18, జనవరి 2025, శనివారం

ప్రబంధ కవుల ప్రతిభ

 శు భో ద యం🙏


ప్రబంధ కవుల ప్రతిభ!! తెనాలి వారి ప్రాగల్భ్యం!!


ఉ: " సారధి ఛాదసుండు; బడి సాగదు చక్రయుగంబు ;ప్రాఁత సం

చారపు గుఱ్ఱముల్ ; రధియు శౌర్యమునందరమాని ;సాత్మవి

స్తారము ఖండ ఖండములు ; తానట మాసరి! యంచుఁదత్పురిన్

దేరులు నవ్వు శంకరుని తేరిని , కేతన కింకిణీ ధ్వనిన్ 

పాండురంగ మాహత్మ్యము-ప్రథమా శ్వాసము-115 పద్యము; తెనాలి రామకృష్ణ కవి;

పాండురంగ మాహాత్మ్యము చక్కని ప్రౌఢ ప్రబంధం. పాండురంగ విభుని పదగుంభనమునకు నిలయము. 

ఈప్రబంధం కాశీపుర వర్ణనతో ప్రారంభమౌతోంది. అక్కడ చాలా పెద్దపెద్ద రథాలు ఉన్నాయట. అవి పరమేశ్వరుని రథాన్ని చూచి

గణగణ మని నవ్వుతున్నాయట. (వెక్కిరిస్తున్నాయని భావం) ఎందుకూ నవ్వటం? మీరు మాకు సరిగారు అని;

ఇంతకూ శివుని రథానికున్న లోపాలేమిటీ? ఒకటా రెండా ? అన్నీ లోపాలేనట!

సారధి చూద్దామా పరమ ఛాందసుడు. లోకంలో ఈఛాందసుడు అనేపదం వట్టి చాదస్తం కలవాడు అనే యర్ధంలో 

వాడబడుతోంది. అంటే ఒకరిమాటవినడు తనకు తోచిందే చేస్తాడని యర్ధం. ఇక ఛాందసుడు అనేపదానికి వేదవిదుడు అనే అర్ధంకూడా ఉంది. శివుని రథ సారధి బ్రహ్మగారు. చతుర్వేదములు ఆయన ముఖతః పుట్టాయి.కాబట్టి ఆయన ఛాందసుఁడయ్యాడు.

ప్రస్తుతం మనమిక్కడ చాదస్తం కలవాడనే అనుకోవాలి.

బడి సాగదు చక్రయుగంబు- చక్రాలా ఒకేలా నడిచేవికావు. శివుని రధానికి చక్రాలు సూర్య చంద్రులు,సూర్యుడు పగలు,చంద్రుడు రాత్రి ,మాత్రమే ఉంటారు. ఒకసారి యిద్దరూ ఉండరు.అందువల్ల చక్రాలు సమంగా సాగవు.

ప్రాఁత సంచారపు గుర్రముల్: గుర్రాలు తిరిగి తిరిగి ముసలివైపోయాయి. ఇకవాటికి శక్తిలేదు.ఇంతకీ గుర్రాలు యేవి? వేదాలే

చతుర్వేదాలూ శివుని రథానికి గుర్రాలు. వేదాలు చాలా ప్రాచీనమైనవే! అందుచేత ముసలి గుర్రాలట!

రథియు శౌర్యమునం దరమానిసి"- ఇంక ఆరథమెక్కి తిరిగే ఆయన ఆడో మగో తెలియనివాడు. (పరాక్రమంలో సగంమనిషి!) అర్ధనారీశ్వరుడుగదా!

ఆత్మ విస్తారము ఖండఖండములు "- దాని పొడవు వెడల్పులు చుద్దామా ?ముక్కలూ చెక్కలు. శివుని రథం

భూమి. భూవలయం నవఖండ మండితమైనది. అంటే తొమ్మిది ముక్కలుగా ఉంటుంది. విరిగిన చెక్కముక్కలతో చేసిన రథం.దానికి

బలమెక్కడిది? అనియీసడింపుతో ఆవూరి రథాలు తమ జండాలకు కట్టిన చిరుగంటల మ్రోతలతో శివుని రథాన్ని చూసి నవ్వుతాయట!

ఆహా కవిదెంత గొప్పయూహ! దానికి శ్లేషను జోడించి , చక్కని పద్యాన్ని ప్రకల్పన చేశాడు!

ఇందులో నిందా స్తుతి గర్భితమైన శ్లిష్టోత్ప్రేక్షాలంకారం చోటుచేసికొన్నది!


                                              స్వస్తి!🙏🌷🌷🙏🌷☝🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

పదవిని బట్టి విలువ

 పదవిని బట్టి  విలువ!

              

           ఉ: "స్థాన  విశేష మాత్రమున  'తామఱపాకున  నీటిబొట్ట'! నిన్


                 బూనిక  మౌక్తికంబనుచుఁ బోల్చినమాత్రన  నింత గర్వమా?


                 మానవతీ శిరోమణుల  మాలిక లం దునఁ గూర్ప వత్తువో?


                 కానుక లీయవత్తువొ?  వికాసము నిత్తువొ?  విల్వ నిత్తువో?


                  చాటుపద్యం-- నందితిమ్మన-- రాయల యాస్థాని!


                       

                            విచిత్రమైన పద్యమే ! కానీ  లోకంలో  నకీలీల బారిన పడి బాధపడుతున్నవారెందరో?  అలాంటి కవులెవ్వరో  రాయల పరిసరాలలో చేరి డాబుచేస్తూ, తిమ్మనకు దక్కవలసిన గౌరవాన్ని  దక్కకుండా చేస్తున్నారేమో? వారిని మనస్సులో 

పెట్టుకొని  తిమ్మనగారు యీపద్యం వ్రాశారు.


               "  ఉదయపువేళలో  సరోవరాలలో  కనిపించే  దృశ్యం,తామఱాకుపై పడిన  నీరు ముత్యంలా  తళతళలాడుతూ  కనిపిస్తుంది.సూర్యరస్మి వలన తామరపాకుకుండే  స్నిగ్ధత్వంవలన  ఆవిధంగా కనిపిస్తుంది.చూచేవారికది ముత్యమేమోనని  భ్రమకల్గిస్తుంది.

అది నీరేగానీ  ముత్యంగాదు. అదిగో దాన్ని నిందిస్తున్నట్లుగా  సాకుచేసికొని  తిమ్మనగారు  యీవిధంగా అంటున్నారు.


                            "ఓనీటి చుక్కా! తామఱపాకుపై  నిలచి నేను  ముత్యాన్నని డాబులు కొట్టబోకు. తెలియని వారు నిన్ను ముత్య

మనుకొనినంత మాత్రమున నీకంతగర్వమా? నీవేమైనా  ఆడవారి పూమాలలలో  నలంకరింప దగియున్నావా? కానుకలిచ్చుటకు పనికివత్తువా? నీవల పరిసరములకేదైన వికాసము కలుగునా? అమ్ముకొందమనిన నీకేమైన  విలువయున్నదా? గాలివాటుకు నీటిలోకిజారితివా? ఇకనీపనిశూన్యము. ఇంతదానికంత మిడిసిపడుటయేల? మేలుగాదు సుమా?"-అని హెచ్చరిక!


                   నేడు గూడా  యేమాత్రము విలువలేనికొందరు  మహానాయకుల నాశ్రయంచి  తామేదో మహనాయకులమన్నట్లు

డాబులు చేయువారున్నారు. అట్టి నకిలీల కందరకూ యాపద్యము చెంపపెట్టు.


                      మహా కవుల  నర్మగర్భసందేశము  లిట్లుండును!


                                               స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

మంత్రపుష్పం

 *మంత్రపుష్పం* 

                

 *దేవాలయంలో పూజ చేసేటప్పుడు మంత్రపుష్పం చదువుతారు.* 


*పరమాత్మ సర్వత్రా ఉన్నాడని మంత్రపుష్పం చెబుతుంది.*


*మానవుల లోపల, బయట కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడని, ఆ పరమాత్ముడు ఏ రూపంలో ఉందో మంత్రపుష్పం చెబుతుంది.*

మానవ శరీరంలో ముకుళించుకుని వున్న కమలంలో నాభి పైభాగంలో హృదయ కమలం వుంది. దానికి మొట్టమొదటి భాగాన అగ్నిశిఖలో పసుపు రంగుతో వడ్ల గింజ మొనలా దేవదేవుడు అణు రూపంలోవున్నాడు” అని మంత్ర పుష్పంలో వర్ణించబడింది.


చేతిలో పుష్పాలని తీసుకుని మంత్రపుష్పం పూర్తయిన తర్వాత ఆ పుష్పాలని భగవంతునికి సమర్పించి, నమస్కరించి, ఆ పుష్పాలని మన శిరస్సు మీద వేసుకుంటే ఆ దైవశక్తి మనలోకి ప్రవేశిస్తుందని భక్తుల విశ్వాసం.


మనిషిలో వున్న పరమాత్మ ఉనికిని తెలియజేసి భక్తుడు, పరమాత్మ ఒక్కటే అనే అద్వైత భావం కలిగించే మంత్రపుష్పాన్ని విన్నప్పుడు కళ్ళు మూసుకుని పరమాత్మని దర్శనం చేసుకోవాలి.


అన్ని శుభాల్నీ కలగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం అనే శ్లోకపాదం మంత్రపుష్పంలో కనిపిస్తుంది. నారాయణుడే విశ్వానికి జీవనాధారమని,ఆయన మంగళకరుడు, నాశరహితుడని మంత్రపుష్పంలోని మూడో శ్లోకం చెబుతుంది. 


చీకటివెలుగులు సూర్యుడి వల్ల సంభవిస్తాయి. ఆ సూర్యుణ్ని సృష్టించింది శ్రీమన్నారాయణుడే. అందుకే “దైవం పరంజ్యోతి”అంటారు. అతనే పరబ్రహ్మ. ధ్యానం, అది చేసేవాడు- రెండూ నారాయణుడే అని మంత్రపుష్ప సారాంశం.

                    

*రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే*

*నమోవై యం వై శ్రవణాయ కుర్మహే* 

 *సమే కామాన్ కామకామాయ* 

 *మహ్యం కామేశ్వరో వై శ్రావణౌ*

 *దధాతు*

 *కుబేరాయవై శ్రవణాయ* 

 *మహారాజాయ నమః*


రాజులకు రాజైన దేవుడోయి

పరులకు లాభాలీయునోయి

వైశ్రవణునకు వందనమోయి

సకల కోరికల యజమానోయి

మా కోరికలన్ని తీర్చునోయి

అతడే కుబేరుడు వైశ్రవణుడోయి

ఆ మహారాజుకు వందనమోయి.

*ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు,*

 *ఓం తదాత్మా* *ఓం తత్సత్యమ్*

*ఓం తత్సర్వం, ఓం తత్పురోమ్ నమః*


అతడే బ్రహ్మమతడే వాయువు

అతడే సత్యమతడే ఆత్మ

అతడే సర్వమతడే ఆదిదైవం

 *అన్తశ్చరతి భూతేషు* 

*గుహాయామ్ విశ్వమూర్తిషు*


జీవులందున్నవాడు

బయటా వున్నవాడు

తెలియని వాడు

విశ్వమంతా వున్నవాడు.

 *త్వం యజ్ఞ్యస్త్వం* *వషట్కారస్త్వం* 

*మిన్ద్రస్తగ్ం* *రుద్రస్త్వం విష్ణుస్త్వం*

*బ్రహ్మత్వం ప్రజాపతిః*

*త్వం తదాప ఆపొజ్యోతీ*

*రసో ౭ మృతం*

*బ్రహ్మ*

*భూర్భువస్సువరోమ్*


నీవే యాగము  యాగమంత్రము

నీవే  విష్ణువు బ్రహ్మ ఇంద్రుడవు

నీవే  జలము తేజము రసము

నీవే శాశ్వతము  విశ్వరూపము

నీవే  ఓం కారబ్రహ్మవు

*ఈశాన స్సర్వ విద్యానా మీశ్వర*

*స్సర్వభూతానామ్ బ్రహ్మధిపతిర్*

*బ్రహ్మణో ౭ ధిపతిర్ బ్రహ్మశివోమే*

*అస్తు సదా శివోమ్*


సకల విద్యల కు ఈశుడవు

సకల జీవులకు ఈశుడవు

నీవే బ్రహ్మ యజమాని

నీవే బ్రాహ్మల యజమాని

నీవే బ్రహ్మ సదాశివుడవు

*తద్విష్ణో పరమం పదగ్ం*

*సదా పశ్యన్తి సూరయః*

*దివీవ చక్షు రాతతమ్*


ఆ విష్ణు లోకము నోయి

ఆ పరమ పధమునోయి

జ్ఞానులు సదా చూచేరోయి ఆకాశమంతా చూచేరోయి

*తద్విప్రాసో విపన్వవో*

*జాగృవాం స్సమిన్దతే*

*విష్ణోర్య త్పరమం పదమ్*


కోరికలు దోషాలు లేని వారు

జాగృతి చలనాలు కలవారు

విష్ణులోక కాంతులు పెంచేరు

పరలోక ప్రకాశము

 *ఋతగ్ం  సత్యం పరమ్బ్రహ్మ* 

*పురుషం కృష్ణ పింగళమ్*

*ఊర్ధ్వరేతమ్ విరూపాక్షం*

*విశ్వరూపాయ వై నమో నమః*


ముక్తినాధుడు సత్యరూపుడు

బ్రహ్మ రూపుడు నల్లనివాడు

పైకి వెలుగు  తేజోవంతుడు

విరూపనేత్రుడు విశ్వరూపుడు

దేవదేవునకు మరల వందనము.

*నారాయణాయ విద్మహే*

*వాసుదేవాయ ధీమహి*

*తన్నో విష్ణు ప్రచోదయాత్*


నారాయణుని ఉహించెదను

వాసుదేవుని ధ్యానించెదను

విష్ణు చైతన్యము కలుగు గాక

*ఆకాశ త్పతితం తోయమ్*

*యథా గచ్ఛతి సాగరం*

*సర్వదేవ నమస్కారః*

*కేశవమ్ ప్రతి గచ్ఛతి*


ఆకాశ ధారాల నీరులు

ఎలా సాగరమే చేరునో

సకలదేవ వందనాలు

ఆ పరందామునే చేరును

 *మంత్రపుష్పం సంపూర్ణం*


*సర్వం శ్రీపరమేశ్వరా ర్పణమస్తు*

కత్తులు దూసిన నోరులేని

 **కత్తులు దూసిన నోరులేని పందెం కోళ్లు **

**చేతులు మారిన వేల కోట్లు **

@@@@@@      @@@@

**పంతం పడుతుంది పందెం **

**గెలిస్తే ఎవడికి అందం **

**కోడికి మనిషికి విడదీయరాని బంధం **

**అక్షరాలలో చెప్పలేనిది అ అనుబంధం **

**కోటేశ్వరుడిని సైతం నిముషాలలో కూటికి లేని ఈశ్వరుడు ని చేయగలదే పందెం **

**కాలానికి అందరూ సమానులే **

**కాలం కలిసోస్తే కోటేశ్వరులే **

**అదే కక్ష కడితే బికారులే **😂

**500 నోట్లే నోరేళ్లబెట్టాయి **

**అదృష్టవంతుడుకి పట్టం కట్టాయి **

**దురదృష్టవంతులను రోడ్ మీద నిలబెట్టాయి **

**ఆలోచించండి వేల బతుకులు చితికి పోయాయి **

**లాభం వచ్చినవాడికి సంక్రాంతి పండగ **

**లాస్ అయినవాడికి జీవితం దండగ **😂😂

**అవునా కాదా?**

**నిజాన్ని చెప్పేవాడికి ధైర్యం ఎక్కువ **

**నిజాన్ని దాచే వాడికి భయం ఎక్కువ **

**బొమ్మిన వెంకట్ **

ఎప్పుడూ వద్దు..

 ఇవి ఎప్పుడూ వద్దు..


* చదువులో పోలిక వద్దు..


* టెన్షన్ వద్దు..


* అనవసరపు వాదన వద్దు..


* అతి మంచితనం వద్దు..


* మొహమాటం వద్దు..


* నిర్లక్ష్యం వద్దు..


* అనుమానం వద్దు..


982


* అకాల భోజనం, నిద్ర వద్దు..


* భార్య భర్త మద్య మూడో వ్యక్తి జోగు


RE


* ఒంటరితనంతో బాధ పడకు వద్దు.


* అతి వేగం వద్దు..


2


* పొదుపు చేయకుండా ఖర్చు పెట్టవద్దు.)


* మితి మీరి తినవద్దు..



అనువాదపద్యం

 శుభోదయమ్ సుభాషితమ్ 


> *అనవాప్యం చ శోకేన శరీరం చోపతప్యతే*

> *అమిత్రాశ్చ ప్రహృష్యన్తి మా స్మ శోకే మతిం కృథా:*

> విదురనీతి

------------------------------------------------

 అనువాదపద్యం:

ఆ॥వె॥

కోరి భంగపడిన కూడి పరిహసించు 

శత్రువర్గమెల్ల చవట యనుచు 

మనసు దుఃఖపడును మాన్యత చెడిపోవు 

కోర్కె శోకమిచ్చు కోర్కె వలదు 

*~శ్రీశర్మద*

మహాభారతం

 🙏 మహాభారతం - శాంతి పర్వం 🙏

               మూడవ భాగం 

భీముడు మాటలకు కూడా ధర్మరాజు లో ఏమీ మార్పు రానందున అర్జునుడు అందుకుని " ధర్మజా ! నాకు తెలిసిన ఒక ఇతిహాసం చెప్తాను విను. పూర్వం కొంత మంది బ్రాహ్మణ బ్రహ్మచారులు తమ కులముకు ఉచితమైన ఆచారములను వదిలి అడవులకు వెళ్ళారు. వారి మీద దయ కలిగిన ఇంద్రుడు ఒక పక్షి రూపంలో వారి వద్దకు వెళ్ళి" మీరు ఎంచుకున్న మార్గం తప్పు " అని చెప్పాడు. ఆ బ్రహ్మచారులు ఆ పక్షిని మహాత్ముడిగా గుర్తెరిగి తమకు తగిన మార్గం ఉపదేశించమని అడిగారు. అప్పుడు పక్షి రూపంలో ఉన్న ఇంద్రుడు ఇలా చెప్పసాగాడు " చతుష్పాదములలో గోవు, శబ్ధములలో మంత్రం, మనుష్యులలో బ్రాహ్మణుడు అత్యంత శ్రేష్టమైన వారని వేదవిదులు చెప్తారు. కనుక బ్రాహ్మణుడు మంత్రోపాసన చేసి తనకు నిర్ధేశించిన కర్మలు చెయ్యడం అతడి కర్తవ్యం. కానీ నిర్లక్ష్యంచేత కాని, కోపంచేత కానీ, శోకంచేత కానీ, తనకు నిర్దేశించిన విద్యుక్త కర్మలను చెయ్యకపోవడం మహాపాతకం. అజ్ఞానులు, అర్ధహీనులు సన్యాసం గురించి తెలియక ఉభయభ్రష్టులు ఔతున్నారు. ఎవరైతే గృహస్థు ధర్మాలను పాటిస్తూ అతిథులను, దేవతలను, పితృదేవతలను సంతృప్తిపరుస్తాడో అతడికి పుణ్యలోకములు అరచేతిలో ఉంటాయి. మంచి కర్మలు చేసి వాటిని బ్రహ్మార్పణం చేస్తే మహదానందం కలుగుతుంది " అని చెప్పాడు. ఆ మాటలు విన్న బ్రాహ్మణ బ్రహ్మచారులు గృహస్థాశ్రమం స్వీకరించి తమతమ విద్యుక్త ధర్మం నిర్వర్తించుటకు వెనుకకు వెళ్ళారు. కాబట్టి ధర్మరాజా ! నీవు నీ రాజ్యమును జనరంజకంగా పాలించు. యజ్ఞ యాగాదులు చేసి పుణ్యలోకాలను సంపాదించు " అని పలికాడు.


తరువాత ధర్మరాజు మనస్థాపం నివారించుటకు నకులుడు ఇలా చెప్పాడు. " అన్నయ్యా ! బ్రాహ్మణులు తమ విద్యుక్త ధర్మమైన యజ్ఞయాగాదులు చేసినపాపము నుండి విముక్తులు ఔతున్నారు. కేవలం యజ్ఞయాగాదులు చేసినందువలన ఏమి ప్రయోజనం ఉంటుంది. ఫలాపేక్ష లేకుండా ధనమును సంపాదించి యజ్ఞయాగాదులు చేసి బ్రాహ్మణులను తృప్తిపరిచిన అది నిస్సంగప్రవృత్తి ఔతుంది కాని మనలోని కామక్రోధాలను, శోకమోహాలను విడిచి పెట్టకుండా అడవులకు పోయి తపస్సు చేసినందువలన ప్రయోజనం ఏమిటి ? అదియును కాక గృహస్థాశ్రమధర్మం, బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాసధర్మాలలో గృహస్థాశ్రమం శ్రేష్టమైంది. క్షత్రియులు ధనమును కూడబెట్టి క్రతువులు చెయ్యకపోయిన పాపం వస్తుందని వేదములు చెప్తున్నాయి, గాఢాంధకార బంధురమైన ఈ విశాలవిశ్వానికి వెలుగునిచ్చే ఈశ్వరుడే ఆశ్రమధర్మాలను వర్ణవ్యవస్థను ఏర్పాటు చేసాడు. ఈ యుద్ధం కూడా ఆయన కల్పించినదే ! భగవంతుడు నిర్ణయించిన యుద్ధమున జరిగిన హింసను తలచి నీవిలా శోకించి నీ ఆశ్రమధర్మమును విడుచుట తగునా ! యుద్ధంలో హింస జరిగిందని బాధపడుతున్నావు. మనకు ముందు పాలించినరాజులు యుద్ధములు చేయలేదా వారు ఉత్తమగతులు పొందలేదా ! నీకు ఈ యుద్ధమున ఏమీ పాపం అంటదు. ధర్మాత్ముడవైన నీకు తప్పక ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి. క్షత్రియుని పాలనలో ప్రజలు రక్షణ కోరుకుంటారు. ప్రజలు సుఖంగా జీవించడానికి కావలసిన పరిస్థితులను కల్పించడం రాజువిధి. అది నెరవేర్చకపోవడం పాపంకాదా ! దానధర్మాలు చెయ్యడం క్షత్రియధర్మం. అర్హులైన వారికి నీవు దానధర్మాలు చెయ్యాలి. అవన్ని వదిలి నీవిలా అడవులకు పోవడం ఉత్తమధర్మమా ! నీకిది భావ్యమా ! " అని పలికాడు నకులుడు.


తరువాత సహదేవుడు " అన్నయ్యా ! మానవుడు పైపైన ఉన్న కోరికలు విడిచి జీవించిన అది మోక్షకారకం ఔతుందా ! అన్నయ్యా ! నీవు కూడా శారీరక సుఖం వదిలి నీ వంశధర్మములు నిర్వర్తించు. మమత బంధమును కలిగిస్తుంది. మమతను విడిచిన మోక్షం లభిస్తుంది. నీవు అడవులకు వెళ్ళినా ఈ లోకంలోని వస్తువులను, సౌఖ్యాన్ని నీ మనస్సు కోరిన అది నీకు ఉత్తమలోక ప్రాప్తికి ప్రతి బంధకం ఔతుంది. అన్నయ్యా ! నీవు నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, చెలి, చుట్టం. నా మాట విని నీ మనస్సుమార్చుకో. నేను చెప్పింది అబద్ధమో, నిజమో నాకు తెలియదు. నేను భక్తితో పలికిన ఈ మాటలను నీవు కరుణతో విశ్వసించు " అని పలికాడు. నకులసహదేవుల మాటలకు ధర్మరాజు బదులు చెప్పలేదు.


అప్పటి వరకు పెదవి విప్పని ద్రౌపది లేచి ధర్మరాజు వద్దకు వచ్చి " నాధా ! మీరు అనుమతి ఇచ్చిన నాకు తోచినమాటలు చెప్తాను " అని, ధర్మజుని అనుమతితో ఈ విధంగా చెప్పసాగింది. " నాధా ! మనం ఆడవులలో ఉన్నకాలాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అరణ్య అజ్ఞాతవాసాలు ముగియగానే సుయోధనుడిని చంపి మన రాజ్యసంపదలను తిరిగి కైవశం చేసుకుంటామని మీరు మీ తమ్ములకు నచ్చచెప్ప లేదా ! చెప్పినట్లు రాజ్యాన్ని కైవశం చేసుకుని ఇప్పుడిలా మాటతప్పి రాజ్యత్యాగం చేసి అడవులకు పోతానని చెప్పడం ధర్మమా ! ధర్మం సత్యం వ్రతముగా పెట్టుకున్న మీకు ఈ విధంగా పలకడం న్యాయమా ! రాజు ఎప్పుడూ పేదమనసుతో ఉండ కూడదు. రాజు తన రాజ్యమును, ప్రజలను రక్షించాలి, దుర్మార్గులను నిర్ధయగా శిక్షించి సన్మార్గులను దయతో రక్షించాలి. బ్రహ్మదేవుడు లోకాన్ని రక్షించడానికే క్షత్రియ కులాన్ని సృష్టించాడు. రాజు మనుష్యరూపంలో ఉన్న దేవుడు. అలాంటి రాజు చేతకాని వాడైన దుర్మార్గులు విజృంభిస్తారు. రాజునందు దేవుడు రాజనీతిని ప్రతిష్ఠించాడు. అపరాధులను శిక్షించడం రాజధర్మం దానిని నెరవేర్చిన ఇహపరములు సిద్దిస్తాయి. తప్పు చేసిన బ్రాహ్మణుడి నయినా రాజు శిక్షించడమే రాజధర్మం. ఇప్పుడు నీవు అదే రాజధర్మాన్ని నిర్వర్తించావు. రజస్వలను, ఏకవస్త్రను అయిన నన్ను సభకు ఈడ్చి వలువలు ఊడదీసి, తొడచూపి అవమానించిన దుర్యోధన, దుశ్శాసన, కర్ణులను నీవు ఒక రాజుగా శిక్షించావు. అది పాపంకాదు కనుక నీవు చింతించ పనిలేదు. విషప్రయోగం చేసిన వారిని, గృహదహనం చేసిన వారిని, రాజకీయ రహస్యములను బహిరంగపరచిన వాళ్ళను, హంతకులను, పరసతిని కోరిన వారిని, బందువులను చంపిన వాడిని శిక్షించడం రాజధర్మం. అది పుణ్యకార్యం. దండించ వలసిన వారిని దండించక పోవడం మహాపాపం. రాజు దండనీతిని అవలంబించడం పేదలకు, సాధువులకు, తాపసులకు మేలుచేస్తుంది. వారికి రక్షణ కలిగిస్తుంది, దుష్టశిక్షణ, శిష్టరక్షణ చెయ్య వలసిన రాజు బ్రాహ్మణుల వలె ఇంద్రియనిగ్రహం పాటించడం ధర్మమా ! కనుక నీ మనసులోని శంకను తొలగించు. నాధా ! నా మాదిరి జీవితంలో కష్టపడిన వారు ఉన్నారా ! కాని నేను అన్నీ మరచి గృహస్థు ధర్మాలను విడువక నిర్వర్తించడం లేదా ! కౌరవులు వారి గోతిని వారే తవ్వుకున్నారు. వారిపాపం వారే అనుభవించారు. అందుకు మీరు బాధపడటం ఎందుకు. కనుక మీరు రాజ్యభారం వహించి ప్రజలను జనరంజకంగా పాలించండి. మీకు తెలియని యుద్ధనీతి లేదు. పూర్వం బృహస్పతి, శుక్రుడు యుద్ధనీతిని లోకానికి తెలిపారు. ఆ నీతిని కూలంకుషంగా అభ్యసించిన మీరు ఈ రాజ్యాన్ని పాలించుట ధర్మం " అని చెప్పింది.

                    సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

శనివారం🍁* *🌹18, జనవరి, 2025🌹*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

          *🍁శనివారం🍁*

  *🌹18, జనవరి, 2025🌹*  

      *ధృగ్గణిత పంచాంగం*


  *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - కృష్ణపక్షం*

*తిథి      : పంచమి* పూర్తిగా రోజంతా 

రాత్రితో సహా 

*వారం    : శనివారం* ( స్ధిరవాసరే )

*నక్షత్రం  : పుబ్బ* మ 02.51 ఉపరి *ఉత్తర ఫల్గుణి ( ఉత్తర )*

*యోగం  : శోభన* రా 01.16 వరకు ఉపరి *అతిగండ*

*కరణం  : కౌలువ* సా 06.26 *తైతుల* రాత్రంతా పూర్తిగా

 *సాధారణ శుభ సమయాలు* 

 *ఉ 11.00 - 01.00   సా 04.00 - 06.00*

అమృత కాలం  : *ఉ 07.53 - 09.38*

అభిజిత్ కాలం  :  *ప 11.55 - 12.41*

 

*వర్జ్యం  :  రా 10.51 - 12.37*

*దుర్ముహూర్తం  : ఉ 06.40 - 08.10*

*రాహు కాలం   : ఉ 09.29 - 10.53*

గుళికకాళం : *ఉ 06.40 - 08.04*

యమగండం  : *మ 01.43 - 03.07*

సూర్యరాశి : *మకరం*  

చంద్రరాశి : *సింహం/కన్య*

సూర్యోదయం :*ఉ 06.40* 

సూర్యాస్తమయం :*సా 05.56*    

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*

 *వైదిక విషయాలు* 

ప్రాతః కాలం  :  *ఉ 06.40 - 08.55*

సంగవ కాలం  :      *08.55 - 11.10*

మధ్యాహ్న కాలం    :      *11.10 - 01.26*

అపరాహ్న కాలం    : *మ 01.26 - 03.41*

*ఆబ్ధికం తిధి  : పుష్య బహుళ పంచమి*

సాయంకాలం  :  *సా 03.41 - 05.56*

ప్రదోష కాలం  :  *సా 05.56 - 08.29*

రాత్రి కాలం     :  *రా 08.29 - 11.53*

నిశీధి కాలం    :*రా 11.53 - 12.43*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.58 - 05.49*

______________________________

         *🌷ప్రతినిత్యం🌷*

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌹II శ్రీ వేంకటేశ పంచక స్తోత్రంII🙏*


*ఉపేన్ద్రమిన్దుశేఖరారవిన్దజామరేన్ద్ర*

*బృన్దారకాదిసేవ్యమానపాదపఙ్కజద్వయమ్ ।*

*చన్ద్రసూర్యలోచనం మహేన్ద్రనీలసన్నిభమ్*

*నాగరాఙ్గిరీశ్వరం నమామి వేఙ్కటేశ్వరమ్ ॥*


*🙏ఓం నమో వేంకటేశాయ🙏*

******************************


*🍁 అంజని పుత్ర స్తోత్రం..!!🍁*


*ఓంకార ప్రియ హనుమంత ఐక్య వినాయక హనుమంత*

*జయ బజరంగబలి జయజయ జయ బజరంగబలి*


           *🍁ఓం శ్రీ🍁* 

 *🌹ఆంజనేయాయ నమః🌹* 


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

           

          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

🌹🌷🍁🍁🍁🍁🌷🌹

ఈశ్వరచైతన్యం

 *యో రుద్రో విశ్వాభువనావివేశ తస్మై రుద్రాయ నమో అస్తు*


ఏ రుద్రుడు సమస్త భువనములందు అంతటా ప్రవేశించి ఉన్నాడో ఆ రుద్రునకు నమస్కారములు(యజుర్వేదం)


పరమేశ్వరుడైన రుద్రుడే అన్ని భువనాలలో, ప్రత్యణువునా వ్యాపించి ఉన్నాడు.

'యో రుద్రో అగ్నౌ అప్సు య ఓషధీషు...' అని ప్రారంభించి సాగే పై మంత్రం 'అగ్ని యందు, జలము లందు, ఓషధులందు' వ్యాపించిన పరమేశ్వరుని ప్రస్తుతించింది.

ఈ తత్త్వమే యజుర్వేదంలోని రుద్రనమక మంత్రాలలో విస్తృతమై కనిపిస్తుంది.


ఈశ్వరచైతన్యం ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంది. 'వ్యాపించిన ఈశ్వరు'ని విష్ణువు అంటారు. కనుక ఈశ్వరుడే విష్ణువు. ఈ భావమే 'నమో భగవతే రుద్రాయ విష్ణవే' అని శ్రుతి మరొక చోట చెప్పింది. 'శివాయ విష్ణురూపాయ' అనే మాటలోని

ఆంతర్యమిదే. ముజ్జగాలకీ, మూడు గుణాలకీ అతీతమైన బ్రహ్మమే 'శివుడు'. ఆయన విశ్వమందు ఘోర, అఘోర రూపాలతో వ్యాపించి ఉన్నాడు. పంచభూతాలలో,

సూర్యచంద్రాది జ్యోతిర్గణాలలో అనంత విశ్వమందంతటా అనంతంగా వ్యాపించాడు.

ఈ ఘోరాఘోర స్వరూపుడైన శివుడే 'రుద్ర' నామంతో వ్యవహరించబడుతున్నాడు.


జీవుల కర్మలకు అనుగుణంగా ఈ ప్రకృతిలో వ్యాపించిన ఈశ్వరశక్తి సుఖదుఃఖాలుగా లభిస్తుంది. దుఃఖానుభవమే ఘోరం - సుఖానుభవమే అఘోరం. అగ్ని

మేలూ చేస్తుంది - కీడూ కలిగిస్తుంది. ఇలా ప్రకృతిలో ప్రత్యంశంలోనూ ఈ రెండు లక్షణాలు ఉంటాయి. ఈ రెండు లక్షణాలు అనివార్యం. కానీ ఈ రెండు ఒకే ఈశ్వరశక్తి స్వరూపాలేనని గ్రహించడమే 'శివజ్ఞానం'.


రుద్ర శబ్దానికి ఘోరపరమైన అర్థం 'దుఃఖకారకుడు'. ఈశ్వరుడు (ప్రభువు) ధర్మరక్షణ కోసం పాపకర్ములను శిక్షిస్తాడు. అదే పాపానుభవ ప్రదానం. అదేవిధంగా ధర్మపరులను, భక్తులను ఆనందింపజేసే 'శాంతస్వరూపుడు' - ఇది రుద్ర శబ్దానికి అఘోరపరమైన

అర్థం. నిజానికి ఈ శిక్షగానీ - రక్షగానీ జీవుల కర్మానుగుణంగా లభించేదే కానీ-ఆ రుద్రుడు సుఖదుఃఖాలకు అతీతుడైన పరమాత్మ (శివుడు). ఈ రెండు రకాల జీవులను అనుగ్రహించడానికేనని 'శివ' నామ తాత్పర్యం.


'శివుడు రుద్రుడై విష్ణువైనాడు' అనేది చక్కని సమన్వయం. 'త్రిగుణాతీతుడైన పరమాత్మ మంగళస్వరూపుడు (శివుడు) కనుకనే, ఘోర అఘోర రూపాలతో జగతిని శాసిస్తున్న ఈశ్వరుడై (రుద్రుడై), విశ్వమంతా వ్యాపించి (విష్ణువై) నిర్వహిస్తున్నాడు”.


పై రుద్రమంత్రంలో‘వివేశ” శబ్దం - 'ప్రవేశించుట' అనే అర్థంలో ప్రయోగింపబడింది.


విశ్వవ్యాపకుడైన రుద్రుని ఆరాధించడం వల్ల - ఘోర, అఘోర అనుభవాలు కూడా పరిణామంలో 'మంగళం'(శివం)గా లభిస్తాయి. ఇదే శివోపాసన, వేదమతం ప్రకారం

'శివ' 'రుద్ర' 'విష్ణు' శబ్దాలు ఒకే పరమేశ్వరునికి చెందినవి.


పంచభూతాలలో, సూర్యచన్దులలో, క్షేత్రజ్ఞుడైన జీవునిలో ఉన్న ఈశ్వర చైతన్యాన్నే 'అష్టమూర్తులు'గా ఉపాసించాలి. ఈ ఎనిమిది స్వరూపాలు ఈశ్వరుని ప్రత్యక్షమూర్తులు.వీటిలో 'ఘోరాఘోరం'గా ఉన్న రుద్రుడే అష్టమూర్తి స్వరూపుడు. ఈ ఎనిమిది మూర్తులు మనలోనూ, మనచుట్టూ ఉన్న విశ్వంలోనూ వ్యాపించి ఉన్నారు. వారు మనలను

శివ(శుభ) రూపాలుగా అనుగ్రహించాలనీ, తద్వారా శాంతం, సుఖం లభించాలనీ అష్టమూర్తి స్వరూపుడైన ఈశ్వరుని ఆరాధిస్తాం. క్రమంగా 'అంతా ఈశ్వరమయం'

అనే జ్ఞానం (ఈశావాస్యమిదం సర్వం) లభిస్తుంది. అదే శివజ్ఞానం (ఆత్మజ్ఞానం).అంతటా వ్యాపించిన ఆత్మయే శివం. ఘోరాఘోరాలకు అతీతమైన ఆత్మతత్త్వమిది.


దీనిని ప్రకటించడానికై వేదంలో రుద్రమంత్రాలు చెప్పబడినాయి. బ్రహ్మజ్ఞులైనరమణమహర్షి ఈ అంశాన్నే -


'జగత ఈశధీ యుక్త సేవనం

అష్టమూర్తి భృత్ దేవ పూజనం' (ఉపదేశసారం) - అని తెలియజేశారు.


'శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, ఈశాన, మహాదేవ, పశుపతి' - ఈ ఎనిమిది

క్రమంగా 'భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు,యజమాని(క్షేత్రజ్ఞుడు)' - అనే ఎనిమిది మూర్తులుగానున్న రుద్రుని నామాలు.

ఇహంలో ఈ ఎనిమిది మనకు అనుకూలంగా ఆనందాన్ని అందించడం లౌకిక ప్రయోజనం. అంతా శివమయం అనేది పారమార్థిక లక్ష్యసిద్ధి.

గురువే బ్రహ్మయు

 గురువే బ్రహ్మయు కనగా 

గురువే విష్ణువు మరియును గురువే శివుడున్ 

గురువే బ్రహ్మమగుట నా 

గురువుకు నతులిత్తు నేను గురుతభక్తిన్ 

*~శ్రీశర్మద*

వశిన్యాది వాగ్దేవతలు

 *వశిన్యాది వాగ్దేవతలు...🙏🙏🌹🌺*




'వాక్కు' అనగా ప్రకటింపబడిన జ్ఞానం . అర్ధరహితమైన శబ్దం కాదు .


వశిన్యాది వాగ్దేవతల దయ లేకపోతే, మనం పలకలేం, పలికినది తెలుసుకోలేం .


వశిన్యాది వాగ్దేవతలు మొత్తం ఎనిమిది మంది. వీరు సాక్షాత్తు అమ్మవారి నుండి వచ్చిన అమ్మవారి యొక్క పూర్ణ స్వరూపాలు.


వీరు శ్రీ చక్రంలో బిందువు నుండి మూడవది, "త్రైలోక్య చక్రం" అనే "చతురస్రం" నుండి ఏడవది అయిన "సర్వరోగహర చక్రం" లో వుండి, వీరిని స్మరించి నంత మాత్రమున, "ఆది"(మనసుకు వచ్చిన రోగం) మరియు "వ్యాధి"(శరీరానికి వచ్చిన రోగం) లను తొలగించగలరు.


వీరు అక్షర స్వరూపులు. సర్వ మంత్ర స్వరూపులు. వాక్కు విభూతి అనగా వాక్ వైభవము కలవారు. 


వీరు మన ఉపాధులలో అనగా  శరీరములలో ఉండుటవల్లనే మనము మాట్లాడ గలుగుతున్నాం.


దీర్ఘ అక్షరాలను తీసివేస్తే, అక్షర సంఖ్య 50.ఆ 50 అక్షరాలను 8 వర్గాలుగా విభజిస్తారు.


ఆ ఎనిమిది అక్షర వర్గాలకు, ఎనిమిది మంది వశిన్యాది వాగ్దేవతలు అధికారిణులు.


*వీరే ఆ ఎనిమిది మంది వశిన్యాది వాగ్దేవతలు...*


1. వశిని అమ్మవారు...


అ నుండి అః అనే 16 స్వరాక్షరములకు ఆది దేవి. మన కంఠములొ  ఉంటారు. వశీకరణ మంత్రాధి దేవతా. ఈమె దయ ఉంటే లోకంలో అన్ని మన పాదాక్రాంతం అవుతాయి.


2. కామేశ్వరి అమ్మవారు...


'క' వర్గమునకు దేవి. మన తాళువులలో(దవడలలో ) ఉంటారు. కోరికలను ఈడేర్చే మంత్రాధి దేవతా. ఈమె దయ ఉంటే  అన్ని కోరికలు తీరుతాయి. 


3. మోదినీ అమ్మవారు...


'చ' వర్గమునకు దేవి. మన ఔష్టములు (పెదవులలో ) ఉంటారు. ఆనందము, త్రుప్తి కలిగించే మంత్రాధి దేవతా. ఈమె దయ ఉంటే  అన్ని ఆనందాలే. 


4. విమలా అమ్మవారు...


'ట' వర్గమునకు దేవి.  మన దంతములలో ఉంటారు . ఈమె దయ ఉంటే  నిర్మల జ్ఞానం అనగా బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది.


5. అరుణా అమ్మవారు...


'త' వర్గమునకు దేవి. మన అంగిళిలో ఉంటారు. ఈమె దయ ఉంటే సకల దేవతల కృప కలుగుతుంది. 


6. జయినీ అమ్మవారు...


'ప' వర్గమునకు దేవి మరియు అభ్యంతర వాక్ స్థానము . ఈమె దయ ఉంటే జయం లభిస్తుంది.


7. సర్వేశ్వరీ అమ్మవారు...


'య' వర్గమునకు దేవి మరియు బాహ్య వాక్ స్థానము . ఈమె దయ ఉంటే అధికారం లభిస్తుంది.


8. కౌళినీ అమ్మవారు...


'ష' వర్గమునకు దేవి. మన నాలుక పైన నడయాడు తల్లీ. ఈమె దయ ఉంటే కుండలినీ యోగం లభిస్తుంది...

17, జనవరి 2025, శుక్రవారం

మహాభారతం

 🙏మహాభారతం - శాంతి పర్వం 🙏

             రెండవ భాగం 

మహాభారతం అంటేనే పంచమ వేదం అన్నారు. వేదార్థం తెలియకపోయినా భారతాన్ని చదివి అర్ధం చేసుకోవాలి. అందులోనూ శాంతి పర్వం అంతా ధర్మ శాస్త్ర విషయాలే, ఉపనిషత్తుల సారాంశమే. కాబట్టి ఇది ఒక కథా విషయం అనుకోని ప్రక్కన పెట్టకండి. ఇది కథ మాత్రమే కాదు. వేదసారం అని గ్రహించండి . ఎన్నో ధర్మాలు తెలియజేసేది శాంతి పర్వం అందుకే ఈ ఉపోద్ఘాతం వ్రాస్తున్నాను. 

  మన వేదవ్యాస గురువు మహానుభావుడు. వేదమంతా ఒక రాశిగా పడిపోయి ఉంటె , కలియుగం లో ఉండేటటువంటి ఆయుర్థయన్ని దృష్టిలో పెట్టుకుని వేదములను చదవ గలిగిన వాళ్ళు ఉండరని , వేదమును విభాగం చేసి "రుక్" "యజుర్" "సామ" "అథర్వణ" వేదము అని నాలుగు విభాగములు చేసి 18 పురాణములు వెలయించిన తరువాత పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రచన చేసారు, అందులో లేనటువంటి ధర్మ సుక్ష్మం లేదు , భారతం అంతా కూడా రచన చేసిన తరువాత వేదవ్యసుడే అన్నాడు నీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా , ఏది తెలుసుకోవాలన్నా భారతమే ఆధారం ఇంత కన్నా ఇంకోటి ఏది ఉందొ నాకు చెప్పు అన్నాడు , కాబట్టి నీకు జవాబు లేనిది లేదు మహాభారతం లో అన్ని ఉన్నాయ్. నీకు వెతుక్కోవటం రావాలి, తెలుసు కోవటం రావాలి , ఇది కాకుండా వేరొకటి కొత్తగా తెలుసుకోవటానికి వేరేది ఉండదు, అన్ని భారతం లోనే ఉన్నాయి.

అన్ని ఆఖ్యానములతో అన్ని ఉపాఖ్యానములతో అన్ని విశేషాలతో భారత రచన చేశానని మన గురువైన వేద వ్యాసుడు పేర్కొన్నాడు. అటువంటి మహాభారతమును


"ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబనియు ఆధ్యాత్మ వేదులు వేదంతమనియు నీతి విచక్షణులు నీతి శాస్త్రంబని కవివృ ష భులు మహా కావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష సంగ్రహమని అయితి హసకులు ఇతిహసమనియు పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చయంబు అని మహి కొనియాడుచుండ వివిధ వేద తత్వ వేది వేదవ్యసుడాది ముని పరశారత్మజుండు, విష్ణు సన్నిభుoడు , విశ్వ జానీనమై పరగుచుoచేసే భారతంబు అని నన్నయ పేర్కొన్నారు 

ఇక విషయంలోకి వెడదాము.


కళింగ దేశపు రాజు చిత్రాంగదుడు తన కుమార్తె శుభాంగికి స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరానికి సుయోధనుడు, కర్ణుడితో కలిసి వెళ్ళాడు. ఆ స్వయం వరానికి శిశుపాలుడు, జరాసంధుడు, రుక్మి మొదలైన రాజులు హాజరయ్యారు. స్వయంవరంలో శుభాంగికి ఆమె చెలికత్తె ఒక్కొక్క రాజును పరిచయం చేస్తుండగా శుభాంగి ఎవరి మెడలోను వర మాల వేయక సుయోధనుడిని కూడా దాటి పోయింది. అది చూసి సుయోధనుడు కోపించి ఆమెను తన రథం మీద పెట్టమని ఆజ్ఞాపించాడు. అది చూసి స్వయంవరానికి వచ్చిన రాజులంతా సుయోధనుడి మీద విరుచుకు పడ్డారు. సుయోధనుడు వారితో ఘోరంగా పోరాడాడు. కర్ణుడు తన అస్త్ర విద్యా నైపుణ్యంతో రాజులందరితో యుద్ధం చేసాడు. కర్ణుడి ధాటికి తాళ లేక రాజులందరూ పారి పోయారు. సుయోధనుడు శుభాంగిని తీసుకుని హస్థినా పురానికి వెళ్ళాడు. ఆ సమయంలో తనకు జరిగిన పరాభవాన్ని తలచుకుని జరాసంధుడు కర్ణుడిని తనతో యుద్ధం చెయ్యమని కోరాడు. అందుకు అంగీకరించిన కర్ణుడు జరాసంధునితో యుద్ధంచేసాడు. ముందు అస్త్ర శస్త్రములతో యుద్ధంచేసాడు. తరువాత జరిగిన బాహాబాహీ యుద్ధంలో కర్ణుడు జరాసంధుని ఓడించాడు. క ర్ణుడి పరాక్రమానికి మెచ్చిన జరాసంధుడు అతనికి మాలినీ నగరాన్ని బహూకరించాడు.

కర్ణుడి గొప్పతనానికి కలత చెందిన ఇంద్రుడు కపట బ్రాహ్మణ వేషం ధరించి కర్ణుడి కవచ కుండలాలను దానంగా అడిగి పట్టుకు వెళ్ళాడు. అర్జునుడు కర్ణుడిని వధించ గలగడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. కనుక ధర్మజా ! నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు. మొదట బ్రాహ్మణ శాపం, తరువాత పరశురాముడి శాపం, తరువాత ఇంద్రుడు కవచకుండలాలను పట్టుకు పోవడం, ఆ పై కుంతీదేవికి ఇచ్చిన వరం కారణంగా మీ నలుగురు అన్నదమ్ములను విడుచుట, భీష్ముడు కర్ణుడిని అర్ధ రథుడిగా ప్రకటించుట, తరువాత శల్యుడు తన ములుకుల వంటి మాటలతో కర్ణుడిని హింసించుట ఇన్ని తోడయ్యాయి కనుకనే అర్జునుడు కర్ణుడి ఓడించ గలిగాడు. ధర్మజా ! అది కాక అర్జునుడికి వరుణుడు, పరమశివుడు, ఇంద్రుడు, యముడు, ద్రోణుడు, కృపాచార్యుడు వీరంతా దివ్యాస్త్రాలను ప్రీతితో ఇచ్చారు. అందువలన అర్జునుడు కర్ణుడిని వధించాడు కాని, లేకున్న కర్ణుడిని జయించడం అర్జునికి వీలు కాని పని " అని నారదుడు పలికాడు.


నారదుడి మాటలను విని ధర్మరాజు తీవ్రమైన శోకంతో మరింత కలత చెందాడు. పక్కనే ఉన్న కుంతీదేవి ధర్మరాజును ఓదారుస్తూ " నేను కర్ణుడిని కలిసి అతడి జన్మ రహస్యం చెప్పి అతడిని మీ వైపు రమ్మని ఆహ్వానించినప్పుడు సూర్యభగవానుడు వచ్చి " కర్ణా కుంతి చెప్పింది నిజం " అని పలికాడు. అయినా కర్ణుడు సుయోధనుడిని వదిలి రావడానికి ఇచ్చగించ లేదు. అటువంటి కర్ణుడిని తలచుకుని ఇప్పుడు ఎందుకు బాధ పడుతున్నావు " అని పలకగా ధర్మరాజు తల్లిని ఏహ్యభావంతో చూసి " అమ్మా ! నీవు ఈ రహస్యాన్ని మా నుండి దాచినందు వలనే ఈ అనర్ధం జరిగింది కనుక నేటి నుండి స్త్రీలకు రహస్యం దాచే శక్తి క్షీణించును గాక " అని స్త్రీ జాతినంతా ధర్మరాజు శపించాడు. అయినా ధర్మరాజు మనసు కుదుట పడలేదు.


యుద్ధ పరణామాలకు విరక్తి చెందిన ధర్మరాజు " ఎవ్వరూ లేని ఈ రాజ్యం మనకెందుకు ఎక్కడికైనా వెళ్ళి భిక్షుక వృత్తి స్వీకరించి బ్రతుకు వెళ్ళబుచ్చుదాము. అప్పుడే నా మనస్సుకు శాంతి లభిస్తుంది. అర్జునా ! మనమంతా దాయాదులను చంపాము. అది మనలను మనం చంపుకోవడంతో సమానం కాదా ! ఎందుకీ క్షత్రియ ధర్మం, కాల్చనా ! వనములలో ఉండి అహింసావ్రతమును పాటిస్తూ బ్రతకడం ధర్మం కాదా ! అందుకని మనం తిరిగి వనములకు వెడదాము. రాజ్యం అనే ఈ మాంసం ముక్క కొరకు పశువుల మాదిరి కొట్టుకున్నాము, చంపుకున్నాము, వంశనాశనం చేసుకున్నాము. ఇప్పుడు ఇంతటి కుత్సిత బ్రతుకు బ్రతుకుతున్నాము. అర్జునా ! ఈ కురు సామ్రాజ్యమే కాదు. ముల్లోకాధిపత్యం ఇచ్చినా నా మనస్సు శాంతించదు. నాకీ రాజ్యం వద్దు మీరే ఏలుకొండి. మన పెద నాన్న పుత్రవ్యామోహంతో తన కుమారుడైన సుయోధనుడిని కట్టడి చేయ లేక పోయాడు. ఆ నీచుడి వలన వంశనాశనం అయింది. సుయోధనుడిని చంపి మనం మన కోపం తీర్చుకున్నాము కాని, నా మనసంతా శోకపరితప్తమైంది. నేను మాత్రం ఏమి చేశాను? రాజ్యకాంక్షతో యుద్ధానికి సిద్ధపడి పాపం చేసాను. ఈ హేయమైన యుద్ధం వలన లభించిన రాజ్యమును వదిలితే గాని నాకు మనశ్శాంతి లభించి మనసు పరిశుద్ధం కాదు. అందుకని నేను తపోవనానికి వెళ్ళి మునివృత్తి స్వీకరించి శేషజీవితం ఆనందంగా గడుపుతాను " అని ధర్మరాజు అన్నాడు.


ఆ మాటలకు అర్జునుడికి పట్టరాని కోపం వచ్చింది. అయినా తమాయించుకుని దానిని మనసులో దాచుకుని పైకి చిరునవ్వు నవ్వుతూ " అన్నయ్యా ! ఇలాంటి మాటలు ఎక్కడన్నా ఉన్నాయా ! ఎప్పుడైనా విన్నామా ! అరివీర భయంకరులమై శత్రువులను ఓడించి రాజ్యలక్ష్మిని చేపట్టాము. అది అంతా మరచి పోయి ఇప్పుడు ముని వృత్తి స్వీకరిస్తానని చెప్పుట తగునా ! మనం సుయోధనుడి మాదిరి అధర్మంగా రాజ్యం పొందలేదు. ధర్మబద్ధంగా రాజ్యాన్ని పొందాం. ధర్మబద్ధమైన రాజ్యమును పాలించకుండా వదలడం ధర్మమా ! అలాంటి వాడివి యుద్ధం చేసి ఇందరు రాజులను చంపడం ఎందుకు. ఇంత చేసి ఇప్పుడు రాజ్యాన్ని వదిలి ముని వృత్తిని స్వీకరిస్తానని చెప్పిన నిన్ను లోకం పిరికి వాడని నిందించదా ! మనం యుద్ధం వలన పొందిన పాపమును అశ్వమేధ యాగం చేసి పోగొట్టుకోవచ్చు. అంతే కాని క్షత్రియ ధర్మాన్ని వదిలి మునివృత్తి స్వీకరించుట అధర్మం కాదా ! అన్నీ ధర్మాలకు మూలమైన సంపద లేని నాడు చచ్చినవాడితో సమానం కాదా ! సంపదలు ఉంటే బంధువులు వారంతట వారే మన దగ్గరకు వస్తారు. సంపదలే మిత్రులను మనకు దరిచేరుస్తుంది. సంపద శౌర్యమూ, ధైర్యమూ, సద్బుద్ధీ కలుగజేస్తుంది. రాజ్యసంపద పురుషార్ధాలలో మేటి, అలాంటి రాజ్యసంపద మనకు ధర్మబద్ధంగా ప్రాప్తించింది. ఆ సంపదను అనుభవించడం మనధర్మం కాదా ! దేవతలు కూడా దాయాదులను చంపే అభివృద్ధిని సాధించారు. దాయాదులను, శత్రువులను చంపకుండా రాజ్య సంపద లభిస్తుందా ! వేదములు కూడా శత్రుసంహారం చేసి రాజ్యసంపద పొంది యజ్ఞ యాగాదులతో దేవతలను సంతోషపెట్టి చని పోయిన తరువాత ఉత్తమగతులు పొందడమే క్షత్రియ ధర్మం. మన పూర్వీకులైన దిలీపుడు, నృగుడు', అంబరీషుడు, సగరుడు, నహుషుడు, మాంధాత మొదలగు రాజులు ఈ ధర్మాన్నే అనుసరించి ఉత్తమగతులు పొందారు. ప్రస్తుతం నిన్ను వరించిన చక్రవర్తిపదవిని త్యజించుట న్యాయమా ! నీవు కూడా నీ పూర్వీకుల వలె యజ్ఞ యాగాదులు చేసి పునీతుడివి కాకపోతే నీకు పుణ్యం ఎలా లభిస్తుంది. అశ్వమేధయాగం చేసిన రాజులంతా పునీతులైయ్యారు " అని అర్జునుడు పలికాడు.


అర్జుడి మాటలు ధర్మరాజు ను స్వస్థుడిని చేయలేక పోయాయి. అతడు తన దుఃఖాన్ని వీడక " అర్జునా ! ఎందుకో నా మనసు రాజ్యపాలనకు అంగీకరించడం లేదు. ఈ లోకంలో తృప్తిని మించిన సంతోషం వేరొకటి లేదు. ఈ నిస్సారమైన సంసారం వీడి ఒంటరిగా అడవులకు వెళ్ళి అక్కడ ఉన్న తాపసుల పలుకులు వీనులవిందుగా వింటూ కాలం గడపడం ఎంత బాగుంటుంది. నిందను పొగడ్తను సమంగా స్వీకరిస్తూ కత్తితో పొడిచిన వాడిని మేనికి చందమును అలదిన వాడిని ఒకటిగా చూస్తూ మూగవాడిలా మౌనవ్రతం ఆచరిస్తూ పర్ణశాల నిర్మించుకుని ఎవరు ఏమిచ్చినా భగవత్ప్రసాదంగా స్వీకరించి తృప్తి చెందడం కంటే ఆనందం మరొకటి కలదా ! అలా కాకుండా కర్మమార్గంలో ప్రయాణిస్తే పాపం మూట కట్టుకోవడం తప్ప మనకు ఒరిగేది ఏముంది? కనుక నేను మోక్షమార్గముకు దూరం కాలేను. దేవుడి కృప వలన అమృత తుల్యమైన జ్ఞానం లభించింది. అదే శాశ్వతం, అదే మోక్షమార్గం, నేను దానిని వదులుకోలేను " అన్నాడు.


ఆ మాటలు విన్న భీమసేనుడు ధర్మరాజుతో " అన్నయ్యా ! నీవు కర్మయోగివి. శృతి విహితమైన కర్మలు ఆచరించకుండా జ్ఞానమార్గం అవలంబించడం న్యాయమా ! యుద్ధంలో అనేక మంది మరణాన్ని చూసి బంధుమిత్రులను పోగొట్టుకుని నీకీ విరక్తి, అసూయ వచ్చాయి. కాని ఈ వైరాగ్యం, ఈ కోపం, ఈ అసూయ యుద్ధానికి ముందు వచ్చి ఉంటే ఎంతో మంది రాజులు, బంధువులు, స్నేహితులూ ప్రాణాలు విడువక ఉండే వారు కదా. మేమూ రాజ్యం మీద ఆశ వదిలి మునివృత్తి స్వీకరించి ఉండేవాళ్ళం. ఈ మహాభారత యుద్ధం జరిగేదీ కాదు, ఇంత ప్రాణ నష్టం జరిగి వుండేదీ కాదు. ఆనాడు భీకర ప్రతిజ్ఞ చేసి యుద్ధంలో పాల్గొని అందరినీ చంపి ఇప్పుడు అడవులకు పోతాను అంటే విన్న వారు ఏమనుకుంటారు. నిన్ను హేళన చేయరా ! వెనుకటికి నీ లాంటి వాడొకడు కష్టపడి బావి తవ్వి చివరకు నీళ్ళు త్రాగ కుండా ఊరుకున్నాడట. ఎత్తైన చెట్టెక్కి శ్రమ పడి తేనెపట్టును కొట్టి తేనెను త్రాగక ఊరుకున్నాడట, విస్తరి నిండా మృష్టాన్నం వడ్డించే వరకు ఉండి తరువాత తినకుండా విడిచి వెళ్ళాడట. కోరి వచ్చిన వనితను విడిచి వెళ్ళాడట, నీ భుజ బలంతో పరాక్రమంతో శక్తియుక్తులతో రాజ్యలక్ష్మిని కైవశం చేసుకుని రాజ్యపాలన చేయకుండా అడవులకు పోతాను అనడం కూడా అటువంటిదే కదా ! అయినా నీకు అన్నీ తెలుసు. నీకు నేను చెప్పగలిగినది ఏమున్నది. నీవు అడవులకు పోతుంటే నీ వెనుక మేము నడుస్తుంటే లోకులు నవ్వుతూ " ఈ వెర్రి వాళ్ళు అడవులకు పోతాననే ధర్మరాజు ను ఆపకుండా ఆయన వెనుక వీళ్ళూ వెడుతున్నారు " అని హేళన చేయ్యరా ! నీవు అడవులకు పోయి నీ తమ్ములందరినీ రాజ్యభోగాలకు దూరం చేస్తావా ! ప్రజలను శోకసాగరంలో ముంచుతావా ! ధర్మరాజా ! కర్మ రాహిత్యమే మోక్షమార్గం అయితే అరణ్యంలోని చెట్లు కర్మలు చెయ్యవు కదా ! వాటికి మోక్షం రాలేదు కదా ! అన్నయ్యా కర్మలను త్యాగం చెయ్యడం కాదు కర్మలు ఆచరిస్తూ కర్మఫలాన్ని త్యాగం చెయ్యాలి, తాను చేసే కర్మలన్ని బ్రహ్మార్పణం అంటూ నిష్కామకర్మలో మునిగి తేలాలి. అప్పుడు తత్వజ్ఞానం కలిగి కర్మరాహిత్యమై మోక్షం లభిస్తుంది " అన్నాడు.

                  సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

మ్రొక్కులూ-త్రొక్కుళ్లు

 ఓం శ్రీ మాత్రేనమః

ఓం గురుభ్యోనమః


మ్రొక్కులూ-త్రొక్కుళ్లు

(హితోక్తి)

డా.రఘుపతి శాస్త్రుల


వైకుంఠైకాదశినా

డాకాంక్షను భక్తజనములా బాలాజిన్

శ్రీ కైవల్యము గోరుచు

ప్రాకటముగ గనుట నెంచ పాపమ్మగునే?

(కైవల్యము=మోక్షము)


భక్తజనమ్ముల గములను

యుక్తిగ గనిపెట్టి వారి ఉరుకులు పరుగుల్

రక్తిగ చూడక, ప్రోవగ

శక్తులు గల రక్షకుల కసాధ్యమె కావన్

(గములు=సమూహములు-ప్రోవగ=ఆదుకోవడానికి)


తిరుమల వేంకటేశ్వరుని తృప్తిగ గాంచగ గోరి ఆశతో

నరిగెడు వారి పట్టుదలనంతయు కేవల మర్థకాంక్షతో

సరిగని ప్రోవకుండుటది సత్కృతియే తగినట్లు వారికిన్

సరిపడ రక్షణమ్ముల విశాల మతిన్ సమకూర్చ లేరొకో?

(అర్థ కాంక్ష= డబ్బే ధ్యేయంగా -సత్కృతి=గౌరవము)


బలగము లనునవి ప్రాణ

మ్ములను బలిగ గొనుటకో?సమున్నత గతులన్

పలువిధములుగా బ్రోవన్

తలపడి రక్షించు కొఱకొ? తలపగ వలయున్

(బలగములు=రక్షకభటులు)


అధికారుల గణములకును

ముదముగ నాయకుల సేవ మోదము నందన్

సదమల గతిసేయుటకై

మదిదలచిన, పేదజనుల మనుగడ ఎటులౌ?

(మనుగడ=బ్రతకడం)

చులకన

 🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏 🏵️ *నేటి సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట..ఒకరి జీవితం ఇంకొకరికి చులకన..ఒక్కరి బాధ ఇంకొకరికి బరువు..ఒకరి పరువు ఇంకొకరికి అవకాశం..ఒకరి బలహీనత ఇంకొకరికి బలం* 🏵️ఎదుటి వారిలో మంచిని చూడకపోవడం వారిలో మంచి తనం లేకపోవడాన్నే సూచిస్తుంది.. మేలు కోరేవాడు నిన్ను ప్రశ్నిస్తాడు.. కీడు చేసేవాడు నిన్ను ప్రశంసిస్తాడు..నిజాయితీ పరుడుని నమ్మితే ప్రగతి...మడత నాలుక ఉన్న వాడిని నమ్మితే జీవితం అధోగతి 🏵️కష్టాలను, నష్టాలను చూసి అధైర్యపడవద్దు.. మన లక్ష్యాన్ని అందుకునేందుకు ముందుకు సాగుదాం.. ఒక చెట్టు ఆకులను కోల్పోతుంది.. మరలా కొత్త ఆకులను చిగురిస్తుంది.. అందమైన దృశ్యాన్నిస్తుంది..కఠినమైన పరిస్థితుల్లో మనిషికి అండగా నిలిచేది విశ్వాసం మాత్రమే.. అందమైన చిరునవ్వు నవ్వి చెవిలో నెమ్మదిగా చెప్తుంది..ఏం పర్లేదు.. అంతా మంచే జరుగుతుంది🏵️🏵️మీ *అల్లం రాజు రాజుభాస్కరరావు . శ్రీ విజయ ఆయుర్వేదిక్& g జనరల్ ఏజన్సీస్.D.N.29-2-3. గోకవరం బస్టాండ్ దగ్గర. స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం .మందులు అయిపోయిన వారు రాలేను వారికి కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును* 9440893593.9182075510🙏🙏🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం  -చతుర్థి - మఘా -‌‌ భృగు వాసరే* (17.01.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*