17, అక్టోబర్ 2021, ఆదివారం

సంస్కృత మహాభాగవతం*

 *17.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదహారవ అధ్యాయము*


*పరమాత్ముని విభూతుల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*16.17 (పదిహేడవ శ్లోకము)*


*ఐరావతం గజేంద్రాణాం యాదసాం వరుణం ప్రభుమ్|*


*తపతాం ద్యుమతాం సూర్యం మనుష్యాణాం చ భూపతిమ్॥12827॥*


*16.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*ఉచ్చైఃశ్రవాస్తురంగాణాం ధాతూనామస్మి కాంచనమ్|*


*యమః సంయమతాం చాహం సర్పాణామస్మి వాసుకిః॥12828॥*


*16.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*నాగేంద్రాణామనంతోఽహం మృగేంద్రః శృంగిదంష్ట్రిణామ్|*


*ఆశ్రమాణామహం తుర్యో వర్ణానాం ప్రథమోఽనఘ॥12829॥*


నేను గజరాజులలో ఐరావతమును. జలచరములకు ప్రభుడైన వరుణుడను. తపింపజేయువాడు, ప్రకాశమును ఇచ్చువాడు ఐన సూర్యుడను నేను. మానవులలో మహారాజును. అశ్వములలో ఉచ్చైశ్రవమును, ధాతువులలో బంగారమును, శాసించువారిలో యముడను, సర్పములలో వాసుకిని. నాగేంద్రులలో అనంతుడను, ఆదిశేషుడను. కొమ్ములు, కోఱలుగల ప్రాణులలో మృగరాజైన సింహమును, చతురాశ్రములలో నేను సన్న్యాసాశ్రమమును. నాలుగు వర్ణములవారిలో బ్రాహ్మణుడను నేనే.


*16.20 (ఇరువదియవ శ్లోకము)*


*తీర్థానాం స్రోతసాం గంగా సముద్రః సరసామహమ్|*


*ఆయుధానాం ధనురహం త్రిపురఘ్నో ధనుష్మతామ్॥12830॥*


*16.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*ధిష్ణ్యానామస్మ్యహం మేరుర్గహనానాం హిమాలయః|*


*వనస్పతీనామశ్వత్థ ఓషధీనామహం యవః॥12831॥*


*16.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*పురోధసాం వసిష్ఠోఽహం బ్రహ్మిష్ఠానాం బృహస్పతిః|*


*స్కందోఽహం సర్వసేనాన్యామగ్రణ్యాం భగవానజః ॥12832॥*


*16.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*యజ్ఞానాం బ్రహ్మయజ్ఞోఽహం వ్రతానామవిహింసనమ్|*


*వాయ్వగ్న్యర్కాంబువాగాత్మా శుచీనామప్యహం శుచిః॥12833॥*


పవిత్ర నదులలో గంగానదిని, జలాశయములలో సముద్రమును, ఆయుధములలో ధనుస్సును, ధనుర్ధారులలో త్రిపురారియైన శంకరుడను, నివాసస్థానములలో మేరు పర్వతమును, దుర్గమప్రదేశములలో హిమాలయమును, వనస్పతులలో రావిచెట్టును (అశ్వత్థవృక్షమును). ధాన్యములలో యవధాన్యమును, పురోహితులలో వసిష్ఠుడను. వేదవేత్తలలో బృహస్పతిని. సేనాధిపతులలో కుమారస్వామిని, సన్మార్గప్రవర్తకులలో బ్రహ్మదేవుడను, పంచమహాయజ్ఞములలో బ్రహ్మయజ్ఞమును (స్వాధ్యాయ యజ్ఞమును), వ్రతములలో అహింసావ్రతమును, శుద్ధమొనర్చు పదార్థములలో నిత్య శుద్ధములైన వాయువు, అగ్ని, సూర్యుడు, జలము, వాక్కు, ఆత్మను నేనే.


*16.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*యోగానామాత్మసంరోధో మంత్రోఽస్మి విజిగీషతామ్|*


*ఆన్వీక్షికీ కౌశలానాం వికల్పః ఖ్యాతివాదినామ్॥12834॥*


*16.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*స్త్రీణాం తు శతరూపాహం పుంసాం స్వాయంభువో మనుః|*


*నారాయణో మునీనాం చ కుమారో బ్రహ్మచారిణామ్॥12834॥*


యోగములలో మనస్సును నిరోధింపగల సమాధియోగమును నేను. శత్రువులను జయింపగోరువారి గోప్యయంత్రాంగమును (వ్యూహరచనను) నేను. ఆత్మానాత్మవివేక చర్చయందు నేను బ్రహ్మవిద్యను. పరస్పరవాద వివాదములలో తత్త్వనిర్ణయమునకై చేయు వాదమును నేను. పురుషులలో స్వాయంభువ మనువును, స్త్రీలలో ఆయన భార్యయైన శతరూపను నేను. మునులలో నారాయణమహర్షిని, బ్రహ్మచారులలో (జితేంద్రియులలో) సనత్కుమారుడను నేను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదహారవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: