8, ఏప్రిల్ 2022, శుక్రవారం

వైద్యులకు శరదృతువు తల్లివంటిది

 శ్లోకం:☝️

*వైద్యానాం శారదీ మాతా*

    *పితాచ కుసుమాకరః l*

*యమదంష్ట్రా స్వసా ప్రోక్తా*

    *హితభుక్ మిత భుక్ రిపుః ll*


భావం: వైద్యులకు శరదృతువు తల్లివంటిది మరియు వసంతకాలం తండ్రివంటిది. ఈ రెండు కాలాలలో చాలామంది అస్వస్థతకు గురైయ్యే అవకాశం ఉన్నందున వైద్యులకు చేతినిండా పని ఉంటుందిట. అందువల్ల ఈ రెండు ఋతువులు మృత్యుదేవత అయిన యమధర్మరాజు యొక్క రెండు దంతాలుగా భావించవలసి యుంటుంది. దీనికి ఒకే ఒక పరిష్కారం హితాహారం మితాహారం తినడం.

కామెంట్‌లు లేవు: