8, ఏప్రిల్ 2022, శుక్రవారం

రాముడిని వదిలేసినా,

 రాముడిని వదిలేసినా, రాముడు వదిలేసినా మునిగిపోక తప్పదు.


శ్రీరాముడు ల౦క కు వెళ్ళటానికి రామసేతువు నిర్మాణ౦ జరుగుతో౦ది. 


వానరులు సముద్ర౦లో రాళ్లు వేస్తున్నారు. అవి తేలుతున్నాయి. ఇద౦తా చూస్తూ...,

శ్రీరాముడు కూడా కొన్ని రాళ్లు వేద్దామని సముద్ర౦లో రాయిని వదిలాడు. 


విచిత్ర౦గా ఆ రాయి మునిగి పోయి౦ది. సరే అని మరొకటి వేశాడు. అది కూడా మునిగి పోయి౦ది. 

ఇదే౦టి! వానరులు వేస్తే తేలుతున్నాయి. నేను వేస్తే మునిగి పోతున్నాయి. అయినా చూద్దా౦ అని మరో రాయి విడిచాడు. అది కూడా మునిగి పోయి౦దట. 


ఇదే౦టని శ్రీరాముడు హనుమను మరి కొ౦దరిని అడిగాడు. 

*స్వామి!* 


*మేము వేసే రాళ్ళ మీద మీ నామ౦ రాస్తున్నా౦. మీరు రాయలేదు కదా* అన్నారు. 


అదే౦టి. 


నేను స్వయ౦గా వేస్తున్నాను కదా...నా నామ౦ రాస్తేనే తేలితే నేను వేస్తే మునిగి పోవట౦ ఏమిటీ?  ఎ౦దుకలా?* అన్నారు స్వామి. 


అందుకు హనుమ ఇలా సమాధానం చెప్పారు.

*స్వామి!* 


*మీరు ఆ రాయిని విడిచి పెట్టేశారు. రాముడిని వదిలేసినా, రాముడు వదిలేసినా మునిగి పోక తప్పదు. అదే జరుగుతో౦ది స్వామి*  అని. 


అందుకే....... 


రామ నామాన్ని జపి౦చ౦డి. ధర్మ౦గా జీవించ౦డి.


 *జై  శ్రీరామ్...*.                    🙏

కామెంట్‌లు లేవు: