేవతల గురువైన గురు బృహస్పతిని సూచిస్తుంది, వాయు అంటే గాలి మరియు అప్పన్ అంటే దేవత, అంటే మలయాళంలో 'తండ్రి' లేదా 'ప్రభువు'.  

గురుడు మరియు వాయువు కృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్టించారు కాబట్టి, దేవుడికి గురువాయూరప్పన్ అని పేరు పెట్టారు.


💠 ఈ విగ్రహం పాతాళ అంజనం లేదా నల్ల బిస్మత్ అని పిలువబడే రాతితో తయారు చేయబడింది మరియు పాంచజన్య (శంఖం), సుదర్శన చక్రం, కౌమోదకి (గద్దె) , మరియు పద్మo (కమలం) పట్టుకొని నాలుగు చేతులతో నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది.


💠 శ్రీ ఉత్తర గురువాయూరప్పన్ ఆలయ నిర్మాణం కేరళ శైలిలో విలక్షణమైనది.  

ప్రధాన కృష్ణ దేవాలయం కాకుండా, ఈ ఆలయంలో  గణపతి, శివుడు మరియు అయ్యప్పలకు చిన్న ఉప ఆలయాలు మరియు సర్ప దేవతలకు చిన్న ఉపాలయాలు కలవు.


💠 ఢిల్లీలోని భక్తుల బృందం కోరిక మేరకు, ఆర్ష ధర్మ పరిషత్ పేరుతో ఒక సొసైటీని ఏర్పాటు చేశారు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA).

1975 సంవత్సరంలో, జనక్‌పురిలో ఆలయ నిర్మాణం కోసం ఒక స్థలాన్ని కేటాయించింది.  అయితే, జ్యోతిష్య కారణాల వల్ల జనక్‌పురిలో కేటాయించిన స్థలంలో ఆలయాన్ని నిర్మించలేకపోయారు. 

తదనంతరం, మయూర్ విహార్ ఫేజ్-1లో శ్రీకృష్ణ మందిర్ సమాజం పేరుతో భక్తుల చొరవతో భూమి కేటాయింపు మయూర్ విహార్ ఫేజ్-1కి బదిలీ చేయబడింది.


💠 వాస్తవానికి, ఆ తర్వాత జరిగిన సంఘటనల విధానం మరియు క్రమంలో ప్రభువు చిత్తం చాలా స్పష్టంగా కనిపించింది. యమునా తీరానికి ఎదురుగా ఉన్న ప్రదేశంలో ఈ దేవాలయం కావాలని భగవంతుడు స్వయంగా నిర్ణయించుకున్నట్లుగా ఉంది. 

ఇంకా, తూర్పు వైపు చూసే సంప్రదాయ ఆలయ శాస్త్రానికి బదులు యమునా వైపు చూసేందుకు విగ్రహం పశ్చిమాభిముఖంగా ఉన్న కొన్ని విష్ణు దేవాలయాలలో ఇది ఒకటి.


💠 బాలాలయాన్ని 1983 ఏప్రిల్ 8వ తేదీన కేరళ నుండి తెప్పించిన భగవాన్ గురువాయూరప్పన్ దివ్య విగ్రహంతో ప్రొ.వేజపరంబు పరమేశ్వరన్ నంబూద్రిపాడ్ ప్రతిష్ఠించారు. 

ప్రముఖ ఆలయ వాస్తుశిల్పి ప్రొఫెసర్ వేజాపరంబు పరమేశ్వరన్ నంబూద్రిపాడ్ ప్రస్తుత ఆలయాన్ని రూపొందించారు. 

అతని సమర్థ మార్గదర్శకత్వంలో, బ్రహ్మమంగళం సుబ్రమణియన్ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించారు. 

గర్భ గృహం కోసం శంకుస్థాపన చేసిన కంచి కామకోటి పీఠాధీశ్వరులు.. పవిత్ర జగద్గురువులు జయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామివారు 2 అక్టోబరు 1986న గురువాయూరప్పన్ దివ్య విగ్రహం ప్రతిష్టించారు


💠ఈ ఆలయం తూర్పు లేదా పడమర రెండు వైపులా రెండు గోపురాలతో కేరళ శైలిలో నిర్మించబడింది. 

గర్భ గ్రహం రెండు భాగాలుగా విభజించబడింది, ఒకటి శ్రీకృష్ణుడి కోసం మరియు మరొకటి భగవతి దేవి కోసం. 

ప్రొ.వేజాపరంబు పరమేశ్వరన్ నంబూద్రిపాద్ ఆలయ వాస్తుశిల్పి.


💠 ఈ ఆలయంలో ప్రధానంగా  శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ కృష్ణ  జన్మాష్టమి జరుపుకుంటారు . 

ఈ పండుగను భక్తులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

మహా శివరాత్రి కూడా వేద మంత్రాలతో జరుపుకుంటారు.

ఈ ప్రధాన పండుగలతో పాటు అనేక ఇతర పండుగలు గురువాయూరప్పన్ ఆలయంలో జరుపుకుంటారు.


💠 ఈ పండుగల సమయంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. 

 ఈ ఆలయాన్ని ఢిల్లీలోని మలయాళీ మరియు తమిళ సమాజాలు అత్యంత గౌరవిస్తారు.


⚜సామాజిక కార్యకలాపాలు :


ఆహారం - 

ఆలయ నిర్వహణలో నిరుపేద ప్రజలకు ఆలయం రోజువారీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తుంది.


విద్య - 

నిరుపేదలు మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆలయ నిర్వహణ ద్వారా స్కాలర్‌షిప్‌లు ఏర్పాటు చేయబడ్డాయి.


వైద్యం – 

నిరుపేద రోగుల కోసం దేవస్థానంచే ఉచిత వైద్య సౌకర్యం కలదు.


💠 వేసవికాలం: 5:30 AM నుండి 11:00 AM వరకు; 6:00 PM నుండి 9:00 PM వరకు

శీతాకాలం: 5:30 AM నుండి 11:00 AM వరకు; 5:30 PM నుండి 8:30 PM వరకు.

Panchaag


 

Photo

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 40*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 40*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*తటిత్వన్తం శక్త్యా తిమిర పరిపన్థి స్ఫురణయా*

*స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేన్ద్రధనుషమ్ |*

*తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం*

*నిషేవే వర్షన్తం హరమిహిరతప్తం త్రిభువనమ్ ‖*


ఇప్పుడు మణిపూర చక్రానికి వచ్చారు. ఇది జలతత్త్వ చక్రం. శంకరులు అంటున్నారు..


తవ శ్యామం మేఘం = శివ స్వరూపం ఇక్కడ నీలమేఘం వలె ఉందట.


తటిత్వన్తం శక్త్యా = అమ్మవారేమో మెరుపుతీగ వలె ఉందట. ఆమె ఇంకా..


తిమిర పరిపన్థి స్ఫురణయా = చీకట్లను పారద్రోలే కాంతి వలెనూ


స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేన్ద్రధనుషమ్ = నానా రత్నాభరణముల ప్రకాశము వలె, ఇంద్రధనస్సు వలె ఉన్నారట. 

మణిపూర శబ్దంలోనే మణులు వున్నాయి కదా! అవి వెలుగులు చిమ్ముతూ ఉంటాయి.


చమత్కారం గమనించండి శివుడు నీలమేఘం వలె ఉంటే, అమ్మవారు ఆయనను విడవకుండా మెరుపుతీగ వలె కలిసి ఉన్నారట. మేఘము జలతత్త్వమయితే, మెరుపుతీగ అగ్నితత్త్వం. రెండూ ఉంటే వర్షం. ఇక్కడ శివ, శక్తుల సమయాచారం చెప్పారు. అలాగే *అగ్నీషోమ తత్త్వం* కూడా దృష్టికి తెస్తున్నారు. ఈ అగ్నీషోమ తత్త్వం  అంతర్యాగానికి చెప్పే మాట. లఘువుగా పరమాత్మ జీవాత్మ సంయోగమునకు సమన్వయమునకు సంకేతముగా చెప్పవచ్చు.


హరమిహిరతప్తం త్రిభువనమ్ నిషేవే వర్షంతం = హరుడు/శివుడు వేడెక్కించిన భూమిని నీవు వర్షంతో చల్లబరుస్తున్నావమ్మా. *భవదా వసుధా వృష్టిః పాపారణ్య దవానలా* అమ్మవారి నామాల్లో ఒకటి.


అగ్ని తత్త్వం తరువాత జలతత్త్వం.వేసవి తరువాత వర్ష కాలం వలె. ఇక్కడ స్వామి అమృతేశ్వరుడని, అమ్మవారు అమృతాంబ అనీ పిలువబడతారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సోమవారం, అక్టోబరు 2, 2023*

 శుభోదయం, పంచాంగం                卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*సోమవారం, అక్టోబరు 2, 2023*

  *శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

  *దక్షిణాయనం - వర్ష ఋతువు*

  *భాద్రపద మాసం - బహళ పక్షం*

తిథి  తదియ* ఉ10.42 వరకు  

వారం  సోమవారం* (ఇందువాసరే)

నక్షత్రం *భరణి* రా10.34 వరకు

యోగం : *హర్షణం* మ3.12 వరకు

కరణం  : *విష్ఠి* ఉ10.42 వరకు  తదుపరి *బవ* రా10.10 వరకు

వర్జ్యం  *ఉ8.31 - 10.04* 

దుర్ముహూర్తము : *మ12.14 - 1.02*  

 మ2.37 - 3.25*                   

అమృతకాలం    : *సా5.52 - 7.26* 

రాహుకాలం ఉ7.30 - 8.00*

యమగండ/కేతుకాలం :ఉ10.30 - 12.00*

సూర్యరాశి: *కన్య* || చంద్రరాశి: *మేషం*

సూర్యోదయం: *5.54* || సూర్యాస్తమయం: *5.48*

👉 *మహాభరణి,  సంకష్టహర చతుర్థీ*సర్వేజనా సుఖినో భవంతు

చరిత్ర పాఠాల్లో చొప్పించినవే..

 చమర్/మాదిగ  అంటే ఎవరు?? దళితుడా? వీరాదివీరుడైన క్షత్రియుడా??

చమర్/మాదిగ అంటే దళితుడు కాదు..తనను మతం మారమని హింసించిన మొఘలులను అణిచివేసి తన సనాతన ధర్మాన్ని  వదులుకోని సనాతనధర్మ రక్షకుడు..

భారతదేశంలో చమర్ అని పిలవబడే కులం వాస్తవానికి ' చన్వర్ ' వంశానికి చెందిన క్షత్రియ కులం అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు.

మహాభారతంలోని కూడా ఈ వంశం ప్రస్తావించబడింది.. 

హిందూ కుల వ్యవస్థను క్రూరంగా, వివక్షగా మార్చిన వారు హిందువులు కాదు..మార్చిన వారు విదేశీ దురాక్రమణదారులు!..

టర్కీ దాకా భారతదేశ సరిహద్దులు ఉండి..టర్కీని సైతం పరిపాలించిన శతాబ్దంలో ఈ రాజవంశం భారతదేశ పశ్చిమ ప్రాంతంలో పరిపాలించింది..

ఆ సమయంలో చన్వర్ సేన్ వారి మహారాజు..

ఈ రాజ కుటుంబానికి బప్పా రావల్ వంశంతో వివాహ సంబంధాలున్నాయి..

రానా సంగ మరియు అతని భార్య జాలి రాణి చన్వర్ వంశానికి చెందిన సంత్ రైదాస్జీ ని మేవార్ రాజగురుగా చేశారు..

చిట్టోడ్ కోటలో ప్రార్థన చేసేవారు..చేయించేవారు.. నాటి సమాజంలో చమార్ అని పిలవబడే వారు చరిత్రలో ఎక్కడా ప్రస్తావించబడలేదు..

చమర్ అనే పదం మొదట వాడినది సికందర్ లోడి.

హిందూ సంత్ రవిదాస్ కీర్తిప్రతిష్టలు..సమాజం మీద ఆయన ప్రభావం పెరగడం చూసి మొఘల్ పాలకులు భయపడ్డారు..

సంత్ రవిదాస్ ను ముస్లిం గా మార్చడానికి సద్నా కసాయి వాడిని సికందర్ లోడి పంపాడు..సంత్ రవిదాస్ ఇస్లాం స్వీకరిస్తే భారతదేశంలోని అధిక సంఖ్యలో హిందువులు ఇస్లాం స్వీకరిస్తారని అతనికి కుట్ర..

కానీ సంత్ రవిదాస్ ను ఇస్లాంలోకి మార్చడానికి పంపిన సద్నా హిందూత్వం పట్ల ఆకర్షితుడై అతను హిందుత్వ మార్గంలోకి వచ్చేశాడు.. సద్నా కసాయి పేరు నుంచి  అతని పేరు రామదాస్ అయింది. సాధువులు ఇద్దరూ కలిసి హిందూ మత ప్రచారంలో నిమగ్నమయ్యారు. దాని ఫలితంగా సికందర్ లోడి కి  కోపం వచ్చి తన అనుచరులను అవమానించడానికి మొదటిసారి చమర్ అనే పదాన్ని ఉపయోగించాడు.

వారు సంత్ రవిదాస్ ను జైలులో పెట్టారు.. అక్కడ ఆయనచేత పశువుల చర్మం వలవడం..చర్మం సాపు కొట్టడం..బూట్లు తయారు చేయడం మొదలైన వాటి పనిని వారు బలవంతంగా చేయించారు.. ఆయన్ను ముస్లింగా మార్చడానికి చాలా ఫిజికల్ టార్చర్ పెట్టారు..కానీ సంత్ రవిదాస్ అన్నారు :-

"వేద మతమే అతి పెద్దవిశిష్టమైన నిజ జ్ఞానం.. అంత పవిత్రమైన ధర్మాన్ని నేనెందుకు వదలాలి.. మీరు అబద్ధ ఖురాన్ చదవకండి..వేద ధర్మాన్ని..ప్రపంచ సౌభాగ్యాన్ని కోరుకునే సనాతన మతాన్ని వదలకండని ఆయన నినదించాడు '..

వేధింపులు భరించినప్పటికీ తమ వైదిక మతంపై దృఢంగా ఉండి, తమ అనుచరులను..తమ వారసులు మతమ మారకుండా కాపాడుకున్నారు..

మన గొప్ప రవిదాస్ తన జీవితాన్ని మొత్తం ధర్మాన్ని, దేశాన్ని రక్షించడానికి అర్పించినారు.. తర్వాత కాలంలో  చన్వర్ వంశ వీరులు ఢిల్లీని చుట్టుముట్టారు.. సికందర్ లోడి గత్యంతరం లేని పరిస్తితుల్లో సంత్ రవిదాస్ ను విడిచిపెట్టారు..

సంత్ రవిదాస్ చైత్ర శుక్లా చతుర్ధశి ఆదివారం నాడు చిత్తూరులో పరమపదించారు..

వారు నేడు మన మధ్య లేరు కానీ వారి జ్ఞాపకం వారి ఆదర్శాలను అనుసరించేలా ప్రేరేపిస్తుంది, వారి జీవితాలు నేటికీ సమాజానికి సంరక్షణ కల్పిస్తుంది..

ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ రోజున ఉన్న చమర్ కులం లేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇన్ని దారుణాలు భరించిన ఈ వంశ హిందువులు తమ మతాన్ని జాతి హితం కోసం వదలలేదు..

నేడు భారతీయులు వామపక్షవాదులు..బ్రిటిష్ వాడు రాయించిన చరిత్రను ఎక్కువగా నమ్ముతారు.. ఇలాంటి సలీంషాహి బూట్లు నాకే చరిత్రకారులను..

వారు వ్యాప్తి చేసిన వైరాగ్యం తెలుసుకొని హిందూ సమాజాన్ని కాపాడాలి..

నిజానికి ఈ రోజు హిందూ సమాజం బ్రతికి ఉంది అంటే ఈ వంశ వీరులు చేసిన అతిపెద్ద త్యాగఫలమే..

నాటి సమాజంలో  హీనమైన పని చేయడానికి ఒప్పుకున్నారే గాని ఇస్లాం స్వీకరించలేదు.. ఆ సమయంలో వారు ఇస్లాంను స్వీకరిస్తే వాళ్ళ రాజ్యాలు పోయేవికావు..అలాగే సమాజంలో తమ క్షత్రియ హోదాకూడా కాపాడబడేది..

అవసరమైతే మరణాన్ని సైతం స్వీకరించడానికి సిద్దపడ్డారే కానీ సనాతన ధర్మాన్ని వదులుకోలేదు..

ఈ చన్వర్ వంశ వీరులు తమ మతాన్ని కాపాడటానికి పందులను సైతం పెంచడానికి ఒప్పుకున్నారు కానీ ముస్లిం మతాన్ని మాత్రం ఒప్పుకోలేదు..

మన చమర్/మాదిగ సోదరులకు ప్రణామం చేద్దాం..

గమనిక :- హిందూ సమాజంలో అంటరాని తనం..వివక్ష..అధిక-నీచ భావం లేదు..

ఈwe దుశ్చర్యలన్నీ ముస్లింల దండయాత్ర, ఇంగ్లీష్ ఆక్రమణ..అద్దె మైకు  వామపక్ష మరియు హిందూ వ్యతిరేక చరిత్రకారులు మన చరిత్ర పాఠాల్లో చొప్పించినవే..




Avvaru Srinivasa Rao.