6, నవంబర్ 2022, ఆదివారం

హిందువులకు అదేం ఆత్మవంచనో

 * ఒక మిత్రుడు పంపిన మెసేజ్,,*.         హిందువులకు అదేం ఆత్మవంచనో🤦‍♂️ తమ పవిత్రమైన సంప్రదాయాలు, నామాలు, ఆచారాలను తిట్లకి, అవహేళనకి* *పర్యాయపదాలుగా వాడుతూ తమ సంస్కృతి సాంప్రదాయాలను తామే అవమానుపరుచుకూoటూవుంటారు🤦‍♂️*  


 *boss తిట్టాడా" అని అడగటానికి బదులుగా "అక్షింతలు పడ్డాయా" అని అడగటం🤦‍♂️* 

 *"మందు🥃కొట్టావా" అని అడగటానికి బదులు "తీర్ధం పుచ్చుకున్నావా" అని అడగటం🤦‍♂️* 

 *"మోసం చేశాడా" అని అడగటానికి బదులు* *"పంగనామాలు పెట్టాడా" అని అడగటం OR "శఠగోపం పెట్టాడు" అని అనడం* 🤦‍♂️

 *"బార్ నుండి మందుకొట్టి వస్తే "ఎరా గుడినుండి వస్తున్నావా" అని స్నేహితులు అడగటం 🤦‍♂️* 


 *"దివాళా తీశారు (ఓడిపోయారు)" అని ఎక్కిరించడానికి/అవహేళన చెయ్యడానికి"👉 "గొవిందా గో....విందా......" అని వాడటం *🤦‍♂️** 

" *trap చేయడాన్ని" 👉 "ముగ్గులోకి దింపాను" అనడం🤦‍♂️* 


 *ప్రలోభపెట్టి ప్రేమలోకి or trapలోపడేయడానికి ప్రయత్నించడాన్ని "పులిహోర కలుపుతున్నాడు" అని* 

 *ప్రతి పండుగకు చేసుకుని దైవానికి నైవేద్యముగా* *సమర్పించే  పవిత్రమైన "పులిహోర"ని* *అవమానించడం/* *అవహేళనచెయ్యడం🤦‍♂️* 


  *పవిత్రమైన "సంస్కృత" భాషను తాగుబోతులు మైకం తలకెక్కిన తరువాత మాట్లాడే అర్ధంకాని బూతుమాటలను 👉 ఇక సంస్కృతం మొదలుపెడతారు" అని అవమానించడం 😡🤦‍♂️* 

 

 *ఇలా చెప్పుకుంటూ పోతే మన హిందువులే తమ పవిత్ర భాషను, సాంప్రదాయాలను, ఆచారాలను, నామాలను అవమానించుకోవడం పరిపాటి(fashion) అయిపోయింది😡🤦‍♂️* 


 *పండగ నాడు పాత మడుగేనా (పాత బట్టలు) అనేది సామెత. కొందరు దీనిని పండగనాడు పాత* *మొగుడేనా(భర్త) అనేలా మార్చేశారు ఆచారాలు మంట కలపాలి అని.* 


 *ఎవరైనా ఎక్కువ గోల చేస్తే ఏందిరా నీ రామాయణం అనిమంచి చెబితే జ్ఞాన బోధ వద్దు అని, సిగరెట్టు కాల్చుకోవడానికి అగ్గిపెట్టె ఇచ్చేవాడిని గురు అగ్గిపెట్టె అని అడగడం, ఎవరైనా కక్కుర్తి పడితే నీ కక్కుర్తిలో నా కమండలం అని, ఏదీ మిగలలేదు ఉపయోగం లేదు అంటే ఏమి మిగిలింది బూడిద అనడం, మోసపోతే తూర్పు తిరిగి దండం పెట్టు అనడం... ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడాలంటే శతకోటి లింగాలలో నువ్వో బో* *లింగం అనడం  etc....* *ఇదో పెద్ద లిస్టులు హనుమంతుని తోక లా అని వాడుకోవడం కూడా ఇదే తరహా...* *🤷‍♂️యిక ముందు యిటువంటి జోకుల కు స్వస్తి పలుకుదాము.ముందు మన నుంచి వీటిని తీవ్రంగా ఖండించే పని* *ప్రారంభించుదాము.ఎందుకంటే క్రైస్తవ, ముస్లింలు  వాలు వారి వారి మతాలపైవారు పొరపాటున జోకులు వేసుకోరు. వాస్తవికత తో హిందూ దేవి, దేవతలను, గ్రంథాలను గౌరవించుకుందాము.*

కార్తీకపురాణం - 13వ అధ్యాయము*

 🌴🌹🪔🕉️🛕🕉️🪔🌹🌴


    🕉️ _*సోమవారం*_ 🕉️

🪔 *నవంబరు 7, 2022* 🪔


*కార్తీకపురాణం  - 13వ అధ్యాయము*


🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️🕉️

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔


*కన్యాదాన ఫలము*

*సువీర చరిత్రము*


🌹🪔🌹🪔🌹🪔🌹🪔🌹


ఓ జనక చక్రవర్తీ ! కార్తీకమాసములో యింకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై ఆలకింపుము.


*కార్తీకమాసములో నదీస్నానం ముఖ్యము.* దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒక వేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన యెడల యెంతటి మహాపాపములు చేసియున్ననూ, ఆ పాపములన్నియు పోవును. ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించిననూ పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంత కన్న ముఖ్యమైనది కన్యాదానము. కార్తీకమాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన యెడల తాను తరించుటయే గాక తన పితృదేవతలను కూడ తరింపజేసినవాడగును. ఇందులకొక ఇతిహాసం గలదు. చెప్పెదను శ్రద్దగా ఆలకింపుము.


*సువీర చరిత్రము*


🪔🌹🪔🌹🪔🌹🪔🌹🪔


ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన *"సువీరు"డను* ఒక రాజుండెను. అతనికి రూపవతియను భార్యకలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడయి , భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందోక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. ఆ  బిడ్డను అతి గారాబముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన అ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికి శుక్ల పక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి నొందుచు , అతిగారబముతో పెరుగుచుండెను , ఆమె చూచు వారలకు కనులపండువుగా , ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచినకొలదీ , బాలికకు నిండు యౌవనదశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికనుగాంచి ఆమె అందచందములకు పరవశుడై అ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకా రాజు *"ఓ ముని పుత్రా ! ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో నున్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన యెడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతు"నని* చెప్పగా తన చేతిలో రాగి పైసాయైననూ లేకపోవుటచే బాలిక పైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోరతపమాచరించి , కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించెను. రాజు అ పాత్రను పుచ్చుకొని , సంతోషించి , తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరినీ అత్తవారింటికి పంపెను.


అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్చగా ఖర్చుపెట్టుచూ భార్యతో సుఖముగా వుండెను. అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆరాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సురాగానే మరుల యెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచుచుండెను.


ఒకానొక సాధుపుంగవుడు తపతీనదీ తీరమునుండి నర్మదానదీ తీరమునకు స్నానార్ధమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని *"ఓయీ ! నీవెవ్వడవు ? నీ ముఖ వర్చస్సుచూడ రాజవంశమునందు జన్మించిన వానివలె నున్నావు. నీవీ యరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి ?"* అని ప్రశ్నించగా , సువీరుడు *"మహానుభావా ! నేను వంగదేశమును నేలు చుండెడిది సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులాక్రమించుటచే భార్యాసమేతముగా నీ యడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు. పుత్రశోకముకంటె గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగము కంటే గొప్పసంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్ఠుడనియినందున యీ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు యిద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకిచ్చి , వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే యింత వరకు కాలక్షేపము చేయుచున్నాను"* అని చెప్పగా , *"ఓ రాజా ! నీవు యెంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మము లాలోచింపక కన్యనమ్ముకొంటివి. కన్యావిక్రయము మహాపాతకములలో నొకటి , కన్యను విక్రయించిన వారు 'అసిపత్రవన'  మను నరక మనుభవింతురు. ఆ ద్రవ్యములతో దేవముని , పితృదేవతా ప్రీత్యర్ధము యే వ్రతము చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్యావిక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చికొని పెండ్లాడిన వారు చేయు గృహస్థధర్మములు వ్యర్ధమగుటయేగాక అతడు మహా నరక మనుభవించును. కన్యావిక్రయము జేసినా వారికీ యెట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే యున్నారు. కావున , రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తికొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు , ధర్మబుద్ధి గల వానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన యెడల గంగాస్నాన మొనరించిన ఫలము , అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయేగాక, మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలిగిపోవును"* అని రాజునకు హితోపదేశము చేయగా అందుకా రాజు చిరునవ్వు నవ్వి *"ఓ మునివర్యా ! దేహసుఖము కంటె దానధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా ? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను సిరి సంపదలతోను సుఖముగా వుండక , చనిపోయిన తర్వాత వచ్చెడి యేదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడువమాంటారా ? ధనము , బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని , నోరు మూసుకొని , బక్క చిక్కి శల్యమైయున్న వారిని లోకము గుర్తిస్తుందా ? గౌరవిస్తుందా ? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాన , నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనమెవరిత్తురో వారికే యిచ్చి పెండ్లి చేయుదును కాని , కన్యాదానము మాత్రము చేయను"* అని నిక్కచిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను.


మరి కొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొనిపోయి , యమలోకములో అసిపత్రవనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శ్రుతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతిచెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యావిక్రయము వలన ఆ శ్రుతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి.


అంతటా శ్రుతకీర్తి *"నేనెరిగున్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు , యజ్ఞయాగాదులొనరించి యున్నాను. నాకీ దుర్గతి యేల కలిగె ?"* నని మనమునందుకొని నిండుకొలువు దీరియున్న యమధర్మరాజు కడకేగి , నమస్కరించి *"ప్రభూ ! నీవు సర్వజ్ఞుడవు , ధర్మముర్తివి , బుద్దిశాలివి ,  ప్రాణకోటినంతను సమంగా జూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసియుండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి ? సెలవిండు"* అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శ్రుతకీర్తిని గాంచి *"శ్రుతకీర్తి ! నీవు న్యాయమూర్తివి , ధర్మజ్ఞుడవు , నీ వెటువంటి దురాచారములూ చేసియుండలేదు. అయిననేమి ? నీ వంశియుడగు సువీరుడు తన జ్యేష్టపుత్రికను ధనమునకాశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకొనే వారి పూర్వీకులు యిటు మూడు తరములవారు అటు మూడు తరములవారున్ను వారెంతటి పుణ్యపురుషులైనను నరకమనుభావించుటయే గాక ,  నీచజన్మ లెత్తవలసియుండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదునుగాన , నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీతీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా యాశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి , అచటకు పోయి ఆ కన్యను వేదపండితుడును శీలవంతుడునగు ఒక విప్రునకు కార్తీకమాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అటుల చేసిన యెడల నీవు , నీ పూర్వికులు , సువీరుడు , మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కెగుదురు. కార్తీకమాసములో " సాలంకృత కన్యాదానము " చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను , లేక విధివిధానముగా ఆబోతునకు వివాహమొనర్చినను కన్యాదాన ఫలమబ్భును. కనుక , నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటుల చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు , పోయిరమ్ము"* అని పలికెను.


శ్రుతకీర్తి యమధర్మరాజుకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణకుటిరములో నివసించుచున్న సువీరుని భార్యను , కుమార్తెను చూచి , సంతోషపడి , ఆమెతో యావత్తు విషయములు వివరించి , కార్తీకమాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలసికొనెను.


కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను , పుణ్యము కలుగును. కార్తీకమాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు. విష్ణుసాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును.


      *ఇట్లు స్కాంద పురాణాంతర్గత* 

                 *వశిష్ట ప్రోక్త* 

          *కార్తీక మహాత్య మందలి*


          *పదమూడో అధ్యాయం* 

              *పదమూడో రోజు*     

       *పారాయణము సమాప్తము*


           🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*


🙏🌹🍁🕉️🛕🕉️🍁🌹🙏

Srimadhandhra Bhagavatham

 [ Srimadhandhra Bhagavatham -- 64 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


శ్రీరామ చరిత్ర

నవమస్కంధములో ఒక గమ్మత్తు చేశారు. నవమి నాడు రామచంద్రమూర్తి పుట్టారు. దశమ స్కంధమును ప్రారంభం చేసేముందు నవమస్కంధములో రామాయణమును చెప్పారు. నవమ స్కంధములో శ్రీరామచంద్రప్రభువు యొక్క సంకీర్తనము విశేషంగా చేయబడింది. ఇక్ష్వాకువంశములో జన్మించిన దశరథ మహారాజుగారికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేస్తే, సంతానం కలగడానికి ప్రతిబంధకమయిన పాపము పరిహరింపబడి, యజ్ఞపురుషుని అనుగ్రహముచేత లభించిన పాయసమును తన ముగ్గురు ధర్మపత్నులయిన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచి ఇస్తే పుట్టిన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే నలుగురు కుమారులలో మహాధర్మాత్ముడయిన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన కోసమని, తాను భార్య సీతమ్మతో కలిసి తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠితుని చేయడం కోసం, పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసమునకు బయలుదేరి వెళ్ళి అక్కడ శూర్పణఖ ముక్కు చెవులు కోసి మారీచాది రాక్షసుల పీచమడచి, అక్కసుతో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తరువాత అరణ్యకాండలో కబంధవధ జరిగిన తరువాత సుగ్రీవుని జాడ తెలుసుకుని, మైత్రి చేసి, వాలిని సంహరించి, హనుమ సహాయంచే నూరుయోజనముల సముద్రమునకు ఆవల దక్షిణదిక్కున వున్న లంకాపట్టణంలో రావణాసురుని ప్రమదావనంలో బంధింపబడిన సీతమ్మజాడ హనుమ ద్వారా తెలుసుకుని, సముద్రమునకు సేతువు కట్టి, ఆవలి ఒడ్డుకు చేరి, రావణ కుంభకర్ణాది రాక్షసులను తెగటార్చి, తిరిగి సీతమ్మను పొంది పదకొండు వేల సంవత్సరములు రామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసి, రామరాజ్యమని పేరు తెచ్చి, ఎన్నో ఆశ్వమేధములు, వాజపేయములు, పౌండరీకములు మొదలయిన యాగములు చేసి, మనిషి ఎలా ప్రవర్తించాలనే దానికి ఒక అద్భుతమయిన కొలమానమును ఏర్పాటు చేసిన విశేషమయిన అవతారము రామావతారము.

ఆ రామచంద్రమూర్తి అనుగ్రహమే పోతనగారియందు ప్రసరించి భాగవతమును ఆంధ్రీకరించుటకు తోడ్పడింది. రాముడు కృష్ణుడని ఇద్దరు లేరు కనుక ఆ రాముడే కృష్ణకథ చెప్పించాడు.

దశమ స్కంధము – పూర్వ భాగము – శ్రీకృష్ణ జననం

భాగవతంలో దశమస్కంధము ఆయువుపట్టు లాంటిది. ఈ దశమస్కంధము జీవితంలో తప్పకుండా విని తీరాలి. ఇందులో వ్యాసభగవానుడు కృష్ణ భగవానుని లీలలను విశేషమయిన వర్ణన చేసారు. పోతనగారు దానిని ఆంధ్రీకరించి మనకి ఉపకారం చేశారు. దశమస్కంధమును ప్రారంభం చేస్తూ ఒకమాట చెప్తారు. పూర్వకాలంలో భూమి గోరూపమును స్వీకరించి బ్రహ్మగారి వద్దకు వెళ్ళి ఏడ్చి ‘మహానుభావా! భూలోకంలో ఎందరో రాజులు భూమి పతులమని పేరు పెట్టుకొని పరమదుర్మార్గమయిన పరిపాలన చేస్తూ ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నారు. ఎంతోమంది అధర్మాత్ములు ఈవేళ భూమిమీద తిరుగుతున్నారు. వారి భారం నాకు ఎలా తగ్గుతుంది? అటువంటి వారి మదమణచి భూమి భారమును తగ్గించవలసినది’ అని ప్రార్థించింది. భూభారము అనేది తక్కెట్లో పెట్టి తూచే కొలత కాదు. ఎంతమంది బిడ్డలు పుట్టినా తల్లికి ఎప్పుడూ బరువు కానట్లే, ఎన్ని ప్రాణులు వున్నా, భూమికి ఎప్పుడూ బరువు కాదు. కాని ధర్మము తప్పి ప్రవర్తించే మనుష్యులను చూసి భూమి భారమని బాధపడుతుంది. అన్నిటిని సృష్టి చేసిన బ్రహ్మగారిని అడిగింది. ‘భారము తగ్గించడం, ఉన్నది నిలబెట్టడం స్థితికారకుడయిన శ్రీమహావుష్ణువు అనుగ్రహం కాబట్టి నీవయినా నేనయినా ఆయనను ప్రార్థన చేయాలి’ అని ఆనాడు బ్రహ్మగారు ధ్యాన మగ్నుడై పురుషసూక్తముతో స్వామి వారిని ఉపాసన చేశారు. ఆ ధ్యానమునందు ఆయనకు ఒక వాణి వినపడింది. వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వునవ్వి బ్రహ్మగారు ‘భూమీ! నీవేమీ బెంగపెట్టుకోవద్దు. స్వామి తొందరలో కృష్ణావతారమును స్వీకరిస్తున్నారు. ఆ అవతారం చిత్రమయిన అవతారం. స్వామి కళ్ళు ఇంకా తెరవడం రాని పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షససంహారం ప్రారంభం చేస్తాడు. ఎందరో రాక్షసులు, దుర్మార్గులు మరణిస్తారు. నీకు భారము తగ్గుతుంది. దేవతలను, సురకాంతలను తమతమ అంశలతో భూమిమీద జన్మించమని స్వామి ఆదేశం ఇచ్చాడు. ఆయన యదుకులంలో యాదవుడిగా పశువులను కాసేవాడిగా జన్మించబోతున్నాడు. జగదాచార్యునిగా లోకమునకు జ్ఞానమును ఇస్తాడు’ అని చెప్పాడు. భూమాత పరమ సంతోషమును పొంది తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ ఆగమనం కోసమని నిరీక్షిస్తున్నది.

ఈలోగా భూలోకంలో యదువంశమునకు చెందిన శూరసేనుడు అనే రాజు మధుర రాజ్యమును పరిపాలిస్తున్నాడు. ఆయన కుమారుడు వసుదేవుడు. భోజవంశమునకు చెందిన ఉగ్రసేనుడు, దేవకుడని ఇద్దరు అన్నదమ్ములు. దేవకుని కుమార్తె దేవకి. ఉగ్రసేనుని కుమారుడు కంసుడు. అన్నదమ్ముల బిడ్డలు కనుక కంసుని చెల్లెలు దేవకీదేవి. దేవకీదేవిని శూరసేనుని కుమారుడైన వసుదేవునకిచ్చి వివాహం చేశారు.

దశమస్కంధము ఉపనిషత్ రహస్యము. దశమస్కంధము ప్రారంభంలోనే ఒక లక్ష టన్నుల ప్రశ్న ఒకటి పడుతుంది. ఆ ప్రశ్నకు సమాధానమును తెలుసుకోగలిగితే హృదయగ్రంథి విడిపోయినట్లే! కృష్ణ జననం పరమపవిత్రమయిన ఆఖ్యానం.

దేవకీ వసుదేవులకు వివాహం జరిగిన తర్వాత కొన్ని వందల గుఱ్ఱములను, బంగారు ఆభరణములతో అలంకరింపబడిన ఏనుగులను, కొన్ని వేల రథముల నిండా బంగారమును, కొన్ని వందలమంది దాసీజనమును ఏర్పాటు చేసి, మహానుభావుడయిన దేవకుడు తన కుమార్తెను అత్తవారింటికి పంపుతున్నాడు. రాజమార్గంలో కొన్ని వేల రథములు అనుసరించి వెడుతున్నాయి. దేవకీదేవి రథం బయలుదేరి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది. రథమును నడపడానికి సారథి ఉంటాడు. ఆ సమయంలో కంసుడు అకస్మాత్తుగా వచ్చాడు. అతనికి చెల్లెలు అంటే మహాప్రేమ. ఆమె తన తండ్రిగారి సోదరుని కుమార్తె అయినా, కంసునికి దేవకీదేవి అంటే చాలా ప్రేమ. ఆయన దేవకీదేవి రథమును నడపడానికి సిద్ధపడ్డాడు. అందరూ చాలా సంతోషించారు. తానే చెల్లెలిని అత్తవారింటిలో దింపుతానని గుఱ్ఱముల పగ్గములు పట్టుకున్నాడు. వెనక దేవకీవసుదేవులు కూర్చున్నారు. రథం వెళుతున్నది.

అశరీరవాణి కొన్ని మాటలు పలికింది. ‘అశరీరవాణి’ చాలా గమ్మత్తయిన మాట. శరీరము ఉంటే వాణి ఉంటుంది. వాణి ఉన్నది అంటే అది శరీరంలోంచి వస్తున్నదని గుర్తు. కనీసంలో కనీసం ఎదురుగుండా నామ రూపములతో ఏదో ఉండాలి. మనుష్యుడు లేకుండా మాట ఉండదు. కానీ ఇక్కడ శరీరము లేదు కానీ మాట వినబడుతున్నది అంటున్నారు అదీ చిత్రం.

‘తలోదరి’ అంటే పైకి కనపడని కడుపు కలది. కొంతమందికి కడుపు కనపడదు. అసలు కడుపు ఉన్నదా లేదా అనే అనుమానం ఉన్నట్లు ఉన్నవాళ్ళని ‘తలోదరి’ అంటారు. అసలు కడుపు లేనట్లుగా శుష్కించిన కడుపులా కనపడుతున్నది. ఈ కడుపులో ఎనమండుగురు పుట్టబోతున్నారు. వారిలో ఎనిమిదవవాడు కంసుడిని చంపబోతున్నాడు. ఆవిడ చక్కగా వసుదేవుడిని వివాహం చేసుకుని రథం ఎక్కి వెళ్ళిపోతోంది. ‘ఆవిడ మెచ్చుకోవాలని చెల్లెలి సంతోషం కోసం పిచ్చివాడా, రథము నడుపుతున్నావు! కాని ఈమె ఎనిమిదవ గర్భము నిన్ను చంపేస్తుంది’ అని అశరీర వాణి పలికింది.

ఇప్పటివరకు కంసుడు పరమప్రేమతో ఉన్నాడు. ఆకాశంలోంచి ఈమాట వినపడగానే వెంటనే రథమును ఆపి క్రిందికి దిగాడు. కళ్ళు ఎర్రబడిపోయి గుడ్లు తిరుగుడు పడ్డాయి. అపారమయిన కోపం వచ్చేసింది. తన ఎడమ చేతితో చెల్లెలి కొప్పు పట్టుకొని రథములో నుండి క్రిందకు లాగి ఒరనుండి కరవాలమును తీసి ఆమెను నరికివేయడానికని సిద్ధపడుతున్నాడు. ఆసమయంలో వసుదేవుడు మాట్లాడాడు. ఇది చాలా గమ్మత్తయిన సన్నివేశం. ఇలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించరు. రథం నడుపుతున్న వాడు బావమరిది, తన చెల్లెలినే లాగేసి చంపేస్తాడని, అశరీరవాణి పలుకుతుందనిగాని వసుదేవుడు కలగనలేదు.

ఏమీ కంగారు పడకుండా, ధర్మం తప్పకుండా చాలా పెద్దమనిషిగా తాను అప్పుడు మాట్లాడిన మాట తాను తప్పలేని మాట అయ్యేటట్లుగా మాట్లాడగలగడం అంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈశ్వరానుగ్రహం లేనివాడు అలా మాట్లాడలేడు. ఆయన ఎంతో గొప్పగా మాట్లాడాడు.

ముందు కంసుని అనుగ్రహం కోసమని బ్రతిమలాడాడు. ప్రపంచంలో పరమపవిత్రమయిన సంబంధములలో ‘అన్న’ అనిపించుకున్న రక్తసంబంధం ఒకటి. అన్నగా పుట్టినవాడికి ఒక మర్యాద ఉంటుంది. ఎప్పుడూ కూడా తన బావగారు బ్రతికి వుండాలని కోరుకోవాలి. ‘బావమరిది బ్రతక కోరతాడు’ అని ప్రపంచంలో ఒక సామెత ఉన్నది నీవు అన్నవి రథం తోలడానికి వచ్చావు. నీ చెల్లెలిని సంతోష పెట్టాలి. చక్కని మాటలు నాలుగు మాట్లాడాలి. నువ్వు చంపేస్తాను అంటున్నావు. గాలిమాటలు నమ్మి చెల్లెలిని చంపేస్తావా! రేపు ప్రపంచం నిన్ను ఏమంటుంది? అరివీర పరాక్రమము కలిగినవాడు భోజవంశంలో పుట్టినవాడయిన కంసుడు ఒక చెల్లెలి ఎనిమిదవ గర్భము వలన చచ్చిపోతాననే గాలిమాట విని, ఇంకా పాదముల పారాణి ఆరని ఆడపిల్లను చంపేశాడని లోకం చెప్పుకుంటుంది.. అది ఎంత మహాపాపం. అందుకని తొందరపడి చంపకు. నిన్ను అభ్యర్థిస్తున్నాను’ అన్నాడు.

కంసుడు ‘అది మిన్నులమోతో, అధికారిక వాక్యమో నాకు అనవసరం. ఈమె కడుపున పుట్టిన ఎనిమిదవ పిల్లవాడి వలన నాకు ప్రాణహాని అని నాకు వినపడింది. అందుకని నేను చంపేస్తాను’ అన్నాడు.

వసుదేవుడు ‘నీ అదృష్టం కొద్దీ నీ చావుకు ఒక కారణం తెలిసింది. ఒకవేళ నీవు ఈమెను చంపివేశావనుకో నీకు చావురాకుండా ఉంటుందా? చెల్లెలిని చంపిన పాపమునకు అధోగతికి వెళ్ళిపోతావు. నీ చెల్లెలిని విడిచిపెట్టెయ్యి’ అన్నాడు. ఎంత గొప్ప వేదాంతమును చెపితే మనసు మారే అవకాశం ఉంటుందో దానిని చెప్పాడు. ఏడురోజులు వినేది శుకబ్రహ్మ పరీక్షిత్తుకు చెప్పారు. ఏడు క్షణములలో వినేది వసుదేవుడు కంసునికి చెప్పాడు. వాని మనస్సు మారలేదు. కంసుడు ‘నేను అలా విడిచిపెట్టను. నువ్వు చాలా తేలికగా మాట్లాడుతున్నావు. నేను మరణమును అంగీకరించను. దేవకిని చంపేస్తాను’ అన్నాడు. వసుదేవుడు ఆలోచించాడు. ఉన్నదున్నట్లు చెపితే కంసుని తలకెక్కదని భావించాడు. తానొక ధర్మము నిర్వర్తించాలి తన భార్యను రక్షించుకోవాలి. జ్ఞానబోధ చేస్తే వీని బుద్ధికి ఎక్కదు. అలాగని ఎలాగయినా తన భార్యను రక్షించుకోవాలని అసత్యమును చెప్పకూడదు. సత్యమే చెప్పాలి. అది కంసుని మనస్సుకు నచ్చేదయి ఉండాలి. ముందు అసలు నేను తక్షణం చేయవలసిన పని దేవకీదేవి ప్రాణములను రక్షించడం అనుకుని ‘బావా! అయితే నీకొక మాట చెబుతాను. నీ చెల్లెలికి పుట్టిన ఎనిమిదవ వాని చేత నీవు మరణిస్తానని అనుకుంటున్నావు. ఈ దేవకీ దేవి గర్భమునుండి పుట్టిన ప్రతి పిల్లవాడిని, పుట్టీ పుట్టగానే తీసుకువచ్చి నీకు ఇచ్చేస్తాను. వాడిని నువ్వు చంపెయ్యి. అపుడు నీకు మృత్యువు రాదు కదా! అంతేకానీ నీ చెల్లెలిని చంపడం ఎందుకు? పాపకర్మ కదా! నీ మృత్యుహేతువును నువ్వు చంపినట్లయితే ప్రపంచం నిన్ను తప్పు పట్టదు. నువ్వూ ధర్మం తప్పనక్కరలేదు. నేనూ ధర్మం తప్పనక్కరలేదు. ఆమెను విడిచి పెట్టు’ అన్నాడు.

కంసుడు ‘ఇదేదో బాగానే చెప్పాడు’ అనుకుని మీ ఇద్దరు హాయిగా అంతః పురమునకు వెళ్ళిపొండి’ అని ఆ రథమును వదిలిపెట్టేశాడు. దేవకీ వసుదేవులు ఎంతో సంతోషముగా ఉన్నారు.


 Srimadhandhra Bhagavatham -- 65 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

దేవకీ వసుదేవులు సంతోషంగా ఉంటూ ఉండగా వారికి మొట్టమొదట కొడుకు పుట్టాడు. పుట్టిన కొడుకును పుట్టినట్లుగా పట్టుకువెళ్ళి కంసునికి ఇచ్చేశాడు. వసుదేవుని చూసి ‘బావా చూశావా నువ్వు ఎంత మాట తప్పని వాడవో! పిల్లవాడు పుట్టగానే తీసుకు వచ్చి ఇచ్చావు. నాకు అందుకే నీవంటే అంత గౌరవం. నువ్వు మాట తప్పని వాడవు. ఎనిమిదవ వాడు కదా నన్ను చంపేది! మొదటివాడిని చంపడమెందుకు? తీసుకువెళ్ళిపో’ అన్నాడు. వసుదేవుడు పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. రెండవ కొడుకు పుట్టాడు. ఎనిమిదవ గర్భమును కదా ఇమ్మన్నాడని రెండవ పిల్లవానిని తీసుకు వచ్చి ఇవ్వలేదు. ఇలా ఆరుగురు పిల్లలు పుట్టారు. ఆ ఆరుగురు పిల్లలతోటి అమ్మకి, నాన్నకి మిక్కిలి అనుబంధం ఏర్పడింది. ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒకరోజున కంసుని దగ్గరికి నారదుడు వచ్చాడు. ఆయన మహాజ్ఞాని. ఎప్పుడు వచ్చినా ఏదో లోకకళ్యాణం చేస్తాడు. కంసుని దగ్గరకు వచ్చి ‘కంసా! ఎంత వెర్రివాడవయ్యా! అసలు నీవు ఎవరిని వదిలిపెడుతున్నావో వారెవరూ మనుష్యులు కారు. నువ్వు క్రిందటి జన్మలో ‘కాలనేమి’ అను పేరు గల రాక్షసుడవు. నిన్ను శ్రీమహావిష్ణువు సంహరించారు. నీ తండ్రి, తల్లి, దేవకీ, వసుదేవుడు, పక్క ఊళ్ళో ఉన్న నందుడు, ఆవులు, దూడలు వీరందరూ దేవతలు. నిన్ను చంపడానికే వచ్చారు’ అని చెప్పి ఆయన హాయిగా నారాయణ సంకీర్తనం చేసుకుంటూ ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయాడు.

కంసుడికి అనుమానం వచ్చింది. నారదుడు అనవసరంగా అబద్ధం చెప్పడు కదా! వసుదేవుడిని ఆరుగురి పిల్లలను తీసుకురమ్మనమని కబురు చేశాడు. ‘ఎనిమిదవవాడికి వీళ్ళు సహాయ పడితే నా బ్రతుకు ఏమయిపోవాలి? ఉన్నవాళ్ళను ఉన్నట్లుగా సంహరించాలి’ అనుకుని పిల్లలను చంపేశాడు. తన తల్లిని, తండ్రిని, దేవకిని, వసుదేవుని అందరినీ కారాగారంలో పెట్టి బకుడు, తృణావర్తుడు, పూతన – ఇలాంటి వారినందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేసాడు. వస్తున్న గర్భం ఏడవ గర్భం. జాగ్రత్త పడిపోవాలని దేవకీ వసుదేవులను అత్యంత కట్టుదిట్టమయిన కారాగారంలో పెట్టాడు. రోజూ తానే వెళ్ళి స్వయంగా చూస్తుండేవాడు. ఇక్కడ ఒక అనుమానం రావాలి. వసుదేవుని పిల్లలు పసివారు. నారదుడు మహానుభావుడు. లోకకళ్యాణకారకుడు. ‘నారం దదాతి యితి నారదః’ అని ఆయన జ్ఞానం ఇచ్చేటువంటి వాడు ఆరుగురు పిల్లలు చచ్చిపోవడానికి ఎందుకు కారకుడు అయ్యాడు? వచ్చి ఆయన చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి? కంసునితో ఎందుకు అలా చెప్పాడని అనుమానం వస్తుంది. భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు. దీనికి పరిష్కారం దొరకాలంటే దేవీభాగవతం చదవాలి. దేవీ భాగవతంలో ఈ రహస్యమును చెప్పారు.

పూర్వం మరీచి, ఊర్ణాదేవి అని ఇద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఆరుగురు పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. వీళ్ళు ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి సభకు వెళ్ళారు. వాళ్ళు నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చుని ఉండగా ఒక నవ్వు నవ్వారు. బ్రహ్మగారు ‘మీరు రాక్షసుని కడుపున పుట్టండి’ అని శపించారు. అందువలన వారు ఆరుగురు క్రిందటి జన్మలో ‘కాలనేమి’కి కుమారులుగా జన్మించారు. అలా కాలనేమి పుత్రులుగా కొంతకాలం బ్రతికి తదనంతరం హిరణ్యకశిపుని కడుపున పుట్టారు. అప్పటికి వాళ్ళకి ఉన్న రజోగుణ తమోగుణ సంస్కారం తగ్గింది. మరల బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు వారికి దీర్ఘాయుర్దాయమును ప్రసాదించారు. ఈవిషయమును వారు తండ్రయిన హిరణ్యకశిపునకు చెప్పారు. హిరణ్యకశిపునికి కోపం వచ్చింది. ‘నేను యింకా తపస్సు చేసి దీర్ఘాయుర్దాయమును పొందలేదు. మీరు అప్పుడే పొందారా? మిమ్మల్ని శపిస్తున్నాను. మీరు దీర్ఘనిద్రలో ఉండి మరణించండి. అంతేకాకుండా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గతజన్మలో తండ్రి ఆ జన్మలో మిమ్మల్ని చంపుతాడు’ అన్నాడు. వాళ్ళు దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు. మరుజన్మలో మరీచి ఊర్ణల కొడుకులు ఇప్పుడు దేవకీదేవి కడుపున పుట్టారు. వాళ్ళ శాపం ఈ జన్మతో ఆఖరవుతుంది. వీళ్ళు ఇప్పుడు గతజన్మలోని తండ్రి కాలనేమి అయిన కంసుడిచేతిలో మరణించాలి. వారికి ఆ శాప విమోచనమయి వారు మరల బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి. నారదుడు వచ్చి వాళ్ళు శాప విమోచనం పొందేలా చేసాడు. అదీ నారదుని రాకలో గల కారణం. ఇది దేవీ భాగవతాంర్గతం.

కుండలోపల వెలుగుతున్న దీపంలా లోకములనన్నింటినీ తన కడుపులో పెట్టుకున్న శ్రీమహావిష్ణువుని తనకడుపులో మోయవలసినటువంటి దేవకి కంసుని కారాగారమునందు మగ్గుతున్నది. ఈ స్థితిలో ఒక చిత్రం జరిగింది. శ్రీమన్నారాయణుడు తాను అవతరించాలని అనుకున్నాడు. తనకన్నా ముందు శేషుడు బయలుదేరుతున్నాడు. ఆదిశేషుడు ముందు అన్నగారుగా పుట్టాలి. యోగమాయను పిలిచి ఒకమాట చెప్పాడు. ‘నీవు భూమి మీదకి వెళ్ళు. అక్కడ కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులు ఉన్నారు. కంసుడు వసుదేవుని భార్యలందరినీ ఖైదు చేశాడు. ఒక్క రోహిణి మాత్రం నందవ్రజంలో నందుని దగ్గర ఉన్నది. వసుదేవుని తేజస్సు దేవకీదేవిలో ఏడవగర్భంగా శేషుని అంశ ఉన్నది. ఎవరికీ తెలియకుండా ఆ గర్భస్థమయిన పిండమును వెలికి తీసి దానిని తీసుకు వెళ్ళి నందవ్రజంలో ఉన్న రోహిణీ గర్భమునందు ప్రవేశపెట్టు. గర్భస్రావం అయిందని అందరూ అనుకుంటారు. ఇక్కడ జారిపోయిన పిండము అక్కడ పెరుగుతుంది. పెరిగి అక్కడ వర్ధిల్లుతాడు. శేషుడు బలరాముడన్న పేరుతో జన్మిస్తాడు. నన్ను సేవించాలని కోరుకుంటున్నాడు. నీవు వెళ్ళి ఆపని చేయవలసినది’ అని చెప్పాడు. వెంటనే యోగమాయ బయలుదేరి వచ్చింది. ఏడవ గర్భంలో దేవకీదేవి గర్భము నిలిచి సంతోషంగా ఉన్న సమయంలో ఆమె కడుపులో ఉన్న పిండమును బయటికి లాగి నందవ్రజంలో నందుని దగ్గర వున్న రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టింది.

ఇవాళ భాగవతమును వింటున్నప్పుడు ఇది జరుగుతుందా అని సందేహించనవసరం లేదు. ఇప్పుడు మనవాళ్ళు చేసే పనిని భాగవత కాలంలోనే మహర్షులు చేశారు. చాలా బలవంతుడయిన వాడు కాబట్టి ఆయనకు ‘బలభద్రుడు’ అని పేరు. లోకముల నన్నింటిని ఆనందింప చేస్తాడు కాబట్టి రామ శబ్దమును ప్రక్కన పెట్టి ‘బలరామా’ అని పిలిచారు. ఈ అమ్మ కడుపులోంచి లాగబడి వేరొక అమ్మ కడుపులోకి ప్రవేశ పెట్ట బడ్డాడు ‘సంకర్షణుడు’ అని పేరు వచ్చింది. ఈవిధంగా బలరాముని ఆవిర్భావం జరిగింది. తదనంతరం కృష్ణపరమాత్మ ఆవిర్భవించాలి. శ్రీమన్నారాయణుని పూర్ణమయిన తేజస్సు బయలుదేరి వసుదేవుడిని ఆవహించింది. వసుదేవుడి లోంచి ఆ తేజస్సు దేవకీ గర్భంలోనికి ప్రవేశించింది. కృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నాడు. ఈ గర్భంలోకి ముప్పది కోట్ల మంది దేవతలు బ్రహ్మగారితో కలిసి వచ్చి దేవకీదేవి కడుపులోకి వెళ్ళి నిలబడ్డారు. ఇదీ గర్భశుద్ధి అంటే. వారందరూ మహానుభావా! నీవు మాయందు అనుగ్రహించాలి. కంసాదులు రాజ్యం చేస్తూ భక్తులయిన వారిని నిగ్రహిస్తున్నారు. ముకుందా! నీవు అమ్మ గర్భంలోనుండి బయటకు రావసిందని పరమాత్మను స్తోత్రము చేస్తున్నారు.

ఇక్కడ కంసుని పరిస్థితి దారుణంగా ఉన్నది. దేవకికి అష్టమ గర్భం వచ్చేసింది. నెలలు పెరుగుతున్నాయి. తొమ్మిదవ నెల వచ్చేసింది. స్పష్టంగా తేజస్సు కనపడుతున్నది. ఆ అష్టమ గర్భంలో పుట్టేవాడు తనను చంపేస్తాడని భయం. జ్ఞానము చేత లోకమంతా ఒక ఈశ్వరుడు కనపడ్డట్టే కంసునికి కూడా కనపడుతోంది. నారదుడు ధర్మరాజు గారితో ‘కొందరు వైరముతో కూడా ఈశ్వరుని పొందుతున్నారు’ అన్నాడు. కంసుడు ఎవరిని చూసినా శ్రీహరే కనపడుతున్నాడు. కృష్ణుడు ఆవిర్భవించే సమయం ఆసన్నమవుతున్నది. శ్రావణమాసంలో అర్థరాత్రి పన్నెండు గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావం జరిగింది. ఆకాశం అంతా మబ్బులు పట్టి ఉన్నది. కంసుడు గాఢనిద్రలో ఉన్నాడు. భటులను పెట్టాడు. తలుపులు దగ్గరికి వేసి వాటికి ఇనుప గొలుసులు వేసాడు. వాటిలో మేకులు దింపాడు. తాళములు వేసాడు. తాళం చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. వసుదేవుడు ఏమయినా చేస్తాడేమోననే అనుమానంతో వసుదేవుని కాళ్ళకు చేతులకు ఇనుప సంకెళ్ళు వేశాడు. ఆనాడు దేవకీ ప్రసవ సమయమందు సహాయం చేసిన వారు లేరు. ఆతల్లి అంత బాధపడింది. అటువంటి స్థితిలో అర్థరాత్రి పన్నెండు గంటల వేళయింది.

మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. నాలుగు బాహువులతో, నల్లటి మబ్బువంటి కాంతితో, పట్టు పీతాంబరము కట్టుకుని, శంఖ చక్ర గదా పద్మములను పట్టుకొన్న వాడై, మహానుభావుడు వజ్ర వైడూర్యములు పొదగబడిన కిరీటముతో, నల్లటి కుంతలములతో, చెవులకు పెట్టుకొనబడిన కర్ణాభరణముల కాంతి గండ స్థలములయందు ప్రకాశిస్తూ ఉండగా, మెడలో కౌస్తుభమనే రత్నమును ధరించి, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో, సమస్త లోకములు కొలిచే పాదపద్మములతో, చంటిపిల్లవాడిగా వసుదేవునికి దర్శనం ఇచ్చాడు. పిల్లవానిని చూసి సంకెళ్ళలో ఉన్న వసుదేవుడు పొంగిపోయాడు. అన్ని లోకములను కాపాడేవాడు ఈవేళ నాకు కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకు పుడితేనే గోదానం, వస్త్రదానం, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు. నేను ఎన్ని దానాలు చెయ్యాలి. కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చేయాలి. నేను చెయ్యడానికి కూడా లేదు. ‘కృష్’ అనగా నిరతిశయ ఆనందరూపుడు. ఆ కృష్ణ దర్శనంతో కలిగిన ఆనందములో ఆయన స్నానం చేసాడు. ఒక్కసారి నీళ్ళు ముట్టుకున్నాడు. మానసికముగా పదివేల మంది బ్రాహ్మణులకు పదివేల గోవులను దానం చేశాడు. ‘నేను కారాగారమునుండి బయటకు వచ్చిన తరువాత తీర్చుకుంటాను’ అనుకుని పిల్లవాడుగా ఉన్న స్వామిని చూసి దేవకీ వసుదేవులు నమస్కరించారు. కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ ‘భయపడకండి. అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెపుతాను వినండి.

 Sri Siva Maha Puranam -- 11 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


కేదారేశ్వరుడు


కేదారేశ్వర లింగం గురించి ఒకమాట చెప్తారు.


మహాద్రి పార్శ్వే చ తటే రమంతం, సంపూజ్యమానం సతతం మునీంద్రైః

సురాసురైర్యక్షమహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే!! (ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం – ౧౧)


హిమాలయ పర్వతములలో వెలసినది కేదారలింగము. నరనారాయణులిద్దరూ సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరీక్షేత్రము నందు తపస్సు చేసినప్పుడు ద్యోతకమయిన శివలింగము. కేదారమునందు ఉన్న శివలింగమును దర్శనం చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే! కేదారేశ్వర లింగమును దర్శనం చేసేటప్పుడు ఒక నియమం ఉన్నది. ఆ నియమంతోనే దర్శనం చేయాలి.

కేదారేశ్వరంలో నరనారాయణులు ఒక పార్థివ లింగమును ఉంచి ఆరాధన చేస్తూ ఉండేవారు. పార్థివ లింగము అంటే మట్టితో చేసిన శివలింగం. మట్టితో చేసిన ఆ శివలింగమును వారు సాక్షాత్తు ఈశ్వరుడని నమ్మి శివలింగమునకు అర్చన చేస్తు ఉండగా ఆ శివలింగం లోంచి పరమశివుడు ఆవిర్భవించి ‘మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగిపోయాను. ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివ లింగమునకు అర్చన చేశారు. మీకేమి కావాలో కోరుకోమని అడిగితే వారు ‘స్వామీ! ఇక్కడే ఈ బదరీ క్షేత్రమునకు ఆవలివైపు హిమాలయ పర్వతశృంగముల మీద నీవు స్వయంభువ లింగమూర్తివై వెలసి లోకమును కాపాడు’ అని అడిగారు. వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిశాడు.

హిమాలయ పర్వతములు సముద్ర మట్టమునకు కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. కేదారం వెళ్ళడానికి దారి కొన్ని నెలలలో మాత్రమే వీలు చేయబడుతుంది. రాత్రి తొమ్మిది దాటితే ఆ మార్గ ప్రాంతంలో కరెంటు తీసివేస్తారు. అక్కడి కాటేజీలలో చీకట్లోనే పడుకోవాలి. అక్కడ ప్రయాణం చేయాలి అంటే పాదచారియై వెళ్ళాలి. మంచి హోరుమని వానలా పడిపోతుంది. పైనుంచి క్రిందకి చూస్తే కళ్ళు తిరుగుతాయి.

ఇటునుంచి రుద్రప్రయాగ, అటునుంచి దేవప్రయాగ రెండూ వెళ్ళి కలుస్తాయి. ఇక్కడ గంగానది – బదరీలో అలకనందానది. పర్వతముల నుండి ఎన్నో జలపాతములు పడిపోతూ ఉంటాయి. సాధారణంగా ఆ మార్గంలో నడిచి వెళ్ళే వాళ్ళు తక్కువ. డోలీ, లేదా గుర్రముల మీద కూర్చుని వెళ్ళాలి. గుర్రం ఒక్కసారి జారిందంటే ఇక గుర్రం మీద కూర్చున్న వాడిని వెతకవలసిన అవసరం ఉండదు. అలా జారితే వాడు కొన్నివేల అడుగుల నుండి క్రింద పడిపోతాడు. శరీరం చిన్నాభిన్నం అయిపోతుంది. యాత్రలో ఎన్ని కష్టములు ఉన్నప్పటికీ కేదారనాథ్ యాత్ర వెళ్ళితీరవలసిన యాత్ర. ఇన్నివేల అడుగులు పైకి ఎక్కిన తర్వాత స్వామి దేవళం కనపడుతుంది. లోపలి వెడితే లోపల పెద్ద అంతరాలయం ఉంటుంది. అక్కడ మహానుభావుడు కేదారేశ్వరుడుగా వెలిశాడు. కేదార శివలింగ దర్శనం చేసిన వాడికి మోక్షం కరతలామలకమని శివమహాపురాణం, పెద్దలు నిర్ణయం చేశారు. కేదారం వెళ్ళినపుడు పడిపోయిన వారికి కూడా మోక్షం దొరికి తీరుతుంది.

ఆ శివాలయంలో ఒకసారి ఒక విచిత్రమయిన స్థితి ఏర్పడింది. అక్కడ శివలింగం వెలసి కొన్ని యుగములు అయింది. శివాలయములో శివునికి పునఃప్రతిష్ఠ ఉండదు.

ఒకసారి పాండవులు అయిదుగురు కలిసి కేదారేశ్వర దర్శనమునకు వెళ్ళారు. ఆలయంలో చిన్న శివలింగం ఉన్నది. పాండవులు ఏమి చేస్తారో చూడాలని శివునికి ఒక ముచ్చట. ఒక చిన్న దున్నపోతు రూపంలో పరుగెత్తాడు. పాండవులు దానిని గమనించారు. వారు ఖచ్చితంగా అది శంకరుడే అయి ఉంటాడని భావించారు. మహిషరూపంలో వెడుతున్నా అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు. ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు. దాని కాళ్ళు పట్టుకోవాలని వారు ఆ మహిషం దగ్గరికి వెళ్ళారు. వాళ్లకి దాని కాళ్ళు అందలేదు. తోక అందింది. ఈశ్వర స్వరూపంగా దాని తోక పట్టుకున్నారు. వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై పరమేశ్వరుడు తన పృచ్ఛభాగమును అక్కడ విడిచిపెట్టి దానిని శివలింగంగా మార్చివేశాడు. అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్న కేదారలింగం. కేదారం వెళ్లి వచ్చిన వాడికి అంతటా శివుణ్ణి చూడడం అభ్యాసంలోకి రావాలి. అంత పరమ పవనమయిన క్షేత్రం కేదార క్షేత్రం.


కొండ ఎక్కుతున్నప్పుడే దూరంగా కైలాస దర్శనం అవుతూ ఉంటుంది. ‘అదిగో కైలాసం కనపడుతోంది చూడండి అంటారు. ఆ మంచుకొండ నిజంగా కైలాసంలాగే భాసిస్తూ ఉంటుంది. వర్షం ఆగి సూర్య కిరణములు పడుతుంటే ఆ దృశ్యం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కైలాస సమీపమునకు వెళ్లి వచ్చినట్లు అనిపిస్తుంది. శంకర భగవత్పాదులు అక్కడే తమ సత్యదండమును విడిచిపెట్టేశారు అని భక్తులు నమ్ముతుంటారు. అక్కడ శంకరుల సత్యదండపు పెద్ద ఫోటో ఒకటి ఉంటుంది. అక్కడే చిన్న ఆలయం కూడా ఉంటుంది. కేదారము అంత గొప్ప క్షేత్రము.


కేదారక్షేత్రం వెళ్ళినవారు తెలియక ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. కేదార లింగమును తిన్నగా కంటితో చూడకూడదు. వలయమును పట్టుకు వెళ్ళాలి. వలయము అంటే చేతికి వేసుకునే కంకణం వంటి గుండ్రని వస్తువును తీసుకువెళ్ళాలి. అంతరాలయంలో ప్రవేశించగానే కంటిముందు ఆ వలయమును పెట్టుకుని అందులోంచి చూడాలి. కేదారము దర్శనము చేత మోక్షమీయగలిగిన క్షేత్రం గనుక సమస్త బ్రహ్మాండము నిండినవాడు వీడే అని తెలుసుకోవడానికి కంటికి అడ్డంగా ఒక వలయాకరమును పెట్టుకుని అందులోంచి కేదార లింగమును చూడాలి. అలా చూసిన వలయ కంకణమును అక్కడ వదిలిపెట్టి వచ్చెయ్యాలి. మన చేతికి ఉన్న ఏ బంగారు కంకణమునో ఉపయోగించినట్లయితే దానిని అక్కడ వదిలిపెట్టేయడానికి మనసొప్పదు. ముందే ఒక రాగి కంకణమును పట్టుకుని వెడితే రాగి చాలా ప్రశస్తము కనుక, ఆ కంకణములోంచి కేదార లింగమును దర్శనం చేసి దానిని అక్కడ వదిలిపెట్టి రావచ్చు. ఇకముందు వెళ్ళేవారు ఒక వలయంలోంచి కేదారలింగమును దర్శనం చేసే ప్రయత్నం చేస్తే మంచిది.



చిన్నపిల్లల అనారోగ్య ఔషధ యోగాలు

 చిన్నపిల్లల అనారోగ్య నివారణ కొరకు ఔషధ యోగాలు - 2 . 


 * చిన్నపిల్లలకు మూత్రము బంధించిన - 


    నిమ్మగింజలను నూరి బొడ్డుపైన పట్టు వేసి చన్నీళ్ళను పైనుంచి ధారగా పోయుచున్న చిన్నపిల్లలకు మూత్రము ధారాళముగా వెడలును . 


 *  చిన్నపిల్లలు పాలు కక్కుచున్న - 


      చిన్నపిల్లలకు పాలు ఇచ్చుటకు ముందు , ఇచ్చిన తరువాత కొంతసేపటికి నాలుగైదు చుక్కల నిమ్మకాయ రసం తాగించుచుండిన త్వరలొనే పాలు కక్కు సమస్య తగ్గును . 


 *  చిన్నపిల్లల లివర్ మరియు స్ప్లీన్ సమస్యల నివారణ కొరకు - 


     నీరుల్లిపాయలను (onion ) దారముతో గుచ్చి చిన్నపిల్లల మెడలో కట్టుచుండిన లివర్ మరియు స్ప్లీన్ సమస్యల నుంచి బయటపడుదురు . 


 *  చిన్నపిల్లల దగ్గు హరించుట - 


     దానిమ్మ బెరడు , ఉప్పు కలిపి నూరి కందిగింజ అంత మాత్ర తేనెతో నూరి నాకించుచుండిన చిన్నపిల్లల దగ్గు నివారణ అగును . 


 *  ఎక్కిళ్లు నివారణ కొరకు - 


      కుంకుడు కాయకు రంధ్రము చేసి దారంతో గుచ్చి పిల్లల కంఠము నందు మాలగా వేసిన దృష్టిదోషము వలన కలిగిన ఎక్కిళ్లు నివారణ అగును . 


             కొబ్బరికోరు పావుతులం , పటికబెల్లం పొడి పావుతులం కలిపి తినిపించుచుండిన పిల్లలకు వచ్చు ఎక్కిళ్ళు నివారణ అగును .


 *  పిల్లలకు బాన పొట్ట నివారణ - 


     పిల్లలకు పొట్ట పెద్దగా అయినపుడు రోజూ ఒక వెల్లుల్లిపాయ తినిపించుచుండిన యెడల ఊదర పొట్ట హరించును . 


 *  చిన్నపిల్లల కోరింత దగ్గు హరించుట కొరకు - 


     అరటిఆకులను మాడ్చి భస్మము చేసి ఆ భస్మమును మూడు పర్యాయములు ఒక చిటికెడు తేనెతో కలిపి నాకించుచున్న ఎటువంటి కొరింత దగ్గు అయిన నివారణ అగును . 


     మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


ఆరోగ్యం పట్ల అవగాహన

 *ANU power yoga & Natural healing center.*

(ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న Contact:9381490085)


*🌺ఎడమ వైపు నిద్ర పోవడం*

భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని పచనం ( జీర్ణం ) చెయ్యటానికి జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది . మెదటగా మెదడు లోని రక్తం , తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది . అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది . అందు వలన నిద్ర వస్తుంది . నిద్ర పోవడం మంచిది .

ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవలెను . ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు *వజ్రాసనం* వేయండి .

# రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు . కనీసం *2 గంటల* తర్వాత నిద్ర పోవాలి . మీరు వెంటనే నిద్ర పోవడం వలన *డయాబెటీస్* , *హార్ట్ ఎటాక్* వచ్చే ప్రమాదముంది .

*పడుకునే విధానం* :----

ఎడమ ప్రక్కకు తిరిగి , ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి .

# దీనిని *వామ కుక్షి* అవస్దలో విశ్రమించటం అంటారు .

# మన శరీరంలో *సూర్యనాడి , చంద్ర నాడి మరియు మధ్యనాడి* అనే మూడు నాడులున్నాయి . సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి పనికొస్తుంది . ఈ సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది .

# మీరు అలసత్వానికి గురైయినపుడు , ఇలా ఎడమ వైపున తిరిగి పడుకొనుట వలన అలసత్వం తొలగి పోతుంది . మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు .

*ప్రయోజనాలు ( Benefits )* 

1 . గురక తగ్గి పోవును .

2. గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్బాశయంకు , కడుపులోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును . వెన్ను నొప్పి , వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగును .

3 . భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది .

4 . వీపు , మెడ నొప్పులున్నవారు ఉపశమనం పొందెదరు .

5 . శరీరంలో వున్న విషాలని , వ్యర్ద పదార్ధలని తొలగించే రసాయనాలకు తోడ్పడుతుంది .

6 . తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి నెట్టి వేయ బడును .

7 . కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి .

8 . జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగును .

9 . గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేయును .

10 . గుండెలోని మంటను నిరోధిస్తుంది . కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి .

11 . ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు .

12 . కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయి .

13 . మెదడు చురుకుగా పని చేస్తుంది .

14 . పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది .

15 . ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి* .

ప్రతి ఒక్కరు వారి వారి పద్దతులలో నిద్రపోతారు . కావున వెంటనే మీరు మీ పద్ధతిని మార్చుకోవాలంటే చాలా కష్టం . కాని మీరు మీ ఆరోగ్యం కొరకు కొద్దిగా ప్రయత్నం చేస్తే మార్పు చేసుకోవచ్చును .

ఎడమ వైపు తిరిగి పడుకొనిన యెడల , మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు మీరు గమనించ వచ్చును .

*మీరు ఈ చిన్న మార్పుని చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి*

*గమనిక* : 

తల తూర్పు వైపు పెట్టి పడుకోవాలి . కుదరకపోతే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి .

ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు . చదువు కునేందుకు , ఏదైనా అభ్యాసానికి ఉత్తర దిశ మంచిది. 🌺ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి.............

పంచాంగఫలముత్తమ్

 తిథేశ్చ శ్రియమాప్నోతి* 

       *వారాదాయుష్యవర్ధనమ్* 

       *నక్షత్రాత్ హరతే పాపం* 

       *యోగాత్ రోగనివారణం* 

       *కరణాత్ కార్య సిధ్ధిం చ* 

       *పంచాంగఫలముత్తమ్*

 🕉️ *ఓం శ్రీ గురుభ్యోనమః* 🕉️

             *పంచాఙ్గము*

*ఆదివారం, నవంబర్ 06, 2022*

*శ్రీ శుభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం,* *శరదృతువు*

*కార్తీక మాసము,* *శుక్ల పక్షం*

✳️><<>><<>♾️🔘♾️<>><<>><✳️

       *తిథేశ్చ శ్రియమాప్నోతి* 

       *వారాదాయుష్యవర్ధనమ్* 

       *నక్షత్రాత్ హరతే పాపం* 

       *యోగాత్ రోగనివారణం* 

       *కరణాత్ కార్య సిధ్ధిం చ* 

       *పంచాంగఫలముత్తమ్*

✳️><<>><<>♾️🔘♾️<>><<>><✳️

తిథి : *త్రయోదశి* సా.4.26 వరకు 

వారం : *ఆదివారం* (భానువాసరే)

నక్షత్రం : *రేవతి* రా.12.50 వరకు

యోగం : *వజ్రం* రా.1.22 వరకు

కరణం : *తైతుల* సా.4.26 వరకు

             తదుపరి *గరజి* తె.4.07 వరకు


వర్జ్యం : *మ.12.58 - 2.33*

దుర్ముహూర్తం : *సా.3.53 - 4.38* 

అమృతకాలం : *రా.10.27 - 12.02*

రాహుకాలం : *సా.4.30 - 6.00*

యమగండ/

కేతుకాలం : *మ.12.00 - 1.30*


సూర్యరాశి : *తుల*

చంద్రరాశి : *మీనం*

సూర్యోదయం : *6.04* 

సూర్యాస్తమయం : *5.25*

✳️><<>><<>♾️🔘♾️<>><<>><✳️

తులసి అనగా

 *తులసి అనగా ఎవరు?*

 ``` తులసి (మొక్క) గత జన్మలో ఆడపిల్ల, ఆమె పేరు బృందా, రాక్షస వంశంలో పుట్టింది, చిన్నప్పటి నుంచి విష్ణు భక్తురాలు, ఎంతో ప్రేమతో భగవంతుడిని పూజిస్తూ, సేవిస్తూ ఉండేది. ఆమె పెరిగింది, ఆమె రాక్షస వంశంలో రాక్షస రాజు జలంధరుని వివాహం చేసుకుంది.  జలంధరుడు సముద్రం నుండి పుట్టాడు.

 వృందా చాలా పవిత్రమైన స్త్రీ, ఎప్పుడూ తన భర్తకు సేవ చేసేది.

 ఒకసారి దేవతలు మరియు రాక్షసుల మధ్య యుద్ధం జరిగింది, జలంధరుడు యుద్ధానికి బయలుదేరినప్పుడు, బృందా "" -

 ప్రభూ, నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు, నువ్వు యుద్ధంలో ఉన్నంత వరకు, నేను పూజలో కూర్చుని, మీ విజయానికి పూజలు చేస్తాను, మీరు తిరిగి వచ్చే వరకు, నేను నా ప్రతిజ్ఞ పాలన అని సంకల్పం తీసుకుంటాను .అప్పటివరకు నా సంకల్పం

 వదలను అని అంటుంది.  జలంధరుడు యుద్ధానికి వెళ్ళాడు, వృందా ఉపవాస వ్రతం చేసి పూజలో కూర్చుంది, ఆమె ఉపవాస ప్రభావం వల్ల దేవతలు కూడా జలంధరుని గెలవలేకపోయారు, దేవతలందరూ ఓడిపోవడం ప్రారంభించినప్పుడు, వారు విష్ణువు వద్దకు వెళ్లారు.

 అందరూ దేవుడిని ప్రార్థించినప్పుడు, దేవుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు - బృందా నా పరమ భక్తురాలు, నేను ఆమెను మోసం చేయలేను.

 అప్పుడు దేవత ఇలా అన్నాడు - దేవా, వేరే మార్గం లేదు, ఇప్పుడు మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరు.

 భగవంతుడు జలంధరుడి రూపం ధరించి వృందా రాజభవనానికి చేరుకున్నాడు

 భర్తను చూసిన బృందా వెంటనే పూజ నుండి లేచి అతని పాదాలను తాకింది.నా భర్త తల తెగిపోయి ఉండడం చూసి నేను పడిపోయాను వృంద అప్పుడు నా ఎదురుగా నిలబడినది ఎవరు?

 ఆమె  అడిగింది - నేను తాకిన మీరు ఎవరు, అప్పుడు దేవుడు తన రూపంలో వచ్చాడు, కానీ అతను ఏమీ చెప్పలేకపోయాడు, వృందాకు మొత్తం అర్థం అయ్యింది, ఆమె దేవుడిని శపించింది , మీరు రాయిగా మారండి, మరియు దేవుడు వెంటనే రాయి అయ్యాడు. .

 దేవతలందరూ ఏడ్వడం ప్రారంభించారు మరియు లక్ష్మీ జీ ఏడ్చి ప్రార్థించడం మొదలుపెట్టారు, వృందా జీ అదే పనిని దేవునికి తిరిగి చేసి తన భర్త తలను పట్టుకుంది, ఆమె

 సతి జరిగింది.

 అతని బూడిద నుండి ఒక మొక్క ఉద్భవించినప్పుడు

 విష్ణువు చెప్పాడు - నేటి నుండి

 ఆమె పేరు తులసి, మరియు నా రూపాలలో ఒకటి ఈ రాయి రూపంలో ఉంటుంది, ఇది శాలిగ్రామం పేరుతో తులసితో పాటు పూజించబడుతుంది.

 తులసి జీ లేకుండా భోగ్

 ``నేను ఒప్పుకోను.  అప్పటి నుండి అందరూ తులసిని పూజించడం ప్రారంభించారు.  మరియు కార్తీక మాసంలో శాలిగ్రామ్ జీతో తులసి జీ వివాహం.

 ``` పూర్తయింది. దేవ్-ఉతవాణి ఏకాదశి రోజున దీనిని తులసీ వివాహంగా జరుపుకుంటారు!```

 * ఈ కథను కనీసం ఇద్దరికైనా చెప్పండి, మీకు ఖచ్చితంగా పుణ్యం లభిస్తుంది.  లేదా నాలుగు గ్రూపులుగా పంపండి.

స్వంత వారిని కూడా నమ్మడు.

 శ్లోకం:☝️

  *దుర్జనదూషిత-మానసః*

*స్వజనేష్వపి నాస్తి విశ్వాసః |*

  *బాలః పాయస-దగ్ధో*

*దధ్యపి ఫూత్కృత్య భక్షయతి ||*


భావం: ఎలాగైతే వేడి పాయసంతో మూతి కాలిన పిల్లవాడు పెరుగును కూడా ఊదుకుని తింటాడో... దుర్జనుల వల్ల దూషితమైన (మోసపోయిన) వాడు తన స్వంత వారిని కూడా నమ్మడు.

5, నవంబర్ 2022, శనివారం

రాయబార కార్యాలయంలో మహిళ మోదీజీ గురించి ఇలా ఒక పోస్ట్‌లో రాసింది !*

 *జర్మనీలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళ మోదీజీ గురించి ఇలా ఒక పోస్ట్‌లో రాసింది !*


 ఆమె రాసింది ...........


 మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జర్మనీకి వచ్చినప్పుడు, అతను తనతో పాటు తన బంధువులైన 40 మందిని తీసుకువచ్చాడు.


 వారి బస కోసం మొత్తం ఐదు హోటళ్లు (అన్నీ ఫైవ్-స్టార్) బుక్ చేయబడ్డాయి.


 బంధువులందరూ ప్రతిరోజూ ఖరీదైన మాల్స్‌లో షాపింగ్ చేసి లక్షలాది రూపాయలకు వస్తువులను కొనుగోలు చేశారు.


 మొత్తం విదేశాంగ శాఖ పేరుతో బిల్లులు వసూలు చేశారు.


 మన్మోహన్‌ సింగ్‌ పర్యటన కరెన్సీ అంతటా ఇదే రోజువారీ కథనం.


 స్టేట్ డిపార్ట్‌మెంట్‌లోని మొత్తం భారతీయ-సిబ్బంది సేవకుడు వారందరి ముందు నృత్యం చేసేవారు.


 మన్మోహన్‌జీ ఒక్కసారి కూడా రాయబార కార్యాలయానికి రాలేదు లేదా మమ్మల్ని కలవలేదు.


 ఇప్పుడు మోడీజీ జర్మనీకి రెండుసార్లు ప్రధానిగా వచ్చినప్పుడు, సిబ్బంది అంతా మళ్లీ అదే ప్రదర్శనను ఆశించారు.


 కానీ అతను ఒంటరిగా రావడం నాకు ఆశ్చర్యంగా ఉంది!


 బంధువుల సైన్యం లేదు.


 కాబట్టి భద్రత & భద్రత కారణాల దృష్ట్యా హోటల్‌లోని ఒక అంతస్తు మాత్రమే పూర్తిగా బుక్ చేయబడింది.


 మాల్స్‌లో షాపింగ్ లేదు


 ఫుల్ టైమ్ వర్క్ తో బిజీగా ఉన్నారు.


 ఎంబసీ సిబ్బంది చంచగిరి చేయడానికి అనుమతించబడలేదు;


 అయితే, సిబ్బంది తమ కార్యాలయంలోని రోజువారీ పనులను కొనసాగించారు.


 నిజానికి డేటా మొత్తం సేకరించి ఫైల్ ఫోల్డర్‌లో పెట్టే పనిలో చాలా బిజీగా ఉన్నాము, మూడు రోజులు ఇంటికి వెళ్లలేము.


 తన బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, మోడీజీ కొంత సమయం తీసుకొని రాయబార కార్యాలయానికి వచ్చారు మరియు పర్యటనను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇచ్చారు మరియు వారందరూ అతనితో ఒక కప్పు టీ తాగారు.


 ఇది ఒక గొప్ప వ్యక్తి పరిచయం!


 మిత్రులారా, చాలా సంవత్సరాల తర్వాత, మీకు నిజాయితీ గల ప్రధానమంత్రి లభించారు.


70 యేళ్లు విదేశీ శక్తులు పరిపాలనలో లేని అభివృద్ధి 8 ఏళ్లలో ఎలా సాధ్యపడింది ప్రపంచ దేశాలు భారత్ ను హీరో గా ఎందుకు చూస్తున్నాయి దేశ ద్రోహులు మోడీ గారి మీద ఎందుకు పడి ఏడుస్తున్నారు

కార్తీక పురాణం 11 వ అధ్యాయం

 *కార్తీక పురాణం 11 వ అధ్యాయం*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*మంథరుడు - పురాణ మహిమ*


ఓ జనక మహారాజా! యీ కార్తీకమాస వ్రతము యొక్క మహాత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన యెడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణ్యర్చనానంతరం పురాణ పఠనం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారు తప్పని సరిగా వైకుంఠాన్నేపొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను. శ్రద్దగా ఆలకింపుము. అని వశిష్టుల వారు ఈ విధముగా చెప్పసాగిరి.

పూర్వము కళింగ దేశమున మంధరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు, మద్య మాంసాది పానీయాలు సేవించుచూ కొన్ని జాతుల వారి సాంగత్యము వలన స్నానజప, దీపారాధనాదికములను! ఆచారములును పాటింపక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు, భర్త యెంత దుర్మార్గుడయిననూ, పతినే దైవముగానెంచి విసుగు చెందక సకలోపచారములు జేయుచు, పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని చేయుచున్ననూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగ తనములు చేయుచూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద నున్న ధనము, వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనమపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్ర మొకటి గాడ్రించుచు వచ్చి కిరాతుకుని పైబడెను. కిరాతుకుడు దానిని కూడా చంపెను. కానీ అ పులి కూడా తన పంజా తో కిరాతుకకుని కొట్టి యుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒక కాలమున నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమ లోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధ పడుచుండిరి.


మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరి నామ స్మరణ చేయుచు సదాచర వర్తినియై భర్తను తలచుకుని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొనాళ్ళుకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్య పాద్యాదులచే పూజించి " స్వామి!నేను దీనురాలను, నాకు భర్త గాని, సంతతిగానిలేరు. నేను సదా హరి నామ స్మరణ చేయుచు జీవించుచున్న దానను, కాన, నాకు మోక్ష మార్గము ప్రసాదించు" మని బ్రతిమాలుకోనేను. ఆమె వినయమునకు, ఆచారమునకు ఆ ఋషి సంతసించి" అమ్మా! ఈ దినము కార్తిక పౌర్ణమి, చాల పవిత్రమైన దినము. ఈ దినమును వృథాగా పాడు చేసుకోనువద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను చమురు తీసికొన వచ్చెదను. నీవు ప్రమిదను, వత్తి ని తీసికొని రావలయును. దేవాలయములో ఈ వత్తిని దెచ్చిన ఫలమును నీ వందుకోనుము" అని చెప్పిన తోడనే అందుకామె సంత సించి, వెంటనే దేవాలయమునకు వెళ్లి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనే ప్రమిదెలో పోసి దీపారాధ న చేసెను. అటు తరువాత యింటికి వెడలి తనకు కనిపించిన వారి నెల్ల " ఆరోజు రాత్రి ఆలయ ముందు జరుగు పురాణ కాలక్షేపము నకు" రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంత కాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుటచే వల్ల విష్ణుదూతలు వచ్చి విమాన మెక్కించి వైకుంఠమునకు దీసికునిపోయిరి. కానీ - ఆమెకు పాపత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముందుట చేత మార్గ మధ్యమున యమలోకమునకు దీసికోనిపోయిరి. అచట నరక ముందు మరి ముగ్గురితో బాధ పడుచున్న తన భర్తను జూచి " ఓ విష్ణుదూతలారా! నా భర్త మరి ముగ్గురును యీ నరక  బాధపడుచున్నారు . కాన, నాయ౦ందు దయయుంచి వానిని వుద్ధరింపుడని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు " అమ్మా! నీ భర్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడై నాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశ చే ప్రాణహితుని చంపి ధనమపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము నాలుగవ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించిననూ అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము, మద్య మాంసభక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు. అందుకే యీ నలుగురు నరకబాధలు పడుచునారు. " అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకు ఆమె చాలా విచారించి "ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపుడని ప్రార్ధించగా , అందులకా దూతలు " అమ్మా! కార్తీక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిదఫలము కిరాతకునకు, పురాణము వినుటవలన కలిగినఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగునని  చెప్పగా అందులకామె అట్లే ధారపోసేను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లిరి. కావున, ఓరాజా! కార్తీకమాసమున పురాణము వినుటవలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా? అని వశిష్టులవారు అడిగిరి.


పదకొండవ అధ్యాయం సమాప్తము.

క్షీరాబ్ది ద్వాదశి/కైశిక ద్వాదశి*

 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

   

              *_నేటి విశేషం_*


*క్షీరాబ్ది ద్వాదశి/కైశిక ద్వాదశి*

         *శని త్రయోదశి*

క్షీరాబ్ధి ద్వాదశి వ్రత విధానం 


శ్రీ పసుపు గణపతి పూజ


శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే


(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)


శ్లో // అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం

కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)


ఆచమనం


ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,


(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)


ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,

మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,

వామనాయ నమః, శ్రీధరాయ నమః,

ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,

దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,

వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,

అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,

అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,

అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,

ఉపేంద్రాయ నమః, హరయే నమః,

శ్రీ కృష్ణాయ నమః


యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా

తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ //

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః

యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ //

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే

శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే //

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః

వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః

అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః

నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః

ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే //

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ప్రాణాయామము

(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

సంకల్పం

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీమత్ క్షీరాబ్దిశయన దేవతా ముద్దిశ్య శ్రీ క్షీరాబ్ధిశయన దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

కలశారాధనం

శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః

మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః

కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)

శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః

కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం // ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి(అక్షతలు వేయవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి

(గంధం చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.

మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి

(అగరవత్తుల ధుపం చూపించవలెను.)

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(బెల్లం ముక్కను నివేదన చేయాలి)

ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా

ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

(నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.

(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)

ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)

తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.

(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)

ప్రాణప్రతిష్ఠపన

అసునీతే పునర్స్మాసుచక్షుఃపునః ప్రాణమిహనో దేహిభోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనమతే మృడయానః స్వస్తి అమృతంవైప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యధాస్థానముపహ్వయతే ఉపహితో భవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ ప్రసీద ప్రసీద ప్రీతిగృహాణ యత్కించిత్ నివేదితం మయా// తదంగ ధ్యానావాహనాది షోడశోపచారపూజాంకరిష్యే // అధ ధ్యానం.

క్షీరాబ్ధి పూజ విధానము

ధ్యానం:

(పుష్పము చేతపట్టుకొని)

శ్లో. దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాన్యథః కరే

చక్రమూర్ధ్వకరే వామం, గదా తస్యా న్యధః కరే

దధానం సర్వలోకేశం సర్వాభరణ భూషితం

క్షీరాబ్ధిశయనం దేవ ధ్యాయే న్నారాయణం ప్రభుం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // ధ్యాయామి ధ్యానం సమర్పయామి.

(పుష్పము వేయవలెను).

ఆవాహనం:

ఓం సహస్రశీర్ షా పురుషః, సహస్రాక్ష స్సహస్రపాత్,

స భూమిం విశ్వతోవృత్వా, అత్యతిష్ఠ ద్దశాంగులమ్.

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి.

(పుష్పము వేయవలెను).

ఆసనం:

శ్లో. అనేక హార సంయుక్తం నానామణి విరాజితం

రత్న సింహాసనందేవ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః రత్నసింహాసనం సమర్పయామి.

(అక్షతలు వేయవలెను.)

పాద్యం:

శ్లో . పద్మనాభ సురారాద్య పాదాంబుజ శుభప్రద

పాద్యం గృహాణ భగవాన్ మయానీతం శుభావహం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః పాద్యం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)

అర్ఘ్యం:

శ్లో. నిష్కళంక గుణారాధ్య జగత్రయ రక్షక,

ఆర్ఘ్యం గృహాణమద్దత్తం శుద్దోదక వినిర్మితం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // ఆర్ఘ్యం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)

ఆచమనం:

శ్లో. సర్వారాధ్య నమస్తేస్తు సంసారార్ణవతారక

గృహాణ దేవమద్దత్తంపరమాచమనీయకం .

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)

పంచామృతస్నానం

శ్లో. స్వాపాదపద్మసంభూత గంగాశోభిత విష్ణునం

పంచామృతైః స్నాపయిష్యేతంశుద్ధో దకేనాపిచ //

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // పంచామృతస్నానం సమర్పయామి.

టహ్దనంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)

వస్త్రం:

శ్లో. విద్యుద్విలాసరమ్యేణ స్వర్ణవస్త్రేణ సంయుతం,

వస్త్రయుగ్మం గృహణేదం భక్తాదత్తం మయాప్రభో

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

ఉపవీతం:

శ్లో.నారాయణ నమస్తేస్తు నాకాధిపతిపూజిత,

స్వర్ణోపవీతం మద్దత్తం స్వర్ణంచ ప్రతి గృహ్యతాం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి.

గంధం:

శ్లో. రమాలింగన సంలిప్త రమ్య కాశ్మీర వక్షసే

కస్తూరీమిళితం దాస్యే గంధం ముక్తి ప్రదాయకం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః గంధం సమర్పయామి.

(గంధం చల్లవలెను.)

అక్షితలు:

శ్లో. అక్షతానక్షతాన్ శుభ్రాన్ పక్షిరాజధ్వ జావ్యయ,

గృహాణ స్వర్ణవర్ణాంశ కృపయాభక్త వత్సల

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // అక్షితాన్ సమర్పయామి.

(అక్షితలు సమర్పించవలెను)

పుష్పసమర్పణం:

చామంతికా వకుళచంపక పాటలాబ్జ పున్నాగ జాజికరవీరరసాల పుష్పై బిల్వ ప్రవాళతులసీదళ మల్లికాభిస్త్వాం

పూజయామి జగదీశ్వర, వాసుదేవః పుష్పాణి పూజయామి.

(పుష్పాములు వేయవలెను)

అథాంగపూజా:

శ్రీకృష్ణాంగపూజా పారిజాతాపహారకాయనమః పాదౌ పూజయామి,

గుణాధరాయ నమః గుల్ఫౌ పూజయామి,

జగన్నాథాయ నమః జంఘే పూజయామి,

జానకీవల్లభాయ నమః జానునీ పూజయామి,

ఉత్తాలతాల భేత్రై నమః ఊరూ పూజయామి,

కమలానాథాయ నమః కటిమ్ పూజయామి,

నిరంజనాయ నమః నితంబర పూజయామి,

నారయణాయ నమః నాభిమ్ పూజయామి,

వామ్నాయ నమః వళిత్రయం పూజ,

కాలాత్మనేనమః గుహ్యం పూజయామి,

కుక్షిస్థాఖిలభువనాయ నమః ఉదరమ్ పూజయామి,

హృషీకేశాయ నమః హృదయమ్ పూజయామి,

లక్ష్మీవక్షస్థలాయ నమః వక్షఃస్థలమ్ పూజయామి,

పార్థసారథయే నమః పార్శ్వే పూజయామి,

మధురానాథాయ నమః మధ్యమ్ పూజయామి,

హరయే నమః హస్తాన్ పూజయామి,

అనిరుద్ధాయనమః అంగుళీః పూజయామి,

శంఖచక్ర గదాశారఙ్గథారిణే నమః బాహూన్ పూజయామి,

వరదాయనమః స్తనౌ పూజయామి,

అధోక్షజాయ నమః అంసౌ పూజయామి,

కంబుకంఠాయ నమః కంఠం పూజయామి,

ఓజిస్వినే నమః ఓష్ఠౌ పూజయామి,

దామోదరాయ నమః దన్తాన్ పూజయామి,

పూర్ణేందునిభవక్త్రాయ నమః ముఖమ్ పూజయామి,

గరుడవాహనాయ నమః గండస్థలమ్ పూజయామి,

నరనారాయణాత్మకాయ నమః నాసికమ్ పూజయామి,

నీలోత్పలదళశ్యామాయ నమః నేత్రే పూజయామి,

భృగ్వాదిమునిసేవితాయై నమః భ్రువౌ పూజయామి,

భృంగరాజవిరాజిత పాదపంకజాయ నమః భ్రూమధ్యమ్ పూజయామి,

కుండలినే నమః శ్రోత్రే పూజయామి,

లక్ష్మీపతయే నమః లలాటమ్ పూజయామి,

శిశుపాలశిరశ్చేత్త్రే నమః శిరః పూజయామి,

సత్యభామారతాయ నమః సర్వాణ్యాంగాని పూజయామి

ధూపం:

శ్లో . దశాంగం గుగ్గులో పేతంచందనాగురువాసితం

ధూపం గృహాణ దేవేశ దూర్జటీనుతసద్గుణా

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ధూప మాఘ్రాపయామి.

(ఎడమచేతితో గంటను వాయించవలెను)

దీపం:

శ్లో// అజ్ఞాన ధ్వాంతనాశాయ అఖండ లోకశాలినే

ఘృతాక్తవర్తి సంయుక్తం దీపం దద్యామి శక్తితః

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః దీపం దర్శయామి.

(ఎడమచేతితో గంటను వాయించవలెను)

ధూపదీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి

నైవేద్యం:

పృధుకానిక్షుఖండాంశ్చ కదళీఫల కానిచ,

దాపయిష్యే భవత్ప్రీత్యై గృహాణసురపూజిత

(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల చుట్టూ నీరు చిలకరించుచూ.)

ఓం భూర్భువ స్సువః, ఓం త తసవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణ మసి,

(మహా నైవేద్య పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)

(ఎడమచేతితో గంటను వాయించవలెను)

ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయ స్వాహా,

ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా

ఓం సమనాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా.

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నైవేద్యం సమర్పయామి

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

అమృతాభిధానమపి - ఉత్తరాపోశనం సమర్పయామి

హస్తౌ పక్షాళయామి - పాదౌ ప్రక్షాళయామి - శుద్దాచమనీయం సమర్పయామి.

తాంబూలం:

విస్తీర్ణ సుసంయుక్తం నాగవల్లీ విరాజితం

కర్పూరేణసుసమ్మి శ్రం తాంబూలం స్వీకురుప్రభో

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనం:

ప్రదీపితంచ కర్పూర ఖండకైః జ్ఞానదాయినం

గృహాణేదంమయాదత్తం నీరాజనమిదం ప్రభో

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నీరాజనం సమర్పయామి.

(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)

నీరాజనాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి

మంత్రపుష్పమ్:

పుష్పాంజలిం ప్రదాస్యామి భక్త్యాభక్తాశ్రయ ప్రభో అనుగ్రహంతుభద్రం మే దేహి దేవేశ్వరార్చిత!

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి.

( అని మంత్ర పుష్పం సమర్పించి లేచి నిలబడి ముకళితహస్తులై )

ప్రదక్షిణ

ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం సంసార సాగరాన్మాం త్వ ముద్ధరస్య మహాప్రభో ప్రదక్షిణ.

(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)

శ్లో//యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే

పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ

త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల

అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ

తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన

ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం.

సంసారసాగరా న్మాం త్వ ముద్ధరస్వ మహాప్రభో.తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

సాష్టాంగ నమస్కారం:

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం ఏతత్ఫలం

తులసీధాత్రీసమేత శ్రీలక్ష్మీ నారాయణార్పణమస్తు

శ్రీ కృష్ణార్పణమస్తు.

(శ్రీ తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి షోడశోపచార పూజ సమాప్తం.)

క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ

పూర్వము దర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో గూడి ద్వైతవనమందుండగా, నచ్చటికి అనేక ఋషులతోఁ గూడి వ్యాసులవారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగుపూజలు సలిపి కూర్చొండబెట్టి తానును వారి యనుజ్ఞ బొంది కూరుచుడి కొంతతడువు మాటలాడి యాయనతో 'స్వామీ! మీరు ఎల్లధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు దెలియని దర్మసూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ యుపాయము చేత సిద్దించునో సెలవిండు, అని యడుగగా వ్యాసుడు 'నాయనా! మంచి ప్రశ్న చేసినావు. ఈ విషయమునే పూర్వం నారదమహాముని బ్రహ్మనడుగగా నాతడు సర్వకామప్రదములగు రెండు వ్రతములు చెప్పినాడు.క్షీరాబ్ధి ద్వాదశి వ్రతము, క్షీరాబ్ధి శయన వ్రతము అను నా రెండు వ్రతములలో క్షీరాబ్ధి ద్వాదశీవ్రతమును నీకు జెప్పెదను వినుము. కార్తిక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుకూఁకిన తర్వాత పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును, మునులతోడును, లక్ష్మీ తోడును గూడి బృందావనమునకు వచ్చి యుండి, యొక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా - ఏ మానవుడైనను ఈ కార్తిక శుద్ద ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో, దేవతలతో గూడి బృందావనమున వేంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో గూడ పూజించి తులసిపూజచేసి తులసికథను విని భక్తితో దీపదానము చేయునోవాడు సర్వపాపములు వీడి నా సాయుజ్యమును బొందును. అని శపథము చేసినాడు గాన నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము, అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధాన మెట్టిదో నాకు జెప్పమని యడుగగా వ్యాసిడిట్లు చెప్పదొండగెను. ' దర్మరాజా! ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారణ చేసికొని సాయంకాలమున మరల స్నానము చేసి శుచియై తులసికోట దగ్గర చక్కగా శుద్ది చేసి ఐదు వన్నెల మ్రుగ్గుల పెట్టి పలువిధముల నలంకరించి తులసీ మాలమందు లక్ష్మీసహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోను బూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెఱుకుముక్కలు సమర్పించి తాంబూలనీరాజనములొసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసీసహిత లక్ష్మీనారాయణ మహత్మ్యమును దీపదాన ఫలమును విని యనంతరము బ్రాహ్మణునకు గంధపుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తిచేయవలెను. ఇట్లే మానవుడు చేసినను ఇష్టముంగాంచును. ధర్మరాజది విని దీపదాన మహిమను జెప్పుమని యడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు. 'యుధిష్టిరా! దీపదానమహిమనెవడు చెప్పగల్గును ? కార్తిక శుద్ద ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానముచే ఉప పాతకములు పోవును. నూఱు చేసిన విష్ణు సారూప్యము గలుగును. అంతకెక్కువగాఁ జేసిన నా ఫలములు నేను జెప్పలేను. భక్తితో నొకవత్తితో దీపము బెట్టిన బుద్దిశాలి యగును. నాలుగు వత్తులు వేసి వెలిగించిన రాజగును. పదివేసిన విష్ణుసాయుజ్యము నొందును. వేయివత్తులు వేసినచో విష్ణురూపుడగును. ఇది బృందావనములో చేసిన యెడల కురుక్షేత్రమందు జేసినంత ఫలము గలుగును. దీనికి ఆవునేయి మంచిది. నూవులనూనె మధ్యమము. తేనె యదమము. ఇతరములైన అడవినూనెలు కనీసము, ఆవునేయి జ్ఞానమోక్షముల నొసగును. నువ్వుల నూనె సంపదను కీర్తినిచ్చును. ఇప్పనూనె భోగప్రదము, అడవినూనె కామ్యార్థప్రదము, అందులో ఆవనూనె మిగుల కోరికలనిచ్చును. అవిసెనూనె శత్రుక్షయకారి. ఆముదము ఆయుష్షును నాశనము చేయును. బఱ్ఱె నేయి పూర్వపుణ్యమును దొలగించును. వీనిలో కొంచమైన ఆవునేయి కలిసిన దోషపరిహారమగును. ఈ దీపదానములవలననే యింద్రాదులకు వారివారి పదవులు దొరకినవి. దీనివలన ననేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులను ముక్తిగాంతురు. బృందావనమందొక మంటపము గట్టి వరుసగా దీపపంక్తులు పెట్టి యున్న నెవడు చూచి యానందపడునో వాని పాపములన్నియు నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు.' అని చెప్పగా విని ధర్మరాజు మహానందమును జెంది తులసీ మహత్మ్యమును జెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు. తులసీ మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు జెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తికమాసమందు తులసిపూజ చేయువారుత్తమలోకమును బొందుదురు. తుదకు ఉత్థానద్వాదశినాడైనను తులసిపూజ చేయనివారు కోటిజన్మలు చండాలులై పుట్టుదురు. తులసిమొక్క వేసి పెంచినవారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందుందురు. తులసీదళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదలి వైకుంఠమునకు బోవుదురు. బృందావనము వేసినవారు బ్రహ్మత్వము బొందుదురు.తులసి యున్న ఇంటిలో గాపురము చేయుట, తులసితోట వేసి పెంచుట, తులసిపేరులు దాల్చుట, తులసిదళము భక్షించుట, పాపహరములు. తులసి యున్న చోటునకు యమకింకరులు రారు. 'యాన్ములే....' అను మంత్రమును బఠించు వారికి నే బాధయు నంటదు. యమకింకరులు దగ్గరకు రారు. ఈ తులసి సేవయందే ఒక పూర్వకథను జెప్పెద వినుము. కాశ్మీరదేశ వాసులగు హరిమేధసుమేదులను నిద్దఱు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి యొక స్థలములో నొక తులసితోటను జూచిరి. చూచినతోడనే వారిలో సుమేధుడు భక్తితో బ్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూచి హరిమేధుడిదియే మని యడిగెను. సుమేధుడు ఇక్కడ నెండబాధగా నున్నదని యొక మఱ్ఱిచెట్టునండకుజేరి తులసికథ నిట్లు చెప్ప దొడఁగెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దానియందు ఐరావతము కల్పవృక్షము మొదలుగా నెన్నియో యుత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృతకలశము పుట్టెను. ఆ యమృతకలశమును జేత బూని మహానందము నొంది విష్ణువు ఆ కలశముపై నానందబాష్పములు విడువగా నందు ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని, లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద నుంచుకొని నీవు లోకముల పావనము జేయగలదానవగు మని ప్రేమ మీఱ బలికెను. అందువలన నారాయణునకు తులసియందు ఎక్కువ ప్రీతి కలిగియుండును. అందువలన నేను తులసికి మ్రొక్కినాను. అని యా బ్రాహ్మణుండు పలుకుచుండగానే యామఱ్ఱి ఫెళ్ళుమని విరిగి కూలెను. ఆ చెట్టు తొఱ్ఱలోనుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్యతేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహధారులైన మీ రెవరిని యడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు నని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లనియెను. ' నేను దేవలోకవాసిని, నాపేరు ఆస్తికుడందురు. నేనొకనాడు అప్సరసలతోగూడి నందనవనమున గామవికారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనిబడి మా సందడివలన సమాధి చలించి యచ్చట తపస్సు చేయుచున్న రోమశమహాముని నన్ను చూచి నీవు మదోన్మత్తుడవై యిట్లు నాకలజడి కలిగించితివి గావున బ్రహ్మ రాక్షసుడవగు మని శపించి తప్పిదము పురుషునిది గాని స్త్రీలు పరతంత్రలు గనుక వారివలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతట నేను శాపమునకు వెఱచి యా మునిని వేడి ప్రసన్నునిజేయగా నాయన యనుగ్రహము గలిగి నీవెప్పుడు తులసిమహిమను, విష్ణుప్రభావమును విందువో అప్పుడు శాపవిముక్తుడవుగుదువని అనిగ్రహించెను. నేనును బ్రహ్మరాక్షసునై యీ చెట్టు తొఱ్ఱలో జేరి మీ దయవలన నేడు శాపమోక్షణము నొందితిని' అని జెప్పి , రెండవవాని వృత్తాంతము చెప్పసాగెను. ' ఈయన పూర్వమొక మునికుమారుడిగానుండి గురుsకులవాసము జేయుచుండి ఒక యపరాధము వలన బ్రహ్మరాక్షస్సువగు మని గురువు వలన శాపము బొంది యిట్లు నాతో గలసియుండెను. మేమిద్దఱమును మీదయ వలన బవిత్రులమైతిమి. ఇట్లు మమ్మనుగ్రహించినారు గాన మీతీర్థయాత్రాఫలము సిద్దించినది.' అని చెప్పి వారిరువురు వారిత్రోవను బోవగానే బ్రాహ్మణులిద్దఱు ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను బొగడుచు యాత్రముగించుకొని యిండ్లకేగిరి. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదలి యుత్తమగతిని జెందుదురని బ్రహ్మ నారదునకు జెప్పెను.' అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ! ఇట్లు క్షీరాబ్ధివ్రతము జేసి తులసికథ విన్నవారుత్తములగుదురు.


               *_🌸శుభమస్తు🌸_*

     🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

జలుబు నివారణ కొరకు -

 చిన్నపిల్లల అనారోగ్య సమస్యల నివారణ కొరకు - 1


 * జలుబు నివారణ కొరకు - 


     చిన్నపిల్లలకు జలుబు చేసిన రోజున తమలపాకులు కు ఆముదం రాసి వెచ్చచేసి రొమ్ముపైన , పొట్టపైన , తలపైన వేసి కట్టు కట్టుచున్న జలుబు హరించును . 


 *  కడుపు నొప్పి హరించుట కొరకు - 


      నీరుల్లిపాయను కుమ్ములో (పొయ్యిలో ) వేసి ఉడికించి దంచి రసము పిండుకొని కడుపునొప్పి గల పిల్లలకు ఒక పావు తులము రసము తాగించిన చిన్నపిల్లల కడుపునొప్పులు వెంటనే హరించును . 


 *  చిన్నపిల్లల శరీరం బలపడుటకు - 


     శిశువు పుట్టిన దగ్గర నుంచి 5 సంవత్సరముల వయస్సు వచ్చువరకు ప్రతిరోజూ నువ్వులనూనె ఒంటికి రాసి రెండు గంటలు ఆగిన తరువాత నలుగుపెట్టి స్నానం చేయించుచుండిన యెడల శరీరము నందలి ఎముకలు మిక్కిలి గట్టిపడి క్రిందపడినను విరగకుండా ఉండును . మరియు శరీరము కాంతివంతముగా తయరగును . 


 *  మాటలు రాని చంటిపిల్లలకు - 


     మర్రి ఊడలు మెత్తగా నూరి చిక్కని గంధము తీసి నాలుకపై వేసి రుద్దుతుండవలెను . ప్రతిరోజూ ఇలా చేయుచుండిన త్వరగా మాటలు వచ్చును . 


 *  చిన్నపిల్లల కాళ్లు , చేతులు బలహీనమై నడవకుండా ఉండిన - 


   పచ్చి ఆవుపాలలో ఉండు వెన్నని తీసి గోరోజనము కొంచం ఆ ఆవు వెన్నకి కలిపి ప్రతిరోజూ పొట్టకి , కాళ్ళకి , చేతులకు బాగా రుద్దుతున్న కొంతకాలానికి మంచి బలం కలిగి నడవటం జరుగును . 


 *  చిన్నపిల్లల విరేచనాలు తగ్గుటకు -

    మారేడుకాయ గుజ్జు ౩ గ్రాములు నీళ్లతో కలిపి తాగించిన చిన్నపిల్లల విరేచనాలు తగ్గును . 


 *  పాలు కక్కుట తగ్గుట కొరకు - 


       ఇంగువను నీళ్లతో అరగదీసి కడుపు పైన లేపనం చేయుచుండిన పిల్లలు పాలు కక్కుట తగ్గును . 


       మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  

   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా 

క్షీరాబ్ది ద్వాదశి

 *ॐ        క్షీరాబ్ది ద్వాదశి* 

          *(చిలుకు ద్వాదశి)*


*1. ఇళ్ళల్లో తులసీ*  *బృందావనంలో తులసి మొక్కవద్ద ఉసిరి కొమ్మ గ్రుచ్చి, సాయంకాలవేళ "తులసీ ధాత్రీ సహిత లక్ష్మీనారాయణ" పూజ - " క్షీరాబ్ది ద్వాదశీ" వ్రతంగా ఆచరించడం.* 

*2. ఆనాటి సాయంత్రమే విష్ణ్వాలయాలలో విష్ణుమూర్తి దర్శనం చేసికొని, మోహినీ రూపంలో స్వామి పంచియిచ్చే "అమృతం" పొందడం.* 

    *మనకి ఒక సందేహం కలుగుతుంది. "ఆ అమృతం స్వీకరిస్తే, మనకి అమరత్వం సిద్ధిస్తుందా?" అని.* 

    *కానీ మనకి శాశ్వతమైనదేదో తెలిపే జ్ఞానాన్ని అందించి, తద్వారా శాశ్వతత్వాన్ని అనుగ్రహిస్తాడు స్వామి.* 

    *మెదడనే మంధర పర్వతాన్ని కవ్వంగా చేసికొని, నరాలనే వాసుకితో క్రియగా చిలకాలి.*

    *కామక్రోధాది విషం వస్తుంది. దాన్ని మనలోని చిదానందరూపుడైన శివునకర్పించాలి.* 

    *తదుపరి వచ్చేవన్నీ మన సాధనలో ఉత్పన్నమయ్యేవిగా అన్వయించుకుంటూ ముందుకు సాగాలి.* 

    *చివరకి మనలో శాశ్వతమైన  "ఆత్మ" అమృతంగా వస్తుంది. అది తెలుసుకుని మనం  చిరంజీవులమవుతాం.* 


                    *=x=x=x=* 


  *— రామాయణంశర్మ* 

            *భద్రాచలం*

నమస్కార ప్రక్రియ

 నమస్కార ప్రక్రియ 


మనకున్న ఆస్తి అంతా నమస్కార క్రియే. భగవత్పాదుల వారు ఒకప్పుడు కనకధారా స్తోత్రంతో లక్ష్మి దేవిని ఉద్దేశించి ప్రార్థించారు. ఒక బీద బ్రాహ్మణ వనితకోసం ఈ స్తోత్రాన్ని ఆయన చెప్పారు. ఆయనకు స్వయంగా కావలసినది ఏదీ లేదు. కానీ మహాలక్ష్మిని ప్రార్థించి ఆమె దర్శనమిచ్చిన పిదప ఆమెను దేనినీ కోరకుండా ఉండడానికీ లేదు. అందుచేత ఆయన నమస్కారమనే సంపదను మాత్రం ఆమెవద్ద కోరుకుంటారు.


సంపత్కరాణి సకలేంద్రియనందనాని 

సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షీ 

త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని 

మామేవ మాతరనిశం కలయంతునాన్యే ||


కట్టకడపట ‘నాన్యే’ అన్న పదప్రయోగం చేశారు ఆచార్యులు. ‘మహాలక్ష్మీ! నేను చేసే ఈ నమస్కార క్రియను మించిన సంపద వేరే ఏదీ అక్కరలేదు. త్వద్ వందనాని ఏవ – నిన్ను ఉద్దేశించి చేసే ఈ నమస్కారము మాత్రము “మామ్ – నన్ను – అనిశం – ఎల్లప్పుడూ, కలయంతు – చేరుగాక – నాకు కలుగు గాక – నాన్యే – ఇతరము కాదు” అని ఆచార్యులు ప్రార్థించారు. 


అమ్మవారికి చేసే ఆ నమస్కారం ఎటువంటిది? సంపత్కరాణి – సంపదలు కలిగించునది. సకలేంద్రియ నందనాని – అన్ని ఇంద్రియములను సంతోషపెట్టునది. సామ్రాజ్య దాన నిరతాని - అంతేకాదు ఆ నమస్కారము సామ్రాజ్యమునే ఇవ్వగల శక్తి గల యట్టిది. లలితా సహస్ర నామములలో “రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజపీఠ నివేశిత నిజాశ్రితా” – అన్న నామములున్నవి. రాజ్యమును ఇచ్చుటకునూ, తన ఆశ్రితులను రాజపీఠం అనగా సింహాసనమందు కూర్చోపెట్టుటకు అమ్మవారికి అనుగ్రహ శక్తి కలదు.


ఆ నమస్కారానికి మరొక శక్తి కలదు. అది, దురితోద్ధరణోద్యతాని – దురితములు అంటే పాపములు దురితముల నుండి ఉద్ధరించుటకు ఉద్యమించే శక్తి అంటే మన పాపములను ఆ నమస్కారం పోగొడుతుంది. దీనికి మరొక పాఠాంతరమును చూస్తున్నాం. అది “దురితాహరణోద్యతాని” వ్యాకరణ యుక్తంగా హరణ, ఆహారణ రెండూ ఒక్కటే. హరణ అంటే పోగొట్టుట, ఆహరణ అంటే తీసుకొని వచ్చుట అనే అర్థం కూడా ఉంది. అపుడు దురితములను తీసుకొని వస్తుందనే అపార్థం ఔతుంది. అందుచేత “దురితోద్ధరణోద్యతాని” అనేదే సరియైన పాఠం. ఆమె మన నమస్కార క్రియ చేత దురితములను వ్రేళ్ళతో పెకలించగలదు.


మామేవ అన్న పదప్రయోగంలోని ‘ఏవ’ అను పదమును – వందనాని అనే పదముతో కలిపి చదువుకోవాలి. వందనాని ఏవమామ్ మాత అనిశం కలయంతు – నాన్యే – అనగా ఈ వందనం మాత్రం, వేరే ఏదీ కాదు – నన్ను వచ్చి చేరుగాక అని ఆచార్యుల భావం.


ఆచార్యుల వారు ప్రశ్నోత్తర రత్నమాలికను వ్రాశారు. అందులో ప్రశ్నలు, వానికి ఉత్తరాలు వుంటాయి. అందులో ఒక ప్రశ్న; కింవిషం? విషము ఏది? అని ప్రశ్న దానికి జవాబు – “అవధీరణా గురువు” – గురువును అవమర్యాద చేయడమే విషం అని ఉత్తరం. అందులోనే మరొక్క ప్రశ్న ఉంది. పాతుం కర్ణాంజలిభిః “కిం అమృతం?” శ్రవణామృతము వుండేదేది? దానికి బదులు –“సదుపదేశం”, “కిం ఉపాదేయం?” దేనిని మనం గ్రహించ వలసినది? – “గురు వచనం. ఉపాదేయము గురువచనమే. వారి ఉపదేశములే మనకు శిరోధార్యములు. “కో గురుః? – గురువెవ్వరు?” – “యో అధిగతతత్త్వః శిష్యహి తాయోద్యతః సతతం” – గురువు తత్త్వాన్వేషణ చేసి తత్త్వజ్ఞుడై ఉండాలి. అతడు అనుభవశాలిగా ఉండవలె. అట్టి గురువు, అన్ని కాలములలోనూ శిష్యుని హితాన్ని ఉద్దేశించి పాటుపడుతూ ఉంటాడు. “శిష్యహి తాయోద్యతః సతతం”.


శిష్యుని హితమేది? అతనిని కర్మ బంధం నుండి తప్పించి, సంసార విమోచనతో అతనికి మోక్ష సౌఖ్యం కల్గించడమే గురువు చేసే హితచర్య. గురువుకు చేసే నమస్కార క్రియ శిష్యునికి ఆ హితాన్ని చేకూరుస్తుంది. గురువు యొక్క కృపాధార అనే కనకధార అతనిపై వర్షిస్తుంది. అందుచేత మనకు ఆ ఒక్క నమస్కారమనే సంపద ఉంటే చాలు. వేరే ఏదీ అక్కరలేదు. 


“తస్మై శ్రీ గురవే నమః”


--- శ్రీకార్యం చల్లా విశ్వనాథశాస్త్రి గారి ‘ఆచార్యవాణి’ ప్రథమ సంపుటం నుండి


#KanchiParamacharyaVaibhavam #Paramacharya