23, నవంబర్ 2020, సోమవారం

సోమవార వ్రతం

 🌹🌾🌺🌷💐🌸🥀


*కార్తిక మాసంలో సోమవార వ్రతం చేసే విధానం ఏమిటి?*


*కార్తిక మాసంలో సోమవారం అని వారం పేరు తలుచుకున్నా వెయ్యిసార్లు శివుణ్ణి తలచినట్లేనని అంటారు.*


*దీన్నిబట్టి కార్తిక సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజని ఆర్ధమవుతుంది. ఆ రోజు చేసిన పూజలకు, అభిషేకాలకు, దానాలకు ఈశ్వరుడు అధికంగా సంతుష్టుడవుతాడు.*


*భక్తుల సర్వ అభీష్టాలను తీరుస్తాడు. కార్తిక సోమవారం నాడు చేసే శివనామస్మరణ సద్యోముక్తిని కలిగిస్తుంది.*

               M.s.s.k

*కార్తికసోమవారంనాడు శివుడికి శక్తికొద్దీ పూజ చేస్తే జన్మజన్మలపాపాలు నశిస్తాయని స్వయంగా శివుడే పార్వతికి చెప్పాడు.*


*ఒకసారి ఆకాశ మార్గాన పార్వతీపరమేశ్వరులు విహరిస్తుండగా పార్వతీదేవికి పరమేశ్వరుణ్ణి ఈ వ్రతాన్ని గురించి అడిగింది. "నాథా! వర్ణభేదాలు లేకుండా సకల మానవకోటి ఆచరించగలిగే ప్రతం ఏదైనా ఉందా? శాస్త్ర సమ్మతమైనది, ఆచంద్రతారార్కం మానవులకు శుభఫలాలను అందించే వ్రతాన్ని చెప్పమని పార్వతి కోరింది.*


*దానికి ఈశ్వరుని సమాధానమే సోమవార వ్రతం.*

             M.s.s.k

*సూర్యోదయం నుంచి ప్రదోష కాలం వరకూ ఉపవాసం చేసి అభిషేక అర్చనలతో సోమవారం తనను పూజించినవారికి సమస్త శుభఫలాలు సమకూరుతాయని శివుడు బోధించాడు*


*ఈ వ్రత మాహాత్మ్యాన్ని గురించి వశిష్ట మహర్తి జనకమహారాజుకు చెప్పాడు కార్తికపురాణంలోని సోమవార వ్రత కథ ప్రముఖమైనది.*


*మిత్రశర్మ, స్వాతంత్ర్య నిష్ఠురి అనే దంపతుల కథ ఇది. నిష్ఠురి తన భర్త మిత్రశర్మను నిద్రలో ఉండగా చంపుతుంది.*


*ఆ పాపానికి గాను నరకంలో శిక్ష అనుభవిస్తుంది. తరువాత కుక్కగా పుడుతుంది.*

     

*ఒకరోజు తినడానికి ఏమీ దొరక్క ఆ కుక్క ఆకలితో అలమటిస్తూ తిరగసాగింది. ఒకానొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తిక సోమవార వ్రతాన్ని ఆచరించి బలి అన్నాన్ని బయట పెట్టగా దాన్ని ఆ కుక్క తినేసింది ఆత్మజ్ఞాన సంపన్నుడైన బ్రాహ్మణుడు సోమవార వ్రత ఫలాన్ని ఆ కుక్కకు ధారబోయగా దానికి ముక్తి లభించింది. శివసాన్నిధ్యానికి వెళ్లింది.*


*జన్మజన్మల పాపాలన్నింటినీ తొలగించగలిగే శక్తి కార్తిక సోమవారం వ్రతానికి ఉందని ఈ కథ తెలియచేస్తుంది.* 


*ఇంతకూ సోమవారవ్రతం అంటే కార్తిక సోమవారం నాడు పగటి ఉపవాసంతో నక్షత్రదర్శనం వరకు శివధ్యానం చేయడం మాత్రమే.*

                  *భక్తి*

                 M.s.s.k

కామెంట్‌లు లేవు: