31, అక్టోబర్ 2020, శనివారం

అరుణాచల శివ 🙏

 అరుణాచల శివ 🙏




' సద్దర్శనము - సద్విద్య' (ఉన్నది నలుబది)

          -భగవాన్ శ్రీ రమణ మహర్షి



శ్లోకం : 32


 గవేషణా త్ప్రాప్య హృదన్తరం త

 త్పతే దహాన్తా పరిభుగ్నశీర్షా l

 అథాహమన్య త్స్ఫురతి ప్రకృష్టం

 నాహంకృతి స్త త్పరమేవ పూర్ణం ll



అహంభావము హృదయమధ్యమున అన్వేషించి తన మూలస్వరూపమునుపొంది పైకి రాజాలక ఆ మూలస్వరూపమునందు లయమునొందును. ఆ అహంభావము లయించిన పిదప ఉత్తమమైన - విశుద్ధమైన - మరియొక 'అహం' రూపము భాసించును. అది పూర్వోక్తమైన అహంభావము కాదు. అది అఖండమైన పరమాత్మతత్త్వమే.


'అహం' పదమునకు వాచ్యార్థమైన ఆత్మాభాసమగు అహంకారము నశించినపుడు కాలత్రయమునందును అనుసరించునదై, 'అహం' పదమునకు లక్ష్యార్థమైన, శుద్ధమైన, అహంవృత్తి-మేఘములు తొలగిన పిదప సూర్యుడువలె భాసించును.


ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏

కామెంట్‌లు లేవు: