30, జనవరి 2024, మంగళవారం

అరిచేతిలోనే

 *యత్రాస్థి భోగో న చ తత్ర మోక్షః*

*యత్రాస్థి మోక్షో న చ తత్ర భోగః*

*శ్రీ సుందరీసేవనతత్పరాణాం*

*భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ*


అర్థము:

*యత్ర అస్తి భోగః* = ఎక్కడైతే భోగములను అనుభవించుట ఉంటుందో...

*న చ తత్ర మోక్షః* = అక్కడ మోక్షము ఉండదు. 

*యత్ర అస్తి మోక్షః* = ఎక్కడైతే మోక్షము ఉంటుందో...

*న చ తత్ర భోగః* = అక్కడ భోగములు అనుభవించుట ఉండదు. 


కానీ....


*శ్రీ సుందరీ సేవన తత్పరాణాం* = అమ్మవారిని సేవించుకొనుటలోనే మునిగి ఉండే వారికి...

*భోగః చ మోక్షః చ* =భోగము, మోక్షము రెండూ కూడా....

*కరస్థ ఏవ* = అరిచేతిలోనే ఉంటాయి (అందుబాటులో ఉంటాయి. )

తా॥

ఎక్కడైతే భోగములను అనుభవించుట ఉంటుందో... అక్కడ మోక్షము ఉండదు. ఎక్కడైతే మోక్షము ఉంటుందో... అక్కడ భోగములు అనుభవించుట ఉండదు. కానీ....  అమ్మవారిని సేవించుకొనుటలోనే మునిగి ఉండే వారికి... భోగము, మోక్షము రెండూ కూడా.... అరిచేతిలోనే ఉంటాయి (అందుబాటులో ఉంటాయి.)

*~శ్రీశర్మద*

8333844664

సూక్తులు

 🌸🪷 *~సూక్తులు~* 🪷🌸


శ్లో𝕝𝕝 

*స్పృశన్నపి గజో హన్తి*

*జిఘ్రన్నపి భుజఙ్గమః।*

*హసన్నపి నృపో హన్తి*

*మానయన్నపి దుర్జనః॥*


తా𝕝𝕝 ఏనుగు స్పృశిస్తున్నట్లుగా కనబడుతూనే చంపును....

సర్పము వాసన చూస్తున్నట్లుగా కనబడుతూనే కాటు వేయును....

రాజు నవ్వుతున్నట్లుగా నటిస్తూనే చంపును.....  దుర్జనుడు గౌరవిస్తున్నట్లుగా నటిస్తూ చంపును....

卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐


శ్లో|| 

*అభ్రచ్ఛాయా ఖలప్రీతిః*

*సిద్ధమన్నఞ్చ యోషితః।*

*కిఞ్చిత్కాలోపభోగ్యాని*

*యౌవనాని ధనాని చ॥*


తా|| "మేఘముల నీడ, దుర్జనులతోడి మైత్రి, వండిన అన్నం, స్త్రీలు, యౌవనం, ధనం - ఇవన్నీ స్వల్పకాల భోగ్యాలు. స్థిరముగా ఉండవు.

卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐

అదే 'బ్రహ్మ

 శ్లోకం:☝️

*యన్మనసా న మనుతే*

  *యేనాహుర్మనో మతమ్ ।*

*తదేవ బ్రహ్మ త్వం విద్ధి*

  *నేదం యదిదముపాసతే ॥*

  - కేనోపనిషద్ 1.5


భావం: ఏది మనస్సుతో ఆలోచించదో, అసలు దేనివలన మనస్సు ఆలోచించ కలుగుతోందో, అదే 'బ్రహ్మ'మని నీవు తెలుసుకొనుము. అంతేగాని ఇక్కడ నరులు ఉపాసించేది (బ్రహ్మము) కాదు.🙏

సంకల్పము

 *శుభోదయం*

**********

సంధ్యా వందన

 మరియు ఇతర 

పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.30.01.2024 

మంగళ వారం (భౌమ వాసరే) 

 **********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

హేమంతృతౌ

పౌష్య మాసే కృష్ణ పక్షే 

పంచమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భౌమ వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

*ఇతర పూజలకు*

 శ్రీ శోభకృత్  నామ సంవత్సరే ఉత్తరాయణే

హేమంతృతౌ పౌష్య మాసే  కృష్ణ పక్షే

పంచమ్యాం

భౌమ వాసరే అని చెప్పుకోవాలి.

*ఇతర ఉపయుక్త విషయాలు*

సూ.ఉ.6.37

సూ.అ.5.51

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం*. 

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం* 

*ఉత్తరాయణ పుణ్యకాలం శరత్ ఋతువు*

*పుష్య మాసం* 

*కృష్ణ పక్షం పంచమి పూర్తి*. 

*మంగళ వారం*. 

*నక్షత్రం ఉత్తర రా. 7.49 వరకు.* 

అమృతం ప.11.50 ల 1.36 వరకు. 

దుర్ముహూర్తం ఉ.8.51 ల 9.36 వరకు. 

దుర్ముహూర్తం రా.10.57 ల 11.48 వరకు. 

వర్జ్యం రా.తె.5.04 ల మరునాడు ఉ.6.50 వరకు. 

యోగం అతిగండ ప.9.15 వరకు. 

కరణం కౌలవ సా. 7.19 వరకు.   

కరణం తైతుల మరునాడు ఉ. 8.20 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా. 3.00 ల 4.30 వరకు. 

గుళిక కాలం మ. 12.00 ల 1.30 వరకు. 

యమగండ కాలం ఉ. 9.00 ల 10.30 వరకు. 

---////----////---////---////---

పుణ్యతిధి పుష్య బహుళ పంచమి. 

************

*బ్రాహ్మణ వధూవరుల వివరాలకై సంప్రదించండి*:-

/\//\\//\\//\\///\\//\\//\\//\\//\\//\\//\\/\\_ 

*శ్రీ పద్మావతి శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*, 

(రి.జి.నెం.556/2013)

S2 - C 92, 6 - 3 -1599/92,

సచివాలయనగర్,వనస్థలిపురం,

హైదరాబాద్ 500 070.

ఫోన్(చరవాణి) నెం.

*8019566579/9848751577*

****

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

.

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

**తృతీయ స్కంధము*


*కటి విరాజిత పీత కౌశేయ శాటితో; వితత కాంచీగుణ ద్యుతి నటింప*

*ఆలంబి కంఠహారావళి ప్రభలతోఁ; గౌస్తుభ రోచులు గ్రందు కొనఁగ*

*నిజ కాంతి జిత తటిద్ర్జ కర్ణకుండల; రుచులు గండద్యుతుల్ ప్రోదిసేయ*

*మహనీయ నవ రత్నమయ కిరీటప్రభా; నిచయంబు దిక్కుల నిండఁ బర్వ*


నడుముమీద మెరిసిపోతున్న పట్టుపీతాంబరం మీద మొలత్రాడు దీప్తి చిందులు త్రొక్కుతున్నది. చాలా పొడవుగా వ్రేలాడుతున్న హారాల కాంతులను కౌస్తుభమణి కాంతులు మించిపోతున్నాయి. తన కాంతులనే మెరపుల గుంపులను జయించిన చెవులకు ఆభరణాలైన కుండలాల కాంతులను చెక్కిళ్ళ వెలుగులు మరింత పెంపొందిస్తున్నాయి. చాలా గొప్పవి అయిన తొమ్మిది రకాల రత్నాలు పొదిగిన కిరీటం ప్రభలు దిక్కులందంతటా వ్యాపిస్తున్నాయి. విలాసంగా ఆస్వామి తన పాదాలదగ్గర ఉన్న గరుత్మంతుడి భుజంమీద ఎడమ చేతిని ఉంచాడు. ఆ చేతికున్న వలయాలు, కంకణాలు, కేయూరాలూ వెలుగులను వెదజల్లు తున్నాయి. రెండవ చేతితో ఒక సుందరమైన పద్మాన్ని విలాసంగా త్రిప్పుతూ ప్రకాశిస్తున్నాడు ఆ స్వామి.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం  - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం  -‌ చతుర్థి -  ఉత్తరాఫల్గుణి -‌ భౌమ వాసరే* *(30-01-2024)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/Oo3QyZyrfB4?si=kbnwobcgldzCRGIt


🙏🙏

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*30-01-2024 / మంగళవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టె విషయంలో జాగ్రత్త అవసరం.  సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి.ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.

---------------------------------------

వృషభం


ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది . వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మాతృ వర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి.  ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి.

---------------------------------------

మిధునం


సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధు వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున పురోగతి సాధిస్తారు.

---------------------------------------

కర్కాటకం


దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలు సామాన్యం సాగుతాయి. ఆర్థిక పరంగా స్వల్ప ఇబ్బందులు తప్పవు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

---------------------------------------

సింహం


ఉద్యోగులకు పని ఒత్తిడి  నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి.

---------------------------------------

కన్య


 ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు.  నూతన ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

---------------------------------------

తుల


సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి.

---------------------------------------

వృశ్చికం


నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి అవరోధాలు తొలగుతాయి. ఆప్తుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూరపు బంధువులు ఆగమనం కలిగిస్తుంది. 

---------------------------------------

ధనస్సు


భూవివాదాలు పరిష్కారమౌతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ప్రయాణాలు వీలైనంత వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------

మకరం


వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాత మిత్రులను  కలుసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

కుంభం


నూతన వాహనయోగం ఉన్నది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.

---------------------------------------

మీనం


కుటుంబ సభ్యులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటాబయట ప్రోత్సాహకార వాతావరణం ఉంటుంది.  ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

క్రుంగిపోనివాడికి

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 శ్లో𝕝𝕝 *విపత్తిష్వవ్యథో దక్షో*

         *నిత్యముత్థానవాన్నరః*|

         *అప్రమత్తో వినీతాత్మా* 

         *నిత్య భద్రాణి పశ్యతి*||


తా𝕝𝕝 "*ఆపత్కాలంలో క్రుంగిపోనివాడికి, కార్యనిర్వహణలో నేర్పు కలవాడికి, అప్రమత్తంగా మెలిగేవాడికి, వినయవిధేయతలు కలవాడికి ఎల్లప్పుడు శుభాలే చేకూరతాయి*"....

29, జనవరి 2024, సోమవారం

హిందువులకు

 



హిందూ సనాతన ధర్మ విశిష్టత కోసం ప్రతి ఒక్కరికి తెలిసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా ఏడాది పొడవునా కనీసం 15 పుణ్యక్షేత్రాలకు దర్శించిన వారికి వారు ఖర్చు చేసిన ప్రతి రూపాయి వారికి తిరిగి ఇచ్చే విధంగా ఈ పధకం హిందువులకు ఉపయోగపడుతుంది


దయచేసి ప్రతి ఒకరు మన పేజిని లైక్ చేసి మాకు సపోర్ట్ గా నిలవండి :)🙏🙏🚩🚩🚩

హిందూ బంధువులకు

 సమస్త హిందూ బంధువులకు ఒక సూచన ! మనం ఒక విచిత్రమైన తప్పిదం చాలా కాలంగా చేస్తున్నాం .ఒకసారి కుటుంబ సమేతంగా తిరుపతి, శ్రీ శైలం, కనక దుర్గమ్మ ఆలయాలు దర్షించాక మళ్లీ మళ్లీ అవే ఆలయాలకు 15/20/25 వేలు ఖర్చులు పెట్టి, క్యూ లలో నిల్చుని, రూం.లు దొరకక, చంటి పిల్లలతో అవస్థలు పడి, 300/1000 రూ టిక్కెట్లు పెట్టీ వెళుతుంటే ప్రభుత్వాలు ఆ సొమ్ము ఇతర వర్గాలకు మళ్లిస్తున్నారు. అదే వెంకన్న, మల్లన్న, దుర్గమ్మ గుడులు మన వూళ్ళో ఉన్నా బాగు చేయడానికి మనసు రాదు.

మరి మనం ఇదే ఖర్చులో పావలా వంతు మన ఊరి గుడికి ఖర్చు పెట్టుకుంటే ఏ అలసట లేకుండా ,దర్శనం,ప్రసాదం, ఆశీర్వాదం లభిస్తాయి. పేద పూజారి కడుపు నిండుతుంది. కొంత సొమ్ము మీ దగ్గర లోని గోషాలలకు ఇస్తే గోమాతల కడుపు నిండి ఆశీర్వాదం,పుణ్యం లభిస్తాయి . కొన్నాళ్ళకు ప్రభుత్వాలు గుడులపై పెత్తనం వదులుకుంటారు. ఇది సాధ్యమే ! తిరుపతి వెంకన్న ,మనగుడిలో వెంకన్న ఒకరే కదా !! ఆలోచించండి ,అర్థం చేసుకోండి !!

పది మందికీ ఇదే విషయం చెప్పి మీ గుడి, మీ వూరు,మీ గోవులను కాపాడుకోండి !జై శ్రీ రామ్!!!

అన్నం విలువ

 *అన్నం విలువ*

🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚

ఒక స్కూల్లో చిన్న పిల్లవాడు భోజన సమయంలో తన మిత్రులతో పాటు

తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినేవాడు. ఆ అబ్బాయి తాను తెచ్చుకున్న అన్నాన్ని ఒక్క మెతుకు కూడా క్రింద పడకుండా, పదార్థాలను వృధా చేయకుండా తినేవాడు. అతని స్నేహితుల్లో చాలా మంది ఇంటి నుండి తెచ్చుకున్న అన్నాన్ని సరిగ్గ తినకుండా, క్రింద పైన వేసుకుంటూ తినేవారు. మరికొందరైతే గొడవపడుతూ కోపంతో ఆహారాన్ని విసిరిపారేస్తుంటారు. కానీ ఈ అబ్బాయి మాత్రం ఒక్క మెతుకు కూడా పారేయకుండా తినేవాడు.

ఒకవేళ తాను తెచ్చుకున్న బాక్స్ కు ఎక్కడైనా రెండు మెతుకులు అతుక్కుని ఉన్నాకూడా వాటిని కూడా తినేవాడు. అది చూసి మిగతా పిల్లలు ఈ అబ్బాయిని

ఎగతాళి చేసేవారు. " అరే! వీడొక తిండిపోతు రా! ఒక్కమెతుకుకూడా

వదలకుండా తింటాడు"అని ఎగతాళి చేసినా ఈ అబ్బాయి పట్టించుకునేవాడు కాదు. ఈ అబ్బాయి స్నేహితుడు ఇవన్నీ రోజూ గమనిస్తూ ఉండేవాడు, ఒకరోజు తన మిత్రున్ని ఇలా అడిగాడు.

"నువ్వు ప్రతిరోజూ ఇలా నీవు తెచ్చుకున్న ఆహారాన్ని వృధా చేయకుండా ఇంత చక్కగా తింటున్నావు కదా! మిగతావాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తున్నా నీకు బాధ అనిపించదా? " దానికి ఈ అబ్బాయి ఇలా సమాధానం ఇచ్చాడు.


"ఏదో వారికి తెలియకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకేం బాధలేదు.

ఇక నేను అలా తినడానికి కారణం చెప్పనా? అలా తినడం అన్నది

నా తల్లిదండ్రులకు నేను ఇచ్చే మర్యాదకు చిహ్నం.

అమ్మ ఉదయాన్నే లేచి నాకు ఇష్టమైన పదార్థాలను అడిగి వండి ప్రేమతో బాక్స్ లో పెట్టి పంపిస్తుంది,

వండటానికి కావలసిన వస్తువులను నాన్న ఎంతో కష్టపడి పనిచేసి ఆ సంపాదనతో సాయంత్రానికి తెస్తాడు.

ఇద్దరి ప్రేమతో పాటు వారి కష్టంకూడా నా భోజనంలో ఉంది.

అలాంటప్పుడు నేను ఒక్క మెతుకును వృధా చేసినా వారికి అగౌరవ పరచినట్లే!

అంతేకాదు ఒక రైతు తన చెమటను చిందించి పంటను పండిస్తాడు.

అతన్ని కూడా నేను అవమానపరిచినట్లే కదా!

అందుకే నేను ఎవరు

నవ్వుకున్నా ఒక్క మెతుకును కూడా వృధా చేయను

అంతేకాదు ఎంతోమందికి రెండుపూటలా కడుపునిండా అన్నం దొరకడం లేదు. నాకు దొరికింది.

నా తల్లిదండ్రుల పుణ్యమా అని, అమ్మ ఎప్పుడూ చెపుతుంది. ఆహారాన్ని వృధా చేయకూడదని "

అని చాలా చక్కగా చెప్పాడు.

ప్రతి ఉపాధ్యాయుడూ, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటివి చెప్పి వారిలో ఆలోచనా విధానంలో మార్పుతేవలసిన అవసరం ఎంతైనా ఉంది.


అన్నం పరబ్రహ్మ స్వరూపం.

Panchang

  


గొప్ప సంస్కృతి

 ఎంత గొప్ప సంస్కృతి మనది!🙏🏵️🙏🚩


*దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రతో కలసి... సకుటుంబ సపరివారంగా, బంధు మిత్రుల సమేతంగా బయలుదేరి జనక మహారాజు గారి ద్వారం వద్దకు వెళ్తాడు.*


*అప్పుడు జనక మహారాజు తాను స్వయంగా ఎదురు వెళ్లి సాంప్రదాయ పద్ధతిలో వారి వివాహ శోభాయాత్రకు సాదరపూర్వక స్వాగతం చెబుతాడు.*


*అప్పుడు వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్లి జనక మహారాజుకు పాదాభివందనం చేస్తాడు.*


*అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేపి సంతోషంతో కౌగలించుకొని... “రాజా! మీరు పెద్దవారు. పైగా వరుని పక్షంవారు. ఇలా మీరు నాకు పాదాభివందనం చేయడం ఏమిటి?” గంగానది వెనక్కు ప్రవహించడం లేదు కదా అని అంటాడు.*


*అప్పుడు దశరథ మహారాజు అద్భుతమైన, సుందరమైన జవాబు చెబుతాడు...*


*”మహారాజా! మీరు దాతలు... కన్యాదానం చేస్తున్నారు... నేనైతే యాచకుణ్ణి... మీ ద్వారా కన్యను పొందాలని వచ్చాను... ఇప్పుడు చెప్పండి. దాత మరియు యాచకులలో ఎవరు పెద్ద?ఎవరు గొప్ప?” అని అంటాడు.*


*ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళల్లోంచి ఆనందబాష్పాలు రాలుస్తూ ఇలా అంటాడు... ”ఏ గృహంలో అయితే కూతుళ్లు ఉంటారో... వాళ్ళు భాగ్యవంతులు. ప్రతీ కూతురి అదృష్టంలో తండ్రి తప్పక ఉంటాడు.”*


*ఇదీ ఘనమైన మన భారతీయత..!*   


*ఇదీ మహోత్కృష్ఠమైన మన సంస్కృతి..!* 


*ఇదీ రామాయణం నీతి..!*  

.

అమృతం త్రాగి

 అమృతం త్రాగి

భూమి మీదకు

ఎవరు రాలేదు


మహారాజు కూడ

మరణం పొందినాడు


ఒకడు చరిత్ర సృష్టించి

పోయినాడు


మరొకడు చరిత్రహీనుడై

మరణించినాడు


మంచిపనులు చేసి

నరలోకంలో

దేవుడు అయ్యాడు


చెడుపనులు చేసి

రాక్షసుడు అయ్యాడు


సమయం వస్తే అందరు

భౌతికదేహం వదిలి

పైకి పోతారు


అహంకారం వదిలేద్దాం

అవివేకం వదిలేద్దాం

మంచి ప్రజలను

ప్రతిభావంతులను

ప్రోత్సహిస్తు

ముందుకు పోదాం


⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡


అమృతం పీత్వా 

 కో2పి భూమౌ 

 న ఆగతవాన్


మహారాజః అపి

మరణం ప్రాప్తవాన్ 


కశ్చన చరిత్రం సృష్ట్వా

గతవాన్


కశ్చన చరిత్రహీనః భూత్వా

మృతవాన్


సాధుకార్యాణి కృత్వా

నరలోకే దేవః అభవత్


అసాధుకార్యాణి సమాచర్య

నరలోకే దైత్యః అభవత్


సమయమ్ ఆగచ్ఛతి చేత్

సర్వే భౌతికదేహం త్యక్త్వా

ఉపరి గచ్ఛంతి ఏవ


అహంకారం త్యజేమ

అవివేకం విసర్జయేమ

సజ్జనాన్ సత్పురుషాన్

ప్రతిభావతః జనాన్

సదా ప్రోత్సాహయన్తః

అగ్రే గచ్ఛేమ

గోవు వెనక వెళ్ళడమెందుకు

 🙏 శ్రీ గురుభ్యోనమః 🙏


🕉️గోవు వెనక వెళ్ళడమెందుకు?🕉️


పరమాచార్య స్వామివారు విజయయాత్రలలో భాగంగా, వివిధ ప్రాంతాలలో నివసిస్తుండేవారు. అలాంటి సమయాలలో కొందరు భక్తులు, తమ ఇళ్ళకు రమ్మనో లేదా అక్కడి దేవాలయాలకు రమ్మనో అభ్యర్తిస్తుంటారు.


భక్తులు రమ్మని ప్రార్తిస్తున్నది దేవాలయానికే అయితే పరమాచార్య స్వామివారు దాదాపుగా వారి అభ్యర్థనను మన్నించి అక్కడకు వెళ్లి, దేవాలి దర్శనం చేసుకుని, దగ్గరలోని ఒక స్థలంలో మకాం చేసి, కొద్దిసేపో లేదంటే ఒకరోజో అక్కడ ఉంది భక్తులకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తుంటారు. కొన్నిసార్లు ఏదైనా ఉపన్యాసం కాని లేదా సామాన్య విషయాలు చర్చించడం కాని జరుగుతూ ఉంటాయి.


ఒకసారి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తం విజయయాత్ర చేస్తున్నారు. యాత్రలో భాగంగా తిరుచిరాపల్లిలో కొన్నిరోజుల పటు మకాం చేశారు. ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు.

ఆ భక్తజన సమూహంలో తిరుచ్చిలోని ఒక కళాశాల ప్రధానాచార్యులు కూడా ఉన్నారు. వరుసలో అతని వంతు రాగానే మహాస్వామివారికి నమస్కరించి, ఎన్నోరకాల పళ్ళు పూలు సమర్పించాడు. మహాస్వామివారి దివ్యపాదములు తన కళాశాలను తాకాలని, విద్యార్ధులని అనుగ్రహించాలని ప్రార్థించాడు.


కాని మహాస్వామివారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అతని ప్రార్థనకు మౌనమే స్వామివారి సమాధానం అయ్యింది. అతను మాత్రం రోజూ వచ్చి స్వామివారిని అర్థించేవాడు.


చివరగా ఒకరోజు కరుణాసాగరులైన మహాస్వామివారు అతనిపై తమ దయను ప్రసరింపజేశారు. పటికబెల్లం, కుంకుమ ప్రసాదం ఇస్తూ, స్వామివారు అతనితో, “రేపు ఉదయం మీ కళాశాలకు వస్తాను. ఒక ఆవు, దూడతో నీవు నీ భార్య సిద్ధంగా ఉండండి” అని ఆజ్ఞాపించారు.


ఆ భక్తుని సంతోషానికి అవధులు లేవు. “ఖచ్చితంగా అలాగే చేస్తాను పెరియవా” అని మహదానందంతో వెళ్ళిపోయాడు.


చెప్పినట్టుగానే ఉదయం స్వామివారు కళాశాలకు వెళ్ళారు. అతను ఆవు, దూడ, పూర్ణకుంభంతో సహా స్వామివారికోసం ఎదురుచూస్తున్నాడు. మహాస్వామివారి పూర్ణకుంభాన్ని స్వీకరించి, కళాశాల ద్వారం వద్దకు వచ్చి నిలబడ్డారు.


స్వామివారు ఆ భక్తునితో, “నువ్వు ఎక్కడేక్కడైతే నేను రావాలి అనుకుంటున్నావో, అక్కడకు నువ్వు ఆవు, దూడను ముందు తీసుకుని వెళ్ళు, నేను అనుగమిస్తాను” అని తెలిపారు.


స్వామివారి ఆదేశం ప్రకారం అతను భార్యతో కలిసి ఆవు దూడను ముందు తీసుకుని వెళ్తూ ఉంటె స్వామివారు ఆవు వెనుకగా వస్తున్నారు. మొత్తం కలియతిరిగిన తరువాత స్వామివారు ఆ భక్తునితో, “సంతృప్తిగా ఉందా?” అని అడుగగా, అతను తనకు కలిగిన ఆనందాన్ని మాటలలో చెప్పడం కుదరక, కళ్ళ నీరు కారుస్తూ, హృదయం ఉప్పొంగి, తనకు స్వామివారు కలిగించిన అదృష్టానికి, వారి దయకు కృతజ్ఞతగా నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. 


తమ వసతికి తిరిగొచ్చిన స్వామివారు సాయింత్రం భక్తులతో మాట్లాడుతూ, ఉదయం తాము కళాశాలకు వెళ్లోచ్చిన విషయం ప్రస్తావనకు రావడంతో ఒక వ్యక్తి స్వామివారిని, “పెరియవా, కళాశాలో మీరు ఆవు వెనుకగా ఎందుకు వెళ్ళారు?” అని అడిగాడు.


స్వామివారు చిరునవ్వుతూ, “అతను నాపై అత్యంత భక్తిభావం కలవాడు. నేను వస్తే అది కళాశాలకు మంచి అని నమ్మి నన్ను ఆహ్వానించాడు. కాని అది ఆడపిల్లలు చదివే కళాశాల. వారు అన్ని రోజులలోను కళాశాలకు వస్తారు. వారు దూరం ఉండాల్సిన సమయాలలో కూడా కళాశాలకు వస్తారు. అందుకే నేను ఒక ఆలోచన చేశాను. అతని కోరికను తీర్చాలి. నా అనుష్టానం, నియమపాలన కూడా కాపాడబడాలి. దానికి పరిష్కారం ఒక్కటే. మన శాస్త్రాలలో ఉన్నదాని ప్రకారం, ఎటువంటి అశౌచమైనా, ఎటువంటి స్థలమైనా గోవు డెక్కల నుండి వచ్చే ధూళి తగిలితే, ఆ స్థలం పవిత్రమవుతుంది. అందుకే ఆవును ముందు వదిలి నేను దాన్ని అనుసరించాను” అని బదులిచ్చారు.


స్వామివారు చెప్పిన విషయాన్ని విన్నవారందరూ స్థాణువులై నిలబడిపోయారు. ఇంతటి ధర్మసూక్ష్మము ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ధర్మాన్ని, ఆశ్రమ నియమ పాలనను ఇంతగా పాటించే జీవితం ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ఇలా దయను కూడా ధర్మంతో ముడిపెట్టి పాలించేవారు కంచి పరమాచార్య స్వామివారు కాక ఇంక ఎవరు ఉంటారు?


🌹👏🌹

జయ జయ శంకర

హర హర శంకర

🌹👏🌹


అపార కరుణాసింధుం 

జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం

ప్రణమామి ముదావహం