15, మార్చి 2023, బుధవారం

జలుబు హరించుటకు

 జలుబు హరించుటకు సులభ ఆయుర్వేద యోగాలు - 


 *  అల్లం , మిరియాలు , తులసి దళాలు సమభాగములుగా తీసుకుని దంచి కషాయం కాచి పూటకు గిద్దెడు (టీ గ్లాసు ) మోతాదులో తీసికొనవలెను . 


 *  పండు జిల్లేడు ఆకు రసం మరియు నువ్వుల నూనె కలిపి శరీరముకు మర్దన చేయుచున్న జలుబు హరించును . 


 *  10 గ్రాముల శొంఠి చూర్ణమును 50 గ్రాముల వేడి నీటిలో కలిపి నిద్రపోయే ముందు పుచ్చుకొనుచుండిన యెడల జలుబు హరించును . 


 *  నల్ల జీలకర్ర చూర్ణమును గుడ్డలో మూటకట్టి వాసన చూచుచుండిన జలుబు త్వరగా తగ్గును . 


 *  వేడి వేడి మినప గుగ్గిళ్లను ఉప్పు కలిపి భోజనము చేసిన పిమ్మట తినుచుండిన యెడల రెండు మూడు రోజుల్లో జలుబు తగ్గిపోవును . 


   పైన వివరించిన ఆయుర్వేద చిట్కాలలో మీకు అనువుగా ఉన్న ఒకదానిని ఎంచుకొని పాటించి సమస్య నుంచి బయటపడగలరు . 


      జలుబు , పడిసం వంటి సమస్యలతో ఇబ్బంది పడున్నప్పుడు చల్లటి పదార్దాలు , పచ్చళ్లు , పాలు మరియు పాల సంబంధ ఉత్పత్తులు , ఫ్రిజ్ నీరు , కూల్డ్రింక్స్ వంటివి సేవించరాదు . 


         

సీతా జయంతి

  సీతా జయంతి!*


ఫల్గుణ మాసంలో కృష్ణ పక్ష అష్టమి నాడు జానకీ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజును సీతాదేవి జనక మహారాజుకు పొలంలో దొరికిన రోజుగా చెప్పుకుంటారు. సీత త్యాగానికి, అంకిత భావానికి ప్రతీక. ఈ రోజున సీతారాములను పూజించడం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగి పోతాయని నమ్మకం. ఈ రోజున శ్రీరాముడితో పాటు సీతా మాతను కూడా పూజిస్తే లక్ష్మీ నారాయణుల కటాక్షం దొరుకుతుందట. 


ఈ పండుగను ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. దక్షిణ భారత దేశంలో మహారాష్ట్ర, తమిళనాడులో కూడా దీనికి ప్రాముఖ్యత ఉంది. సీత భూదేవి పుత్రిక కనుక భూమి అనే పేరుతో కూడా సీతను పిలుస్తారు. జీవితం ముందుకు సాగడానికి, ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగేందుకు సీతా జయంతిని జరుపుకుంటారు. సీతా జయంతిని భక్తిగా జరుపుకునే వారికి ఆనందదాయకమైన దాంపత్య జీవితం లభిస్తుందని నమ్మకం. అంతేకాదు వివాహానికి అడ్డంకులు ఎదురవుతున్న వారు కూడా సీతాజయంతి రోజున సీతారాములను ఆరాధించి, ఉపవాసం చేస్తే తప్పకుండా అడ్డంకులన్నీ తొలగిపోయి వివాహం జరుగుతుందని చెబుతారు.

ఆహారముతో నింపవలెను

 .


             _*|సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝  

*ఉదరం పూరయేదర్థం* 

*అన్నైర్భాగం జలేన చ।*

*వాయోః సఞ్చారణార్థాయ*

*చతుర్థం అవశేషయేత్॥*


తా𝕝𝕝 " *పొట్టను సగభాగం ఆహారముతో నింపవలెను.... మిగిలిన సగభాగంలో సగం నీటితో పూరించవలెను*.... *దేహములోని ప్రాణవాయువు  ప్రసరించుటకు వీలుగా ఆ తక్కిన భాగం ఖాళీగా  ఉంచచలెను.*"...

ధనమును

 *సుభాషితమ్* *అర్థానామార్జనే దుఃఖం*

*ఆర్జితానాం చ రక్షణేl*

*ఆయే దుఃఖం వ్యయే దుఃఖం*    

*ధిగర్థం దుఃఖభాజనమ్|*


*ధనమును సంపాదించుట కష్టం, సంపాదించిన ధనమును రక్షించుట కూడా కష్టమే*

కష్టించి ధనమును ఎట్లో సంపాదించిననూ దానిని భద్రపరచుట కష్టమైనదే. ఇక భద్రపరచిన ధనమును ఖర్చు చేసిననూ ధనము తరిగిపోతున్నదని దుఃఖమే మానవుడికి మిగులుచున్నది.

అందువల్ల *ధనమును ఏ విధంగా చూసిననూ ఏ దశలోనైనా దుఃఖమునే కలిగించేది అని తెలియుచున్నది*


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

పునర్జన్మ

 సనాతన ధర్మం - పునర్జన్మ


ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను స్వామివారి ముందుంచాడు.


”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.


”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.


అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర కారు ఉన్నదా అని అడిగి ఈ కంచీపురంలో వెళ్ళి కొంచం సమాచార గణాంకాలను సేకరించుకు రాగలవా అని కనుక్కున్నారు. అతను వెంటనే ఒప్పుకున్నాడు. కాని తన ప్రశ్నకు ఎందుకు వెంటనే సమాధానం చెప్పలేదు అని అనుకున్నాడు.


”సరే స్వామిజి, ఏమి చెయ్యమంటారో సెలవివ్వండి” అని అడిగాడు. అందుకు మహాస్వామి వారు, “కాంచీపురంలోని ఒక పది ప్రసూతి వైద్యశాలలకు వెళ్ళు. అక్కడ గత రెండు రోజులలో పుట్టిన పిల్లల వివరాలు, వారి ఆరోగ్యం, తల్లితండ్రుల పేర్లు, వారి స్థితి, వారి విద్యార్హతలు, పుట్టిన సమయం వంటివి తెలుసుకుని రా” అని చెప్పారు.


ఆ విదేశీయుడు, “సరే ఇదేమి పెద్ద పని కాదు” అని తన కారులో వెళ్ళిపోయాడు. సాయిత్రం లోపల కావల్సిన వివరాలతో మహాస్వామి వారి ముందు వచ్చాడు. ఆ వివరాలకు స్వామి వారికి చెప్పాడు.


“ఈ రెండు రోజులలో పది ఆస్పత్రులలో 15 మంది పిల్లలు పుట్టారు. 7గురు మగపిల్లలు, 8మంది ఆడపిల్లలు. వారిలో ముగ్గురికి పోషకాహార లోపం ఉంది. ఇద్దరు ధనికులైన తల్లితండ్రులకు ప్రథమ సంతానం. వారు అత్యంత ఖరీదైన ఆస్పత్రులలో పుట్టారు. నలుగురు పిల్లలు రోజుకూలి చెసుకునే వారికి పుట్టారు. వారికి అప్పటికే పిల్లలు ఉన్నారు” అని చెప్పుకొచ్చాడు.


స్వామివారు అతణ్ణి చూసి, కొన్ని ప్రశ్నలు వెయ్యడం మొదలుపెట్టారు.


”వీరు పుట్టిన ఈ రెండు రోజులలొ వారు నిజాయితీగా ఉందడమో లేదా కపట బుద్ధితో ప్రవర్తించడమో చేసారని నువ్వు అనుకుంటున్నావా?”


“లేదు వారు కనీసం తమ తల్లిని కూడా గుర్తించలేని చంటిపిల్లలు. కాబట్టి ఈ జన్మలో వాడికి పాపము పుణ్యము అనేది ఏమి లేదు” అని చెప్పాడు.


మహాస్వామి వారు ”మీ సిద్ధాంతము ప్రకారం ఈ పిల్లలందరూ ఏ పాపము పుణ్యము చెయ్యలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండాలి. కాని లేరు. కొంత మంది అరోగ్యం బాగులేదు. కొంత మంది ధనవంతుల పిల్లలు, కొంతమంది కూలివాని పిల్లలు. ఒకేరోజు, ఒకే అక్షాంశం, రేఖాంశం ఒకే ఊరిలో పుట్టిన పిల్లలైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు. ఇదే పునర్జన్మ సిధ్ధాంతం”


ఆ విదేశీయుడు ఈ మాటలను విని స్థాణువైపోయాడు. ఇక్కడే పునర్జన్మ సిద్ధాంతం నిజం అనేది తేటతెల్లమవుతోంది. ఈ పిల్లలందరూ వారి వారి పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో ఇలా పుట్టారు.


ఆ విదేశీయుడిని చూసి సనాతనధర్మ సాకారరూపం చిరునవ్వుతోంది.


సనాతన ధర్మానికి పుర్జన్మ సిద్ధాంతం ప్రాణం. దాన్ని నమ్ముతాను అని చెప్పడానికే నుదుట బొట్టు పెట్టుకోవడం.


పునరపి జననం పునరపి మరణం

పునరపి జననీ జఠరే శయనం ||


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

14, మార్చి 2023, మంగళవారం

శబరి

 శబరి గిరిజన కుటుంబంలో పుట్టిన ఒక స్త్రీ.ఈమె పంపానదీ తీరంలో మతంగ మహాముని వద్ద, ముని కన్యల మధ్య అమాయంకంగా పెరిగింది.అందువలన బోయ కులంలో పుట్టినప్పటికీ ముని చెప్పిన మాటలు శ్రద్ధగావినేది. దాని వలన అమె యోగాభ్యాసం చేసేది.మతంగ మహామునిని పరమశివుడుగా, ఆశ్రమాన్ని కైలాసంగా భావించేది.ఆశ్రమంలో అన్ని పనులు చేస్తూ సేవా మార్గంలో కాలం గడిపేది.        మతంగ మహాముని మాటల్లో శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారమని, రాక్షసులను సంహరించిన వీరుడని తెలుసుకుంది.మతంగ మహామునికి రాముడు అరణ్యవాసానికి వెళ్లిన విషయం తపశ్సక్తి ద్వారా తెలిసింది. అలా తెలుసుకున్న మతంగముని శిష్యులు, తాము స్వర్గానికి వెళుతూ శబరికి ఆ విషయం చెబుతారు. వనవాసంలో ఉన్న రాముడు ఒకానొక సందర్భంలో ఆశ్రమానికి వస్తాడని, అతని దర్శనం తర్వాత శబరి కూడా శరీరాన్ని వదలవచ్చని వివరిస్తారు.సీతా,లక్షణ సమేతుడై శ్రీరాముడు ఆశ్రమం వైపు వస్తున్నాడని తెలిసింది.అతణ్ని చూడాలని ఆశపడింది. ఆ ఆశని రాముని గురించి మతంగ మహర్షి చెప్పిన మాటలు రెట్టింపు చేశాయి. ఒక్కసారి జీవితంలో రాముణ్ని చూస్తే చాలనుకుంది. అంతకుమించి ధన్యత లేదనుకుంది. రాముని రూపురేఖలు చూసి తరించాలనుకుంది.          ఎంత కాలం ఎదురు చూసినా రాముడు రాలేదు.అలాగని శబరి ఎదురు చూడకుండా ఉండలేకపోయింది. మతంగ ముని ముసలి వాడై, స్వర్గానికి వెళుతూ రాముడు వస్తాడనీ మరలా చెపుతాడు. నీకు దర్శనభాగ్యం కలిగిందని, ఆశ్రమాన్ని అంటి పెట్టుకొనే ఉండమంటాడు. ఎప్పటికయినా రాముడు వస్తాడని శబరి నమ్మకంతో ఉంటుంది.ఆశ్రమంలో చివరికి శబరి మాత్రమే ఒంటిగా మిగిలింది. రామనామమే  సర్వం అయింది. శబరికికూడా ముసలి తనం వచ్చింది. రాముడు రాలేదు. వస్తాడనే ఆమెకు ఇంకా నమ్మకం. ఒంట్లో శక్తే కాదు, కంటిచూపూ తగ్గింది.అయినా  రాముని వస్తాడనేదానిమీద నమ్మకం తగ్గలేదు. మతంగి ముని మాట మీద గురి పోలేదు.రాముడు వస్తాడని ప్రతిరోజు వేకువ ఝామునే ఆశ్రమ పర్ణశాలను శుభ్రం చేసి, అలికి ముగ్గులు పెట్టేది. నదిలో స్నానం చేసి కడవతో నీళ్ళు తెచ్చేది. పూలు, పళ్ళూ తెచ్చేది. పూలను మాలకట్టి అలంకరించేది.ఫలహారంగా పెట్టడానికి పళ్ళను సిద్ధంగా ఉంచేది.ప్రతిరోజూ రాముడొస్తున్నట్లు ఏ రోజుకారోజే ఎంతో ఎదురు చూసేది. రోజులూ నెలలూ సంవత్సరాలూ విసుగూ విరామం లేకుండా అలా ఎదురు చూపులతోనే 13 సంవత్సరాల కాలం గడిపింది.  అందరూ అనుకునేటట్లుగా రాముడు ఆశ్రమానికి వచ్చినప్పుడు శబరి ఎంగిలి పండ్లను ఇవ్వడం వాల్మీకి రామాయణంలో లేదని తెలుస్తుంది. అడవిలో దొరికిన ఆహారంతోనే ఆమె రామలక్ష్మణులకు ఆతిథ్యం ఇస్తుందని, ఆ తరువాత రాముని అనుమతితో శబరి తన శరీరాన్ని యోగాగ్నిలో అర్పించుకుని మోక్షాన్ని పొందిందని తెలుస్తుంది.ఈ కథలో గిరిజన స్త్రీ అయిన శబరికి  వేదం తెలియనప్పటకీ, యజ్ఞయాగాదులు చేసే అధికారం ఆనాడు లేకపోయిననూ,యోగసాధన, జ్ఞానం, మోక్షం పొందడానికీ అందరూ అర్హులే అని నిరూపించే ఘట్టమే రామాయణంలోని శబరి కథ.

*స్త్రీ మూర్తిని

 🌿🌼🙏యావత్తు సృష్టిని.. ఒక్క గంటలో తయారు చేయగల్గిన దేవుడు.. *స్త్రీ మూర్తిని తయారు చేయడానికి మాత్రం వారం రోజులు కష్ట పడ్డడంట.* ఎందుకో తెలుసుకోవాలంటే మనసు పెట్టి చదవాలి 🙏🌼🌿


🌿🌼🙏మగాడితో సహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు. 🙏🌼🌿


🌿🌼🙏ఒక రోజూ రెండు రోజులూ కాదు. ఏకంగా వారంరోజులు తీసుకున్నాడు..స్త్రీ సృష్టికోసం. మిగిలిన పనులన్నీ మానుకుని..తన నాథుడు స్త్రీ సృష్టికోసం ఇంతగా తలమునకలైపోవడం చూసిన దేవత అడిగింది... "స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని?". 🙏🌼🌿


🌿🌼🙏అప్పుడు దేవుడు.. "ఏం చెయ్యను మరి...

ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా... ఇష్టాయీష్టాలకతీతంగా ఉండాలీ..

సృష్టి. వివక్ష తగదు. మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. 🙏🌼🌿


🌿🌼🙏చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసులవరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా... ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా...ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. 

అడిగేవారు ఉండరూ ఉండకపోవచ్చు...రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి. ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే...." అన్నాడు.🙏🌼🌿


🌿🌼🙏"ఏంటీ? ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా?" అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది. "ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం" అని ప్రశ్నించింది. 🙏🌼🌿


🌿🌼🙏అప్పుడు దేవుడు.."ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు. 

కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. 

అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు, ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు. 🙏🌼🌿


🌿🌼🙏ఇష్టం,  కష్టం, ప్రేమ, కోపం, తాపం, అంటూ అన్ని భావోద్వేగాలనూ ఆమె చవిచూడాలి. 

అవసరమైతే దిగమింగాలి. కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు. 

ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమానురాగాలను...." అన్నాడు.🙏🌼🌿


🌿🌼🙏"ఓహో. ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది. అప్పుడు దేవుడు.. "ఎందుకాలోచించదు? 

అన్ని విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు..." అన్నాడు.🙏🌼🌿


🌿🌼🙏దేవత ఆమె చెక్కిళ్ళను తాకి "ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ? కన్నీరు కారుస్తోందిగా....ఏంటిది? " అని అడిగింది.🙏🌼🌿


🌿🌼🙏అప్పుడు దేవుడు.. "అదా...కన్నీరది. 

ఆ కన్నీటిలో ఆనందమూ ఆవేదనా దుఃఖమూ దిగులూ ఆశ్చర్యమూ భయమూ అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి. 🙏🌼🌿


🌿🌼🙏ఆ కన్నీటికున్న  శక్తి అనంతం....

పైగా మరో జీవీకి ప్రాణంపోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది" చెప్పాడు. 🙏🌼🌿


🌿🌼🙏దేవత ఆశ్చర్యపోతూ "మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే. .." అని చెప్పింది. 🙏🌼🌿


🌿🌼🙏అయితే దేవుడు.. "అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా..వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటివరకూ తెలియనట్టే ఉంటుంది..." అవసరమైనప్పుడు..*ఆ శక్తి ముందూ.. ఎవరూ నిలబడలేరు..🙏🌼🌿

అని చెప్పి భూమ్మీదకు పంపాడు స్త్రీని...!!


🌿🌼🙏ఇదంతా చదువుతుంటే.. మన జీవితంలో జరిగిన ఎన్నో ఘటనలు జ్ఞప్తికి వస్తున్నాయి కదా..🙏🌼🌿


🌿🌼🙏అందుకనే ఏమో *స్త్రీని పుడమి తల్లి తో పోల్చారు*.. 🙏🌼🌿


శ్రీమాత్రే నమః

విజయాలకి

 🙏🌺విజయాలకి భక్తి మార్గాలు🌺🙏


🌺సాధారణంగా రోజూ చేసే పూజాదికాలతోపాటు, 

గ్రహస్థితి బాగా లేదని తెలిసినపుడు, 

ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని చెబుతారు. 

దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుందని కూడా అంటారు. 🌺


🌺అలాగే మనం ఏదైనా ఓ పని జరగాలని కోరున్నప్పుడు 

ఆ పని సవ్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలని చెబుతున్నారు పెద్దలు. 


ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠించాలి, 

ఏ దేవతా పూజ చేయాలనే వివరాలు మీకోసం. 🌺


🌺1. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నపుడు మంచి అవకాశాలు రావాలన్నా, చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా 

రోజూ సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదవాలి. సూర్యధ్యానం చేయాలి.


🌺2. ఇక వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నపుడు 

"కనకధారా స్తోత్రం" రోజు చదివితే ఆ వ్యాపారం 

అభివృద్ధి చెందుతుందట.


🌺3. ఇక మంచి విద్య రావాలన్నా, 

చదువులో ఏకాగ్రత కుదరాలన్నా రోజూ 

హయగ్రీవ స్తోత్రం" పిల్లలతో చదివించాలి. 

అలాగే "సరస్వతి ద్వాదశ నామాలు" చదువుకోమనాలి.


🌺4. కుటుంబ వ్యక్తుల మధ్య మంచి సత్సంబంధాలకు  విష్ణు సహస్రనామం, లలితా సహస్ర నామం 

పారాయణ చేయాలిట.


🌺5. పిల్లలు కలగాలని కోరుకునే దంపతులు 

"గోపాల స్తోత్రం " చదివితే మంచిదట. 

అలాగే గర్భవతిగా వున్న స్త్రీ ఈ స్తోత్రాన్ని రోజు పఠిస్తే సుఖప్రసవం అవుతుంది అంటారు పెద్దలు.


🌺6. ఇక వివాహానికి "లక్ష్మీ అష్టోత్తర పారాయణం" చెయ్యాలి. 

మంచి సంబంధం దొరికి, 

పనులన్నీ చక్కగా జరగాలని,

పెళ్లితంతు సక్రమంగా జరగాలని సంకల్పించి 

ఈ పారాయణాన్నీ రోజు చేస్తే ఆ కోరికలు తీరుతాయట.


🌺7. ఋణబాధలు ఇబ్బంది పెడుతుంటే 

రోజూ నవగ్రహ స్తోత్రం చదువుకోవాలిట. 

అలా చదివితే ఆ ఇబ్బందులలోంచి బయట పడతారుట.


🌺8. ఇవే కాక ఇక ఇతర ఏ కోరికలు సిద్ధించాలన్నా 

విష్ణు సహస్ర నామ పారాయణ చేస్తే చాలు 

ఆ కోరికలన్నీ తీరుతాయట. 🌺


🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻


@everyone

గుండెకు డిజిటల్ మెడిసిన్*

 🩺🩺🩺🩺🩺🩺🩺🩺🩺🩺

ఈనాడు తమిళనాడు బ్రేకింగ్ న్యూస్


*గుండెకు డిజిటల్ మెడిసిన్*

(గుండె మార్పిడి లేకుండా గుండెను రీసైకిల్ చేయవచ్చు)


కత్తి మరియు రక్తం లేకుండా అల్ట్రా మోడ్రన్ ఇంగ్లీష్ మెడిసిన్.


*1) యాంజియోగ్రామ్ లేదు*


*2) బైపాస్ సర్జరీ లేదు*


*3) యాంజియోప్లాస్టీ లేదా స్టెంట్ లేదు*


రెండు సూపర్ ఆధునిక యంత్రాలు కనుగొనబడ్డాయి

*1)CT-700*

*2)EECP*


*1) యాంజియోగ్రామ్ లేకుండా గుండె అడ్డంకిని గుర్తించేందుకు CT-700 అనే అత్యంత ఆధునిక యంత్రం కనుగొనబడింది*..


దీనికి రెండు నిమిషాలు సరిపోతుంది.

దీని కోసం ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు


ఈ ఖర్చు కూడా తక్కువే

చెన్నైలో రెండు చోట్ల మాత్రమే ఇలా చేస్తారు.


ప్రారంభ దశలో గుండె అడ్డంకిని గుర్తించడం

మాత్రల ద్వారా నయం అయ్యే అవకాశం చాలా ఎక్కువ..


మరియు అది ఇప్పుడు

*2) EECP* అనే అధునాతన యంత్రం ద్వారా బైపాస్ సర్జరీ మరియు స్టెంట్ లేకుండా గుండెను నయం చేయవచ్చు మరియు రీసైకిల్ చేయవచ్చు.


ప్రభుత్వం ఆమోదించిన వైద్య వ్యవస్థ


నిజం తెలుసుకోవాలంటే

*శ్రీ వివేకానంద హాస్పిటల్*

చెన్నై

08925015666

08778463371

09500037040

04443192129


*DR.G. డాక్టర్స్ కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూలో వివేకానందన్*

ఇది ప్రచురించిన వార్త


దీని వల్ల లక్షలాది మంది మధుమేహం, హృద్రోగులు ప్రయోజనం పొందారు.


ఎలాంటి బ్లాక్ లేకుండా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ దీన్ని షేర్ చేయండి.


ఒక షేర్ చాలా మంది హృద్రోగుల ప్రాణాలను కాపాడుతుంది

ధన్యవాదాలు 🙏🙏🙏


క్యాన్సర్‌ను ఓడించింది


   పైనాపిల్ వేడి నీరు

    దయచేసి ప్రచారం చేయండి!! దయచేసి ప్రచారం చేయండి!!

    ICBS జనరల్ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ గిల్బర్ట్ ఎ. ఈ బులెటిన్‌ను అందుకున్న ప్రతి ఒక్కరూ పది కాపీలను ఇతరులకు తీసుకెళ్లగలిగితే, కనీసం ఒక ప్రాణమైనా రక్షించబడుతుందని క్వాక్ నొక్కి చెప్పాడు.

    నా వంతుగా నేను కొన్ని చేశాను, మీరు కూడా చేయగలరని ఆశిస్తున్నాను..

     ధన్యవాదాలు!


    పైనాపిల్ వేడి నీరు మీ జీవితాన్ని కాపాడుతుంది

    వేడి పైనాపిల్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది.

    ఒక కప్పులో 2 నుండి 3 పైనాపిల్ ముక్కలను సన్నగా కోసి వేడి నీళ్ళు పోస్తే "ఆల్కలీన్ వాటర్" అవుతుంది, రోజూ తాగితే అందరికీ మంచిది.

    వేడి పైనాపిల్ క్యాన్సర్ నిరోధక పదార్థాలను విడుదల చేస్తుంది, సమర్థవంతమైన క్యాన్సర్ చికిత్స కోసం ఔషధం యొక్క తాజా పురోగతి.

    పైనాపిల్ యొక్క వెచ్చని పండు తిత్తులు మరియు కణితులను చంపే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది అన్ని రకాల క్యాన్సర్లను నయం చేస్తుందని నిరూపించబడింది.

    పైనాపిల్ వేడి నీరు అలెర్జీలు/అలర్జీల వల్ల శరీరంలోని అన్ని సూక్ష్మక్రిములు మరియు టాక్సిన్‌లను తొలగిస్తుంది.

    పైనాపిల్ రసం నుండి తీసుకోబడిన ఔషధం *హింసాత్మక కణాలను* మాత్రమే నాశనం చేస్తుంది మరియు ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయదు.

    అలాగే పైనాపిల్ జ్యూస్‌లో ఉండే అమినో యాసిడ్‌లు మరియు పైనాపిల్ పాలీఫెనాల్స్ అధిక రక్తపోటును నియంత్రిస్తాయి, అంతర్గత రక్తనాళాలు అడ్డుపడకుండా చేస్తాయి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి మరియు రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి.

    చదివిన తరువాత, ఇతరులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

   


  *ఈ సందేశాన్ని కనీసం ఐదు గ్రూపులకు పంపండి*

  *కొందరు పంపరు*

  *అయితే మీరు తప్పకుండా పంపుతారని ఆశిస్తున్నాను*


ముఖ్యగమనిక:

మీరు రైలులో ప్రయాణం చేసేటప్పుడు మీకు "అత్యవసరంగా మందులు" అవసరమైతే....ఏంచేస్తారు..రైలులో అత్యవసరంగా వైద్యులు దొరుకుతారేమెాగానీ... "ప్రాణాపాయం "నుండి కాపాడే మందులు దొరకవు....

దానికొరకే ఒకవ్యక్తి నడుంబిగించాడు....

అతడే..." విజయ్ మెహెతా " ఈ వ్యక్తి మీకు కావలసిన ప్రాణాపాయ నివారణ మందులను పొందడానికి మీరు అతనికి ఫోన్ చేస్తే....తరువాత వచ్చే స్టేషన్లో వాటిని అందజేస్తారు అదీ ఎటువంటి 'ప్రత్యేక రుసుము' లేకుండా వాటిని అందజేస్తారు ఇప్పటికి భారతదేశం మెత్తంలో ప్రస్తుతానికి 400 వందల స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నది...

మీరు చేయవలసిన ఫోన్ నం.

విజయ్ మెహెతా ...09320955005

అందరికీ పంపండి..ప్రయాణికుల ప్రాణాలను కాపాడండి...


******************************

చెల్లి పేదరికం

 ఇండియా టీవీ ప్రోగ్రామ్ లో యోగి కళ్ళలో నీళ్ళు రావడమే కాదు చెల్లి పేదరికం చూసి ఒళ్ళు మరచి ఏడ్చాయి . అధికారంలో ఉన్న మిగిలిన నాయకులు తమ కుటుంబాలను కోట్లకు అధిపతులుగా చేసినప్పుడు మీ సోదరి ఇంకా ఎందుకు పేదరిక జీవితం గడుపుతోంది అని రజత్ శర్మ యోగిజీని అడిగినప్పుడు . యోగి సోదరి పని చేస్తున్న పోటో చూపించారు . స్టేజి మీద అక్క పేదరికం ఫోటో చూసి  అయిన యోగి . కొన్ని క్షణాలు యోగి ఏడుస్తునే వున్నాడు .  కానీ తనను తాను హ్యాండిల్ చేసుకుంటూ నేను యోగిని 25 కోట్ల మంది ఉత్తర ప్రదేశ్  ప్రజల తరుపున ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసానని... తన కుటుంబం గురించి ప్రమాణం చేయలేదు . ఇలా అంటుంటే యోగికి తన చెల్లి అంటే తనకు ప్రాణం , కానీ కుటుంబ పేదరికం చూసి ఏడ్చిన యోగి , ప్రభుత్వ ఖజానా నుండి ఒక్క రూపాయి ఇవ్వలేదు ఎందుకంటే యోగి చేసిన ప్రమాణస్వీకారం , నిస్వార్థ కార్య యోగం . ఒక పక్క అఖిలేష్ కుటుంబవాది మరో పక్క యోగి లాంటి నిస్వార్థ కార్మికుడు ఇద్దరిని ఎలా పోల్చగలం . UP కి నిస్వార్థ , కరుడుగట్టిన ధర్మవీరుడు యోగి లాంటి ముఖ్యమంత్రి దొరకడం నిజంగా అదృష్టం

హరిఓం

 హరిఓం   


'ఓం''...  తో   అలసట  మాయం...

శాస్త్రీయంగా  నిరూపించిన  బాలిక.......


👉    ఓం... శబ్దంతో.... 

శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలు గేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది. 

👉పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్త లను అకట్టుకుంది. 

👉కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది. 


👉ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు. 


అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి...

👉ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియ

జేసింది. 

👉అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది. 


👉గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు. కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు. 


👉ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు. 

👉ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించి నపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది. 

👉అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది. 

👉దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది. 

👉దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది. 

👉ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది. 


👉17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది. 

👉ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష తెలిపింది.... 


ప్రతి రోజు  ఉదయం ,  సాయంత్రం  కనీసం  11 సార్లు  దీర్ఘ  ఓంకారం  చేయండి.........  మీ  బంధు మిత్రులతో  చేయించండి ........ ఓం ,  ఓం , ఓం.....

తామస గుణం

 శ్లోకం:☝️

*యత్కర్మ కృత్వా కుర్వంశ్చ*

  *కరిష్యంశ్చైవ లజ్జతి ।*

*తజ్ఞేయం విదుషా సర్వం*

  *తామసం గుణలక్షణం ॥*

   - మనుస్మృతి 12.35


భావం: ఒక పని పట్ల మనస్సాక్షి అపరాధంగా తప్పుగా భావిస్తే, ఆ కర్మ పాపం (తామస గుణం) తో కూడినదిగా తెలుసుకోవాలి.

ఆనందపు తుంపరలు

 శ్లోకం:☝️ఆనందస్వరూప ధ్యానం

*స్ఫురన్తి సీకరా యస్మాద్-*

 *ఆనందస్యాంబరేఽవనౌ ।*

*సర్వేషాం జీవితం తస్మై*

 *బ్రహ్మానందాత్మనే నమః ॥*

 - యోగవాసిష్ఠం 1.1.3


భావం: విశ్వమంతా (నింగి - నేల) ఆనందపు తుంపరలు కురిపించే మరియు అందరికీ ప్రాణం (జీవులకు ఆధారం) అయినట్టి బ్రహ్మానంద స్వరూపుడైన పరమాత్మకు నమస్కారము.🙏

పూజలు

 *పూజలు అవసరమా???*


పూజ మన మనసును బాగు చేసుకునే సాధనమే గానీ దైవాన్ని ఆకట్టుకునే ప్రయత్నం కాదు. 

ఇరవై ఏళ్ళుగా పూజలు చేస్తున్నా ఫలం లేదని కొందరు అంటుంటారు. 

అంటే ఇరవై ఏళ్ళ అశ్రద్ధ వారిలో ఉందని అర్థం, భగవంతుని అనుగ్రహానికి క్షణకాలం స్మరణ చాలు!!...


పిల్లవాడికి జబ్బు చేస్తే ఏడుకొండల వాడిని ఒక క్షణం పాటు మొక్కుకుంటాం. 

అక్కడ దేవుని రూపంతో గాని, స్మరించే కాలంతో గానీ పని లేకుండానే కోరిక నెరవేరుతుంది. 

పిల్లవానికి జబ్బు తగ్గిన తర్వాత కృతజ్ఞత కోసం తిరుపతి వెళ్తున్నాం కానీ ముందు తిరుపతి వచ్చి మొక్కుకుంటేనే కోరిక తీరుస్తానని దేవుడు చెప్పటంలేదు!!...


క్షణంలో అనుగ్రహించే దైవానికి గంటల కొద్దీ పూజ ఎందుకు అని అనుమానం వస్తుంది!!..

ఒక రూపంపై మనసు నిలిపే శిక్షణ కోసం విగ్రహం ఎలా అవసరమైందో, మనకి ఓర్పు, సహనం, ఏకాగ్రత నేర్పేందుకు పూజ కూడా అంత అవసరమైంది. 

అంటే క్షణకాలం వచ్చి పోతున్న భగవత్ స్మరణ, ఎక్కువ సేపు నిలిపేందుకే పూజ అవసరం, పూజ మనసు బాగుచేసుకొనే సాధన...


*శ్రీ సద్గురు పీఠం కోటకదిర*

వేదాలను మించిన శాస్త్రం లేదు

 శ్లోకం:☝️

*నాస్తి వేదాత్పరం శాస్త్రం*

 *నాస్తి మాతుః పరో గురుః ।*

*నాస్తి దానాత్పరం మిత్రం*

 *ఇహ లోకే పరత్ర చ ll*

    అత్రిస్మృతిః - 148


భావం: వేదాలను మించిన శాస్త్రం లేదు. తల్లిని మించిన గురువు లేదు, దానాన్ని మించిన స్నేహితుడు లేడు; ఇహలోకంలోను పరలోకంలో కూడా!