8, ఏప్రిల్ 2022, శుక్రవారం

తల్లిదండ్రులు

 🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂 తల్లిదండ్రులు, కొడుకులు, కూతుళ్ళు పరస్పరం ఎలా (ఒకరియెడల‌ మరొకరు) ప్రవర్తించాలి?

సమాధానం:-తల్లిదండ్రులు,_"ఈ కొడుకులు, కూతుళ్ళు,మన ఇంట పుట్టారు.కనుక మనం వీరి ఐహిక పారలౌకిక  క్చేమం ‌చూడాలి.మనం కేవలం సుఖశాంతులు చూచుకోవటం కాదు, వీరిని బాగుచేయడం ఎలా?అనే భావంతో‌ సంతానం మీద అధికారం చేయాలి, వాళ్ళని క్రమశిక్షణ లో పెట్టాలి.వాళ్ళకి 

మంచి విద్య నేర్పించాలి.అవసరార్ధం దండింఛ వలసి‌ వచ్చిన అది వారి మేలు కోసమే చెయ్యాలి.

సంతానం మేమనుకోవాలి?

అంటే ఈ శరీరం ద్వారా మనం పరమాత్ముని పొందగలం.ఈ శరీరం, మనకి తల్లిదండ్రులు వలన లభించింది.కనుక మనవలన వారికి ఎన్నడూ దుఃఖము కలుగరాదు.మనవలన‌,

వీరికి అపకీర్తి రాకుండా ఉండాలి.మన ప్రవర్తన వీరికి లోకంలో గౌరవసత్కారాలు పెంచేదిగా ఉండాలి.మనం చేసే

తీర్థ,సేవన,వ్రతాది శుభకార్యాలు ఏ‌‌ కొద్దివి అయినా వాటి వలన కలిగే పుణ్యఫలం తల్లిదండ్రులు కే లభించాలి.ఇటువంటి భావనవలన ఒకరిమీద ఒకరికి ప్రేమ పెరుగుతుంది.వర్తమానంలో కుటుంబం సుఖపడుతుంది.

భవిష్యత్తులో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది.🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

కామెంట్‌లు లేవు: