ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
27, జనవరి 2021, బుధవారం
26, జనవరి 2021, మంగళవారం
మన మహర్షులు- 5
మన మహర్షులు- 5
*అష్టావక్ర మహర్షి*
🍁🍁🍁🍁
గొప్ప ఋషులలో ఒకరే ఈ అష్టావక్రుడు.
తల్లి కడుపులో ఉండగానే ఎన్నో శాస్త్రాలను అలవోకగా నేర్చేసుకున్న మహా జ్ఞాని.
జనక మహారాజుకు, యాజ్ఞవల్కుడికి ఈయన గురువు.
అష్టావక్రుడు కడుపులో ఉండగానే అష్ట వంకరలతో పుడతావనే శాపాన్ని పొందాడు. ఆ శాపాన్ని ఇచ్చింది కూడా ఎవరో కాదు అతని తండ్రి ఏకపాదుడే.
అలాంటి మహర్షికి స్వయానా శ్రీకృష్ణుడే అంత్యక్రియలు చేసాడంటే అతని జన్మ ఎంత గొప్పదో మనకి తెలుస్తోంది కదా.
వివరాల్లోకి వెళితే ఒకప్పుడు ఏకపాదుడనే గొప్ప తపస్వి ఒకరు ఉండేవారు. ఆయన భార్య పేరు సుజాత. ఆతను వేదవేదాంగాలు తెలిసినవాడు కావటంవల్ల ఎంతోమంది శిష్యులు అతని దగ్గర వేదాలు నేర్చుకుంటూ ఉండేవారు.
కొన్నాళ్ళకు గర్భవతి అయింది సుజాత. కడుపులో ఉన్న బాబు తండ్రి తన శిష్యులకు చెప్పే శాస్త్రాలను వింటూ ఉండేవాడు.
ఒకరోజు తండ్రి చెప్పే అభ్యాసంలో తప్పు దొర్లటంతో ఆగలేక, నాన్నగారు మీరు తప్పు చెప్తున్నారు, ఇలా చెప్పాలి అని ఎలా చెప్పాలో కూడా వివరిస్తాడు. దానితో ఆగ్రహించిన తండ్రి ఇప్పుడే ఇలా ఉంటే పుట్టాకా ఇంకా ఎన్ని తప్పులు ఎంచుతావో అని కోపగించి నువ్వు అష్ట వంకరలతో పుట్టుగాక అని శపిస్తాడు.
ఒకసారి ఏకపాదుడు ధనం కోసం జనకుడి దగ్గరకి వెళ్ళే సమయానికి అక్కడ వరుణుని కొడుకైన వంది ఉంటాడు. వంది నాతో వాదించి గెలిస్తే నీకు ఏది కావాలన్నా ఇస్తాను. ఓడిపోతే మాత్రం జలదిగ్బంధం చేస్తాను అని అంటాడు.
ఏకపాదుడు వందితో వాదించి ఓడిపోయి బందీ అయిపోతాడు.
తన తండ్రి గురించి తెలుసుకున్నఅష్టావక్రుడు జనకుని కొలువుకి వెళ్లి వందిని ఓడించి తన తండ్రిని విడిపించుకుని వస్తాడు.
ఆ ఆనందంలో తండ్రి అతనిని అందంగా మారేలా వరమిస్తాడు.
అలా అందంగా మారిన అష్టావక్రుడు సదాన్య మహర్షి కూతురు సుప్రభను వివాహం చేసుకుంటాడు.
అష్టావక్రునికి సంతానం కలిగాక తపస్సు చేసుకోవటానికి అడవులకు వెళ్ళిపోతాడు.
అతని దగ్గరకి రంభ మొదలైన అప్సరసలు వచ్చి నాట్యం చేస్తారు. వారి నాట్యం చూసిన అష్టావక్రుడు ఏమి వరం కావాలో కోరుకోమంటాడు. అందుకు వాళ్ళు విష్ణుమూర్తిని పొందాలన్న తమ కోరిక తీరేలా చూడమని అడుగుతారు. అందుకు అష్టావక్రుడు ద్వాపర యుగంలో విష్ణుమూర్తి కృష్ణావతారం ఎత్తినపుడు మీ కోరిక తీరుతుంది అని వరమిస్తాడు. ఆ అప్సరసలే ద్వాపరయుగంలో పుట్టిన గోపికలు.
అంతేకాదు గంగను భూలోకానికి తేవాలనుకున్న భగీరథుడు చాలా బలహీనంగా ఉండేవాడు. అతనిని బలంగా ఉండేలా చేసి గంగను భూలోకానికి తేవటంలో సహాయం చేసింది కూడా ఈ అష్టావక్ర మహర్షే.
ఆయన జనకమహారాజుతో చేసిన వేదాంత చర్చయే “అష్టావక్రసంహిత”. ఈ పుస్తకం ఇరవై అధ్యాయములతో అనేక విషయాలు కలది. శాంతి, ఆత్మజ్ఞానం, జీవన్ముక్తులపై ఎన్నో వివరములుగల పుస్తకం. ప్రతి ఒక్కరూ చదవదగినది.
తరువాత అష్టావక్రుడు మనస్సును పరమాత్మయందు లయం చేసి, శ్రీకృష్ణుని దర్శించి ఆయన పాదముల వద్ద దేహత్యాగం చేశారు.
అతనికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే అంత్యక్రియలు చేసాడు.
ఇలా జన్మను విడిచిన అష్టావక్రుడు వైకుంఠానికి వెళ్లి మోక్షాన్ని పొందుతాడు.
🍁🍁🍁🍁
తెలుగు సంవత్సరాలు .
------------ తెలుగు సంవత్సరాలు .
-------------------------------------------------------------
1927, 1987, 2047, 2107 : ప్రభవ
1928, 1988, 2048, 2108 : విభవ
1929, 1989, 2049, 2109 : శుక్ల
1930, 1990, 2050, 2110 : ప్రమోదూత
1931, 1991, 2051, 2111 : ప్రజోత్పత్తి
1932, 1992, 2052, 2112 : అంగీరస
1933, 1993, 2053, 2113 : శ్రీముఖ
1934, 1994, 2054, 2114 : భావ
1935, 1995, 2055, 2115 : యువ
1936, 1996, 2056, 2116 : ధాత
1937, 1997, 2057, 2117 : ఈశ్వర
1938, 1998, 2058, 2118 : బహుధాన్య
1939, 1999, 2059, 2119 : ప్రమాది
1940, 2000, 2060, 2120 : విక్రమ
1941, 2001, 2061, 2121 : వృష
1942, 2002, 2062, 2122 : చిత్రభాను
1943, 2003, 2063, 2123 : స్వభాను
1944, 2004, 2064, 2124 : తారణ
1945, 2005, 2065, 2125 : పార్థివ
1946, 2006, 2066, 216 : వ్యయ
1947, 2007, 2067, 2127 : సర్వజిత్
1948, 2008, 2068, 2128 : సర్వదారి
1949, 2009, 2069, 2129 : విరోది
1950, 2010, 2070, 2130 : వికృతి
1951, 2011, 2071, 2131 : ఖర
1952, 2012, 2072, 2132 : నందన
1953, 2013, 2073, 2133 : విజయ
1954, 2014, 2074, 2134 : జయ
1955, 2015, 2075, 2135 : మన్మద
1956, 2016, 2076, 2136 : దుర్ముఖి
1957, 2017, 2077, 2137 : హేవిళంబి
1958, 2018, 2078, 2138 : విళంబి
1959, 2019, 2079, 2139 : వికారి
1960, 2020, 2080, 2140 : శార్వరి
1961, 2021, 2081, 2141 : ప్లవ
1962, 2022, 2082, 2142 : శుభకృత్
1963, 2023, 2083, 2143 : శోభకృత్
1964, 2024, 2084, 2144 : క్రోది
1965, 2025, 2085, 2145 : విశ్వావసు
1966, 2026, 2086, 2146 : పరాభవ
1967, 2027, 2087, 2147 : ప్లవంగ
1968, 2028, 2088, 2148 : కీలక
1969, 2029, 2089, 2149 : సౌమ్య
1970, 2030, 2090, 2150 : సాధారణ
1971, 2031, 2091, 2151 : విరోదికృత్
1972, 2032, 2092, 2152 : పరీదావి
1973, 2033, 2093, 2153 : ప్రమాది
1974, 2034, 2094, 2154 : ఆనంద
1975, 2035, 2095, 2155 : రాక్షస
1976, 2036, 2096, 2156 : నల
1977, 2037, 2097, 2157 : పింగళ
1978, 2038, 2098, 2158 : కాళయుక్తి
1979, 2039, 2099, 2159 : సిద్దార్థి
1980, 2040, 2100, 2160 : రౌద్రి
1981, 2041, 2101, 2161 : దుర్మతి
1982, 2042, 2102, 2162 : దుందుభి
1983, 2043, 2103, 2163 : రుదిరోద్గారి
1984, 2044, 2104, 2164 : రక్తాక్షి
1985, 2045, 2105, 2165 : క్రోదన
1986, 2046, 2106, 2166 : అక్షయ
----------------------------------------------------------
మీ బంధుమిత్రులకు కూడా పంపండి.
🙏 🙏
మన మహర్షులు - 4*
*మన మహర్షులు - 4*
*అరుణి మహర్షి*
🍁🍁🍁🍁
పూర్వకాలమున అరుణుడను పేరు గల ముని ఉండెడి వాడు.ఆయనకు అరుణి యను పేరు గల కుమారుడు గలడు.అరుణి చిన్నతనమునుండి తపస్సాధనలో ఉండేవాడు.ఈతడు సర్వ గుణ శోభితుడు, మౌనవ్రతుడు.
బ్రహ్మతేజస్వి .
దేవికా నదీతీరాన ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేస్తూ ఉండేవాడు.
అరుణి మహర్షి భారతీయ చింతనకు ఒక రూపునిచ్చిన తత్వవేత్తలలో ప్రముఖుడు.
వేదాంతాలకు చిహ్నాలు అనదగిన మన ఉపనిషత్తులలో ఈ అరుణి మహర్షి ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది.
బృహదారణ్యక, ఛాందోగ్య ఉపనిషత్తులలో అరుణి బోధలు ప్రముఖంగా కనిపిస్తాయి.
అంతేకాదు. భారతీయ చింతనకు సంబంధించి ముఖ్యంగా పేర్కొనే 'తత్వమసి' (అది నువ్వే) అనే వాక్యం అరుణి మహర్షి చెప్పినదే!
అరుణి మహర్షికి ఉద్దాలకుడు అన్న పేరు కూడా ఉంది.
ఈ పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథనమూ ఉంది.
అరుణి తన చిన్నతనంలో దౌమ్యుడు అనే రుషి వద్ద విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు. ఆ గురువు గారు ఒకనాడు ఏదో పని మీద వెళ్తూ ఆశ్రమానికి చెందిన పొలాలను జాగ్రత్తగా గమనించుకోమని అరుణికి చెప్పి బయల్దేరాడు.
దౌమ్యుడు అలా వెళ్లాడో లేదో, ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకుని వచ్చాయి. చూస్తూచూస్తుండగానే వర్షం చినుకులుగా మొదలై ఉధృతంగా కురవసాగింది. దౌమ్యుని పంటపొలాలకు అనుకుని ఉన్న నీటి ప్రవాహానికి గండి పడనే పడింది. నీరు నిదానంగా పొలాలలోకి చేరసాగింది. ఆ పరిస్థితిని చూసిన ఆరుణికి ఏం చేయాలో పాలుపోలేదు. గండికి ఎంతగా మట్టి కప్పినా అది నిలవడం లేదు. ఇక ఎలాగైనా గురువుగారి పొలాలను, ఆయన మాటను కాపాడాలనే తపనతో... తానే ప్రవాహానికి అడ్డుగా పడుకొన్నాడు అరుణి.
ఆ రోజు చీకటిపడే సమయానికి ఆశ్రమానికి చేరుకున్న గురువుగారికి అరుణి కనిపించలేదు. వెంటనే తన విద్యార్థులు కొందరిని వెంటబెట్టుకుని అడవిలోకి బయల్దేరారు గురువుగారు. అక్కడ తన పొలాలను చేరుకున్న దౌమ్యునికి,
అంత వర్షంలో కూడా అవి నిండిపోకుండా ఉండటం చూసి ఆశ్చర్యం వేసింది.
కారణం ఏమై ఉంటుందా అని నలుదిక్కులా పరిశీలిస్తున్న ఆయనకు సన్నగా ఒక మూలుగు వినిపించసాగింది. ఆ శబ్దం దిశగా చూస్తే ఏముంది! నీటి ప్రవాహానికి అడ్డుగా పడుకుని ఉన్న అరుణి కనిపించాడు.
అరుణి చేసిన త్యాగానికి దౌమ్యుని నోట మాట రాలేదు. నీటి ప్రవాహాన్ని నియంత్రించినవాడు కాబట్టి, అరుణి ఇకమీదట ఉద్దాలకుడు అన్న పేరుతో పిలువబడతాడని ఆయన ఆశీర్వదించారు. అంతేకాదు! నీటి మీద చూపించిన సాధికారతే జ్ఞానం మీద కూడా చూపగలడని వరాన్ని అందించారు.
గురువుగారిచ్చిన మాట వృధా పోలేదు. తన స్వదేశమైన పాంచాలరాజ్యంలోనే కాకుండా మాద్ర, తక్షశిల వంటి రాజ్యాలన్నీ తిరుగుతూ... అక్కడ పేరుమోసిన గురువులందరి వద్దా విద్యను అభ్యసించాడు అరుణి.
గురువుల దగ్గర్నుంచీ పొందిన జ్ఞానాన్ని మనకు ఉపనిషత్తుల రూపంలో అందించారు.
ఒకనాడు అరుణి దేవికానదిలో స్నానం చేయుటకు బయలుదేరిపోతూ ఉండగా భయంకరాకారంలో ఒక క్రూరుడు ఎదురుగా రాసాగాడు.మహర్షి శ్రీహరినామం జపిస్తూ నడుస్తూన్నాడు.అంత ఆ క్రూరుడు ఆ మహర్షి దివ్వతేజస్సును చూపి మంత్రముగ్ధుడై సాష్ఠాంగపడ్డాడు.అతడొక దొంగల నాయకుడు. అనేక క్రూరకృత్యాలు చేసాడు.
మహర్షిని చూడగానే అతని మనస్సు మారనది. వద్దన్ననూ మహర్షి వెంటబడ్డాడు.అతనికి సేవచేయసాగాడు.సంవత్సరముల తరబడిసేవచేస్తూనే ఉన్నాడు. మహర్షికి ఏ ఆపదా రాకుండ కాపాడుచున్నాడు.
ఒకనాడొక బెబ్బులి మహర్షి పైకి రాబోగా ఆ దొంగల నాయకుడు బాణంతో దానిని సంహరించాడు. అది అరుస్తూ అరుణి సమీపాన పడి మరణించింది. ఆ అరుపునకు అదిరిపడి నమో నారాయణాయ
అని బిగ్గరాగా అన్నాడు. మరణించి పడివున్న బెబ్బులి శరీరం నుండి ఒక దివ్వ పురుషుడు బయటకు వచ్చాడు.అతడు మహర్షికి నమస్కరించి మహాత్మా నేనొక వీరుడను. విప్రులను బాధించుటచే వారు నన్ను పులివికమ్మని శపించారు. శాపవిమోచనం ప్రసాదించమని కోరగా వారు నారాయణ మంత్రం నా చెవిని శోకిన మరు క్షణం ఈ పులి రూపం పోయి మనుష్యు రూపం వస్తుందని పలికారు. మీరు పలికిన నారాయణ మంత్రం నేను విన్నాను. శాపవిమోచనం కలిగింది.అని చెప్పాడు.
మహర్షి ఆనందించాడు.. తనను సేవించే దొంగలరాజుని పిలిచి నాయనా, నీ సాహసానికి ఎంతో సంతోషంగా ఉంది. నీకు ఏం కావాలో కోరుకో అని పలుకగా .
దొంగలనాయకుడు మహర్షి మోక్షమార్గ ముపదేశించు అనగా అరుణి..నీవు నేటి నుండి మాంసము తినడం మాని, సత్య వ్రతుడివై నారాయణ స్మరణ చేయుచూ జీవించు అదే నీకు మార్గం ప్రసాదిస్తూంది. సాధన చేయి అని మహర్షి మౌనం వహించాడు.
ముని అదేశానుశారం హరిస్మరణ చేస్తూ తపస్సు ప్రారంభించాడు. చివరికి హరి సాయుజ్యం పొందాడు.
మహర్షుల కృపకు పాత్రులైనవారు దేనినైనా సాధించగలరు గదా.
అతనికి శ్వేతకేతు అనే కుమారుడు కలిగాడు.. శ్వేతకేతు బ్రహ్మచర్య దీక్షతో విద్యాధ్యయనం సాగించాడు.
కానీ తను నేర్చినదే సమస్తమని గర్వించసాగాడు.
బ్రాహ్మణుడు
కొన ఊపిరితో చావు బతుకుల్లో ఉన్న మన సనాతన హిందూ ధర్మానికి ఊపిరి పోసి బతికించిన మహానుభావుడు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ...బ్రాహ్మణుడు.
ఆజాద్ హిందూ ఫౌజ్ ను స్థాపించి బ్రిటీష్ వారిని గడగడలాడించి తెల్ల కుక్కలకు పగలే చుక్కలు చూపిన ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ....బ్రాహ్మణుడు.
హిందూ పద బాదషాహీ , హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీని నడిపించి ఆది శంకరుల తర్వాత మళ్ళీ హిందూ ధర్మానికి జవసత్వాలు తీసుకువచ్చిన ధర్మప్రభువు సమర్థ రామదాసు ...బ్రాహ్మణుడు.
హిందూ ధర్మాన్ని , మన సనాతన గురుశిష్య పరంపరను , మన జ్ఞాన కేంద్రాలైన గురుకులాలను విధర్మీయులు కుట్రపన్ని క్రమేపి నాశనం చేయప్రయత్నిస్తూన్న తరుణంలో , అతి సామాన్యుడైన చంద్రగుప్తుడిని తన రాజనీతితో రాజుగా చేసి,హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి పునఃధర్మ స్థాపన చేసిన మేధోధీరుడు చాణక్యుడు...బ్రాహ్మణుడు.
పసికందును వెనక కట్టుకుని అరివీర భయంకర రణరంగంలో బ్రిటీషులను గడగడలాడించి,భారత మాతను బానిస సంకెళ్ళ నుండి విడిపించుటకు సింహగర్జన చేసిన ఆడ సింహం రాణి ఝాన్సీ లక్ష్మీబాయి....బ్రాహ్మణురాలు.
ఐక్యతారాగాన్ని ఆలాపించి,చెల్లా చెదరుగా విడిన హిందూ సమాజాన్ని ఏకం చేసి భారత స్వాతంత్ర సమరనాదాన్ని పూరించి , వాడవాడలా వినాయకుడిని స్థాపించి..తద్వారా భారత స్వాతంత్ర్యానికి పూనాదులు వేసి,మన సనాతన ధర్మ రక్షణకు ప్రాణాలు త్యాగం చేసిన భారత మాతా భక్తుడు బాల గంగాధర తిలక్ ...బ్రాహ్మణుడు.
నలంద , తక్షశిల లాంటి మన భారత దేశ జ్ఞాన కేంద్రాలను ఆక్రమణదారులు మట్టుబెట్టి భస్మీకృతం చేస్తే...అలాంటి జ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి , భారత మాతకు పూర్వ జ్ఞాన వైభవమును తేవాలని , జోలేపట్టి ఆఖరికి శవాలపై వేసిన డబ్బును ఏరుకోవడానికి వెనకాడక , భిక్షాటన చేసి బనారస్ హిందూ విశ్వవిద్యాలయము ( BHU ) ను స్థాపించి దేశములో విద్యావెలుగులను నింపిన అసమాన కీర్తిమంతుడు మదన మోహన మాలవీయ ...బ్రాహ్మణుడు.
కశ్మీరును స్వతంత్రం చేయాలని , భారతమాత శిరస్సు ఖండించబడకూడదని ఆరాటపడి పోరాటం చేసిన త్యాగధనుడు, జనసంఘ్ ను స్థాపించి భారత భవిష్యత్తుకు పునాదివేసి , ప్రాణాలు అర్పించిన డా॥ శ్యామా ప్రసాద్ ముఖర్జీ....బ్రాహ్మణుడు.
ఈ రోజు నేను హిందువుని అని ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛా భిక్షను అనుగ్రహించిన,రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ( RSS ) ను స్థాపించిన డా॥ హెడ్గేవార్ ...బ్రాహ్మణుడు.
నేడు నరేంద్ర మోడీని చూసి యావత్ ప్రపంచం గర్విస్తూన్నది.ఆ నరేంద్ర మోదీ గారిని తీర్చిదిద్దిన భారతీయ జనతా పార్టీకి పురుడుపోసిన దీనదయాల్ ఉపాధ్యాయ...బ్రాహ్మణుడు.
అపర మేధావి , కవి , రచయిత...భారత యశస్వీ ప్రధానిగా కీర్తి గడించిన మన భారత రత్న అటల్ బిహారీ వాజపేయ్ ...బ్రాహ్మణుడు.
ప్రపంచ క్రికెట్ లో భారత దేశానికి అగ్ర స్థానాన్ని కల్పించి క్రికెట్ దేవుడిగా కీర్తింపబడే భారత రత్న సచిన్ టెండూల్కర్ ...బ్రాహ్మణుడు.
ఇలా చెబుతూ పోతే సంవత్సరాలు గడిచినా విషయం పూర్తవ్వదు.ఇది భారత జాతి కొరకు , భారత దేశం కొరకు , సనాతన హిందూ ధర్మం కొరకు తమ సర్వస్వాన్ని ధారపోసి , సంపూర్ణ జీవితాలను త్యాగం చేసిన త్యాగధనులైన బ్రాహ్మణుల చరిత్ర....ఎంత చెప్పినా తరగదు.
భారత మాత కొరకు కేవలం బ్రాహ్మణులే త్యాగం చేశారు...మిగితా వారు చేయలేదు...మిగితా వారు పాటుపడలేదు అనేది మా ఉద్దేశ్యం కాదు.దేశ నిర్మాణంలో అందరి పాత్ర ఉందీ...అన్నీ వర్గాల సమిష్టి పోరాటమే భారత రూపం.అందులో బ్రాహ్మణులు కూడా ఉన్నారనేది సమాజం గుర్తించాలి.
ఇంతటి త్యాగాలను చేసి దేశ వైభవాన్ని నిలిపిన , నిలుపుతూన్న బ్రాహ్మణుల గురించి చలన చిత్రాలలో వ్యంగ్యంగా చిత్రీకరించడం శోచనీయం...దానిని మిగితా హిందూ సమాజం ఖండించకపోవడం దౌర్భాగ్యం.
సినిమాలలో బ్రాహ్మణులపై వెధవ జోకులేయడం
బ్రాహ్మణులను కాలితో తన్నడం
బ్రాహ్మణులను రౌడీలకు సలహాదారుగా చూయించడం...ఇలా ఒకటా రెండా....ఏ చిన్న అవకాశాన్ని చిత్ర పరిశ్రమ వదలదు..బ్రాహ్మణులను కించపరుస్తూనే ఉంటుంది.
ఇకనైనా ఇటువంటి వెకిలి చేష్టలు మానాలి.
బ్రాహ్మణులు దేశ నిర్మాణంలో చేసిన సేవలను గుర్తించాలి.
వారికి తగిన గౌరవాన్ని కల్పించాలి.
బ్రాహ్మణత్వం నాశనమైన రోజు హిందూ ధర్మం నిలవదు.హిందూ ధర్మం నాశనమైన రోజు దేశం మిగలదు.
ఈ దేశ పునాది బ్రాహ్మణత్వంలో ఉంది అనేది యావత్ సమాజం విస్మరించకూడదు.
॥ శ్రీమాత్రే నమః ॥
మన మహర్షులు - 3
మన మహర్షులు - 3
అరణ్యక మహర్షి
అరణ్యక మహర్షి పుట్టింది అడవిలోనే, పెరిగింది అడవిలోనే, తపస్సు చేసిందీ అడవిలోనే. ఆయనకి అడవి తప్ప వేరే ప్రదేశాలు ఏమీ తెలియవు. అందుకనే ఆయనకి అరణ్యక మహర్షి అని పేరు వచ్చింది.
ఈ మహర్షి ఆశ్రమం రేవానదీ ఒడ్డున ఉండేది. చాలా ప్రశాంతంగా ఉండేది.
పెద్ద పెద్ద జంతువులు కూడ అక్కడ కలిసి మెలిసి ఉండేవి. ఆయన ఎప్పుడూ రామనామం చేస్తూ ఉండేవాడు
ఆయన రామనామ జపం ఎప్పుడూ చెయ్యడం వల్ల ఆశ్రమంలో ఎప్పుడూ రామనామం వినపడుతూ ఉండేది.
పండిపోయిన ఆకులు రాలి పడుతున్నప్పుడు, ఎండిపోయిన పుల్లలు విరిగి కిందపడుతున్నప్పుడు, చీమలు పాకుతున్నప్పుడు, గాలి వేసినప్పుడు, చెట్లు ఊగుతున్నప్పుడు
ఏం జరుగుతున్నా రామనామమే వినిపించేది.
అంటే అరణ్యక మహర్షికి రామ మంత్రం, రామ ధ్యానం, రామ స్మరణం, రామ పూజనం, రామ చింతనం, రామ మననం, మొత్తం రామ మయంగా ఉండేవాడు.
ఒకసారి శత్రుఘ్నుడు ఆయన ఆశ్రమానికి వచ్చి నమస్కరించి, ఆయన రామ భక్తి చూసి స్వామీ ! నేను ఎప్పుడు రాముడితోనే ఉంటాను, అయినా నాకంటే మీకే ఎక్కువ రామ భక్తి ఎలా వచ్చింది? అని అడిగాడు..
అరణ్యక మహర్షి శత్రుఘ్నుడికి ఏం చెప్పాడో చదవండి మరి...
'నేను ఎప్పుడు ఈ అడవి వదిలి ఎక్కడికీ వెళ్లలేదు. అయినా నాకు చిన్నప్పటి నుంచి జ్ఞానం సంపాదించాలని కోరిక ఉంది. కాని నాకు గురువు లేడు కదా... ఇలా అనుకుంటూ ఉండగా లోమశ మహర్షి వచ్చి నీకు గొప్ప మంత్రం, సంసార సాగరం నుంచి బయట పడే సేది చెప్తాను అని మంత్రం ఉపదేశించాడు
అదే.. 'రామనామం'. 'రామ' అనే రెండు అక్షరాల్ని ఎప్పుడూ మనస్సులో జపిస్తూ వుంటే వేరే వ్రతాలు, పూజలు, యాగాలు, దానాలు, మౌనవ్రతాలు ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. అందుకని రామ' నామం జపించుకో ,'అని చెప్పాడు
తర్వాత అరణ్యక మహర్షి లోమశ మహర్షిని అడిగి రామకథ అంతా తెలుసుకుని ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసుకుని రామ నామం చేసుకుంటున్నాడు.
ఇదంతా విన్నాక శత్రుఘ్నుడు అరణ్యక మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని అయోధ్యకి పంపించాడు.
ఆ సమయంలో శ్రీరాముడు అశ్వమేధయాగం చేస్తున్నాడు.
అరణ్యక మహర్షి సరయూనది ఒడ్డున యజ్ఞదీక్షలో ఉన్న రాముడ్ని చూసి
ఆనందంతో కళ్లనుంచి జలజల నీళ్ళు రాలుతుంటే భక్తితో ఆయన తన దేహాన్నే
మరిచిపోయాడు
శ్రీరాముడు అరణ్యక మహర్షిని చూసి ఎదురు వెళ్ళి మహర్షిని కౌగిలించుకుని, చేతులు పట్టుకుని తీసుకువచ్చి కూర్చోపెట్టాడు.
అరణ్యక మహర్షి శ్రీరాముడి పాదాలమీద పడి నమస్కారం చేసి స్వామీ! ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నా తపస్సు పండింది. నా జన్మధన్యమైంది. నాకు మోక్షం ప్రసాదించు అన్నాడు.
వెంటనే ఆయన శరీరం లో నుండి ఒక తేజస్సు శ్రీరాముడిలో కలిసిపోయింది..
చూశారా ! అరణ్యక మహర్షి 'రామ' అనే నామంతోనే భగవంతుడిలో ఎలా
కలిసిపోయాడో!
రామనామం అంత గొప్పదన్నమాట.
ఇదండీ.... పరమ రామభక్తుడైన అరణ్యక మహర్షి కథ!
అల్పపుణ్యప్రదంబు లైనట్టియాగ
ములును యోగంబులును వ్రతంబులును సరియె ?
తెగని సంసారబంధంబు త్రెంచివైచి
క్షేమ మొనగూర్చు శ్రీరామనామమునకు."
జై శ్రీరామ్..🙏🙏
🍁🍁🍁🍁
జ్ఞానోన్మత్తులం
శ్లోకం:- డా౹౹ సూరం శ్రీనివాసులు
వయం జ్ఞానోన్మత్తాః పరికృతపురాణాదికథనాః
జడే జీవేఽసక్తా ఇవ సతతనాట్యా ధనధియః౹
అహం బ్రహ్మాస్మీతి ప్రకటనరతాః స్థేమవచనైః
కుతో వా ధాతస్త్వం భవసి విఫలస్సర్జనగతౌ౹౹
తాత్పర్యం : సూరం చంద్రశేఖరం
మేము జ్ఞానోన్మత్తులం.పురాణ కథలను మా
పరివారంగా చేసుకున్నవారం. ఈ జడంమీదా
,జీవంమీద ఆసక్తి లేనట్లు నటిస్తుంటాం. మనసేమో
ధనం మీద.అహం బ్రహ్మాస్మి అని గట్టిగా ప్రకటిస్తుంటాం.
విధాతా ! సృష్టిగతిని ఇలా కొనసాగిస్తూ నువ్వెందుకు
విఫలుడవవుతున్నావు?
స్త్రీలు రుద్రాక్షలు
*🍃స్త్రీలు రుద్రాక్షలు ధరించవచ్చునా ?🍃*
అయాచితంగా ,సులభంగా,ఎక్కువ శ్రమపడకుండా లభించే అమూల్య వస్తువులను అలక్ష్యం చేసే గుణం మానవులకి ఎక్కువే.
ఆలయ ఉత్సవాల సమయంలో, ఆధ్యాత్మిక కార్యక్రమాల సమయంలో
దైవీకశక్తి గల రుద్రాక్షలను
పూజాగదిలో పెట్టి పూజించి
కంఠంలో ధరించడం వలన
అద్భుత శక్తులు పొంద వచ్చును. రుద్రాక్షలలో అయస్కాంత శక్తి వున్నది.
అది మనలోని చైతన్య శక్తితో
చేరినప్పడు, మనసుకు ప్రశాంతతను కలిగించి ఆలోచనా శక్తిని
పెంపొందిస్తుంది. మంచి ఆలోచనలు కలగడం వలనసజ్జనుల సాంగత్యం ఏర్పడి సత్చింతనతో సత్కార్యాలు చేయడానికి అవకాశం కలుగుతుంది. రుద్రాక్షధారణ వలన సాత్విక గుణాలు ఏర్పడే అవకాశముంది. అలాటివారిలో దైవచింతన వుంటుంది. విద్యార్థులు రుద్రాక్షలు మెడలో ధరిస్తే మేధస్సు పెరుగుతుంది.
రుద్రాక్షలు ధరించినట్లయిన పవిత్రగంగలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి.
గంగ స్నానం వలన
చేసిన పాపాలు తొలగిపోతాయని
ఐహీకం. మానవుడి అనేక కష్టనష్టాలకు కారణం అతడు చేసే పాపాలే. విజ్ఞానశాస్త్ర రీతిగా చూసినా యీ దైవీక
రుద్రాక్షలను ధరించిన వారికి
దీర్ఘాయువు, సిరి సంపదలు ప్రాప్తిస్తాయని జాబాల ఉపనిషత్ తెలుపుతున్నది. ఒకటి నుండి14 ముఖాలదాకా రుద్రాక్షలు వున్నాయి.అనేక శారీరక ,మానసిక రుగ్మతల తీవ్రతను రుద్రాక్షలు
తగ్గిస్తాయని పరిశోధకులు
తెలుపుతున్నారు. సర్వవేళలా రుద్రాక్షలను
ధరించ వచ్చును.
శివ దీక్ష తీసుకున్న స్త్రీలు
రుద్రాక్షలను ఎల్లవేళలా ధరించవచ్చును. సాధారణ గృహిణులు మాత్రం పూజా వ్రత సమయాలలో మాత్రమే ధరించాలి. తరువాత, వాటిని మెడలో నుండి తీసివేసి పూజా గదులలో వుంచాలి.🍃