26, జులై 2024, శుక్రవారం

వినాయకుడు విశేషాలు*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

     *వినాయకుడు విశేషాలు*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*వరసిద్ధి సుబుద్ధి మనోనిలయం*

*నిరత ప్రతిభా ఫలదాన ఘనం।*

*పరమేశ్వర మాన సమోదకరం*

*ప్రణమామి నిరంతర విఘ్నహరమ్ ॥*


*వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు.*


*కృతయుగంలో సింహవాహనంపై పదితలలతో దర్శనమిచ్చాడు.*


*త్రేతాయుగంలో నెమలివాహనంపై మయూరేశుడిగా ఆవిర్భవించాడు.*


*ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై, చతుర్భుజుడై అలరారాడు.*


*కలియుగంలో తొండంతో, ఏకదంతుడై సంపద బొజ్జతో ఉన్న గణనాథుడు దర్శనమిచ్చాడు.*


*బదరీనాథ్ వద్ద వినాయకుని గుహలు ఉన్నాయి. ఆ గుహలో వ్యాసమహర్షి భారతం చెప్తూంటే, ఘంటాన్ని ఆపకుండా గణపతి భారతం రాశాడట.*


*కేదార్ నాథ్ యాత్ర చేసే యాత్రికులు వారి మార్గంలో ఉండే గౌరీకుండ్ వద్ద బాలగణేశుని ఆలయాన్ని దర్శిస్తారు.*


*శ్రీ శైలంలో సాక్షిగణపతిని చూడనిదే యాత్ర పూర్తికాదని చెప్తారు.* 


*శబరిమలలో కన్నెమూల గణపతి ప్రసిద్ది చెందింది.*


*మధురలో క్షిప్రగణపతిని ప్రతిభక్తుడు దర్శించి పూజిస్తాడు.*


*ప్రథముడైన గణపతిని ముందుగా పూజించిన తర్వాతే ఇష్టదైవాలను ప్రార్థించడం ఆనవాయితీగా వస్తోంది. విఘ్నేశ్వరునికి గణాధిపత్యం ఇవ్వడమే ఇందుకు కారణం.*


*ఏ నోములు, వ్రతాలు, పూజలు చేసినా హరిద్రా గణపతికే మొదటిపూజ.*


*గణపతికి గరిక అంటే ఇష్టము. గరికను దారంతో కట్టి గణపతికి మాల వేస్తే మీ మనోగతమైన అన్ని రకాల కోరికలు పూర్తిగా నెరవేరుతాయి.*


*శ్రీ మహాగణపతికి పూజ చేసి బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి.*


*వినాయక చవితినాడు మాత్రమే తులసీదళాలతో వినాయకుడిని పూజిస్తారు. మరి ఏ ఇతర రోజుల్లోనూ వినాయకుని తులసీదళాలతో పూజించకూడదు.*


*విఘ్నేశ్వరుడు తర్పణ ప్రియుడు. గణపతికి 21 రోజులు బెల్లం పానకంతో తర్పణ చేస్తే తాము అనుకున్న పనులు ఎటువంటి విఘ్నము అవాంతరాలు లేకుండా సాధించగలుగుతారు.*


*గణపతికి ప్రతిరోజూ గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనైశ్చరుని వలన కలిగే ఈతిబాధలు, సమస్యల నుంచి బయటపడతారు.*


*శని భగవానుడిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి.*


*గం గం గణేశాయ నమః।*

*ఓం నమః శివాయ॥*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

దేవస్థానాల్లో వాలంటీర్ గా

 *దేవస్థానాల్లో వాలంటీర్ గా చేయాలనుకునే వారికోసం...*


ప్రతి శనివారం, ఆదివారం రోజుల్లో *అన్నవరంలో సేవ* ఉంది. వాలంటీర్ గా

ఎవరైనా వెళ్లాలని 7893159871 కాల్ చేయండి. 


*రామేశ్వరంలో* హుండీ లెక్కింపు ఉన్నది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు 7893159871 కాల్ చేయండి.


 మహాశివరాత్రి సందర్భంగా *పట్టిసీమ, కోటప్పకొండ శ్రీశైలంలో, పంచరామాల్లో సేవలు* ఉన్నవి. వాలంటీర్ గా వెళ్లగలిగే వారు ఎవరైనా ఉంటే కనుక తెలియజేయండి

789315981. 


 *సింహాచలంలో*, ప్రతి శనివారం, ఆదివారం సేవ ఉన్నది. ఎవరైనా ఉంటే కనుక తెలియజేయండి

7893159871 


*శ్రీపురంలో సేవ* చేయడానికి సేవకులు కావలెను. 

7893159871


 *ద్వారకా తిరుమలలో సేవ* ఉన్నది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు, 7893159871 కాల్ చేయండి. 


*భద్రాచలంలో సేవ* చేయటానికి సేవకులు కావలెను 7893159871 కాల్ చేయండి. 


*తిరుపతిలో సేవ* చేయటానికి సేవకులు కావలెను 7893159871


*మద్ది ఆంజనేయ స్వామి గుడి వద్ద సేవ* చేయడానికి సేవకులు కావలెను 7893159871 కాల్ చేయండి


*అయోధ్య మరియు కాశి* రాగలిగే వారు ఎవరైనా ఉంటే గనుక కాల్ చేయండి. భోజనానికి , రూముకి , ట్రైన్ చార్జీలతో కలిపి, మూడు రోజుల సేవకి ₹3500/- 


*కాణిపాకంలో సేవ* చేయడానికి సేవకులు కావలెను 7893159871.


*రామనారాయణ టెంపుల్, విజయనగరం సేవ*, శనివారం, ఆదివారం సేవ చేయుటకు  కావలెను. 

7893159871 


కాశీకి అస్తికలు అనే కాన్సెప్ట్ తో మొదలుపెట్టిన ఈ సంస్థ ఉచితంగా అస్థికలు తీసుకు వెళ్ళే కార్యక్రమం చేస్తుంది. స్వయంగా వెళ్లలేని వారెవరైనా సరే చనిపోయిన మీ ఆప్తుల అస్తికలు వీరికి ఇస్తే, ఈ సంస్థ వారు పవిత్ర గంగానదిలో నిమజ్జనం చేయగలరు దీనికి డబ్బులు అవసరం లేదు. 

బీద ధనిక  కుల వర్గ భేదము ఏమీ లేవు. 

 కాశీలో కార్యక్రమం చేసి లైవ్ వీడియో పంపిస్తారు. కనుక  ఎవరైనా అస్తికలు గంగలో కలపాలని ఉండి స్వయంగా వెళ్లలేని వారు ఉంటే కనుక వీళ్ళకు తెలియజేయండి  ఫ్రీగా తీసుకువెళ్లి కార్యక్రమం అన్ని పూర్తి చేసి వస్తారు. 7893159871 కాల్ చేయండి. 


భక్తితో (డబ్బులు ఆశించకుండా) సేవ చేయాలి అనుకునేవారికి ఈ మెసేజ్ పంపించండి. 


జై శ్రీ రామ!

జై శ్రీ మన్నారాయణ!

హరే కృష్ణ!

హర హర మహాదేవ శంభో శంకర

కురియగజేసినావుగద

 చంపకమాల:

*****+*****

సిరిగల తల్లివీవుగద చిన్మయ హాసము జేయుచుందువే!

మరిమరినీదుకీర్తనల,మన్ననసేసెడువారలెందరో!!

మరువరు నీదుసాయమును, మార్గముజూపినతల్లినీవనన్!

కురియగజేసినావుగద, కూరిమిబెంచెడురీతి నీకృపన్!!

సర్వలఘుకందము

 సర్వలఘుకందము


*జలరుహభవ నుత చరణుడు*

*సలిలపు శయమునఁ దెనమణి జగము నరయుచున్*

*దెలి చిరునగవుల వశయగు*

*కలిమిచెలిని గలసి మనలఁ గరుణఁ గనవలెన్!*


🙏🙏🙇‍♂️🙏🙏

 *_సింహశ్రీ_*

తెలుగు సామెతలు

 ⚡ *మరుగున పడుతున్న కొన్ని 209 తెలుగు సామెతలు..మీకోసం!*


1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

5. అనువు గాని చోట అధికులమనరాదు

6. అభ్యాసం కూసు విద్య

7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి

8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం

9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

12. ఇంట గెలిచి రచ్చ గెలువు

13. ఇల్లు పీకి పందిరేసినట్టు

14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు

15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు

17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు

18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ

19. కోటి విద్యలూ కూటి కొరకే

20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

22. పిట్ట కొంచెం కూత ఘనం

23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక

25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె

27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు

28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

29. ఆది లొనే హంస పాదు

30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు

32. ఆకాశానికి హద్దే లేదు

33. ఆలస్యం అమృతం విషం

34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ

35. ఆరోగ్యమే మహాభాగ్యము

36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట

37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి

39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు

40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు

41. ఏ ఎండకు ఆ గొడుగు

42. అగ్నికి వాయువు తోడైనట్లు

43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు

44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట

45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు

48. అప్పు చేసి పప్పు కూడు

49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా

50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు

51. బతికుంటే బలుసాకు తినవచ్చు

52. భక్తి లేని పూజ పత్రి చేటు

53. బూడిదలో పోసిన పన్నీరు

54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,

గిల్లితే యేడుస్తాడు

55. చాప కింద నీరులా

56. చచ్చినవాని కండ్లు చారెడు

57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు

58. విద్య లేని వాడు వింత పశువు

59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ

60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు

61. చక్కనమ్మ చిక్కినా అందమే

62. చెడపకురా చెడేవు

63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు

64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ

65. చింత చచ్చినా పులుపు చావ లేదు

66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,

ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట

67. చిలికి చిలికి గాలివాన అయినట్లు

68. డబ్బుకు లోకం దాసోహం

69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన

71. దాసుని తప్పు దండంతో సరి

72. దెయ్యాలు వేదాలు పలికినట్లు

73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు

74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి

75. దొంగకు తేలు కుట్టినట్లు

76. దూరపు కొండలు నునుపు

77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు

78. దురాశ దుఃఖమునకు చెటు

79. ఈతకు మించిన లోతే లేదు

80. ఎవరికి వారే యమునా తీరే

81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు

82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట

83. గాజుల బేరం భోజనానికి సరి

84. గంతకు తగ్గ బొంత

85. గతి లేనమ్మకు గంజే పానకం

86 గోరు చుట్టు మీద రోకలి పోటు

87. గొంతెమ్మ కోరికలు

88. గుడ్డి కన్నా మెల్ల మేలు

89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు

90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు

91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా

92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు

93. గుడ్ల మీద కోడిపెట్ట వలే

94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట

95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు

96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు

97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు

99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు

100. ఇంటికన్న గుడి పదిలం

101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ

102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట

103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు

104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు

105. కాకి ముక్కుకు దొండ పండు

106. కాకి పిల్ల కాకికి ముద్దు

107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది

108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా

109. కాసుంటే మార్గముంటుంది

110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు

111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును

112. కలి మి లేములు కావడి కుండలు

113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు

114. కంచే చేను మేసినట్లు

115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !

116. కందకు కత్తి పీట లోకువ

117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

118. కీడెంచి మేలెంచమన్నారు

119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు

122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా

123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట

124. కూటికి పేదైతే కులానికి పేదా

125. కొరివితో తల గోక్కున్నట్లే

126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు

127. కొత్తొక వింత పాతొక రోత

128. కోటిి విద్యలు కూటి కొరకే

129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట

130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు

131. కృషితో నాస్తి దుర్భిక్షం

132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము

133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు

134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు

135. ఉన్న లోభి కంటే లేని దాత నయం

136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక

137. మెరిసేదంతా బంగారం కాదు

138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో

139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు

141. మనిషి మర్మము.. మాను చేవ...

బయటకు తెలియవు

142. మనిషి పేద అయితే మాటకు పేదా

143. మనిషికి మాటే అలంకారం

144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ

145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు

146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా

147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా

148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట

149. మొక్కై వంగనిది మానై వంగునా

150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు

151. మొసేవానికి తెలుసు కావడి బరువు

152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు

154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి

155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు

156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు

157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

159. నవ్వు నాలుగు విధాలా చేటు

160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

161. నిదానమే ప్రధానము

162. నిజం నిప్పు లాంటిది

163. నిమ్మకు నీరెత్తినట్లు

164. నిండు కుండ తొణకదు

165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు

166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు

166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి

167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు

168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు

170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు

171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు

172. ఊరు మొహం గోడలు చెపుతాయి

173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు

174. పాము కాళ్ళు పామునకెరుక

175. పానకంలో పుడక

176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు

178. పండిత పుత్రః పరమశుంఠః

179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు

180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు

181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట

182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది

183. పెళ్ళంటే నూరేళ్ళ పంట

184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట

186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది

187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

188. పిచ్చోడి చేతిలో రాయిలా

189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా

190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం

191. పిండి కొద్దీ రొట్టె

192. పిట్ట కొంచెము కూత ఘనము

193. పోరు నష్టము పొందు లాభము

194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు

195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట

196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము

199. రామాయణంలో పిడకల వేట

200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు

201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు

202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు

203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

204. రౌతు కొద్దీ గుర్రము

205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు

206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు

207. సంతొషమే సగం బలం

208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే

209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు….

🙏

బ్రాహ్మణ సంక్షేమ వేదిక

 బ్రాహ్మణ సంక్షేమ వేదిక వార్తలు :


హైదరాబాద్, ఉప్పల్ , నల్లచెరువు ఎదురుగా ఉన్న శ్రీ సాయిత్రిశక్తి దేవాలయం లో   మొదటి అంతస్తు లోని  FUNCTION HALL లో అతి తక్కువ ధరకు అన్ని సౌకర్యాలతో  బ్రాహ్మణుల కుటుంబాల వారు శుభకార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని ఆలయ యాజమాన్యం ప్రకటించింది.


సౌకర్యాలు:

హాల్, కుర్చీలు, పెళ్లిపందిరి, పురోహితులు, టెంట్ హౌస్ సామాగ్రి, సన్నాయి వారు, ఫోటో & వీడియో గ్రాఫర్, మైక్ & Light సెట్స్, Labors, Water Supply, Carpets, పెళ్లి సామాగ్రి   


భోజన ఏర్పాట్లు :

అన్నం, బిర్యానీ Or (పులిహోర), పూర్ణాలు, రెండు కూరలు,పప్పు, సాంబారు, అప్పడం, నెయ్యి, బజ్జిలు, స్వీట్స్,పెరుగు, ఐస్ క్రీం  


200 మంది అతిధులు  హాజరైతే పైన వివరించిన సౌకర్యాలతో RS 1,75,000 (ఒక లక్ష డెబ్భై ఐదువేలరూపాయలు) ఖర్చుతో వేడుక నిర్వహించుకోవచ్చును.  


400 మంది అతిధులు హాజరైతే పైన వివరించిన సౌకర్యాలతో RS 3,00,000 (మూడు లక్షల రూపాయలు) ఖర్చుతో వేడుక నిర్వహించుకోవచ్చును.


సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ : 93980  38442 


ధన్యవాదాలు

బాలశ్రీనివాసులు

బ్రాహ్మణ సంక్షేమ వేదిక 

9059550280 


NOTE : ఈ ఫంక్షన్ హాల్ సేవలను సద్వినియోగం చేసుకొనే వారు బ్రాహ్మణ సంక్షేమ  వేదిక ID కార్డు లేదా ధ్రువపత్రం తప్పని సరిగా ఉండాలి

వినయాంజలి

వినయాంజలి 


సీ. బమ్మెర గ్రామాన ప్రభవించి యుర్విపై

               భక్తి పంచిన యట్టి  భాగవతుడు

    పద్యముల్  సేద్యమున్ పరవశంబున జేసి

               సన్నుతుండైనట్టి  సవ్యసాచి

    మకరంద సాహిత్య మాధుర్యరసమును 

               తెలుగుజాతి కిడిన వెలుగు రేఖ

    భక్తి సాహిత్యంబు పంచియున్ మేనున

               పులక లెత్తించిన నలువపట్టి 

తే. రాజులకు కావ్య మీయక రక్తి తోడ 

     భక్తితో రామవిభునకు ముక్తి గోరి

     కావ్య మంకింత మొనరించి ఘనత గాంచె

     భక్త పోతన పావన భాగవతుడు       


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

🌸శ్రీ లక్ష్మీ స్తుతి

 🌸శ్రీ లక్ష్మీ స్తుతి🙏 


సీ. శ్రీదేవి ! ప్రియకరీ ! క్షీరాబ్ది కన్యకా !

           శ్రీకరీ ! నుతియింతు క్షేమ మొసగ

భూదేవి ! శ్రీలక్ష్మి ! భువనరక్షాకరీ !

        భూరి కృపాకరీ ! సారసాక్షి ! 

సద్భక్తితోడను సతతంబు సేవింతు

        చంద్రసహోదరీ ! సకలజనని ! 

మాధవీ ! మమ్ముల మమతతో గావుము 

        పద్మాక్షి ! యిందిరా ! పద్మహస్త !

తే. పాలకడలిన పుట్టిన పసిడితల్లి !

     ఆదిశంకరు స్తుతులెల్ల నాలకించి 

      కనకవర్షంబు నిచ్చిన కనకలక్ష్మి !

      తల్లి ! వరలక్ష్మి ! మాపైన దయను చూపు.


సాహితీ శ్రీ జయలక్ష్మి

ఆకార మిచ్చుచు

 ఆకార మిచ్చుచు నర్చనమ్మిడి నిరా

     కార! నే చేసితి నేరమయ్య!

వాక్కులకందని వాడవంచని తెల్సి

         సల్పితి స్తోత్రముల్ జడుడ నగుచు!

నెందెందు వెదకిన నందందె గలవని

         తెలిసియు జేసితి తీర్థయాత్ర!

తెలిసియు తెలియక నలసత దప్పులన్

       సలిపి యుండగ వచ్చు ఛాందసమున!


అన్ని రూపులు నీవెగా అభవ!ఘనుడ!

భవ!యనిర్వచనీయుడా!వందనీయ!

విశ్వమంతయు నీదెగా విభుడ!యనఘ!

తలను వంచితి జగదీశ!తత్వ మెఱిగి!


-------కోడూరి శేషఫణి శర్మ

శ్రీ గణనాథోద్భవము

 శుభోదయం!

*శ్రీ గణనాథోద్భవము!* మూలం: శ్రీ శివ మహా పురాణము.

6చం.

సకియలు జెప్ప పార్వతియు చక్కని పల్కులటంచు మెచ్చుచున్!

పకపక నవ్వి యామె నిజ వర్ష్మపు నలుంగున జేసె చేతనున్!

చకచక సృష్టిజేసి బహు చక్కని బాలకు జూపి మెచ్చుచున్!

ఇకమన కెల్లవేళలను నీఘను డొప్పును రక్షకుండనన్..!


  భావము: చెలికత్తెలు చెప్పగా పార్వతి నవ్వుచూ వెంటనే తన శరీరమునకు నాలుగు పెట్టిన పిండితో వెంటనే చక్కని బాలుని బొమ్మను చేసి మెచ్చుచూ వారికి చూపి ఇక ఎప్పుడూ ఈ ఘనుడే మనకు రక్షకుడనెను.

                             ☘️☘️☘️🌷☘️☘️☘️

ఉత్పలమాల

 ఉత్పలమాల:

**********

అమ్మలు ప్రేమమూర్తులుగ,నాకలి దీర్చెడు యన్నపూర్ణలై

బొమ్మలతోడ పిల్లలకు,బోధనసేయును నీతిగాథలన్

సొమ్ములకన్న మిన్నగను,శోభగబెంచును వారికెప్పుడున్

కమ్మగ కృష్ణలీలలను,కళ్ళకు కట్టిన రీతి జెప్పులే!

పద్యతాంబూలం

 పద్యతాంబూలం


పలురూపంబుల గొలిచితి, 

పలునామంబులను బొగడి, ప్రచలిత మతినై, 

పలుదిక్కుల వెదకితి నిను, 

పలుచన జేసితిని గాదె, పరిపరివిధముల్..


🙏🕉️🙏


- రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్

క్రొత్తపలుకు-6

 క్రొత్తపలుకు-6


బుద్ధి లేక యున్న సుద్దులందరు నేర్పు 

బుద్ధి గలిగె నేని పూతచరిత 

పొందవచ్చుగాక నందఱితోబాటు 

కీర్తి నొంద మేలు గెలిచి నిలచి 

*~శ్రీశర్మద*

ఋణానుబంధమున

 శ్లో:-ఋణానుబంధ రూపేణ 

             పశు పత్ని సుతాలయా: 

             ఋణ క్షయే క్షయం యాంతి

             తత్ర      కా     పరిదేవనా ?


వసుధ ఋణానుబంధమున 

         వర్తిలు పుత్ర కళత్ర వాసముల్ 

పశువులు మానవాళికిని 

          పాయకనుండియు నెల్ల వేళలన్ ,

వసుధ ఋణంబు దీరగను 

          వాటికవే మరి వీడు చుండ , యా 

మసలిన బంధమున్ దలచి

           మానవు  డేలను చింత చెందగన్ ?    


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

ముక్కు పుడక

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


             *ముక్కు పుడక*

                ➖➖➖✍️


*ఆడవారు ముక్కుపుడక ఎందుకు ధరించాలి......!!!*

*మంగళసూత్రంలా ముక్కెర కూడా?!*


*ఆడవారు ముక్కుపుడక ధరించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఆడవారు ముక్కుపుడక ధరించడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో మీకు తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి….* 


*సంప్రదాయం ప్రకారం వివాహ సమయానికి అమ్మాయిలకు ముక్కుపుడక తప్పనిసరి అని అనేది ఆచారం. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఈ విధానాన్ని ఆచరిస్తున్నారు. ఏడు, పదకొండు సంవత్సరాలకు ముక్కు కుట్టిస్తారు. కానీ చిన్న వయస్సులో కుట్టించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిదట.*


*ముక్కుకి కుడివైపున సూర్యనాడి ఉంటుంది. కుడివైపు ముక్కుకు మండలాకారమైన ఒకరాయి ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి.* 


*అలాగే ఎడమవైపున చంద్రనాడి ఉంటుంది. అందువల్ల ముక్కుకు ఎడమవైపున అర్ధ చంద్రాకారంలోని ముక్కు పుడక ధరించాలని పండితులు చెప్తున్నారు.* 


*మరోవైపు ముక్కు ఎడమవైపున ముక్కుపుడక ధరించడం ద్వారా ఆడవారికి గర్భకోశవ్యాధులు తగ్గుతాయట. పురుటి నొప్పులు ఎక్కువ కలగకుండా సుఖ ప్రసవం అవడానికి సహకరిస్తుందట. కన్ను, చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయట. చెవికి సంబంధించిన వ్యాధులు అనగా చెవిపోటు, చెవుడు వంటివి కలుగకుండా ముక్కుపుడక సహాయపడుతుంది. అంతేకాదు దీన్ని ధరించడం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు ధరిచేరవు ప్రత్యుత్పత్తి మెరుగుపడుతుందని వైద్యులు చెప్తున్నారు.*


*ఇంకా అందం కోసం ముక్కుపుడకను ధరించే మహిళలు ఎక్కువ.* 


*భామాకలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది. ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్లనంటుంది. విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుంది. అది ఇవ్వగానే లంకెబెందెలు దొరికినంత సంతోషంతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రాయబారం నడుపుతుంది.* 


*దేవతలందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది. బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు.*


*అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న సాంప్రదాయం. బయటి వాళ్ళెవరైనా ఇవ్వజూపితే అది చాలా తప్పు.* 


*తాళిబొట్టు మాదిరిగానే వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం తీయరు కొందరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా చెబుతారు.*✍️


🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀