🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺భార్యాభర్తల పరస్పర ప్రవర్తన ఎలా ఉండాలి?
సమాధానం:-భర్త, భార్య గురించి -"ఈమె తన తల్లిదండ్రులు, సోదరులు, సోదరీమణులు మొదలైన వారిని అందరినీ, విడిచిపెట్టి,నా దగ్గరకు వచ్చిందంటే ఎంత గొప్ప త్యాగం చేసింది? కనుక ఈమెకు ఏవిధమైన కష్టం కలగకుండా చూసుకోవాలి.జీవనం నిమిత్తం తిండి,బట్ట, ఇల్లు మొదలైన వాటికి లోటుండకూడదు.నాకంటే ఈమెకు ఎక్కువ సుఖం లభించాలి".అని భావిస్తూ ఆమె యొక్క పాతివ్రత్య ధర్మం విషయం కూడా ద్రుష్టి లో ఉంచుకోవాలి.అలాగే ఆమె గౌరవం నకు భంగం కలగకుండా చూసుకోవాలి.దానివలనఆమె హద్దులు మీరకపోవడం శ్రేయస్సు పొందటం జరుగుతుంది.
అలాగే భార్యకు ఎటువంటి భావం ఉండాలంటే -"నేను నా గోత్రం కుటుంబం మొదలైనవి త్యజించి వీరింటికి వచ్చానంటే సముద్రం దాటి ఇప్పుడు ఒడ్డు కు చేరుకుని మునిగిపోకూడదు.అంటే నేను ఇంతటి త్యాగం చేసి వచ్చాక ఇప్పుడు నా వలన వీరికి దుఃఖము కలుగకూడదు.వీరికి నా వలన అవమానం గానీ,నిందగానీ,తిరస్కారం గానీ,జరుగకూడదు.నావలన వీరికి నింద మొదలైనవి జరిగితే అది చాలా అనుచితమైన విషయం అవుతుంది.నేనెంత కష్టమైనా అనుభవింతునుగాక, కానీ వీరికి మాత్రం కించిత్తు అయినా కష్టం కలుగరాదు."అంటూ ఆమె తన సుఖసంతోషాలు త్యాగం చేసి పతి యొక్క సుఖసంతోషాలు ద్రుష్టిలో ఉంచుకుని ఆయన యొక్క ఇహపర శ్రేయస్సు కోరుకోవాలి.🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి