23, నవంబర్ 2020, సోమవారం

కారు కధ

 కారు కధ 

అనగనగా ఒక కారు.  కారు అంటే అదేదో ప్రత్యేకమైనది అని అనుకోకండి. సాదా సీదా కారు. దానికి అన్నిటికి వున్నట్లే అన్ని పార్టులు వున్నాయ్. కీ తిప్పితే స్టార్టు అవుతుంది గేరు వేసి యాక్సిలరేటర్ తొక్కితే కదులుతుంది. క్లేచ్చి బ్రేకులు అన్ని సరిగ్గా వుంది రోడ్డుమీద చక్కగా ప్రయాణిస్తున్నది. ఇది ఇలా ఉండగా 

ఒకరోజు నాలుగు టైరు ఛేక్రాలు ఒక మీటింగు పెట్టుకున్నాయి. అవి ఇలా అనుకున్నాయి. మనం ఐదు చెక్రలము వున్నాము అంటే వాటి దృష్టిలో స్టీరింగ్ చెక్రముతో కలిపి అయినా మనమే ఈ కారు బరువు మోస్తూ ఈ కారుని ఎక్కడికంటే అక్కడికి ఆ స్టీరుంగు తిప్పినట్లుగా వింటూ తిప్పుతున్నాము. ఎండలో, వానలో బురుజాలో చివరికి రాళ్ళలో, ఎత్తుపల్లాలలో ఏమాత్రం విసుక్కోకుండా అన్ని బాధలు పడుతూ తిప్పుతుంటే ఆ స్టీరింగ్ చక్రం మాత్రం చక్కగా మెత్తటి కవరు వేసుకొని మన యజమాని సున్నితపు చేతులలో వయ్యారంగా తిరుగుతున్నది. చక్కగా మన యజమానితో పాటు ఏసి లో జాం జాం అనుటు పాటలు వింటూ ఆనందంగా వున్నది. ఏమిటి మన దురదృష్టం. మనం కూడా దానిలాగా ఉంటే యెంత మంచిగా ఉంటుంది అని ఒక టైరు చక్రం అంటే మిగితా మూడు చక్రాలు కూడా అవును అవును అని వత్తాసు పలికాయి. ఈ విధంగా అనుకోని అవి ఒక తీరుమానం చేసాయి. మనం మన హక్కులకోసం పోరాడుదాము అన్నాయి. వాటికి తోడు యెర్ర లైటు కూడా నేను మీకు సహకరిస్తాను అని అన్నది. వెంటనే అవి చేసిన తీరుమానంతో యజమాని వద్దకి వెళ్లి వాటి డిమాండ్లు చెప్పాయి. 

వాటికి భయపడిన యజమాని సరే అని ఒప్పుకున్నారు. అప్పుడు వెంటనే స్టీరింగ్ చక్రాన్ని తీసి ఒక టైరు చక్రాన్ని ఫిట్ చేసాడు. ఆ స్టీరింగ్ చక్రాన్ని వెనుక టైరు చక్రంగా ఫిట్ చేసాడు.  ఆ చకార్లు సరిగా ఫిట్ కాలేదు కానీ బలవంతంగా ఫిట్ చేయాలిసి వచ్చింది. 

ఇప్పుడు చుడండి స్టీరింగ్ చక్రం స్థానంలో టైరు చక్రం ఉండటంతో యజమాని కూర్చోటం కూడా కష్టం అయ్యింది. ఇక వెనుక చక్రం స్థానంలో స్టీరింగ్ చక్రం ఫిట్ చేయటంతో అది పూర్తిగా కుంగి ఉండటంతో బాలన్సు సరిగా లేదు. 

ఆలా ఉండటంతో కారు నడవటం చాలా కష్టంగా తయారయింది. ఇటు డ్రైవరుకు స్టీరింగ్ చక్రం తిప్పటం కష్టంగా ఉంటే అటు టైరు చక్రం స్థానంలో వున్న స్టీరింగ్ చక్రం బరువు మోయలేక పోతున్నది. చిన్న చిన్నగా కదులుతూ కదలలేక కదులుతూ వున్నది.  కానీ ఈ కారు తోటి కారులు మాత్రం చక్కగా వేగంగా ముందుకు పోతున్నాయి. 

ఇప్పుడు ఈ కారు మన దేశం అనుకోండి. మిగిలిన విషయాలు ఇక నేను చెప్పక్కరలేదు. 

 

కామెంట్‌లు లేవు: