6, నవంబర్ 2022, ఆదివారం

ఆరోగ్యం పట్ల అవగాహన

 *ANU power yoga & Natural healing center.*

(ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న Contact:9381490085)


*🌺ఎడమ వైపు నిద్ర పోవడం*

భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని పచనం ( జీర్ణం ) చెయ్యటానికి జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది . మెదటగా మెదడు లోని రక్తం , తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది . అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది . అందు వలన నిద్ర వస్తుంది . నిద్ర పోవడం మంచిది .

ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవలెను . ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు *వజ్రాసనం* వేయండి .

# రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు . కనీసం *2 గంటల* తర్వాత నిద్ర పోవాలి . మీరు వెంటనే నిద్ర పోవడం వలన *డయాబెటీస్* , *హార్ట్ ఎటాక్* వచ్చే ప్రమాదముంది .

*పడుకునే విధానం* :----

ఎడమ ప్రక్కకు తిరిగి , ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి .

# దీనిని *వామ కుక్షి* అవస్దలో విశ్రమించటం అంటారు .

# మన శరీరంలో *సూర్యనాడి , చంద్ర నాడి మరియు మధ్యనాడి* అనే మూడు నాడులున్నాయి . సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి పనికొస్తుంది . ఈ సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది .

# మీరు అలసత్వానికి గురైయినపుడు , ఇలా ఎడమ వైపున తిరిగి పడుకొనుట వలన అలసత్వం తొలగి పోతుంది . మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు .

*ప్రయోజనాలు ( Benefits )* 

1 . గురక తగ్గి పోవును .

2. గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్బాశయంకు , కడుపులోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును . వెన్ను నొప్పి , వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగును .

3 . భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది .

4 . వీపు , మెడ నొప్పులున్నవారు ఉపశమనం పొందెదరు .

5 . శరీరంలో వున్న విషాలని , వ్యర్ద పదార్ధలని తొలగించే రసాయనాలకు తోడ్పడుతుంది .

6 . తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి నెట్టి వేయ బడును .

7 . కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి .

8 . జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగును .

9 . గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేయును .

10 . గుండెలోని మంటను నిరోధిస్తుంది . కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి .

11 . ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు .

12 . కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయి .

13 . మెదడు చురుకుగా పని చేస్తుంది .

14 . పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది .

15 . ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి* .

ప్రతి ఒక్కరు వారి వారి పద్దతులలో నిద్రపోతారు . కావున వెంటనే మీరు మీ పద్ధతిని మార్చుకోవాలంటే చాలా కష్టం . కాని మీరు మీ ఆరోగ్యం కొరకు కొద్దిగా ప్రయత్నం చేస్తే మార్పు చేసుకోవచ్చును .

ఎడమ వైపు తిరిగి పడుకొనిన యెడల , మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు మీరు గమనించ వచ్చును .

*మీరు ఈ చిన్న మార్పుని చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి*

*గమనిక* : 

తల తూర్పు వైపు పెట్టి పడుకోవాలి . కుదరకపోతే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి .

ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు . చదువు కునేందుకు , ఏదైనా అభ్యాసానికి ఉత్తర దిశ మంచిది. 🌺ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి.............

కామెంట్‌లు లేవు: