8, ఏప్రిల్ 2022, శుక్రవారం

బాల రోగములు

 శిశువులకు కలుగు రోగములు - 


   పసివారికి కలుగు రోగములను బాల రోగములు అని పిలుస్తారు . బాలురకు కూడా పెద్దవారి వలే సమస్త రోగములు కలుగును. కాని మరికొన్ని వ్యాధులు గ్రహదోషములు వలనను , మాతృకా దోషముల వలనను కూడా కలుగుచున్నవి. గ్రహాదుల వలన కలుగు వ్యాధులు కాక సామాన్యముగా కలుగు రోగములు 22 రకాలుగా ఉండును. అని శార్ఙ్గధరుడు వివరించెను . ఇప్పుడు మీకు వాటి గురించి సంపూర్ణముగా వివరిస్తాను . 


 * వాతజము - 


       వాతప్రకోపము చేత దేహమున పాలు దోషమును పొందినప్పుడు ఆ పాలను తాగించుట చేత శిశువు కంఠస్వరం మరియు శిశువు క్షీణించడం , మలమూత్ర , అపాన వాయువు నిరోధము కలుగుట వంటి సమస్యలు ఉత్పన్నం అగును . 


 * పిత్తప్రకోపం - 


         పిత్తప్రకోపం చెందుట చేత పాలు దోషం పొంది ఆ పాలు సేవించుట వలన సర్వదా చెమటపట్టుట , మలము బురద వలే వెడలుట , కళ్లు ఉబ్బు , సర్వాంగముల యందు వేడి కలిగి ఉండును. 


 * శ్లేష్మజము - 


          శ్లేష్మ వికారముచే చెడిన పాలను త్రాపుట చేత చొల్లు కారుట , అతినిద్ర , ఒడలు బరువు వంటి సమస్యలు కలుగును. 


 * ధంతో భేదము -  


          శిశువులకు కొత్తగా దంతములు మొలచునప్పుడు జ్వరం , భేదులు , వాంతులు , దగ్గు , తలనొప్పి కలిగి ఉండును. 


 * దంతఘాతము - 


          5 , 7 , 8 సంవత్సరముల వయస్సున దంతములు రాలుట చేత జ్వరం వంటి ఉపద్రవములు కలుగును. 


 * దంత శబ్దము ( దంత హర్షము ) - 


         శిశువులు నిద్రలో ఉన్నప్పుడు పళ్లు కోరుకుట  


 * అకాల దంతము - 


         శిశువులకు పండ్లూడు కాలమునకు ముందుగానే పండ్లు జ్వరాల వంటి ఉపద్రవాలు కలుగును. 


 * అహి పూతనము - క్షుద్రరోగము . 


         శిశువులు నిద్రించు సమయమున పక్క మీదనే మలమూత్రములు విసర్జించగా ముడ్డిని తుడవకగాని , కడగక ఉండటం వలన ముడ్డి యందు దురద కలిగి వ్రణము ఏర్పడును . 


 * ముఖపాకము - 


        శిశువుల నోరు పండినట్లు ఉబ్బుట . 


 * ముఖస్రావము - 


        శిశువుల నోట చొల్లు కారుట . 


 * గుదపాకము - 


         శిశువుల ముడ్డి పండి వ్రణం ఏర్పడుట . 


 * ఉపశీర్షకము - 


          శిశువుల కపాల స్థానమున వ్రణము ఏర్పడి జ్వరం వంటి ఉపద్రవాలు కలుగును. 


 * మహావిసర్పి - 


          శిశువుల శరీరం నందు వాతాదిదోషము వికారం పొందుట వలన మహాపద్మము అనే విసర్పి రోగము పుట్టును . ఇది చాలా తీవ్రంగా ఉండును. గుదస్థానము నందు ఎర్రటి తామర వలే ఉండును . హృదయము మొదలు శిరస్సు వరకు వేదనాభరితముగా ఉండును. 


 * తాలుకంటకము - 


         శిశువుల దవడల యందు శ్లేష్మ ప్రకోపము చేత ముండ్లవలే గరగరలాడుచుండి కఫము పడుట . 


 * విచ్ఛిన్నము - తాలు పాకము . - 


         శిశువుల దవడల యందు పల్లము పడుట చేత శిశువు పాలు త్రాగక నీళ్ల వలే మలము , విసర్జించునప్పుడు కడుపునొప్పియు , నేత్ర కంఠముల యందు వికారం , తాగినపాలు గొంతు దిగక కక్కుట వంటి సమస్యలు కలుగును. 


 * పారిగర్భికము - 


        తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చు పాలను శిశువు తాగుటచేత శిశువుకు ఆ దోషమున దగ్గు , అగ్నిమాంద్యము , వాంతులు , కండ్లమబ్బు , అరుచి , భ్రమ , కాళ్లు చేతులు సన్నం అగుట , కడుపు పెరుగుట మొదలగునవి కలుగును. ఈ సమస్య తల్లి గర్భముతో నుండకుండా ఉన్నను ఆమె పాలు తాగినను కొందరికి కలుగును. 


 * దౌర్బల్యము - 


         శిశువుల శరీరముకు దుర్బలత్వము కలుగుట. 


 * గాత్రశోషము - 


          ఏ దోషము వల్లనైనా శిశువు శరీరం కృశించుట . 


 * శయ్యా మూత్రము - 


         వాత వికారముచే శిశువు రాత్రియందు గాని పగటి యందు గాని పక్కపైన మూత్రమును పలుమార్లు విడుచును. 


 * కుకూనము - 


         చంటి పాల దోషముచే శిశువుల కనురెప్పల యందు దురద కలిగి దానిని నలుపుట చేత సూర్యుని తేజస్సు చూడనీయక పలుమార్లు కన్నీరు కార్చును . 


 * రోదనము - 


          పిల్లలు సదా ఏడ్చుచుండును. 


 * ఆజగల్లి - 


           శ్లేష్మ ప్రకోపము చేత శిశువు ల శరీరమున పెసరగింజల వంటి కురుపులు కలిగి వేదనాయుక్తమై శరీరం పాలిపోయినట్లు ఉండును. 


         పైన చెప్పిన విధముగా 22 రకాలుగా శిశు సంబంధ దోషములు కలుగును. సరైన పద్ధతిలో సమస్యని గుర్తించి చికిత్స చేయవలెను . 


    

         మీకు తెలిసినవారందరికి ఈ విషయం షేర్ చేయండి . మరిన్ని సులభయోగాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


      గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

కామెంట్‌లు లేవు: