26, జులై 2023, బుధవారం

చిదంబర ఆలయం

 *చిదంబర ఆలయం* 

చిదంబరం లో ఉన్న నటరాజ విగ్రహం యొక్క కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల 

పరిశోధన అనంతరం పాశ్చాత్య సైంటిస్టులు తేల్చి చెప్పేశారు .

ఈ ఆలయం ప్రపంచ అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది.

చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి . మానవుడికి నవ ( 9 ) రంధ్రాలు ఉంటాయి


చిదంబరం దేవాలయంలో పైన 21600 బంగారపు రేకులు తాపడం చేశారు . మానవుడు రోజుకు 21600 సార్లు గాలి పీలుస్తాడు . ( 15 x 60x 24 = 21600 )


ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72000 బంగారపు మేకులు వాడారు . మన శరీరం లో ఉండే నాడులు 72000 అని ఆయుర్వేదం చెబుతుంది .


దేవాలయం లో " పొన్నాంబళం " కొంచెం ఎడమవైపుకు ఉంటుంది . అది మన హృదయ స్థానం . అక్కడకి వెళ్ళడానికి " పంచాక్షర పడి " ఎక్కాలి . 

అది న + మ + శి + వ + య . పంచాక్షరి ని సూచిస్తుంది.


" కనక సభ " లో 4 స్తంబాలు 4 వేదాలకు ప్రతీకలు 


పొన్నాంబళం లో 28 స్థంబాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు - శివారాధనా పద్ధతులు . ఇవి 64 ఇంటూ 64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి. 64 కళలు ఉన్నాయని రుజువు ఇది . అంతే కాదు అడ్డు దూలాలు రక్త ప్రసరణ నాళాలు 


9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు . 

అర్ధ మంటపం లోని 6 స్తంబాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు .

ప్రక్కన ఉన్న మంటపం లోని 18 స్తంబాలూ 18 పురాణాలకి ప్రతీకలు 


నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్ట్ లు కాస్మిక్ డాన్సు అని వర్ణించారు . 

మూలవర్ చెప్పిన ఈ విషయాలు శాస్త్ర సమ్మతాలని నిరూపించడానికి పాశ్చాత్య పరిశోధకులకు 8 సంవత్సరాలు పట్టింది.

(సేకరణ)

పిల్లవాడు - పిల్లివైద్యం

 పిల్లవాడు - పిల్లివైద్యం


పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శ్రీ మఠంలో భక్తులు బారులు తీరి ఉన్నారు. వారిలో దంపతులొకరు మగబిడ్డతో వరుసలో నిలబడి ఉన్నారు. వారి వంతు రాగానే, బిడ్డను మహాస్వామి వారి పాదాల చెంత ఉంచి భోరున ఏడవసాగారు. ఇతర భక్తులు వారివైపు జాలితో చూస్తున్నారు. ఆ పిల్లవాణ్ణి చూస్తే బంగారు బొమ్మలా ఏ కదలికా లేకుండా ఉన్నాడు. కళ్ళు కూడా కనిపించడం లేదు అని అర్థమైంది.


స్వామి వారు పిల్లవాడి వంక కొద్ది సేపు తీక్షణంగా చూసి, "ఇంకా అలానే ఉంది. తగ్గలేదు" అని మౌనంలోకి వెళ్ళిపోయారు. మహాస్వామి ఏమి అన్నారో ఎవరికీ అర్థం కాలేదు. కాసేపాగి మఠం అంతేవాసిని కొద్దిగా పాలు, నందివర్ధనం పువ్వు తెమ్మన్నారు. పాలలో పువ్వుని ముంచి పిల్లవాడి తలకు, కళ్ళకు, కడుపుకు, కాళ్ళకు రాసి కనులు మూసి కొద్ది సేపు ప్రార్థన చేసారు. తరువాత ఆ బిడ్డ తల్లి తండ్రులతో, "మాయవరం(మైలాదుతురై) మయూరనాథుని ఆలయానికి తీసుకుని వెళ్ళి, అక్కడ ఉన్న దక్షిణామూర్తి పాదాల చెంత పిల్లవాడిని ఉంచండి. ఇప్పుడే బయలుదేరండి" అని చెప్పారు. వెంటనే ఆ దంపతులు ఆ పిల్లవాణ్ణి తీసుకుని పయనమయ్యారు.


వీరు అక్కడకు చేరుకునేటప్పటికే అక్కడ చాలా మంది ఉన్నారు. వారు ఈ పిల్లవాడి గురించి మాట్లాడుకుంటున్నారు. గణపతిని దర్శించుకుని దక్షిణామూర్తి సన్నిధికి వెళ్ళి పిల్లవాడిని స్వామి పాదాల చెంత ఉంచి ప్రార్థించసాగారు. ఒక గంట గడిచింది. పిల్లవాడిలో ఏ కదలికా లేదు. చుట్టూ మూగిన జనం ఆ బిడ్డ తల్లిదండ్రుల నమ్మకం చెడిపొయేలాగా మాట్లాడుతూ, వారిని మాట్లాడించే ప్రయత్నం చేయనారంభించారు.


అదే సమయానికి ఒక తెల్ల పిల్లి ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ పిల్లాడి దగ్గరకు వచ్చింది. పిల్లి నుంచి బిడ్డను తల్లి కాపాడ సాగింది. ఎవ్వరూ ఊహించని విధంగా పిల్లి పిల్లాడి నుదురు నాకి, తల నుంచి పాదాల వరకు వాసన చూసి వెళ్ళిపోయింది. పుట్టినప్పటి నుంచి కదలని ఆ పిల్లవాడు దక్షిణామూర్తి వైపు చూసి నవ్వి కేరింతలు కొట్టసాగాడు. ఆ తల్లిదండ్రులు "జయ జయ శంకర హర హర శంకర" అని ఆనందంతో చెప్పుకుంటూ పిల్లవాడిని ఎత్తుకున్నారు. పిల్లవాడు తల్లిదండ్రులను చుసి నవ్వాడు. ఈ సంఘటన చూసిన జనాలు స్వామివారి దైవత్వాన్ని కొనియాడారు.


పూర్వ జన్మలలో పిల్లిని చంపినట్లు అయితే, అలాంటి వారు మరు జన్మలో సంతాన హీనులుగా కానీ, మానసిక/శారీరిక వైకల్యం ఉన్న సంతానం కానీ కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. 


మహాస్వామి వారి గొప్పతనం ఏమని చెప్పేది. ఏ పిల్లిని చంపడం ద్వారా సంక్రమించిన పాపం వల్ల ఆ తండ్రికి అలాంటి సంతానం కలిగిందో, ఆ పిల్లి జాతి ద్వారానే ఆ పిల్లవాడి కర్మను మార్చారు. మహాస్వామి వారి దగ్గరకు వచ్చి శరణు వేడిన వారి బాధలను స్వామి వారు ఎన్నిటినో తీసి వేసారు. వైద్యులు నయం చేయలేని, కర్మవశాత్తు కలిగే ప్రాణంతక రోగాలను ఎన్నింటినో స్వామి వారు తొలగించారు.


ఇలాంటివి చదువుతుంటే, స్వామి వారు మన మధ్యలో ఇంకో 100 యేళ్ళు ఉంటే బావుంటుంది అని అనిపించకుండా ఉంటుందా?


--- ఆదిత్య నండూరి, హైదరాబాద్


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

మత రక్షణకు మహత్తర కృషి

 కంచి మహా స్వామి వారు- మత రక్షణకు మహత్తర కృషి


భారత దేశంలో మతం మనుగడకు రాజ్యాంగరక్షణ చేకూరింది మన రాజ్యాంగంలో మతం ప్రజల ప్రాథమిక హక్కుగా  పరిగణన పొందింది. అయితే ఇందుకు ప్రధాన బాధ్యులు ఎవరో దేశం మొత్తం మీద తెలిసిన వారు ఎందరో లేరు.


1947లో కామకోటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి తపోబలంతో ఆ లక్ష్యం ఎలా సాధించబడిందో వేద రహస్య సంవేది, మహా పండితుడు శ్రీమాన్ అగ్నిహోత్రం రామానుజ తాతాచారి గారు ఈ వ్యాసంలో వెల్లడించిన విషయాలు అద్భుతావహాలు.


హిందూ మత సంరక్షణకు శ్రీ కంచి కామకోటి పరమాచార్యులు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు చేసిన మహత్తర సేవలు తెలుసుకోవాలంటే భారత స్వాతంత్ర ఉద్యమం నాటి దేశ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవాలి.


చిన్నతనంలోనే సన్యసించి కంచి కామకోటి మఠాధిపత్యం వహించడం వల్ల స్వామివారి ప్రత్యక్షంగా దేశ రాజకీయాలలో పాల్గొనలేదు. అయినా భారత స్వాతంత్రాన్ని వారు మన: పూర్వకంగా వాంఛించారు. దానిని బలపరిచారు.


స్వామివారి ఆశించింది భారతదేశంలో విదేశీ పాలన అంతరించడం మాత్రమే కాదు. మన దేశీయుల హృదయంలో పాదుకున్న విదేశీ వ్యామోహం కూడా అంతం అవ్వాలని వారు గాఢంగా వాంఛించారు.


గాంధీ గారి విదేశీ వస్తే బహిష్కరణ ప్రారంభించిన నాటి నుండి స్వామి స్వయంగా ఖద్దరు ధరిస్తున్నారు.

దురదృష్టవశాన జాతీయ ఉద్యమ నాయకులూ రాజకీయాలకే సర్వప్రాధాన్యం ఇచ్చి , మతం పట్ల ఉపేక్ష వహించారు.

అందువల్ల మనకు స్వాతంత్రం సిద్ధించిన నాడు మన మతానికి ఆధ్యాత్మిక ప్రయోజనాలకు హాని వాటిల్లవచ్చని స్వామి వారు అనుమానించారు.

ఈ విషయమై శ్రీ కామకోటి స్వామి పలువురు రాజకీయ నాయకులను హెచ్చరించారు. కానీ వారి హెచ్చరికలను నాయకులు అంతగా పాటించలేదు. రాజకీయాలు మినహా ఇతర సమస్యలకు ప్రాధాన్యం లేని నాటి క్లిష్ట పరిస్థితులలో మన  మత రక్షణకు కంచి స్వామివారు ఒక్కరే అవిశ్రాంతంగా పాటుపడక తప్పలేదు.


భారత రాజ్యాంగ నిర్మాణ దశలో కంచి పీఠాధిపతి ప్రదర్శించిన అసాధ్య రాజకీయ పరిజ్ఞానం వల్లనే నేడు మన రాజ్యాంగ చట్టంలో మతస్వాతంత్రానికి    మతసంస్థల సంరక్షణకు ( అనగా హిందూ ధర్మంలో ఈనాడు ఉన్న అనేక సాంప్రదాయాల పీఠాలు మఠాలు స్వతంత్రతకు) నియమ నిబంధనలు స్థిరంగా నెలకొన్నవి.

ఈ సందర్భంగా శ్రీ స్వామి వారు సల్పిన నిరాడంబర కృషిని విజ్ఞాన ప్రపంచానికి వెల్లడించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.


""స్వామి భవిష్యద్వాణి""

మత స్వాతంత్రానికి మత సంరక్షణకు రాజ్యాంగ ప్రమాణికతను సమకూర్చాలని లక్ష్యసాధనలో  స్వామి వారెంత నిర్విరామంగా పాటుపడినరో నే నెరుగుదను. కుంభకోణం సమీపాన వేలూరు అనే పల్లెటూరులో ఒక అర్ధరాత్రి స్వామి వారు చేసిన ఈ హెచ్చరిక నేటికీ నా  చెవులలో మారు మ్రోగుతున్నది.


" భారత రాజ్యాంగం ద్వారా మన మతాన్ని కాపాడుకొనడం మన తక్షణ కర్తవ్యం. ఇది ఎంత మాత్రమూ ఉపేక్షించవలసిన విషయం కాదు.


ఈ హెచ్చరిక ప్రాముఖ్యత ఆనాడు మేమంతగా గుర్తించలేదు. కానీ తర్వాత కొద్ది రోజులలోనే జరిగిన సంఘటనలు స్వామి భవిష్యత్ వాణిని అక్షరాలా ధ్రువీకరించినవి.

భారత స్వాతంత్రాన్ని గురించి ప్రత్యేకించి భారతదేశానికి నూతన రాజ్యాంగ నిర్మాణాన్ని గురించి చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశానికి ఒక రాయబార వర్గాన్ని పంపింది.


ఆ సందర్భంలో తమ కర్తవ్యం ఏమిటో కామకోటి శంకరాచార్యుల వారు తప్ప,తక్కిన మతాధిపతులు ఎవరు గుర్తించలేదు . బ్రిటిష్ రాయబార  వర్గ సభ్యులను కలుసుకొని మన దేశంలో గల మత సంస్థల పరిస్థితులను గురించి, భవిష్యత్తులో వాటి ప్రతిపత్తిని గురించి రాయబారవర్గ సభ్యులకు నచ్చ చెప్పవలసిందిగా స్వామి వారు మమ్ము ఆదేశించారు.


కానీ బ్రిటిష్ రాయబారవర్గమ్మ విజ్ఞప్తిని ఆలకించడానికి అవకాశం ఇస్తుందా అని మేము సందేహించాము. ఏమైనప్పటికీ జరగవలసినదేదో జరగనిమ్మని, స్వామివారి ఆదేశం మేరకు రాయబారవర్గానికి టెలిగ్రాములు పంపాము. మేము ఊహించినట్టే జరిగింది! మా టెలిగ్రాములకు వారు సమాధానం కూడా ఇవ్వలేదు. అయినా, స్వామివారు మావలే నిరాశ చెందలేదు. ఆయన ఆత్మ విశ్వాసం మాకు ఆశ్చర్యం కలిగించింది. అది మా అల్పగ్నతకు నిదర్శనం. స్వామి సంకల్పం అమోఘం. అది వారికే విధితం.


అద్భుత సన్నివేశం


ఇంతలో తలవని తలంపుగా "తక్షణం మద్రాస్ కు బయలుదేరి రావలసింది " అని " హిందూ" పత్రిక కార్యాలయం నుంచి నాకు టెలిగ్రామ్ వచ్చింది. నేను మద్రాసు చేరి హిందూ కార్యాలయంలో అడుగుపెట్టినాను లేదో , అప్పటి హిందూ సంపాదకులు శ్రీ కస్తూరి శ్రీనివాసన్ నాకు ఎదురుపడి, బ్రిటిష్ పార్లమెంటరీ రాయబారవర్గం మరికొన్ని నిమిషాల్లో తమ కార్యాలయం దర్శించబోతున్న వార్త నా చెవిని వేశారు. ఆనాడు రాయబారవర్గ సభ్యుల గౌరవార్థం హిందూ కార్యాలయంలో ఒక తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఏ రాయబారవర్గం వారు మేము పంపిన టెలిగ్రాములకు సమాధానమైనా పంపకుండా తటస్థంగా ఉన్నారో, వారే మరికొన్ని క్షణాల్లో అక్కడికి నాకు ప్రత్యక్షమయ్యే అద్భుత సన్నివేశం అప్పటికప్పుడు ప్రత్యక్షమైంది. రాయబారవర్గం కార్యదర్శి కి కస్తూరి శ్రీనివాసన్ నన్ను పరిచయం చేశారు. మా టెలిగ్రాములు ఒక్కదానికైనను మీరు జవాబు ఇవ్వలేదు అని వారితో నేను అన్నాను. రాయబారవర్గ సభ్యులందరిలో ప్రముఖుడైన బ్రిటిష్ పార్లమెంటరీ సభ్యుడు శ్రీ సోరేన్సేన్ కు స్వయంగా మా విజ్ఞప్తిని వినిపించవచ్చని ఆయన నాకు సలహా ఇచ్చారు. ఈ వ్యవహారం అంతా హడావిడిగా జరిగిపోవడం వల్ల మా విజ్ఞాపనను రాత మూలకంగా వారికి సమర్పించడానికి వీలుపడలేదు, భారత దేశంలో మత సంస్థలు నిస్సహాయ స్థితి గురించి నోటి మాటలతోనే శ్రీ సోరేన్సేన్ కు సంగ్రహంగా చెప్పి మత సంస్థలకు రాజ్యాంగ రక్షణ అవసరమైన శ్రీ కామకోటి మఠాధిపతులు ఆశయాన్ని వారికి విశదపరిచాను. మరొకసారి తనను ఢిల్లీలో కలుసుకోవాల్సిందిగా ఆయన నాతో అన్నారు.    

      

      మతము ప్రాథమిక హక్కు!

ఆశ్చర్యకరంగా జరిగిన ఈ కథ యావత్తు మహాస్వామి వారికి వినిపించాలని నేను హుటాహుటిగా కంచికి తిరిగి వచ్చాను. నేను చెప్పిందంతా స్వామి విన్నారు ఒక్క క్షణం ధ్యానంలో ఉన్నారు.

అతి తర్వాత మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించవలసిందని కోరుతూ ఒక విజ్ఞాపన తయారు చేయవలసిందిగా మాదేశించారు.

మతమా! ప్రాథమిక హక్కా !


హక్కు! ప్రాథమిక హక్కుల గురించి దేశంలో అప్పటికే మేధావి వర్గాల్లో సైతం ఆలోచనలు బయలుదేరలేదు. కాగా మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించడం గురించి యోచించిన వారు అసలే లేరు. ఆ మాటకొస్తే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల అవతరణకు ఇదే నాంది వాక్యము అనడం కూడా అతిశయోక్తి కాదు.

తర్వాత మళ్లీ నేను బ్రిటిష్ రాజ్యాంగ పరిరక్షణ రాయవర్గం వారిని కలుసుకున్నప్పుడు వారు నాతో అన్న మాటలు మేము ఎంత చేసినా చివరికి రాజ్యాంగం తయారు చేయవలసింది భారతీయులైన మీ వారే కాబట్టి మీరు వారిని వెళ్లి కలుసుకోవడమే ఉత్తమం అని వారు మాకు సూచించారు. ఆ విధంగా తరువాత భారతదేశానికి స్వాతంత్రం లభించడం, రాజ్యాంగ పరిరక్షణకు ఒక కమిటీ ఏర్పాటు అవ్వడం మేము కామకోటి పీఠం తరఫున అప్పటికే అనేక పర్యాయాలు శ్రీ పటేల్ గారిని అంబేద్కర్ గారిని గారిని కలుసుకొని అనేక విన్నపాలు విన్నపించాం , ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అంబేద్కర్ గారి వద్ద మా అనుమానం ఏదైతే ఉందో అది పటాపంచలయ్యి వారు మా యొక్క అభిప్రాయాలను ఎంతో గౌరవించారు అంతేకాక స్వామి వారి యొక్క న్యాయ ,రాజ్యాంగ లౌకిక ,రాజకీయ పరిజ్ఞానానికి ముగ్గులయ్యారు , వారికి కూడా తెలియని అనేక విషయాలను స్వామి వారి ద్వారా వారికి విన్నవిస్తూ ఉంటే , వారు ఆశ్చర్య చెక్కుతులై , దక్షిణ భారతదేశంలో ఎక్కడో ఒక కుగ్రామంలో ఏకాంతంగా కాలం గడుపుతున్న ఒక యోగి పుంగవుని దివ్య ప్రభావం ఎలా నడిపించిందో అని తెలుసుకొని ఆయన పొంగిపోయారు, 

మరొక మెలిక

ఇంత  జరిగిన మతానికి మత సంస్థలకు నిర్నిరోధమైన స్వాతంత్రాన్ని రాజ్యాంగంలో కల్పించడానికి రాజకీయ నాయకులు సిద్ధంగా లేరు. అందుచేత మేము సూచించిన మత స్వాతంత్రం అనే పదానికి ముందు చట్టసమ్మతమైన అను మాటలు చేర్చవలసిందిగా వారు సలహా ఇచ్చారు. ఆ మాటలు చేర్చినట్లైతే ప్రభుత్వం తన ఇష్టప్రకారం మత విషయంలో మత సంస్థల వ్యవహారంలో జోక్యం కల్పించుకోవచ్చు ప్రభుత్వం ఏ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టిన మత సంస్థలు దానికి అడ్డు చెప్పడానికి వీలు ఉండదు అంత మాత్రమే కాదు. భవిష్యత్తులో రాబోయే కొన్ని ప్రభుత్వాలు అసలు మతంలోనే విశ్వాసం లేనివి గా ఉండవచ్చు అందుచేత బిల్లు రెండవ మార్పు చర్చలకే వచ్చినప్పుడు second reading of the bill ఆ నిబంధనలను తగువిధంగా సవరించవలసిందిగా స్వామి వారు మాకు చెప్పారు, ఆ ప్రకారమే రాజ్యాంగ పరిషత్ సభ్యులకు మేము విజ్ఞాపన చేసాము.

 డాక్టర్ అంబేద్కర్ మతాభిమానం

ఈ సందర్భంలో ఒక విషయం ప్రత్యేకంగా చెప్పక తప్పదు. సాంఘిక సమస్యలపై డాక్టర్ అంబేద్కర్ గారికి గల తీవ్రమైన అభిప్రాయాలను బట్టి మేము వారిని దర్శించినప్పుడు మా సూచనలకు వారు సుముఖులుగా ఉంటారని ఊహించలేదు కానీ అక్కడ కూడా స్వామివారి ప్రభావమే మాకు సహాయపడింది మాకు గల అనుమానాలు అంబేద్కర్ మహాసేయుడు ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోకుండా మత సంస్థల స్వచ్ఛందంగా  మననవలసినవేనని తమ అభిప్రాయం అన్నారు.

అప్పటినుండి మా వ్యవహారం నల్లేరుపై బండిలా నడిచింది.

మత సంస్థలకు సంబంధించిన క్లాజ్ ని నాలుగు భాగాలుగా విభజించారు. చట్టసమ్మతమైన అనే మాటలను నాలుగో భాగానికి మాత్రమే వర్తింపజేశారు.

మత సంస్థల స్వతంత్ర నిర్వహణ రాజ్యాంగ రక్షణ సమకూరుందంటే శ్రీ కామకోటి పరమాచార్యుల కృషి అందుకు ప్రధాన కారణం.

ప్రతి మతము ఈ హక్కులు కలిగి ఉంటుంది.

అని మాత్రమే ఆదిలో ఉండేది మహా మేధావులను రాజ్యాంగ నిర్మాతలు సైతం ఆ వాక్య రచనల్లో గల లోపాన్ని గ్రహించలేదు.

స్వామి వారొక్కరే దాన్ని అసమగ్రతను గ్రహించారు!


హిందూ మతానికి చెందిన ఏ వ్యక్తి అయినా తాను వైష్ణవుడనో శైవుడననో  భావిస్తూడే తప్ప, ఓం ప్రధమంగా హిందువులని పరిగణించుకోడు. అదేవిధంగా మన దేశంలో ఏ మత సంస్థ అయినా హిందూ మతం పేరుతో వ్యవహరించదు. ఎక్కడ చూసినా వైష్ణవ స్మార్త శైవా సిద్ధాంతాన్ని వేర్వేరు సంస్థలు గాని ఆ పేర్లతో నడుస్తూ ఉంటాయి. అందుచేత మత సంస్థలు అన్నప్పుడు అనేక శాఖల పేర్లతో నడిచే సంస్థలు రాజ్యాంగ రక్షణ సూత్రం వర్తించకపోవచ్చు. ఆ హేతు చేత అన్ని మతాలు ఆ మతాలకు చెందిన అన్ని శాఖలు ఈ క్రింది హక్కులు కలిగి ఉంటావి. అనే మాటలు చేర్చాల్సిందిగా శ్రీ స్వామి వారి సూచించారు స్వామి వారి సూచన ప్రకారమే ఆ నిబంధన రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదం పొందింది!


ఇంత వ్యవహారం నడిచిన ఈ సందర్భంలో స్వామివారు వహించిన పాత్ర పరమ రహస్యంగా ఉండిపోయింది.

తాము తెర మరుగున ఉండి,

మన మతానికి, మత సంస్థలకు స్వాతంత్రాన్ని, రాజ్యాంగ రక్షణనూ ప్రతిపాదించిన మహానుభావుడు ఆయన. రాజ్యాంగ వేత్తలు ,న్యాయ శాస్త్ర విచారకులు, న్యాయమూర్తులు, అందరూ స్వామివారి ప్రజ్ఞాపూర్వక సూచనలను  సూచనలను అనుసరించిన వారే అయినారు.


ఇంతవరకు లోకానికి వెల్లడి కానీ ఈ మహత్తర విషయాలు మన మత చరిత్రలోనే కాదు, మన మన రాజ్యాంగ నిర్మాణీతిహాసంలో సైతం సువర్ణ అక్షరాలతో చిత్రించదగ్గ అంశాలు.


శృంగేరి స్వామి ప్రశంస

ఇదే సందర్భంలో మరువరాని మరొక విషయాన్ని తెలుసుకోవాలి.

అది శ్రీ శృంగేరి పీఠాధిపతుల సందర్శనం. హిందూ మత సంస్థలకు భారత రాజ్యాంగంలో రక్షణ కల్పించే నిమిత్తం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు సలుపుతున్న కృషి సందర్భంగా నేను నా సహచరులు దేశంలో వివిధ మతాధిపతిలను సందర్శించాము. ఆ సందర్భంలోనే అప్పటి శృంగేరి పీఠాధిపతులు     శ్రీ చంద్ర శేఖర భారతీ స్వామి సమక్షంలో మీ అనుభవించిన దివ్య అనుభూతి ఎన్నటికీ మరువరానిది.

ఆ మహనీయుడు మఠాధిపతి అయినా తపస్ సంపన్నుడు నిరంతన ధ్యాన నిమగ్ధుడు ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే బాహ్య స్మృతి కలిగిన ఉండే మహా వ్యక్తి.


మేము శృంగేరి కి వెళ్ళిన రోజున అదేమి భాగ్య విశేషముగాని అంతకుముందే దీర్ఘ సమాధి      నిష్ఠులైన ఉండిన స్వామివారు , ఆనాడు దర్శనమిచ్చారు.

చూడడంతోనే స్వామివారి మమ్మల్ని అడిగిన మొట్టమొదటి ప్రశ్న కామకోటి పీఠాచార్యులు వ్యాస పూజ ఎక్కడ చేశారు?

తిరువడైమరుదురు అని మేము సమాధానం చెప్పాము.

అట తర్వాత హిందూ మత సంస్థలకు రాజ్యాంగ పరిరక్షణకై కామకోటి ఆచార్య స్వాములు సలుపుతున్న కృషిని దేశంలో మత సంస్థలన్నీటిని సమైక్యతకు వారు కలుపుతున్న ప్రయత్నాలను శృంగేరి స్వామికి నివేదించాము.

ప్రసన్నవదనంతో స్వామివారి ఇలా అన్నారు. దేశ పరిస్థితులను సూక్ష్మంగా గ్రహించి ప్రస్తుత స్థితిలో మన కర్తవ్యం ఏమో గుర్తించ జాలిన వారు కంచి స్వామి వారు ఒక్కరు మాత్రమే. ఈ విషయంలో మేమందరం వారి కృషి  పైన ఆధారపడుతాము ఇందుకు మేము వారికీ ఎంతో కృతజ్ఞులము.

వర్తమాన కాలంలోని మనదేశంలో హిందూ మతస్తులు ఈ మాత్రమైనా ధర్మనిష్ట కలిగి ఉన్నవారు అంటే  అందుకు ప్రధానంగా శ్రీ కంచి  శంకరాచార్యులు కారణం , అంటూ మమ్మల్ని ఆశీర్వదించి పంపించారు.


   శ్రీ అగ్నిహోత్రం రామానుజ తాతాచారి.

పైన తెలిపిన విషయాలు గమనిస్తే

ఆనాడు పరమాచార్య స్వామి వారు అంత శ్రమ కృషి తీసుకొని ఉండకపోతే, ఈనాడు భారత దేశంలో  ఏ మఠము లో అయినా గాని 

ప్రభుత్వాలు జోక్యం చేసుకొని , పీఠాలలో  కూడా రాజకీయాలు చేసి , పీఠాధిపతిని కూడా వారే నిర్ణయించేవారు , పీఠాధిపతి వ్యవస్థలో కూడా రిజర్వేషన్ పెట్టిన ఆశ్చర్యపడనక్కర్లేదు , అటువంటి స్థితి మనకు కలిగి ఉండేది, ఆనాడు పరమాచార్య స్వామి వారి ముందు చూపు వల్లనే ఈనాడు దేశంలో అన్ని పీఠాలలో సక్రమంగా వారి వారి సాంప్రదాయాను సారం నడుచుకుంటూ ధర్మ ప్రబోధం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు చెప్పండి నేను పైన అన్న మాట తప్పా ?

పరమాచార్య స్వామి వారే లేకపోతే ఈనాడు హిందూ ధర్మం మరోలా ఉండేది, 

వారు ఈ దేశానికి ఈ ధర్మానికి చేసిన కృషి అనన్య సామాన్యం

మరో శంకరుల ఈ భూమి మీద నడయాడిన అపర దక్షిణామూర్తి అవతారం జగద్గురు శ్రీ కంచి కామకోటి పీఠాధిపరులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, 

జయ జయ శంకర హర హర శంకర

శ్రీ రామ జయం

పండితుని తెలివి*

 *పండితుని తెలివి*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏


చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు. ఆ పండితుడు రాజుకు  ఒక "ఘనపనస" చదివి ఆశీర్వదించాడు.


అప్పుడు ఆ రాజుగారు "ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా నేర్చుకుని చదవవచ్చు! చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను." అన్నాడు.


అప్పుడు ఆ పండితుడు "రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోషపరచడానికి ఆడతాను" అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.


రాజు గారు “ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం!” అన్నాడు.  కానీ ఆ పండితుడు "రాజా! ఆటను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా! రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలిగాను అని గొప్పగాచెప్పుకోవచ్చు"  అంటూ సున్నితంగా తిరస్కరించాడు.


"సరే! పండితా! నీ తెలివిని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేరుస్తాను. చెప్పు!" అన్నాడు రాజుగారు.


“మహారాజా! చదరంగంలో 64 గడులు ఉంటాయి కదా! ఒక గడిలో ఒక గింజ - రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు గింజలు - మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు - నాలుగవ గడికి మళ్లి రెట్టింపు 8 గింజలు -

.... ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం." అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.


రాజు “సరే !” అని ఆ పని మంత్రికి పురమాయించాడు. ఆ పండితుని వెంట మంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.


తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు "పండితుడడిగాడు కదా.. మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు.. మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు.. తర్వాత8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు..

‘అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు.. వెఱ్ఱి పండితుడు.. గింజలకు గింజలు రెట్టింపు చేసుకు పోయినా ఎన్నివస్తాయి.. ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..” అన్నాడు


“అలా తీసెయ్యకండి మహారాజా !.. ఆ పండితుడేమీ వెర్రిబాగులవాడు కాదు.. “


“ఎందుచేత..” అన్నాడు రాజుగారు.


“లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!”


“ఎందుకు..” ఆశ్చర్యపోతూ అడిగాడు మహారాజు.


“ఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటలకొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణంలో చెప్పేసాడు మహారాజా !  అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపకమాల పద్యం కూడా చెప్పాడు.”


“అలాగా.. ఏమిటా పద్యం..”


“ఇదుగో.. వినండి మహారాజా !”


“శర శశి షట్క చంద్ర శర సాయక

రంధ్ర వియత్ నగాగ్ని భూ

ధర గగనాబ్ధి వేద గిరి తర్క పయోనిధి

పద్మజాస్య కుంజర తుహినాంశు సంఖ్యకు

నిజంబగు తచ్చతురంగ గేహ విస్తర మగు

రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్”


పద్యం విన్న మహారాజు “దీన్లో తేలిన లెక్కెక్కడుంది.. అంతా బాణాలూ, చంద్రులూ, ఆకాశం,అంబుధి, కొండలు తప్ప..”


“అదే మహారాజా ! మనదేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరములతో అనల్పార్థసాధకంగా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..”


“సరే… సరే.. విప్పి చెప్పు..”


 “ఈ పద్యంలో లెక్కచిక్కు విడిపోవాలంటే మనపూర్వుల సంఖ్యాగణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతి శక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు..”


ఈ పద్యంలో…


శర, సాయక, -  అనే పదాలకు అర్థం బాణాలు అని .(మన్మథుని పంచసాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి. 


గగన, వియత్ - 0

(ఆకాశం గగనం శూన్యం)


శశి, చంద్ర, తుహినాంశు -1 

(చంద్రుడొకడే భూమికి )


షట్కము - 6 


రంధ్ర - 9  

(నవరంధ్రాలు)


నగ, గిరి, భూధర - 7 


అగ్ని - 3 

(మూడగ్నులు; గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని)


అబ్ధి, పయోనిధి - 4 


వేద -4

(చతుర్వేదములు)


తర్క - 6

( షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)


పద్మజాస్య - 4 

(పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడు)


కుంజర - 8

(అష్ట దిగ్గజములు)


ఇవీ ఇందులోని అంకెలసంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’


శర శశి షట్క  చంద్ర శర

5     1     6         1    5

 సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ

        5       9        0         7       3

ధర గగనాబ్ధి  వేద  గిరి

  7     0  4      4    7

తర్క పయోనిధి పద్మజాస్య 

  6           4           4     

కుంజర తుహినాంశు 

  8          1

సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి

స్తర మగు రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్


అంకెలు లెక్కించేటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. ‘అంకానాం వామతో గతిః’ -

కుడినుంచి ఎడమకు చేర్చి చదువుకోవాలి..


అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.


1,84,46,74,40,73,70,95,51,615


ఒకకోటి 84లక్షల 46వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615.


ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం. ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే, ఒక ఘనమీటరు విస్తృతిగల గాదెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే, 4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు దాదాపుగా 12,000 ఘన కిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..


పేర్చుకుంటూ వెళితే  300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు.. అంటే భూమికి సూర్యునికి ఉన్న దూరానికి రెట్టింపు.


పోనీ లెక్కపెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటే సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి  58,495 కోట్ల సంవత్సరాలు..

అదీ సంగతి…!


వేదపండితులతో వేళాకోళం తగదు మహారాజా !…


నిజానికి అతడు చదివిన గణపనస కూడా లెక్కలకు, ధారణ శక్తికి సంబంధించినదే ! 

ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ ఘనాపాటి కాలేరు. అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించపరిచారు. ఇప్పుడు ఏం చేయడం, మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది .


అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకులనుండి ఎవ్వరూ కూడా ఇప్పటివరకు మాట తప్పలేదు. ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవాలో ఆ పండితుణ్ణే అడుగుదాము. అని ఆ పండితుని పిలిపించి క్షమించమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏం చేయాలో చెప్పుమన్నాడు.


ఆ పండితుడు "రాజా ! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము. ధాన్యం బదులుగా ఆవును ఇవ్వండి చాలు !" అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.


*సర్వేజనాసుఖినోభవంతు*🙏🙏

సంతత వర్షపాతమై

 *ప్రస్తుత వర్షహేతువు*


ఉ॥

ఎండలఁ దాళలేమి తన యింతి యొసంగిన సూచనంది నా 

కండగ నుండు నంచు ఘను డంబుధి నీరము నాన దృప్తిగా 

మెండుగ శైత్యమై ప్రబల మింటికి మంటికి ధార గట్ట నా 

శుండజలంపుహేల భువి సోకెను సంతత వర్షపాతమై 

*~శ్రీశర్మద*

8333844664

Siva puja


 

అగద తంత్రము

 అగద తంత్రము - విషం , దాని పుట్టుక లక్షణాలు.


 ఈ అగద తంత్రము . ఆయుర్వేదాన్గములలో ఒకటి   అసలు ఆయుర్వేదంగములు 8 . అవి 


 1. శల్య తంత్రము.

 2. శౌలాక్య తంత్రము.

 3. కాయ చికిత్స .

 4. భూత విద్య.

 5. కౌమార భ్రుత్యము.

 6. అగద తంత్రము.

 7. రసాయన తంత్రము.

 8. వాజికరణ తంత్రము.


 ఈ 8 విభాగములు ఆయుర్వేదం లొని భాగాలు  అందులొ ఈ అగద తంత్రము అనునది అనేక రకమయిన విషాలు శరీరం నందు ప్రవేశించి నానా విధములగు బాధలు శరీరమున ఏర్పడినప్పుడు అట్టి భాధలను ఉపశమింప చేసి మరణం కలగకుండా కాపాడుటకు ఉద్దేశింపబడింది . 


       అనేక రకములు అగు పాములు , తేళ్ళు, ఎలుకలు, పిచ్చి కుక్కలు , సాలిళ్ళు , దోమలు మొదలగు జంతువులు విష జంతువులు. ఈ జంతువుల యెక్క బాగాలు అనగా శుక్రము, చొంగ మొదలగు భాగములు కూడా విషం అనియు అవి తీవ్రమయిన వ్యాధులను కలుగజేయు ప్రభావం కలవు అని మన పూర్వీకులు కనుగొన్నారు .


 విషము పుట్టుక  - 


 దేవదానవులు అమృతం కొరకు పాలసముద్రం చిలుకుతున్నప్పుడు అమృతం కంటే విశేష కాంతి కలదియు , నీలవర్ణం అయిన వస్తువోకటి పుట్టి లోకమును నశింప చేయుటకు క్షణక్షణం వ్యాపించచుండగా దానిని చూసి జగత్తు అంతా విషాద భరితం అయ్యెను . అందువలన దానికి విషం అని పేరు వచ్చింది.  అప్పుడు ఆ విషం ఈశ్వరునిచే ఎదుర్కొనబడినది. ఆ తరువాత ఆ విషం తన అసలు రూపం వదిలి కృత్రిమ రూపం ధరించి స్థావర, జంగమ ల యందు ప్రవేశించెను .


 విష భేదములు - 


 స్థావరం, జంగమం అను విషములు రెండు విధములు . ఇవి ఆక్రుతిమములు ( రూపం కలవి )

అందు స్థావరమునకు 10 , జంగమునకు 16 ద్రవ్యములను ఆశ్రయించుకొని ఉండును. అదే విధంగా సవిషయమనియు , సవిశావిషములు అనియు రెండు విధములు . 


            రసాది దాతువుల యందును , ముస్తకాది కందల యందు ఉండు విషములను స్థావర విషములు అనియు, పాము , ఎలుక , తేలు మొదలగు వానియందు ఉండు విషములను జంగమ విషములు అని అందురు. ఇవి విషములు అన్నింటిలోను తీవ్రమైనవి.


 విష లక్షణ గుణములు - 


 విషములు అన్నియు ఆర్చుట, ఉష్ణం , తీక్షణం , చిక్కదనం లేకుండా ఉండుట, ముందు శరీరం అంతా వ్యాపించి తరువాత జీర్ణం అగుట , శీగ్రంగా చంపుట, అలగే శరీరం నుండి పోవుచూ శరీర బంధాలును ( బాగాలు ) శిధిలం చేయుట , సూక్ష్మ నాళాల యందు కూడా ప్రవేశించుట, జట రాగ్ని వలన కూడా జీర్ణం కాకుండా ఉండుట, దోష ధాతువులను క్షీనింప చేయుట , సూక్ష్మ తత్వం వలన శరీరం యందు అవయవాల నందు ప్రవేశించి వికారం కలగచేయును .


 విష ప్రభావం - 


 విషములు యందు గుణములు తీక్షనములు . అందువలన అవి త్రిదోషములను ప్రకొపిమ్పచేయును . అట్లు విషము చే ప్రకోపించబడిన త్రిదోషములు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించ లేకపోవును. అందువలన విషము పిత్తము వలన జీర్ణం కాలేకపోవడం వలన ప్రాణం బంధించును. విషంతో కూడిన శ్లేష్మం చే పోవు త్రోవ మార్గము శ్లేష్మంచే నిరోదింప బడటం ములాన ఉచ్చ్వాసం బంధింపబడును. అందువల్ల ప్రాణం ఉన్నప్పటికి లేని వాడివలే సంజ్ఞా రహితుడై పడి ఉండును.


          విషం మొదట శరీరం నందు ప్రవేశించి మొదట రక్తమును, తరవాత కఫమును, పిత్తమును,వాతమును వాటి పనులను చెడగొట్టి చివరికి హృదయం నందు ప్రవేశించి ప్రాణాలు హరించును.


 స్థావర విషం యుండు స్థానములు - 


 వేరు , ఆకు , పండు, పువ్వు పట్ట, పాలు, చేప బంక, దాతువులు, దుంప ఈ పది స్థానములు విషం నిలువ ఉండు స్థానములు . అలాగే శుశ్రుతం నందు అశ్హ కూర , గుంజ, సుగంద, నల్ల యష్టిమధుకం , గన్నేరు , గురువింద, ఈశ్వరి, పోత్తిదుంప, గంజాయి మొక్కల వేర్లు విషపురితమైనవి .


    నేపాళ గింజ మద్య ఉండు సన్నని ఆకు , చేదు అనప, పాల టేకు, ప్రెంకనమ్ , అందుగ, మొక్కల యెక్క ఆకులు విషం కలవి.


     ఈ విధంగా స్థావర విషాలు 55 రకాలుగా ఉంటాయి అని శుశ్రుతుడు తన గ్రంధంలో వివరించాడు.


 ధాతు విషాలు - 


 పాదరసం, తాలకం , తామ్రము , సత్తు, సీసము , తగరము, అంజనము, మణిశిల, పాషానములు , మణులు ఇవి ధాతు విషములు .


 కంద విషాలు - 


 సక్తుకము, ముస్తకము, కూర్మము , నార్వికము, సర్షపము , ఫైకథమ్ , వత్స నాదము,శ్వేత శృంగి, కాలకుటము , మేష శృంగి, ధర్దుకము, హాలాహలము, కర్మాట ము గ్రంది. , హరిధ్రకము, రక్త శృంగి, కీసరము, యమధంష్ట్రా అనునవి 18 కంద విషములు 


        పైన చెప్పిన 18 విధములు అగు కంద విషములు ప్రాణాంత కములు. మొదటి 8 ఔషధాల యందు , మిగిలిన 10 రసవాదం ( బంగారం తయారు చేయు విద్య.) యందు ఉపయోగిస్తారు.


 స్థావర విషం లక్షణాలు - 


 స్థావర విషం జ్వరము, ఎక్కిళ్ళు, దంత హర్షము, మింగుడు పడకుండా ఉండుట, మరపు వచ్చుట, వమనం ( వాంతి ) , అరుచి,  శ్వాస, మూర్ఛ వీటిని కలుగచేయును .


 మూల విషం లక్షణాలు. - 


 మూల విషం భక్షణ వలన చుట్టుకొని పొవుట, ప్రలాపం, మొహం కలుగును. పత్ర విషం 

( ఆకు లొని ) విషం వలన ఆవులింతలు, శరీరం చుట్టుకొని పొవుట, శ్వాస లొ ఇబ్బంది కలుగును.

ఫల విషం వలన వృషణాల వాపు , దాహం , అన్నా ద్వేషం కలుగును. పుష్ప విషం వలన వాంతి , మూర్ఛ కలుగును. పట్టచేప జిగురు విషము వలన నోటి వాసన, జిహ్వాకాటిన్యం , తలనొప్పి, సొల్లు కారుట, కలుగును. క్షార విషం వలన నోట నురుగ వచ్చుట, విరేచనం , నాలుక బరువు ఎక్కుట కలుగును. ధాతు విషం వలన గుండె యందు పీకుడు , మూర్ఛ కలుగును. సాధారణంగా ఈ విషములు అన్నియు తినిన కొంతకాలం తరువాత ప్రాణములు హరించును.


 స్థావర విషం లక్షణములు -


 స్థావర విషం తిన్న వానికి మొదటి వేగమున నాలుక నల్లగా మారి మోద్దుబారుతుంది. మూర్ఛ , శ్వాస, వాంతి కలుగును. రెండొ వేగమున వణుకు, తాపము, కం టం నందు భాద కలుగును, మూడో వేగమున గుండె యందలి భాద మొదలగును. ఆమాశయం నందు శుల మొదలై కన్నులు రంగు మారి పచ్చబడి వాచుట కలుగును. నాలుగో వేగమున పక్వాశయం నందు పోటు , ఎక్కిళ్లు , దగ్గు తలబరువు కలిగించును. అయిదో వేగమున కఫం కారుట, కళ్ళు పోటు, ఆరో వేగమున తెలివి నశించి విరేచనం ఎక్కువ అగును. ఏడో వేగమున మెడ, వీపు, నడుములు నిలవకపోవుట ఆతరువాత ప్రాణం పొవుట సంభవించును .


  మాటలు సరిగ్గా రానివారికి మాటలు తెప్పించే  రహస్య యోగం  -


వసకొమ్ముని దంచి చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని ఒక పాత్రలో పోసి ఆ చూర్ణం నిండేవరకు ఉసిరికాయలు రసం పొసి బాగా కలిపి ఒక రాత్రి నానబెట్టి తరువాత ఎండబెట్టి బాగా ఎండబెట్టి బాగా ఎండిన తరువాత మళ్ళి దంచి మెత్తగా తయారుచేసుకుని ఆ చూర్ణాన్ని రోజూ పూటకు మూడు గ్రాముల మోతాదుగా ఒక చెంచా తేనె కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే మాటలు తడబడే వారికి , మాటలు ముద్దగా పలికేవారికి , మాటలు ఆగిఆగి మాట్లాడేవారికి ఆ సమస్యలు తొలగి స్వచ్చముగా మాటలు వస్తాయి.

 

     లేత మర్రి ఊడలు సాన పైన అరగదీసి ఆ గంధమును నాలిక పైన రాయుచున్నను మాటలు త్వరగా వచ్చును . 


 

   మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


 ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

        9885030034                     


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


   కాళహస్తి వేంకటేశ్వరరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

దైవశక్తి తిరుగులేనిది!

 శుభోదయం🙏


దైవశక్తి తిరుగులేనిది!


"గురుడు గురుండు;వాలు శతకోటి సుపర్వులు వాహినీపతుల్;

సురభవనంబుకోట;మధుసూదనుడుంసైదోడు;దంతి ది

క్కరపతి;గాగేనోడడె?సురేంద్రుడు దాయలచేత నాజిలో,

శరణముదైవమే!పురుషశక్తి నిరర్థక మెన్ని భంగులన్; "-

భర్తృహరి సుభాషితములు-దైవపధ్ధతి;


        ఎంతమొనగాడైనా ఎంతసాధన సంపత్తి కలిగినాదైవబలం లేకుంటేఅవన్నీ వ్యర్థమే!

       దేవేంద్రుడెంతగొప్పవాడు.త్రిలోకాధిపతి. ఆయనకు గురువు (సలహాదారు.మంత్రాంగం నిర్వహించేవాడు) బృహస్పతి. గురుగ్రహం ఉచ్చలో ఉంటే ఇంకఆతనికితిరుగులేదని జాతకశాస్త్రం ప్రవచిస్తోంది.గురుశనులఆధారంగానే ఆయుర్దాయాదులనిర్ణయం.అలాంటిప్రాముఖ్యంగల గురువే దేవేంద్రునకు గురువు.

            

 వాలు-ఆయుధం శతకోటి నూరంచులు కలది .తిరుగులేనిది.

        సేనానులా అమృతపానంచేసినదేవతలు.

         దేవతలనివాసం ఆకాశంలో నిర్మించినకోట.

మధుసూదనుడు, విష్ణువు సోదరుడు సహాయకుడు. పట్టపుటేనుగా ఐరావతం దిగ్గజం.

      ఇన్ని సాధనాలున్నా దేవేంద్రుడు రాక్షసులచేతిలో ఓడిపోవటంచూశాం.ఏమిటికారణం?దైవబలంలేకపోవటమే! కనుక దైవమేశరణు! తక్కినవి నిరర్థికములు.

[26/07, 5:51 am] Ch. Satyanarayana: 🙏👌👌👌🙏🙏🙏💐💐💐🌷💐🌷🌷🌷💐🌷🌾🌷

శ్రీ పాండునాథ్ ఆలయo

 🕉 మన గుడి : 





⚜ అస్సాం : పాండు


⚜ శ్రీ పాండునాథ్ ఆలయo



💠 ఒక్కపటి పాండు నగరి, గౌహతి దగ్గర పాండు సబర్బన్ పట్టణానికి పాండు రాజు ( పాండవుల తండ్రి) పేరు పెట్టారు. 

పట్టణంలోని తిలా హిల్స్‌లో పాండు (పాండునాథ్ ఆలయం) ఆలయం ఉంది.


💠 ఐదుగురు పాండవులను సూచించే ఐదు గణేశ విగ్రహాలు ఇక్కడ కనిపిస్తాయి - 

వారి వనవాస సమయంలో, పాండవులు 5 వినాయకుడి విగ్రహాలు స్థాపించారు అని  నమ్ముతారు. 

ఈ ప్రదేశంలో అనేక ఇతర విగ్రహాలు కూడా ఉన్నాయి.


💠 ఇది తిలా అనే కొండపై ఉంది. 

ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, పాండవులు అజ్ఞాతవాసం చేసిన కాలంలో, వారు గణేశుని దర్శనంలో చాలా కాలం పాటు ఇక్కడ నివసించారు. 

ఐదుగురు పాండవుల సోదరులను వర్ణించే ఐదు వినాయకుడి చిత్రాలను మీరు అక్కడ చూడవచ్చు. 

అలాగే, చారిత్రక ప్రాముఖ్యతతో పాటు, సందర్శకులు బ్రహ్మపుత్ర నది వద్ద సూర్యాస్తమయం యొక్క హృదయాన్ని కదిలించే దృశ్యాలను కూడా సంగ్రహించవచ్చు.


💠 విష్ణువు మధు, కైటభ అనే రాక్షసులను సంహరించిన ప్రదేశం ఇది. 

తల్లి కామాఖ్యను పూజించే ముందు ఇక్కడ పాండునాథుని పూజించాలి అంటారు


💠 బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న పాండునాథ్ ఆలయం నుండి పాండు అనే పేరు వచ్చింది అని కూడా నమ్ముతారు.


💠 1586లో రఘుదేవ్ నారాయణ్, కచ్ రాజు పాండునాథ్ ఆలయాన్ని పునర్నిర్మించాడు. అహోం రాజు గౌరీనాథ్ సింఘా1785 లో దేవాలయం కోసం భూమిని విరాళంగా ఇచ్చాడు, 

 

💠 పాండవులు బ్రహ్మపుత్ర నదిలోని బ్రహ్మకుండలో పవిత్ర స్నానాలు చేసి నీలాచల్ కొండను అధిరోహించారని ప్రజలు నమ్ముతారు. స్వర్గానికి వారి అంతిమ యాత్రకు ముందు కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకున్నారు అని ఇక్కడ నమ్మకం.

26-07-2023) రాశి ఫలితాలు*

 *నేటి (26-07-2023) రాశి ఫలితాలు*


మేషం


 26-07-2023



సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.  పాత  మిత్రులు నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు  పొందుతారు.  ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి.



---------------------------------------


వృషభం


 26-07-2023



ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు తగిన  ఫలితం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్ధిరాస్తి వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉత్తమ  ఫలితాలు పొందుతారు.  విద్యార్థుల  ఫలితాలు  సంతృప్తి కలిగిస్తాయి.



---------------------------------------


మిధునం


 26-07-2023



కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు.  సన్నిహితులతో  మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.   వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున  అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. 



---------------------------------------


కర్కాటకం


 26-07-2023



దీర్ఘకాలిక  రుణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది.  దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో  కలహా సూచనలున్నవి.  దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.  వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.



---------------------------------------


సింహం


 26-07-2023



గృహమున వివాహ శుభకార్యాలు  నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం  ఉంటుంది. చేపట్టిన  వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.  విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు.   ఉద్యోగస్తులకు  ఆశించిన స్థాన చలనాల కలుగుతాయి.



---------------------------------------


కన్య


 26-07-2023



ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.  సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. చేపట్టిన పనులు శ్రమతో   కాని  పూర్తికావు. ముఖ్యమైన  వ్యవహారాలలో నమ్మినవారే మోసగిస్తారు. వ్యాపారమున అలోచించి నిర్ణయాలు  తీసుకోవాలి.



---------------------------------------


తుల


 26-07-2023



సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన విషయాలలో  కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  ఉద్యోగ విషయంలో జాప్యం కలిగిన   అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాలి.



---------------------------------------


వృశ్చికం


 26-07-2023



దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. జీవితభాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఉద్యోగ వాతావరణం  అనుకూలంగా ఉంటుంది.  నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.  స్ధిరాస్తి  కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి.



---------------------------------------


ధనస్సు


 26-07-2023



వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. భూ సంబంధిత  క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు పెరుగుతాయి.   ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.



---------------------------------------


మకరం


 26-07-2023



బంధు మిత్రులతో మాటపట్టింపులు  కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవర పెడతాయి. చేపట్టిన పనులలో నిదానంగా ముందుకు సాగడం  వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు  బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.



---------------------------------------


కుంభం


 26-07-2023



ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది.  వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన  పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో ఇబ్బందులు తప్పు.  నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.



---------------------------------------


మీనం


 26-07-2023



ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తికావు.  దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఇంటా బయట వివాదాలు కలుగుతాయి.  ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి.  నిరుద్యోగ  ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

---------------------------------------

నియమమేమీ లేదు*...

 .                       🕉️


           *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_*


                _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*న వ్యాప్తిరేషా గుణినో గుణవాన్ జాయతే ధ్రువమ్౹*

*చన్దనోఽనలసన్దగ్ధో న భస్మ సురభిః క్వచిత్॥*

                 _దృష్టాన్తకలికాశతకమ్


తా𝕝𝕝 

చందనం సువాసనా భరితమైనప్పటికి, అది అగ్నిచేత కాల్చబడినప్పుడు దాని భస్మానికి ఆ సువాసన ఎట్లైతే ఉండదో, అలానే *గుణవంతునికి గుణవంతులైన సంతానమే కలుగుతారనే నియమమేమీ లేదు*.....

పులస్త్య బ్రహ్మ చరిత్ర

 *నిత్యాన్వేషణ:*


పులస్త్య బ్రహ్మ చరిత్ర వివరించగలరా?


విష్ణుమూర్తి నాభికమలము నుంచి ఉద్భవించిన బ్రహ్మ దేవుడు సృష్టి కార్యం చేయటానికి తన శరీరము నుంచి కొంతమందిని సృష్టించాడు. వారినే "బ్రహ్మ మానస పుత్రులు" అంటారు. అలాంటి మానస పుత్రులలో పులస్త్యుడు ఒకరు. ఈయన బ్రహ్మదేవుడి కుడి చెవి నుంచి జన్మించారు. తన తండ్రి చెప్పిన విధంగానే పుట్టిన దగ్గర నుంచి నారాయణుడి మీద మక్కువతో నిరంతరం తపస్సులో మునిగి ఉండేవాడు.

పులస్త్యుడి భార్య పేరు హవిర్భువ, ఈమె కర్దమ ప్రజాపతి కూతురు. వీరి అనురాగానికి ప్రతిరూపంగా వీరికి "అగస్త్య మహర్షి" పుడతారు. పెద్ద కుమారుడు అగస్త్యుడు కూడా గొప్ప మహర్షి. అగస్త్యుడు పుట్టాక పులస్త్యుడు తృణబిందు ఆశ్రమానికి వెళ్లి తపస్సులో లీనమైపోతాడు. ఆ ఆశ్రమంలోకి ఒకరోజు ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఆనందంతో కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉంటారు. తన తపస్సుని భగ్నం కలిగించటానికే వారిద్దరూ అక్కడికి వచ్చారని అనుకొన్న పులస్త్యుడు ఇక ముందు "తన ఆశ్రమం వైపు వచ్చిన అమ్మాయిలు గర్భవతులు అవుతారని" శపిస్తాడు. ఆ శాపం విన్న ఇద్దరు అమ్మాయిలు అక్కడనుంచి పారిపోతారు.

ఈ శాపం గురించి తెలియని తృణబిందు రాజర్షి అనే రాజు కుమార్తె అయిన "ఇద్విద" ఆ ఆశ్రమ సమీపానికి వచ్చి గర్భవతి అవుతుంది. ఏడుస్తూ తండ్రి దగ్గరకి వెళ్లి విషయాన్ని చెపుతుంది. విషయం తెలుసుకున్న మహారాజు పులస్త్యుడి దగ్గరకి వచ్చి తన కూతురిని పెళ్లి చేసుకోమని అభ్యర్దిస్తాడు. అతని మాటను గౌరవిస్తూ పులస్త్యుడు ఇద్విదను పెళ్లి చేసుకుంటాడు. ఆమె కూడా ఆశ్రమంలోనే ఉంటూ మహర్షికి సేవ చేస్తూ ఉండేది. వారికి "విశ్రవసు" అనే కుమారుడు పుడతాడు. ఈ విశ్రవసువే రాక్షసులనందరినీ పుట్టించాడని అంటారు. ఇతని కొడుకులే రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, శూర్పణక మరియు కుబేరుడు. (Note: ఇది సరికాదు. విశ్రవసువుకు ఇద్దరు భార్యలు, మొదటి భార్య ఇలావద, విశ్రవసువు ఇలావదకు జన్మించినవాడు కుబేరుడు ఇతడు యక్షుడు, ఉత్తరదిక్కుకు అధిపతి. వీరి సంతానము: నలకూబర, మణిభద్ర, మయూరాజ, మీనాక్షి, ఇతని నివాసం మొదట లంకానగరము, తరువాత అలకాపురి. విశ్రవసువు రెండవ భార్య కైకేయి రాక్షస కన్య వారి సంతానమే రావణుడు, విభూషణడు, కుంభకర్ణుడు, శూర్పణక) ఈ విధంగా చూస్తే పులస్త్యుడు రావణాసురునికి తాతగారు అవుతారన్న మాట.

ఒకసారి పరాశరుడు రాక్షసుల మీద కోపంతో సత్రయాగం చేస్తున్న సమయంలో అగస్త్యుడు వచ్చి ఆ యాగాన్ని ఆపమని ఆదేశిస్తాడు. అపుడు పరాశరుడు వెంటనే ఆ సత్రయాగాన్ని ఆపుతాడు. ఇది చూసిన పులస్త్యుడు పరాశరుడు అంత కోపంలో ఉండి కూడా యాగాన్ని వెంటనే ఆపినందుకు ఆనందించి వరం కోరుకోమని అంటాడు. దానికి పరాశరుడు తన మనస్సు ఎల్లప్పుడూ వేదపురాణాల మీద ఉండాలని, తను వేదశాస్త్రాల్లో గొప్ప ప్రతిభ కలిగి ఉండాలని కోరుకుంటాడు. దానికి తథాస్తు అంటాడు పులస్త్యుడు.


అలాగే భీష్ముడు ఒకసారి గంగా నదీ తీరంలో పితృకర్మలు చేస్తూ ఉండగా పులస్త్యుడు అక్కడికి వస్తాడు. భీష్ముడు అతనిని భక్తితో పూజిస్తాడు. దానికి సంతసించిన పులస్త్యుడు ఏమైనా సందేహాలుంటే అడగమని అంటాడు. దానికి భీష్ముడు తీర్థయాత్రల వల్ల కలిగే ఫలితాలని చెప్పమని కోరుతాడు. దానికి సమాదానంగా పులస్త్యుడు భీష్మా! గర్వం, కోపం, ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండటం, తక్కువగా తినటం, నిజాలనే మాట్లాడటం, ఎప్పుడూ సంతోషంగా ఉండటం, మంచి పనులనే చేయటం, ఇలాంటివన్నీ చేసేవారు ఎటువంటి తీర్థయాత్రలు చేయకపోయినా దానికి మించిన ఫలితం లభిస్తుందని చెప్తాడు.

బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుడు జీవించినంత కాలం వేదనిష్టా పరాయణుడై, ఎల్లప్పుడూ నారాయణుని స్మరిస్తూ చివరికి అతనిలోనే ఐక్యమైపోతాడు. ఇదండీ పులస్త్య బ్రహ్మ చరిత్ర.

శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం :28/150 


వైష్ణవః ప్రణవీ తాళీ 

ఖేలీ కాలకటంకటః I  

నక్షత్రవిగ్రహమతి 

ర్గుణబుద్ధిర్లయోఽగమః ॥ 28 ॥  


* వైష్ణవః = విష్ణుశక్తిని కలిగినవాడు, 

* ప్రణవీ = మిక్కిలి వేగము కలవాడు, 

* తాళీ =(తాళము) సంగీత శాస్త్రమునందలి లయజ్ఞానము కలవాడు, 

* ఖేలీ = మిక్కిలిగా నటించువాడు, 

* కాలకటంకటః = యముని నియంత్రించువాడు, 

* నక్షత్రవిగ్రహమతిః = నక్షత్రముల, గ్రహముల యొక్క జ్ఞానం కలవాడు, 

* గుణబుద్ధిః = మంచిగుణములతో నిర్ణయించువాడు, 

* లయః = తానే ప్రళయరూపమై ఉన్నవాడు, 

* అగమః = తేలికగా పొందుటకు వీలులేనివాడు.


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

25, జులై 2023, మంగళవారం

యదార్థ సంఘటన.

 ఒక రోజు ఒక ముస్లిం తన భార్య మరియు ఎనిమిది మంది పిల్లలతో గ్రామపెద్ద వద్దకు వచ్చి గ్రామంలో నివసించడానికి వేడుకున్నారు.

 రాత్రి నిద్రలేచిన గ్రామాన్ని సంరక్షిస్తున్న వాచ్‌మెన్‌ వాళ్లను ఇక్కడ ఉండనివ్వకండి అని ఎంత వారించినా ఎవరూ వినకపోవడంతో ముస్లిం కుటుంబాన్ని గ్రామంలో ఉండేందుకు అనుమతించారు.

 రోజులు గడిచాయి, ముస్లింల ఎనిమిది మంది పిల్లలు పెద్దవారయ్యారు,ముస్లింలు సర్పంచ్ వద్దకు వెళ్లి, పిల్లలకు పెళ్లిళ్లు కాబోతున్నాయని, నాకు ఒకే ఇల్లు ఉందని ఇల్లులు కట్టుకోవడానికి కొంత భూమిని ఇవ్వమని వేడుకున్నారు, గ్రామస్థులు ఆ ముస్లిం కుటుంబాలకు బంజరు భూమిని ఇచ్చారు, ఇక అక్కడ అందరూ ఇల్లు కట్టుకున్నారు.

 కొంతకాలం తర్వాత, ఆ ఎనిమిది మందికి పెళ్లిళ్లు అయ్యాయి 74 మంది పిల్లలు పుట్టారు మరియు దాదాపు 30 సంవత్సరాలలో, ఆ గ్రామంలో ముస్లింల జనాభా 40% అయింది.

 ఇప్పుడు ముస్లిం అబ్బాయిలు వారి అలవాటు ప్రకారం హిందువులతో గొడవలు పెట్టుకోవడం మొదలుపెట్టారు మరియు హిందూ మహిళలను మరియు సోదరి కుమార్తెలను వేధించడం ప్రారంభించారు. క్రమంగా, ప్రతి హిందువు తన కుటుంబంతో స్వచ్ఛందంగా గ్రామాన్ని విడిచిపెట్టడం ప్రారంభించారు.

 ఒక రోజు గ్రామంలోని ప్రధాన దేవాలయాన్ని ముస్లింలు పడగొట్టారు మరియు వారు దానిపై మసీదు నిర్మించడం ప్రారంభించారు, అప్పుడు మిగిలిన హిందువులు వారిని ఆపడానికి ప్రయత్నించారు అప్పుడు ముస్లింలు అల్లా పనిని ఎవరు అడ్డుకుంటే, వారిని నరికివేయండి అని అన్నారు.

 మిగిలిన హిందువులు, ఎదురు మాట్లాడకుండా గ్రామాన్ని విడిచి పెట్టి వెళ్లిపోతు మేము మీ మాట వినలేదని ముస్లీమ్ లను నమ్మినము అని దాని కారణంగా మేము ఈ రోజు గ్రామాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది అని దారిలో ఉన్న వాచ్‌మెన్‌తో చెప్పారు.

 ఆ గ్రామం పేరు *పంచవటి* కాని ప్రస్తుతం *రహీమాబాద్‌గా* మార్చబడింది. ఈ గ్రామం మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఉంది.

 *గమనిక - ఇది కథ కాదు, యదార్థ సంఘటన.*


హిందువులు కు జ్ఞానోదయం కలగాలని కోరుకుందాం సార్


ప్రతి హిందువు మన ధర్మ రక్షణ కోసం మన హిందువుల దగ్గర కొనడం అలవర్చుకొండి


ఆటో, హాస్పిటల్, మాంసపు కొట్టు, కిరాణం,డాక్టర్స్,మెకానిక్స్,మొదలైనవి మన హిందువుల దగ్గర కొనడం ప్రయత్న పూర్వకంగా అలవాటు చేసుకోండి.


80 శాతం ఉన్న మనల్ని చూసి ఇతరులు భయపడేది అటుంచి,మనల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

రాజకీయనాయకుల ను నమ్ముకొకండి వారు ఓట్లకోసం ఎవరిని దూరం చేసుకోరు

మన దర్మం కోసం పాటుపడే నాయకులను ఎన్నుకోండి.


మన ధర్మం రక్షింప బడాలని రోజుకు ఒకసారి దేవుణ్ణి ప్రార్థించండి


హిందువుల ఐక్యత వర్ధిల్లాలి

*సమస్త హిందూ జన సుఖినోభవంతు*

భారత్ మాతాకు జై.

ప్రణతి శ్రీకాళహస్తీశ్వరా ! మహేశ !

 ఏ వేదముల్ నేర్చె నెంచగా సాలీడు ?

          సర్పమే శాస్త్రముల్ చదువు కొనియె ?

హస్తి యే పాఠమ్ము లభ్యాస మొనరించె ?

         తిన్నడే మంత్రమ్ము తీర్చె మదిని ?

జగతీ తలమ్మునన్ జ్ఞానోదయ ప్రాప్తి 

          సమకూరునా ! డొల్ల చదువు కతన ? 

కాదయ్య పరమేశ ! కాదు కాదెప్పుడు

          చేరు నయ్యది నీదు సేవ చేత

నిరత సoసేవనా సక్తి నిల్ప మదిని

కల్గు జ్ఞానమ్ము జీవికి గరళకంఠ !

అన్యమున కూడ దెప్పుడీ యవనియందు 

ప్రణతి శ్రీకాళహస్తీశ్వరా ! మహేశ !          


గోపాలుని మధుసూదన రావు 🙏