10, మే 2024, శుక్రవారం

అక్షయతృతీయ పర్వదినము

 🌻అక్షయతృతీయ పర్వదినము 🌻


సీ. జమదగ్ని పుత్రుడై జగతిలో విష్ణువు 

                  రాముడై పుట్టిన రమ్య దినము 

     పావనగంగమ్మ ప్రవహించి సాగియు 

                 న్నుర్విని తాకిన  పర్వ దినము 

      రఘురామచంద్రుండు రాజ్య మేలినయట్టి 

                  త్రేతాయుగారంభ దివ్య దినము

      చిననాటి మిత్రుని శ్రీకృష్ణపరమాత్మ 

                   కూర్మి తోడను  కల్సుకొనిన దినము 

      గణపతి సాయాన ఘనుడగు వ్యాసుచే 

                   భారతమ్మొదలై న  పర్వ దినము

      భాను డక్షయపాత్ర పాండవాగ్రజునకు 

                   దీవించి యిచ్చిన దివ్య దినము 

      శంకరాచార్యుండు సంపద కొరకునై 

                   కనకధారాస్తుతి న్ననిన దినము

      అన్నపూర్ణాదేవి యవతార మెత్తియున్ 

                   నాహారమిడినట్టి యాది దినము

      పరమాత్మకృష్ణుండు పాంచాలిని సభలొ

                   కాచి రక్షించిన ఘన దినమ్ము 

 తే. దివ్యమైన యీ "అక్షయతృతియ దినము"

       బహువిధమ్ముల గమనించ పర్వదినము 

       పుణ్య కర్మల నీ వేళ పూని చేయ 

       శాంతి సిరి సంపద లమరు సత్వరముగ.


✍️గోపాలుని మధుసూదనరావు🙏

హిందూ ధర్మం జ్ఞానం మీద

 హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. జన్మం మీద కాదు. 

(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 

1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.

2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.

3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..

4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.

5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 

6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.

7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు. 

వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 

8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.

9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.

ఇంకా 

1.ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.

2.ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)

3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.

ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు

1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.

2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..

3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు. 

4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.

5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.

6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)

7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది ( విష్ణుపురాణం 4.1.13). 

8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).

9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).

10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.

మీరు షేర్ చేసే ప్రతి సందేశం తో పాటు ఈ సందేశాన్ని కూడా మీ బంధువులకు స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి*

*తెలియని విషయాలు తెలుసుకునే అదృష్టాన్ని వారికి అందించటంలో సహాయపడండి*

ఇదే మన సనాతన ధర్మం యెుక్క గొప్పతనం by జాజిశర్మ

దినత్రయ మహాపర్వం*

 *ఈనాడు శుక్రవారం తో కలిసిన అక్షయ్య తృతీయతో కూడిన దినత్రయ మహాపర్వం*.


   లక్ష్మీ దేవి ఆవిర్భవించిన అక్షయ్యతృతీయనాడు ఏ పని చేసిననూ అది మంచి అయిన నూ చెడు అయిన నూ *అక్షయ్యఫలితం అంటే అనేక రెట్లు ఫలితం* లభిస్తుంది. అందువలన ఈనాడు ఏ చెడ్డ పనినీ చేయక వీలైనన్ని మంచిపనులు చేయడం మంచిది.

    దినత్రయం/ ఏష్యం అనగా మూడు దినములతో సమానం., అంటే ఈనాడు ఏ శుభాశుభములైననూ మూడు రెట్లు ఫలితమునిస్తాయి. కావునా ఈనాడు ఏ తప్పు పనులనూ(పాపములను) చేయక వీలైనన్ని శుభకర్మలు చేయడం మంచిది.

    శుక్రవారం శుభసౌఖ్యములకు కారకం.

అందువలన ఈనాడు మద్యమాంసాదులు విడిచిపెట్టి, దూషణాది అరిషడ్వర్గములను తగ్గించుకుని గోసేవలు, గోపోషణములు,విత్తనాలు నాటడం, దైవారాధనం,దానధర్మాలు వంటి సత్కర్మలు చేసి తరించగలరు.

అక్షయం

 వైశాఖమాసం శుద్ధ తదియ "అక్షయ తృతీయ"గా భావిస్తారు.."అక్షయం" అంటే నాశనం లేనిది..

.కానిది...అని అర్థం..ఈ రోజున ఏ మంచి పని చేసినా దాని వలన కలిగే పుణ్యం "క్షయం" కాదు..ఈ రోజున "బంగారం"కొంటే మంచిది అంటారు..అది ఎలాగంటే..    కొని బీరువాలో దాచడం కాదు.కొనుగోలు చేసిన బంగారాన్ని "దానం" చేయాలి..అప్పుడు కీర్తి పెరుగుతుంది..వెండి పాత్రలో గానీ,"రాగి" పాత్రలో గానీ,నీళ్ళు పోసి దానిలో "తులసీ దళాలు"వేసి దానం చేస్తే ఆ కుటుంబం లోని పిల్లలకు త్వరగా వివాహాలు అవుతాయని శాస్త్ర వచనం..దానం చేయడం వలన అధిక ఫలం వస్తుంది..కానీ కొనడం వలన కాదు. ధన సంపదనను ఇచ్చే మంత్రం...."కుబేరత్వం ధనాదీశ గృహేతే కమలా స్తితా తాం దేవాం ,  తేషుయా సుసమృద్ధిత్వం మద్ గృహేత్ నమో నమః..." ఇది ఐశ్వర్య ప్రాప్తి మంత్రం..రోజుకు నిష్టగా108 పర్యాయములు"మండలం" రోజులు (40) జపిస్తే ఐశ్వర్యం లభిస్తుంది...ఈ తిథి నాడు అక్షతోదకంతో స్నానం చేసి,అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి,అర్చించి,ఆ తరువాత ఆ బియ్యాన్ని మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి ,మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణో చ్చిష్టంగాతలచి ,వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి" అక్షయ తృతీయ" ఫలం లభిస్తుందట.."రాజసూయ యాగం" చేసిన ఫలం లభిస్తుందట..అంత్యమున "జీవన్ముక్తి" లభిస్తుందట....

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం,

 శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, సింహాచలం చందనోత్సవము. సందర్భంగా ఈ కథనం





సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి స్వామీ వారి నిజ రూప దర్శనం ఒక్క రోజు మాత్రమే కలుగుతుంది. అదే వైశాఖ శుద్ధ తదియ… అక్షయ తృతీయ రోజు. దీనినే చందనోత్సవంగా పిలుస్తారు. సింహాద్రి అప్పన్నగా కీర్తించబడే లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం అత్యంత వైభవంగా జరుగనుంది.


చైత్ర అమావాస్య ను గంధం అమావాస్య గా జరుపుతారు. ఇందుకు నిదర్శనం గా ఖచ్చితంగా గంధం అమావాస్య రోజున వర్షం పడుతుందని పెద్దలు చెపుతుంటారు.


విశాఖపట్టణం జిల్లా , సింహాచలం ఉత్తరాంధ్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. తిరుపతి తర్వాత అత్యంత ఆదాయం కలిగిన క్షేత్రం. దేశంలో ఉన్న నారసింహ క్షేత్రాలలో అతి పాచీనమైనది విశాఖపట్టణం జిల్లాలోని సింహాచలం క్షేత్రం. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. 


దశావతారాల్లోని రెండు అవతారాలు కలగలసిన అరుదైన స్వరూపమే సింహాచల క్షేత్రం లోని వరాహనరసింహావతారం. తన భక్తుడైన ప్రహ్లాదునికిచ్చిన మాట కోసమై హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారమూ కలిసి వరాహ లక్ష్మీనరసింహావతారం గా భక్తులకు అభయమిస్తున్నారు. స్వామివారు త్రిభంగి ముద్రలో అనగా వరాహము యొక్క తల, మానవ శరీరము, సింహం తోక కలిగిన మూర్తిగా దర్శనమిస్తారు.


స్థలపురాణం:-

******

తన అన్నహిరణ్యాక్షుని చంపినవాడని హరి మీద ద్వేషం పెంచుకున్న హిరణ్యకశిపుడు, స్వయంగా తనకు కలిగిన బిడ్డే హరిభక్తుడు కావడం సహించలేకపోయాడు. కన్నమమకారాన్ని కూడా చంపుకుని, పసివాడని కూడా చూడకుండా, అతని హరిభక్తిని మానిపించడానికి చాలా ప్రయత్నాలు చేసాడు. అయినా వినకపోవడంతో అనేక రకాల చిత్రహింసలు పెట్టాడు. ఏనుగులతో తొక్కించాడు. విష సర్పాలతో కరిపించాడు. అగ్ని జ్వాలల మధ్య పడవేయించాడు. నిరంతర హరినామస్మరణతో, భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న ప్రహ్లాదుడిని అవి ఏ రకంగానూ బాధపెట్టలేకపోయాయి. చివరికి ఒక కొండపైనుండి సముద్రంలోనికి తోసివేయించే ప్రయత్నం చేసాడు. ఆ కొండయే సింహాచలమనీ, ఎన్ని ఆపదలొచ్చినా, తన భక్తులను ఏదో ఒక విధంగా కాపాడుతూ ఉండే శ్రీమన్నారాయణుడు సముద్రంలో పడిపోకుండా ప్రహ్లాదుడిని కాపాడాడనీ, అప్పుడు ప్రహ్లాదుడు, తనను కాపాడటానికి ద్వయావతారంలో(వరాహ, నరసింహ) వచ్చిన విష్ణుమూర్తిని అదే రూపంతో సింహాచలం మీద వెలిసి, భక్తులను కరుణించమని వేడుకున్నాడనీ స్థలపురాణం చెప్తోంది.


హిరణ్యకశిపుని సంహారానంతరం ప్రహ్లాదుడు సింహాచలం కొండపై వెలసిన స్వామికి దేవాలయం కట్టించాడు. కానీ కృతయుగం చివరికి అది శిథిలమైపోగా, విగ్రహం చుట్టూ మన్ను పుట్టలా కట్టింది. తర్వాతి యుగంలో చంద్ర వంశం లోని వాడైన పురూరవుడు ఊర్వశితో కలిసి ఆ ప్రాంతాలలో ఆకాశమార్గాన విహరిస్తుండగా, సరిగ్గా స్వామివారు వెలిసిన ప్రాంతంలో ఆయన రథం ఆగిపోవడంతో, అక్కడ ఏదో శక్తి ఉందని భావించి, క్రిందకి దిగాడు. ఆయన మట్టితో కప్పబడిన విగ్రహాన్ని చూసి, చుట్టూ ఉన్న మట్టిని తొలగిస్తూ ఉండగా ఆకాశవాణి స్వామివారిని చందనంతో కప్పి ఉంచమని, కేవలం సంవత్సరానికి ఒక్క రోజు(అక్షయ తృతీయ- వైశాఖ శుద్ధ తదియ) మాత్రమే స్వామి నిజరూప దర్శనంతో అనుగ్రహిస్తారనీ పలికింది. అప్పుడు పురూరవుడు స్వామివారి మూర్తిని చందనంతో పూత పూసి ఆలయం నిర్మించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకూ అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. చందనపు పూతతో ఉన్న స్వామి లింగాకారుడిగా దర్శనమిస్తాడు.

చందనోత్సవం

 *వైశాఖ శుధ్ద తదియ నే అక్షయ తృతీయగా జరుపుకుంటారు .*


ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి  చందనోత్సవం  కూడా జరుగుతుంది. 


స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు.  అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు  చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం


1. పరశురాముని జన్మదినం.


2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం.


3. త్రేతాయుగం మొదలైన దినం.


4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం.


5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో , వ్రాయడం మొదలుపెట్టిన దినం.


6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం.


7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం.


8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం.


9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం.


10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.


అక్షయ తృతీయ నాడు , మనం  చేపట్టిన  ఏ  కార్య  ఫలమైనా , (అది  పుణ్యం కావచ్చు , లేదా  పాపం  కావచ్చు) అక్షయంగా , నిరంతరం , జన్మలతో సంబంధం లేకుండా , మన వెంట వస్తూనే ఉంటుంది.


పుణ్య  కర్మలన్నీ  విహితమైనవే.  అందునా ,  ఆ రోజు  ఓ  కొత్త  కుండలో గానీ , కూజాలో గానీ ,  మంచి నీరు  పోసి , దాహార్తులకు  శ్రధ్ధతో  సమర్పిస్తే ,  ఎన్ని  జన్మలలోనూ ,  మన  జీవుడికి    దాహంతో  గొంతు  ఎండి పోయే  పరిస్థితి  రాదు. 


అతిధులకు , అభ్యాగతులకు ,  పెరుగన్నంతో  కూడిన  భోజనం  సమర్పిస్తే ,  ఏ  రోజూ  ఆకలితో  మనం అలమటించవలసిన  రోజు  రాదు. వస్త్రదానం వల్ల  తదనుగుణ ఫలితం లభిస్తుంది. 


అర్హులకు  స్వయంపాకం , దక్షిణ , తాంబూలాదులు  సమర్పించుకుంటే ,  మన  ఉత్తర జన్మలలో ,  వాటికి  లోటు  రాదు. గొడుగులు , చెప్పులు ,  విసన కర్రల లాటివి  దానం  చేసుకోవచ్చు.


 ముఖ్యంగా  ఆ  రోజు  నిషిధ్ధ  కర్మల జోలికి  వెళ్ళక పోవడం  ఎంతో  శ్రేయస్కరం.

సద్బ్రాహ్మణుడికి నమస్కరిస్తూ


 అగ్రతశ్చతురో వేదాః

పృష్ఠతః సశరం ధనుః!!!

ఇదం బ్రాహ్మ్యమ్  ఇదం క్షాత్రం!!!

శాపాదపి శరాదపి!!!


నాలుగు వేదాలను నిష్ఠగా పఠించి 

పృష్ఠ భాగం లో (వీపు ) అమ్ములపొదిని

ధరించి,చేతిలో ధనుస్సు తో  ఉన్న 

బ్రాహ్మణుడు అవసరాన్ని బట్టి


శాపమూ ఇవ్వగలడు..

శరమూ ప్రయోగించగలడు..

ఆశీర్వాదమూ ఇవ్వగలడు..

అస్త్రమూ సంధించగలడు..


ధర్మగ్లాని ఏర్పడినప్పుడు ధర్మ పరమైన

హింసను కూడా చేపట్టగలడు..సమయాన్ని

బట్టి బ్రాహ్మణ ధర్నాన్ని , క్షాత్ర ధర్మాన్ని ఒకేసారి పాటించగల సద్బ్రాహ్మణుడికి నమస్కరిస్తూ 🙏🙏


పరశురామ జయంతిశుభాకాంక్షలు

హిందువులు

 




పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో 1946 లో హిందు జనాభా దాదాపు 250000, ముస్లిం జనాభా దాదాపు 5000, దేశ విభజన సమయంలో సియాల్ కోట్ ని భారత్ లో కలపాలా, పాకిస్తాన్ లో కలపాలా అన్న చర్చ వచ్చినప్పుడు హిందువులు భారత్ లో కలపాలని, ముస్లింలు పాకిస్తాన్ లో కలపాలని అడిగారు, 


అప్పుడు స్థానిక పెద్దలు వోటింగ్ పెడదాం, ఎక్కువ సంఖ్యలో దేన్ని కోరితే అలా కలుపుదాము అని నిర్ణయించి వోటింగ్ కోసం ఒకరోజు ను నిర్ణయించారు. ఆ రోజు తెల్లవారుజాము కల్లా ముస్లిం లు మొత్తం ఓటు వేయడానికి క్యూ లో నిలబడ్డారు, దాదాపు 85% జనాభా మనమే ఉన్నాం కాబట్టి గెలుపు గ్యారెంటీ అనే ధీమాతో హిందువులు చాలామంది ఇళ్లలో నే ఉండిపోయారు ఓటు వేయడానికి వెళ్లిన కొద్ది మంది హిందువులు అంత పెద్ద క్యూ చూసి -----ఏం నిలబడతాం లే అని తిరిగి ఇళ్ళకి వెళ్లిపోయారు,ఎవరికీ పట్టనిది నాకెందుకు అని కొందరు క్యూ నుండి బైటికి వచ్చారు.  


పోలింగ్ అయ్యాక బాలట్ బాక్స్ లు తెరిచి చూస్తే దాదాపుగా అంతా పాకిస్తాన్ లో కలపడానికే మొగ్గుచూపినట్టు తేలింది. దాంతో సియాల్కొట్ పాక్ లో ఉండిపోయింది, వెంటనే హిందువుల ఊచకోత మొదలైంది వేల సంఖ్యలో హిందువుల్ని చంపుతూ హిందూ జనాభాని క్రమంగా 500 కు తెచ్చారు. హిందువుల బద్ధకం, బుద్ధి హీనత, మతం పట్ల అభిమానం లేకపోవడాలు ఒక్క సియాల్ కోట్ లో 3 లక్షల పైగా హిందూ హత్యలకు కారణం అయ్యాయి.    


పరుగెత్తి ప్రాణాలు కాపాడుకుంటావా, కూర్చుని ప్రాణాలు వదిలేస్తావా అని హిందువుల్ని అడిగితే ప్రాణాలకోసం ఎవడు పట్టుగెత్తుతాడు చావు ఎప్పటికైనా తప్పదు కొంచెం ముందుగా పోతే ఏమౌతుంది అన్నంత బద్ధకం హిందువులది, మిగిలిన కుటుంబ సభ్యులు అనాధలై, అడుక్కుతింటారు అనే ఆలోచనని బద్ధకం తొక్కేస్తోంది. లక్షల సందర్భాలలో ఇది నిరూపణ అయ్యింది. 


హిందూ అనైక్యతకు పాకిస్తాన్ లోని మరో సంఘటన చెప్తారు. విభజన కు ముందు ఒక హిందూ జామిందార్ ఎకరం విస్తీర్ణం లో ఒక పెద్ద భవనాన్ని నిర్మించే సమయంలో తన మిత్రుడైనా ఒక ముస్లిం తో ------నా ఒక్కగానొక్క కొడుకు కోసం ఎంత పెద్ద బంగ్లా కట్టిస్తున్నానో చూడు అన్నాడు, అప్పుడు ఆ ముస్లిం దాన్ని ఏదో ఒక రోజున నా 5 మంది కొడుకులు ఆక్రమిస్తారు అన్నాడు, విభజన తర్వాత జమిందార్ ని కొడుకును అతని మిత్రుడే చంపి ఆ బంగ్లాని ఆక్రమించాడు, 


ఇలాంటివి వేల సంఖ్యలో చెప్పినా, చూసినా హిందువులు వాటిలో అర్ధాన్ని గ్రహించడం లేదు, 

గుర్తు పెట్టుకోవడం లేదు, 


ఫలితంగా అవే పునరావృతం అవుతున్నాయి.

Shared from WhatsApp

https://whatsapp.com/dl/source=sfw

శుక్రవారం, మే 10, 2024*

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*శుక్రవారం, మే 10, 2024*

       *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

 *ఉత్తరాయణం - వసంత ఋతువు*

      *వైశాఖ మాసం - శుక్ల పక్షం*   

🔔తిథి      : *విదియ* ఉ5.45 వరకు

            తదుపరి *తదియ* తె4.55 వరకు

🔯వారం   : *శుక్రవారం* (భృగువాసరే )

⭐నక్షత్రం  : *రోహిణి* మ12.35 వరకు

✳️యోగం : *అతిగండం* మ2.03 వరకు

🖐️కరణం  : *కౌలువ* ఉ5.45 వరకు

       తదుపరి *తైతుల* సా5.20 వరకు

     ఆ తదుపరి *గరజి* తె4.55 వరకు

😈వర్జ్యం   :  *ఉ.శే.వ6.19వరకు*

               *సా6.10 - 7.45*

💀దుర్ముహూర్తము : *ఉ8.06 - 8.57* 

                           *మ12.20 - 1.11*

🥛అమృతకాలం    :  *ఉ9.27 - 11.01* 

                         మరల *తె3.43 - 5.19* 

👽రాహుకాలం       : *ఉ10.30 - 12.00*

👺యమగండ/కేతుకాలం : *మ3.00 - 4.30*

🌞సూర్యరాశి: *మేషం* || 🌝చంద్రరాశి: *వృషభం*

🌅సూర్యోదయం: *5.34* || 🌄సూర్యాస్తమయం:* *6.17*

       👉 *అక్షయతృతీయ*

      *సింహాచల చందనోత్సవం*

సర్వేజనా సుఖినో భవంతు 

ఇరగవరపు రాధాకృష్ణ🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం  -‌ తృతీయ  - రోహిణీ -‌‌  భృగు వాసరే* (10.05.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

నర్మదానది

 ॐ                       నర్మదానది 


*ఈ నెల 1వ తేదీ నుంచీ రేపు 12వ తేదీ వరకూ నర్మదానదీ పుష్కరాలు కదా! 


నర్మదా సరితాంశ్రేష్ఠా 

                  రుద్రదేహాద్విని సృతా I 

తీరమే త్సర్వభూతాని 

                 స్థావరాణి చరాణి చ ॥ 

 

  - నర్మద నదులలోకల్లా శ్రేష్ఠమైనది. 

    రుద్రుడైన శివుని దేహంనుండీ పుట్టింది. 

    చరాచర ప్రాణులన్నిటినీ తరింపజేయునట్టిది. 

    

    ఈ విధంగా నర్మదానదిని అతిపవిత్రమైనదిగా మన పూర్వులు భావించారు. 

    గంగాతీరాన కూడా లేనన్ని పుణ్యక్షేత్రాలు ఈ నర్మదా నదీ (నదము) తీరాన ఉన్నాయి. 


            నర్మద పుట్టుకపై పురాణగాథ 


    మండువేసవిలో ఒకనాడు శివునికి బాగా చెమట పట్టిందట. 

    ఆ చెమటనుండీ ఒక షందమైన అమ్మాయి ఉద్భవించింది. 

    అమే నర్మద నదిగా మారిపోయింది. 

    అందుకే నర్మదకు 'రుద్రదేహ' అనీ, శంకరుని కూతురు కనుక శాంకరీ అని కూడా పేర్లున్నాయి. 


                    ఉభయతట పావని 

  

    నర్మదా నదిని ఉభయతట పావని అంటారు. అంటే ఈ నదిలో ఏ ఒడ్డున ఎక్కడ స్నానం చేసినా పుణ్యప్రదమన్నమాట. 

     కొందరు భక్తులు నర్మదా నదికి ప్రదక్షిణం చేస్తారు. దీన్ని పరిక్రమణం అంటారు. 


              నర్మదా నదికి  ఇతరపేర్లు 


    'నర్మద' అంటే ఆనందాన్నిచ్చేది అని అర్థం. 

 1.దీన్నే రేవా అనీ, రేవాజీ అనీ కూడా వ్యవహరిస్తారు. 

     రేవ - అంటే దుముకు అని అర్థం. రేవ్ ధాతువునుండి రేవ అయింది. 

    అమరకంటకం వద్ద ఇది 3500 అడుగుల ఎత్తునుండి దూకుతుంది. అందువల్లనే దీనికి 'రేవా' అనే పేరు. 


 2.మేఖల పర్వతాలలో పుట్టడంచేత - మేఖల కన్యక 


3.సూర్ పన్ జలపాతం తరువాత ఈనది హరన్ పాల్ అనేచోట గుజరాత్ లో మైదాన ప్రదేశంలో ప్రవహిస్తుంది. 

   'హరన్ పాల్' అంటే ఒకలేడి దుముకగలంత వెడల్పు. హరిణమంటే లేడి. 

    ఈ చోట నర్మదానది అంత సన్నగా ఉండడం వల్ల, ఈ నదికి 'హరన్ పాల్' అనేపేరు వచ్చింది. 


                నర్మదా నది ప్రత్యేకత 


    మూడు సంవత్సరాలు సరస్వతిలోనూ, 

    ఏడు రోజులు యమునా నదిలోనూ, 

    ఒక్కరోజు గంగానదిలోనూ స్నానం చేయడం వల్ల పుణ్యం వస్తుందంటారు. 

    కానీ నర్మదానదిని చూస్తేచాలు పాపాలన్నీ పటాపంచలవుతాయట. 


    గంగానది కూడా ఏడాదికి ఒకసారి నర్మదానదిలో స్నానంచేసి, తన పాపాలను (తనలో భక్తులు స్నానంచేయడం ద్వారా భక్తులపాపాలను) కడిగివేసుకుంటుంది. 

    గంగ నర్మదలో స్నానం చేసినరోజుని 'గంగాసప్తమి' అంటారు. 


                       నర్మద బాణం 


    నర్మదానదిలోని చిన్నచిన్న కంకరరాళ్ళన్నీ శివలింగాలని పోలి ఉంటాయి. 

   అందుకే నర్మదా నదిలోని ప్రతి కంకరా శంకరుడే అనే పలుకుబడి వచ్చింది. 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

            భద్రాచలం

మనం కావాలి

 మనం కావాలి అనుకున్నవాడు 

మనలో మంచిని చూస్తాడు..!! 


మనం వద్దు 

అనుకున్న వాడు 

మనలో చెడును చూస్తాడు..!! 


మనతో అవసరం ఉన్నవాడు మనలో బలహీనతను చూస్తాడు..!!


*శుభోదయం*

పంచాంగం 10.05.2024 Friday

 ఈ రోజు పంచాంగం 10.05.2024  Friday 


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస శుక్ల   పక్ష: తృతీయా తిధి భృగు వాసర: రోహిణి నక్షత్రం అతిగండ యోగ: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


తదియ రాత్రి 02:52 వరకు.

రోహిణి పగలు 10:49 వరకు. 

సూర్యోదయం : 05:50

సూర్యాస్తమయం : 06:35


వర్జ్యం : సాయంత్రం 04:18 నుండి 05:52 వరకు. 


దుర్ముహూర్తం : పగలు 08:23 నుండి 09:14 వరకు తిరిగి మధ్యాహ్నం 12:38 నుండి 01:29 వరకు.


అమృతఘడియలు : పగలు 07:46 నుండి 09:18 వరకు తిరిగి రాత్రి 01:41 నుండి 03:15 వరకు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

పొందరు దుఃఖముల్

 శు భో ద యం🙏


గోవింద పదారవింద మహిమ!


                  ఉ: పొందరు దుఃఖముల్, భయము పొందరు, పొందరు దైన్య మెమ్మయిన్,


                       పొందరు తీవ్ర దుర్దశలు , పొందు ప్రియంబులు , పొందు సంపదల్


                      పొందు సమగ్ర సౌఖ్యములు , పొందు సమున్నత కీర్తు లెందు,, గో


                       వింద పదారవింద పదవీ పరిణధ్ధ గరిష్ట చిత్తులన్;


                            నృసింహ పురాణము- ఎఱ్ఱాప్రెగ్గడ;


                      

                 గోవింద పదారవింద ధ్యాన పరాయణులకు దుఃఖములు రావు. (దుఃఖములకు వెరువరని భావము) భయముండదు.

జీవన దైన్యముండదు. దుర్దశలు దాపురించవు. ప్రియములు కలుగుచుండును. సంపదలు కలుగును. సంపూర్ణమైన సుఖములు కలుగును. సర్వోన్నతమైన కీర్తికలుగును.ననిభావం!


                         ఈపద్యంలో ఒక చమత్కారం ఉన్నది. గోవిందుని గొలచినవారికి కలుగని కీడులు ఒకవరుసగాను, కలిగెడు

లాభములను మరియొక వరుసగాను వివరించుట.


                      నవ విధ భక్తి మార్గాలలో పాద సేవ సముచిత మైనది. అహంకార రాహిత్యము నొనగూరిచి, మనో విశుధ్ధిని కలిగించుటకు అది చక్కనిమార్గం. సనక సనందనాది భక్తులు గోరిన దదియే! నేడు మనమందరం

ఆదేవదేవుని పై మనసు నిలిపి ధ్యానం చేద్దాం. ముక్తిమాట యేమైనా కనీసం చిత్త శాంతితో ప్రశాంతంగా బ్రతికే అవకాశం కోసం

ప్రయత్నం చేద్దాం!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


                                                           స్వస్తి!

ధనము చేత

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లోకం|| *విత్తేన రక్ష్యతే ధర్మో విద్యా యోగేన రక్ష్యతే*|

       *మృదునా రక్ష్యతే భూపః సత్త్స్రీయః రక్ష్యతే గృహమ్‌*||


తా𝕝𝕝 ధనము చేత *ధర్మము* రక్షింపబడును, యోగము లేదా నిరంతర అభ్యాసం చేత *విద్య* రక్షింపబడును. మర్యాదస్వభావం చేత *రాజు* రక్షింపబడును. మంచి స్త్రీలచేత *గృహము* రక్షింపబడును*.


     👇 //------- ( *మోహముద్గరం* )------// 👇


శ్లో|| 

*అగ్రే వహ్నిః పృష్ఠేభానూ*

*రాత్రౌ చుబుకసమర్పితజానుః*

*కరతలభిక్షస్తరుతలవాసః*

*తదపి న ముంచత్యాశాపాశః* ||16||


భావం: ఎదురుగా చలిమంట పెట్టుకొని,  వీపుపై సూర్యుని కిరణాలు పడేలా కూర్చొని, రాత్రిళ్ళు మోకాళ్ళకి గడ్డాన్ని ఆనించుకుని కూర్చుంటాడు; తిండి తినడానికి రెండు చేతులూ దొప్పలుగా చేసుకొని అందులో తింటాడు. చెట్టు నీడన ఉంటాడు. ఐనా ఆశలు మాత్రం వదలడు.