ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
25, జులై 2024, గురువారం
రాధాకృష్ణుల ప్రేమతత్వం*
*రాధాకృష్ణుల ప్రేమతత్వం*
దేహము లవ్వి వేరుకన తీరులవొక్కటె యెంచి చూడ,సం
దేహము లేదు కృష్ణునకు దివ్య వ్రజాంగనయైన రాధకున్
మోహము లేదు సత్ప్రణయ ముగ్ధ మహత్తర దివ్యభావ,దా
సోహమె జూడ వారికిని శుద్ధప దార్ధములంచు మ్రొక్కెదన్ !!
పద్య ప్రతిభ
పద్య ప్రతిభ
సీ. ఆదికవివరేణ్యు పాదున జనియించి
భారత కావ్యాన పరిఢవిల్లి
కవిబ్రహ్మ తిక్కన కావ్యమ్ము లందున
బహుళ ఛందస్సుతో ప్రజ్ఞ పొంది
ఆమాత్యు డెఱ్ఱన్న నందమౌ కవనాన
రమ్య ప్రబంధమై రాణ కెక్కి
పోతన కవితలో పొంది లాలిత్యమ్ము
భక్తవరుల నోట పలుక బడియు
నాంధ్రభోజునిభవ్య నాముక్తమాల్యదన్
జటిల రచన తోడ జగతి వెల్గి
ఆ. అష్ట దిగ్గజముల యాంధ్ర ప్రబంధాల
ఘనత గలుగు శ్రావ్య కవన మందు
నవని వెలుగు దివ్య యవధానముల యందు
"పద్య కుసుమ" మవని పరిఢ విల్లె
✍️గోపాలుని మధుసూదనరావు 🙏
వలువలు మాసినన్
: చం॥
వలువలు మాసినన్ విడరు పర్వున కార్యము లాచరించగా
కలతలు లేవు భార్య యెడ గట్టిగ బాధ్యత లుండ వెన్నడున్
తలకును తైలముండదు నిదానము ముఖ్యవిధానమైన త
ద్దలసుల జీవనమ్ము కడుహాయిగ సాగును సౌఖ్యదాయియై
*~శ్రీశర్మద*
:
ఆటవెలది:
*********
తెలుగు భాషటన్న తేజరిల్లేఖ్యాతి
తెలుగు నందు మంచి తేనె లూరు
అమ్మ భాషటన్న యావకాయేనురా
తల్లితెలుగునెపుడు తలచు కొనుడు
*****************
రావెల పురుషోత్తమరావు
(అమెరికా)
నీ పాదమె
కం.
నీ పాదమె భయహరణము
నీ పాదమె భవతరణము నిజముగ నాకున్
నీ పాదమె సర్వసుఖము
నీ పాదమె దలతు నెపుడు నేనిక శ్రీశ!
✍️యస్.కె.చక్రవర్తి
క్రొత్తపలుకు-4
క్రొత్తపలుకు-4
శుద్ధి రెండువిధము లిద్ధరాతలిలోన
నాత్మశుద్ధి యొకటి యాచరింప
నాత్మశుద్ధి లేని యాచారవంతుడు
శుద్ధమవడుగాక యుద్ధరింప
బాహ్యశుద్ధి దేహబాహ్యమ్మునకు జెందు
నదియ లేక నాత్మ యమల మవదు
చిత్తశోధనమ్ము జేయగా జేకూరు
నాత్మశుద్ధి మిగుల నమలమయ్య 5
*~శ్రీశర్మద*
నిత్యపద్య నైవేద్యం-
నిత్యపద్య నైవేద్యం-1559 వ రోజు
సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-194. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి
ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు
సుభాషితం:
మన: ప్రీతి కర: స్వర్గ:
నరకస్తద్విపర్యయ:l
నరక స్వర్గ సంజ్ఞే వై
పాపపుణ్యే ద్విజోత్తమ:ll
తేటగీతి:
సతము మదికి సంతోషమే స్వర్గమనగ
ధరను తీరని దుఃఖమే నరకమనగ
అరయ నరక స్వర్గాలనే యార్యజనులు
పాపపుణ్యంబులందురు వరుసగాను.
భావం: మనసుకు సంతోషం కలిగించేదే స్వర్గం. ఎడతెగని దుఃఖమే నరకం. ఈ నరక స్వర్గాలకు పాపపుణ్యములని పేరు.
గోరింటాకుపుణ్య స్త్రీలు
_*ఆషాఢమాసమునందు అన్ని కులములలోని పునిస్త్రీలకు గో రింటాకు నూరి దానమిచ్చిన శు భఫలం!!.*_
>>>>>>>>>>>>(ॐ)<<<<<<<<<<<<<<<<<
_*ఆషాఢంలో గోరింటాకుపుణ్య స్త్రీలు ఎందుకుపెట్టుకోవాలి?.*_
ప్రకృతిలోగ్రీష్మఋతువు తరువాత వర్షఋతువుగా మారుతుందిమన వాతావరణం ఆప్రకారంఆషాడమా సములో వర్షాలు పడుతూఉంటా యి,దీంతోవాతావరణంఅంతాచల్ల గా మారుతుంది.
అంతేనా!, సూక్ష్మక్రిములుపెరిగిమ నకు అంటురోగాలు వ్యాపిస్తాయి. అయితే!, వర్షాలుఎక్కువగాపడట మువలన వాతావరణం చల్లబడు తుంది కానీ,ఒంట్లోవేడి ఇంకాఅలా నే ఉంటుంది.
బయట వాతావరణానికి సమానం గా మనశరీరం మారదు.
దీంతో సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది.
అందుకు గోరింటాకు పెట్టుకోవడం వల్లశరీరంలోని అధిక వేడిని తీసే స్తుంది,అంతేకాకుండా రోగ నిరోధ క శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమం గా జరిగేలా చేస్తుంది ఈగోరింటికు. ఇది గొప్ప ఆయుర్వేద దివ్యఔషధ గుణములు కలిగినది గోరింటాకు. అందుకే! ప్రతిఒక్కరూఈసమయం లో గోరింటాకును కోసి కొద్దిగాపసు పు కొద్దగా చింతపండు చాలా కొద్ది గా నీరుసున్నము వేసి మెత్తగానూ రి ఆనూరినది చిన్న చిన్న డబ్బాల లో నిమ్మకాయంత పెట్టి శక్తి ఉన్న వాళ్ళు,ముత్తయిదులకు, ఒక జా కీటు పీసులు,నాలుగులేకఆరు గా జులు,పసుపు,కుంకుమ,గంధము,కాటుక,పువ్వులలు తమలపాకు లు మూడు,రెండువక్కలు,రెండు పండ్లు,సిద్ధపరచుకొని,ముందు ముతైైదువునకుపసుపు,కుంకుమ,గంధము,కాటుక,గాజులుతాంబూ లముతోపాటు నూరిన గోరింటాకు ను ఇవ్వాలి.
ఇచ్చినవస్తువులు,గోరింటాకునుపెట్టుకోవాలని చెప్పాలి,అని పెద్దలు చెబుతారు.
అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచా రం వెనుక ఆరోగ్యప్రయోజనాలుఉ న్నాయని చెబుతారు.
అందుకే అ మ్మాయిలంతా ఈసమ యంలోగోరింటాకుపెట్టుకుంటారు. ఇప్పుడంటే!గోరింటాకుపెట్టుకోవడ ము ఆడవారు మాత్రమే! చేస్తారని చెబుతున్నారు.
పైవిధముగాస్త్రీదేవతలదేవాలయములలో చేసిన పునిస్త్రీలకు ఆ గౌ రీదేవిఅనుగ్రహమున నిండు ము తైదువుల ఆశీర్వకనములందుతా యి 3,5,9,మందికి ఇస్తే!దీర్ఘసౌమం
ళ్యత్వము కలుగుతుంది.
కానీ, ఇది వరకైతే మగవారుకూడా పెట్టుకునేవారట వారువ్యవసాయ ముచేయుటపొలంపనులుచేయు వారుఎక్కువశాతమునీళ్ళల్లోనాన డం మూలనా! గోళ్లకు జరిగే హాని కూడా నిరోధిస్తుంది అనిపెట్టుకునే వారు,దానివలన!వారిగోళ్ళుపుచ్చి పోకుండావుంటాయి,పెట్టుకున్నవా రికి భార్యపై ప్రేమకలుగుతుందని అర్ధనారీశ్వరతత్వమనిశాస్త్రవచనము.
కాని కోన్ వాడకూడదు దానిలో ర హానికరసాయనాలు కలుపుతారు.
గోరింటాకుఆకు సహజంగా ప్రకృతి సిద్ధంగా వచ్చినది. దీనినిమాత్రమే వాడాలి.
గోరింటాకునకు మంచికథకూడాచె బుతారుపెద్దలు.
గౌరీదేవి (పార్వతీ దేవి) బాల్యంలో స్నేహతులతో, వనంలో ఆటలాడు కునే సమయంలో రజస్వలఅయిం దిట.
ఆ రక్తపుచుక్కలునేలనుతాకినంత నే ఓమొక్క పుట్టిందట.
అదేగోరింటమొక్క.ఈవార్తగౌరీదేవి తండ్రి పర్వతరాజుకుతెలిసి ఆవిం తనుచూసేందుకు సతీసమేతంగా, గోరింట మొక్క దగ్గరకు వెళ్తాడు.
అంతలోనే ఆ మొక్క పెద్ద గోరింట చెట్టై యిలా అంది. "నేను సాక్షాత్ పార్వతీదేవి రుధిరాంశతోజన్మించా ను. కాబట్టి నావలన లోకానికి ఏవి ధమైన ఉపయోగం ఉంటుందో! చె ప్పమ"ని పర్వతరాజుని అడిగింది.
అపుడు గౌరీదేవిసహజమైనబాల్య చాపల్యంతో గోరింట చెట్టు ఆకును కోస్తుంది. ఫలితంగాగౌరీదేవిచేతివే ళ్లు ఎర్రబారిపోతాయి.
అది చూసిన పర్వతరాజు కూతురి చేయికందిపోయిఉంటుందనిబాధప డతాడు.
తనకేవిధమైన బాధా లేదని, పైగా చాలాఅందంగాఉండి,అలంకారం గా అగుపిస్తోందని గౌరీదేవి తండ్రికి చెబుతుంది.సంతోషించిన పర్వత రాజు యిలా చెబుతాడు.
"స్త్రీ"సౌభాగ్యానికి చిహ్నంగా గోరిం టాకు, యిక నుండి భూలోకంలో ప్రసిద్ధమవుతుంది.
తన రంగు వలన గోరింటాకు పెట్టు కున్న చేతులకు కాళ్ళకు అందాన్ని స్తుంది.
అందరూ పెట్టుకునే అలంకారవస్తు వుగా,గోరింటాకుగా,గౌరవంపొందుతుంది. ఇదే గోరింట చెట్టు జన్మకు సార్థకత"ఈఆకును నూరి పుణ్య స్త్రీలకు వాయనముగా ఇచ్చిన వా రికీ సుఖము,ఆనందము,సౌభాగ్య ముకలుగుతా యని పర్వతరాజు చెబుతాడు.
అప్పుడు గౌరీదేవితోసహాఅందరూ ఆ చెట్టు ఆకు పసరుతోచేతులుకా ళ్ళుఅందంగాఅలంకరించుకుంటారు.అప్పుడు కుంకుమకు ఓ సందే హం కలిగింది.
ఈ ఆకుతో నుదుటన కూడాబొట్టు దిద్దుకుంటే,అప్పుడు తనప్రాధాన్య త తగ్గిపోతుందనికుంకుమబాధప డింది. కుంకుమ గౌరీదేవికి తన బా ధచెప్పుకోగా, *'ఈ ఆకు నుదుట దగ్గర పెడితే!పండదు'* అనిగౌరీ దేవి చెబుతుంది.
గౌరీదేవి కుంకుమకు యిచ్చిన మా ట కారణంగానే, గోరింటాకు నుదు రున పండదని పెద్దలు చెబుతారు. గౌరి ఇంటి ఆకు కాబట్టి గోరింటాకు అసలు పేరు *"గౌరింటాకు".* అని పేరు,గోరింటాకుకూడా,సంవత్సరానికి ఓమారు ఆషాఢ మాసంలో పు ట్టింటికి(పార్వతీదేవిదగ్గరకు)వెళ్తుం దిట.
ఆషాఢ మాసంలో తను పుట్టింట ఉన్నపుడు కూడా తనను తప్పక అందరూ పెట్టుకోవాలని గోరింటా కు కోరుకుందట.
ఆషాఢ మాసంలో చేతినిండాగోరిం టాకుపెట్టుకుంటేకష్టాలుఉండవని, సీతమ్మ గోరింటాకు ఇతరులకుయి చ్చినవరమే సీతారాముల అనురా గమనియిందుకుగోరింటాకుకారణ మని పురాణాలు చెబుతున్నాయి.
*గౌరీ ఇంటాకుస్త్రీమూర్తికదానం గౌరవమైన సౌభాగ్య జీవనము నకు మార్గము.*
*సర్వేజనాఃసుఖీనోభవంతు.*
ఆచార్య సద్భోదన*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి...
*ఆచార్య సద్భోదన*
➖➖➖✍️`
భావనామాత్ర సంత్యుష్టయే నమః
```
*భగవన్నామ స్మరణ చేసేటపుడు భావం భగవంతునిపై ఉండేలా చూసుకోవాలి.* ```
నామమునకు తగిన రూపం ప్రత్యక్షం కావాలి. అంతేకాని నోటితో నామము పలుకుతూ మనసులో ఏవో ఆలోచనలు చేస్తుంటే అది స్మరణ అనిపించుకోదు.
ఇలా ఎంత సమయం చేసినప్పటికీ ఏ కొంచెం కూడా ప్రయోజనం లేదు. రేడియో/టేప్ రికార్డర్ ఉంటుంది చూడండి, దానికో టేపు వేస్తే చక్కగా పాడుతూ ఉంటుంది. అంత మాత్రమున ఆ పాటలకు భగవంతుడు కదలి వస్తాడా!?
మనం నేడు రేడియో మాదిరిగానే చేస్తున్నాం కనుకనే అనుగ్రహాన్ని అందుకోలేకపోతున్నాం. భగవంతుడు బాహ్య ఆడంబరములకు లొంగేవాడు కాదు. ఆయనకు భావమే ప్రధానం. భావం సరిగా ఉన్నపుడే ఆయన పలుకుతాడు. ప్రార్థనకు సమాధానమిస్తాడు.✍️```
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
శ్రీనాధ కవితా వైభవం!
శ్రీనాధ కవితా వైభవం!
ఉ: ఎక్కడ లేరె వేల్పులు సమీప్సిత దాతలు, ముద్దుకూన ! నీ
వెక్కడ ? ఘోర వీర తపమెక్కడ ? యీపటు సాహసిక్యమున్
తక్కు ,'శిరీషపుష్ప మవధాన పరత్వమునన్ మధువ్రతం
బెక్కిన నోర్చునో? విహగ మెక్కిన నోర్చునొ ? నిశ్చయింపుమా?
హరవిలాసం-- 4: ఆ: శ్రీనాధ మహాకవి!
ఓముద్దుకూనా!పార్వతీ !కోరిన కోర్కెలు దీర్చుటకు, దేవత లెందరోగలరుగదా! పరమేశ్వరుని గూర్చియే తపమేల? సుకుమారివి నీవిక్కెడ? ఘోర మైన యీకఠోర తపమెక్కడ? ఈదుస్సాహసమును వీడుము, దిరిసెనపూవుపై తుమ్మెద వ్రాలిన నోర్చునుగాని, గ్రద్దవ్రాలిన నోర్వ నేరదుగదా! యని దీనిభావము.
పార్వతి పరమేశ్వరుని భర్తగా బడయఁ గోరి తపమాచరింపఁ బోవుచు ,తండ్రి హిమవంతుని యనుజ్ఙ బడయుటకేగ, గిరిజ నిశ్చయమును విని, సుకుమారివి నీవు తపమొనరింపలేవు. ఈదుస్సాహసమున వీడుమని హిమవంతుడామెకు నచ్చజెప్పు సందర్భము.
"దిరిసెన పూవు మిగుల మృదువైనది. అది తుమ్మెద సోకు నోర్చునుగాని, బలమైన పక్షి సోకు నోర్వజాలదని చెప్పుచు, అన్యాపదేశముగా శంకరునితో నీకు పొందు అనుచితము. అనిసూచించెను.
పార్వతిని శిరీషపుష్పముతో బోల్చి యామె సుకుమార ప్రకృతిని, శంకరుని యందు విహంగోపమమును, జెప్పి యతని మొఱటుతనమును కవి నిరూపించెను.
ఈరీతిని శ్రీనాధుని కవిత్వము వ్యంగ్య వైభవ విలసితమై యొప్పారును!
నిదర్శనాలంకారము.
స్వస్తి!
క్షమా మంత్రం*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్షమా మంత్రం*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్*
*తథ్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే ।*
*విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ*
*న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమః ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*స్వస్తిః ప్రజాభ్యః పరిపాలయంతాం*
*న్యాయేన మార్గేణ మహీం మహీశాః*
*గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం*
*లోకాస్సమస్తా స్సుఖినోభవంతు!*
*ఓం శాంతిః శాంతిః శాంతిః!*
*సర్వేజనా సుఖినోభవంతు!!*
*ఓం తత్సత్!!*
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*
*ఓం నమః శివాయ!!!*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
మహావైణికుడు
మహావైణికుడు....మహోన్నతుడు..
సీ..
వీణియచేబట్టి విహరింప రాగ ర
మ్యాకాశ వీథీసుధాంశుడనగ
వీణాసునాదాల విజయింప నారదు
డేతెంచె మహతితో నిలకుననగ
పీఠికాపురమందు వీణాశ్రవణమది
హృదిరసప్లావితరీతి గనగ
విశ్వకవీశు రవీంద్రనాథు నతులు
గొని మన్ననయుగన్న గురువనంగ
సంగీత సామ్రాట్టు సంగమేశ్వరశాస్త్రి
తుమరాడ వంశాబ్ధి హిమవలమన
గండపెండేరముల్ ఘనబిరుదంబులన్
మెండుగానందిన మేటియనగ
తేగీ..
అమ్మ యా పరాభట్టారికాశిషముల
శాస్త్రి సాధించె సంగీత శాస్త్ర విద్య
వినయశోభితవైణికవీరుడగుర!
యట్టి యబ్బురంబగుమూర్తికంజలింతు.
వారికి ఘనమైన అక్షర నివాళి
రాయప్రోలు జగదీశచంద్రశర్మ.. తెనాలి
డొనేషన్లు కట్టలేము
⭐*
*తెలంగాణ లోని వివిధ ప్రాంతాల ను తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల వేరకు సంప్రదాయ కళాశాల లో అడ్మిషన్స్ కు అవకాశం కల్పించడం జరిగింది*
*తెలంగాణ బ్రాహ్మణ బంధువులందరికి ప్రత్యేక విజ్ఞప్తి*
*మీ పిల్లలు 10th పాస్ అయ్యారా. ఏ కాలేజీలో చేర్పించాలని ఆలోచిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం*. *డొనేషన్లు కట్టలేము అత్యధిక ఫీజులు చెల్లించుకోలేమని బాధపడుతున్నారా* *వీటన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడి లేకుండా మీ పిల్లలు ఉన్నతంగా చదువు కోవాలని కోరుకుంటున్నారా*
అయితే ఇది మీకు గొప్ప అవకాశం
*ఎలాంటి ఫీజు ఉండదు ఎలాంటి డొనేషన్స్ ఉండవు*
పూర్తిగా ఉచితం
అమ్మాయిలకు మాత్రమే
పరిమిత సీట్లు కలవు కొద్దిమందికే అవకాశం
చదువుతోపాటు సంగీతము సాహిత్యము స్తోత్రాలు యోగా కుట్లు అల్లికలు ఇలాంటి ఎన్నో విద్యలను అందిస్తుంది.
అప్లై చేసుకోవడానికి చివరి తేది 31.07.2024.
*సంప్రదాయ కళాశాల పాలమూరు నందుఇంటర్ మొదటి సంవత్సరానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి కావున ఆసక్తిగల బ్రాహ్మణ విద్యార్థినిలు ఎవరైనా ఉంటే దయచేసి తొందరగా తెలపగలరు*
*Mpc 10 సీట్లు*
*Bipc 15 సీట్లు* మాత్రమే అవకాశం కలదు*.
కావున ఈ సమాచారం బ్రాహ్మణులందరికీ తెలియజేసి అమ్మాయిలకు ఒక గొప్ప భవిష్యత్తుకు ఇవ్వడానికి మీ వంతు సహాయాన్ని చేయగలరని మనవి.
విలువలతో కూడుకున్న చదువు ఒక్క సాంప్రదాయ పాఠశాలల్లో మాత్రమే సాధ్యం.
*సాంప్రదాయ విద్యతో పాటు ఆధునిక విద్య అందిస్తున్న ఏకైక సంస్థ*
*ఒత్తిడి లేకుండా చదువుతూ గత రెండు సంవత్సరాలుగా జిల్లా స్థాయి ఉన్నత ర్యాంకులను సాధించినటువంటి ఏకైక విద్యాలయం ఏదైనా ఉంది అంటే అది మన సాంప్రదాయ కళాశాల మాత్రమే*
కావున బ్రాహ్మణోత్తములారా ఇటువంటి సదవకాశాన్ని వినియోగించుకోగలరు
త్వరపడండి.
వివరాలకు.
కుప్పా జగన్నాథ శర్మ
+919849658030
గొండ్యాల రాఘవేంద్ర శర్మ
9705838686
తోటపల్లి శ్రీకాంత్ శర్మ.
9059902877
తాటిపర్తి వేణుగోపాలరావు.
+919440831549.
సరిత కులకర్ణి.
+919849375365
తపస్సులని
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 *దేవద్విజగురుప్రాజ్ఞ*
*పూజనం శౌచమార్జనమ్* |
*బ్రహ్మచర్యమహింసా చ*
*శారీరకం తప ఉచ్యతే* ||
తా|| *దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించుట, శరీరశుద్ధి కలిగియుండుట* *మరియు ఋజుత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శరీరముచే చేయదగిన తపస్సులని చెప్పబడుచున్నవి.*,
✍️🌹💐🌷🙏
సుందరకాండము
సుందరకాండము
ముప్పది ఏడవ సర్గము
శ్రీరామచంద్రుని శీఘ్రముగా తీసికొని రమ్మని
సీత హనుమంతుని కోరుట
తే.
అనిలనందను డైనట్టి హనుమ వలన
విభుడురాముని కుశలముల్ వినిన సీత
సంతసిల్లియు మిక్కిలి స్వాంతమందు
మారు తా బల్కె నీరీతి మధురముగను 866*
తే.
"రామచంద్రుండు నిరతమ్ము ప్రేమతోడ
మదిని నిను దల్చుచున్నాడు మఱపులేక"
యనెడి మధురపు వచనముల్ హనుమ ! యిప్పు
డయ్యె నమృతపు సదృశము లరయ వినగ. 867*
తే.
"విభుడు నిరతమ్ము తా కూడి విరహమందు
శోకమున నున్నవాడదె శూరుడయ్యు"
ననెడి మాటలు ములుకులై యంతరమున
బాధ కల్గించు చుండెను బహువిధముల. 868*
ఆ.
అంతులేని విరివి యైశ్వర్యమున గాని
మహితమైన దుఃఖమందు గాని
ధరను రజ్జుపగిది దైవమ్ము బంధించి
లాగుచుండు నరుని వేగముగను 869*
తే.
అరయ విధివల్ల నాపదలందు బడిన
నన్ను లక్ష్మణు మరియు నా నాథు గనుమ
ప్రాణి విధి దాటజాలడు బ్రతుకునందు
విధిని దప్పింప లేడుగా వేధ యైన 870*
తే.
భయద తోయధి నన్నావ బ్రద్ద లవగ
నీదుచున్ డస్సిపోయిన జోదు వంటి
రామచంద్రుండు శోక నీరధిని నుండి
పరమ శాంతిని యెపుడు తా బయట పడునొ ? 871*
ఆ.
రామచంద్రు డెపుడు రక్కసులను జంపి
యసురు లంకపతిని హత మొనర్చి
దనుజపట్టణమును ధరపాలు గావించి
చేరు నెపుడు నన్ను చీరు టకును? 872*
ఆ.
దానవుండు గడువు ద్వాదశమాసముల్
నిర్ణయించ పదియునెలలు గడచె
చివరి రెండునెలలె జీవించి నే యుందు
విన్నవించు హనుమ ! విభున కిపుడు. 873*
మం.ద్వి.
“సీత నర్పించుమా శ్రీరామునకును
వైరమ్ము వానితో వలదునీ కంచు”
శ్రీవిభీషణుడెంత చెప్పినన్ వినక
కడు మూఢతన్నుండె ఖలుడు రావణుడు
ఆయువు మూడిన యా దైత్యపతిని
కబళించ మృత్యువు కడునుత్సుకతను
నెదురు చూచుచు నుండె కదనరంగమున 874*
✍️గోపాలుని మధుసూదనరావు 🙏
