8, అక్టోబర్ 2023, ఆదివారం

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు -  భాద్రపద మాసం - కృష్ణ పక్షం  -  నవమి - పుష్యమి -  భాను వాసరే* (08.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/-jrwR-jYkwE?si=bvFUvPslWvOvDXwL



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కులద్వేషి

 *సుభాషితం*- 

---------------


*విషదరోతోsఫ్యతివిషమః*

     *ఖల ఇతి న మృషా వదంతి విద్వాoసః ౹*

     *యదయం నకులద్వేషీ* 

*కులవిద్వేషి పునః పిశునః ౹౹🌺*


        *విషం నిండిన పాముకన్నా దుష్టుడు ఎక్కువ చెడ్డవాడు అని విద్వాంసులు అంటారు.ఎందుకంటే పాము నకుల ద్వేషి అయితే ముంగీసకు శతృ,తన కుల ద్వేషి కాదు.అయితే దుష్ట మనిషి కులద్వేషి.*

🌺✍🏼

Garuda gammana


 

నీకంటే అలవాటు



నీకంటే అలవాటు

తండ్రి: ఎందుకు ఏడుస్తున్నావురా? కొడుకు: అమ్మ కొట్టింది నాన్నా... తండ్రి: అమ్మే కదరా కొట్టింది... ఏడవకు...

 కొడుకు: నీకంటే అలవాటయ్యింది. నాన్నా... నాకు నొప్పిగా ఉంది మరి...

😁😄

AMRUTHA HASTAM BRAHMIN TRUST*

 *

My name is Rama Rao..iam a pharma distributor. Iam one of the trustee to *AMRUTHA HASTAM BRAHMIN TRUST*  Hyd zone.


We coordinate to provide the servises like


1. Cooks and caterers 

2. Brahmin male female care takers.

3. Matrimony services

4. Nursing services 

5. Oldage home requirements 

6. Other required services to members.

7. Legal assistance 


Our main motto is to strengthen the Brahmin community like other communities.. *all the service  requests are free.. we don't charge any membership fee also*.. we only request you to save our number in your contacts.. and tell about us in your near and dear groups so that they can also avail the trust services...all the activities we do..you can see in our status updates.. 

*Pls spend little time for our Brahmins unity* 🙏

Our number: *9182057592*

DEvaalayam

 


సుభాషితమ్


 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


*శ్లోకం*


*వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం౹*

 *వందే సర్వగతం దయామృతనిధిం వందే నృసింహాపహం౹*

 *వందే విప్రసురార్చితాంఘ్రికమలం వందే భగాక్షాపహం౹*

*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹*


_" *శివస్తుతి - 6* "_


యముని హరించే వాడు, హరుడు, విషాన్ని ధరించే వాడు, దయామయుడు, పెద్ద ముళ్ళు వేయబడిన ఝూటములు కలవాడు, అంతటా వెళ్ళినవాడు, దయ అనే అమృతానికి నిధియైన వాడు, నరసింహ స్వామిని వశం చేసుకొన్నవాడు,  బ్రాహ్మణుల, దేవతలచే పూజించబడిన పాదపద్ములు కలవాడు,  భగుని కన్ను నాశనము చేసినవాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన *శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

🪷 శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

*🌸 సాంఖ్య యోగః 🌸*


*2-అధ్యాయం,53వ శ్లోకం*


 *శ్రుతి విప్రతి పన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా |* 

 *సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి || 53* 


 *ప్రతిపదార్థం* 


శ్రుతి విప్రతిపన్నా= నానావిధ వచనములను వినుటవలన విచలితమైన ; తే =నీ యొక్క ; బుద్ధిః = బుద్ధి; యదా = ఎప్పుడయితే ; సమాదౌ = పరమాత్మ యందు ; నిశ్చలా = నిశ్చలముగా; అచలా = స్థిరముగా; స్థాస్యతి = నిలుచునో; తదా = అప్పుడే; యోగమ్ = యోగమును ( భగవత్సాక్షాత్కారమును ); అవాప్స్యసి =( నీవు ) పొందగలవు;


 *తాత్పర్యము* 


నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన ( అయోమయమునకు గురియైన ) నీ బుద్ధి పరమాత్మ యందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే, నీవు ఈ యోగమును పొందగలవు. అనగా, నీకు పరమాత్మ తో నిత్య ( శాశ్వత ) సంయోగము ఏర్పడును .


 *సర్వేజనః సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

రామాయణమ్ 348

 రామాయణమ్ 348

...

అన్నా ! నీ కిష్టమైన మాటలు చెప్పేవారు ఎల్లవేళలా లభింతురు.

కానీ ప్రియము కాకపోయిననూ హితవు చెప్పువారు అరుదు.

.

రాముడు నిన్ను చంపుచుండగా నేను చూడజాలను అందుకే వెళ్ళిపోతున్నాను ఇక సెలవు అని ఆకాశమున నిలచి విభీషణుడు పలికెను.

.

వెనువెంటనే ముహూర్తకాలములో విభీషణుడు రామలక్ష్మణులు ఉన్నచోటికి వచ్చెను.

.

ఆకాశములో మెరుపు వలే మెరుస్తూ నిలుచొని యున్న విభీషణాదులను క్రిందున్న వానరులు చూసిరి.

.

ఎవడీ రాక్షసుడు ? మనలను చంపుటకు వాని అనుచరులతో వచ్చినాడా ఏమి !అని సుగ్రీవుడు హనుమంతుడు మొదలైన వారితో అనెను.

.

సుగ్రీవుని మాటలు వెలువడగనే అందరూ ఒక్కసారిగా మద్దిచెట్లను ,పర్వతములనుచేతపుచ్చుకొన్న వారై ,రాజా అనుజ్ఞ ఇమ్ము ఇప్పుడే వారిని నేలకూల్చెదము అని పలికిరి.

.

వానర సేనలో పుట్టిన కోలాహలము గమనించి క్రిందకు దిగకుండగనే పెద్ద కంఠస్వరముతో ,నేను రావణుని తమ్ముడు విభీషణుడను ,మా అన్న చేసిన చెడ్డపనికి ,అది తగదు అని నేను హితవు పలుకగా ఆతడు నన్ను అవమానించి వెడలగొట్టినాడు .నేను నా భార్యాపుత్రాదులను విడిచి రాముని శరణు జొచ్చినాను .

.

నా రాక మహానుభావుడైన రామునికి ఎరిగించండి అని బిగ్గరగా పలికెను.

.

వూటుకూరు జానకిరామారావు

భగవద్గీత ఎందుకు చదవాలి

 *భగవద్గీత ఎందుకు చదవాలి? చదివితే ఏమీ వస్తుంది?*



"మనిషి తన తల రాతను కచ్చితంగా మార్చుకోలేడు, తాను చేసిన కర్మ అనుభవించక తప్పదు" అన్న ఒక్క మాటను మనము పెద్దల నుంచి పదే పదే వింటూ ఉంటాము.. అలాంటప్పుడు ఈ భగవద్గీతలు లేదా ఇతర మత గ్రంథాలు ఎందుకు చదవాలి ?? అన్న భావన మనిషిలో కలిగే అతి సహజమైన ఆలోచన...దాని సమాధానం ఒక్కటే " భగవద్గీత మన జీవనగీతను, లేదా కర్మ భారాన్ని కచ్చితంగా మార్చదు.. కానీ మనము జీవితాన్ని చూసే పద్దతిని మటుకు కచ్చితంగా మార్చేస్తుంది ". ద్వాపరయుగం లో యుగం లో ఇంద్రుడినే జయించగలిగే బలం, తెగవు, అస్త్ర సంపద ఉన్న అర్జునుడు సైతం కురుక్షేత్రం లో తన వారిని చూసి మానసికముగా బలహీనుడు అయిపోతాడు.. దాదాపు అస్త్ర సన్యాసం చేసే పరిస్థితికి వస్తాడు. అలాంటి సమయంలోనే కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన గీతోపదేశం ఒక్క అర్జునుడికి కాదు, సమస్త మానవజాతికే మార్గదర్శకం అయింది.. ఇది మతాలకు సంబంధం లేని ఒక సందేశం, సమస్త మానవ జాతికి అది ఉపయోగ పడే విధంగా చెప్పబడింది.. అది ఎలానో చూద్దాము


1) భగవద్గీత మనలో ఉన్న బలాన్ని మనము గుర్తించేలా చేస్తుంది:

మనిషికి ఎప్పుడు కూడా గతం గురించి లేదా జరగబోయే దాని గురించి చింత ఉంటుంది. గీత లో ఉన్న సారాంశం మనిషి యొక్క ఆలోచన పద్దతిని ప్రభావితం చేసి ప్రస్తుత కాలంలో ఉండి, ఆలోచించేలా మనిషిని ముందుకు నడిపిస్తుంది.


2) భగవద్గీత కర్మ యొక్క గొప్పతనాన్ని మనకు తెలియచేస్తుంది. ఆత్మ బలం, దైవం యొక్క గొప్పతనాన్ని, చేసే కర్మ యొక్క ఫలాన్ని, గీత తెలియ చెప్తుంది. దాని వలన మనిషి యొక్క ఆలోచన దృక్పథం మారుతుంది.


3) భగవద్గీత మన మనసు ని కంట్రోల్ చేసుకునే మార్గం చూపిస్తుంది. నిత్యం మనలో చాల మంది అనవసరమైన ప్రాపంచిక సుఖాల మీద మోజుతో ఆనందాన్నికోలుపోతారు.. అట్లాగే అనవసరమైన ఆలోచనల వలన మన మనశాంతిని కోలుపోతాము .. అలాంటి పనికి రాని విషయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా మన మనసుని అదుపులో పెట్టుకొనే మార్గం గీత సారాంశం మనకు చూపిస్తుంది.


4) భగవద్గీత ఒంటరితనాన్ని జయించేలా చేస్తుంది:

మనలో చాల మంది వయసు పెరిగేకొద్దీ బాధ పడే అంశం ఏంటి అంటే ఒంటరితనం.. దాని నుంచి మనిషి తప్పించుకోవడం చాల కష్టం.. ఈ జీవాత్మకు, పరమాత్మ ఎప్పుడు తోడుగా ఉంటాడన్న సంగతి మనకు అర్ధం కాదు. ఆ విషయాన్నీ భగవద్గీత మనకు చాలా సరళంగా తెలియచెప్తుంది.


5) భగవద్గీత మనలో నిర్ణయాలు తీసుకునే సమర్ధత పెంచుతుంది:

మనలో చాల మంది ఒక నిర్ణయం తీసుకోడానికి భయపడుతూ ఉంటాము, దాని తరువాత వచ్చే పర్యవసానాలను ఎదురుకొనే ధైర్యం ఉండదు మనకు.. ఒక స్థిమితమైన ఆలోచన పద్దతిని మనకు అలవాటు చేసి జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది భగవద్గీత .


6) భగవద్గీత మనల్ని మనము గుర్తించేలా చేస్తుంది. సమస్యలు అనేది మానవ జీవితంలో చాలా సాధారణమైనవి .. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనము ఢీలా పడిపోకుండా, కృష్ణుడు మనకు గీత రూపం లో చేయూతను ఇచ్చి కర్మను చేయమంటారు.


7) భగవద్గీత మనకు మంచి చెడు మధ్య తేడాను తెలియచేస్తుంది:

ఒక నిర్ణయం తీసుకునే ముందు అది మంచిదా చెడ్డదా అని అని మన మనసు మనకు చెప్తుంది. మనము తీసుకునే నిర్ణయం వలన ఇంకో మనిషికి సమస్య రాకుండా ఎలా తీసుకోవాలి అన్న ఒక దృష్టికోణాన్ని భగవద్గీత మనకు చెప్తుంది. మనకు తీసుకునే నిర్ణయాన్ని పక్క వారిని బాధిస్తే మటుకు దానికి మనమే పూర్తి బాధ్యులం అని కూడా తెలియచేస్తుంది.


8) భగవద్గీత భావోద్వేగాలకు, కర్మకు తేడా తెలియ చెప్తుంది.

అర్జునుడు భావోద్వేగాలకు లోనయ్యి యుద్ధం చేయను అంటాడు .. అట్లాగే మన అన్న ఒక భావనతో మనము కూడా చాల సార్లు మన వాళ్ళు చేసిన తప్పుని సమర్థిస్తాము. అది తప్పు అని అర్ధమయ్యేలా భగవద్గీత మనకు చెప్తుంది.


9) భగవద్గీత మనకు ఈ సమాజంలో ఉంటూనే ఆధ్యాత్మిక జీవితం ఎలా గడపాలో చెప్తుంది:

ఈ సమాజం లో ఉంటూనే, మనకు లోకం లో ఉన్న సంసార పరమైన రుచులు అంటకుండా, తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ జీవితాన్ని ఎలా గడపాలో భగవద్గీత మనకు నేర్పిస్తుంది.


10) భగవద్గీత మనకు తిండి యొక్క విశిష్టత గురించి చెప్తుంది:

ఒక రకమైన తిండి తినడం వలన మనలో ఉన్న భావోద్వేగాలు ఎలా మారుతాయి, మన జీవన శైలిని అది ఎలా నిర్దేశిస్తుంది.. అట్లాగే మనము తినే తిండి మన ఆరోగ్యం, ఆలోచన, జీవన శైలిని ఎలా ప్రభావితం చేస్తుంది అన్న సారాంశం భగవద్గీత లో ఉంటుంది.


11) భగవద్గీత జీవితం యొక్క పరమార్థాన్ని తెలియచేస్తుంది:

తిన్నామా,, పాడుకున్నామా, తెల్లారిందా .. అన్నట్టు కాకుండా భగవంతుడిని ఎలా అన్వేషించాలి అని ఒక మార్గాన్ని మనకు భగవద్గీత చూపిస్తుంది.

నాకు భగవద్గీత లో బాగా నచ్చిన శ్లోకం ఏంటి అంటే

न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन ।

नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि

దీనికి అర్ధం ఏంటి అంటే " పార్థ .. ఈ ముల్లోకాల్లో నేను నిజంగా తల్చుకుంటే సాధించలేనిది ఏది లేదు.. అసలు నేను సాధించడానికి కూడా ఏమి మిగలలేదు. అయిన సరే నేను కర్మను చేస్తున్నాను .. అట్లా చేయకపోతే, కర్మ అనేది చేయక్కర్లేదు అని ఒక తప్పుడు ఉద్దేశాన్ని జీవులకు నేను చెప్పినట్టు అవుతుంది. దాని వలన వాళ్ళు కర్మ చేయడం మానేస్తారు.. కాల చక్రం అనేది దాని వలన ఆగిపోతుంది. జీవులో మేలు కోసమే నేను కర్మాణి చేస్తున్నాను.

భగవద్గీత మన నుదిటివ్రాత అని ఎవరో మహా కవి అన్నట్టు గుర్తు .. మతాలతో సంబంధం లేకుండా ఒక పుస్తకం పుస్తకం అనుకోని అందరూ దాన్ని ఒకసారన్నా అది చదివితే మన ఆలోచనలో వస్తుంది.


ఒక ముక్కలో చెప్పాలి అంటే జీవితం యొక్క పరమార్థాన్ని భగవద్గీత మనకు చెప్తుంది.

*కృష్ణం వందే జగద్గురుమ్*

సుభాషితమ్


 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


*శ్లోకం*


*వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం౹*

 *వందే సర్వగతం దయామృతనిధిం వందే నృసింహాపహం౹*

 *వందే విప్రసురార్చితాంఘ్రికమలం వందే భగాక్షాపహం౹*

*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹*


_" *శివస్తుతి - 6* "_


యముని హరించే వాడు, హరుడు, విషాన్ని ధరించే వాడు, దయామయుడు, పెద్ద ముళ్ళు వేయబడిన ఝూటములు కలవాడు, అంతటా వెళ్ళినవాడు, దయ అనే అమృతానికి నిధియైన వాడు, నరసింహ స్వామిని వశం చేసుకొన్నవాడు,  బ్రాహ్మణుల, దేవతలచే పూజించబడిన పాదపద్ములు కలవాడు,  భగుని కన్ను నాశనము చేసినవాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన *శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

తల్లి భూమి కంటే బరువైనది

 శ్లోకం:☝️

*మాతా గురుత్తరా భూమేః*

  *ఖాత్ పితోచ్చతరస్తథా |*

*మనః శీఘ్రతరం వాతాత్*

  *చింతా బహుతరీ తృణాత్ ||*

  యక్ష-యుధిష్ఠిర సంవాదం, 

  వనపర్వ, మహాభారతం


భావం: తల్లి భూమి కంటే బరువైనది. తండ్రి ఆకాశం కంటే ఉన్నతుడు. మనస్సు గాలి కంటే వేగవంతమైనది. గడ్డి కంటే చింతలు చాలా ఎక్కువ.

పంచాంగం 08.10.2023 Sunday,

 ఈ రోజు పంచాంగం 08.10.2023  Sunday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష: నవమి తిధి భాను వాసర: పుష్యమీ నక్షత్రం సిద్ధ యోగ: గరజి తదుపరి వణిజ కరణం ఇది ఈరోజు పంచాంగం.

నవమి పగలు 10:13 వరకు.

పుష్యమి రాత్రి 02:44 వరకు.

సూర్యోదయం : 06:11

సూర్యాస్తమయం : 05:56

వర్జ్యం : పగలు 08:53 నుండి మధ్యాహ్నం 10:40 వరకు

దుర్ముహూర్తం : సాయంత్రం  04:22 నుండి 05:09 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం : మద్యాహ్నం  12:00 నుండి 01:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

సుందరి చూపులో

 


సుందరి చూపులో  మదనుని  తూపులు !

                                          ------------------------------------------------------------- 


                చం:  " కొలకుల  కెంపు  సొంపు ,  రహిఁగుల్కెడు  తారల  నీలిమంబు ,  క


                           న్బెళకు  మెఱుంగులుం  , గలసి  , పెంపమరెన్  హరిణాక్షి  చూపు,  ల


                           వ్వలదొర , ముజ్జగంబుఁ  గెలువన్, నవ చూతదళంబు , మేచకో

                

                            త్పల , మరవింద ,  మొక్క మొగిఁ బట్టి   ప్రయోగము సేయు కైవడిన్;


                                      అనిరుధ్ధ చరిత్రము--ద్వి:ఆ:- 29వ: పద్యం; కనపర్తి అబ్బయా మాత్యుడు;


             అర్ధాలు:  కొలకులు-కన్నుల తుదలు; కెంపు -ఎరుపు; రహిగుల్కెడు- శోభలను ప్రసరంచు; తారలు-కనుగ్రుడ్లు;

బెళకు-చంచలము; పెంపమరెన్- అందగించెను; హరిణాక్షి: వనిత; వలదొర- మన్మధుడు;  చూతదళము-మామిడియాకు;

మేతకోత్పలము- నల్లకలువ; అరవిందము- పద్మము; 


                               ఇదియొక  అద్భుత మైన  చమత్కార పద్యము. ఇంతవరకు దీనిని బోలిన పద్యం రాలేదు.


                   మన్మధునకు  ముల్లోకాలను  జయించాలనే  కోరిక కలిగినదట! అదీ కేవలం  మూడేమూడు బాణాలతో.

మన్మధుడు  శృంగార రసానికి  అధినాయకుడు. కాబట్టి ఆమూడుబాణాలతో  యేమిచెయ్యదలచాడు? ముల్లోకాలలో

నివసించే  పురుషుల (యువకుల)  హృదయాలలో అలజడి లేపి  వారిని శృంగార పరాయణులను  చేయదలచాడన్నమాట!


                         జయించాలంటే  బాణాలు కావాలి. ఆయన కున్నవెన్ని? మొత్తం ఐదే  అయిదు బాణాలు."  అరవింద మశోకంచ,

చూతంచ, నవమల్లికా ,నీలోత్పలంచ, పంచైతే  పంచ బాణస్య సాయకాః" అని అమరం.  అరవిందము ,అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలములు. ఇందులో కేవలం  మూడేమూడు బాణాలతో  ముజ్జగాలను గెలవాలి. వెదికాడు లోకాలన్నీ  ,ఈమూడూ

ఒక్కచోట దొరికినాయి! ఎక్కడ  ఉషాసుందరి కంటిలో , అమ్మయ్య అనుకున్నాడు.


                       ఉషాసుందరి కన్నులలో  మూడు బాణాలు దొరికాయట! ఎలాగో  చూడండి!


              కొలకులకెంపు -కనుచివరలు యెర్రగా ఉన్నాయి. ఆయెరుపు నవచూత దళమువలె( మామిడాకు వలె)నున్నది.


              రహిగుల్కెడు తారల నీలిమంబు-  కనుగుడ్లు యొక్క నల్లదనం ,నీలోత్పలం  వలె  ఉన్నది. 


              కన్బెళకు మెఱుంగులు- కన్నులలోని  తరళమైన  కాంతులు  అరవిందము  వలె నున్నవి.


                                  ఇకనేం  చూతము  నీలోత్పలము  అరవిందము   యీమూటితో  ముజ్జగములను  సునాయాసంగా

గెలవ  గలమని  వాటిని మల్లోకముల మీద యెక్కుపెట్టెనా?  యనేరీతిగా  ఉషాసుందరి  కన్నులు , చూపులూ  ఉన్నాయని

కవి వర్ణన.  ముల్లోకాలలోనూ  ఇంత అందమైన  సుందరిలేదనీ, యెవరైనా ఆమెయందానికి, దాసోహ మనక  తప్పదనీ

కవిగారి యభిప్రాయం.  కంటిలో  మూడు  మన్మధబాణాలను  సృజించటం( ఊహించటం) ఇక్కడ కవితా చమత్కారం!


                                                                        స్వస్తి!🙏🙏🙏🙏

ధర్మం' అంటే ఏమిటి

 🕉️   *'ధర్మం' అంటే ఏమిటి?*   🕉️



ఇది చాల క్లిష్టమైన ప్రశ్న! 

వెంటనే వివరించి చెప్పటానికి కుదరని గంభీరమైన ప్రశ్న!  ఎందుకంటే ధర్మం అనే రెండక్షరాల శబ్దానికి 

చాలా లోతువుంది. 

చాలా సంక్లిష్టత ఉంది. 

చాలా నిగూఢత ఉంది. 

చాలా విశాలత ఉంది.


*‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతమ్’*


ధర్మాలన్నియు సాక్షాత్ పరమాత్ముని నుండి లభించాయి.


ధరించునదిగాబట్టి ధర్మము అని ధర్మ శబ్దానికి ఉత్పత్తి అర్ధము. (ధృ – ధారణే). 

ధర్మము నిత్యసత్యమై వుండేదైనా దేశకాల ప్రాంతాదుల ననుసరించి ధర్మం మారుతుంటుంది.


ధర్మము – సామాన్యధర్మం, 

విశేషధర్మం అని రెండు రకాలు.


*శ్లో|| ధృతిః క్షమా దమో స్తేయం, శౌచమింద్రియ నిగ్రహః|*

       *హ్రీర్విద్యాసత్య మక్రోధః ఏతత్ ధర్మస్త్య లక్షణమ్||*


“ధృతి – 

క్షమ – 

దమం – 

అస్తేయం – 

శౌచం – 

ఇంద్రియ నిగ్రహం – 

హ్రీః (సిగ్గు) – 

విద్య – 

సత్యం – 

అక్రోధం”, 

ఈ పది లక్షణాలు కలిగియుండడమే ధర్మమని శాస్త్రం చెబుతోంది. 

అంటే;...


*1.* మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. 

తనకు సంబంధించినది కానివ్వండి, 

కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, 

సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు. 

కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి. 

కువిమర్శలు ప్రారంభమౌతాయి. 

ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది. 

ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంటిత దీక్షతో ‘ధృతి' చెడకుండా ముందుకి సాగిపోవాలి.

*‘ఇది ధర్మం’.*


*2.* మనిషి ఏ విషయంలోనైనా, 

ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. 

క్షమాగుణంతో ఉండాలి. 

ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కొనాలి. 

కోపగించుకోకూడదు. 

ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు. *‘ఇది ధర్మం’.*


*3.* మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. 

ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనైనా ఇది ముఖ్యం. 

చదువుతున్నా, 

వింటున్నా, 

పని చేస్తున్నా, 

మాట్లాడుతున్నా, 

మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుంచాలి  *‘ఇది ధర్మం’.*


*4.* తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసికొనలేక, 

నిస్తేజంగా..

నిర్వికారంగా, 

నిరాశగా, 

నిర్లిప్తతగా, 

నియమరహితుడుగా, 

ఉండకూడదు. 

*‘ఇది ధర్మం’.*


*5.* మనిషి ఎల్లప్పుడూ..

మనస్సునూ, 

శరీరాన్నీ, 

మాటనూ..

ఆలోచననూ, 

సంసారాన్ని, 

ఇంటినీ, 

పరిసరాన్నీ, 

ధరించే వస్త్రాలనూ 

పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. 

మనసు పరిశుభ్రంగా వుండాలి.  

మనిషి పరిశుభ్రంగా ఉండాలి.

*‘ఇది ధర్మం’.*


*6.* చదువు వున్నా, 

సంపదలున్నా, 

కీర్తివున్నా, 

బలంవున్నా 

ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. 

కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దాన్ని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. 

*‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడినైనా గెలుస్తాడు’* మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో వారికి..

భూతప్రేతాలుగాని, 

దెయ్యాలు గాని, 

యక్షకిన్నెర కిమ్పురుషులుగాని, 

గ్రహాలు గాని, 

రోగాలు గాని, 

కష్టసుఖాలుగానీ, 

మరణంగానీ, 

వశంలో వుంటాయి. 

కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయాలి .

*‘ఇది ధర్మం’.*


*7.* ప్రతి విషయానికీ సంకోచపడటం, 

సిగ్గుపడటం, 

అనుమానపడటం, 

తనను తాను తక్కువగా భావించటం కూడదు 

*‘ఇది ధర్మం’.*


*8.* మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి. 

అకారణంగా, 

అనవసరంగా, 

ఒకరి మెప్పుకోసం, 

ఒకరిని మెప్పించటం కోసం, 

తన పనిని సాధించుకోవటం కోసం, 

తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం, తనవారిని తృప్తిపెట్టటంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. 

అబద్ధం మరొకనాటికి అవమానం పాలు చేస్తుంది. 

అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. 

మన శక్తినీ, మన కీర్తినీ, మన గొప్పదనాన్ని పాతాళానికి త్రొక్కివేస్తుంది. 

కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు. 

*‘ఇది ధర్మం’.*


*9.* మానవునికి ఆహారం ఎంత ముఖ్యమో, 

వివేకం కూడ అంతే ముఖ్యం. 

వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. 

విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి.

 ‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. 

మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవితం గడపకూడదు. ఎంతటి పెడతానం పెనవేసుకొనివున్నా, 

స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా,

భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. 

*‘ఇది ధర్మం’.*


*10.* పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం 

ఇవన్నీ మనిషిని  పతనావస్థకు నెడతాయి. 

పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. 

తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. తనను కన్నవారికీ, 

తాను జన్మనిచ్చిన వారికీ, 

తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది..

కాబట్టి వీటిని వదిలిపెట్టాలి. 

*‘ఇది ధర్మం’.*...🙏