23, నవంబర్ 2020, సోమవారం

అభరణాలు ధరిస్తే శుభం..?

 ఏ రోజు ఏ అభరణాలు ధరిస్తే శుభం..?


మహిళలు నిత్యం అభరణాలు ధరిస్తారు. సందర్భాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. అయితే గ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించాల్సి ఉంటుంది. ఏ రోజు ఏ రకమైన నగలు ధరిస్తే మంచిదో తెలుసుకోవడం ముఖ్యం.


వారంలో రోజుకో గ్రహాధిపతి ఉంటాడు. ఆదివారానికి సూర్యుడు అధిపతి అయితే, శుక్రవారానికి శుక్రుడు అన్నట్టు.. ఆయా వారాలన్ని బట్టి ఆ రోజుకి ఉండే గ్రహాదిపతిని అనుసరించి ఏ నగలు ధరించాలో తెలుసుకోవాలి. నిత్యం నవగ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి.


అయితే బంగారంతో పొదిగించిన ఆభరణాలు లేకపోయినా.. తమ తమ స్థోమతకు తగినట్లు ఇప్పుడు దుకాణాల్లో అమ్మబడే ఆభరణాలతో ప్రతిరోజూ అలంకరణ చేసుకోవడం మంచిది.


ఇక ఏ వారంలో ఎలాంటి ఆభరణాలు ధరించాలో తెలుసుకుందాం.


* ఆదివారం (సూర్యగ్రహానికి ప్రీతికరమైన రోజు) కెంపులతో చేసిన నగలు.. చెవిపోగులు, హారాలు మొదలగునవి ధరించడం శుభప్రదం. దీనిద్వారా నేత్ర సంబంధిత వ్యాధులు, శరీర తేజస్సు, ప్రకాశవంతం పొందవచ్చును.


* సోమవారం (చంద్రగ్రహానికి ప్రీతికరమైన రోజు) ముత్యాలతో తయారు చేసిన ఆభరణాలు.. హారాలు, గాజులను వేసుకోవడం మంచిది. ముత్యాలతో తయారయ్యే గాజులను, చెవిపోగులను వాడటం ద్వారా మనశ్శాంతి, అనుకున్న కార్యములో విజయం చేకూరుతుంది.


* మంగళవారం (కుజ గ్రహానికి ప్రీతికరమైన రోజు) పగడాలతో చేసిన ఆభరణాలు.. దండలు, ఉంగరాలను వాడటం మంచిది. పగడాలతో తయారైన ఉంగరాలను, దండలను వాడటం ద్వారా కుటుంబ సంక్షేమం చేకూరటం, ఈతిబాధలు తొలగిపోవడం వంటి ఫలితాలుంటాయి.


* బుధవారం (బుధ హానికి ప్రీతికరమైన రోజు) పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి వాడటం మంచిది. విద్యాకారకుడైన బుధునికి ప్రీతికరమైన ఈ రోజున విద్యార్థులు పచ్చని రంగుతో కూడిన ఉంగరాలు, స్త్రీలతే హారాలు వినియోగించడం మంచిది. దీంతో బుద్ధికుశలతలు పెరగడం, ధనలాభం, కార్యసిద్ధి చేకూరుతుంది.


* గురువారం బృహస్పతి (గురుభగవానుడు) కోసం పుష్యరాగముతో తయారైన చెవిపోగులు, ఉంగరాలు వంటి ఆభరణాలు ధరించడం మంచిది. దీంతో గురుగ్రహ ప్రభావంతో అవివాహితులకు కళ్యాణం జరగడం, వ్యాపారాభివృద్ధి, కార్యసిద్ధివంటి ఫలితాలుంటాయి.


* శుక్రవారం శుక్రుని (శుక్రగ్రహం) కోసం వజ్రాల హారాలు, ముక్కుపుడక వాడటం ద్వారా స్త్రీలకు సౌభాగ్యం, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం, పదోన్నతులు, అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. లక్ష్మిదేవి అనుగ్రహం కూడా పొందినవారవుతారు.


* శనివారం (శనిగ్రహం) శనికోసం నీలమణి, మణిహారాలు వంటి ఆభరణాలు ధరించడం మంచిది. దీనిద్వారా శనిగ్రహ ప్రభావంతో తలెత్తే సమస్యలు కొంతవరకు సమసిపోతాయి. నీలమణితో తయారైన హారాలు చెవిపోగులు, ఉంగరాలు ధరించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

కామెంట్‌లు లేవు: