31, అక్టోబర్ 2020, శనివారం

ఆధ్యాత్మిక జీవనము*

 *ఆధ్యాత్మిక జీవనము*


ఇంద్రియాలు మనకు అందించే జ్ఞానం గురించి మనం చాలా ఎక్కువ ఆలోచిస్తుంటాము. బాహ్య వస్తువులను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నామని అనుకుంటాము. కానీ అది నిజం కానే కాదు. బాహ్య వస్తువుల నుంచే ప్రేరణ బయలుదేరి, మనకంటి ద్వారా మనస్సుకు చేరి, తర్వాత మనలోని జ్ఞాతకు అనుభూతిని కలుగజేస్తోంది. ఇదంతా ఎంత డొంక తిరుగుడుగా జరుగుతున్నదో గమనించారా. దీనినే మనం జ్ఞానం అని పిలుస్తున్నాము.


నిజమైన ప్రత్యక్షానుభూతిలో లేదా అపరోక్షానుభూతిలో ఆత్మ యొక్క స్వప్రకాశం వలన సత్యం నేరుగా అవగతం అవుతుంది.  అంతరాత్మ యొక్క ఈ అంతర్జ్యోతి మనస్సు, ఇంద్రియాల ద్వారా భాసిస్తూ ఉంటుంది. అంతేకాక అది తానుగా కూడా ప్రకాశించగలదు.


ఇదే *మహాచైతన్య* స్థితి. దీనినే *తురీయం* అని కూడా అంటారు. మన అనుభవం మూడు అవస్థలలో ఉంటుంది. ఇవి జాగ్రత్ (మేలుకుని ఉన్నప్పటి స్థితి), స్వప్న (కలలు కనే స్థితి), సుషుప్తి (గాఢ నిద్ర). 


ఈ మూడింటికి  భిన్నమైనది మరొకటి ఉంది. అదే తురీయం. అది ఒక అవస్థ కాదు. అది భావాతీతమూ, మహాచైతన్యవంతమూ అయి ఉంటుంది. మొదటి మూడు అవస్థలూ దాని యొక్క పాక్షికస్వరూపాలే. ఆ అవస్థలో మనలోని ఆత్మ, తాను పరమాత్మ యొక్క అంశనని తెలుసుకుంటుంది.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: