23, నవంబర్ 2020, సోమవారం

శివాష్టకమ్:-1*

 శివాష్టకమ్:-1*


*ప్రభుం ప్రాణనాథం, విభుం విశ్వనాథం*

*జగన్నాథనాథం సదానందభాజమ్,*

*భవద్భవ్య భూతేశ్వరం, భూతనాథం*

*శివం శంకరం  శంభుమీశానమీడే.*

*తా:-* కృపాళువు,పరమపావనుడు,
దయామయుడైన ప్రభువు,అందరి జీవితాలకి అధిపతి,అతి శక్తివంతమైన జగత్ప్రభువు,
విష్ణువుకి నాథుడు,ఎల్లప్పుడూ ఆనందపారవశ్యంలో ఉండేవాడు,
జగత్తులన్నిటికి వెలుగు,తేజస్సు ప్రసాదించువాడు,జీవకోటికి ప్రభువు,
భూతమునకు,సర్వులకు ప్రభువైన నీకు నా ప్రణామములు.

కామెంట్‌లు లేవు: