17, అక్టోబర్ 2021, ఆదివారం

 *వాక్సిన్స్---ఎంత వరకు పని చేస్తున్నాయి*


డా౹౹వేణు గోపాల రెడ్డి


ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు200 కోట్లమందికి వాక్సిన్ ఇవ్వడం జరిగింది. చాలా మంది వాక్సిన్స్ పై నమ్మకం కలిగుండాగా కొంతమంది మాత్రం వాక్సిన్స్ ని ఇప్పటికి నమ్మడం లేదు. వాక్సిన్స్ వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ అని వారు ప్రచారం చేస్తున్నారు... అసలు నిజాలేమిటి


1. వాక్సిన్స్ ఎంతవరకు సమర్ధవంతంగా పని చేస్తున్నాయి.


ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు సేకరించిన సమాచారం మేరకు వివిధ వాక్సిన్స్ సమర్ధత 80% నుండి 95%. ఏ వాక్సిన్ కూడా 100% పనిచేయడం లేదు. వ్యక్తుల వయసు, ప్రాంతం, ఇతర వ్యాధులు తదితరం వాక్సిన్ పనితీరుపై కీలక ప్రభావం చూపిస్తుంది. మొత్తం మీద వాక్సిన్స్ పనిచేస్తున్నాయి.


2. వేరియంట్ ల పై వాక్సిన్ పని తీరు ఎలా ఉంది.


వాక్సిన్స్ వాస్తవానికి వైల్డ్ స్ట్రైన్ స్పైక్ ప్రోటీన్ ఆధారంగా చేయబడ్డాయి. అప్పట్నుంచి వైరస్ చాలా mutate అవుతూ ఉంది. కొత్త వేరియంట్ రావడం జరిగింది...కొత్తవి ఇంకా రావచ్చు. ఇప్పుడున్న వాక్సిన్స్ వేరియంట్ మీద ప్రభావం తగ్గవచ్చు, కానీ అసలే పనిచేయవు అనేది నిజం కాదు. వేరియంట్ కు అనుగుణంగా వాక్సిన్స్ ని కూడా అప్డేట్ చేయనున్నారు. భవిష్యత్లో బూస్టర్ డోసులు అవసరం అవుతాయి కాబోలు.


3.వాక్సిన్ ఒక సారి తీసుకుంటే ఎంతకాలం రక్షణ ఉంటుంది.


ఇప్పటివరకు ఉన్న పరిశోధనల ప్రకారం వాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి 8 నెలల నుండి ఒక సంవత్సరం వరకు రక్షణ ఉంటుంది. మళ్ళీ బూస్టర్ డోస్ అవసరమా అనే అంశంపై పరిశోధన జరుగుతుంది


4. వాక్సిన్స్ వైరస్ వ్యాప్తిని నిరోధిస్తాయా


వాక్సిన్స్ వైరస్ ఒక వ్యక్తి నుండి వేరేవారికి వ్యాప్తి చెందే అవకాశాన్ని 74% తగ్గిస్తున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి


5. వాక్సిన్ సురక్షితమేనా?


ఏ వాక్సిన్ కూడా 100% సురక్షితం కాదు. అన్ని వాక్సిన్స్ కు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కరోన వాక్సిన్స్ లో 10 లక్షల మందికి 5 గురికి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ గమనించడం జరిగింది. వైరస్ వల్ల జరిగే నష్టంతో పోలిస్తే ఇది కొన్ని వేల రెట్లు సురక్షితం


6. వాక్సిన్స్ వల్ల కోవిడ్ వ్యాప్తి తగ్గిందా


వాక్సిన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కరోన కేసుల వేగం తగ్గింది. ఆసుపత్రులలో చేరాల్సిన అవసరం, icu చికిత్సలు తగ్గాయి. వైద్యావ్యవస్థ పై ఒత్తిడి తగ్గింది. మరణాల సంఖ్య తగ్గింది. వాక్సిన్స్ బహుళ ప్రయోజనకారిగా పనిచేస్తున్నాయి.


అపోహాలు వీడండి....వాక్సిన్ తీసుకోండి.... అసలే థర్డ్ వేవ్ మేఘాలు కమ్ముకుంటున్నాయి


*కరోన నుండి రక్షణ ౼ దశ సూత్రాలు*


1. సమూహాలకు దూరంగా ఉండాలి


2. భౌతిక దూరం పాటించాలి


3. మాస్కు, వీలయితే డబుల్ మాస్కు, ఫేస్ షిల్డ్ ధరించాలి


4. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి


5. వాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలి


6. వ్యాయామం రోజు చేయాలి....ఎండలో కనీసం 30 నిమిషాలు గడపాలి


7. నిద్ర నిండుగా 8 గంటలు ఉండేలా చూసుకోవాలి


8. పోషక ఆహారం తీసుకోవాలి


9. సానుకూలంగా ఆలోచించాలి


10. ఆరోగ్య జీవనశైలి అలవర్చుకోవాలి


Dr. A. Venu Gopala Reddy

MSc. PhD. Microbiology

Principal, TSMS, VEENAVANKA, KARIMNAGAR DIST

75697 62669


Please share

కామెంట్‌లు లేవు: