8, ఏప్రిల్ 2022, శుక్రవారం

*శ్రీ విష్ణు సహస్రనామ విశ్లేసణ

 *శ్రీ విష్ణు సహస్రనామ విశ్లేసణ.* >>>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<                                                        *ఓం శ్రీ పరమాత్మనే నమః.*

*శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము హరిః ఓమ్*

ఈ స్తవరాజము *'ఓమ్'* అనుప్రణ వ పవిత్రాక్షరముతో ప్రారంభము అ గుచున్నది. ఓంకారము మంగళప్రద ము, పవిత్రము అగుటచేత ఆరంభ మునను,అంతమునను. ఈదివ్యమం త్రము గానము చేయ బడును ఇది ప్రణవమని పిలువబ డును.*'ఓమ్'.* అను మంత్రముతో భగవానుని ఉపాసించువాడు ముక్తి నిపొందుననిప్రశ్నోపనిషత్తుతెలుపు తున్నది. *"ఓమిత్యేకాక్షరంబ్రహా ఓమితిఇదగ్ం సర్వం”* అని మాం డుక్యోపనిషత్తు గానము చేయును. *“ఓం తద్బహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓ తత్సర్వం ఓం తత్సర్వం”* అనినారాయణోపనిష త్తు గానము చేయుచున్నది. *“ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహ రన్ మా మనుస్మరన్ యః ప్రయా తి త్యజన్ దేహం స యాతి పర మాగతిమ్”* - ఎవ్వడుఓంకారము ను ఉచ్చరించుచు దేహత్యాగము చేయునో వాడుపరమగతినిపొందు ను - అను గీతావాక్యము స్మరణీయ ము (గీత : 8-11)


*“ప్రణవః సర్వ వేదేషు”* - సర్వవే ద సారము ప్రణవమైయున్నది. (గీత :7-8) *“గిరా మస్మ్యేక మక్ష రం”* - వాక్కులయందు నేను ఓం కారమునైయున్నాను (గీత:10-25)

1వశ్లోకము - 1 వపేజీ శ్రీ విష్ణు సహ స్రనామ స్తోత్రము - వివరణ *“ఓం అథ”* అను ఈ రెండు శబ్దములు ను సృష్టి ప్రారంభమునబ్రహ్మదేవుని కంఠము నుండిఆవిర్భవించినమంగ ళ శబ్దములని శృతి గానముచేయు ను.                                          కావునమంగళప్రదమగు.ఓంకారపు ణ్య శబ్దముతో మంగళప్రదమగుఈ స్తవరాజము ప్రారంభమగుచున్నది. *"తస్య వాచకః ప్రణవః”* - భగ వానుని నామము ప్రణవమనిపతం జలి మహర్షి తెలిపియున్నాడు. *'ఓం'* అనునది భగవానుని నామ ముగా గీతా శాస్త్రమున (17-23) తెలుపబడియున్నది.                  *“ఓం” అని పిలిచినచో “ఓ”* య ని భగవానుడు పలుకునని భక్తుల యొక్క విశ్వాసము.                 కావున *'ఓమ్'* అను దివ్యనామ ముతో ఈ స్తవరాజము మంగళకర ముగా ప్రారంభమగు చున్నది.

                                                              *ఓంనమోభగవతేవాసుదేవాయ.                             ఓం శ్రీ విష్ణురూపాయ నమశ్శివా యనమః.                                                ఓంనమోనారాయణాయవిశ్వస్మైనమః.    (మానవసేవయేమాధవసేవ.)             .      సర్వేషాంశాన్తిర్భవతు.*                       .                                                                      *ఇంద్రగంటి శంకర ప్రసాద శర్మ.                               సింగరేణి సూపర్ బజారు వెనుక.         కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణారాష్ఠ్రం.*

కామెంట్‌లు లేవు: