24, డిసెంబర్ 2023, ఆదివారం

విష్ణుచిత్తుని చరితము

 విష్ణుచిత్తుని చరితము

(ఆముక్తమాల్యద )


సీ. చెంగల్వ కొలనులో నంగన లాపురిన్

           బసపాడి యత్యంత పావనముగ

     నచ్యుతు పూజకై యావస్యకంబైన 

           తీర్థమున్ బిందెల దీసికొనియు

     ఘటియందు నటునిటు కమలముల్ కదలగా 

           కటియందు కీలించి కదలు చుండ

     చనుదోయిభారాన తను మధ్య మల్లాడ

           భవ్య ప్రబంధముల్ పాడుకొనుచు

ఆ. పాదకటకము లను పదభూష లను దాల్చి

     నడచుచుందు రింతు లొడలు కదల

     నడక సోయగముల నయనాల వీక్షించి

     విల్లుపురము ప్రజలు విస్తు పోగ.     04*      


సీ. ద్రవిడాంగనామణుల్  రత్నసోపానాల

              పసుపు నరగదీసి పైన దాల్చి

     జలకమ్ము లాడగా సాగి యా నీరమ్ము

             పచ్చగా నేలపై పరచు కొనియె

     సోపానముల క్రింద సుఖనిద్ర చెందెడి

             హంసల పక్షమ్ము లయ్యె పసుపు

     పసిడి సదృశమైన పక్షమ్ములను గూడి

             యందాల నొప్పెనా యండజములు          

తే. పసుపు పక్షంబులను గూడి పట్టణమున 

     సంచరించెడి  హంసల సరళి గాంచి

     'పసిడి రెక్కల వేలుపు పక్షు' లనుచు

     భ్రమసి సంతస మందిరి ప్రజలు మదిని  05


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

శ్రీ శివమహాపురాణం

 సంపూర్ణ శ్రీ శివమహాపురాణం - కైలాస సంహితా - అధ్యాయం - 3                                                                                                                                ఓంకార స్వరూపము - సన్న్యాస పద్ధతి


ఈశ్వరుడు ఇట్లు పలికెను -


ఓ దేవీ! వినుము. నీవు నన్ను ప్రశ్నించిన విషయమును చెప్పగలను. దీనిని విన్నంత మాత్రాన జీవుడు సాక్షాత్తుగా శివుడు అగును (1). ఓంకారముయొక్క అర్థమును తెలియుట యనగా నా స్వరూపమగు జ్ఞానమును పొందుటయే. ఓంకారము అనే మంత్రమునకు ప్రణవము అని పేరు. అది ఉపాసనలన్నింటికీ మూలము (2). అది మర్రిచెట్టు విత్తనము వలె మిక్కిలి సూక్ష్మమైనది మరియు గొప్ప అర్థము గలది. వేదమునకు కారణమైనది, వేదముల సారము అగు ఓంకారము విశేషించి నా స్వరూపమే యగుచున్నది (3). ప్రకాశస్వరూపుడను, సత్త్వరజస్తమోగుణములకు అతీతుడను, సర్వమునెరింగిన వాడను,సర్వమును సృష్టించిన వాడను, సర్వజగన్నాథుడను. సర్వవ్యాపకుడను, మంగళకరుడను అగు నేను ఓం అనే ఒకే అక్షరము గల మంత్రమునందు ప్రతిష్ఠితుడనై యున్నాను (4). సత్త్వరజస్తమోగుణముల కలయికలోని హెచ్చు తగ్గుల వలన ఈ జగత్తులోని సకలపదార్థములు నిర్మాణమై యున్నవి. ఈ సమస్తము, దానిలోని విభిన్నములగు అంశములతో సహా ఓంకారముయొక్క అర్థములో అంతర్గతమగునని మహర్షులు చెప్పుచున్నారు (5). కావున, ఈ అక్షరము సర్వజగత్తునకు అధిష్ఠానము, అవినాశియగు పరంబ్రహ్మమే యగుచున్నది. శివుడు సృష్ట్యాదియందు ఈ అక్షరముచే సకలజగత్తును సృష్టించును (6), శివుడే ఓంకారమనియు, ఓంకారమే శివుడనియు చెప్పబడినది. ఏలయనగా, వాచకమగు ఓంకారమునకు వాచ్యమగు శివునకు భేదము లేశ##మైననూ లేదు (7). కావున, ఓంకారస్వరూపుడనగు దేవునిగా నన్ను బ్రహ్మర్షులు తెలియుచున్నారు. విద్వాంసులు వాచకమగు ఓంకారమునకు వాచ్యమగు పరంబ్రహ్మతో ఐక్యమును భావన చేయుచున్నారు (8). కావున, ముముక్షువు మనస్సులో వికారములు లేనివాడై, సర్వజగత్కారణము, నిర్గుణుడను, పరమేశ్వరుడను అగు నేను ఓంకారస్వరూపుడనని తెలియవలెను (9). దేవతలకు ప్రభ్వియగు ఓ దేవీ! కావుననే, నేను జీవులు ముక్తిని పొందుట కొరకై కాశీలో సర్వమంత్రములలో శ్రేష్ఠమైన ఈ ఓంకారమును మాత్రమే ఉపదేశించెదను (10).


ఓ అంబికా! నీవు అడిగిన ప్రశ్నలలో ముందుగా ఓంకారముయొక్క ఉద్ధారము (మంత్రరహస్యములను బయటకు తీయుట, అనగా విడివిడిగా తెలసుకొనుట) ను చెప్పెదను. దీనిని తెలియుట చేతనే పరమసిద్ధి (మోక్షము) లభించును (11). ముందుగా నివృత్తి (ఆపివేయుట)ని, తరువాత క్రమముగా ఇంధనమును, కాలమును, దండము (నియమము) ను మరియు ఈశ్వరుని ఉద్ధారము చేయవలెను (12). ఈ విధముగా మూడు మాత్రలు, బిందువు, నాదము అను అయిదు వర్ణములతో కూడియున్న స్వరూపము గల ప్రణవమును ఉద్ధారము చేసి నిత్యము జపించువారికి అది ముక్తిని ఇచ్చును (13). బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు గల సకలప్రాణుల ప్రాణము ఈ ఓంకారమే. కావుననే, దీనికి ప్రణవమను పేరు వచ్చినది (14). ఓంకారమునకు ఆకారము మొదటి వర్ణము; తరువాతిది ఉకారము; మధ్యమునందు మకారము గలదు; అది నాదముతో అంతమగును (15). ఓ మహర్షీ! ఓంకారమునందు మొదటి వర్ణము దక్షిణదిక్కునందు గలదు. అది జలస్వరూపము. మధ్యమవర్ణమగు మకారము ఉత్తరమునందు గలదు. అది అగ్ని స్వరూపము (16). క్రమముగా అకార, ఉకార, మకారములు మూడు మాత్రలు. తరువాతి భాగము సగము మాత్ర అని చెప్పబడినది (17) ఓ మహేశ్వరీ! బిందువు, నాదము కలిసి అర్ధమాత్ర యగును. జ్ఞానులచే మాత్రమే తెలియబడే ఈ అర్ధమాత్రను సాక్షాత్తుగా వర్ణించుట శక్యము కాదు (18). ఓ ప్రియురాలా! వేదములు నానుండియే పుట్టుననే సత్యమును 'ఈశానస్సర్వవిద్యానామ్‌' మొదలైన శ్రుతివాక్యములు చెప్పుచున్నవి (19). కావున, వేదమునకు ఆదిలోనుండే (కారణమైన) ఓంకారము నన్ను బోధించును. నన్ను బోధించుచుండుట చేతనే ఓంకారముకూడ వేదమునకు ఆది (కారణము) అని వర్ణించబడుచున్నది (20).


అకారము సర్వజగత్తునకు బీజమగు మహత్తత్త్వమునకు, రజోగుణమునకు, సృష్టికర్తయగు బ్రహ్మగారికి, ఉకారము మహత్తత్త్వమునకు కూడ కారణమగు మాయాశక్తికి, సత్త్వగుణమునకు, జగత్పరిపాలకుడగు విష్ణువునకు ప్రతీక (21). మకారము మాయాశక్తిసమేతుడగు ఈశ్వరునకు, తమోగుణమునకు, సంహారకుడగు రుద్రునకు ప్రతీక. బిందువు ప్రకాశస్వరూపుడగు మహేశ్వరునకు, తిరోభావము (కార్యజగత్తు కారణరూపములోనికి విలీనము కాగా, ఆ కారణము కూడ పరమాత్మలో విలీనమగుట) నకు ప్రతీకయని చెప్పబడినది (22). సర్వము మరల అనుగ్రహించే సదాశివునకు నాదము ప్రతీకయని చెప్పబడినది. సర్కజగత్కారణమగు ప్రకృతికంటె పరుడగు శివుని నాదముయొక్క అగ్రమునందు భావన చేయవలెను (23). ఆయనయే సర్వమును తెలిసినవాడు, సర్వమును సృష్టించువాడు, సర్వమును పాలించువాడు. శుద్ధుడు, నాశము లేనివాడు, శబ్దములచే సాక్షాత్తుగా నిర్దేశింప శక్యము కానివాడు, కార్యకారణములకు అతీతుడు అగు పరబ్రహ్మ సాక్షాత్తుగా ఆ సదాశివుడే (24). ఈ ప్రణవములోని ఆకారము మొదలగు వర్ణములలో తరువాతి వర్ణము దానికి ముందుండే వర్ణమును వ్యాపించును. అనగా, పూర్వవర్ణము వ్యాప్యము కాగా, ఉత్తరవర్ణము వ్యాపకమగును. ప్రణవమంతటా ఈ విధముగా భావన చేయవలెను (25). సద్యోజాత, నామదేవ, అఘోర, తత్పురుష, ఈశానులు అనే నా స్వరూపములై యున్న ఐదు బ్రహ్మలు అకారము మొదలగు అయిదు వర్ణములయందు క్రమముగా ప్రతిష్ఠితులై యున్నారు (26). ఓ పార్వతీ! ఆకారమునందు సద్యోజాతుని నుండి పుట్టిన ఎనిమిది కళలు, ఉకారమునందు వామదేవస్వరూపములగు పదమూడు కళలు గలవని చెప్పబడినది (27). మకారమునందు అఘోరస్వరూపములగు ఎనిమిది కళలు గలవు. బిందువునందు తత్పురుషస్వరూపములగు నాలుగు కళలు ఉద్భవించి యున్నవి (28). నాదమునందు ఈశానునినుండి పుట్టిన అయిదు కళలు గలవు. ఆరు విధముల ఐక్యమును అనుసంధానము (భావన) చేయుటచే ప్రణవము ప్రపంచమునకు ఆత్మయగునని చెప్పబడినది (29). మంత్రము, యంత్రము, దేవత, ప్రపంచము, గురువు, శిష్యుడు అనునవి ఆ ఆరు తత్త్వములు. ఓ ప్రియురాలా! ఈ ఆరు పదార్ధముల తత్త్వమును గురించి వినుము (30).


ఈ అయిదు వర్ణముల కలయికయే మంత్రమగునని పూర్వములో చెప్పియుంటిని. ఆ మంత్రమే యంత్రరూపమును దాల్చును. దాని మండలముల క్రమమును చెప్పెదను (31). యంత్రము దేవతయొక్క స్వరూపము. దేవత జగత్స్వరూపిణి. గురువు జగత్స్వరూపుడని చెప్పబడినది. శిష్యుడు గురువుయొక్క శరీరమని ఋషులు చెప్పుచున్నారు (32). ఈ సర్వము ఓంకారమే అనియు, సర్వము బ్రహ్మమేననియు వేదము చెప్పుచున్నది. కావున, ఓంకారము వాచకము, బ్రహ్మ వాచ్యము అనే సంబంధము కూడ ఇదే విషయమును చెప్పుచున్నది (33). దేవతలకు ప్రభ్వియగు ఓ పార్వతీ! ఆధారము, మణిపూరము, హృదయము, విశుద్ధి, ఆజ్ఞ, శక్తి, శాంతి అనునవి క్రమముగా ఒకదానిపై మరియొకటి ఉండును. ఇవి స్థానములని చెప్పబడినవి. శాంతికి పైన పరాత్పరుడగు సదాశివుడు ఉండును. ఎవనికి దృఢమగు వైరాగ్యము కలుగునో, వాడే అధికారి (34, 35). జీవబ్రహ్మల ఏకత్వము భావన చేయబడును. కావున, ధ్యానమునకు విషయము నేనే అగుచున్నాను. దేవతలకు ప్రభ్వియగు ఓ పార్వతీ! విషయమును చక్కగా చెప్పియుంటిని. ఇపుడు సంబంధమును వినుము (36). జీవుడు, ఆత్మ అనువాటికి నాతో అభేదము వాచ్యము. ఓంకారము వాచకము. ఈ సందర్భములో ఇదియే సంబంధమని చెప్పబడినది (37). వ్రతము మొదలగు వాటియందు చాల ప్రీతి గలవాడు, శాంతస్వభావము గలవాడు, తపశ్శాలి, ఇంద్రియములను జయించినవాడు, శుచిశుభ్రతలు గలవాడు. సచ్ఛీలము గలవాడు, బ్రాహ్మణుడు, వేదమునందు నిష్ఠ గలవాడు (38). ఇహలోకమునందలి భోగములయందు మాత్రమే గాక పరలోకములో దేవతల భోగములయందు కూడ వైరాగ్యము గలవాడు, శివదీక్ష గలవాడు, మంచి బుద్ధి గలవాడు, శమదమాదిగుణసంపన్నుడు, సౌశీల్యము గలవాడు అగు శిష్యశ్రేష్ఠుడు సకలశాస్త్రముల సారమునెరింగినవాడు, వేదాంతజ్ఞానమునందు నిష్ణాతుడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, సన్న్యాసి అగు ఆచార్యుని వద్దకు వెళ్లి, సాష్టాంగనమస్కారము మొదలగు వాటిచే ప్రయత్నపూర్వకముగా ఆయనను సంతోష పెట్టవలెను (39-41).


ఎవడు గురవో, వాడే శివుడు, ఎవరు శివుడో, వాడే గురువు అని మహర్షులు చెప్పిరి. ఈ విషయమును మనస్సులో నిశ్చయించుకొని తన మనస్సులోని భావమును గురువునకు నివేదించవలెను (42). సద్బుద్ధి గల బ్రాహ్మణుడగు సాధకుడు గురువుయొక్క అనుజ్ఞను పొంది పన్నెండు రోజులు పాలను మాత్రమే ఆహారముగా తీసుకొని, సముద్రతీరమునందు గాని, నదీతీరమునందు గాని, పర్వతమునందు గాని, శివాలయమునందు గాని, శుక్లపక్ష పంచమినాడు గాని, ఏకాదశి నాడు గాని, ఉదయమే స్నానమును చేసి పవిత్రమగు అంతఃకరణము గలవాడై నిత్యకర్మలను ఆచరించి, గురువును ఆహ్వానించి యథావిధిగా నాందీశ్రాద్ధమును చేసి, క్షౌరకర్మయందు కక్షములను గుహ్యమును విడిచిపెట్టి శిరోజములను గెడ్డమును మీసమును గోళ్లను తీసివేసి, తరువాత స్నానమును చేసి, ఏకాగ్రమగు మనస్సు గలవాడై, పిండిని భుజించి, తరువాత సాయంకాలమునందు స్నానమును చేసి సంధ్యావందనమును చేసి, గురువుతో కూడి సాయంకాల - ఔపాసనమును చేసి, గురువు రూపములోనున్న శివునకు శాస్త్రోక్తమగు దక్షిణను ఇచ్చి (43-47), హోమద్రవ్యములను సంపాదించి, స్వశాఖాసూత్రములో చెప్పిన విధముగా యథావిధిగా లౌకికాగ్ని మొదలగు విభేదములను అనుసరించి అగ్నిని ప్రతిష్ఠించవలెను (48). అహితాగ్నియగు బ్రాహ్మణుడు ప్రాజాపత్యేష్టిచే ఆధానము చేయబడిన శ్రౌతాగ్నియందు చక్కగా ఆహుతులను సమర్పించి సమస్తసంపదను దక్షిణగా ఇచ్చి, తరువాత ఆ అగ్నిని తన యందు ఆరోపించుకొని, ఇంటిని విడిచి సన్న్యసించవలెను. తరువాత, అతడు స్థిరచిత్తముగల వాడై చరువు (హోమద్రవ్యము) ను వండి ఆ అగ్నియందు సమిధలు, అన్నము, నెయ్యి మొదలగు వివిధద్రవ్యములను (49,50), పురుషసూక్తమును పఠిస్తూ ప్రతి ఋక్కునకు అంతమునందు హోమము చేసి స్వశాఖాసూత్రములో చెప్పబడిన విధముగా స్విష్టకృత్‌ హోమమును చేయవలెను (51).


తరువాత ఆ విద్వాంసుడు తంత్రోక్తవిధానముగా కూడ హోమమును చేసి, అగ్నికి ఉత్తర దిక్కునందు వస్త్రము, మృగచర్మము మరియు దర్భలతో రచింపబడిన ఆసనమునందు కూర్చుండి దృఢమగు చిత్తము గలవాడై బ్రాహ్మముహూర్తము వరకు గాయత్రిని జపించవలెను (52). తరువాత ఆ విద్వాంసుడు స్నానమును చేసి యథావిధిగా హోమము కొరకై అన్నమును వండి పురుషసూక్తముతో మొదలిడి విరజాసూక్తము వరకు హోమమును చేయవలెను (53). ఈ ప్రక్రియను వామదేవమహర్షి చెప్పిన విధముగా గాని, శౌనకాది మునులు చెప్పిన విధముగా గాని చేయవచ్చును. కాని వామదేవమహర్షి తల్లి గర్భమునందుండగనే జ్ఞాని యైనాడు గాన, ఆయన చెప్పిన పద్ధతి శ్రేష్ఠము (54). తరువాత శేషహోమమును పూర్తి చేసి, ప్రాతరౌపాసనమును చేయవలెను. తరువాత అగ్నిని తనయందు ఆరోపించుకొని, ప్రాతస్సంధ్యావందనమును చేసి (55), సూర్యోదయమైన తరువాత గాయత్రీమంత్రమును జపించవలెను. తరువాత క్రమముగా మూడు ఏషణలను (సంతానము, ధనము, పరలోకములయందు గల ఆసక్తి) విడిచి పెట్టి ప్రేష (సన్న్యసించే సమయములో చెప్పే) మంత్రములను ఉచ్చరించి (56). పిలక, యజ్ఞపవీతము, మొలత్రాడు మొదలగు వాటిని పరిత్యజించి, తూర్పు దిక్కు వైపునకు గాని, ఉత్తరము వైపునకు గాని వెళ్లవలెను (57). తరువాత లోకములో సంచరించుటకు తగిన దండమును, కౌపీనమును స్వీకరించవలెను. అతడు లోకవ్యవహారమునందు, లోకసంచారమునందు ఇష్టము లేని వాడైనచో, వాటిని స్వీకరించనక్కర లేదు (58). తరువాత అతడు గురువు వద్దకు వెళ్లి మూడు సార్లు సాష్టాంగ నమస్కారమును చేయవలెను. తరువాత గురువునకు సమీపములో నిలబడవలెను (59). అపుడు గురువు విరజాహోమము చేయగా మిగిలి యున్న తెల్లని భస్మను తీసుకొని, దానిని శిష్యునికి యథావిధిగా పూయవలెను (60).


తరువాత 'అగ్నిరితి' అని మొదలయ్యే మంత్రముతో త్రిపుండ్రమును ధరింపజేయవలెను. హృదయపద్మమునందు నీతో గూడి ప్రతిష్ఠితుడనై యున్న నన్ను ధ్యానించవలెను (61). ప్రీతితో నిండిన మనస్సు గల గురువు శిష్యుని శిరస్సుపై చేతిని ఉంచి వాని కుడి చెవిలో ఋషి మొదలగు వాటితో కూడియున్న ప్రణవమంత్రమును మూడు సార్లు చక్కగా ఉచ్చరించవలెను. ఆ గురుశ్రేష్ఠుడు తరువాత ఉపాసనా (స్వానుభవ) సహితముగా దాని ఆరు విధముల అర్థమును బోధించవలెను (62, 63). ఆ శిష్యుడు గురువునకు పన్నెండు సార్లు భూమిపై సాష్టాంగముగా ప్రణమిల్లి నిత్యము గురువునకు వశుడై యుండి, వేదాంతమును చక్కగా అభ్యసించవలెను (64). ఆతడు నిత్యము పరిశుద్ధమైన, వికారములు లేని మనస్సులో సాక్షిస్వరూపుడను, వినాశము లేనివాడను, పరంబ్రహ్మను, పరమాత్మను అగు నన్ను మాత్రమే ధ్యానించవలెను (65). శమదమాదిధర్మములయందు నిత్యము ప్రీతి గలవాడు, వేదాంతజ్ఞానమునందు నిష్ణాతుడు, మాత్సర్యము లేనివాడు అగు ఆ యతి ఈధ్యానమునందు అధికారము గలవాడని చెప్పబడినది (66). దోషములు లేనిది, శోకము లేనిది, శ్రేష్ఠమైనది, ఎనిమిది పత్రములు గలది, కేసరములతో శోభిల్లునది, తొడిమకు పై భాగమునందు విరాజిల్లునది, మూలాధారశక్తితో మొదలిడి మూడు తత్త్వములకు పైన ఉండునది అగు హృదయపద్మమనే ఈశ్వరధామమును భావన చేసి దానిమధ్యలో దహరాకాశము (ఈశ్వరస్థానము) ను భావన చేయవలెను (67, 68). పరబ్రహ్మస్వరూపమైన ఓం అనే ఏకాక్షరమంత్రమును ఉచ్చరిస్తూ నీతో గూడియున్న నన్ను ఆ హృదయాకాశమధ్యములో నిత్యము స్థిరమగు మనస్సుతో ధ్యానించవలెను (69). ఓ ప్రియురాలా! ఈ విధముగా ఉపాసించు సాధకుడు నా లోకమును పొంది నానుండి విజ్ఞానమును పొంది నా సాయుజ్యము అనే ఫలమును పొందును (70).


శ్రీశివమహాపురాణములోని కైలాససంహితయందు సన్న్యాసపద్ధతి వర్ణనము అనే మూడవ అధ్యాయము ముగిసినది (3).

24-12-2023 / ఆదివారం / రాశిఫలాలు*

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️

 •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*24-12-2023 / ఆదివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


భాగస్వామ్య వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి. దూరప్రయాణాల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.

---------------------------------------

వృషభం


నూతన వాహన సౌక్యం ఉన్నది. ఆర్థిక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

మిధునం


చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేరు. ఇంటా బయట  బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ కష్టం ఫలించదు.

---------------------------------------

కర్కాటకం


ఆకస్మిక ధన లాభ  సూచనలున్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. సన్నిహితులు,  వివాదాలు సర్దుబాటు కాగలవు. 

---------------------------------------

సింహం


ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు.

---------------------------------------

కన్య


వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట  బాధ్యతలతో భారంగా మారతాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి.

---------------------------------------

తుల


ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. బంధువర్గం వారితో అకారణ  వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన  కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.  వ్యాపార, ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. కొన్ని పనులలో రెండు రకములైన ఆలోచనలతో నష్టాలు తప్పవు.

---------------------------------------

వృశ్చికం


వృత్తి వ్యాపారాలలో  మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు  నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

---------------------------------------

ధనస్సు


నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమౌతాయి. వ్యాపారాలు గతం కంటే  మెరుగవుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

---------------------------------------

మకరం


వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో ఆస్థి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆదాయానికి  మించి ఖర్చులు ఉంటాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

---------------------------------------

కుంభం


ఒక విషయంలో బంధువర్గం నుండి విమర్శలు తప్పవు.  ఇతరుల పై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు తప్పుతాయి.  వ్యాపారాలు మందకోడిగా  సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ప్రయాణాలు వాయిదా పడతాయి.

---------------------------------------

మీనం


నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

- *శ్రీ రామరక్షా స్తోత్రం-4* -

 🕉️🪷  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪷🕉️

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


𝕝𝕝 *శ్లో* 𝕝𝕝  

*రామరక్షాం పఠేత్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్* ౹

*శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః* ||


  - *శ్రీ రామరక్షా స్తోత్రం-4* -


తా𝕝𝕝 సమస్త పాపములను నాశనం చేయునది, కోరిన కోర్కెలు తీర్చునది అయిన రామరక్షా స్తోత్రమును జ్ఞాని అయినవాడు పఠించవలెను. రఘువంశ సంజాతుడైన ఆ రామచంద్ర ప్రభువు నా శిరస్సును రక్షించుగాక. *నా నుదిటిని దశరథ నందనుడైన శ్రీరాముడు రక్షించుగాక.*

23, డిసెంబర్ 2023, శనివారం

Panchang


 

ధ్యాసలో నుంచుకొనును ధ్యానాంగములను.

 🌹శ్రీమహావిష్ణు దర్శనము 🌹

         (ఆముక్త మాల్యద )


సీ. శర దిందు చంద్రికా గరిమపై గెల్చిన 

            మురువుతో వెల్గెడి మోము వాడు

    అర్క చంద్రుల శోభ లలమియు నున్నట్టి

            యరవింద నేత్రంబు లమరు వాడు

    సుందరోజ్వల వపు రిందీవరశ్యాము 

           స్వర్ణ వసన ధారు చారుదేహు

    మకరకుండలధారు మణిమయ కటిభూషు

           శ్రీవత్సలాంఛన చిద్విలాసు

తే. శంఖ చక్ర గదా శార్ఞ్గ చారు హస్తు

     మహిత మణిమయ శోభిత మకుట భూషు

     విమల తేజిత విభాసు విష్ణుదేవు 

     తనదు హృదియందు నీరీతి తలచ తగును.  


సీ. సర్వేశ్వరుడు విష్ణు సారూప్యమును గోరు

            నరుడు ధ్యానము నిట్లు నెరప దగును

     తొలుత నొక్కంగమున్ దలచి గుర్తించియు

            చిక్కబట్ట దగును చిత్తమందు 

     నయ్యది మనమందు నంటగా ధృఢరీతి

           తదుపరి యంగంబు తలచ వలయు

     నా రీతి యంగమ్ము లన్నిటిన్ వరుసగా 

           ధ్యానించ వలయును ధారణమున 

తే. హరిని నీరీతి చింతించ ననయముగను

     కదలుచున్నను లేక తా కదలకున్న 

     నెచట నున్నను తానిక నెట్టులున్న 

     ధ్యాసలో నుంచుకొనును ధ్యానాంగములను. 


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

ఉత్తర ద్వార దర్శనం

 🪷🌸🪷🌸🪷🌸🪷🌸🪷🌸🪷


*ఉత్తర ద్వార దర్శనం అంటే!*


*నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా...*


శ్రీవైకుంఠ మహానగరం, నిత్య విభూతి, పరమ పదము, పరమ ధామము, పరమ వ్యోమ అనే పేర్లతో కీర్తించబడుతుంది. వైకుంఠము అనగా ఎటువంటి దివ్య శక్తులకు కూడా లొంగనిది, తన ప్రాభవాన్ని తగ్గించగల, తప్పించగల ఏ శక్తి దాని ముందర లేవు. ఈ పరమపదం శక్తి అన్ని లోకాల్లో, విభూతులలో, వైభవాలలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఎటువంటి వారైనా చివరకు కోరుకొనేది పరమపదాన్నే. పరమపదమునకు మించిన ఉత్తమ స్థానం మరొకటి లేదు. పరమాత్మ తన పరిపూర్ణ పరివారంతో అక్కడ వేంచేసి ఉంటాడు. వైకుంఠ నగరంలో అనంతమైన మణిస్తంభములతో నిర్మించబడిన మహా మణిమండపమున మధ్యలో అన్నిటి కంటే కింద కూర్మనాథుడు ఉంటాడు. అతన్ని ఆధారం చేసుకొని మహా దిగ్గజములు ఈ బ్రహ్మాండాన్ని మోస్తుంటాయి. ఆ దిగ్గజముల మీద అద్భుతమైన మహాపద్మం ఉంటుంది. ఆ మహాపద్మం మీద అనంతమైన పాదములు గల మహా సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద వేయి పడగలతో ఆది శేషుడు విరాజిల్లుతూ ఉంటాడు. అతని పైన పరమాత్మ శయనించి ఉంటాడు.


వైకుంఠానికి వెళ్లినవారందరూ పరమాత్మ సేవ చేయగల అదృష్టాన్ని పొందలేరు. కొందరు మహాకూర్మాన్ని చూస్తారు, మరి కొందరు అష్టదిగ్గజాలను చూస్తారు, ఆపైన మరి కొందరు మహాపద్మాన్ని, మరి కొందరు పరమాత్మ సింహా సనాన్ని చూస్తారు. ఆపైన చేరుకు న్నవారు పరమాత్మను సేవించినా వారిలో కూడా నూటిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే పరమాత్మ కైంకర్యా న్ని నోచుకుంటారు. వైకుంఠాన్ని చేరిన ప్రతి వారు పరమాత్మను దర్శిం చలేరు. దర్శించిన ప్రతి వారు ఆయన కైంకర్యాన్ని చేయలేరు. పరమాత్మను సేవించడానికి కావాల్సిన అనన్యమైన భక్తితో కూడుకున్న జ్ఞానము కలవారు. మాత్రమే భగవంతుడిని దర్శించు కోగలరు, సేవించుకోగలరు. ఇటువంటి అనన్యమైన భక్తితో కూడుకున్న జ్ఞానమే ఉత్తర ద్వారం. ద్వారము అనగా మనం లక్ష్యాన్ని చేరడానికి సాధనము. మన లక్ష్యము భగవంతుడు ఉన్న లోకానికి వెళ్లడమా? చూడ డమా? భగవంతుడిని స్తోత్రం చేయడమా? భగవంతునికి సేవలు చేయడమా? భగవంతుడు ఉన్న లోకానికి వెళ్లడం దక్షిణ ద్వారం, భగవంతుడిని చూడడం తూర్పు ద్వారం, భగవంతుడిని కీర్తించడం పశ్చిమ ద్వారం, భగవంతుడిని సేవించడం అనగా కైంకర్యం చేయడం ఉత్తర ద్వారం. ఈ విషయాన్ని బ్రహ్మ పురాణం, పద్మ పురాణం, బ్రహ్మవైవర్త పురాణాలలో చాలా వివరంగా అందించారు.


వైకుంఠం చేరుకోగలగాలి అని చాలా మంది కలలు కంటూ ఉంటారు, వారి లక్ష్యం వైకుంఠాన్ని చేరడం మాత్రమే. మరి కొందరు వైకుంఠం వెళ్లాలి పరమాత్మను సేవించాలి అని కోరుకుంటారు, వీరి లక్ష్యం పరమాత్మ దర్శనం. వైకుంఠంలో స్వామి ముందర నిలబడి ఆయనను స్తుతించాలి అని మరి కొందరు కోరతారు, వారి లక్ష్యం పరమాత్మ స్తుతి మాత్రమే. ఇలాంటి వారు కాకతాము అన్ని కైంకర్యాలు పరమాత్మకే చేయాలి అది కూడా పరమాత్మ చెప్పి చేయించుకోవాలి అని కోరుకొనే వారు వేల కోట్లలో ఒక్కరు మాత్రమే ఉంటారు. అటువంటి వారి గురించే ఆండాళ్లమ్మ అంటే గోదాదేవి తిరుప్పావులో ఉనక్కే నామ్ ఆట్ చెయ్ వోమ్ అని పలికింది. అనగా నీకే మేము అంతరంగ కైంకర్యములు చేయాలి అని. అలాగే మత్తనమ్ కామంగళ్ మాత్తు అని పలికింది అనగా ఇంతకంటే వేరే కోరికలు మాకు వద్దు అని ఆండాళ్లమ్మ కోరింది. ఆండాళ్లమ్మ వైకుంఠాన్ని కోరలేదు, స్వామి దర్శనాన్ని కోరలేదు, స్వామి స్తుతిని కోరలేదు, స్వామి కైంకర్యాన్ని కోరింది. నీవేమీ వద్దయ్యా నీ కైంకర్యం చాలు అనగలగాలి. అందుకే పరమాత్మ వైకుంఠం ఇస్తానంటే హనుమంతుడు తనకు వైకుం ఠం వద్దు నీ సేవ కావాలని కోరుకున్నాడు. భగవంతుని లోకంలో ఉండడం, భగవంతుని దగ్గర ఉండడం, భగవంతుని చూడడం, భగవంతుని స్తుతించడం ఇవేమి కోరవలసినవి కావు. పరమా క ఏకాంత సేవ చేయాలి అని గాఢంగా తపించగలగడమే ఉత్తర ద్వారం. మరి తూర్పు ద్వారం, పశ్చిమ ద్వారం, దక్షిణ ద్వారం వాటిలోనూ భక్తి ఉండి, అంతో ఇంతో జ్ఞానం ఉంది.


వైకుంఠం చేరితే చాలని, స్వామిని చూస్తే చాలని, స్వామిని స్తుతిస్తే చాలని అనుకుంటారు. ఇవన్నీ శాశ్వతం కాదు. వైకుంఠ లోకం వెళితే ఎప్పుడూ అక్కడే ఉండాలని నియమం లేదు. స్వామిని చూస్తే చాలు అనుకుంటే ఒక సారి చూస్తే సరిపోతుంది. స్వామిని స్తుతిస్తే చాలు అనుకుంటే ఒకసారి మనసారా స్తోత్రం చేస్తే సరిపోతుంది కానీ స్వామికి అంతరంగ కైంకర్యం అన్ని వేళలా చేయాలి అన్న కోరికలో స్వామి లోకం, స్వామి దర్శనం, స్వామి స్తుతి, స్వామి కైంకర్యం అన్నీ ఇమిడి ఉన్నాయి. వైకుంఠం చేరడం, స్వామి దర్శనం, స్వామి స్తుతి ఏ ఒక్కసారికి ఇచ్చినా సరిపోతుంది కానీ అంతరంగ కైంకర్యం అన్ని వేళలా ఉండేది. కానీ అంతరంగ కైంకర్యం అంటే స్వామి నిద్రపోతుంటే పాద సంవాహనం చేయడం, స్వామికి చలివేస్తే దుప్పటి కప్పడం, స్వామి కూర్చుంటానంటే సింహాసనం ఏర్పాటు చేయడం అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. స్వామికి చలివేస్తే దుప్పటి కప్పడం కాక తానే దుప్పటై ఆయనని అతుక్కుని ఉండటం సేవ. దుప్పటి కప్పిన వారు కప్పి వెళ్లిపోతారు కానీ కప్పుకున్న దుప్పటి ఎప్పుడూ ఒంటిమీదనే ఉంటుంది. చందనం పూసినవారు వెళ్లిపోతారు కానీ చందనం ఒంటికే ఉంటుంది.


పరుపు ఇచ్చిన వారు వెళ్లిపోతారు కానీ పరుపు స్వామికి శయ్యగా ఉండిపో తుంది. అలాగే పాదుకలు ఇచ్చినవారు వెళ్లిపోతారు కానీ పాదు. కలు పాదాలను అంటిపెట్టుకుని ఉంటాయి. మరి పాదుకలను సమకూర్చాలనా లేక పాదుకలు కావాలని కోరుకుంటామా?, చందనం పూయాలనా లేక చందనం అవ్వాలని కోరుకుంటా మా? ఏ పేరో ఏ సేవో ఏ సంబంధమో అవసరం లేదు ఎప్పుడు నీతోనే ఉండాలి, నీకు అవసరమైన ప్రతి కైంకర్యం నేనే కావాలి. అని కోరుకోవాలి. అందుకే యామున మిశ్రులు స్తోత్ర రత్నంలో 


*నివాస శయ్యా ఆసన పాదుక అంశుక ఉపధాన శీతాతప*

*వారణాదిభిః శరీర భేదైః తవ శేషతాం గతః*


అని చెప్పారు అనగా ఆదిశేషుడు నీవు ఉంటానంటే తాను ఇల్లు అయ్యాడు, పడుకుంటానంటే తాను పరుపు అయ్యాడు, కూర్చుంటానంటే తాను సింహాసనం అయ్యాడు, నడుస్తానంటే తాను పాదుకల య్యాడు, తలగడ కావాలంటే తాను తలగడ అయ్యాడు, కట్టుకుంటానంటే తానే వస్త్రం అయ్యాడు, చలికి దుప్పటి అయ్యాడు, ఎండకి గొడుగు అయ్యాడు. అందుకే అతనని ఆది శేషుడు అంటారు. అంటే మొదటి  సేవకుడు. చలి వేస్తే దుప్పటి ఇచ్చినవాడు సేవకుడు కాదు తానే దుప్పటి కావాలి. ఇది వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం.

వైకుంఠ ఏకాదశి

 🙏🙏🙏 *వైకుంఠ ఏకాదశి* 🙏🙏🙏


          వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి శ్రీమన్నారాయణుని దర్శనానికి ఉత్తర ద్వారములోనికి ప్రవేశించేటప్పుడు పఠించవలసిన శ్లోకము 👇


*ప్రళయాబ్ధిజలే శాయిన్ మధుకైటభ సేవితా ప్రార్ధితంతు ఉత్సవం తాభ్యాం కర్తుమారభే అనుజ్ఞాందేహి దేవేశా వైకంఠాలయ భూషణ* ll


          ఏకాదశి అంటే పదకొండు సమూహం. ఈ పదకొండు వైకుంఠం కావాలి, మరి దేని తోటి కొట్టబడకూడదు. ఈ పదకొండు పరమాత్మయందే ఉండడం వైకుంఠ ఏకాదశి. పదకొండు స్వామి సేవకు ఉపయోగించడం ఉత్తర ద్వార దర్శనం. స్వామిని చూడాలని అనుకున్న వారు ఒక్క కనులు పరమాత్మ వైపు ప్రసరింప చేస్తే చాలు, వినాలి అనుకున్న వారు చెవులు అప్పగిస్తే చాలు, అనాలి అనుకున్న వారు నాలుకతో కీర్తిస్తే చాలు, ఉండాలి అనుకున్న వారి శరీరం ఉంటే సరిపోతుంది తక్కినవి ఎక్కడ ఉన్నా కోరిక నెరవేరుతుంది. కానీ అన్ని వేళలా అన్ని విధములా కైంకర్యములు నీకే చేయాలి అంటే ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనసు పదకొండూ పరమాత్మ యందు పరిపూర్ణంగా అర్పించాలంటే ప్రేమతో నిండిన జ్ఞానం కావాలి అదే ఉత్తర ద్వారం. దాని నుంచి దర్శనం పరమాత్మ అంతరంగిక కైంకర్యం. అంతేకాని ఒక్క ముక్కోటి ఏకాదశి నాడు దేవాలయంలోకి వెళ్లి ఉత్తర ద్వారంతో ప్రవేశించి స్వామిని దర్శించుకుని రావడం సాంప్రదాయం అవుతుంది కానీ పరమభక్తితో కూడుకున్న పరమజ్ఞానం కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు ఉత్తర ద్వార దర్శనం చేసిన వారికైనా, ఇలా ఎందుకు చేయాలి ఇందులో అంతరార్ధం ఏమిటన్న జిజ్ఞాస కలుగుతుందనే పెద్దలు ఈ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఆంతర్యం తెలుసుకుని శరీరంలో అణువణువూ, మనసు, అంతఃకరణం ఇలా అన్ని పరమాత్మకు సరమర్పించడమే నిజమైన ఉత్తర ద్వార దర్శనం.


*ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్య ఫలం ఏమిటి* ?


          అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు. ప్రాజ్ఞ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిక్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం. అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తరం దిక్కుకు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము axil అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది. ఈ విశ్వము దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపుకు anti clockwise తిరుగుతూండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపునుంచి దక్షిణానికి clockwise తిరుగుతుంది. "ప్రాగ్ ఆరభ్య దక్షిణేణ వర్తనం" మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి - ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిమీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు.


          ఈరోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము. భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు. ఇలా చెప్పి ఆలయాలవైపు మనల్ని మరల్చారు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము. కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్షించాలా? అని సంసిద్దుడై ఉంటాడుట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? - ఈ లోకంతో భవ బంధనాలనుంచి విముక్తి. మోక్షము అంటే "ముచిల్ మోక్షణే" అని అర్థం. బంధనాలనుంచి ముక్తిని పొందడము, విముక్తిని కలిగించుకోవడము అని అర్థం. అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది.


*సర్వేజనాః సుఖినో భవన్తు!*

రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

23-12-2023 / శనివారం / రాశి ఫలితాలు

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

మేషం


నూతన విద్యవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో  ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆటంకాలు తొలగుతాయి. ఆర్ధికంగా అభివృద్ధి కలుగుతుంది. ప్రయాణాలు కలసివస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

---------------------------------------

వృషభం


చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున కొంత నిరుత్సాహం తప్పదు. వృత్తి వ్యాపారాలు  సామాన్యంగా సాగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

మిధునం


దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలరు. ఆరోగ్య పరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి.  చేపట్టిన వ్యవహారాలు శ్రమాధిక్యతతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల  సహాయం  లభిస్తుంది. ఉద్యోగపరంగా వేధిస్తున్న  సమస్యలకు   పరిష్కారం లభిస్తుంది. స్వల్ప ధన ప్రాప్తి కలుగుతుంది.

---------------------------------------

కర్కాటకం


ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ లబ్ది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

సింహం


ఉద్యోగ వ్యవహారాలలో తల పెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి పై వారి నుండి  ప్రశంసలు పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.  దూరప్రాంతాల వారి నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు.

---------------------------------------

కన్య


సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు  తీసుకున్న నిర్ణయాలు వలన లాభం పొందుతారు. ధనదాయం  బాగుంటుంది. అనారోగ్య సూచనలున్నవి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

తుల


వృత్తి ఉద్యోగ  విషయమై కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలు పరంగా నష్టాల ఊబి నుండి బయటపడతారు. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

---------------------------------------

వృశ్చికం


అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహంలో  శుభకార్యాలు నిర్వహిస్తారు.

---------------------------------------

ధనస్సు


వ్యాపార పరంగా ఇబ్బందులు  తొలగుతాయి. ధన విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు.

---------------------------------------

మకరం


ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది.  రుణ బాధలు తొలగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడగలుగుతారు.

---------------------------------------

కుంభం


సంతానమునకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది.

---------------------------------------

మీనం


ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నేత్ర సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ విషయమై అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధువుల నుండి విమర్శలు ఎదురవుతాయి.

---------------------------------------

🍀 *శుభం భూయాత్* 🍁

వైకుంఠము

 "వైకుంఠము"అనే శబ్ధంలో విశేష అర్థము వుంది..కుంఠనం అంటే కలిసి వుండే స్థితిని చెడగొట్టడం అని అర్థము..అంటే వియోగము కలిగించడం.. వికుంఠ అంటే వియోగాన్ని తొలగించడం ,కలిసి ఉండవలసిన వారిని,సన్నివేశాలని, పదార్థాలని కలిపి ఉంచే పరమాత్మకు"వైకుంఠ" శబ్ధం సార్థకమైనది."వైకుంఠము" అంటే"సర్వేషాం సంశ్లేషితా భూమిః అద్భిః వ్యోమః చ వాయునా వాయుశ్చ తేజసా సార్ధం వైకుంఠత్తం అంతతో మయా"అని పంచ భూతాల, పంచీకరణాదులు చేసేది నేనే.అందుకే నన్ను వైకుంఠ వాసుడు అంటారు అన్నాడు..ఆయన మనకు దర్శనం ఇచ్చి  భిన్నత్వం గల సృష్టి లోని జీవులకు ఏకత్వం బోధించే ఏకాదశి కి " వైకుంఠ ఏకాదశి" అని పేరు వచ్చింది..దీనినే "ముక్కోటి ఏకాదశి" అని కూడా అంటారు. రేపే "వైకుంఠ ఏకాదశి" .. విష్ణు ఆలయాలన్నీ భక్తులతో క్రిక్కిరిసి ఉంటాయి.. తెల్లవారు జామునుంచే "ఉత్తర ద్వార దర్శనం" కోసం బారులు తీరి ఉంటారు..ఈ ద్వారం గుండా భగవంతుని దర్శిస్తే ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం..భావన..ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో వచ్చే పర్వం ఇది..మనకు పునర్జన్మ అంటూ ఉండదు..దక్షిణముఖంగా ఉన్న స్వామిని మనం దర్శించు కోవాలంటే ఉత్తర ముఖంగా నిలవాలి.. దక్షిణ ద్వారం సంసారానికి దారి చూపుతుంది..ఉత్తర ద్వారం మోక్షానికి మార్గం చూపుతుంది.. నవద్వారాలున్న దేహంలోని జీవుని దృష్టి సప్త ద్వారాలకు ఆవల యున్న భగవంతుని వైపు మరలడమే  ఈ పర్వదినం విశేషం..ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ సమయాన మనం ఉత్తరాభిముఖులమై స్వామిని సేవించి కార్యసిద్ధిని సాధించి జ్ఞానం పొందుదాం.. పితృదేవతలు, ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాము..ఓం నమో వేంకటేశాయ.. ఓం నమో నారాయణాయ... విష్ణు వైభవాన్ని కళ్ళారా ఉత్తర ద్వారము గుండా వెళ్ళి దర్శించుకుని ఆనందిద్దాము...పునీతులం అవుదాము...(సేకరణ)

⚜ శ్రీ భీష్మ కుండ్

 🕉 మన గుడి : నెం 277


⚜ హర్యానా : కురుక్షేత్ర


⚜ శ్రీ భీష్మ కుండ్



💠 భీష్మ కుండ్ కురుక్షేత్ర థానేసర్‌లోని నర్కటరి వద్ద ఉంది, దీనిని భీష్మపితామహా కుండ్ అని కూడా పిలుస్తారు


💠 ఇక్కడ భీష్మ ఆలయం ఉంది మరియు మహాభారత యుద్ధం ముగిసే వరకు భీష్ముడు అర్జునుడి బాణాల మంచం మీద పడుకున్న ప్రదేశం ఇది.


💠 భీష్ముని దాహం తీర్చడానికి అర్జునుడు భూమి వైపు బాణం వేసిన ప్రదేశం కూడా ఇదే.


💠 భీష్మపితామహుడు తన శరీరాన్ని విడిచిపెట్టిన ప్రదేశం హర్యానాలో కురుక్షేత్రానికి సమీపంలో ఉందని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.


⚜ స్థల పురాణం ⚜


💠 భీష్ముడు గంగాదేవి కుమారుడు మరియు

పరశురాముడి శిష్యుడు అయినందున,

భీష్ముడు తన కాలంలోని ఏ యోధుడితోనూ

ఓడిపోలేని శక్తిమంతుడు.


💠 భీష్మపితామహుడు పాండవులు మరియు కౌరవులచే గౌరవించబడ్డాడు, అయితే అతను మహాభారత యుద్ధంలో కౌరవులకు మద్దతు ఇచ్చాడు.  

కొన్ని రాజకీయ కారణాల వల్ల, అతను కౌరవుల వైపు నుండి మహాభారత యుద్ధంలో ఇష్టం లేకుండా పోరాడవలసి వచ్చింది, కానీ అతను

పాండవులను చంపనని ప్రతిజ్ఞ చేశాడు. 


💠 ఈ ప్రమాణం వెనుక పాండవుల పట్ల

ఆయనకున్న అభిమానమే కారణం.

అంతేకాదు కౌరవులు పాండవులతో ఏళ్ల

తరబడి అన్యాయం చేస్తున్నారని లోకానికి

తెలిసింది. 


💠 పురాణాల ప్రకారం, భీష్ముడు అతను కోరుకున్నంత కాలం జీవించగలడు మరియు అతను కోరుకున్నప్పుడు మాత్రమే చనిపోతాడనే వరం అతనికి ఉంది

 వీటన్నింటికీ అగ్రగామిగా, అతను అలుపెరగని, ఎవరి చేత ఓడింపబడలేని అతిపరా క్రమవంతమైన మహాయోధుడు


💠 పాండవులకి భీష్మ పితామహుడిని ఎదుర్కోవటానికి మార్గం లేదు, కాబట్టి వారు శ్రీకృష్ణుని నుండి సలహా కోరారు. 

భీష్మ పితామహ మరణ రహస్యం శ్రీకృష్ణుడికి తెలుసు. 


💠 భీష్మ పితామహుడి మరణ రహస్యం భీష్ముడికే అడిగి తెలుసుకోవలసిందిగా పాండవులను శ్రీకృష్ణుడు కోరాడు

తనను తాను విముక్తి చేసుకోవడానికి, పాండవులను ఎలా చంపాలో రహస్యంగా సూచించాడు.

అందువల్ల  పాండవులకు శిఖండిని యుద్ధంలో తీసుకెళ్లమని సలహా ఇచ్చాడు, అతను పురుషుడు లేదా స్త్రీ కాదు, అతను నపుంసకుడు.


💠 భీష్ముడు గొప్ప యోధుడు మరియు యోధులతో మాత్రమే యుద్ధం చేయడం వల్ల నపుంసకుడు  అయిన శిఖండిపై దాడి చేయలేకపోయాడు.

ఈ విధంగా, ప్రణాళికాబద్ధంగా, అర్జునుడు శిఖండి వెనుక నిలబడి బాణాలు వేయడం ప్రారంభించాడు, భీష్మ పితామహుడు దీనితో గాయపడి అన్ని ఆయుధాలను విడిచిపెట్టి యుద్ధం యొక్క పదవ రోజున పడిపోయాడు.  


💠 భీష్మపితామహాను బాణాల మంచం మీద పడుకోబెట్టారు మరియు కౌరవులు మరియు పాండవులు చుట్టుముట్టారు.  

బాణపు శయ్యపై పడుకుని దాహం వేస్తూ నీరు కోరగా అర్జునుడు భూమిపై బాణం విసిరాడు.


💠 భీష్ముడు పడుకున్న చోట నుండి నీరు ప్రవహించింది.  ఈ నీటి ప్రవాహం మరెవరో కాదు, తన కొడుకు భీష్ముడి దాహాన్ని తీర్చడానికి భూమి నుండి పైకి లేచిన అతని తల్లి గంగ.


💠 భీష్ముడు ఇచ్ఛా మరణ (అతను కోరుకున్నప్పుడల్లా చనిపోవచ్చు) యొక్క వరంతో  సూర్యుడు ఉత్తర అర్ధగోళంలోకి వెళ్ళినప్పుడు ఉత్తరాయణంలో మరణించాలని ఎంచుకున్నాడు.  

ఉత్తరాయణంలో తుదిశ్వాస విడిచిన వ్యక్తికి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని

 నమ్ముతారు. 


💠 ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని భీష్మకుండ్ అని పిలుస్తారు. భీష్మ పితామహ పేరు మీద ఒక మెట్ల బావి ఉంది, ఇప్పుడు బంగంగా లేదా భీష్మ కుండ్ అని పిలువబడే నీటి ట్యాంక్ పక్కన ఆలయం ఉంది.

దీనిని తానేసర్‌ భీష్మ నర్కటరి ఆలయం అని పిలుస్తారు.


💠 ఈ ప్రదేశం యొక్క పూర్తి దర్శనానికి 45 నిమిషాల నుండి ఒక గంట సమయం పడుతుంది.  చారిత్రాత్మకంగా గొప్ప నేపథ్యం ఉన్న ఈ స్థలాన్ని సందర్శించడానికి ఎప్పుడైనా ఉత్తమ సమయమే.



💠 సమీప రైల్వే స్టేషన్ కురుక్షేత్ర.  

రైల్వే స్టేషన్ నుండి, భీష్మ కుండ్ చేరుకోవడానికి 19 నిమిషాలు (9 కిమీ) పడుతుంది.

Electro hydro power boat


 

Gliding


 

Couch wire fitting


 

Teertham yelaa sveekarinchali