25, నవంబర్ 2020, బుధవారం

కార్తీక పౌర్ణమి.

 కార్తీక పౌర్ణమి... 29-11-2020 ఆదివారం రోజు ననా ? లేక? 30-11-2020 సోమవారం రోజా అని చాలా మంది తెలియక అడుగుతున్న ప్రశ్న...... 


శ్లో.ఉదయస్థా తిథిర్యాహి

నభవేద్దిన మధ్యగా!

సా ఖండా న ప్రధానాస్యాత్ 

వ్రతారంభే సమాపనే!!


సూర్యోదయము మొదలు మధ్యాహ్నకాలము వరకునున్న తిథి, నక్షత్రంబులను ఆఖండంబులనియు - ఇవి వ్రతారంభ, ఉద్యాపనములకు యోగ్యమైనవి..... 


సమాధానం:- శాస్త్ర ప్రకారం

కార్తీక పౌర్ణమి నాడు  స్నానం చేసి అనంతరం ఉపవాసానికి సంకల్పం చేసి  సాయంత్రం విశేషించి (365 వొత్తుల) దీపారాధనలు చేయాలి.... 

అలా చేయాలంటే  ఆదివారం సాయంత్రం దీపారాధనలు చేసేవేళలో పౌర్ణమి ఉన్నా...

ఉదయం వేళ సంకల్పానికి పౌర్ణమి లేదు కనుక ఉపవాసానికి ఆదివారం పనికి రాదు.... 

ఉపవాసం లేకుండా సాయంత్రం విశేష దీపారాధనలు, పూజలు ఫలాన్ని ఇవ్వవు.... 

స్నానాలకి, దానాలకి, ఉపవాసానికి, సాయంత్రం (365 వొత్తుల) దీపారాధనలకి సోమవారం నాడే చేయవలెననేది సశాస్త్రీయమైన నిర్ణయం... 

ఇతిశం.....

🙏💖🌷


దేవాలయాలలో జ్వాలాతోరణం ఇత్యాదులు ఆదివారం 29/11 / 2020... ధన్యవాదములు!!

మారేడుగోప్పతనం

 మారేడుగోప్పతనం


లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను *శ్రీఫలము* అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.


మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి, దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. 


మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది. 

ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది. అందుకే


త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం!


త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!


అని తలుస్తాము.


దళములు దళములుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు. ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది.


అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు, తొమ్మిది కూడా ఉంటాయి. 


పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. 


కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. 


మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు.అందులో మారేడు దళము ఒకటి.


మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది.

అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు  ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నా, మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు. 


శివుడిని మారేడు దళంతో పూజ చేయగనే ఈశ్వరుడు *త్రియాయుషం* అంటాడట.


‘బాల్యం, యౌవనం, కౌమారం 

ఈ మూడింటిని నీవు చూస్తావు’ 

అని ఆశీర్వదిస్తాడుట.


కాబట్టి


ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది.


శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు.


మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే..జ్ఞానం సిద్ధిస్తుంది.


ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి *శ్రీసూక్తం* లో

*అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే*

(అమ్మా అలక్ష్మిని= దరిద్రమును పోగొట్టెదవుగాక) అని చెప్తాము.


మనిషికి మూడు గుణములు, 

మూడు అవస్థలు ఉంటాయి.

నాల్గవదానిలోకి వెళ్ళడు. 

నాల్గవది తురీయము.


*తురీయమే జ్ఞానావస్థ*


అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.


*మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే*  


ఇంట్లో మారేడు చెట్టు ఉంటే..


ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా.. అపారమయిన సిద్ధి కలుగుతుంది.

యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి ..పీట వేసి .. ఆయనను అక్కడ కూర్చోపెట్టి ..భోజనం పెడితే ..అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.


శాస్త్రము మనకు లఘువులు నేర్పింది.


మారేడు చెట్టు అంత గొప్పది.


మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.


అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది.


‘మా-రేడు’ తెలుగులో 

రాజు ప్రకృతి, 

రేడు వికృతి.


*మారేడు అంటే మా రాజు*. 

ఆ చెట్టు పరిపాలకురాలు.

అన్నిటినీ ఇవ్వగలదు.

ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు.

అది పువ్వు పూయవలసిన అవసరం లేదు.


ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా..మారేడు 

పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.


అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.


అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా ..మీ జీవితమును పండించుకోవడానికి, మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలోచెప్పబడ్డాయి.అందులో


మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం,


రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట,


మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట.


ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.◆◆◆

ధార్మికగీత - 91*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                            *ధార్మికగీత - 91*

                                      *****

           *శ్లో:- విద్యా న శోభతే పుంసః ౹*

                  *యది న స్యాత్ రసజ్ఞతా ౹*  

                  *లవణేన   వినా    శాకాః  ౹*

                  *సుపక్వా   అపి  నిష్ఫలా:  !!* 

                                      *****

*భా:-సమాజంలో  నేడు విద్యార్జనా మార్గాలు, మాధ్యమాలు, వనరులు విస్తారంగా అభివృద్ధి చెందాయి. అక్షరాస్యులు, విద్యాధికులు,వివిధ శాస్త్ర పరిశోధనా కుశలురు, విద్యా నిపుణులు  కాలానుగుణంగా పెరిగారు. ఉన్నతస్థానాలను అలంకరిస్తున్నారు. అభినందనీయమే.  మనిషి ఎన్ని విద్యలను గడించినా, ఆ  విద్య ఆధారంగా ఉన్నత  పదవులు చేపట్టి, కొన్ని కోట్లు గడించినా అతనిలో "రసజ్ఞత" అనే సుగుణం లోపిస్తే ఆ విద్యకు విలువ గాని, రాణింపు గాని ఉండవు. సభ్య సమాజంలో ప్రేమాదరాభిమానాలు చూరగొనలేడు. వాసనలేని పూవువలె నిరూపయోగంగా ఉండిపోతాడు. ఎలా? పసందైన      విందు కోసం  అన్నము, కూరలు వండి సిద్ధం చేశారు.  నలభీమపాకమని అందరూ ప్రశంసించారు. తీరా చూస్తే కూరల్లో   ఉప్పు వేయడం మరచిపోయారు. ఇక రుచేముంటుంది?  అందరూ పెదవి విరిచారు. చప్పబడి పోయారు. ఉప్పు లేని కూరల్లాగానే, మంచి చెడు గ్రహింపజాలని ఇంగితజ్ఞానం లేని చదువు కూడా నిష్ఫలమని సారాంశము.అందుకే "రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు" అని తీర్మానించాడు భాస్కర శతక కర్త,*. 

                                   *****

                    *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము



అంత సాధువు ,తన యల్లుడనుసరించ 

సకల సంబారములతోడ సరకు తోడ 

సాగి నావను పయనించి సాగరమున 

చేరె రత్నసానుపురంబు క్షేమముగను 74



రత్నసానుపురపు రమణీయ వీధుల 

వర్తకంబు జేసి వాసికెక్కి 

సరకులన్ని యమ్మి సమకూర్చి ధనమును 

సాదు వెంతొ మిగుల సంతసించె 75



తదుపరి సాధువు ధనమున

కదలియు నికటంబులోని కడుయందంబౌ 

సదమలనగరము నందున 

సదనంబొకదానియందు సౌఖ్యత నుండెన్ 76


సాధు వల్లునితోడను సంపదలతొ

చంద్రకేతుమహారాజు యింద్రుపగిది 

పాలనముసేయుచుండెడి పట్నమందు 

వసతి పొందియు నొకయింట వాస ముండె 77


వ్రతమును చేయగ మఱచియు 

సతతము వ్యాపారమందె సాధువు యుండన్ 

యతికుపితు డైన శ్రీహరి 

సతతము వెతలందు మునుగ శాపంబిచ్చెన్ 78


సాధు వత్యంత నిర్లక్ష్య సరళి తోడ 

"సత్యనారాయణస్వామి సద్వ్రతంబు”

మఱచి చేయక నుండుట మదిని దలచి 

స్వామి యత్యంత కుపితుడై శాపమిచ్చె 79


తనదు వ్రతమును మఱచియు ధైర్యమునను 

సంచరించెడి వ్యాపారి సాధువునకు 

" దారుణంబైన దుఃఖంబు దక్కు గాక "

యనుచు శాపంబు నిచ్చెను యాగ్రహమున 80


                                సశేషము …..


✍️ గోపాలుని మధుసూదన రావు 🙏

ఉత్థాన ఏకాదశి*_

 _*రేపు కార్తీక శుద్ధ ఏకాదశి - భోదన ఏకాదశి - ఉత్థాన ఏకాదశి*_




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️




*కార్తీక శుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి , దేవ - ప్రబోధిని ఏకాదశి , ఉత్థాన ఏకాదశి అని పేర్లు.* ఆషాడ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశిగా అయ్యింది. దీనినే హరి - భోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి , అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈరోజునే జన్మించారు.

ఈ రోజున ఉపవాసం ఉండి , విష్ణువును పూజించి , రాత్రి జాగరన చేసి , మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి , పారణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి.  ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి బ్రహ్మదేవునికి నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది. *"ఈ ఏకాదశి పాపాలను హరిస్తుంది. 1000 అశ్వమేధ యాగాలు , 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని ఒక చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగ ఒక జీవుడు , తన వేలజన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈ రోజు మనం చిన్న మంచిపని (పుణ్యకార్యం) చేసినా , అది మేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుంది.


*ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవు. ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం , సంపదలు , ఉన్నతస్థానం కలగడంతో పాటు పాపపరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు , యజ్ఞయాగాలు , వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల పుణ్యం ఒక్కసారైన ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుంది"* అని బ్రహ్మదేవుడు నారదునితో పలుకుతాడు.

ఇంకా ఈ వ్రతంలో ఒకరికి చేసే అన్నదానం వలన సూర్యగ్రహణసమయంలో పవిత్ర గంగాతీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లబిస్తుంది. వస్త్రదానం చేయడం వలన , పండ్లు , దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇవ్వడం వలన ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి.

ఈ రోజున బ్రహ్మాది దేవతలు , యక్షులు , కిన్నెరులు , కింపురుషులు , మహర్షులు , సిద్దులు , యోగులు అందరూ విష్ణులోకం చేరి కీర్తనలతోనూ , భజనలతోనూ , హారతులతోనూ శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల *ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని ధార్మిక గ్రంధాలు చెప్తున్నాయి.* అందువల్ల అందరు విష్ణుమూర్తికి హరతి ఇవ్వండి. ఏవైనా కారణాల వల్ల హారతి ఇవ్వడం కుదరకపోతే దేవాలయానికి వెళ్ళండి. అక్కడ స్వామికి ఇచ్చె హారతిని కన్నులారా చూడండి , వీలైతే స్వామికి హారతి కర్పూరం సమర్పించండి. అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది. స్వామి అనుగ్రహం కలుగుతుంది.



*ఏకాదశి ముఖ్యమైన సమయాలు*


సూర్యోదయం నవంబర్ 25, 2020 6:51 ఉదయం

సూర్యాస్తమయం నవంబర్ 25, 2020 5:36 అపరాహ్నం

ద్వాదాషి ముగింపు క్షణం నవంబర్ 27, 2020 7:46 ఉదయం

ఏకాదశి తిథి ప్రారంభమైంది నవంబర్ 25, 2020 2:42 ఉద

ఏకాదశి తిథి ముగుస్తుంది నవంబర్ 26, 2020 5:10 ఉదయం

హరి వసారా ముగింపు క్షణం నవంబర్ 26, 2020 11:49 ఉదయం

పరానా సమయం నవంబర్ 26, 1:18 PM - నవంబర్ 26, 3:27 అపరాహ్నం





_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_




9849100044

24, నవంబర్ 2020, మంగళవారం

రక్తం వృద్ది చెందుటకు

 శరీరం నందు రక్తం వృద్ది చెందుటకు సులభయోగాలు  - 


 *  ఉల్లిపాయ , ఉసిరికాయలను సమభాగాలుగా నూరి రసము తీసి ఆ రసము సేవించిన శరీరం నందు రక్తం వృద్ది చెందును. 


 *  టమాటో రసం నందు తేనే కలిపి త్రాగిన రక్తశుద్ధి జరుగును మరియు రక్తం వృద్ది చెందును 


 *  ప్రతిరోజు పడుకునే ముందు వేడిపాలు పావుసేరు తాగుతున్న రక్తంవృద్ది అగును . 


 *  పటికబెల్లం , లొహాభస్మం , పిప్పిల్లు వీటిని సమపాళ్లలో తీసుకుని పొడిచేసి పూటకు పావుతులము పొడిని నేతిలో కలుపుకుని తినుచున్న రక్తం వృద్ది అగును.


 నేను ప్రయోగించిన సిద్ధయోగం  - 


        ఒక స్పూన్ గోధుమ గడ్డి చూర్ణాన్ని ఒక గ్లాస్ తియ్యటి దానిమ్మ రసము నందు గాని ఆపిల్ రసము నందు గాని కలిపి ఉదయం మరియు రాత్రి ఆహారానికి గంట ముందు ఇచ్చినచో 40 రోజులలో శరీరము నందు రక్తం బాగా వృద్ధి అగును. ఈ యోగాన్ని నేను చాలామంది రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఇచ్చాను. చాలా అద్భుతంగా పనిచేసింది. 


                ఇది నా అనుభవ యోగం 


   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

రియల్ స్టోరీ.

 #రియల్ స్టోరీ...


(హృదయాన్ని హత్తుకుంటుంది)


* మహారాష్ట్ర బుల్ఢానా జిల్లాలో.. ఒక చిన్న కుగ్రామం. 65 ఏళ్ల లతమ్మ (లతా భగవాన్ ఖరే) తన భర్త, ముగ్గురు ఆడపిల్లలతో జీవనం సాగిస్తుంది.


* ఆ దంపతులు ముగ్గురి ఆడపిల్లకి పెళ్లిళ్లు చేశారు. ఆ పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు మిగిలాయి. కాయ కష్టం చేసి ఋణ విముక్తులు కావటానికి వారిరువు శ్రమిస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో భర్త అనారోగ్యం పాలయ్యాడు.


*  స్థానికంగా అందుబాటులో ఉన్న మెడికల్ ప్రాక్టిషనర్ ఏదో ఇన్ఫెక్షన్ సోకిందని పట్టణంలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నాడు. లతమ్మ నెత్తిన పిడుగు పడ్డట్టు అయ్యింది. పెద్దాసుపత్రి అంటే డబ్బులు కావాలి. చేతిలో చిల్లిగవ్వ లేని స్థితి. లతమ్మకి ఏమి చెయ్యాలో పాలుపోలేదు. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి భర్తను తీసుకువెళ్లింది. రెండు రోజులు అక్కడే ఉంచింది. భర్త నడవలేని స్థితికి వచ్చాడు. ప్రభుత్వ అసుపత్రిలో సరైన సదుపాయాలు లేవు. రోగ నిర్ధారణకి కీలకమయిన పరీక్షలు చేయాల్సి వచ్చింది. బారామతి లోని 'టెర్మినల్ హాస్పిటల్' కి వెళ్ళి కీలకమయిన టెస్ట్లు చేయించడం అత్యవసరం అని చెప్పారు.


* లతమ్మకి దుఖం ఒక్కటే మిగిలింది. తన దౌర్భాగ్యానికి బాధ పడింది. భర్త పరిస్థితి పూట., పూటకి దిగజారి పోతూవుంది. తన భర్త తన చేతుల్లో చనిపోవటం.. అనే ఆలోచన ఆమెని కుదిపేసింది. నిస్సాహాయంగా రోదించింది.. మౌనంగా ఉండటానికి కానీ, మొహమాట పడటానికి కానీ.. ఇది సమయం కాదని ఆమె గ్రహించింది. వెంటనే చుట్టు పక్కల వారిని, బంధు మిత్రులని కొంగు చాచి సాయం అడిగింది. మనసున్న మారాజులు అందించిన కొద్దిపాటి సాయంతో భర్తని బారామతి హాస్పిటల్ కి తీసుకెళ్లింది.


* అక్కడి డాక్టర్లు అతన్ని చెక్ అప్ కి రిఫర్ చేశారు. 

వరండాలో ఆమె దీనంగా కూర్చుని ఉంది. తన ఇంటి దీపాన్ని ఆర్పవద్దని.. కనబడని దేవుళ్లందరికి మొక్కుతూ ఉంది. కానీ తలచినది జరిగితే విధి గొప్పతనం ఏముంది? ఆ టెస్ట్ లు చాల్లేదు. MRI చేయించాలి. మరి కొన్ని ఖరీదైన పరీక్షలు చేయిస్తే కానీ.. జబ్బు నిర్ధారణ చెయ్యలేమని తేల్చి చెప్పేశారు. లతమ్మ ఏడుపు ఆపుకోలేకపోయింది. తన మాంగల్యం తన కళ్ల ముందే దూరం అవుతుందని ఏడ్చింది. చేతిలో పైసా లేదు. ఇంకా ఖరీదైన పరీక్షలు అంటూ.. రోధిస్తుంది. ఆమె కన్నీళ్లు..  ఆమె మాట వినడం లేదు. బోరున ఏడువ సాగింది.

ఆ రాత్రి ఆసుపత్రి వరండాలో పడుకుండిపోయారు.


 భర్త ఆకలిగా ఉందన్నాడు. ఆమె ఆసుపత్రి బయటకి వచ్చి..  రెండు సమోసాలు తీసుకొచ్చి.. భర్తకి ఇచ్చింది. నేను తిన్నాను.. నువ్వు తినేయ్ అంది. సమోసా చుట్టిన కాగితం పారవేస్తూ.. మరాఠీలో పెద్ద అక్షరాలతో ఉన్న ప్రకటన చూసింది. . “బారామతి మారథాన్ గెలవండి. 3000 వేలు నగదు పొందండి. అనే ప్రకటన చదివింది. ఆమె మనసులో అనేక ఆలోచనలు.. రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచనలతో సతమతమయ్యింది. ఒక నిర్ణయానికి వచ్చింది.


* 19-12-2013న బారామతి మారథాన్  మొదలవబోతూ ఉంది. పోటీదారులందరూ స్పొర్ట్స్ బట్టలు, బూట్లు కట్టుకుని సిద్దంగా ఉన్నారు. 

9 గజాల నేత చీర కట్టుకుని.. కాళ్ళకి కనీసం చెప్పులు కూడా లేకుండా.. తడి కళ్లతో నిలబడ్డ 65 ఏళ్ల లతమ్మ పోటీలో పోల్గొనటానికి అనుమతి అడిగింది. అందరూ ఆమెని పిచ్చి దానిలా చూశారు . ఆమెని పోటీకి అంగీకరించలేదు. కానీ.. ఆమె పట్టు విడవలేదు. వాళ్ళతో వాదించింది. ప్రాదేయపడింది. బ్రతిమాలింది. 


చివరికి బరిలో దిగింది. పోటీ మొదలయ్యింది. లతమ్మ చీర నుండి కాళ్ళు బయటకి లాగింది.. ఉడుములా పరిగెత్త సాగింది. ఆమెకి తన వయసుగాని.. కాళ్ళకి గుచ్చుకుంటున్న రాళ్ళు కానీ.. ఎర్రటి ఎండ కానీ.. తెలియలేదు. తనకు తెలిసిందల్లా.. గెలవాలి మూడు వేలు తీసుకోవాలి భర్తకి టెస్టులు చేయించాలి.. సరైన వైద్యం చేయించాలి. తన భర్త బతకాలి.. తనకి జీవితాంతం తోడు ఉండాలి.. అదే లక్షం.. అదే వేగం.. అదే పరుగు.. అదే విజయం. బారామతి మారథాన్ ఒక చరిత్ర .. బారామతి ప్రజలకి ఒక గొప్ప అదృష్టం. 

ప్రజలు చప్పట్లు మధ్య ఆమె మారథాన్ నెగ్గింది.


* నిర్వాహకులు ఆమె కన్నీటి గాధ విని చలించిపోయారు. సీనియర్ సిటిజన్ విభాగంలో ప్రైజ్ మనీ ని రూ.5 వేలుగా చేసి అందించారు. ఆ డబ్బుతో ఆమె ఆసుపత్రికి పరిగెట్టింది.


* ఆమె ప్రేమ ఊరికేపోలేదు. ఆమె లక్ష్యం ముందు సమస్య చిన్న బోయింది. భర్తకి మెరుగైన వైద్యం అందింది. అన్నీ పత్రికలు, ఛానల్స్  లతమ్మ గురించి గొప్పగా వ్రాసాయి.. చూపించాయి. దేశం నలుమూల నుండి ప్రశంశలు వెల్లువెత్తాయి. నెల తిరిగే సరికి ఆమె జీవితం మారిపోయింది. 


ఎవరో తెలియని వ్యక్తుల నుండి ఆమె బాంకు ఖాతాకి 1,75,000 పైగా పొగయ్యాయి. ఆ కుటుంబం అన్నీ విధాలా గట్టెక్కింది. అసాధ్యాన్ని పట్టుదలతో సుసాద్యం చేసిన 'లతా భగవాన్ ఖరే' ఎందరికో ఆదర్శమయ్యింది.......💐💐

One question

 

అమ్మవారు

                          
























 

స్వామి

 

Health mantra

 

నేనే చేస్తున్నాను

 నేనే చేస్తున్నాను


ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటూనే ఉంటాయి. కానీ నీవు నిరంతరం అవి నేనే చేస్తున్నాను అనే భ్రాంతిలో ఉంటావు. కడుపుకు ఆకలి వేస్తుంది. కానీ నీవు నాకు ఆకలి వేస్తోంది అని అంటావు. ప్రతి ఇంద్రియానికి మనల్ని మనం జోడించుకుంటాము. ఈ జోడింపుని విడదీయాలి. విడదీయాలి అంటే, నిరంతరం ఎటువంటి పనుల వెనుక నీవు, "నేను" అని అంటూ ఉంటావో, దాని వెనుక దానికి సంబంధించిన ఏ ఇంద్రియం పనిచేస్తూ ఉంటుందో, దాని ఎరుక కలిగి ఉండాలి. తిరిగి తిరిగి కాళ్ళు అలసిపోయాయి ఆనాలి. ఈ మాట అనుభవం పొందిన తరువాతే తెలుస్తుంది. నేను అలసిపోయాను అని అనడం కన్నా, కాళ్ళు అలసిపోయాయి అని అనడం యొక్క ప్రభావం చిత్తం మీద వేరేగా ఉంటుంది. ఇంద్రియాల నుండి కొంచెం దూరంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. మనం కర్త కాదని తెలుసుకోవాలి.




మనం చేసే అన్ని కర్మలు పరమాత్మకి సమర్పించాలి అనుకుంటాము. కానీ విజయాలు "నేను"కి సమర్పించి, ఓటములు పరమాత్మకి సమర్పిస్తాము. మనం సమర్పణలో కూడా ఎంపిక ప్రదర్శిస్తాము.




కర్మ నిర్మించబడాలి అంటే మమత్వం కావాలి. "నేను" అనేది అహం ఐతే, "నాది" అనేది మమత్వం. "నాది" లేకుండా "నేను" ఉండడం కష్టం. మమత్వం పోతే కర్మ ఆగిపోయి, ఊర్ద్వయాత్ర ప్రారంభమౌతుంది. కానీ మమత్వం చాలా దట్టమైనది. ధనంలో, పదవిలో, ఆఖరికి త్యాగంలో, జ్ఞానంలో కూడా మమత్వం ఉంటుంది. ఎవరు పరమాత్మకి తమ గతం, భవిష్యత్తు సమర్పించుకోగలరో, వారే వర్తమానం లో జీవించగలరు.

గోవు

 

చిట్క

 

old is