ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
2, ఆగస్టు 2023, బుధవారం
ధనతృష్ణ, దుఃఖ విముక్తి.*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*ధనతృష్ణ, దుఃఖ విముక్తి.*
➖➖➖✍️
*ఒకసారి ధర్మరాజు భీష్ముని… “పితామహా! ధనతృష్ణతో కొట్టుకులాడే జీవి ఎప్పుడు సుఖాన్ని పొందగలడు?” అని అడిగాడు.*
*భీష్ముడు… “ధర్మజా ధనము సంపాదించి,సంపాదించి విసుగుపుట్టి ధనం సంపాదించడం మానుకున్నప్పుడే మానవుడికి సుఖం కలుగుతుంది. ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను… ”ఒక ఊరిలో మంకి అనే బ్రాహ్మణుడు ఉండే వాడు. అతడికి ధనాపేక్ష అధికం. అందు వలన అతడు రెండు కోడెదూడలను కొని వాటిని తాళ్ళతో బంధించాడు. ఒక రోజు అవి తాళ్ళతో కలిసి పారిపోయాయి. *
*అవి పడుకుని ఉన్న ఒంటెను దాటబోయే సమయానికి అది పైకిలేచి నిలబడిన కారణంగా కోడెదూడలు వాటిమెడకు కట్టిన తాళ్ళకారణంగా దూడలు చనిపోయి ఒంటె మెడకు రెండు వైపులా వేలాడసాగాయి.*
*అది చూసిన బ్రాహ్మణుడు హడలిపోయి తాను ప్రేమగా పెంచుకున్న దూడలు చనిపోవడం చూసి అక్కడ చేరిన జనులతో… "అయ్యలారా ! నేను నా ప్రతిభతో ధనం సంప్రదించాలి అనుకున్నాను. అది సాధ్యంకాదని తేలి పోయింది.*
*మానవుని ఉన్నతికి దైవానుగ్రహం ఉండాలికాని మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా అవివ్యర్ధమేకదా ! కనుక దైవం మీద భారంవేసి మన ప్రయత్నాలు చేయాలి. కోరికవదలకుంటే సుఖం ఉండదు.*
*కోరికలకు మూలం మనస్సంకల్పం. మనస్సులో సంకల్పం లేకుండా ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. కోరికలు లేకున్న ధనంతో పని లేదు. కనుక ధనాపేక్ష లేని వాడు ప్రశాంత మనస్కుడై ఉంటాడు. ధనం సంపాదించే కొలదీ తృష్ణ పెరుగుతుంది, దానిని దాచాలన్న తాపత్రయం కలుగుతుంది.*
*కనుక అంతు లేని కోరికలను వదిలిన శాశ్వత ప్రశాంతత పొందాలి. నేను ధన సంపాదనాపేక్షతో తెచ్చిన దూడలు చనిపోగానే నా లోని ధనాపేక్ష తగ్గింది.*
*నాలో ధనతృష్ణ తగ్గింది, ఇంద్రియ నిగ్రహం కలిగింది, నాలో సహనం కలిగింది, ఇక నాకు లోభం అంటదని సమాధానపడి శేషజీవితం ప్రశాంతంగా గడుపుతాను.” అన్నాడు.*
*దుఃఖ విముక్తి:-*
*ధర్మరాజు… “పితామహా ! మానవుడు దేనిని ఆచరించిన సమస్త దుఃఖములనుండి విముక్తి పొందగలడు?” అని అడిగాడు.*
*భీష్ముడు… “ధర్మనందనా ! నేను నీకు అజగర కథచెప్తాను... ‘పూర్వము ప్రహ్లాదుడు ఒక బ్రాహ్మణుడిని చూసి తనకు శమము గురించి చెప్పమని అడిగాడు.*
*అందుకు ఆ బ్రాహ్మణుడు… "మహారాజా ! ఈ చరాచర జగత్తులో అనుదినము ఏ నిమిత్తము లేకుండా ఎన్నో ప్రాణులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. అందులో మానవులూ ఉన్నారు. ఏ ప్రాణి శాశ్వతం కాదు.*
*ప్రాణం శాశ్వతం కాదని తెలిసీ, మానవులు మరణానికి కలత చెందుతారు. నదులకు వరదలు వచ్చినప్పుడు ఎన్నో దుంగలు కొట్టుకు వస్తాయి. అవి ఒక్కొక్కసారి కలుస్తూ తిరిగి కొంతదూరం పోయి విడిపోతాయి.*
*ఈ సృష్టిలో భార్యాభర్తలు బంధుమిత్రులు అలాగే కలుస్తూ విడిపోతుంటారు. ఈ సత్యం తెలిసిన వాడు సుఖదుఃఖాలకు అతీతుడు అయి శాశ్వత ఆనందం పొందగలడు. నేను సుఖదుఃఖాలకు అతీతుడను కనుక నన్ను అడిగి నీ సందేహాలు తీర్చుకుంటున్నావు. నేను, నాకు మేలు జరగాలని ఎన్నడూ కోరను.*
*దుఃఖం వచ్చిన కలత పడక దానిని పోగొట్టడానికి ప్రయత్నిస్తుంటాను. నేను ఆహారంలో రుచికి ప్రాధాన్యత ఇవ్వక ఏది దొరికినా తింటాను. మృదువైన శయ్యమీద, కటిక నేలమీద సమభావంతో నిద్రించగలను. పట్టువస్త్రాలు, నారచీరలు ఏవైనా ధరించగలను. ఎదీ నాకుగాకోరను.*
*లభించినది ఏదైనా తృప్తి చెందగలను. అజగరవ్రతం స్వీకరించి నన్ను వెదుకుతూ వచ్చినది మాత్రం స్వీకరించి ప్రశాంత చిత్తతతో ఉంటాను. తృప్తి, శుభ్రత, ఓర్పు, అంతటా సమభావం, అంతర్దృష్టి ఇదే అజగరవ్రతం . ఇది యజ్ఞయాగాదుల వలన లభించదు. ఆత్మజ్ఞానం వలననే ఇది లభించ గలదు.*
*అజగరవ్రతం ఆచరించే వారికి పాపము అంటదు, భయము ఉండదు, శోకము చేరదు, మోక్షము అతడికి దగ్గరగా ఉంటుంది" అని ప్రహ్లాదుడికి బ్రాహ్మణుడు చెప్పాడు.*
*మనుషులు తరించడానికి కృత యుగంలో ధ్యానం తపస్సులు, త్రేతా యుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపరంలో పూజా పరిచర్యలు, కలిలో హరినామ సంకీర్తనములైనట్లే, శిష్టులను ఉద్దరించి దుష్టులను ఉత్తరించుటకు కృత , త్రేత, ద్వాపర యుగాలలో ఆ జగన్నాథుడు అవతారములు ధరించాడు, మరి కలియుగం మాటేమిటి ?*
*కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం నేను రాను గాక రానని ఆ దేవదేవుడు తెగేసి చెప్పటమే గాక , తాను చేయాల్సిన పనిని ప్రకృతియే తన వికల్ప ములచే పూర్తి చేస్తుందని సెలవిచ్చాడు. *✍️
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
ఆచార్య సద్బోధన:*
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*మనిషికి ఆ మనిషిలో ఏమి చూసి విలువ ఇస్తారు?*
```మనిషి "రంగూ,రూపూ" చూసి మాత్రం "విలువ" ఇవ్వరు!
కేవలం బాగున్నారు అన్న "ప్రశంస" దక్కుతుంది.
అంగబలం,ఆర్ధికబలం ఉన్నా ఇవ్వరు.
వీడితో ఎప్పుడైనా అవసరం ఉంటుందేమో అని "అణుకువ" నటిస్తారు.అంతవరకే!
పదవి,పలుకుబడి,చూసినా అవి ఉన్నన్ని రోజులూ చుట్టూ తిరుగుతారు. "విలువ" ఇవ్వటానికి కాదు వాడుకుందామని.
పదవి పోయిన పూటకే వెనుతిరిగి చూస్తే ఒక్కడూ ఉండడు.ఇది నిజం!
కొంతమంది కబుర్లు చెప్పి "కడుపు" నింపినంత గొప్పగా చెబుతారు.
కాసేపు కబుర్లు "ఎంజాయ్" చేస్తారు కాని "విలువ" మాత్రం ఇవ్వరు.
మనిషి "విలువ" పొందాలంటే ఉండవలసినవి
కరుణ,దయ,ప్రేమ,జాలి,సేవాభావం,సాయపడాలనే తపన,మంచిమనసు,
తెగింపు,విశాలహృదయం ఉండాలి.
పై లక్షణాలు మనకు ఉంటే "విలువ"
మనం పిలవకుండానే మన దగ్గరకు వస్తుంది!✍️```
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
పరమపదం
*పరమపదం*
*’శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు!' అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే. సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం.*
*శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం.*
*అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు.*
*శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే…*
*శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని పూజించే చేతులే చేతులు. శివుని సదా స్మరించేవాడే ధన్యుడు..*
*పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు- 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు.*
*అదే 'శివసిద్ధి'.*
*అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు.*
*పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.*
*శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు.*
*జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివ సాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం.*
🙏ఓం నమః శివాయ 🙏
🔥శివాయ గురవే నమః 🔥
🔱సర్వం శివమయం 🔱
Wedding
*అబ్బురపరచే మణిపూర్‌లోని మైతీ హిందువుల వివాహ వేడుక.*
అష్టాంగ యోగము
అష్టాంగ యోగము అనగా... యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి
యమములు అనగా 5.. అహింస , సత్యం, అస్తేయం , బ్రహ్మచర్యం, అపరిగ్రహం
నియమములు 5... శౌచం, సంతోషం , తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం
ఆసనం... శరీర మాలిన్యం పోవడానికి
ప్రాణాయామం... శ్వాస మాలిన్యం పోవడానికి
యమ నియమ ప్రత్యాహార లు.. నడవడి సరి చేసుకొనుటకు
ధారణ , ధ్యాన , సమాధి... మనో మాలిన్యం పోవటానికి
ప్రత్యహార అనగా... ఇంద్రియాలు నుండి మనసుని ఉపసంహరించు కోవడం
అస్తేయం అనగా...దొంగతనం చెయ్యాలనే బుద్ధి లేకుండుట.
అపరిగ్రహం.. ఇతరుల నుండి ఉచితంగా పొందటం
ఈశ్వర ప్రణిధానం...శరణాగతి
తస్మాత్ జాగ్రత్త
*🙏🌹ఆటో మోసాలు తెలుసుకొని జాగ్రత్త తీసుకోండి.మోడీ గారి డిజిటల్ ఇండియా నినాదం గుర్తు చేసుకోండి.👉 ఆటో బుక్ చేసినాక ఆటో వాడు మనకి ఫోన్ చేసి ఫోన్ పే వద్దు, క్యాష్ ఇస్తే వస్తా అంటాడు. ఆ హడావుడిలో సరే అంటాము. ఆటోలో కూర్చున్నాక OTP చెప్పమని అంటావా అని అడిగితే బుకింగ్ కేన్సిల్ చెయ్యండి అంటాడు. ఎందుకు అంటే బుక్ చేస్తే నాకు ఇంకో ఆర్డర్ రాదు, పైగా పది రూపాయలు కంపెనీ కి కట్టాలి. బుకింగ్ కేన్సిల్ చేస్తే నాకు ఇంకో ఆర్డర్ వస్తుంది. అని అంటాడు. బుకింగ్ కేన్సిల్ చేస్తే ఆటోలో ఉన్నవాడికి సేఫ్టీ ఉండదు. బుకింగ్ రికార్డ్ ఉండదు. డబ్బులు క్యాష్ చేతికి ఇస్తే, ఫోనేపే లో లాగా ఆటో వాడి వివరాలు ఉండవు. *ప్రయాణాల్లో అన్నీ డిజిటల్ పెమెంట్లు మాత్రమే చెయ్యండి*. దీనివల్ల మనం ఆటోలో ఏదైనా విలువైన వస్తువులు మర్చిపోయినా తిరిగి తెచ్చుకోవచ్చు. కిడ్నాప్, లేదా రిస్క్ అయినా ట్రేస్ చెయ్యచ్చు. తస్మాత్ జాగ్రత్త!
అలసట మాయం..
*ఓం….!*
➖➖➖✍️
*'ఓం'... తో అలసట మాయం...!శాస్త్రీయంగా నిరూపించిన బాలిక..!!*
*ఓం... శబ్దంతో.... *
*శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలు గేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది.*
*పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్త లను అకట్టుకుంది.*
*కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది.*
*ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది.*
*అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యంగా కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు.*
*అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది.*
*ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌనఃపున్యం(Frequency)కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి...*
*ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియ జేసింది.*
*అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది.*
*గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు.*
*కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు.*
*ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు.*
*ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు.*
*వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించి నపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది.*
*అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది.*
*దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది.*
*దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది.*
*ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌనఃపున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది.*
*17 మంది యువతీ, యువకులకు ఓం కారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది.*
*ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష తెలిపింది...*
*ప్రతి రోజు ఉదయం , సాయంత్రం కనీసం 11 సార్లు దీర్ఘ ఓంకారం చేయండి.*
*మీ బంధు మిత్రులతో చేయించండి ...*✍️
*ఓం , ఓం , ఓం…*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
స్వగతం
మా ఇంటి ఘటో....
💐💐💐💐💐💐
"అట్టు అట్టు పెసరట్టూ..ఉల్లిపాయ పెసరట్టూ...
ఉప్మాతో జత పెట్టు, భల్ చెట్నీతోటీ కలేసి కొట్టూ..."
ఎక్కణ్ణించో పిఠాపురం నాగేసర్రావు పాట వినిపిస్తోంది.
'ఈ పాట ఎప్పుడో విన్నట్టుందే' అనుకుంటున్నానో - లేదో...
"ఇదిగో...ఏవోయ్...రేప్పొద్దున్న మనింట్లో టిఫిన్...
పెసరట్టుప్మా చేసుకుందామా ?" అనే అడ్వాన్స్
బుకింగు ఆర్డరొచ్చేసింది !
"చచ్చాంరా దేవుడా...ఇప్పుడు...ఎప్పటిదో...
నేను పుట్టనిక్రితం పాట వినబడ్డట్టుంది...
నా తిండిపుష్టి మొగుడికి" అనుకున్నాను.
"మా ఆయన బంగా........రం !" అని మా పుట్టింట్లో సాగదీసి చెబుతాను గాని, ఈయన తిండిగోల గురించి చెబితే, నవ్వుతారని, పుట్టింట్లో కూడా చెప్పట్లేదు.
ఈయన ఓ మోస్తరు మంచోడే కానీ, అదేం గోలో...
ఈయనకి, ఎక్కడ తినేవి ఏం చూసినా, విన్నా,
వెంఠనే అవన్నీ తినెయ్యాలనిపించేటంత జిహ్వ చాపల్యం !
ఆమధ్యెప్పుడో...ఎవరో రికమండు చేశారన్జెప్పి,
మేవిద్ధరం, వెళ్ళక వెళ్ళక, "మిథునం" సినిమాకెళ్ళాం...ఈడూ - జోడూగా...
అసలీమధ్య, ఈయన్తో బయటికెళ్ళడం మానేశాను...
పోకిరీ కుర్రాళ్ళు, మమ్మల్ని చూసి, "ఏనుగు - ఎలక" అంటున్నారని !
ఎందుకో...నిజంగానే, నాకు నేను, ఎలకలాగే అనిపిస్తున్నాను, ఈయన ముందు !
సినిమాలో ఆ అప్పదాసు పాత్రలో ఈయన దూరిపోయినట్టున్నారు, ఎప్పటికీ బయటికి రారే...!
పైగా, "ఈ అప్పదాసున్నాడే...నాకు అగ్రజుడు, దగ్గిరచుట్టం" అని తెగ మెచ్చేసుకుంటున్నారు !
చెప్పొద్దూ... నేనుకూడా...ఆ బుచ్చిలక్ష్మి పాత్రలో,
ఎంతోకొంత దూరిపోయాను...
వాళ్ళది అదోరకం దాంపత్యం...
మొగుడిమీద ప్రేమ వుంటుంది కానీ, ఆయన తిండిగోలమీద విసుక్కుంటూనే, మళ్ళీ అన్నీ చేసిపెడుతూనే వుంటుంది, నాలాగ !
ఇంటికొచ్చిందగ్గిర్నించీ, ఈయన...
"ఆవకాయ మన అందరిదీ...గోంగూర పచ్చడీ మనదేలే" అనే పాటట్టుకుని వదల్రే !
అందులో వర్ణించిన, ఇడ్డెన్నులు, కొబ్బరిచెట్నీ, పెసరట్టు, అల్లం, పులిహోర, మిర్చిబజ్జీ, వేడి పాయసం, ఆవడ - పెరుగు, దిబ్బరొట్టి, తేనెపానకం, గుత్తివంకాయ కూర, గుమ్మడికాయ పులుసు, ఆవపెట్టిన పనసపొట్టు కూర వగైరాలన్నీ...ఈయనకి ఆరాధ్య దైవాలే కదా ?
ఇంక చెప్పేదేముంది...ఆ పాట, ఈయన సెల్ లో అస్తమానూ మారుమోగిపోతోంది !
💐💐
మా పెళ్ళైన కొత్తలో, రేడియోలో ఏదో పాతపాట వస్తోంది...
"అందమైన బావా...ఆవుపాల కోవా...
విందుగా, పసందుగా, నా ప్రేమనందుకోవా..." అని !
అందులో శిష్ట్లా జానకమ్మ,
"హాటు హాటు గారీ...స్వీటు స్వీటు బూరీ...
రాగాల రవ్వట్టూ...భోగాల బొబ్బట్టూ...
నా ప్రేమ పెసరట్టూ..." అనుకుంటూ,
చాలా రకాల తిళ్ళ గురించి వర్ణిస్తుంది.
ఖర్మ కాలి, అవన్నీ ఈ మనుగుడుపుల అల్లుడుగారు విన్నట్టున్నాడు !
"మా పదహార్రోజుల పండగలోపు, అవన్నీ చేయించమని, నాద్వారా, మా అమ్మకి చెప్పించారు !
అత్తలకి, కొత్తల్లుడికి అన్నీ చేసిపెట్టాలనే వుంటుంది కానీ, బొత్తిగా ఇలా, "వెంకటాద్రి వంటిల్లు" లెవెల్లో అడుగుతాడని మా అమ్మకేం తెల్సు ?
ఇంక తప్పేదేముంది...మా ఆస్థాన వంటలక్క,
శేషమ్మ గారిని పిలిచి, రోజుకోరకం చేయించి పెట్టింది.
అప్పణ్ణించీ మా అమ్మకి, కూతురు - అల్లుడూ రావడం ఇష్టమే కానీ, భయంకూడా పట్టుకుంది !
దాన్నే, "అల్లుడు ఫోబియా" అంటారని, మా డాట్రారు చెప్పేశారు !
💐💐
పెళ్ళైన కొత్తలోనే మా అత్తగార్ని అడిగేశా...
"అత్తయ్యగారండీ...ఈయన్ని చిన్నప్పుడు గాని,
'మాయాబజార్' సినిమాకి గాని తీసికెళ్ళారా ?" అని !
"అయ్యో...మాయాబజార్ చూడని వాళ్ళెవరమ్మా...
మా ఇంట్లో అందరం, చాలాసార్లు చూశాం.." అన్నారు.
కొంచెం మొహమాటపడుతూనే అడిగాను,
"వివాహభోజనంబు పాట వచ్చినపుడు,
ఈయన ఎలా వుండేవారూ..." అని.
"నువ్వంటే గుర్తొచ్చింది, అందులో ఘటోత్కచుడు తిన్నవన్నీ...తనకీ కావాలని ఒకటే పేచీ...
ఇంక వాడితో పడలేక, వాళ్ళ నాన్న, ఏవో రెండు మూడు రకాలు మిఠాయి కొట్లోంచి, రకానికి అరకిలో చొప్పున తెచ్చి, సీసాల్లో పోసి, 'ఇంక నెలాఖరుదాకా పరవాలేదులే' అనుకున్నారు.
వీడు, ఓ కర్రని గదలాగ, భుజమ్మీద పెట్టుకుని,
'హహహ్హహ హహహ్హా' అనుకుంటూ, వాటిచుట్టూ తిరుగుతూ, ఎవరికీ మిగల్చకుండా, అన్నీ తనే తినేశాడు ! దిష్టి తగుల్తుందని, ఎవరికీ చెప్పలేదు."
అని నిట్టూర్చింది.. ఆవిడ !
💐💐
టీవీలో ఏదైనా సినిమా గాని, సీరియల్ గాని చూస్తుంటే, ఎక్కడ భోజనాల సీన్లు వస్తాయో అని భయపడి ఛస్తుంటాను.
టీవీలో ఏదైనా సినిమాలో భోజనాల సీను వస్తే,
సినిమా వాళ్ళదేంపోయింది, షో కోసం, ఆ టేబుల్ నిండా, రకరకాల పదార్ధాలు, పది రకాల ప్లాస్టిక్ పళ్ళు పెట్టేస్తారు.
ఆ సినిమాలో నటించేవాళ్ళు, అవేం తినరు సరికదా,
ఏదో మాటా - మాటా వచ్చి, మొహాలు ముడుచుకుని, కంచంలోనే చేతులు కడిగి చక్కా పోతారు !
తరవాత, ఇక్కడ మాకుంటుంది...రుద్రవీణ !
ఈయనెళ్ళి, ఫ్రిడ్జ్ లో వెతికేస్తుంటారు !
ఎప్పుడైనా రైల్లో వెడుతుంటామా...
ఎవరెవరో అమ్ముకునేవాళ్ళొచ్చి, ఏవేవో అమ్మేస్తుంటారు...జాం కాయలు, మావిడి తాండ్రలు,
వేశనక్కాయలు, పాకుండలు, చిక్కీలు గట్రా...
వాళ్ళందర్నీ పోషించే బాధ్యత ఈయనే తీసుకుంటారు, ఎవణ్ణి వదలరు !
ఈయన ఇంటిదగ్గిరే...చిల్లర మార్చుకుని, మరీ
ఆటో ఎక్కుతారు. ముందు జాగర్త !
ఇది చాలదన్నట్టు, ప్రతీ స్టేషన్లోనూ దిగి, అక్కడ
ప్లాట్ ఫారమ్మీదున్న అడ్డమైనవీ కొనుక్కుతింటారు.
ఇంటికెళ్ళగానే మొదలవుతుంది...
"ఘల్లు ఘల్లు ఘల్లు...గజ్జల సంగీతం !"
పొట్టలోపలికి తోసేసినవన్నీ విడివిడిగాను, సామూహికంగాను కలిసి, మిశ్రచాపుతాళంలో నాట్యప్రదర్శన ప్రాక్టీసు చేస్తాయనుకుంటా...ఆ చిత్ర విచిత్ర శబ్దాల గురించి, తదనంతర పరిణామాల గురించీ మీరడగనూ కూడదు - నేను చెప్పనూ కూడదు... ఎడిటింగులో పోతాయన్నమాట !
సినిమాకి వెళ్ళిన ప్రతిసారీ...ఇంటర్వల్లో ఈయన బయటికెళ్ళాల్సిందే, అక్కడ అమ్మే నానా రకాలు కొనాల్సిందే, సినిమా అయ్యేదాకా పరపరలాడించాల్సిందే !
రెండు మూడుసార్లు, ఆ సౌండ్లు భరించలేక, పక్కసీటువాళ్ళు కొట్టడానికొచ్చారుకూడానూ...
💐💐
ఓ రోజు, మొదటిసారి నాగేసర్రావు డబల్ పోజు వేసిన "ఇద్దరు మిత్రులు" సినిమాకెళ్ళాం.
అందులో, రేలంగి - రవణారెడ్డి గారెలు తినడంలో
పోటీ పెట్టుకుంటారు. అంతే... ఆ సీను ఈయనకి
తెగ నచ్చేసింది !
మర్నాడు..మాఇంట్లో...గారెల పండగ అని చెప్పఖ్ఖర్లేదుగా ? పైగా, ఎవరైనా అలాంటి గారెల పోటీ పెడితే బాగుణ్ణుట !
పరుగు పందాలు, బరువులు ఎత్తడాల్లో పోటీలు ఈయనకి పడవు !
"నేను జపాన్లో అయినా పుట్టాను కాదు" అంటుంటారు.
"ఎందుకు ?" అంటే, అక్కడ సుమోగాళ్ళని బాగా మేపుతార్ట ! అందుకుట !
మా తమ్ముడు, ఈయనకి, "తుమ్ముల తిమ్మయ్య బావ" అని పేరెట్టాడు.
'ఎందుకురా, అలా ?' అనడిగితే,
"అక్కా, బావని నువ్వు సరిగ్గా చూళ్ళేదులా వుంది, బావ బయట ఎండలోకి వస్తే చాలు...ముక్కు ఆకాశం వైపు పెట్టి, కళ్ళు చిట్లించి, నోరు తెరిచి, ఇంకో రెండు నిమిషాల్లో గేరంటీగా తుమ్ముతాడు అనేట్టుగా హడావిడి చేస్తాడు.." అన్నాడు.
వాడన్నాక, నాక్కూడా, 'అవును, నిజమేగా...' అనిపించింది.
💐💐
మొన్న ఆదివారంనాడు, ఈటీవీ వాళ్ళు, "శ్రీకృష్ణపాండవీయం" సినిమా వేస్తున్నారు.
ఆ సినిమా మాఇంట్లో అందరికీ చాలా ఇష్టం.
ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు.
అందరం చేరి, సరదాగా చూస్తున్నాం...
సినిమా చూసేటప్పుడు, ఈయనకి పక్కని ఓ కిలో జంతికల్లాంటివి ఉండాల్సిందే !
భీముడు - బకాసురుణ్ణి చంపడానికి, తన తల్లి
కుంతీదేవి ఆశీస్సులు తీసుకుని, రెండు
దున్నపోతుల బండెక్కి, బయల్దేరతాడు.
నాకు హఠాత్తుగా గుర్తొచ్చింది...
అప్పుడే భీముడికోసం, మాధవపెద్ది సత్యం,
ఒకపాట అందుకుంటాడని...
"భళా భళా నా బండి...పరుగూ తీసేబండి..."
అని పాడుతూ...
"అట్టుర...మినపట్టుర...దీన్నొదిలిపెట్టేదెట్టురా...
తీపి తీపి బొబ్బట్టుర...ఇది తింటే ఆకలి కట్టురా..."
అని పాడేలోపు, మా ఇంట్లో కరెంటు కట్టు అవడం
దేశానికి చాలా అవసరమనిపించి, లోపలికెళ్ళి,
మెయిన్ స్విచ్చి కట్టేసి వచ్చి, "వెధవ కరెంటు,
సరిగ్గా ఇప్పుడే పోవాలా ?" అని ఊర్వశి శారదని మించిపోయాను.
పాపం ఈయన, నన్ను ఓదారుస్తున్నారు...
....ఒక బాధిత ఇల్లాలి స్వగతం !
😜😜😜
వారణాసి సుధాకర్.
💐💐💐💐💐💐
_తాపత్రయం-తపన_
*_తాపత్రయం-తపన_*
*ఒక కోటిశ్వరునికి పెద్ద కారు ప్రమాదం జరిగింది... పదిహేను రోజుల తర్వాత కోమాలో నుండి స్పృహలోకి వచ్చాడు.... చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులందరు ఆనందంతో చూసారు....*
*_తాపత్రయం మొదటి మెట్టు_*
*“అందరూ ఇక్కడే వున్నారా?” అని అడిగాడు....*
*అవునని కొడుకు చెప్పాడు....*
*“అందరూ ఇక్కడే ఉంటే అక్కడ షాపులో ఎవరున్నారు?” అని అడిగాడు.....*
*_తాపత్రయం రెండో మెట్టు_*
*“నేను అదృష్టవంతురాలిని... నా మాంగల్యం గట్టిది.... మీకు పెద్దకారు ప్రమాదం జరిగింది.... కారు నుజ్జునుజ్జు అయ్యింది.... అయినా మీరు ప్రాణాలతో బయటపడ్డారు,” అంది భార్య....*
*వెంటనే… “కారు ఇన్సూరెన్స్ క్లైమ్ చేశారా?” అని అడిగాడు....*
*_తాపత్రయం మూడోమెట్టు_*
*“నాన్నా మీకింకొక విషయం చెప్పాలి.... కారు ప్రమాదంలో మీచెయ్యి కారు డోరులో ఇరుక్కుపోయింది.... మీచెయ్యి తీసేసారు... ” అన్నాడు....కొడుకు*
*చెయ్యి చూసుకున్నాడు, లేదు...“చేతికి పాతిక లక్షల రోలెక్స్ వాచీ వుండాలిరా!” అన్నాడు....*
*_తాపత్రయం నాలుగో మెట్టు_*
*“వాచీ తీసుకున్నారా?” జాగ్రత చేశారా?అని లేవబోయాడు....*
*“నాన్న కంగారు పడకండి, మీకు ఇంకొక విషయం చెప్పాలి, ప్రమాదంలో మీ వెన్నెముక విరిగిపోయింది.... మీరు నడవలేరు.... . మీపనులన్నీ చేసుకొనేందుకు అనువుగా మీకు కోటిరూపాయలతో ఎలక్ట్రానిక్ రోబో వీల్ చెయిర్ తీసుకొన్నాం .... అందులో కూర్చుంటే పళ్ళు బ్రష్ చేసుకోవటం, స్నానం చేయటం, భోజనం చేయటం వంటి అన్ని మీపనులు మీరే చేసుకోవచ్చు!” అన్నాడు కొడుకు....*
*“కోటిరూపాయలతో కొన్నారా, కొంటానికి కొటేషన్ తీసుకున్నారా, ఇంకా తక్కువకి వచ్చేదేమో?” అన్నాడు...*
*తాపత్రయానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేమి కావాలి?*
నాసదీయ సూక్తము
నాసదీయ సూక్తము
శ్రీ శివాయ గురవే నమః
నాసదీయ సూక్తము(ప్రతి పదార్థ తాత్పర్యములు)
అక్కడ పుస్తకము ఉందా? లేదా? అని ఎవరయినా ప్రశ్న అడిగారనుకోండి. అక్కడ పుస్తకము ఉంటే ఉందని చెబుతాం. లేదంటే లేదని చెబుతాం. కాని పుస్తకం ఉంది.. లేదు అని జవాబు చెబుతామా? ఏమిట్రా ఇలా చెబుతున్నాడు. ఉంటే ఉందని చెప్పాలి. లేక పొతే లేదని చెప్పాలి. ఉంది... లేదు ఏమిట్రా బాబూ ! అనుకొంటాం. పరమపవిత్రమయిన ఋగ్వేదంలో ఉన్న నాసదీయ సూక్తము ఇలాంటిదే. ఉంది, లేదు అను జవాబులు ఈ సూక్తములో వస్తాయి.
సరస్వతీ దేవికి సంబంధించిన మేధా సూక్త వివరణ పూర్తయిన పిదప, పెద్దలు శ్రీ గుడిపాటి రామకృష్ణ శర్మగారు ఈ నాసదీయ సూక్తాన్ని వివరించమని కోరారు.వారు అడిగి చాలా రోజులయింది. శివయ్య అనుగ్రహంతో నమక చమకాల చివరి భాగం పూర్తి చేసి ఆత్మ జ్యోతి మాస పత్రికకి పంపించిన తర్వాత ఈ సూక్తవివరణను ధైర్యం చేసి ఈరోజు మొదలుపెడుతున్నాను..(త్వరలో పెద్దలు శ్రీ గుడిపాటి రామకృష్ణ శర్మగారు నా నమకచమక వివరణలను పుస్తకంగా ప్రచురించబోతున్నారు.వారికి ధన్యవాదములు)
ఋగ్వేదంలో ఉన్న 1017 సూక్తాలలో నాసదీయ సూక్తము ఒకటి. సృష్టికి ముందు ఉన్న ప్రళయ స్థితి ఈ సూక్తములో చెప్పబడింది. ఈ సూక్తములో సామాన్యుల భావనకు అతీతమైన ఒక విచిత్రమైన శైలి కనిపిస్తుంది. పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంది .
న, అసత్ = నాసత్ . సత్ అంటే ఉంది. అసత్ అంటే లేదు. నాసత్ అంటే లేదని ఏదయితే చెబుతున్నామో అది లేదు. అంటే ఉంది. (At first there was no being nor non being )
ఉంది, లేదు,లేదని చెబుతున్నది ఉంది . ఈ మూడింటి విశ్లేషణ ఈ నాసదీయ సూక్తములో కనబడుతుంది. మహానుభావుడయిన సాయణాచార్యులవారు ఈ నాసదీయ సూక్తానికి వ్రాసిన భాష్య సహాయముతో, బ్రహ్మ సూత్రాల వ్యాఖ్యాన సహాయముతో పెద్దల అనుగ్రహము ద్వారా , నేను తెలుసుకొన్నంత వరకు ఈ నాసదీయ సూక్తాన్ని వివరించటానికి ప్రయత్నిస్తాను.
సహేతుకంగా దోషాలు తెలియచేస్తే వెంటనే సవరించుకొంటాను.
01
नासदासीन्नो सदासीत्तदानीम् नासीद्रजो नो व्योमा परो यत्।
किमावरीव: कुह कस्य शर्मन्नंभ: किमासीद्गहनं गभीरम्॥१॥
నాసదాసీన్నోసదాసీత్తదానీం నాసీద్రజో నో వ్యోమాపరో యత్ ।
కిమావరీవః కుహకస్యశర్మన్నంభః కిమాసీద్గహనం గభీరం ॥ ౧ ॥
పద విభాగము
న, అసత్, ఆసీత్, నో ఇతి, సత్, ఆసీత్, తదానీం, న , ఆసీత్, రజః, న , వి, ఓమ, పరః, యత్, కిమ్, ఆ,అవరీవరీతి, కుహ, కస్య, శర్మన్,అమ్భః, కిమ్, ఆసీత్, గహనమ్, గభీరమ్
ప్రతి పదార్థము
సృష్టికి పూర్వము ఉన్న ప్రళయావస్థ వర్ణించబడుచున్నది
తదానీం= ప్రళయ కాలములో అప్పుడు ఈ ప్రపంచానికి మూల కారణమువలె ఉన్నది
తద్ అసత్= కుందేలు కొమ్ములా లేనే లేదు (కుందేలుకు కొమ్ములు అసంభవము. ఎలుకకు కొమ్ములు అసంభవము)
తథా నోసత్= సత్ పదార్థము ఆత్మ వలె ఉన్నది కావున నిర్వచింఛుటకు వీలులేనిది
న ఆసీత్ రజః= ఆకాశము కింద ఉన్న భూమితో అంతమైన పాతాళము మొదలైన లోకములు లేనే లేవు
వ్యోమ= ఆకాశము
తదపి నో= అది కూడా లేనే లేదు
పరః= ఆకాశమునకు పై భాగము ఉన్న స్వర్గలోకమునుండి సత్య లోకమువరకు లేదు
అవరీవః= ఏదైతే ఆవరించదగినదో - ఆవరించదగిన(ఆక్రమించుకొన్న) భూత సమూహములు - వరించబడుగాక ! అదియునులేదు
కుహ= వరించదగిన వస్తు స్వరూపము ఏ ప్రదేశమునుండి వరించబడుతోందో అదికూడా లేదు
కస్య శర్మన్ =ఏ భోక్త అయిన జీవునియొక్క సుఖ దుఃఖ సాక్షాత్కారములు నిమిత్తములు కాగా ఆవరించిన కలిగిన వస్తు స్థితి ఆవరించబడుగాక !
గహనం= ప్రవేశించుటకు వీలులేని అగాధమైన
ఈదృశః= ఇటువంటి
అంభః= నీరు
కిమాసీత్= ఏమైనది?(నీరు కూడా లేదు)
తాత్పర్యము
సృష్టికి పూర్వము ఉన్న ప్రళయావస్థ ఈ సూక్తములో చెప్పబడుతోంది.
మొదట్లో ఉనికి అనేది లేదు, ఉనికి లేకపోవటం అంటూ కూడా లేదు. మనకి అర్థమయ్యే విశ్వం లేదు.
ఆకాశం లేదు. ఆకాశమునకు పై భాగము ఉన్న స్వర్గలోకమునుండి సత్య లోకమువరకు లేనే లేదు
అలా అని ఏదీ లేదనటానికి వీలు లేదు. నీరు ఏమైనది? ఈ నీరు దేనిచే ఆవరించబడి ఉంది? అది ఎక్కడ ఉంది?
ఏదయితే ఉన్నదో అది ఎఱుగరానిది; చొరరానిది.మిక్కిలి లోతైనది.
నాసదీయ సూక్తము(ప్రతి పదార్థ తాత్పర్యములు)-02.(31-08-2016)
2
न मृत्युरासीदमृतं न तर्हिन रात्र्या अह्न आसीत्प्रकेतः।
आनी॑दवातं स्वधयातदेकं तस्मा॑द्धान्यन्न परः किञ्चनास॥२॥
న మృత్యురాసీదమృతం న తర్హి న రాత్ర్యాఆహ్నఆసీత్ప్రకేతః ।
ఆనీదవాతం స్వధయా తదేకం తస్మాద్ధాన్యన్నపరః కిఞ్చనాస ॥ ౨ ॥
పదవిభాగము
న మృత్యుః, ఆసీత్, అమృతమ్, న తర్హి, న రాత్ర్యాః, ఆహ్నః,ఆసీత్ , ప్రకేతః ।
ఆనీత్, అవాతం, స్వధయా, తత్ ,ఏకం తస్మాత్, హ, అన్యత్, నపరః కిమ్, చన, ఆస
ప్రతి పదార్థము
న మృత్యుః+ ఆసీత్= మృత్యువు లేదు
అమృతం న తర్హి॒= అమృతము(అమర్త్వము) లేదు
రాత్ర్యా = రాత్రితో
ఆహ్నః= పగలు యొక్క
ప్రకేతః = జ్ఞానము, చిహ్నము
న ఆసీత్ = లేకుండెను (ఎందుకంటె వీటికి కారణములైన సూర్యచంద్రులు లేరు కనుక)
స్వధయా= బ్రహ్మతో(మాయ, ప్రకృతి. శక్తిని ధరించినది , తనయందు ధరించబడియుండునది స్వధా)
అవాతం = వాయురహితమైన
తత్ ,ఏకం = కేవలము ఏక ప్రాణము మాత్రమే (బ్రహ్మము )
ఆనీత్ హ = ఉండెను కదా !
తస్మాత్ = ఇదివరకు చెప్పిన బ్రహ్మము కంటె భిన్నముగా
అన్యత్ =వేరొకటి
పరః కించన న ఆస= = సృష్టికి పూర్వము కొంచెము కూడా లేదు.
తాత్పర్యము
ప్రళయకాలపు పూర్వకాలములో మృత్యువు లేదు ; అమృతము(అమర్త్యము) లేదు
రాత్రి పగలు యొక్క జ్ఞానము, చిహ్నము లేదు (ఎందుకంటె వీటికి కారణములైన సూర్యచంద్రులు లేరు కనుక)
మాయతోలేదా, ప్రకృతితో వాయురహితమైన ఏక ప్రాణము మాత్రమే (బ్రహ్మము )ఉండెను.
ఇదివరకు చెప్పిన బ్రహ్మము కంటె భిన్నముగా వేరొకటి సృష్టికి పూర్వము కొంచెము కూడా లేదు.
విశేషాలు
ఈ మంత్రంలో వినబడే స్వధా అనే పదానికి విస్తృతార్థ ప్రయోగాలు ఉన్నాయి.
1. అగ్నికార్యంలో/ యజ్ఞాలలో స్వాహా శబ్దం వినిపించినట్లే పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వడంలో స్వధా శబ్దం వినిపిస్తుంది. పితృయజ్ఞాలలో స్వాహాదేవియే తర్పణాలలో స్వధా రూపిణిగా వస్తున్నదని శాస్త్రం. (పితృ యజ్ఞేషు స్వధా మాతా.) పితృ దేవతలను ఉద్దేశించి వషట్కారం చేయడం స్వధాకారం.(స్వధానమ ఇతి వషట్కారపి.)
2. అగ్ని దేవుని భార్య స్వాహాదేవి. ఆమె మరో రూపం స్వధా.
3. స్వధా శబ్దానికి అన్నం అని కూడా అర్థం ఉంది.
4. స్వధా : పితృహోమము చేయుట.(సంస్కృత-తెలుగు నిఘంటువు వావిళ్ల 1943 )
5. కౌసల్యాదేవి రామునితో బాధ పడుతూ “ నాయనా రామా ! నువ్వు నా ఎదుట లేనప్పుడు పితృ లోకమున లభించే స్వధతో కాని, స్వర్గప్రాప్తి వలన కలిగే అమృతముతో గాని ఏమి లాభము ? “ (వాల్మీకి రామా.అయోధ్య 021 వ సర్గ- 51వ శ్లో) అని చెబుతుంది.
6. అయితే ఈ నాసదీయ సూక్తానికి భాష్యము రచించిన సాయణాచార్యులవారు “స్వస్మిన్ ధీయతే ధ్రియత ఆశ్త్రిత్యవర్తత ఇతి స్వధా “ (తనయందు ధరించబడియుండునది, ఆశ్రయించి ఉండునది) అని వ్రాసారు.అందుకే నేను కూడా స్వధా పదానికి “తనయందు ధరించబడియుండునది” అను అర్థాన్ని స్వీకరించాను.
నాసదీయ సూక్తము(ప్రతి పదార్థ తాత్పర్యములు)-03.(01-09-2016)
तम आसीत्तमसा गूळ्हमग्रे॑ऽप्रकेतं सलिलं सर्व॑मा इदं।
तुच्छ्येनाभ्वपि॑हितं यदासीत्तप॑सस्तन्म॑हिना जायतैकं॥ ३॥
తమ అసీత్తమసా గూళ్హమగ్రే॑ ప్రకేతం సలి॒లం సర్వమాఽఇదం ।
తుచ్ఛ్యేనాభ్వపిహితం యదాసీత్తపసస్తన్మహినా జాయతైకం ॥ ౩ ॥
పదవిభాగము
తమః, అసీత్ , తమసా గూళ్హమ్,అగ్రే , అప్రకేతం, సలిలమ్, సర్వమ్ ,ఆః, ఇదం ।
తుచ్ఛ్యేన, ఆభు అపిహితం , యత్, ఆసీత్ . తపసః , తత్ మహినా, అజాయత, ఏకం
ప్రతి పదార్థము
అగ్రే = సృష్టికి ముందు ప్రళయ దశలో జీవులకు సంబంధించిన (భూత భౌతికమైన) సర్వ ప్రపంచము
తమసా = చీకటితో
గూళ్హమ్= ఆవరించబడియున్నది.
తమః = అన్ని పదార్థాలలో ఆవరించిన చీకటి ఏరకంగా అయితే ఈ శ్వరుని ఆవరించదో అటువంటి చీకటి
అసీత్ = ఈ సర్వ ప్రపంచమును ఆవరించినది..
ఇదం సర్వమ్ సలిలమ్ = ఇప్పుడు కనబడే సకల జగత్తు నీటితో కూడినది
అప్రకేతం= పాలతో కూడిన నీరును ఎలా వేరు చేసి చెప్పుటకు వీలుపడదో అలా అంధకారముతో కూడిన ఈ ప్రపంచమును విడదీసి తెలుసుకొనుటకు బోధ పడుటలేదు
తుచ్ఛ్యేన = అవ్యక్తావస్థలో అనగా వివరించుటకు వీలు కాని స్థితిలో
ఆభుః= మళ్ళీ
అపిహితం = జగత్తు కప్పబడి ఉన్నది.
యత్= ఏదయితే
ఏకం ఆసీత్ = చీకటితో కలిసి విడదీయుటకు వీలు కాకుండా ఒకటిగా ఉన్నదో
తత్= అది(సృష్టి)
తపసః = సృష్టించవలెనని భగవంతుని చక్కని ఆలోచనరూపమగు
మహినా=మాహాత్మ్యముతో (గొప్పతనముతో)
అజాయత= పుట్టింది.
తాత్పర్యము
సృష్టికి ముందు ప్రళయ దశలో జీవులకు సంబంధించిన సర్వ ప్రపంచము చీకటితో కప్పబడియున్నది.
అన్ని పదార్థాలలో ఉన్న చీకటి ఏరకంగా అయితే ఈ శ్వరుని కప్పలేదో అటువంటి చీకటి ఈ సర్వ ప్రపంచమును కప్పివేసింది..
ఇప్పుడు ఈ ప్రళయ కాలములో కనబడే సకల ప్రపంచము నీటితో కూడినది
పాలతో కూడిన నీరును ఎలా వేరు చేసి చెప్పుటకు వీలుపడదో అలా అంధకారముతో కూడిన ఈ ప్రపంచమును విడదీసి తెలుసుకొనుటకు బోధ పడదు.
అవ్యక్తావస్థలో అనగా వివరించుటకు వీలు కాని స్థితిలో జగత్తు కప్పబడి ఉన్నది.
చీకటితో కలిసి విడదీయుటకు వీలు కాకుండా ఒకటిగా ఉన్న సృష్టి - సృష్టించవలెనని భగవంతుని చక్కని ఆలోచనరూపమగు
గొప్పతనముతో మరలా ప్రారంభమవుతుంది.
విశేషాలు
సత్వము, రజస్సు, తమస్సు – ఈ మూడింటికి సమానమయిన పదము ప్రకృతి
ఈ ప్రకృతికి ప్రధానము, అవ్యక్తము, మరియూ అదృశ్యము- ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి.
వేదములో ఈ ప్రకృతి శబ్దము తమస్సు అనే పదముతో చెప్పబడింది.
వేదాంతములో ప్రకృతిని అజ్ఞానము అన్నారు. ఎందుకంటే ఆ పరమాత్మ జ్ఞానము తెలుసుకోవటం కష్టం కనుక.
చివరగా ఒక మాట
బిగ్ బ్యాంగ్ (మహా విస్ఫోటం) అని ఒక మాట ఆధునిక కాలములో వింటున్నాం. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఎక్కువ వేడి పుట్టిందని చెబుతున్నారు.
భగవంతుని తపస్సుచే (తపముచే , వేడిచే) సృష్టి ఏర్పడిందని నాసదీయ సూక్తములోని ఈ మూడవ మంత్రం చెబుతోంది.స్వస్తి.
నాసదీయ సూక్తము(ప్రతి పదార్థ తాత్పర్యములు)-04.(02-09-2016)
कामस्तदग्रे समवर्तताधि मनसो रेत: प्रथमं यदासी॑त्।
सतो बन्धुमसति निरविन्दन् हृदि प्रतीष्या॑ कवयो॑ मनीषा॥४॥
కామస్తదగ్రే సమవర్త॒తాధి మనసో రేతః॑ ప్రథమం యదాసీ॑త్ ।
సతోబన్ధుమసతి నిరవిన్దన్హృది ప్రతీష్యా కవయో మనీషా ॥ ౪ ॥
పదవిభాగము
కామః ,తత్ అగ్రే , సమ్ అవర్త॒త, అధి మనసః ,రేతః ప్రథమం యత్ ,ఆసీత్ ।
సతః బన్ధుమ్ , అసతి నిః, అవిన్దన్, హృది ప్రతి ఇష్య కవయః మనీషా ॥ ౪ ॥
ప్రతి పదార్థము
తత్ అగ్రే = ఇప్పుడు కనబడే సృష్టికి పూర్వము
కామః =సృష్టి చేయవలెనని కోరిక
సమ్ అవర్త॒త,= కోరిక కలిగింది.
యత్= ఆ
అధి మనసః = అంతః కరణమునకు సంబంధించిన వాసనాశేషముతో
ప్రథమం = జరిగిపోయిన కల్పమునందు
రేతః = సృష్టించబోవు ప్రపంచమునకు సంబంధించిన బీజ భూతము
ఆసీత్ = ఉండెను
కవయః= క్రాంతదర్శులైన యోగులు, మునులు
మనీషా=తమ సాత్విక బుద్ధి చేత
అసతి= వినశ్వరమైన
హృది =హృదయములో
ప్రతి ఇష్య =విచారణ చేసి
సతః = సత్పదార్థము చేత ఇప్పుడు అనుభవిస్తున్న సకల జగత్తుకు
బన్ధుమ్ = కల్పాంతరములో ప్రాణులచే అనుభవించబోవు కర్మ సమూహ బంధకము
అసతి =సద్విలక్షణము అన్యాకృతమగు కారణము నందు
నిః, అవిన్దన్= వివేచన చేసి తెలుసుకొనిరి
పద విశేషాలు
1. అంతఃకరణము
అంతర్ + కరణమ్. లోపలి యింద్రియము.
అంతఃకరణము లు - వేదాంతుల మతమున మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అని నాలుగు విధములు. వీనికి క్రమముగా సంశయము, నిశ్చయము, గర్వము, స్మరణము - విషయములు. ఇవి సాంఖ్యుల మతమున బుద్ధి, అహంకారము, మనస్సు లని మూడు విధములు.
2. వాసనాత్రయము
ఇవి మూడు 1.లోకవాసన, 2. దేహవాసన, 3. శాస్త్రవాసన.
3. కల్పము :
a day of Brahma or 1000 Mahayugas, being a period of 432, 000, 000 years of mortals and measuring the duration of the world;( శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953)
తాత్పర్యము
కల్పము అనగా కృత ,త్రేతా ,ద్వాపర కలియుగములు
ఈనాలుగు కలిపి ఒకకల్పాంతరము.
ప్రతి యుగమునకు మహాప్రళయం సంభవిస్తుంది .
మరల తర్వాత యుగం ప్రారంభం కావడానికి మధ్య సంధి కాలం వుంటుంది
ఇప్పుడు కనబడే సృష్టికి పూర్వము భగవంతునికి సృష్టి చేయవలెనని కోరిక కలిగింది.
ఆ అంతః కరణమునకు సంబంధించిన వాసనాశేషముతో జరిగిపోయిన కల్పమునందు సృష్టించబోవు ప్రపంచమునకు సంబంధించిన బీజ భూతము ఉండెను
క్రాంతదర్శులైన యోగులు, మునులు తమ సాత్విక బుద్ధి చేత నశించే దానిని హృదయములో విచారణ చేసారు. సత్పదార్థము చేత ఇప్పుడు అనుభవిస్తున్న సకల జగత్తుకు కారణమయిన - కల్పాంతరములో ప్రాణులచే అనుభవించిన కర్మ సమూహ బంధకములను వివేచన చేసి తెలుసుకొన్నారు.
తదైక్షత అని చాందోగ్యోపనిషత్తు. పరమాత్మ విస్తరించాలని సంకల్పించింది — ఆ సంకల్పం చేతనే జగమేర్పడింది. ఈ భావమే ఈ నాసదీయ సూక్త నాలుగవ మంత్రములో చెప్పబడింది.కామము లేకపొతే సృష్టి లేదు. అందువలన జీవులకు తమ కర్మలకు తగిన ఫలములను అనుభవింపచేయుటకు ఈశ్వరుడు సృష్టి చేయాలనుకొన్నాడు.ఇది తమ బుద్ధి చేత ఋషులు తెలుసుకొన్నారని భావం.
సృష్టికి కారణం కోరిక. అదే ప్రధమ బీజం, దేవుని యొక్క మనసు నుంచి ఆ కోరిక పుట్టింది. ఆ కోరిక నుంచే జగత్తు వికసించింది. తమ హృదయాలను శోధించిన ఋషులు , ఉనికికి, ఉనికి లేకపోవటానికి కారణమైన చైతన్యాన్ని దర్శించి . వాటి మధ్య సంబంధాన్ని తెలుసుకున్నారు.
నాసదీయ సూక్తము(ప్రతి పదార్థ తాత్పర్యములు)-05.(03-09-2016)
तिरश्चीनो विततो रश्मिरेषामधः स्विदासीदुपरि स्विदासीत् |
रेतोधा आसन् महिमान आसन्त्स्वधा अवस्तात् प्रयतिः परस्तात् ||
తిరశ్చీనో వితతో రశ్మిరేషామధః స్విదాసీదుపరిస్విదాసీ త్ ।
రేతోధా ఆసన్మహిమానఆసన్త్స్వధా అవస్తాత్ ప్రయతిః పరస్తాత్ ॥ ౫ ॥
పదవిభాగము
తిరశ్చీనః, వితతః , తతః రశ్మిః ఏషామ్ ,అధః స్విత్, ఆసీత్, ఉపరిస్విత్ ఆసీత్ ।
రేతః ధాః ఆసన్ మహిమాన ఆసన్ , స్వధా అవస్తాత్. ప్రయతిః, పరస్తాత్
ప్రతిపదార్థము
ఏషామ్= ఆకాశాది భూత సమూహములను సృష్టించు ఈ సృష్టి పదార్థముల అవిద్యా కామ కర్మలు( మహా మోహం మొదలైనవి)
రశ్మిః= సూర్య కిరణ సమానములు( సూర్య రశ్మి ఉదయము తరువాత నిమేష కాలములో ప్రపంచమంతటా ఎలా వ్యాపించుచున్నదో ఆవిధముగా అవిద్యా కామ కర్మలు వ్యాపించుచున్నవని భావము. ఏ కార్య వర్గము)
వి తతః= విస్తరించబడెనో ఆ కార్య వర్గము మొట్టమొదట
కింతిరశ్చీనః ఆసీత్ = మధ్యలో ఉండెనా?
కింవాధః అసీత్ = కింద భాగములో ఉండెనా?
అహోస్విత్ = లేక (స్విత్=వికల్పము; ప్రశ్నము; సందేహము)
ఉపరి ఆసీత్ = పై భాగములో ఉండెనా?
రేతః ధాః ఆసన్= సృష్టించబడిన కార్యముల మధ్యలో కొన్ని భావములు బీజ భూతమగు కర్మకు సృష్టి కర్తలు, జీవులు , భోక్తలుగా ఉండిరి.
మహిమాన ఆసన్ = గొప్పవగు ఆకాశాదులు భోగ్యములుగా(భోగింపతగినవిగా) ఉండినవి.
స్వధా అవస్తాత్.= అన్నము (భోగ్య పదార్థము) తక్కువగా ఉండెను.
ప్రయతిః,= ఈశ్వరీయ ప్రయత్నము( భుజించువాడు)
పరస్తాత్= గొప్పగా ఉండెను. ( భోగ్యప్రపంచమును భోక్తృ ప్రపంచముకంటె తక్కువగా చేసెను.భోగ్య= భోగింపదగిన; భోక్తృ= అనుభవించు )
తాత్పర్యము
మాయా సహితుడగు పరమేశ్వరుడు సక ల జగత్తును సృష్టించి తానే స్వయముగా వాటిలో ప్రవేశించి, భుజించువాడు, భుజించునది అను విభాగము చేసాడని తాత్పర్యము
సాయణాచార్యుల వారి నాసదీయ సూక్త వివరణము చివరి భాగము (04-09-2016)
को अद्धा वेद क इह प्र वोचत् कुत आजाता कुत इयंविसृष्टिः ।
अर्वाग् देवा अस्य विसर्जनेनाथा को वेद यतआबभूव ॥6॥
ప్రతి పదార్థము
కోఅద్ధా వేద కఽఇహ ప్రవోచత్ కుత।ఆజాతాకుతఽఇయం విసృష్టిః ।
అర్వాగ్దేవా।ఆస్య విసర్జనేనాథాకో వేద యత ఆబభూవ ॥ ౬ ॥
కః= ఏ పురుషుడు
అద్ధా = పరమార్థ రూపములో (విశేష సత్య రూపములో)
వేద = తెలుసుకొనుచున్నాడు?
కోవా ఇహ=ఎవరు ఈలోకమునందు
ప్రవోచత్ =దీనిని వివరించగలరు?
ఇయం= ప్రత్యక్షముగా కనబడు
విసృష్టిః = ఈ వివిధ సృష్టులు( భూత భౌతిక, భోక్తృ, భోగ్యాది రూపములుగా ఉన్న సృష్టి) (భోగ్య= భోగింపదగిన; భోక్తృ= అనుభవించు)
కుతః= ఏ ఉపాదాన కారణము వలన
కుతః= ఏ నిమిత్త కారణము వలన
ఆజాతా=పుట్టింది?(ఈ రెండు విషయములను బాగా)
కోవేద= విస్తారంగా ఎవరు చెప్పగలరు?
దేవాశ్చాస్య= దేవతలు ఈ ప్రపంచములో
విసర్జనేన తేన = ఆకాశాది భూతోత్పత్తికి తరువాత వివిధ భౌతిక పదార్థముల సృష్టి జరిగిన దానితో
అర్వాగ్=పిమ్మట దేవతలు నవీనులుగా చేయబడిరి.
వేద= ఎవరు ఈ జగత్కారణమును తెలుసుకొనుచున్నాడు?
యతః= ఏకారణము వలన ఈ సకల జగత్తు
ఆబభూవ= ఉద్భవించెను
తాత్పర్యము
ఏ పురుషుడు పరమార్థ రూపములో ఈ సృష్టి కారణము తెలుసుకొనుచున్నాడు?ఎవరు ఈలోకములో
దీనిని వివరించగలరు?
ప్రత్యక్షముగా కనబడే భూత, భౌతిక, భోక్తృ, భోగ్యాది రూపాలుగా ఉన్న ఈ సృష్టి ఏ ఉపాదాన కారణము వలన
ఏ నిమిత్త కారణము వలనపుట్టింది? ఈ రెండు విషయములను బాగా విస్తారంగా ఎవరు చెప్పగలరు? (ఒక కుండ తయారీకి మట్టి కారణము, దాన్ని ఉపాదానము అంటారు.తయారు చేయాలని సంకల్పించే వాడు ఒక కారణము దానిని నిమిత్తము అంటారు. )
ఈ ప్రపంచములో ఆకాశాది భూతోత్పత్తికి తరువాత వివిధ భౌతిక పదార్థముల సృష్టి జరిగిన తర్వాత దేవతలు కొత్తవారిగా చేయబడ్డారు. . ఇటువంటి దేవతలు – సృష్టి తర్వాత ఉన్న దేవతలు ఈ సృష్టి కారణాన్ని ఎలా తెలుసుకోగలరు? ఎలా వివరించగలరు?
దేవతలే తెలుసుకోలేని సందర్భములో వారికంటె వేరైన మనుష్యుడు ఎలా తెలుసుకొనుచున్నాడు? ఏకారణము వలన ఈ సకల జగత్తు పుట్టింది?
इयं विसृष्टिर्यत आबभूव यदि वा दधे यदि वा न ।
यो अस्याध्यक्षः परमे व्योमन् सो अङ्ग वेद यदि वा नवेद ॥7॥
ఇయం విసృష్టిర్యత ఆబభూవ యది వా దధే యది వా న।
యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్ సో అంగ వేద యది వా న వేద॥
ప్రతి పదార్థము
ఇయం = ఈ
యతః= ఉపాదాన భూతుడగు పరమాత్మ నుండి (ఒక కుండ తయారీకి మట్టి కారణము, దాన్ని ఉపాదానము అంటారు)
విసృష్టిః = వివిధ పర్వత , నదీ , సముద్ర రూపమైన విచిత్రమగు ఈ సృష్టి
ఆబభూవ =పుట్టింది
యది వా దధే = ఆ పరమాత్మ జగత్తును ధరించవచ్చును
యది వా న=ధరించలేకపోవచ్చును. (ఒకవేళ ధరించగలిగితే భగవంతుడే ధరించవచ్చును. ఇతరులు ధరించుటకు సమర్థులు కారు.
అన్య= భూత భౌతికాత్మకమగు జగత్తుకు
యః అధ్యక్షః= ఎవరు అధిపతియో
పరమే = గొప్పదగు
వ్యోమన్= ఆకాశమునందు(ఆకాశమువలె నిర్మలమైన స్వప్రకాశమందు)
వ్యోమని= నిరతిశయ ఆనందములో ఏ పరమేశ్వరుడు కలడో
వ్యోమని= విశిష్ట స్వరూపమయిన ఆత్మయందు ఏ పరమేశ్వరుడు కలడో
సో అంగ = అతడే
వేద= తెలుసుకొనుచున్నాడు
యది వా న వేద= ఇతరులు తెలుసుకొనలేకున్నాడు
సర్వజ్ఞుడగు ఈ శ్వరుడు తప్ప సృష్టి విషయము మరెవ్వరూ తెలుసుకొనలేరని భావము.
తాత్పర్యము
ఉపాదాన భూతుడగు పరమాత్మ నుండి (ఒక కుండ తయారీకి మట్టి కారణము, దాన్ని ఉపాదానము అంటారు)వివిధ పర్వత , నదీ , సముద్ర రూపమైన విచిత్రమగు ఈ సృష్టి పుట్టింది
ఆ పరమాత్మ జగత్తును ధరించవచ్చును.ధరించలేకపోవచ్చును. ఒకవేళ ధరించగలిగితే భగవంతుడే ధరించవచ్చును. ఇతరులు ధరించుటకు సమర్థులు కారు.
భూత భౌతికాత్మకమగు జగత్తుకు, ఎవరు అధిపతియో గొప్పదగు నిర్మలమైన స్వప్రకాశమందు,నిరతిశయ ఆనందములో ఏ పరమేశ్వరుడు కలడో, విశిష్ట స్వరూపమయిన ఆత్మయందు ఏ పరమేశ్వరుడు కలడో, అతడే ఈ సృష్టిని తెలుసుకొనుచున్నాడు
ఇతరులు తెలుసుకొనలేకున్నారు.సర్వజ్ఞుడగు ఈ శ్వరుడు తప్ప సృష్టి విషయము మరెవ్వరూ తెలుసుకొనలేరని భావము.
ఇంతటితో సాయణాచార్యులవారు రచించిన నాసదీయ సూక్త భాష్యానికి తెలుగు అనువాదం సమాప్తం.
మంగళమ్ మహత్
-సేకరణ




