21, మార్చి 2024, గురువారం

భగవద్గీత

 యువతకు భగవద్గీత ఏ విధంగా ఉపయోగపడుతుంది?


భగవద్గీత జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ప్రధానంగా గోచరించే విషయం 1.ఇన్ద్రియ నిగ్రహం 2 స్వధర్మాచరణ 3. హృదయదౌర్బల్యమును విడనాడుట!


క్లైభ్యం మాస్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే।

క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప।।(2/3)


క్లైభ్యమనగా చేతకానితనం మరియు పిరికితనము! ఇది హృదయదౌర్బల్యమును కలిగించును. హృదయదౌర్బల్యమనగా (Depression). ఇది క్షుద్రము అనగా పరమ నీచమైనది!

కనుక ఈ నీచమైన హృదయదౌర్బల్యమైన పిరికితనమును వదిలి కర్తవ్యోన్ముఖుడవు కమ్ము!


‘స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి’(2/31)


స్వధర్మాచరణమున చలింపరాదు!


‘స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః(3/35)


ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా, లోపాలతో కూడి ఉన్నా సరే, తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము. పరధర్మాచరణ మిక్కిలి భయంకరమైనది! 


పైన చెప్పిన మూడు శ్లోకాలను పరిశీలిద్దాం!



పైన చెప్పిన మూడు విషయాలు నేటి యువతకు మరీ ప్రత్యేకించి విద్యార్ధులకు వర్తిస్తాయి! నేటి యువత ప్రతీ చిన్న విషయానికి హృదయదౌర్బల్యమునకు (depression and mental imbalance) లోనవుతున్నారు! మరి ఇది పూర్వపు రోజులలో లేదా? అంటే లేదనే చెప్పవచ్చు! పూర్వం గురుకులాలలో విద్యనభ్యసించేవారు! అక్కడ విద్యార్ధి కొన్ని కఠిన నియమములకు లోబడి ఇన్ద్రియనిగ్రహంతో ఉండేవారు! ఉదాహరణకు, తెల్లవారుఝామున బ్రాహ్మీముహుర్తాన లేవడం, గురు శుశ్రూష చేసి విద్యను అభ్యసించడం, గురువుగారి ఆజ్ఞ అయిన తరువాతనే భుజించడం వగైరా క్రమశిక్షణతో మెసలుకొనోవారు! గురుసేవ మరియు విద్యనభ్యసించడమనే విద్యార్థియొక్క స్వధర్మమును పాటించేవారు. వారికి మిగిలిన విషయాలపై దృష్టి ఉండేదికాదు! అలాగుననే, మొదటి ర్యాంకే రావాలని తల్లిదండ్రుల ఒత్తిడి ఉండేదికాదు! అటువంటి ఒత్తిడి లేని వాతావరణంలో మనస్సు దౌర్భల్యమునకు లోనవదు! కనుక వారు నియమములతో కూడిన క్రమశిక్షణతో ప్రశాంతంగా విద్యనభ్యసించేవారు! వారివారి బుద్ధి పరిణితినిబట్టి కొందరు వేగం మరికొందరు కాస్త ఆలస్యంగా మొత్తం విద్యనభ్యసించి వారు సమాజానికి చాలా ఉపయోగపడేవారు! 


మరి నేటి యువత? చదువుకునే విద్యార్థికి దేశ రాజకీయాలతో ఏం పని? ఉదాహరణ ఢిల్లీ యూనివర్శిటీ ఘఠనలు! రాజకీయం వారి స్వధర్మం కాదు! పరధర్మము ఎప్పుడూ భయానకమేయని గీతాబోధ! అదే ప్రస్తుతం జరుగుతోంది! విద్యార్థులలో నియమములు లేవు, ఇన్ద్రియనిగ్రహణ లేదు, క్రమశిక్షణ లేదు, గురువుల పట్ట గౌరవంలేదు. మీదుమిక్కిలి, పరస్పర లింగాకర్షణ! ఆ ఆకర్షణకు ప్రేమయని పేరు! అది సఫలీకృతమైనా కాకపోయినా విద్యార్థి లక్ష్యం దెబ్బతినడం తప్పదు! ఇది వికటిస్తే, ఇన్ద్రియనిగ్రహణ లేకపోవడం వలన హృదయదౌర్భల్యమునకు లోనయి, అయితే ఎదుటివారిని హింసించడం లేక తాను పిరికివాడయితే (క్లైభ్యం) ఆత్మహత్య చేసుకోవడం మనం రోజూ చూస్తున్నాము! ఇటువంటి వారు సమాజానికి ఎలా మేలు చెయ్యగలరు? 

అయితే, మనం మరల గురుకులాల వ్యవస్థకు వెళ్లగలమా? సాధ్యం కాదు! కనుక, మన పాఠ్యాంశాలలో గీత, రామాయణ, భారతంలోని ప్రధానమైన విషయాలను  బోధించాలి! రామాయణం వలన కుటుంబవ్యవస్థ, సౌభ్రాతృత్వం, మంచి నడవడిక అబ్బుతాయి. భారతం వలన సమాజంలో మన చుట్టూయున్నవారితో ఏ రకంగా మెసలుకోవాలో తెలుస్తుంది. గీత వలన ఇన్ద్రియనిగ్రహము, స్వధర్మాచరణ తెలిసి ప్రతి చిన్నవిషయానికి ఉద్వేగానికి లోనవకుండా, మరియొకరికి హాని తలపెట్టకుండాయుండడం తెలుస్తుంది! 


కనుక నేటి యువత భగవద్గీతను అధ్యయనం చేయడం వలన, ఇటువంటి బలహీనతలకు లోనవకుండా తనను తాను ఉద్ధరించుకుంటూ, మెరుగైన సమాజాన్ని తయారు చేయగలదు!

వరాలైన శాపాలు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*వరాలైన శాపాలు -- చందమామ కథలు* 


ఒక గ్రామంలో నారాయణ అనే పేద వ్యవసాయదారు ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడే కాని, అతనికంటూ సొంతంగా కుంటెడు పొలం కూడా లేదు. అందువల్ల ఇతరుల పొలాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి జీవించేవాడు. అతనికి రెండు తీరని కోరికలుండేవి. ఒకటి దేశాటన చెయ్యటం; రెండోది రుచికరమైన రాజభోజనం తినాలని. అయితే అవి అతని వంటి పేదరైతుకు తీరే కోరికలు కావు. కనీసం రాజధానిలో జరిగే వసంతోత్సవాలైనా చూడాలని నారాయణ ఒక సంవత్సరం, తన స్నేహితుడైన మాధవుడితో కలిసి, రాజధానికి బయలుదేరాడు. వాళ్ళు పగలల్లా ప్రయాణం చేసి, చీకటి పడే సమయానికి అరణ్యం మధ్యలో చిక్కుకుపోయారు. ఆ రాత్రి తలదాచుకోవటానికి ఒక గుడి కనిపించింది. నారాయణ ఉత్సాహంతో, ఆ రాత్రి ఆ గుడిలో గడుపుదామన్నాడు. మాధవుడు తల అడ్డంగా ఊపుతూ, ‘‘ఇది చండముఖి అనే దేవత గుడి.

ఆ దేవత మహా ముక్కోపి. ఆమె పగలల్లా ఎక్కడెక్కడో సంచారం చేసి, ఝాముపొద్దుపోయేసరికి గుడికి తిరిగి వస్తుంది. ఆ సమయానికి గుడిలో ఎవడైనా కనిపిస్తే ఆగ్రహంతో వాణ్ణి శపిస్తుంది. అందుచేత రాత్రివేళ ఎవరూ గుడిలోకి అడుగు పెట్టరు,'' అన్నాడు. ‘‘దేవత ఆగ్రహిస్తే ఆగ్రహించనీ, నే నింక ఒక్క అడుగైనా ముందుకు రాలేను,'' అంటూ నారాయణ ఆవులించి, గుడిలోకి వెళ్ళాడు. మాధవుడు మరేం మాట్లాడకుండా ముందుకు సాగి పోయాడు. గుడిలో నడుమువాల్చిన మరుక్షణం నారాయణకు నిద్ర పట్టేసింది. కొంత రాత్రి గడిచినాక ఎవరో కొరడాతో కొట్టినట్టు తోచి, నారాయణ ఉలిక్కిపడి నిద్ర మేలుకున్నాడు. ఎదురుగా ఒక దేవత, ఎరట్రి కళ్ళతో, చేతిలో కొరడా పట్టుకుని నిలబడి ఉంది, ‘‘ఎవడ్రా నువ్వు? నా అనుమతి లేకుండా నా గుడిలో పడుకోవటానికి నీకెంత ధైర్యం!'' అన్నది పట్టరాని కోపంతో. నారాయణ ఆమెకు చేతులెత్తి భక్తితో నమస్కరించి, ‘‘తల్లీ, నే నొక పేద రైతును. వసంతోత్సవాలు చూడడానికి రాజధానికి పోతూ, అలసిపోయి, చీకటి పడేసరికి, ఇక్కడ విశ్రమించాను. నా వల్ల తప్పు జరిగితే క్షమించు,'' అన్నాడు. ‘‘నిన్ను క్షమించానంటే ఆ సంగతి తెలిసి జనం ఈ గుడిని చిటికెలో సత్రంగా మార్చేస్తారు. ఆ తరవాత నాకు శాంతి అన్నది కరువై పోతుంది. నిన్ను శపించి తీరాలి. అప్పుడే మానవులకు నేనంటే భయభక్తులు ఉంటాయి. నువ్వు రైతునంటున్నావు గనక, ఒక సంవత్సరంపాటు నీ చేతి నీరు తగిలిన ప్రతి మొక్కా చచ్చిపోవాలి! ఇకనైనా ఒళ్ళు దగ్గరపెట్టుకు బుద్ధికలిగి ఉండు," అని దేవత అదృశ్యమైపోయింది. వ్యవసాయం చేసుకుని బతికే తన బోటి వాడు సంవత్సరంపాటు వ్యవసాయం చెయ్యకుండా ఎలా బతకాలా అని విచారిస్తూ నారాయణ రాజధాని చేరాడు. ఆ యేడు వసంతోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. నారాయణ వాటిని తనివి తీరాచూసి ఆనందించాడు. దేశం అన్ని మూలల నుంచీ ఉత్సవాలకు వచ్చిన వ్యవసాయదార్లు రాజుగారితో తమ కష్ట సుఖాలు చెప్పుకున్నారు. అందరికీ దాపరించిన సమస్య ఒక చిత్రమైన కలుపుమొక్క. దాన్ని ఎన్నిసార్లు పీకినా నిర్మూలం కాక, పైరులన్నిటినీ పాడుచేస్తున్నది. ఈ సంగతి విని నారాయణ రాజుగారికి నమస్కరించి, ‘‘నాకు అవకాశం ఇస్తే ఒక్క ఏడాదిలో ఈ కలుపు మొక్కలను నామరూపాలు లేకుండా సమూలంగా నిర్మూలించగలను,'' అన్నాడు. రాజు మొదట అతడి కేసి అనుమానంగా చూశాడు. అయితే, ఆ తరవాత, అతని శక్తిని పరీక్షించి, అతనికి అలాటి శక్తి ఉన్నట్టు రూఢి చేసుకుని, అతనికి కావలసిన పరివారాన్ని ఇచ్చి, అతను కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు. నారాయణ తన పరివారంతో అన్ని గ్రామాలకూ వెళ్ళి, పైరు నాటేముందుగా పొలాలన్నిటికీ తన చేతిమీదుగా నీరు పెట్టాడు. దాంతో చేలో ఉన్న కలుపు మొక్కలన్నీ పూర్తిగా నశించిపోయాయి. ఈ విధంగా దేశాటన చేయాలి; రాజభోజనం తినాలి అన్న నారాయణ కోరికలు నెరవేరాయి. అతను ఒక్క ఏడాదిలో దేశమంతా పర్యటించి, గొప్ప సత్కారాలు పొందాడు. రాజుగారు అతనికి నూరు ఎకరాల భూమి ఇనాముగా ఇచ్చాడు. మరుసటి సంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు రాజధానికి పోతూ, చండముఖి ఆలయం దగ్గిరికి వచ్చేసరికి చీకటి పడటం చేత, ఆ ఆలయంలోనే విశ్రమించాడు. ఒక రాత్రివేళ దేవత ప్రత్యక్షమయింది. నారాయణ ఆమెకు నమస్కరించి, ‘‘తల్లీ, నీ శాపం వల్ల ఎంతో లోకోపకారం జరగటమేకాక, నా కోరికలన్నీ తీరాయి. దేశాటన చేసి, రాజభోజనం తిన్నాను,'' అన్నాడు. చండముఖి కళ్ళ నిప్పులు రాల్చుతూ, ‘‘మూర్ఖుడా, మళ్ళీ నన్ను కవ్వించటానికి వచ్చావా? ఈ సంవత్సరం నువ్వు నడిచిన మేర నిలువులోతు గొయ్యి పడుతుంది. నీకు ఎవరైనా పెట్టితేతప్ప తిండి ఉండదు. ఇదే నా శాపం,'' అని అంతర్థానమయింది. తాను కదలటానికి లేదని గ్రహించి, నారాయణ తెల్లవారినదాకా ఆ గుడిలోనే కూర్చుని, ఒక ఉపాయం ఆలోచించాడు. తెల్లవారగానే, ఆ దారినపోయే మనిషితో రాజుగారికి కబురుచేసి, ఒక పల్లకీ తెప్పించుకుని, అందులో వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని, తన శాపం గురించి వివరంగా చెప్పి, దానివల్ల లాభం పొందే ఒక పథకాన్ని రాజుగారికి సూచించాడు. అదేమంటే, రాజ్యంలో తవ్వవలసిన పంటకాలవలన్నీ ముగ్గులతో గుర్తుపెడితే, నారాయణ వాటి వెంట నడుచుకుంటూ పోతాడు. అతని వెనకనే నిలువులోతు కాలవలు వాటంతట అవే ఏర్పడతాయి. ఈ పథకం అమలుజరిగింది. నారాయణ కాలువల కోసం నడవనప్పుడు పల్లకీలో ప్రయాణం చేశాడు. అతను ఎక్కడ ఉన్నా రాజభోజనం బంగారు పాత్రలలో అతను ఉన్నచోటికి వచ్చింది. ఈ విధంగా నారాయణకు దేవత ఇచ్చిన రెండోశాపం వల్ల దేశానికి మరింత మేలు జరిగింది. ప్రయాస లేకుండా, అతి స్వల్పఖర్చుతో దేశమంతటా పంటకాలువలు ఏర్పడి, ఎంతో కొత్తభూమి సాగులోకి వచ్చింది. మూడోసంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు బయలుదేరి వెళుతూ, మళ్ళీ చండముఖి ఆలయంలోనే చీకటిపడే వేళకు చేరాడు. ఒక ఝాముపొద్దు పోయేసరికి దేవత వచ్చింది. నారాయణ చేతులు జోడించి ఆమెతో, ‘‘తల్లీ, నీ శాపాలు అమోఘం! నీ శాపంవల్ల మరొకసారి నాకు దేశాటనా, రాజభోజనమూ, లోకోపకారం చేసిన పుణ్యమూ లభించాయి. నువ్వు దయ ఉంచి ఇక మీదటనైనా శాపాలియ్యటం మానితే, ఇటుగా వెళుతూ రాత్రివేళ ఈ అడవిలో చిక్కుకుపోయిన మనుషులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. నీకు నిత్యమూ పూజలు జరిగేటట్టు ఏర్పాటు చేస్తాను,'' అన్నాడు. చండముఖి పట్టరాని కోపంతో, ‘‘మూర్ఖుడా, ఇప్పటికి రెండుసార్లు నా ఆజ్ఞ ధిక్కరించి నా గుడిలో ప్రవేశించావు. నా శాపాలను అవహేళన చేశావు. ఈసారి నీ దేశాటనా, లోకోపకారమూ ఎలా సాగుతాయో నేను చూస్తాను. నీ దృష్టిలో పడిన ఏ వస్తువైనా మరుక్షణమే భగ్గున మండి మసి అయిపోతుంది. నువ్వు బతికున్నన్నాళ్ళూ కళ్ళకు గంతలు కట్టుకుని, గుడ్డివాడిలా జీవించవలసిందే!'' అని శపించింది. నారాయణ చప్పున పై పంచ తీసి కళ్ళకు అడ్డంగా తలపాగా చుట్టుకుని, ఆ రాత్రంతా ఆలోచించి, తెల్లవారినాక తడుముకుంటూ గుడి బయటికి వచ్చి, తలపాగా విప్పి, ఒకసారి గుడికేసి చూశాడు. మరుక్షణం గుడి భగ్గున మండి బూడిదకుప్ప అయిపోయింది. దానితోనే నారాయణ శాపంకూడా పోయింది. తరవాత నారాయణ అక్కడ ఒక సత్రం కట్టించాడు. అది ప్రయాణీకులకు ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది.


సేకరణ:- వాట్సాప్ పోస్ట్.

శతరుద్రీయము

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

. *శతరుద్రీయము-16*

(వ్యాఖ్య: శ్రీ తురుమెళ్ళ మాధవ కుమార్)

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*ప్రథమానువాకము-14 వ ఋక్కు*


*నమకనామాని : ఓం అన్నానాంపతయే నమః*



ఋషి : భగవంతుడు 

దేవత. : భగవంతుడు 

ఛందస్సు: అనుష్టుప్పు


*నమస్తే అస్వాయుధాయానాతతాయ ధృష్ణవే!*

*ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే!!*


ఉపద్రవము తలపెట్టని రుద్రా నీకు నా నమస్కారము♪. నీ చేతి యందలి సమర్థమగు బాణములకూ, ధనుస్సునకూ, నీ బాహువులకూ నా నమస్కారము♪.


*వివరణ :* 


*అనాతతాయ : హానిచేయ తలపెట్టనటువంటిది.* 


రుద్రుని చేతియందలి ఆయుధమును "హేతి” గా సంబోధించారు ఇంతకు ముందర♪. దానిని మనం “ఆశ” అని అన్వయించుకున్నాము♪. ఈ ప్రపంచంలో చాలామంది భగవంతుని పేరు తలచేవాడిని పిచ్చివాడని అంచనావేస్తారు♪. సన్యాసులను ఎందుకూ పనికిరాని వారుగా తలుస్తారు♪. 


కానీ, ఎంతమంది నిజంగా అర్థం చేసుకుంటారు.... 


 “భక్తులు అంటే కోటానుకోట్ల జన్మల అనుభవాల ద్వారా జీవితాన్ని కాచి వడపోసి చివరకు కావలసినది ఏదో దానిని అర్థం చేసుకున్నవారనీ, వారి జన్మలు ఆఖరుజన్మలనీ, శాశ్వతమైన పదమును పొందిన ఆ భక్తాగ్రేసరులు మనము తిరిగే ఈ పిచ్చి ప్రపంచంలోకి రారనీ”..........


“నా కృష్ణునికి ఇదే ఇచ్ఛ అయితే అలాగే కానియ్యి” అంటూ మీరాబాయి విషం త్రాగింది♪. కృష్ణునిపై ఆమెకుగల అపారమైన నమ్మకంవల్ల విషం ఆమెను ఏమీ చేయలేకపోయింది♪. 


ప్రహ్లాదుడు తండ్రి ద్వారా పడ్డ కష్టాలు పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటారు♪. ఆ భక్తాగ్రేసరునికి శ్రీహరి పైనున్న కాంక్ష ఈ కష్టాలను గుర్తించకుండా చేసింది♪.


భగవంతునిపై కోపం తెచ్చుకొనేవాళ్ళు కూడా వుంటారు♪. నాకు తెలిసిన ఒక కుటుంబంలో వెంకటేశ్వరునికి పూజ చేయరు♪. ఎందుకో అని అడిగితే వాళ్లు తిరుపతికి వెళ్లినప్పుడు రోడ్డుప్రమాదంలో వాళ్ల తండ్రిగారు పోయారట, అందుకని వీళ్లు వెంకటేశ్వరుని పూజించడం మానేశారు♪. సరే వారినమ్మకం వారిది♪. 


ఇలాగే, చాలా మంది భగవంతునిపై అపోహలు పెట్టుకుంటూంటారు♪. ఇటువంటి వారికోసమే ఇక్కడ *“అనాతతాయ”* అంటూ భగవంతుని పైన కాంక్ష హానిచేయనటువంటిది అని చెప్పబడింది♪.


*అనన్యాశ్చింతయంతో మాం*

*యేజనాః పర్యుపాసతే!*

*తేషాం నిత్యాభియుక్తానాం* 

*యోగక్షేమం వహామ్యహమ్ ||*

                            (భగవద్గీత, 9-22)


భగవద్గీతలో అర్జునునికి ఇవ్వబడ్డ హామీ మనందరికీ వర్తిస్తుంది♪. భగవంతుని ద్వేషించి నాశనమైన చరిత్రలు ఎన్నెన్నో చూశాముగానీ, ఆ స్వామిని ఆశించి ఆశాభంగం పొందిన వారెవరూ లేరు♪. 


భగవద్గీతలో “నా భక్తుడు యెన్నటికీ నాశనం పొందడు (న మే భక్తః ప్రణశ్యతి)” అంటూ చెప్పారు♪. ఈ విషయాన్ని నిజంచేసిన గాథలు ఎన్నెన్నో♪. మన దురదృష్టం ఏమిటంటే భగవంతునితోటి బేరసారాలు నడుపుతాము♪. 


వెలుతురు ఎక్కడవుంటుందో చీకటి అక్కడే వుంది, సుఖం ఎప్పుడైతే అనుభవిస్తున్నామో దానిని వెంబడించే దుఃఖమూ వుంటుంది♪. ఇవన్నీ ద్వంద్వాలు అనబడతాయి♪.


భగవంతుని దగ్గరకు వెళ్లి అన్యమైనది కోరుకుంటే కోరుకున్నది దొరుకుతుంది కానీ, ద్వంద్వ సూత్రం ఇక్కడ వర్తిస్తుంది♪. అనన్యమైన కోరిక వున్నవానికి అది యెటువంటి హానీ కలుగచేయదు♪. కాబట్టి, అటువంటి దానికి ఇక్కడ సాధకుడు శిరస్సువంచి నమస్కరిస్తున్నాడు♪.


*బాహుభ్యాం నమః :*


భగవంతుని చూడాలన్న ఆశ ఎవరికి వుండదు? అందరికీ వుంటుంది♪. కానీ ఆయన దర్శనం చేసుకోవాలనో లేదా ఆయనను చేరుకోవాలనో ఖచ్చితమైన లక్ష్యంతోటి ఎవరో కోటిమందిలో ఒక్కరు ప్రయత్నం చేస్తారు♪. వారిలోగూడా ఎవరో ఒక్కరు ఆయనను యధార్థం (తత్త్వం) గా తెలుసుకుంటారు♪. దానికి కారణం తెలుసుకోవడం అవసరం♪. 


విశ్వామిత్రుడు నాలుగువేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు, చివరకు మేనక ఎదురుగా వచ్చి నాట్యంచెయ్యగానే మైమరచి తపస్సువదిలి సంసారంలో పడ్డాడు♪. అంటే ఆయన ఆకర్షణకు లోబడినట్లుగా మనకు పురాణం చెబుతుంది♪.


అదే శివపురాణం చూడండి. జగన్మాత ఆ శివుడిని పెళ్ళి చేసుకుంటానని భీకరమైన ప్రతిజ్ఞ చేస్తుంది♪. తపస్సు చేస్తూ శరీరాన్ని కృశింపజేస్తూ వుంటే ఒక అతిలోకసుందరుడు ప్రత్యక్షమై 'ఆ శివునివద్ద ఏముంది, భూతాల మధ్య వుంటాడు, పుర్రెలో తింటాడు, స్మశానంలో వుంటాడు♪. అతనిని చేసుకుని ఏం సుఖపడతావు ....నన్ను చేసుకో” అంటూ అడగగానే పార్వతి అతనితో... “నా శివుని గురించి ఇలా నువ్వు మాట్లాడడం నీకు తగనటువంటిది♪. ఆయన గురించి నేను చేసే ఈ తపస్సు నేను మానను, నిన్ను చేసుకోవటం జరగని పని” అంటూ అసహ్యంగా తిరస్కరిస్తుంది♪. తర్వాత తన తపస్సును పరీక్షించేందుకై సదాశివుడే ఆ రూపంలో వచ్చాడని తెలిసి సంతోషిస్తుంది♪.


పై రెండు కథలలోనూ ఒకటే లక్ష్యం కనిపిస్తుంది♪. ఇద్దరూ సాధకులే. కాకపోతే ఒకరిది అపరిపక్వ స్థితి, వేరొకరిది పరిపక్వస్థితి♪. 


ఇంతకీ ఈ కథలకూ శివుని బాహువు లకూ ఏమిటి సంబంధం?


విశ్వామిత్రుడు ఆకర్షణకు లొంగిపోయాడనీ, పార్వతి అమ్మవారు ఆకర్షణకు లొంగలేదనీ అర్థం అవుతుంది♪. ఆ ఆకర్షణను ప్రయోగించేది “ఆవరణ, విక్షేప” శక్తులనబడే బాహువులు♪.


మరింత వివరంగా పరిశీలిద్దాము.


                    *సశేషం.....*

        ❀┉┅━❀🛕❀┉┅━❀


*సేకరణ:* *శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

యోగవాసిష్ఠ రత్నాకరము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

. *హరి ఓం*

 *ఓం శ్రీ మహాగణాధిపతయే నమః* 

*ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః* 

*ఓం నమో వసిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి శుకాదిభ్యః*

 

. *🌹యోగవాసిష్ఠ రత్నాకరము🌹* 

*వైరాగ్య ప్రకరణము - 1వ అధ్యాయము* 

. *🌹రాఘవ వైరాగ్య వర్ణనము🌹*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

. *శ్రీ వాల్మీకి రువాచ :-*

0015 


*1-35*

*ప్రాప్యం సంప్రాప్యతే యేన భూయో యేన వ శోచ్యతే* *పరాయా నిర్వృతేః స్థానం యత్తజ్జీవితముచ్యతే.* 


తప్పక పొందదగినట్టి పరమశాంతి నిలయమైన అత్మను బొందినవాడు మరల యెన్నటికిని దుఃఖము నొందడు. అట్టివాని జీవితమే జీవితము. 


*1-36*

*తరవోఽ పి హి జీవన్తి జీవన్తి మృగపక్షిణః* 

*స జీవతి మనో యస్య మననేన న జీవతి.*


వృక్షములున్ను జీవించుచున్నవి. మృగపక్షులున్ను జీవించుచున్నవి. కాని దృశ్యసంకల్పము లేని మనస్సు గలవాడే నిజముగ జీవించుచున్నవాడగును. (లేక తత్త్వబోధచే వాసనాక్షయమువలన నశించిన మనస్సు గలవాడే నిజముగ జీవించుచున్నవాడగును.)  


*1-37*

*జాతాస్త ఏవ జగతి జన్తవః సాధుజీవితాః* 

*యే పునర్నేహ జాయన్తే శేషా జరఠగర్దభాః.*


ఎవరు ఈ ప్రపంచమున తిరిగి జన్మింపరో (పునర్జన్మరహితులో), ఎవరు ఉత్తమ జీవితము గలవారోఅట్టివారే నిజముగ జన్మించిన వారగుదురు. (వారి జన్మమే సఫలమైనది), తక్కినవారు ముసలి గాడిదలవంటివారే యగుదురు. (అప్రశస్త జీవులని భావము).


                    *సశేషం.....*

        ❀┉┅━❀🛕❀┉┅━❀


*సేకరణ:* *శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

ఆత్మవిద్యా విలాసము -

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి🌹*

. *🌹విరచితము🌹*

  *ఆత్మవిద్యా విలాసము - శ్లోకం 16*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*శ్లోకం:-*


*దేహేంద్రియాసు హృదయాదిక చైత్యవర్గాత్ ప్రత్యక్చితే ర్విభజనం భవవారి రాశేః |* 

*సంతారణే ప్లవ ఇతి శ్రుతి డిండిమోఽయం తస్మాద్విచారయ జడాజడయో స్స్వరూపమ్ ॥*



*భావం:-*

దేహం, ఇంద్రియాలు, పంచప్రాణాలు, హృదయం మొదలైన చైతన్యంతో కూడిన వర్గం నుండి లోనుండే చితిని విడదీయడమే సంసార సముద్రాన్ని దాటించే పడవ అని ఉపనిషత్తులు చాటిస్తాయి. అందుచేత జడాజడాల స్వరూపాన్ని గురించి విచారణ చేయుము.


*వివరణ:-* 

శిష్యుని హృదయం చాలా పరిపక్వత చెంది వున్నందున శ్రీ గురువు అత్యుత్తమమైన ఆత్మ విచారణా మార్గాన్ని సూటిగా బోధిస్తున్నాడు.


*చైత్యవర్గం :-*

దేహము, అయిదు జ్ఞానేంద్రియాలు అయిదు కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనోబుద్ధి చిత్తాహంకారాలనే నాలుగు అంతఃకరణాలు కలిసిన ఇరవైయింటినీ చైత్యవర్గమంటారు.


ప్రపంచాన్ని గురించిన జ్ఞానాన్ని ఇస్తాయి, కాబట్టి జ్ఞానేంద్రియాలకి ఆ పేరు వచ్చింది. తక్కిన వాటికి వేరే రకమైన చైతన్యం ఉన్నది. దేహం ఎంతో తెలివైయింది. తనకి పడని వాటిని, అక్కరలేని వాటిని వెంటనే బయటకి తోసివేస్తుంది.


 కర్మేంద్రియాలకు, పంచప్రాణాలకి తమ తమ పనులు చేయడానికి తగిన జ్ఞానం ఉన్నది. అంతఃకరణాల వ్యవహారాలన్నీ చైతన్యంతో కూడినవే.


అయితే ఇవి చైతన్యంతో కూడిన జడాలు. వాటికి స్వతహాగా చైతన్యం లేదు, స్థూల సూక్ష్మ రూపాలుగా ఉన్న ఈ ఇరవయింట్లోను చైతన్యం ప్రసరించిన కారణంగా అవి చైతన్యంతో ప్రవర్తిస్తాయి.


 చైతన్య ప్రసారం ఆగిపోగా అవి తిరిగి జడాలవుతాయి, నశించిపోతాయి. చైతన్యంలేనిదే అవి నిలవలేవు, కొండలు, నదులు మొదలైన వాటిలాగా అవి జడాలుగా నిలిచి ఉండవు. కేవలం చైతన్యాన్ని ప్రసరించడానికే అవి ఉపయోగ పడతాయి. అందుకే అవి చైత్యవర్గం అని పిలువబడుతాయి.


*ప్రత్యక్షితి:-*

 అన్నింటికి అంతరంలో ఉండే చితి. బల్బులోకి ప్రవేశించి వెలుగు నిచ్చే కరెంటులాగా, పైన చెప్పిన చైత్యవర్గం లోపల ప్రవేశించి చైతన్యాన్ని ఇస్తుంది.


*విభజనం :-* 

సంసారంలో కొట్టుమిట్టాడే జీవుడు చైతన్యవంతుడు. అందుండి తరించాలని తహతహపడేది కూడా ఈ జీవుడే.


అందువల్ల తనలోని చితిని, చైత్యవర్గాన్ని విడదీసి తన చితి తన చైత్యవర్గంలోకి ప్రవేశించి, బాహ్య విషయాలని చూపుతోందని, చూపిస్తుందని గ్రహించాలి.


అప్పుడే అతడికి తన నిజ స్వరూపం తెలిసి బాహ్య ప్రపంచాన్ని అధిగమిస్తాడు. లోపలి చితిని విడదీసినప్పుడు దానికి బాహ్య ప్రపంచంలోగాని, దాని బాధలతో గాని సంబంధం ఉండదు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం -‌ ద్వాదశి - ఆశ్రేష -‌‌ గురు వాసరే* *(21-03-2024)* 


ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/BC2F8y5uXdo?si=rWN5EqcF72zeDMCe


🙏🙏

20, మార్చి 2024, బుధవారం

గోత్ర వ్యవస్థ

 హిందూమతంలో సప్తర్షి మరియు గోత్ర వ్యవస్థ (జీన్ మ్యాపింగ్) 

గోత్రం అంటే "అవరోహణం" మరియు సుదూర పూర్వీకులను సూచిస్తుంది, సాధారణంగా గొప్ప ఋషులు మరియు ప్రజాపతిలలో ఒకరు. గోత్రం అనేది ఒక వ్యక్తి యొక్క పురుష వంశంలో మూల వ్యక్తిని సూచిస్తుంది.

గోత్రాలు మరియు ఋషుల గురించి తెలుసుకోవడం అవసరం ఎందుకంటే మంత్రాలను మొదట కనుగొన్న ఈ దివ్య ఋషులు. మంత్ర ద్రష్టలు అయినందున, ఋషులు ఆయా మంత్రాలకు ప్రధాన గురువులు అవుతారు మరియు వారి పేర్లను కలిగి ఉన్న గోత్రాలను స్థాపించారు.

మంత్రాన్ని చూసేవారి స్మరణ ఏదైనా పఠనంలో అంతర్భాగమవుతుంది.(ఆర్షేయ బ్రాహ్మణ 1.1.6, బృహద్-యోగ యాజ్ఞవల్క్య 1.27, భరద్వాజ్ 5.43, బ్రహ్మ సూత్రం 1.1.39 శంకర్ భాష్య, బృహద్ దేవత 1.2).

బౌధాయనస్'రౌత-సూత్ర ప్రకారం; విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప మరియు అగస్త్యుడు 8 మంది ఋషులు; ఈ ఎనిమిది మంది ఋషుల సంతానం గోత్రాలుగా ప్రకటించబడింది.

గోత్రాలు సమూహాలలో ఏర్పాటు చేయబడ్డాయి, ఉదా. అశ్వాలయన-శ్రౌతసూత్రం ప్రకారం వశిష్ఠ గణానికి చెందిన నాలుగు ఉపవిభాగాలు ఉన్నాయి, అవి. ఉపమన్యు, పరాశర, కుండిన మరియు వసిష్ఠ (మొదటి ముగ్గురు కాకుండా).

ఈ నలుగురిలో ప్రతి ఒక్కటి అనేక ఉపవిభాగాలను కలిగి ఉంది, ప్రతి ఒక్కటి గోత్రం అని పిలువబడుతుంది. కాబట్టి అమరిక మొదట గణాలలోకి, తరువాత పక్షాలలోకి, తరువాత వ్యక్తిగత గోత్రాలలోకి.

రోజువారీ ప్రార్థనలలో, ఒకరి గోత్రం యొక్క నిర్దిష్ట స్థాపకుడి పేరు మరియు దానిని స్థాపించిన ఋషి పేరును గుర్తుంచుకోవాలి, కానీ త్రిమూర్తులు (3) లేదా పెంటగాన్ (5)గా ఉండే ఋషుల సమూహంతో కూడిన ప్రవర కూడా. ) ఒకరి కుటుంబానికి చెందిన మారుమూల పూర్వీకులు.

గోత్ర అనేది ఒక వ్యక్తి యొక్క తాజా పూర్వీకుడు లేదా అతని కుటుంబం తరతరాలుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి యొక్క తాజా పూర్వీకులలో ఒకరు; ప్రవర అనేది సుదూర గతంలో నివసించిన ఋషి లేదా ఋషులచే ఏర్పాటు చేయబడింది, వీరు అత్యంత ప్రసిద్ధులు మరియు సాధారణంగా గోత్ర ఋషుల పూర్వీకులు లేదా కొన్ని సందర్భాల్లో మారుమూల పూర్వీకులు మాత్రమే.

కాబట్టి కొందరు ప్రవరాన్ని ఒక గోత్రం నుండి మరొక గోత్రం యొక్క స్థాపకుడిని (స్టార్టర్) వేరుచేసే ఋషుల సమూహంగా నిర్వచించారు.

ప్రవరలు రెండు రకాలు; శిష్య-ప్రశిష్య-ఋషిపరంపర, మరియు పుత్రపరంపర. గోత్రప్రవరాలు ఏకర్షేయ, ద్వార్షేయ, త్రైర్షేయ, పంచర్షేయ, సప్తర్షేయ మరియు 19 ఋషుల వరకు ఉండవచ్చు.

ఒకరి గోత్రాన్ని గుర్తుంచుకోవడం యొక్క ఉద్దేశ్యం ఒకరి పూర్వీకుల నుండి ప్రేరణ పొందడం మరియు ఒకే గోత్రంలో వ్యక్తులు వివాహం చేసుకోనందున వివాహాలలో ఎండోగామిని నివారించడం.

ఇది ఒకే మూల గోత్రానికి చెందిన ఉత్పన్నమైన గోత్రాల మధ్య వివాహాలను నిరోధిస్తుంది కాబట్టి ఇది అర్ధమే.

ఇటీవలి మానవ శాస్త్ర పరిశోధనలు చాలా వంశపారంపర్య మలుపు తీసుకోవడం ప్రారంభించాయి మరియు వారు ఇంటిపేర్లు, పేర్లు, పుట్టిన స్థానాల వెనుక అర్థాలను కనుగొంటున్నారు మరియు వీటన్నింటిలో Y క్రోమోజోమ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అదేవిధంగా, కొన్ని ఆలోచనలు హిందూ కుల మరియు ఉప-కుల (గోత్ర) వ్యవస్థ వెనుక ఉన్న కారణాలు వాస్తవానికి జన్యు వంశాలను వాటి స్వచ్ఛమైన రూపాల్లో సంరక్షించడం మరియు ఇందులో Y క్రోమోజోమ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రతిపాదించాయి.

గోత్ర వ్యవస్థ యొక్క నియమం ఏమిటంటే, పురుషుల గోత్రం అలాగే ఉంటుంది, అయితే స్త్రీ యొక్క గోత్రం వివాహం తర్వాత వారి భర్త యొక్క గోత్రం అవుతుంది. గోత్రం వర్ణ వ్యవస్థకు భిన్నమైనదని గమనించాలి.

మను స్మృతి ప్రకారం, వర్ణ వ్యవస్థ వారి అర్హత మరియు నైపుణ్యం ఆధారంగా వ్యక్తులను ఒక వర్ణం నుండి మరొక వర్ణానికి తరలించడానికి అనుమతించింది, అయితే గోత్రాలు జన్యుపరమైన మరియు వంశపారంపర్య సంబంధాన్ని సూచిస్తాయి.

ఒకే గోత్రంలో వివాహం లేదా?

హిందూ గోత్ర వ్యవస్థ స్పష్టంగా జన్యు వంశాలను స్థాపించడానికి చక్కని మార్గం. మరియు ఇది ప్రధానంగా మగవారి ద్వారా జరుగుతుంది ఎందుకంటే మగవారు Y క్రోమోజోమ్‌ను తరం నుండి తరానికి వక్రీకరణ లేకుండా పంపుతారు. ఎందుకు?

ప్రతి మనిషిలో X మరియు Y క్రోమోజోములు ఉంటాయి. ఆడవారికి XX ఉంటే మగవారికి XY ఉంటుంది. మనకు ప్రతి కణంలో అలాంటి 23 జంటలు ఉన్నాయి మరియు వాటిలో ప్రతి ఒక్కటి తండ్రి నుండి మరియు ఒకటి తల్లి నుండి వస్తుంది.

ఆడవారిలో అందరూ XX అయితే మగవారిలో ఒకరు X మరియు మరొకరు Y, ఇది వారిని మగవారిగా చేస్తుంది. కనుక ఇది ఒక చిన్న చిన్న Y క్రోమోజోమ్ మగుడిని మగవాడిగా చేస్తుంది.

మరియు పురుషులు ఈ నిర్ణయాత్మక Y క్రోమోజోమ్‌ను వారి తండ్రి నుండి మాత్రమే పొందుతారు ఎందుకంటే ఆడవారు తమ శరీరంలో Y క్రోమోజోమ్‌ను కలిగి ఉండరు. అందువలన, Y క్రోమోజోమ్ తండ్రి నుండి కుమారునికి మరియు ఇక నుండి తీసుకువెళుతుంది.

అందువల్ల, ఇది మూల పూర్వీకుల వరకు స్పష్టమైన జన్యు వంశాన్ని స్థాపించడంలో సహాయపడుతుంది. గోత్ర వ్యవస్థ బహుశా ఈ జన్యు వంశాలను సంరక్షించడానికి సృష్టించబడింది.

ఆ సమయంలో, మనకు స్పష్టంగా నేటి చక్కని DNA విశ్లేషణ సాంకేతికత లేదు కాబట్టి మన పూర్వీకులు దానిని సంరక్షించడానికి వారి చక్కని మార్గాన్ని కనుగొన్నారు. స్త్రీ శరీరంలోని క్రోమోజోములు, X క్రోమోజోములు, దాటవచ్చు.

మరియు తండ్రి మరియు తల్లి నుండి వచ్చిన ఈ X క్రోమోజోములు తల్లి తండ్రి లేదా తండ్రి తల్లి క్రోమోజోములు కావచ్చు.

కానీ Y క్రోమోజోమ్ విషయంలో ఇది కాదు. ఇది కేవలం తండ్రి నుండి కుమారునికి బదిలీ చేయబడుతుంది, కలవరపడకుండా, అడ్డదిడ్డంగా ఉంటుంది. అందువల్ల Y క్రోమోజోమ్ స్వచ్ఛమైన జన్యు రేఖను కలిగి ఉంటుంది.

అందుకే కొడుకు పుట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొడుకులు జన్యు రేఖను కలిగి ఉంటారు. Y క్రోమోజోమ్‌ను తదుపరి తరానికి బదిలీ చేయడానికి ఒక తరంలో మగవారు లేకుంటే జన్యు రేఖలు ముగుస్తాయి.

ఈ సాధారణ కారణం కారణంగా, కుమార్తెలు కుమారులు చేసే విధంగా స్వచ్ఛమైన జన్యు రేఖను కలిగి ఉండరని అర్థం చేసుకోవచ్చు.

పెళ్లి తర్వాత మహిళలు తమ గోత్రాలు మరియు ఇంటిపేర్లను ఎందుకు మార్చుకున్నారు, ఎందుకంటే వారు ఇప్పుడు తన భర్త కుటుంబం యొక్క తరువాతి తరాన్ని ముందుకు తీసుకురావడానికి సహాయం చేస్తారు, ఎందుకంటే ఆమె కొడుకు తన తండ్రి యొక్క Y క్రోమోజోమ్‌ను కలిగి ఉంటాడు.

కుదిరిన వివాహాల వెనుక కూడా ఇదే కారణం. సరైన గోత్రంలో వివాహం చేసుకోవడానికి మరియు అదే గోత్రంతో వివాహాన్ని నివారించడానికి వివాహాలు ఏర్పాటు చేయబడాలి.

ఎందుకంటే అదే గోత్రానికి చెందిన వ్యక్తి అదే జన్యు వంశం నుండి వచ్చినందున సాంకేతికంగా సోదరుడు. ప్రతి గోత్ర రేఖ ఒక మగ పూర్వీకుల నుండి కొనసాగుతుంది.

అందువల్ల, ఆ గోత్రంలోని వ్యక్తులు సాంకేతికంగా అదే పూర్వీకుల వారసులు మరియు ఆ విధంగా, తోబుట్టువులు.

రత్నాలుగా భావిస్తుంటారు.

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లోకము౹౹ 


*పృథివ్యాం త్రీణి రత్నాణి* 

*జలమన్నం సుభాషితం|*

*మూఢైఃపాషాణఖణ్డేషు* 

*రత్న సంజ్ఞా విధీయతే||*


భావము:- ఈలోకంలో నీరు, ఆహారము, పెద్దల హితవచనములు అనేవి విలువైన రత్నములు. కానీ ఈ రత్నాలను విడచి మూఢులు రాళ్ళముక్కలను రత్నాలుగా భావిస్తుంటారు.

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

*20-03-2024 / బుధవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

మేషం


చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------

వృషభం


ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

---------------------------------------

మిధునం


నూతన ఋణయత్నాలు చెయ్యవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసివస్తుంది. ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------

కర్కాటకం


ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణానికి శ్రీకారం చుడతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది.

---------------------------------------

సింహం


వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు ఉత్పన్నమవుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.

---------------------------------------

కన్య


కుటుంబ వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. స్నేహితుల సహాయంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు తగిన అవకాశములు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

---------------------------------------

తుల


ప్రయాణాలలో మార్గవరోదాలు కలుగుతాయి. విద్యార్థులు ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి. స్ధిరాస్తి వివాదాలుంటాయి కొంత చికాకు పరుస్తాయి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

వృశ్చికం


గృహ నిర్మాణ ప్రారంభానికి శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు గతంకంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. గృహ వాతావరణం సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

ధనస్సు


ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. కుటుంబ సభ్యులతో కీలక విషయాలు చర్చిస్తారు. భూ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు దీర్ఘకాలిక సమస్యలు నుండి బయటపడతారు.

---------------------------------------

మకరం


ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆర్ధిక సమస్యలు మరింత భాదిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు.

---------------------------------------

కుంభం


ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండక నూతన రుణయత్నాలు చెయ్యవలసి వస్తుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తికాక చికాకు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మిక స్థాన చలన సూచనలున్నవి.

---------------------------------------

మీనం


చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. చాలాకాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

🍀 *శుభం భూయాత్* 🍁

సాధన

 *_నేటి మాట_*


                     *సాధన*

మనసుని కలుషితంచేసే కోరికలే కాదు అనవసరంగా దొర్లే చిన్న మాట కూడా మనని బాహ్యముఖంచేసి శాంతిని దూరం చేస్తుంది. 


అందుకే సాధకులు స్నేహితులు, బంధువులతో కూడా మితంగానే ఉండాలి...

ఏదో ఒక గుర్తింపు కోరుకునే మనసుకు అనామకత్వాన్ని అలవాటు చేయాలి. 

సాత్వికత లేనివారి సహచర్యాన్ని, లౌకిక విషయాసక్తిని, సాధనకు సహకరించని పరిచయాలను తగ్గించుకోవాలి. 


ఎంతమందిలో ఉన్నా దైవనామాన్ని జపిస్తూ అంతర్గతంగా ఏకాంతాన్ని అలవాటు చేసుకోవాలి.

మనసులో ఆలోచనలు రేకెత్తించే వ్యాపకాలను తగ్గించుకోవాలి.


ఇవన్నీ ఆచరించిన రోజున నిజమైన గురుబోధ మనలో నుండి వినిపిస్తుంది. 

గురు అనుగ్రహం వల్ల కలిగే పరిణామం అంతర్ముఖత్వం. మనసు అంతర్ముఖం కావడమంటే ఎప్పుడూ కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు, చూసిందల్లా కావాలనిపించని నిర్లిప్త గుణం అలవడితే మనసు అంతర్ముఖం అవుతుందని అర్ధం.


గురువు అందించే ఈ గుణాన్ని అలవాటు చేసుకునేందుకు నిరంతర సావధానత అవసరం. 

మన మనసును అను*_నేటి మాట_*


                     *సాధన*

మనసుని కలుషితంచేసే కోరికలే కాదు అనవసరంగా దొర్లే చిన్న మాట కూడా మనని బాహ్యముఖంచేసి శాంతిని దూరం చేస్తుంది. 


అందుకే సాధకులు స్నేహితులు, బంధువులతో కూడా మితంగానే ఉండాలి...

ఏదో ఒక గుర్తింపు కోరుకునే మనసుకు అనామకత్వాన్ని అలవాటు చేయాలి. 

సాత్వికత లేనివారి సహచర్యాన్ని, లౌకిక విషయాసక్తిని, సాధనకు సహకరించని పరిచయాలను తగ్గించుకోవాలి. 


ఎంతమందిలో ఉన్నా దైవనామాన్ని జపిస్తూ అంతర్గతంగా ఏకాంతాన్ని అలవాటు చేసుకోవాలి.

మనసులో ఆలోచనలు రేకెత్తించే వ్యాపకాలను తగ్గించుకోవాలి.


ఇవన్నీ ఆచరించిన రోజున నిజమైన గురుబోధ మనలో నుండి వినిపిస్తుంది. 

గురు అనుగ్రహం వల్ల కలిగే పరిణామం అంతర్ముఖత్వం. మనసు అంతర్ముఖం కావడమంటే ఎప్పుడూ కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు, చూసిందల్లా కావాలనిపించని నిర్లిప్త గుణం అలవడితే మనసు అంతర్ముఖం అవుతుందని అర్ధం.


గురువు అందించే ఈ గుణాన్ని అలవాటు చేసుకునేందుకు నిరంతర సావధానత అవసరం. 

మన మనసును అనుక్షణం నిగ్రహించుకుంటే గానీ ఇది సాధ్యం కాదు...

19, మార్చి 2024, మంగళవారం

పరివర్తన

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*పరివర్తన..*


"అయ్యా..స్వామికి ఒక ఆవును ఇద్దామనుకుంటున్నాను..ఎప్పుడు తీసుకొని రమ్మంటావు.."? అని నిన్న ఆదివారం ఉదయం యానాది అని పిలువబడే అతను అడిగాడు.."వచ్చే వారం తీసుకొని రా.." అన్నాను..సరే అని వెళ్ళిపోయాడు..అతనిని చూస్తే..ఒకప్పుడు తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడ్డాడు ఇతను అనే ఆలోచనే రాదు..


2014 లో సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామం నుంచి ఆ యువకుడిని, అతని తల్లిదండ్రులు అతి కష్టమ్మీద శ్రీ స్వామివారి మందిరం వద్దకు తీసుకొని వచ్చారు..అతి కష్టమ్మీద అని ఎందుకు అన్నానంటే..ఆ యువకుడు ఒక పట్టాన ఓ ప్రక్క నిలవడం లేదు..చూపు ఎటో ఉంది..మనిషి ప్రవర్తన తేడాగా ఉంది..తనలో తానే మాట్లాడుకుంటూ..ఉన్నట్టుండి పరుగెట్టేవాడు..పట్టుకోవడం కూడా కష్టం..పోనీ చిన్నపిల్లవాడా అంటే కాదు..సుమారు ముప్పై సంవత్సరాల వయసు..పెళ్లి కూడా జరిగి నాలుగైదు సంవత్సరాల కాలం గడిచి పోయింది..


అతని పేరు కోడిపల్లి యానాది..వృత్తి గొర్రెల పెంపకం..చిన్నతనం నుంచీ తల్లిదండ్రులకు చేదోడు వాదోడు గా వుండేవాడు..కొద్దిగా బిడియస్తుడే గానీ..నెమ్మదస్తుడు..ఎటువంటి వివాదాల్లోకి వెళ్లే మనస్తత్వం కాదు..తన పనేమిటో..తానేమిటో..అన్నట్లుగా వుండేవాడు..వయసు వచ్చిన తరువాత తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు..మూడేళ్ల పాటు సంసారం ఏ ఇబ్బందీ లేకుండా సాగిపోయింది..ఇద్దరు పిల్లలు కూడా కలిగారు..ఉన్నట్టుండి అతనికి ఏమైయిందో తెలీదు..ఒక్కసారిగా యానాది ప్రవర్తనే మారిపోయింది..మానసికంగా మనిషి కుంగిపోతున్నాడు..పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు..

భార్యా..తల్లిదండ్రులు..యానాది లో వచ్చిన మార్పు చూసి తల్లడిల్లిపోయారు..


అన్ని ప్రయత్నాలు చేసిన తరువాత..శ్రీ స్వామివారి మందిరం వద్దకు తీసుకొచ్చారు..శ్రీ స్వామివారి సమాధి చుట్టూ ప్రదక్షిణాలు చేయించారు..మొదటి రెండు మూడు రోజులూ తల్లీ తండ్రీ..భార్యా..ఇలా ఎవరో ఒకరు యానాది ని పట్టుకొని ప్రదక్షిణాలు చేయించే పరిస్థితి..కానీ నాలుగో రోజు గడిచేసరికి..తన పాటికి తానే శ్రీ స్వామివారి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేయసాగాడు..తనలో తాను మాట్లాడుకోవడం తగ్గి పోయింది..మార్పు స్పష్టంగా కనబడ సాగింది..


అతనిని మేమూ చాలా కుతూహలంగా గమనించసాగాము..మాకూ కూడా యానాదిలో వస్తున్న మార్పు ఆశ్చర్యం కలిగించసాగింది.."అయ్యా..మా అబ్బాయి యానాదిని ఇక్కడికి తీసుకొచ్చి..ఆ స్వామి సమాధి చుట్టూ త్రిప్పుతుంటే..వాడిలో చాలా మార్పు కనబడుతోంది.. మేము మండలం రోజుల పాటు వాడిని ఇక్కడే ఉంచాలని అనుకుంటున్నాము..మా పాటికి మేము వంట చేసుకుంటాము..కాకుంటే మా సామాను పెట్టుకోవడానికి ఒక చిన్న గది ఇప్పించండి.."అన్నారు..సరే అని ఒక చిన్న గది కేటాయించాము..అందులో వుండసాగారు..


మరో వారం రోజులు గడిచాయి..యానాది ఒక క్రమ పద్దతి ప్రకారం ప్రదక్షిణాలు చేయడం..శ్రీ స్వామివారి దీపారాధన కోసం నూనె తీసుకొచ్చి అర్చకులకు ఇవ్వడం..ఇతర ఉపాలయాల్లో కూడా ప్రదక్షిణాలు చేసి రావడం..తల్లిదండ్రులతో అప్పుడప్పుడూ మాట్లాడటం..పిల్లలను దగ్గరకు తీసుకోవటం..చేయసాగాడు..మనిషి లో గుణాత్మక మార్పు వచ్చేసింది..చిత్రమేమిటంటే..శ్రీ స్వామివారి మందిరం లో ఉన్న అర్చకులకే కాదు..ఇతర సిబ్బంది కి.. అందరికీ...యానాది ప్రీతిపాత్రుడిగా మారడం..అట్లని అతనేమీ అతి చనువు తీసుకొని ప్రవర్తించడం లేదు..


మండలం రోజులు పూర్తయ్యేదాకా యానాది శ్రీ స్వామివారి మందిరం వద్దే వున్నాడు..యానాది మళ్లీ మామూలు మనిషిగా మారాడు..తనకు వచ్చిన ఇబ్బందిని తీర్చిన శ్రీ స్వామివారిని యానాది మర్చిపోలేదు..తన గ్రామానికి వెళ్లి తన వ్యాపకం తాను చేసుకుంటూ...తాను సంపాదించిన ప్రతి రూపాయ లో కొంత శాతం శ్రీ స్వామివారి వద్ద అన్నదానానికి కేటాయించసాగాడు..ఇప్పటికీ అదే పద్దతి కొనసాగిస్తున్నాడు..గొర్రెలు కాచుకుని జీవనం సాగించే యానాదికి అన్నదానమంటే అత్యంత ఇష్టం.."అన్నమొక్కటే కదయ్యా మనచేత "ఇక చాలు"..అని అనిపించేది.." అంటాడు నవ్వుతూ..తనకు ఏ కష్టం వచ్చినా..నేరుగా శ్రీ స్వామివారి సమాధి వద్దకు వచ్చి మ్రొక్కుకొని వెళుతూ ఉంటాడు..


అత్యంత మితంగా మాట్లాడే యానాది మనసంతా శ్రీ దత్తాత్రేయ స్వామివారే నిండి పోయి వున్నారు..అదే అతనికి శ్రీరామరక్ష..


సర్వం..

దత్తకృప.


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్:523 114..సెల్..94402 66380 & 99089 73699).

జంతు బలులు"

 *💥"జంతు బలులు"💥*

హింసనా? అహింసనా? 

ఈ యొక్క ఆచారాలు ఎలా వచ్చాయి. దీనికి ఆద్యుడు ఎవరు?

 దీని యొక్క పూర్వాపరాలు తెలుసుకుందాం.మిత్రులారా....!

అరుణాచలశివ 🌹


ప్రకృతిలో ని నియమం ధర్మం తప్పితే మనిషికి ఒక మాట,పశువుకు ఒక డెబ్బ,రాక్షస సంహారం;

చర్యకు ప్రతిచర్య-cause and effect-యద్భావంతద్భవతి ఇవే కర్మ సిధ్ధాంతానికి మూలాలు,తెలియక చేసిన తప్పు వలన తెలియకుండా అనుభవిస్తారు తెలిసి చేసిన తప్పు వలన తెలిసేలా,గుణపాఠంలా అనుభవిస్తారు;

మన ఆచారాలు దివ్యద్రష్టలైన ఋషులు తమ తపస్సు లో తాము తెలుసుకున్న అనుభవాలన్నింటినీ క్రోడీకరించి..

అర్ధం చేసుకుని ఆచరించి చెప్పిన అఖండ సత్య సూత్రాలే నేటి మన ఆచారాలు,

బుద్ధుడు,వర్ధమాన మహా వీరుడు ఖండించిన విషయాలు 

👉మొదటి ది జంతుబలులు ఖండించడం,

👉రెండోది ఖర్మకాండాలను, పిండ ప్రధానం,

 👉మూడోది గంగాస్నానం వల్ల పాపాలు(సంస్కారములు) పోవని.

 ➡️భారతీయ సాంప్రదాయం లో మన ఆచారాలలో రెండు ప్రధాన మార్గాలు 

1.దక్షిణాచారం(యోగాచారం సదాచారం,వైధికాచారం,దైవాచారం)

2.వామాచారం(రాక్షసాచారం, నిషేదితాచారం,

పంచ'మ'కార ఆచారం,క్షుధ్రాచారం) 

పై రెండు ఆచారాలలో వామాచారంలో మాత్రమే ఈ భలికి సంబంధించిన సమాచారం,వీటి ఆచారాలు వేద శాస్త్రాలకు భిన్నంగా వుంటు లక్ష్యం మాత్రం ఒక్కటే వుండేది,ఈ సాధనలో పతనానికి,మార్గబ్రష్టులవడాని,ప్రాణాలకు ముప్పు రావడానికి ఆస్కారం ఎక్కువ.వామాచారం మొట్ట మొదటిసారి ఆచరించింది రాక్షసులు,వారు నరభలులు,జీవ జాతుల భలులు భలిదేవతకి ఇచ్చి 

1.మాంసాహారాన్ని,

2.మధ్యపానాన్ని, 3.మైధునం(sex),

4.ముద్ర, 

5.మంత్రం 

పై వాటిని(పంచ'మ'కారాలు) వీరి సాధన అమవాస్య రోజు రాత్రి ఎందుకంటే మనస్సు పనిచేయదు కాబట్టి సాధన, జాగరణం అధ్బుతమైన ఫలితాలను ఇస్తుంది.కానీ ఈ సాధన చేయడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే,మనవులకు ఈ సాధనలు నిషేధించారు,వీటిలో మంత్రం,ముద్ర మాత్రమే తీసుకుని

శాఖాహారం తో సాధన చేయవచ్చును 

👉కృత,త్రేతా,ద్వాపర యుగాలలో పరమాత్మ రాక్షస సంహారం చేశాడు,రాక్షసభల్లులు(dino+asur)రాక్షసులు పూర్తిగా అంతరించి పోయాయి;

కలియుగంలో ఆ రాక్షసులకు "మహిష అసుర

(🐃దున్నపోతు🦬)"

అనే జన్మలు ఇచ్చి వాటిని భలి పశువుగా మానవులకు యోగుల ద్వారా కలియుగంలో భలిసాంప్రదాయ రూపంలో ఇచ్చారు,ఇక్కడ కర్మసిద్ధాంతం కూడా పనిచేస్తుంది. ఒక్కప్పుడు ఎవరైతే బలిచ్చారో వారే మరలా బలిపశువుగా మారి వారి వారి కర్మలను తీర్చుకుంటున్నారు,

➡️పార్వతీ దేవి భూలోకంలో గోమాతగా,వేపచెట్టుగా,తులసి ,గోరింట,నిమ్మ వృక్షం గా అవతరించింది.

ఈ అవతారాలు దుష్టశిక్షణ,చిత్తశుద్దికోసమే.ఇక భలి ఖచ్చితంగా ""⚡వేపచెట్టుకు""⚡మాత్రమే

ఇవ్వాలి,వేప చేదు రాక్షసుల గుణాలను లయం చేయగలదు ,భలిపశువుకు🦬🐃 నొప్పి తెలియకుండా కనురెప్ప పాటులో తల వేరుకావాలి. తల భలిదేవతకి వదిలేసి తలలోనే అహంకారం,కర్మలు, 

సంస్కారములు వుంటాయి కావున,

 మిగిలిన శరీరం శూద్రులు/అంటరానివారు(చెమట వచ్చే విధంగా పనిచేసే వారు కర్మేంద్రియాలను ఎక్కువగా వాడేవారు)దానంగా ఇచ్చేయాలి,ఇక్కడ భలి వలన హింసకు తావు లేదు.బలి పశువుకూడా మంచే జరుగుతుంది,

కానీ నాడు జంతుభలులు రాక్షస సంహారం కోసం మాత్రమే,మాంసాహారం కోసమో భలిదేవతకి ఆహారం కోసమో కాదు,కానీ నేటి జంతు భలులు కేవలం మాంసాహారం కోసం మాత్రమే అదికూడా హింసే,

 నేటి మాంసాహారంలో హలాల్ కూడా అంతా హింసే కదా,హింసించి కృూరంగా చంపుతున్నారు.అప్పుడు భలి అమావాస్య రోజు మాత్రమే ఇస్తే,ఇప్పుడు నిత్యం హింసనే,

నాడు శూద్రులు మాత్రమే మాంసాహారులు,

నేడు ప్రతి నిత్యం 800కోట్ల జనాభాలో 99%మాంసాహారులే(మాంసాహారులే అంటరానివారు)

 జంతు,పక్షి,హింసాహార విహారాలు,మానవులే రాక్షసులైవున్నారు మానవత్వం ఎక్కడుంది,అధర్మం అనగ హింసాత్మక ప్రకృతి విరుద్ధమైన జీవనవిధానం లో 

మనిషి రోగాలు,కష్టనష్టాలు,

కరోనావిజృంభన,ప్రకృతి వైపరీత్యాలు,ప్రళయాలు

ఎందుకుండవు,వినాశకాలేవిపరీతబుద్ది.నేను జంతు బలిని సమర్థిస్తున్నాను కాని పక్షుల భలులు కాదు

అంటే హింసాత్మక ఆహరాన్ని, మద్యపానాన్ని ప్రోస్తహించట్లేదు,కనీసం వాటికి హింస వుండదని(something better than nothing),గుడ్డి కన్నా మెల్లమేలు;

ఎర్రచీమ మాంసాహారి,నల్లచీమ శాఖాహారి మన శరీరంపై ఈ రెండుచీమలుప్రాకితే ఎర్రచీమను చంపేస్తాం.ఎందుకంటే అది హింసాజీవి,

జంతు భలులను ఖండించిన ప్రముఖులలో గౌతమ సిద్ధార్ధుడు(బుద్ధుడు) అగ్రగణ్యుడు,ఈయన చేసిన గణకార్యాలలో ఆనాపానసతి,విపస్సన,

పూర్తి శాఖాహారం

(బ్రాహ్మణజీవితం),

పంచశీలాలు;

అంతవరకూ బాగానేవుంది కాని మన భారతదేశ ఆచారాలు మూఢనమ్మకాలుగా చిత్రించి ఖండించడం బాగా ఆలోచించాల్సిన విషయం,ఖండిస్తే ఖండింపబడటం 

ప్రకృతి నియమం,అందుకే

సాక్షాత్తు ఆధి శంకరాచార్యులు బౌద్ధంను,జైన మతమును పూర్తిగా ఖండించాడు,

సమాజానికి మూఢనమ్మకాలు తీవ్రప్రమాదంకాదు 

కాని మూఢంగా ఖండించినవాడు సమాజానికి అత్యంత ప్రమాదకరం,

ఆ సమయంలో జంతుబలులు తగ్గడం వలన రాక్షసులు మానవరాజులుగా అవతరించి నేటి దుర్మార్గానికి పునాదులు వేశారు,

ఆ సమయంలో బుద్ధుడు

జంతువుభలులు ఖండించకుంటే,

నేడీ దుస్థితి లేకుండా వుండేది,

నిజానికి ఇప్పుడు(హింసాత్మకాహారం)మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించాల్చిన సమయం వచ్చింది,

👉సృష్టి సదా ఒకే విధంగా వుంది కానీ 

ఒక్కొక్కరికి ఒక్కోలాగ వున్నట్లు బ్రమ కలిగిస్తుంది,

అంతమాత్రాన

సృష్టిలో లోపం ఉందనుకుంటే ఖచ్చితంగా అది నీ పొరపాటే అవుతుంది,సాధన లో మనస్సు మాయలో పడుతుంది,బుద్ధి బ్రమకులోనవుతుంది,యదార్థానికి బదులుగా పెడార్తాలు,అపార్థాలు చోటుచేసుకునేఅవకాశం వుంది కావున

అలాంటి సందర్భంలో పూర్వాపరాలు పరిశీలించి వేదాలను ప్రమాణంగా తీసుకుని అనుగుణంగా వుంటే సరియైనది,విరుద్ధంగా వుంటే ఆ గురువు సాధన లో ఇంకా విద్యార్థి దశలోనే వున్నట్లు,ఆఖరికి కరోనా కూడా అందరినీ సమానంగా కలుపుకొనివెళ్ళింది,

దేవుడు/గురువు మాత్రము నా భక్తులు,నా శిష్యులు,నా సాధన అన్నాడంటే నిజమైన దేవుడు/గురువు ఎలా అవుతాడు,

➡️వేదాలు సృష్టి జరగకముందే వున్నాయి వీటిని

సృతులు(పరబ్రహ్మ నుండి వినిపించినవి,వెలువడినవి),ఋషులు,మునులు,యోగులు,బుద్ధులు వారి సాధన అనుభవాలను 

 స్మృతులు అంటారు,

➡️“అహం బ్రహ్మాస్మి” 🟰ఋగ్వేదము

➡️"తత్వమసి"🟰సామవేదము

➡️"అయమాత్మా బ్రహ్మ " 🟰యజుర్వేదము

➡️" ప్రజ్ఞానం బ్రహ్మ"🟰

         అధర్వణవేదము

ఈ మహా వాక్యములు నాలుగు వేదముల,ఉపనిషత్తుల

సారాంశం

👉ఈ అనంతమైన విశ్వంలో అనంతమైన సాధన మార్గాలు ఋషులు,మునులు మనకు అందించారు,ఒక మార్గంలో ప్రయానించేవారు ఇంకొక మార్గంలో ప్రయాణించే వారిని గౌరవించాలి,కలుపుకొని పోవాలి లేదా పరామర్శించాలి కాని విమర్శించద్దు,

ఖండించవద్దు అవి ప్రకృతి విరుద్ధమైన వ్యతిరేక పదాలు,మనలోనే వ్యతిరేకత వుంటే ప్రపంచశాంతికి ఎలా ఉపయోగపడుతుంది అని ఆత్మ విమర్శ చేసుకోవాలి 

Don't judge the book by its cover

👍

👉పిండం పెట్టడం అనేది ప్రాచీనశాస్త్రము(advanced

science)

మనిషి చనిపోయిన వారి శరీరం 27 నుండి 100 గ్రాములు వరకు తగ్గుతుంది,అంటే అర్ధం పొయిన వారు శూక్ష్మశరీరం తోవున్నారనే కదా అర్థం,దేవలోకం,భువర్లోకం

మోక్షం పొందనివారంతా పిండప్రదానాలపై ఆదారపడతారు,

వారికి ప్రతిసంవత్సరం ఒక ముద్ద అన్నం వారి శరీరానికి సంవత్సరం కాలం పోషంపబడుతుంది,

దీనికి ఆధారాలు గరుడ పురాణం,

💥మోక్షం పొందినవారికి, బ్రహ్మలోకానికి కారణ శరీరంతో చనిపోయిన వారికి పిండం అవసరం లేదు వారు మరలా కారణజన్మలుగా అవతరిస్తారు,

మీ తదనంతరం మీ వారసులు పిండం పెడతారో లేదో ఈ జన్మలోనే మోక్షం పొందితే పిండం ప్రదానాలమీద ఆధారపడవలసిన అవసరం లేదు

👉ఇక గంగానది పవిత్రత,శక్తిని గురించిన విషయం నేను చెప్పను మీరే ప్రత్యక్షంగా గంగోత్రి కి వెళ్ళి తెలుసుకోండి,పురుషులలో పుణ్యపురుషులు వేరు అలాగే నదులలో గంగానది ప్రత్యేకం చూడటానికి ఒకేవిధంగా వుండవచ్చును,

ఆ నదిలో బ్యాక్టీరియా ఉన్నట్లు

నేటికీ శాస్త్రవేత్తలు నిరూపించలేకపోయారు,

భగవద్గీత లో ప్రపంచంలోని నదులలో గంగానదిని నేను అన్నాడు

💥మీఆచారం,మీమతం,

మీసాధన బాగుంది అనిపిస్తే గోరంతను

కొండంతగా చెప్పుకోండి,మాది గొప్ప సాధన/మతం అన్నా పర్వాలేదు,మీ సాధన/మతం "కన్నా"మాదే గొప్ప అనడం,

 విమర్శలు,ఖండించడం వలనే మతకలహములు,అభిప్రాయబేధములు,వాదోపవాదాలు,

మాదేవుడు/మాగురువు గొప్పోడు అనడంలో తప్పు లేదు కానీ మీదేవుడు/మీగురువు కన్నా మాదేవుడు/మాగురువు గొప్ప అనడం ఎంతవరకు సరియైనది,

దేవుడు&గురువు అంటేనే గొప్ప వీరు అందరికీ చెందిన అందరివాళ్లు,పంచభూతాలు మాదిరిగానే;

*"నేను&నాది"*

అనే అజ్ఞానతత్వము పోవాలి,*మనం&మనది*అనే మన అనే మానవత్వం రావాలి,మన భూమాత(mother earth),

మన వసుదైక కుటుంబం(universal family)అనే అర్థం మారిపోయింది,మత,దేశ కుటుంబాలు వచ్చాయి🤦‍♂️;

➡️ప్రపంచదేశభక్తి రావాలి,మనం మనుషులము మనకు నిజాలు కావాలి,సత్యం గ్రహించి సత్యం లో జీవిద్దాం; 

👉ఈ భూప్రపంచం అంతటా మనభవిష్యత్ అంతా మన ఆచారాలతో ఓలలాడబోతోంది,ఎందుకంటే ప్రస్తుత సమస్యలకు పరిష్కార మార్గం మన భారతీయ ప్రాచీన శాస్త్రములు,ఆచారాలు,సంప్రదాయాలు దారి చూపిస్తాయి

💥ఏ ఆచారానైనా మతాన్నైనా,సిద్దాంతాన్నైనా

గుడ్డిగా నమ్మకండి గుడ్డిగా ఖండించకండి,తెలియకపోతే

తెలియదు అనాలి కానీ గుడ్డిగా ఖండించవద్దు,అజ్ఞానాన్ని సమాజంలో రూపుమాపాలి,బౌద్ధధర్మం,మతము పేరుతో 

దేవతల నుండి వచ్చిన సదాచారాలను ఖండించవద్దు,

భారతీయ ఆచారాలు ఎల‍ా తప్పో నిరూపించు ప్రకృతి కూడా సత్యానికి సహకరిస్తుంది,

👉నా దృష్టిలో మతములు పగటి వేషాల లాంటివి,ప్రపంచంశాంతికి/

ప్రపంచానికి మతం ఏవిధమైన ఉపయోగం లేదు,ప్రస్తుతానికి మానవులకు మతం అవసరం లేదని చెప్పాడమే నా అభిమతం

➡️ప్రపంచం లోని అన్ని దుఃఖములకు

బుద్ధుడు చెప్పినట్లు 

కోరికలు కాదు,మనస్సు కాదు 

 అజ్ఞానం,అవిధ్య&అధర్మం మాత్రమే మూలకారణం అనగా

అజ్ఞానమే దుఃఖహేతువు,

పరమాత్మ లేదా యోగులు సదా సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగివుంటారు,యోగులు సర్వం తెలిసినవారు,సామాన్యులు కార్యం చూస్తే యోగులు 

కార్యకారణ సంబంధం,పూర్వాపరాలు పరిశీలించి నిర్ధారిస్తారు,

అజ్ఞానమే దుఃఖహేతువు.

➡️లోకులు లోకానికి సంబంధించిన జ్ఞానం కల్గి వుంటే.... యోగి లోకానికి సంబంధించిన జ్ఞానం తో పాటు లోకాతీత జ్ఞానం కూడా కల్గివుంటాడు.

అరుణాచలశివ 🌹

*💥సత్య మేవ జయతే💥*

***గురు బ్రహ్మ 

     గురు విష్ణు

     గురు దెేవోమహేశ్వర 

     గురు సాక్షాత్త్ పరబ్రహ్మ***


🙏సమస్త లోకా,సర్వేజనా

సుఖినోభవంతు🙏

దైవత్వం

 *🌴దైవత్వం పొందగలమా.....!🌴*


దైవత్వం అనేది అంగట్లో దొరికే వస్తువు కాదు. సాటి మనిషిని నిస్వార్థంగా ప్రేమించి, అవసరంలో ఎదుటి మనిషికి, జీవులకు అండగా నిలిచే మనిషి దేవుడు అనిపించుకుంటాడు.

 

మనిషికి మనిషి శత్రువు కాదు... పరిస్థితులే శత్రువును చేస్తాయి...

 

ఆ పరిస్థితుల కారణంగా మనిషి ప్రవర్తించే తీరు - మనిషికి మనిషిని శత్రువుగా మారుస్తుంది..


శతృత్వం, మితృత్వం అనేది మనిషి యొక్క భావనలు.. అంతే...


శతృత్వం ద్వేషాన్ని, అసూయను, కోపాన్ని కలిగిస్తే, మితృత్వం ప్రేమను వ్యక్తపరుస్తుంది. 


*ప్రేమతో దగ్గర తీస్తే క్రూరమృగం కూడా మచ్చిక అవుతుంది.... ప్రేమ తత్వమే దైవత్వం...*


*ఒకప్పుడు రాముడు లాంటి వాడు.. సత్య హరిశ్చంద్రుని వంటి వాడు అని అనిపించుకునేందుకు మనిషి చాలా కష్టపడే వాడు ... ఆ పోలిక చాలా ఉన్నతంగా ఉండేది ..* 


కానీ నేటి మనిషి జంతువులతో, అది కూడా క్రూర జంతువులైన సింహం, పులి, నక్క... లాంటి వాటితో పోల్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు... 


*యత్భావం తత్భవతి... అనే విశ్వ నియమం ప్రకారం ... ఏ రకంగా మన ఆలోచనా తీరు ఉంటుందో, మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది.*

 

మన ఆలోచనా విధానం లో మార్పు రాకపోతే, దైవత్వం వైపు అడుగులు వేయడం అనేది పూర్తిగా అసాధ్యం..... 


ఏ గుడికో వెళ్లి ఒక దండం పడేసి, ఇంట్లో ఒక దీపం వెలిగించి, కనీసం ఇంట్లో వ్యక్తులకు కూడా గౌరవం ఇవ్వలేని వాడు దైవత్వానికి ఎలా అర్హుడు అవుతాడు?.. 


*సాటి మనిషిని ప్రేమిస్తూ, తోటి జీవజంతుజాలం పట్ల దయతో ఉంటూ, ప్రకృతి పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ, ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటే, అదే.. మనం భగవంతుడికి చేసే నిత్య పూజ. అదే మనలో ఉన్న దైవత్వాన్ని మేల్కొలపడానికి తొలి మెట్టు..... ఇది పూర్తిగా అలవరచుకోవాలి.*


    


     *🙏సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు*

కర్మసిద్ధాంతం- 12

 కర్మసిద్ధాంతం- 12

మనం చేసే కర్మలు కాయిక, వాచిక, మానసిక కర్మలుగా విభజించబడ్డాయి. కాయిక అంటే నోటితో చేసే కర్మలు, మానసికం అంటే మనస్సుతో చేసేవి, వాచిక అంటే మాటల ద్వారా చేయబడేవి. భౌతిక శరీరంతో జీవుడు కర్మ చేస్తాడు.

ఆ కర్మలకు కారణం త్రిగుణాత్మకమైన ప్రకృతి. అంటే త్రిగుణాలతో కూడిన ప్రకృతి. ఆ ముడు గుణాలే సత్త్వ, రజో, తమో గుణాలు. నిజానికి జీవుడు (ఆత్మ) కళ్ళకు కనిపించే స్థూల శరీరం కాదు, కనిపించని సూక్ష్మ, కారణ శరీరాదులు కూడా కాదు. 'బ్రహ్మం యొక్క ప్రతిబింబమై ఉండీ (సూక్ష్మ శరీరంలో), తాను స్థూలశరీరమని భ్రమపడేవాడు జీవుడు. కానీ ఈ జీవుడు ఈశ్వరుని నుంచి వేరు కాదు' అని ఆదిశంకరులు తత్త్వబోధలో చెప్తారు.


ఈ ప్రపంచం పంచభూతాత్మకం. పంచభూతాలైన ఆకాసం, వాయువు, అగ్ని, నీరు, పృధ్వీల పంచీకరణం అనే ప్రక్రియ ద్వారా ఏర్పడింది.


3 గుణాలు ఇవి.

సత్త్వగుణం - శుద్ధత్వం మరియు జ్ఞానం దీని లక్షణాలు; ఉదాహరణ - సాత్త్వికమైన వ్యక్తి ఎవరిని బాధించడు. ఇతరులు తనకు అపకారం చేసినా, కోపగించుకోకుండా, ప్రతీకారానికి వెళ్ళకుండా, ఏ విధమైన భావావేశానికి లోనుకాకుండా, నిశ్చలంగా, కరుణాపూరితుడై ఉంటాడు. తన స్వార్ధం చూడకుండా, అందరి మేలు తలుస్తాడు.


రజో గుణం - క్రియ (కార్యము) మరియు కోరిక దీని లక్షణాలు; ఉదాహరణ - రజోగుణం ఉంటేనే పని చేయగలుగుతాము. మనస్సులో సంకల్పాలు కలిగించేది ఈ గుణమే. రజోగుణం గలవాడు కూడా ఎవరి జోలికి వెల్లడు. కానీ తన జోలికి ఎవరైనా వస్తే ఊరుకోడు. తన స్వార్ధం చూసుకుంటూనే ఇతరులకు మేలు చేయాలని చూస్తాడు.


తమో గుణం - అజ్ఞానం మరియు జడత్వం దీని లక్షణాలు; ఉదాహరణ - తమోగుణం కలిగిన వ్యక్తి అందరిని బాధిస్తాడు. ఇతరులకు ఉపకారం చేయడమన్నమాటే ఉండదు. ఎప్పుడూ హానీ చేయాలనే తలుస్తాడు. తన స్వార్ధం గురించి ఆలోచిస్తూనే, ఇతరులు సుఖంగా ఉండకూడదని తలుస్తాడు. తన జోలికి రాకున్నా, ఇతరులను పీడించి, అందులో ఆనందం పొందుతాడు. దురాశ, ప్రతీకారం మొదలైన దుర్గుణాలు దీని లక్షణాలు.


పంచభూతాల సత్త్వగుణ అంశ నుంచి అంతఃకరణాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉద్భవించాయి. రజోగుణ అంశ నుంచి పంచకర్మేంద్రియాలు, పంచవాయువులు ఉద్భవించాయి. తమోగుణ అంశ నుంచి స్థూలమైన పంచభూతాలు, స్థూల శరీరము ఏర్పడ్డాయి.


ఇవన్నీ పంచీకరణం అనే ప్రక్రియలో ఏర్పడ్డాయి. పంచభూతాల్లో, ప్రతి భూతంలోనూ, దాని తత్వం 1/2 వంతు, తక్కిన 4 భూతాల తత్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. ఉదాహరణకు భూమి- అందులో 1/2 భూతత్వం అయితే, 1/8 జలం, 1/8 అగ్ని, 1/8 వాయువు, 1/8 ఆకాశం ఉంటాయి. దీన్నే 'పంచీకరణం' అంటారు.


విశ్వం ఏర్పడటానికి కారణమైన పంచీకరణమే ఈ శరీరం ఏర్పడాటానికి కారణమైంది. జీవుడి స్థూల శరీరం పిండాండమైతే, కనిపించే ఈ విశ్వం బ్రహ్మాండం. ఈ పిండాండం దేనితో ఏర్పడింది, ఈ బ్రహ్మాండం కూడా దానితోనే ఏర్పడింది. కాబట్టి పిండాండాన్ని అర్ధం చేసుకుంటే, బ్రహ్మాండాన్ని అర్ధం చేసుకోవచ్చని చెప్పారు ఋషులు. ఇంకా ఉంది .!

బలి చక్రవర్తి గతజన్మ

 బలి చక్రవర్తి గతజన్మ వృత్తాంతం:


బలి చక్రవర్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన సాక్షాత్ శ్రీమహావిష్ణువుకే మూడు అడుగుల భూమిని దానం చేసిన మహనీయుడిగా, గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు. అతనికి అంతటి గొప్ప అవకాశం రావటానికి కారణం తను గతజన్మలో చేసుకొన్న పుణ్యమే. బలి గతజన్మలో ఒక దరిదృడు. అతను నాస్తికంగా ఉంటూ వేదపండితులనూ దేవతలనూ నిత్యం దూషిస్తూ తిరుగుతుండేవాడు. అతను దరిదృడే ఐనా వేశ్య లోలుడు. ఒక సారి వేశ్యా సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన తాంబూలం, సుగంధ ద్రవ్యాలూ, శ్రీ చందనం, కర్పూరం, మల్లె పూలూ ఇత్యాది భోగవస్తువులను ఒక సంచీలో పెట్టుకొని వేశ్యావాటిక కి బయల్దేరాడు. మార్గమధ్యంలో కాలుజారి నేలమీద పడ్డాడు. అలా పడేటప్పుడు తన తలకి బలంగా గాయమయ్యి మూర్చపోయాడు. ఆ సమయంలో తనకి విచిత్రమైన ఒక ఊహ కలిగింది. తన దగ్గరున్న ఈ పరిమళద్రవ్యాలన్నీ శివుడికి నివేదనచేస్తున్నట్టు. ఆ ఊహలో ఉండగానే తను ప్రాణాలు విడిచాడు. తన దగరున్న సర్వస్వాన్నీ భగవంతుడికి నివేదించినందుకు గానూ ఆ పరమేశ్వరుడి దయవల్ల అతనికి గొప్ప పుణ్యఫలం లభించింది.


మరణించిన తనను యమభటులు నరకానికి తీసుకుపోయారు. అక్కడ యముడు అతని పాపపుణ్యాలని విచారించగా అతనికి చేసిన పాపాలకి గానూ ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్పాడు. కానీ అతను చివరలో తనయావత్తూ ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నట్టూ భావించినందుకు మూడు ఘడియలపాటూ ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉందంది అలా మూడు ఘడియలూ పూర్తయ్యాకా అతనిని నరకంలో శిక్షించవచ్చని చెప్పాడు. ఇదంతా విన్న ఆ పాపికి తను ఇన్నాళ్ళూ చేసినపనులెంత ఘోరమైనవో తెలిసింది. జన్మ చివరలో దేవుడికే అన్నీ దానం చేస్తున్నా అని అనుకోగానే ఇంత ఫలితం వచ్చింది, అలాంటిది తను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుందీ ? అనిపించింది. ఇంతలో ఇందృడు, ఇంద్రగణాలు, అప్సరాగణాలూ మొత్తం అక్కడికి వచ్చి ఆ వేశ్యాలోలుడిని ఐరావతం మీద ఎక్కించుకొని సకల లాంచనాలతో సదరంగా స్వర్గానికి తోడుకొని వెళ్ళారు.


తను ఇంద్ర సిమ్హాసనమ్మీద కూర్చొన్న వెంఠనే అగస్త్యుడికి ఐరావతాన్నీ, విశ్వామిత్రుడికి ఉచ్చైశ్రవాన్నీ, వశిష్టుడికి కామధేనువునూ, గాలవుడికి చింతామణినీ, కౌండిణ్యుడికి కల్పతరువునూ ఇలా ఇంద్రలోకంలోని గొప్ప గొప్ప మహర్షులకి విలువైన సంపదనంతా దానం చేసేసాడు. వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు.


మూడు ఘడియల కాలం ఐపోయిన వెంఠనే ఇందృడక్కడకి వచ్చాడు. ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకూ అన్నిటినీ ఆ వేశ్యాలోలుడు దానం చెయ్యడం తెలుసుకొని కోపగించుకొన్నాడు. ఇంతలో యముడూ అక్కడికి వచ్చాడు ఆ పాపిని మళ్ళీ నరకానికి వెళ్ళడానికి సిద్ధంకమ్మన్నాడు. ఐతే మరలా చిత్రగుప్తుడు అడ్డుచెప్పి అతను ఈ మూడు ఘడియలకాలంలో చేసిన పుణ్య ఫలితంవల్ల తను ఇక మీదట నరకానికి రానవసరం లేదనీ, మరు జన్మలో మహా చక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడనీ చెప్పాడు. తను మునుపు చేసిన పనులకి గానూ అసుర వంశానికి రాజౌతాడని చెప్పాడు. ఆ దాన ఫలితంగనే బలి చక్రవర్తిగా అవతరించి సాక్షాత్ శ్రీ మహా విష్ణువుకే మూడు అడుగుల రూపేణా మూడు లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందాడు. చిరంజీవిగా పాతాళానికి రాజై నిలిచిపోయాడు


దానం చెయ్యాలని మనలో ఏ కొద్ది మందికో ఉంటుంది. చాలా మందికి దానం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం తెలియక దానధర్మాలు చేయకుండా జీవితం సాగిస్తుంటారు. మన వాంగ్మయ సర్వస్వం చేసిన ధర్మం వల్లే మనకు కామితార్ధాలు అన్నీ సమకూరతాయని తెలియజేస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకొన్న ఒక వ్యక్తి జీవితం ఎంతగా మారిపోయిందో తెలిపే కధే ఇది