17, అక్టోబర్ 2021, ఆదివారం

సీతమ్మ మాటలు - అంతరార్థం

 ॐ సీతమ్మ మాటలు - అంతరార్థం 

          

    సీతమ్మ శ్రీరామునితో అరణ్యాలకి వెళ్ళడానికి స్వామిని ప్రాధేయపడుతున్నప్పుడు మధ్యలో అన్న మాటలు,   

    జీవుడు పరమాత్మతో కూడినపుడు, భౌతికంగా ఉండే ఆహారవ్యవహారాదులు ఎలాఉన్నా,  

     పరమాత్మతో కలసి ఉన్న ఆనందం వల్ల, అవి అత్యంత గొప్పవిగానే అనుభూతినిస్తాయి - అనేది అంతరార్థం. 


    Sita, while praying Rama to allow her to accompany with him to the forests, spoke a few words about the physical discomforts. 

    She says all those will be the most comforts if she stays with him. 


INNER MEANING 


    When the Individual Soul links to the Universal Soul,  

    the physical discomfots also will appear as the most comforts. 


ఆ శ్లోకాలు 


        కుశకాశశరేషీకా యే చ

        కణ్టకినో ద్రుమాః I

        తూలాజినసమస్పర్శా 

       మార్గే మమ సహ త్వయా ৷৷ అయోధ్యకాండ 30/12  

    

    వనములలో సంచరించుచున్నప్పుడు మార్గమునందుగల దర్భలు, ఱెల్లుగడ్ది, ముళ్ళదుబ్బులు, ముళ్ళచెట్లు సైతము 

    నీ సాహచర్యప్రభావమున 

    దూది, జింకచర్మము మున్నగువానివలె సుఖస్పర్శనే గూర్చును.  

    అవి నాకు ఏ మాత్రము బాధాకరములు గావు. 


    The white reeds, the kusha, the sara and the ishika grasses and thorny trees on the way 

     will feel as soft as cotton or as the skin of a black antelope. 


        మహావాతసముద్ధూతం 

        యన్మామపకరిష్యతి I 

        రజో రమణ! తన్మన్యే 

        పరార్థ్యమివ చన్దనమ్ ৷৷     

               - అయోధ్యకాండ 30/13  


 ప్రాణేశ్వరా!  

    సుడిగాలులకు ఉవ్వెత్తుగా లేచివచ్చి పైబడిన దుమ్ములకును నేనేమియు బాధపడను. 

    వాటిని నేను మేలైన చందనములవలె భావింతును.  


 O charming Rama! 

     I shall regard, the harmful dust raised by the stormy wind and settled on me, as the most excellent sandal powder. 


        శాద్వలేషు యథా శిశ్యే 

        వనాన్తే వనగోచర! I  

        కుథాస్తరణతల్పేషు కిం 

        స్యాత్సుఖతరం తతః ৷৷ 30/14  


నాథా!  

    నీతోగూడి వనమునందు పచ్చికబయళ్ళపై పరుండినను

    అవి నాకు చిత్రకంబళములతో గూడిన తల్పములకంటెను మిక్కిలి సుఖమునే గూర్చును.  


O rover of the forest! 

    I will feel happier when I sleep on the meadows (of tender green grass) on the outskirts of the forest than 

    when I sleep on the couch spread with carpets.  


        పత్రం మూలం ఫలం యత్త్వ - 

        మల్పం వా యది వా బహు I  

        దాస్యసి స్వయమాహృత్య 

        తన్మేమృతరసోపమమ్ ৷৷ 30/15 


స్వామీ!  

    నీవు స్వయముగా తెచ్చిన ఆకులు, కందమూలములు, పళ్ళు మొదలైనవి ఏవైనా, 

     కొంచెంగా అయినా సమృద్ధిగా అయినా 

     నాకు అవి అమృతతుల్యములే! 

    

    Whatever leaves or roots or fruits you collect with your own hands for me little or much, 

     they will be nectar to me. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

కామెంట్‌లు లేవు: