చాణక్య నీతి
బ్రతుకంగవృత్తియు , బంధువర్గంబు ,
ఆగమవిద్యయు , నాత్మగౌరవము ,
అభివృద్ధి కొఱకునై నవకాశములును ,
మేల్గోరు వారలు , మిత్రవర్గంబు ,
లే దేశమందున యెన్నంగ లేవొ
యా దేశమందున నావాసముంట
నరయ చింతించంగ నవివేకమగును.
వణిజుండు , బాపడు , వైద్యున్డు , రాజు ,
నిరతంబుపాఱెడు నిర్మలనదియు ,
పైన చెప్పినయట్టి పంచ యంశములు
యున్నట్టి యూరిలో నుండుము యెపుడు .
అవిలేని సమయాన ననిశంబు నీవు
వూరిని వదులుము నుండకో క్షణము.
ఇహలోక యాత్రకై వీలగు వృత్తి ,
పాపచింతలనుండి భద్ర తభయంబు ,
చెడుకార్యములుసేయ సిగ్గులజ్జయును ,
దాతృత్వమున దేలు దాక్షిణ్యవరులు ,
తగుశక్తి నిచ్చెడి త్యాగులౌ నరులు ,
యెచ్చోట నుండరో యెంచి చూడగను
నచ్చోట నుండుట యర్హత గాదు
✍️గోపాలుని మధుసూదన రావు
🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి