8, డిసెంబర్ 2023, శుక్రవారం

లయ-లయం

 

లయ-లయం 

మనం తరచుగా రెండు పదాలను వింటూవుంటాము. "లయ" అంటే ఒక క్రమ పద్దతిలో నడిచే కదలిక కానీయండి శబ్దం కానీయండి దానిని మనం లయ అంటాము. ఉదాహరణకు మన శ్వాస , నడక, హృదయ స్పందన, కదిలే చక్రము ఏదైనా కానీయండి. ఇంకా ఇప్పటి ఆధునిక సైన్సు ప్రకారం చుస్తే విదుత్ పౌనపుణ్యం, లేక కంప్యూటర్ వేగాన్ని సూచించే పౌనపుణ్యం (హెర్డ్జి) ఇలా చుప్పుకుంటూ పొతే మనకు  అన్నీ కూడా లయబద్దంగానే గోచరిస్తాయి.  

బౌతికంగా ఇవి అయితే ఇక సంగీతము, నృత్యము శాస్త్రాలు పూర్తిగా లయమీదనే ఆధారపడి  వున్నాయి. విషయం ప్రతి వారికి తెలిసినదే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఒక క్రమపద్ధతిలో వున్నది అదే లయ ప్రకారంగా వున్నది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే లయ లేనిది జగత్తు లేనే లేదు. మన భూమిని కాకుండా ఖగోళాన్ని ఒక్కసారి గమనిస్తే మనకు అంతా లయప్రకారమే గోచరిస్తుంది. సూర్య, చంద్ర, నక్షత్ర గతులు కూడా పూర్తిగా లయ ప్రకారమే ఉన్నాయిమనకు తెలుసు భూమి తనచుట్టూ తానూ తిరగటానికి ఒక్కరోజు పడుతుంది అది ఒక లయ సమయంలోకూడా తన వేగాన్ని మార్చుకోదు అంటే ఒక సారి సగం రోజు ఇంకొకసారి రెండురోజులు అలా ఒకవేళ అదే జరిగితే భూప్రపంచం మొత్తం  నాశనం అవుతుందిఅదే విధంగా చంద్రుడు భూమి చుట్టూ ఒక నెలరోజుల సమయంలో తిరుగుతాడుచంద్రగతి కూడా అనాదిగా అదే విధంగా వున్నదిఇలాగే సూర్య భగవానుడు కూడా ప్రతి గ్రహం, నక్షత్రం పాలపుంతలో ఒక క్రమ వేగంతో సంచరిస్తూవుంటాయిపూర్తి దృశ్యమాన జగత్తు  లయమీదనే ఆధారపడి వున్నది. ఇంకొక విషయంకూడా మనం గమనించాలి ఒక గ్రాహం ఇంకొకగ్రహంకు తాకకుండా పరి బ్రమించటం కూడా లయ మీదనే ఆధారపడి వున్నది. లయ తప్పితే గ్రహగతులు తప్పుతాయి అని వేరే చెప్పక్కరలేదు

ఒక వీధిలో వెళ్లే వాహనాలు వేటి లయ (speed) వాటికి ఉంటుంది ఎప్పుడైతే లయ మారుతుందో లేక లయ ఆగుతుందో అప్పుడు ప్రమాదాలు జరగటం మనం చూస్తూవున్నాము. ఒక మనిషి వీధిలో నడుచుకుంటూ వెళుతున్నాడు అనుకోండి అంటే అతను ప్రతి అడుగు కూడా లయ బద్దంగా వేస్తూ వున్నాడని అర్ధం. ఒకవేళ అతను అలా కాకుండా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వేయాలన్న వేయలేడు తన వేగాన్ని మారుస్తే పర్యావసానంగా లయ మారుతుందికానీ లయ మాత్రం ఉంటుంది. వేగంగా ప్రయాణిస్తే వేగవంతమైన లయ ఉంటుంది నిదానంగా ప్రయాణిస్తే తక్కువ వేగవవంతమైన లయ ఉంటుందికానీ లయ మాత్రం ఎప్పుడు ఉంటుంది. మనిషి జీవితం మొత్తం ఒక లయ బద్దంగానే కొనసాగుతుంది. పుట్టినప్పటి నుండి చరమ దశ వరకు 

లయ బద్దంగా ఉండటమే ఒక నటన అదే ఈశ్వరుడు సృష్టించిన నాట్యం. అందుకే ఈశ్వరునికి నటరాజు అనే పేరు కూడా వున్నది పరమేశ్వరుడు రచించిన నాటకంలో ప్రతిదీ ఒక పాత్ర పోషిస్తూవుంటుంది. మనుషుల పాత్ర మనుషులది పశు పశ్యదుల పాత్ర వాటిదికొన్ని నిర్జీవులు కొన్ని సజీవులు జీవం ఉండటం ఉండక పోవటం కూడా పరమేశ్వరుని లీలలో భాగమే విషయం ప్రతి సాధకుడు తెలుసుకోవాలి

లయం అంటే ఏమిటో కాదు లయ ఆగటమే లయం. సాధారణంగా మనం నిత్యం ఏదో ఒక పని చేస్తూ ఉంటాము అంటే అది లయ, కొంత సమయం తరువాత పని  అయిపోతుంది. అంటే లయ  ఆగిపోతుంది. అదే లయం ఎందుకంటె అప్పుడు పని లేదునీవు హైదరాబాదు నుండి కాశీకి ప్రయాణం చేయాలని రైలు ఎక్కావు రైలు కదిలింది అంటే లయ మొదలైంది. కొంతకాలం తరువాత నీ రైలు కాశీని చేరుకుంది అంటే అప్పటి దాకా రైలుకు వున్న లయ ఆగిపోయింది అంటే లయ లయంగా నిశ్చలంగా మారింది అని అర్ధం

ప్రతి మనిషి శ్వాస కూడా ఒక లయ, ఏదో ఒకరోజు లయ ఆగిపోతుంది అంటే లయం  అవుతుంది. దాని అర్ధమే జీవన చివరి  ఘట్టం. లయను, లయాన్ని రెంటిని శాసించేవాడే పరమేశ్వరుడు విషయం మనం తెలుసుకోవాలిఎప్పుడైతే లయకారుని స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతామో అప్పుడే మనకు మనస్సులో ఒక భావన కలుగుతుంది అదేమిటంటే మనలను కాపాడేవాడు, రక్షించేవాడు కరుణించేవాడు మోక్షసిద్దిని ఇచ్చేవాడు పరమేశ్వరుడు తప్ప వేరొకరు  కాదని. నిత్యం శివాలయంలో మనకు లయ, లయం రెండు దృగ్గోచరితం అవుతుంటాయి. మన మహర్షులు మనకు ప్రతి క్షణం మనం ఎలా మసలుకోవాలి, ఎలాంటి ఆలోచనలు చేస్తే మనం జన్మరాహిత్యాన్ని పొందగలం అనే విషయం అను క్షణం గుర్తుచేస్తున్నారు.  

శివాలయలో పరమశివుని లింగం మీద ఒక్కొక్క చుక్కగా జలం పడటం మనం చూస్తూవుంటాము జల పాత్రలో నీరు ఒక రోజో లేక కొన్ని గంటలో పడి కాళీ అయి  పోతుంది. అదే విధంగా మానవ జీవితంలోని కాలం కూడా ఒక్కొక్క క్షణం కరిగిపోయి చివరికి కాళీ అయి పోతుందిఅంటే అక్కడ అతని కాలం ఆగిపోతుందికాబట్టి కాలం చాలా విలువైనది అని  గమనించాలి. మరి కాలాన్ని ఎలా వినియోగించాలి అంటే ఎలాగ అయితే పాత్రలోని నీరు చుక్క చుక్కగా పరమేశ్వరుని అభిషేకం చేయటానికి ఉపయోగపడుతున్నదో అదే విధంగా మన మనస్సు ప్రతి క్షణం దేవదేవుని అంటే పరమశివుని పాదాలమీదనే ఉండి నిత్యం ఆయనతోటె సంబంధం కలిగి ఆయననే పట్టుకుంటే అప్పుడే మనకు ఆయన కరుణా కటాక్షం కలుగుతాయి

శివుడు బాహ్యంలో కాదు మాన హృదయాంతరాళాల్లో నిక్షిప్తమై వున్నాడు సత్యాన్ని తెలుసుకొని మన హృదయేశ్వరున్ని నిత్యం అను క్షణం తలుస్తూ, కొలుస్తూ ఉంటే తప్పకుండ కైవల్యం లభిస్తుంది. అది ఎలా అంటే 

నేను తీసుకునే శ్వాస అజపా జాపంగా భావించి నిత్యం అజపాజపం చేయాలి. అంటే రోజుమొత్తం నేను జపంలోనే ఉన్నాననే భావనలో ఉండటంనేను స్నానం చేస్తున్నాను అంటే శివునికి అభిషేకం చేస్తున్నాననే భావనలో  ఉండాలి. నేను మల మూత్ర విసర్జన చేస్తున్నాను అంటే శివుని వద్ద మాలిన్యాన్ని తొలగిస్తున్నాను అని  నేను  మాట్లాడుతున్నాను అంటే శివుడు మాట్లాడుతున్నాడు అనే భావన ఇలా నా పూర్తి దైనందిక జీవనం శివునిదే కానీ నాది కాదనే భావనలో సాధకుడు ఉంటే నిత్య కైవల్యమే స్థితి మనం చెప్పుకునే అంత  సులభం కాదు కఠోర దీక్షతో, అకుంఠిత పరిశ్రమతో మాత్రమే సాధ్యంకానీ అసాధ్యము మాత్రం కాదు. "కృషితో నాస్తి దుర్భిక్షం"

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

మీ భార్గవశర్మ

 

సుభాషితమ్

 🕉️🪔  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


*అంధస్యమే హృతవివేక మహాధనస్య*

*చోరై ర్మహాబలభి రింద్రియనామధేయైః* |

*మోహాంధకారకుహరే వినిపాతితస్య*

*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 15_* _


*తా*: ఓ నరసింహ ప్రభూ! మహాబలవంతులగు

ఇంద్రియములనెడి దొంగలు నా వివేక ధనమును

దొంగిలించుకొని, అజ్ఞానమును అంధకారపు గుహలో

త్రోసివేసిరి. కన్నులు కాన రాకున్నవి. నాకు చేయూత నిచ్చి, ఆ గుహ నుండి బయటకు తీసి నన్నుద్ధరింపుము. *లక్ష్మీదేవితో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*.

రైలు ప్రయాణంలో

 నేను రైలు ప్రయాణంలో 

ఓ ఊరు వెళుతుండగా నేను కూర్చున్న భోగీలో నాసీటు కింద కాళ్లదగ్గర  ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది.


దానిని పైకి తీశాను. అందులో కొద్దిపాటి నోట్లు ఒక *కృష్ణుడిఫోటో* తప్ప ఏమీ లేవు. ఎవరిదో తెలిపే ఆనవాళ్ళు ఏమీ లేవు.

ఎలా తిరిగి ఇవ్వడం?

ఈ పర్స్ ఎవరిదండీ? అంటూ అడిగా, అక్కడ ఉన్నవాల్లలో అందరూ పర్స్ కేసి చూశారు, తమ జేబులు తడుముకున్నారు.


ఇంతలో పక్కబెర్తులో కూర్చుని *భగవద్గీత* చదువుకుంటున్న ఒక పెద్దాయన నెమ్మదిగా వచ్చి అది తన పర్స్ అని చెప్పాడు.

మీ పర్సు అని నమ్మకం ఏమిటీ? ఏదైనా ఆనవాలు ఉంటే చెప్పండి అన్నాను. "అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండీ"అన్నాడాయన. 

"ఆ ఒక్క ఆనవాలు చెబితే ఎలాగండీ? ఇంకా ఏదైనా చెప్పండి. మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా!" అని అడిగాను.

అప్పుడు ఆ పెద్దాయన చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమే.


బాబూ..!  అది చిన్నప్పుడు నాకు మా నాన్న ఇచ్చిన పర్సు, అప్పుడు నాకు మా అమ్మానాన్న అంటే చాలా ఇష్టం, అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను.

కాలం గడిచేకొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది. అందుకని నేను అప్పుడు పర్సులో నా ఫోటో పెట్టుకున్నాను.


నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది. నా భార్య చాలా అందగత్తె. నాకు ఆమె అంటే చాలా ప్రేమ. అపుడు ఆమె ఫోటో పర్సులో పెట్టుకునే వాడిని.


ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి కోసం ఆఫీసు వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని.

వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని. వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునే వాడిని. వాడే నా లోకం. అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునే వాడిని. వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు.


నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది.

కొడుకు నన్ను మరచిపోయాడు. నాకెవ్వరూ లేరు. ఇపుడు భయం వేస్తోంది. ఈ వయసులోనేగా తోడు కావాలి. అందుకని నాకు తోడుగా కృష్ణుడిని పెట్టుకున్నాను. ఆయనే నాకు ఇపుడు తోడు.


నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు.

నా విచారానికి ఓదారుస్తాడు.

నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో పర్సులో పెట్టుకోవలసిన నేను చాలా ఆలస్యంగా గుర్తించాను. ఇప్పుడు నేను ఆయనతో గడుపుతున్నాను.


*భగవద్గీత* చదువుతుంటే స్వయంగా ఆ జగద్గురువే నాతో మాట్లాడుతున్న అనుభూతి, ఆనందం కలుగుతున్నాయి. చిన్నతనం నుంచీ నన్ను విడిచిపెట్టిపోయే అశాశ్వతమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చాను తప్ప, శాశ్వతమైన పరమసత్యం 

ఈ భగవద్గీత అనే నిజాన్ని విస్మరించాను. జీవితం అర్ధభాగం పైగా గడిచిపోయిన తరువాత ఈ *బ్రహ్మవిద్యపై* శ్రద్ధ కలిగినదుకు సంతోషించాలో, కనీసం నూటికి 90 మందికిపైగా ఇప్పటికీ దేవుని ఉవాచపై శ్రద్ధ లేనందుకు విచారించాలో తెలియడం లేదు అన్నాడు 

ఆ పెద్దాయన.


ఆయన మాటల్లో ఆవేదన, ఆయన కళ్ళల్లో పలుచటి నీటిచెమ్మ లీలగా కనిపించాయి.

నేను మారు మాట్లాడకుండా పర్సు ఆయనకు ఇచ్చేశా.

పక్క స్టేషనులో రైలు ఆగింది, నేను దిగవలసినది అక్కడే. రైలు దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నా ఆలోచనలు మాత్రం వేగంగానే సాగుతున్నాయి. బయటకు రాగానే ఎదురుగా గోడపై

*భగవద్గీత చదవండి,*

*శ్రీ కృష్ణుని నిజభావం తెలుసుకొనండి"*  అని వ్రాసి ఉన్న బోర్డు చూసి, దానిపై ఉన్న నెంబర్ కి కాల్ చేసి నాకు భగవద్గీత కావాలని అడిగాను. ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి నేనున్న రైల్వేస్టేషన్ కు 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నానని, మీకు ఆలస్యం అవుతుందంటే మీ అడ్రస్ కు తెచ్చి ఇస్తామని చెప్పాడు. గంట సమయమైనా నేను ఇక్కడే వేచి ఉంటాను వెళితే భగవద్గీత గ్రంథంతోనే ఇంటికి వెళ్తాను అని చెప్పాను.

సుమారు 25 సంవత్సరాల వయసున్న వ్యక్తి అర్ధగంటకి  బైకుపై వచ్చి నా నెంబర్ కి కాల్ చేసాడు. అతనిని చూసి చెయ్యి పైకెత్తి పిలిచాను. అతను దగ్గరకు వచ్చి *"భగవద్గీత"* నా చేతిలో పెడుతూ ఆలస్యం అయ్యింది ' క్షమించాలి అన్నాడు. 

ఆ మాటల్లో మర్యాద..... నిజంగానే "భగవద్గీత" ఇంత సంస్కారం నేర్పుతుందా అని చిరునవ్వు నవ్వి, ఆ గ్రంథం యొక్క వెల చెల్లించి, ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి, ఆటోని పిలిచాను. ఆ పెద్దాయన చెప్పింది నిజమే.,  భగవద్గీత పట్టుకుని అడుగులు వేస్తుంటే స్వయంగా ఆ దేవదేవుడే నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.

 

*భగవంతుడు తప్ప నిన్ను కాపాడేవాడే లేడు...* నిత్యం మనకు ఎన్ని పనులు వున్నా భగవంతునికి , భగవంతుడు చెప్పిన భగవద్గీతకు కాస్త సమయం కేటాయిస్తే ఆయన మన కోసం జీవితకాలం తోడు వుంటాడు. ఆయన్ని అర్జునుడిలా శరణు వెడితే!

నీ జీవితమంతా అదే అర్జునుడికి తోడుగా ఉన్నట్టే ఉండి.. నిన్ను నడిపిస్తాడు


🙏జై శ్రీ కృష్ణ🙏జై శ్రీ కృష్ణ🙏


 🌹🙏 సర్వేజనా సుఖినోభవంతు🙏🌹

శ్రీ మకరధ్వజ దండి హనుమాన్ మందిర్

 🕉 మన గుడి : నెం 260


⚜ గుజరాత్ : బేట్ ద్వారక 


⚜ శ్రీ మకరధ్వజ దండి హనుమాన్ మందిర్



💠 మీరు హనుమాన్ యొక్క అనేక అద్భుత దేవాలయాల గురించి విని ఉంటారు, కానీ బాలబ్రహ్మచారి హనుమాన్ కి కూడా ఒక కొడుకు ఉన్నాడని మీకు తెలుసా?  

ఇది మాత్రమే కాదు, బజరంగబలి తన కుమారుడితో కలిసి కూర్చున్న ఆలయం ఉందా? 

 అవును, ఇది బజరంగబలి యొక్క ఏకైక ఆలయం, ఇక్కడ అతను తన కొడుకుతో పాటు పూజించబడతాడు.  

అతని కుమారుడు ఎప్పుడు మరియు ఎలా జన్మించాడు అనేదానికి సంబంధించిన కథ పురాణాలలో వివరించబడింది.


💠 బేట్ ద్వారక ప్రధాన శ్రీ కృష్ణ ఆలయానికి తూర్పున 5 కిలోమీటర్ల దూరంలో హనుమంతుని కోసం అద్భుతమైన మరియు ప్రత్యేకమైన ఆలయం ఉంది.  

దీనిని దండి హనుమాన్ దేవాలయం అని పిలుస్తారు.  ఈ ఆలయం విశిష్టత ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తికరం. 


💠 శ్రీ హనుమంతుడు తన కుమారుడైన మకరధ్వజునితో మొదటిసారిగా కలుసుకున్నాడని విశ్వసించబడే ప్రదేశంలోనే ఈ ఆలయం ఉంది.


💠 లంక దహన కార్యక్రమం తర్వాత హనుమంతుని చెమట కొంత సముద్రంలో పడినందున మకరద్వాజుడు మొసలి నుండి పుట్టాడు. అందుకే హనుమంతుడు కొడుకు పేరు మకరధ్వజుడు .

మకరం అంటే మొసలి 


💠 ఈ ఆలయంలో ఇంతకుముందు మకరధ్వజ విగ్రహం చిన్నగా ఉండేదని, ఇప్పుడు రెండు విగ్రహాలు సమానంగా ఎత్తుగా మారాయని చెబుతారు.  

ఈ ఆలయాన్ని దండి హనుమాన్ దేవాలయం అంటారు.  

హనుమాన్‌ తన కుమారుడు మకరధ్వజ్‌ని మొదటిసారిగా కలిసిన ప్రదేశం ఇదే అని స్థానికులు గట్టిగా  నమ్ముతారు.


💠 మీరు ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే, ముందు హనుమంతుని కుమారుడు మకరధ్వజ్ విగ్రహం ఉంది, సమీపంలో హనుమంతుని విగ్రహం కూడా ప్రతిష్టించబడింది.  

ఈ రెండు విగ్రహాల ప్రత్యేకత ఏమిటంటే, వారి చేతుల్లో ఆయుధాలు లేవు మరియు అవి ఆనంద భంగిమలో ఉన్నాయి. 

 

💠 ఈ ఆలయం 500 సంవత్సరాల పురాతనమైనది.  

హనుమ మరియు మకరధ్వజ్ ...తండ్రి-కొడుకు) కలయికను చూపించిన భారతదేశంలో ఇది మొదటి ఆలయం.


💠 హనుమంతుడు శ్రీరాముడు-లక్ష్మణులను తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు, అతను మకరధ్వజునితో భీకర పోరాటం చేసాడు.  

కొన్ని మత గ్రంథాలలో, మకరధ్వజుడు హనుమంతుని చెమట ద్వారా చేప నుండి జన్మించిన హనుమంతుని కుమారునిగా కూడా  వర్ణించబడింది.  


💠 శ్రీ రాముని యొక్క గొప్ప భక్తుడు మరియు శంకరుడి 11వ రుద్ర అవతారమైన శ్రీ హనుమ బాల బ్రహ్మచారి అని మనకి బాగా తెలుసు.

అయితే మత గ్రంధాలలో హనుమంతుని కుమారుని వర్ణన ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.  


💠 హనుమంతుని కుమారుడైన మకరధ్వజ మూలం యొక్క కథ-మత గ్రంధాల ప్రకారం, హనుమంతుడు సీతను వెతుకుతూ లంకకు చేరుకుని, మేఘనాథునిచే పట్టబడినప్పుడు, అతన్ని రావణుడి ఆస్థానంలో హాజరుపరిచారు.  

అప్పుడు రావణుడు తన తోకకు నిప్పు పెట్టాడు మరియు హనుమంతుడు మండుతున్న తోకతో మొత్తం లంకను కాల్చాడు.  

హనుమంతుడు తన తోక కాలడం వల్ల తీవ్రమైన బాధతో  దానిని శాంతింపజేయడానికి అతను తన తోకలోని అగ్నిని చల్లబరచడానికి సముద్రపు నీటిని ఉపయోగించాడు.


💠 ఆ సమయంలో అతని చెమట చుక్క ఒక చేప తాగిన నీటిలో జారింది.  

చేప ఆ చెమట బిందువు నుండి గర్భవతి అయింది మరియు ఒక కొడుకుకు జన్మనిచ్చింది, అతని పేరు "మకరధ్వజ్".  


💠 మకరధ్వజుడు కూడా హనుమంతుని వలె శక్తివంతమైనవాడు మరియు తెలివైనవాడు.  అహిరావణుడు మకరధ్వజుడిని పాతాళానికి ద్వారపాలకుడిగా నియమించాడు.  అహిరావణుడు శ్రీరాముని మరియు లక్ష్మణుడిని దేవతకు బలి ఇవ్వడానికి తన భ్రాంతి శక్తితో శ్రీరాముడు మరియు లక్ష్మణుడిని పాతాళానికి తీసుకువచ్చినప్పుడు, హనుమంతుడు శ్రీరాముడిని మరియు లక్ష్మణుడిని విడిపించడానికి పాతాళానికి చేరుకున్నాడు మరియు అక్కడ అతను మకరధ్వజుని కలుసుకున్నాడు.  


💠 ఆ తర్వాత హనుమంతుడికి, మకరధ్వజుడికి మధ్య భీకర యుద్ధం జరిగింది.  చివరకు హనుమంతుడు అతన్ని ఓడించి తన తోకకు కట్టేశాడు.  

మకరధ్వజుడు తన మూలాన్ని హనుమంతునికి వివరించాడు.  హనుమంతుడు అహిరావణుడిని చంపడం ద్వారా శ్రీరాముడు మరియు లక్ష్మణుడిని విడిపించాడు మరియు శ్రీరాముడు మకరధ్వజుడిని పాతాళానికి అధిపతిగా నియమించాడు.


💠 ఈ విగ్రహం అతని జ్ఞాపకార్థం స్థాపించబడింది.ఈ మొదటి మకరధ్వజ్ మరియు హనుమంతుని ఆలయం గుజరాత్‌లోని భెంట్‌ద్వారికలో ఉంది.  



💠 ఈ ప్రదేశం ప్రధాన ద్వారక నుండి 2   కిలోమీటర్ల లోపలికి ఉంటుంది.

నవగ్రహా పురాణం🪐* . *100వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *100వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శుక్రగ్రహ చరిత్ర - 12*


దేవయాని కచుడి వైపు చిరునవ్వుతో చూసింది. *"రెండవ సారి పునరుజ్జీవితుడయ్యాక నీలో వర్చస్సు పెరిగింది, తెలుసా ?”* అంది నవ్వుతూ.


*" అంతా నీ చలువే ! గురుదేవులు చెప్పారు. నేను సజీవంగా వచ్చేదాకా అన్నపానాలు ముట్టనని శపథం చేశావట ! నీ రుణం తీర్చుకోలేను , దేవయానీ...”* కచుడు గద్గదికంగా అన్నాడు.


దేవయాని పైట దులిపి , మళ్ళీ వేసుకుంటూ చిన్నగా నవ్వింది. *“రుణం తీర్చుకోవాలని నీకు ఉంటే , తీర్చుకోగలవు ! దానికి మార్గం నేను చూపిస్తాను !”* అంది.


కచుడు తల అడ్డంగా ఊపాడు. *“ఏమి చేసినా , ఎంత చేసినా - నీ రుణం తీర్చుకోవడం అసాధ్యం , దేవయానీ ! ప్రాణానికి ప్రాణం అంటూ నా ప్రాణం ఇచ్చినా నీ రుణం తీరదు. ఎందుకంటే నువ్వు రెండుసార్లు నాకు ప్రాణదానం చేశావు. నేను ఒక్కసారి మాత్రమే నా ప్రాణం ఇవ్వగలను !"*


*"ప్రాణం వద్దు , ప్రేమ ఇస్తే చాలు !"* దేవయాని అతని కళ్ళల్లోకి చూస్తూ అంది.


*"నీ పట్ల నాకు ప్రేమాభిమానాలున్నాయని నీకు తెలుసు , దేవయానీ !"*


*"తెలుసు. అందుకే నా రుణం తీర్చుకునే ఉపాయం చెప్తున్నాను. నన్ను... పెళ్ళి. చేసుకో !"* దేవయాని , రెప్పలు వాల్చి సిగ్గుపడింది.


*"దేవయానీ !"* కచుడి పలుకులో ఆశ్చర్యం ప్రతిధ్వనించింది. *“నీకు... మతి భ్రమించిందా ?”*


*"ఔను ! భ్రమించింది ! నిన్ను మొదటిసారి చూసిన క్షణంలోనే నా మతి నీ చుట్టూ భ్రమించింది. ఆ క్షణం నుంచి అలా భ్రమిస్తూనే ఉంది , నీ చుట్టూ ! ఏమిటి అలా మిడిగుడ్లు వేసుకు చూస్తున్నావు , కచా ? మనిద్దరికీ మన్మథుడు ఆ నాడే పెళ్ళి చేసేశాడు ! ఇక జరగాల్సిన వివాహం సూత్రప్రాయమే !"*


*"దేవయానీ...”*


*"నిన్ను చూశాను ! నీ కోసం కలలు కన్నాను ! నా కలల్లోకి నిన్ను ఆహ్వానించాను !మానసికంగా నన్నూ , నా తనువునూ నీకు ఆ నాడే అర్పించాను...”.*


*"దేవయానీ ! నీ ఆలోచన , ఆశ , అభ్యర్థన , అన్నీ దురదృష్టకరమైనవి !"*


*"కచా !"*


*"గురుపుత్రిక శిష్యుడికి ఏమవుతుందో నీకు తెలుసా ?”* కచుడు తీక్షణంగా చూస్తూ) అన్నాడు.


దేవయాని అతని చూపుల్ని ఎదుర్కొంది. *"తెలియదు !”*


*"ఒక వ్యక్తికి గురువూ , ప్రాణదాతా ఏమవుతాడో తెలుసా ?"*


*“తెలియదు...”*


*"హు ! తెలుసు ! నీకు తెలుసని నాకు తెలుసు ! గురుపుత్రి శిష్యుడికి సోదరి అవుతుందని నీకు తెలుసు ! గురువూ , ప్రాణదాతా అయిన వ్యక్తి తండ్రి సమానుడనీ నీకు తెలుసు !”*


దేవయాని రెప్పలు వేయకుండా , తీక్షణంగా కచుడి ముఖంలోకే చూస్తూ ఉండిపోయింది.


*"గురుపుత్రి అయిన నువ్వు నాకు సోదరివి ! మీ తండ్రి గారికి పుత్ర సమానుడైన నేను నీకు సోదరుణ్ణి ! అర్థం చేసుకుని , అక్రమమూ , అసంగతమూ అయిన నీ ఆశను చంపుకో !"* కచుడు ఉద్వేగంతో అన్నాడు.


*"ఇప్పుడు నాకు బోధపడుతోంది , కచా ! మృతసంజీవని కోసం నన్ను ప్రేమిస్తున్నట్టు నటించావు ! నేనంటే ప్రేమ ఉందనీ , ఆప్యాయత ఉందనీ అందుకే అన్నావు !"* దేవయాని నిష్ఠురంగా అంది.


*"ఇప్పుడూ అంటాను. నీ పట్ల ప్రేమ ఉంది ! ఆప్యాయత ఉంది ! ఏది ఉందో అది ఉందన్నాను నీతో ! నువ్వంటే నాలో ప్రేమా , ఆప్యాయతా ఉన్నాయి గానీ , ప్రణయమూ , అనురాగమూ లేవు ! ప్రేమను ప్రణయంగా , ఆప్యాయతను అనురాగంగా అపార్ధం చేసుకున్న అపరాధం నీది నాది కాదు ! నీ అభిమానానికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. సోదరీ ! గురుదేవులు అనుమతిచ్చారు. నేను స్వస్థలానికి వెళ్తున్నాను !"* చెప్పడం ముగించి , కచుడు వెనుదిరిగాడు.


*"అ !"* దేవయాని గర్జన అతన్ని ఆపింది.


కచుడు ఆమె వైపు తిరిగి చూశాడు. దేవయాని కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. జేవురించిన ముఖంలో ఎర్రటి పెదవులు అదురుతున్నాయి. ఆగ్రహం , ఆవేశం ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మారి సమున్నతమైన ఆమె వక్షభాగాన్ని ఎత్తుకి ఎగసి పడే అలలా చేశాయి.


*“నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది ! నువ్వు మృతసంజీవని కోసం వచ్చావు ! అసుర శిష్యుల ఆవేశం నీకు అదృష్టంగా మారింది ! నిన్ను బ్రతికించుకోవాలన్న నా వాంఛ నీకు మహా భాగ్యంగా మారింది ! నువ్వు స్వార్థపరుడివి ! ఏ మంత్ర ప్రభావంతో నువ్వు రెండుసార్లు ప్రాణం పోసుకున్నావో , ఏ మంత్రాన్ని నా తండ్రి అమాయకంగా నీకు ఉపదేశించాడో , ఆ మంత్రం . ఆ మృతసంజీవనీ మంత్రం నీకు పని చేయదు ! ఆ మంత్రం నీకు ఫలితాన్ని ఇవ్వదు ! ఇది శుక్ర పుత్రిక దేవయాని శాపం !"* ఆగ్రహంతో దహించుకు పోతున్న దేవయాని బిగ్గరగా అరుస్తూ శపించింది.


దేవయాని ఆగ్రహం , శాపం కచుడికి చిరునవ్వు తెప్పించాయి. *"నేను ధర్మం తప్పని వాణ్ణి. గురుదేవులను మోసపుచ్చి నేను మృతసంజీవనీ విద్యను తెలుసుకోలేదు. ఆయన స్వయంగా ఉపదేశిస్తేగానీ ఆ విద్యను నేర్చుకునే అవకాశం లేదు. నీ శాప ప్రభావంతో ఆ మంత్రం నా మీద పనిచేయదు !”*


*“తుచ్ఛుడా ! నీ ముఖం నాకు చూపించకు ! వెళ్ళు ! వెళ్ళిపో !"* దేవయాని హూంకరించింది.


*"వెళ్తాను ! శాపానికి ప్రతి శాపం ఇచ్చి , రుణం తీర్చుకుంటాను ! ధర్మహాని కలిగే కామంతో ప్రవర్తించిన నీకు నీ కులస్థుడితో వివాహం జరగదు ! ఇది బృహస్పతి పుత్రుడైన కచుడి శాపం !”* కచుడు తీక్షణంగా చూస్తూ శపించి , వెనుదిరిగి ద్వారం వైపు నడిచాడు.


కచుడు తిన్నగా శుక్రుడి వద్దకు వెళ్ళాడు. చిరునవ్వు కనిపించని ప్రియ శిష్యుడి వైపు శుక్రుడు ఆశ్చర్యంగా చూశాడు.


*“గురుదేవా ! గురుపుత్రి శిష్యుడికి ఏమవుతుంది ?"* కచుడు ఉన్నట్టుండి అడిగాడు.


*"ఏమవుతుంది, నాయనా ! సోదరి !"* శుక్రుడు చిరునవ్వు నవ్వాడు.


*"దేవయానిని మొదటి నుండీ నేను సోదరిగానే చూశాను. అందుకే ఆమెతో వివాహాన్ని తిరస్కరించాను...”*


*“నీది ధర్మవర్తన ! వెళ్ళిరా , నాయనా !"* శుక్రుడు చెయ్యెత్తి దీవించాడు. 



*"ఇవి , నాయనా , శుక్రుడి చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలు !"* కథనం ముగిస్తూ అన్నాడు నిర్వికల్పానంద.


*"గురువుగారూ ! శుక్రుడు యయాతిని శపించిన ఘట్టం వదిలేశారే !"* సదానందుడు గుర్తు చేశాడు.


*"మరిచిపోయి ఉంటారు... గురువు గారు !"* చిదానందుడు అన్నాడు. 


నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. *“మరిచిపోలేదు , చిదానందా ! అది శుక్రుడి కథలో అంశం కాదు, యయాతి కథలో అంశం ! ఏం జరిగిందంటే , వృషపర్వుడి కూతురు శర్మిష్ఠ , ఒకసారి దేవయానిని అరణ్యంలోని పాడుబావిలోకి తోసి వేసి వెళ్ళిపోయింది. యయాతి ఆమెను రక్షించాడు. తండ్రి ప్రమేయంతో దేవయాని శర్మిష్ఠను దాసిగా చేసుకుంది. యయాతిని వివాహం చేసుకుంది. అందగత్తె అయిన శర్మిష్ఠను రహస్యంగా , భార్యగా ఆదరించాడు యయాతి. అందుకు ఆగ్రహించిన శుక్రుడు యయాతి వృద్ధుడైపోయేలా శపించాడు...".*


*"శుక్రాచార్యుడు ఒంటికంటి వాడయ్యే కథాంశం , గురువుగారూ ?”* శివానందుడు అన్నాడు.


*“ఆ కథాంశం కూడా ఉంది. అది నవగ్రహ మహిమల క్రమంలో చక్కగా చెప్పుకోవచ్చు ! ఇప్పుడు నవగ్రహాలలో ఏడవవాడైన శనైశ్చరుడి చరిత్ర చెప్పుకుందాం !”* నిర్వికల్పానంద అన్నాడు. శిష్యులు ఉత్సాహంగా చూశారు.


*“ఇతర గ్రహదేవతల చరిత్ర కన్నా , శనిచరిత్ర గొప్పగా ఉంటుందనుకుంటాం , గురువుగారూ !"* సదానందుడు అన్నాడు.


*"పురాణాల మూలంగా మనకు తెలుస్తున్న శనైశ్చరుడి చరిత్ర చాలా , చాలా స్వల్పమే నాయనా ! ఆయన బ్రహ్మను సేవించాడనీ , శివుడు ఆయనకు ఇష్టదైవమనీ , అంతేకాకుండా ఏక కాలంలో త్రిమూర్తులను ప్రసన్నం చేసుకున్నాడనీ - తరతరాలుగా పెద్దల నోళ్ళలో నానుతున్న విషయాలున్నాయి. అవేవీ శనైశ్చరుడి వ్యక్తిత్వానికి గానీ , ఆయన తత్వానికి గానీ , గుణగణాలకు గానీ , ఆయన కారకశక్తులకు గానీ విఘాతం కలిగించేవి కావు ! యుగయుగాలుగా , తరతరాలుగా కర్ణపరంపరగా వస్తున్న ఆ విశేషాలను ఆ ప్రాతిపదికమీదే మనం మననం చేసుకోవడం తప్పుకాదు ! కాబట్టి శాస్త్రాధారాల కోసం చూడకుండా ఆయా అంశాలు కలగలుపుకుంటూ శనిచరిత్ర విందాం !"* నిర్వికల్పానంద  అగి  సరేనా అన్నట్టు చూశాడు.


*"గురువుగారూ ! అవి కల్పనలు కదా ! వాటిని స్వీకరించవచ్చా ?"* విమలానందుడు సందేహం వెలిబుచ్చాడు.


నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. *"తార్కికంగా ఆలోచిస్తే కఠిన సత్యం లేకుండా కల్పన రాదు ! నువ్వు విన్నదో , కన్నదో , చదివినదో , ఎలాగైతేనేం - నీ పంచేంద్రియాలు అనుభవంలోకి వచ్చిన దానిని తప్పించి మరొక దానిని ఊహించలేవు కదా ! కఠిన సత్య కల్పనకు మాతృక ! కర్ణపరంపరగా అలా మనకు అందజేయబడిన అంశాలనే 'పుక్కిటి పురాణాలు' అంటారు ! వాటిలో కల్పన తప్పకుండా ఉంటుంది ! ఆ కల్పనకు పునాదిగా సత్యం ఉండి తీరుతుంది !"*


*"బాగుంది , గురువుగారూ ! ఇక శని చరిత్ర విందాం !"* చిదానందుడు వినయంగా అన్నాడు.


*"అలాగే ! వినండి ! ఛాయ సంతానమైన శనీ , సావర్ణి , తపతీ ముగ్గురూ సంజ్ఞ పెంపకంలో పెరుగుతున్నారని మనం చెప్పుకున్నాం కద ! తపస్సు చేయడానికి వెళ్ళిన సంజ్ఞా పుత్రుడు యముడు తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చాడు. అతని ముఖంలో ఏదో కొత్త తేజస్సు నర్తనం చేస్తోంది...”* నిర్వికల్పానంద ప్రారంభించాడు.


*శనిగ్రహ చరిత్ర ప్రారంభం*

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం



.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||





సాధ్వీమణీ ! నేను ఈ మాట అన్నానో లేదో పర్జన్యుడు హఠాత్తుగా వర్షించాడు. ధారాహస్తాలతో

కుండపోతగా వానకురిపించాడు. ఉరుములూ మెరుపులతో వర్షిస్తున్న మేఘాన్ని చూసి నా హృదయం

వెమలిలా పురివిప్పి నాట్యం చేసింది. ఆ గుడిసెలోనుంచి ఒక్క అంగలో ఇవతలికి వచ్చాను. పన్నెండేళ్ళ

తరవాత పడుతున్న వానలో కేరింతలు కొట్టాను.

అవర్షణే చ చౌర్యేణ యత్పాపం కథితం బుధైః !

యో న వర్షతి పర్జన్యః తత్తు తస్మై భవిష్యతి


* త్రిశంకుడికి విశ్వామిత్రుని ప్రత్యుపకారం

ప్రియాంగనా! మరి నువ్వు ఎలా కాలం గడిపావో, ఏమేమి చిత్రవిచిత్ర సంఘటనలు 

జరిగాయో చెప్పాలి. కష్టాలు గడిచిపోయాక వింతలూ విడ్డూరాలుగానే ఉంటాయి. క్రూరమృగాల

సంచరించే ఈ భయంకరారణ్యంలో ఇంతమంది పిల్లల్నివేసుకుని ఒక్కతెవూ ఎలా కాలం గడిపావు

ఎలా పోషించావు ఇంతమందినీ? అని విశ్వామిత్రుడు సానునయంగా ప్రశ్నించాడు.

ఆ ప్రియంవద మృదువుగా పలికింది. ఆకలితో అలమటిస్తున్న పిల్లల్ని బతికించుకోడానికి చాలా

తిప్పలు పడ్డాను. గుప్పెడు నీవారధాన్యంకోసం అడవి అంతా గాలించేదాన్ని. వాటితో కాసింత గంజి కా

తలో గుక్కెడూ పట్టించి కొన్ని నెలలు గడిపాను. రానురాను ఆ గింజలూ కరువయ్యాయి. బిచ్చ

ఎత్తుదామంటే వేసేవాళ్ళు ఎవరు? అందరిదీ అదే అవస్థాయె. కాయలూ దుంపలూకాదు ఆకులు

అలములూకూడా దొరకని పరిస్థితి. పెద్ద పెద్ద మహావృక్షాలు నిలువునా ఎండిపోయి మోడులై బికారులలా

నిలబడ్డాయి. ఒకప్పటి పచ్చదనం తల్చుకుంటే గుండెలు బావురుమనేవి. గంపెడు పిల్లల్ని ఎలా సాకాలో

ఎలా బతికించుకోవాలో, నా ప్రాణాలు కడబట్టకుండా ఎలా నిలుపుకోవాలో ఏమీ తోచక రేయింబవళ్ళు

విలపించినదాన్ని విలపించినట్టున్నాను. సుదూర ఆశ్రమాలనుంచీ జనపథాలనుంచీ ఆకలిచావుల వార్తలు

గుండెను పిండేసేవి. వద్దు అది తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఒక కొడుకును ఎవరికైనా అమ్మేసి

మిగిలినవాళ్ళని బతికించుకుందామని కఠోరనిర్ణయానికి వచ్చి సిగ్గువిడిచి బయలుదేరాను. అదృష్టవశాత్తు

సత్యవ్రతుడు ఎదురయ్యాడు. ఆ దయార్ద హృదయుడు ప్రతిజ్ఞచేసి రోజూ ఏదోవేళ మాంసం తెచ్చి మన

ఆశ్రమవృక్షానికి వేలాడగట్టి వెడుతూ ఉండేవాడు. ఆ మహానుభావుడే ఉపకారం చేసి ఉండకపోతే

నాథా ! ఈపాటికి మేమెవ్వళ్ళమూ నీ కంటికి కనిపించి ఉండేవాళ్ళం కాదు. మా అందరి ప్రాణాలూ

నిలబెట్టిన దయామయుడు ఆ సత్యవ్రతుడు.

*🚩శ్రీ వివేకానందస్వామి🚩*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                    *భాగం 106*


''నాకంటూ ఒక 'పని ఉన్నది''


ఒక రోజు స్వామీజీ కలతగా ఉన్నారు. అందుకు కారణం ఏమిటని శరత్ అడిగినప్పుడు కాసేపు అంతర్ముఖులై ఉండిపోయిన స్వామీజీ ఆ తరువాత ఇలా  అన్నారు: “నాయనా! నేను నిర్వర్తించవలసిన మహాకార్యం ఒకటి ఉంది. కాని అందుకు తగిన సామర్ధ్యంకాని, అర్హత కాని నాలో లేవని అనుకొన్నప్పుడు నా మనస్సు తల్లడిల్లి పోతుంది. 


పని అంటే మామూలు పని కాదు; మన మాతృదేశాన్ని పునర్నిర్మించ వలసిన మహాకార్యం అది. ఆధ్యాత్మికత ఇక్కడ అడుగంటిపోయింది. ఆకలి, పస్తులు దేశం అంతటా విలయతాండవం చేస్తున్నాయి. భారతం మళ్లీ మేల్కొనాలి; తన పారమార్థికతతో లోకాన్నే జయించాలి." ఏదో మహోన్నత శక్తి ఆవేశించినట్లు స్వామీజీ మాట్లాడడం విన్న శరత్ ఆశ్చర్యచకితుడై కూర్చుండి. పోయాడు.


 స్వామీజీ మాట్లాడడం ఆపగానే శరత్ ఆయనతో, "స్వామీజీ! ఇదిగో మీ శిష్యుణ్ణి నేను ఉన్నాను. మీరు తలపెట్టిన కార్యం నిమిత్తం నేను ఏం చేయాలో ఆదేశించండి" అంటూ తన హృదయాంతరాళం నుండి పలికాడు. వెంటనే స్వామీజీ, "ఒక భిక్షాపాత్ర, కమండలం పుచ్చుకొని ఇంటింటికి పోయి భిక్షాటన చేసిరాగలవా?" అని అడిగారు. అందుకు శరత్ "చేసిరాగలను" అని దృఢంగా జవాబిచ్చాడు. స్వామీజీ ఆ మాట విని ఎంతో సంతోషించారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శివానందలహరీ

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 20*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

   

*సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచ గిరౌ*

*నటత్యాశాశాఖా స్వటతి ఝడితి స్త్వైరమభితః*

*కపాలిన్ భిక్షో మే హృదయకపి మత్యంత చపలం*

*దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో ।।*



 ఓ కపాలధారీ, సర్వవ్యాపకా, శివా, ఆదిభిక్షూ, నా దగ్గర మనస్సనే కోతి ఉంది. అది సంసారారణ్యమునందు చంచలముగా చరించుచున్నది. స్వైరవిహారము చేయుచున్నది. యువతుల స్తనములనే పర్వతములపై క్రీడించుచున్నది. ఆశా శాఖలపై దూకుతున్నది. అటునిటు వేగముగా పరుగులిడుతున్నది. అత్యంత చపలమైన నా మనస్సనే ఈ కోతిని, దృడమైన భక్తి అనే త్రాడుతో, బంధించి నీ వశంచేసుకుని, నీ ఆధీనంలో నీవే పెట్టుకొనుము.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

ప్రమాణమవుతాయి


 ॐ దయచేసి దీనిని చదివి, వీడియో చూడండి. 

    అందఱికీ అవసరమని భావిస్తే, మీ పరిచితులకి కూడా పంపి, ఆనందాన్ని పంచండి. 


    బ్రహ్మశ్రీ జటావల్లభుల జగన్నాధంగారు జ్ఞానవృద్ధులూ, 

    97 సంవత్సరాలు నిండుతున్న వయోవృద్ధులూ. 


1. వారు విశ్రాంత తెలుగు పండితులు, పశ్చిమ గోదావరి జిల్లా కైకరం వాస్తవ్యులు. 

2. మా తండ్రిగారూ వారూ, 1959 నుంచీ మిత్రులుగా ఉండేవారు. 

    వారు కైకరంలోనూ, మా నాన్నగారు, 

    ఆ పక్క గ్రామమైన పూళ్ళలోనూ పనిచేసేవారు. 

3. నేను నిడదవోలులో పనిచేస్తున్నప్పుడు, 1995లో వసంత నవరాత్రుల సందర్భంగా, వారు ఉపన్యాసాలకి వచ్చినపుడు,   

    మా నాన్నగారూ వారూ పండిత చర్చ చేసికొంటూ, పాత జ్ఞాపకాల నేమఱువేసుకొనేవారు. 

4. వారు భద్రాచలం వచ్చినపుడు కూడా, 

    మా నాన్నగారూ వారూ చాలా బాగా గడిపేవారు. 

5. వారికి నేనంటే బాగా ఇష్టం. నాకు వారు పితృతుల్యులు.  

    అప్పుడప్పుడూ వారు నాపై పుత్రవాత్సల్యంతో ఫోనులో మాట్లాడుతూ, అనేక విషయాలు చెబుతూ ఉంటారు. 

6. కైకరం దగ్గర గోపీనాథపట్నంలో ఈ నెల 1వ తేదీ, హనుమత్ విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు నేను వెళ్ళాను. 

    ఆ సాయంత్రం కైకరంలో జగన్నాథంగారిని, వారి గృహంలో దర్శించుకొన్నాను. 

6. అటువంటి పెద్దల విషయ జ్ఞానం అత్యంత ప్రామాణికమూ, అనుభవపూర్వకమైనదీ. 

    ప్రాచీన సాహిత్యంపై అనర్గళంగా ఉపన్యసించడం వారికే సాధ్యం. 

    అంతేకాక, ప్రస్తుత ఆధనిక విజ్ఞానాన్ని, పురాతన విషయాలతో సమన్వయపరచడం వారి ప్రత్యేకత. 

    దానిని రికార్డు చేసి భద్రపరచుకొనకపోతే, 

   ప్రస్తుత ప్రముఖ ప్రవచకుల - అర మార్కే ప్రథమ రాంకు అయి, 

    నాలాటి సున్న మార్కులవాళ్ళకు అవే ప్రమాణమవుతాయి. 

7. ఇప్పటికీ, వారి ధారణా - కంచు కంఠ ధ్వనీ గమనిస్తే, అత్యంత ఆశ్చర్యం వేస్తుంది. 

    నేను కైకరం వెళ్ళిన సందర్భంలో, 

వారు చెప్పిన అనేక విషయాలలో ఒకదానిని ఇప్పుడు విందాం.    


  — రామాయణం శర్మ 

            భద్రాచలం

వేద ఆశీర్వచనం.


 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  -‌ దశమి - హస్త -‌ గురు వాసరే* (07.12.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/5rnURg00JBM?si=cIoZyEXHY6_2C_cv


.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కార్తిక పురాణము - 26*

 *కార్తిక పురాణము - 26*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*కార్తిక పురాణము - ఇరవై ఆరవ అధ్యాయము*


దుర్వాసుడు భూలోకము మొదలైన సమస్త లోకములు తిరిగి రక్షణము పొందలేక శీఘ్రముగా హరి నిలయమైన వైకుంఠమునకు చేరి ఇట్లు ప్రార్థించెను.


జగన్నాథా! బ్రాహ్మణ ప్రియా! మధుసూదనా! సుదర్శన చక్ర సంభవమైన మంటలు నాపైన పడకుండా రక్షించుము. ఓ విష్ణో! సూర్య కోటి సమాన కాంతి గల ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది. స్వామీ

నివారించుము.


నీ భక్తుడైన అంబరీషునకు శాపమిచ్చిన పాతకునకు నాకు ఈ శిక్ష తగియే ఉన్నది. వేలకొలదీ బ్రాహ్మణులలో నేను బహు పాతకుడను.నన్ను రక్షించుము. హరీ! నీ వక్షస్థలమందు బ్రాహ్మణుని పదము ఉండలేదా? భృగుమహర్షి హరిని పాదముతో వక్ష స్థలమందు తన్నెను గదా!కాబట్టి అట్లే నా పాతకము కూడా నీవు సహించవలెను.ఈ ప్రకారము విష్ణుమూర్తి ముందు దుర్వాస మహాముని సాష్టాంగ నమస్కారము చేసినవాడై ఓ స్వామీ! నను రక్షించుమని అనేక మారులు దుర్వాసుడు పలికినవాడాయెను.


అంత హరి నవ్వుచు ఇట్లనియెను. దుర్వాసా! బ్రాహ్మణులు నాకు దేవతలు అను మాట నిజమే. మీవంటి వారు మిక్కిలి దేవతలేయగుదురు.బ్రాహ్మణోత్తమా! నీవు సాక్షాత్ శంకరుడవు. బ్రహ్మ స్వరూపుడవు. జటలతో గూడి భృకుటికుటిలమైన నీ ముఖమును జూచినచో ఎవ్వరికి భయము గలుగదు? మీవంటి వారు స్వభావమునకు వికారమును గలుగనివ్వరు గదా!నేను మనో వాక్కాయముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చేయను.ఆ సంగతి నీకు తెలిసియేయున్నది గదా! దేవతలకు, బ్రాహ్మణులకు, సాధువులకు, గోవులకు సుఖము కొరకు ప్రతియుగమందు నేనవతరించుచుందును.


దుర్వాసా! నీవు సాధు నిందితమైన కర్మను ఆచరించితివి.అంబరీషునకు కారణము లేని శాపమునిచ్చితిని. అంబరీషుడు మనోవాక్కాయములచేత శత్రువునకును అపకారమును చేయడు. సర్వభూతములయందును నన్ను బావించుచు చరాచరమూలందంతటను నన్ను చూచుచుండును.అట్టి వానిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి. ఇది నీకు తగునా? నీవు భోజనమునకు వచ్చెదనని చెప్పి పోయి సకాలమునకు రాలేదు.నీకు అనుష్ఠానమున్నచో చేసుకొనవచ్చును.కానీ అట్టి స్థితిలో నీవు అతనికి అనుజ్ఞయు ఇవ్వలేదు. కేవలము జలమును బుచ్చుకొని ద్వాదశీ పారణ ముఖ్య కాలమునకు చేసెను. ఉదక పానమందేమి దోషమున్నది?ఉపవాస కాలమును నీరు త్రాగుట దోషము కానేరదు.


బ్రహ్మచర్యాదులకు ఆహారము నిషిద్ధమైనప్పుడు ఉదక పానము విహితమై యుండగా దాహ శాంతికై అంబరీషుడు జలపానము చేసినందున ఏమి దోషము జరిగినది? నీకేదీ సందు దొరకక దానినొక తప్పుగా చేసుకొని శాపమిచ్చితివి గానీ విచారించిన అది దోషము అగునా!అప్పటికీ నిన్ను అనేక విధములుగా ప్రార్థించినా నీవు కోపమును తగ్గించుకొనలేక తన్ని దూరముగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడవైన నీవలన భయము పొంది తన హృదయాంతర్వాసియైన స్వయం ప్రభువైన నన్ను శరణు వేడెను.


అంతలో నీవు శాపమిచ్చితివి.బ్రాహ్మణుని మాట అసత్యమై పోవునను తలంపుతో రాజు హృదయమందున్న నేను ఈ పది జన్మల శాపమును అంగీకరించితిని. రాజు నీవు శాపమిచ్చుటయే ఎరుగడు.వినలేదు.నీవు శాపమిచ్చు సమయమున రాజు అయ్యో బ్రాహ్మణాపకారము గలిగినదే ద్వాదశిని విడిచిన హరి భక్తి లోపించునను భయంతో జలపారణ చేసితిని.దానితో బ్రాహ్మణ తిరస్కార మయ్యెగదా? హరీ! నన్నెట్లు కాపాడుదువు అని దీనుడై నన్ను శరణు జొచ్చి నాయందే మనసు ఉంచి ఇతర విషయములు మరిచి తన శరీరమును తానెరుగక ఉండెను.ఇట్లుండగా నీవు శాపమిచ్చితివి. శాపమందు నీవు, "మీనము, కూర్మము మొదలైన పది జన్మలు గమ్ము" అని చెప్పితివి. అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడైన నేను అతని హృదయమందు నివసించి అతని చెవి వలన నీవిచ్చిన శాపమును వినుచు భక్తునికి అన్యాయముగా శాపము గలిగెను గదా దీనినెట్లు చేయుదును అని ఆలోచించితిని.


బ్రాహ్మణుడి మాటను సత్యముగా చేసితేని నా భక్తునికి అనిష్టము గల్గును. శాపమును నివారించితినేని బ్రాహ్మణ వచనము సత్యమగును. కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమగుటకు భక్త రక్షణము జరుగుటకు ఆలోచించి నీవిచ్చిన శాపములను నేను స్వీకరించితిని.భక్తులకు కల్గిన అంతులేని మహా కష్టములు అన్నింటినీ నేను హరింతును. నాభక్తుడు ధర్మాత్ముడు, సమస్త భూతములయందు సమబుద్ధి కలవాడు. అట్టి విషయమును ఎరింగియుండియు నీవు అధర్మముగా శాపమిచ్చితివి.వేదములందు దేశమును బట్టి కాలముననుసరించి ముఖ్యముగా వయస్సును చేసుకొని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయములుగా చేసికొని మనుష్యులకు వివిధ ధర్మములు చెప్పబడినవి గదా!


పురుషులకు కొన్ని ధర్మములు, స్త్రీలకు కొన్ని ధర్మములు, మనుష్య జాతికంతకూ కొన్ని ధర్మములు చెప్పబడినవి. కాబట్టి మనుష్య జాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మములను మనుష్యులందరూ విడువకూడదు. రెండు పక్షములందును మనుష్యులందరికిని ఏకాదశినాడు భోజనమాచరించకూడదని వేదములందు పరమ ధర్మము విధించబడినది. భుజించిన యెడల దోషము చెప్పబడి యున్నది. ద్వాదశిని విడిచినచో ఏకాదశిని విడిచిన దోషము సంభవించును. నాభక్తి లోపించునను భయముతో వాడు జలపారణము చేసెను. ఇట్లుండగా నీవు వృధాగా విచారించక శాపమిచ్చితివి గదా!అంతట విరమించక తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరుచునంతలో నేను చక్రమును పంపితిని. అనగా శాపమిచ్చిన గ్రహించువారు లేరు గాన శాపము వృధాయగునని తలంచి నివారించు భావముతో చక్రమును పంపితిని.


బ్రాహ్మణోత్తమా! దుఃఖించకుము.అంబరీషుని విషయమై నీవిచ్చిన శాపము నాకు వరమాయెను.నేను ఈ రూపములను ధరించి అవతారములను ఎత్తవలసి యున్నది.నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్తుయొక్క స్థితి కారణము కొరకు శంఖాసురుని సంహరించుటకునూ, మనువును రక్షించుటకునూ, పెద్ద చేపనగుదును.


దేవదానవులు సముద్రమును మదించు సమయములో సముద్రమందు మునిగిన మందర పర్వతమును నావీపున ధరించుటకు తాబేలునగుదును. హిరణ్యాక్షుని సంహరించుటకు, భూమిని ఉద్ధరించుటకు, నీలాద్రితో నల్లకొండతో సమానమైన పందిని అగుదును.


హిరణ్యకశిపుని సంహరించుటకు క్రోధ జ్వాలల చేత దిగంతముల వ్యాపించుచూ వికృతాననుడైన మనుష్య సింహమునగుదును.లోకత్రయమును జయించి బలిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యమును వామనుడిగా పొట్టివాడనగుదును. క్షత్రియ నాశనము కొరకు మహా బలముతో కూడి క్రూర కర్మయుతుడనై పరశురాముడను పేరుగల బ్రాహ్మణుడనగుదును.


రావణుని సంహారం కొరకు ఆత్మ జ్ఞాన శూన్యుడైన రాముడను రాజును అగుదును.యదువంశమందు ఆత్మజ్ఞానము గలిగియు గోపికాముకుడనై రాజ్యములేని కృష్ణుడనగుదును.


కలియుగమందు పాపమోహము కొరకు బుద్ధుడను దితి కుమారుడనై పాషండ మార్గోపదేశినగుదును.కలి యుగాంతమందు విప్ర శత్రు ఘాతకుడనైన బ్రాహ్మణుడనగుదును.ఇట్లు నాకు పది జన్మలు గల్గును.ఈ పది అవతారములు విను వారికి పాతకనాశనములగును.


ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే షడ్వింశాధ్యాయ సమాప్తః!!.

రాశిఫలాలు

 •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*08-12-2023 / శుక్రవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


వృత్తి, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది  కార్యక్రమాల్లో పాల్గొంటారు.

---------------------------------------

వృషభం


ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు.  దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

మిధునం


ఉద్యోగ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.  అన్ని రంగాల వారికి ఒడిదుడుకులు తప్పవు. రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.

---------------------------------------

కర్కాటకం


నూతన రుణయత్నాలు అనుకూలించవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. కొన్ని వ్యవహారాలలో  అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

---------------------------------------

సింహం


ఉద్యోగాలు మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం ఆనందం కలిగిస్తుంది. కీలక సమయంలో సోదరుల నుండి  సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న  అవకాశాలు లభిస్తాయి. అన్ని దేశాల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

---------------------------------------

కన్య


వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి  ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత  చికాకులు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

---------------------------------------

తుల


ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.  నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------

వృశ్చికం


వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. బంధు వర్గం వారితో విభేదాలు తప్పవు. వృధా ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆలోచనలు కలసిరావు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనులలో  శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

---------------------------------------

ధనస్సు


గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహం కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది.

---------------------------------------

మకరం


ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు.

---------------------------------------

కుంభం


నిరుద్యోగుల యత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యటం మంచిది.

---------------------------------------

మీనం


వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ  పరిస్థితులు ఉంటాయి. మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక ఈ విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. ఉద్యోగస్తులు ఒక వ్యవహారంలో అధికారుల నుండి సమస్యలు ఎదుర్కొంటారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

సుభాషితమ్

 🕉️🪔  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


*అంధస్యమే హృతవివేక మహాధనస్య*

*చోరై ర్మహాబలభి రింద్రియనామధేయైః* |

*మోహాంధకారకుహరే వినిపాతితస్య*

*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 15_* _


*తా*: ఓ నరసింహ ప్రభూ! మహాబలవంతులగు

ఇంద్రియములనెడి దొంగలు నా వివేక ధనమును

దొంగిలించుకొని, అజ్ఞానమును అంధకారపు గుహలో

త్రోసివేసిరి. కన్నులు కాన రాకున్నవి. నాకు చేయూత నిచ్చి, ఆ గుహ నుండి బయటకు తీసి నన్నుద్ధరింపుము. *లక్ష్మీదేవితో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*.