20, జనవరి 2023, శుక్రవారం

పెద్దలు చెపుతారు.

 శ్లోకం:☝️

*దశకూప సమా వాపీ*

  *దశవాపి సమో హ్రదః l*

*దశహ్రద సమః పుత్రో*

  *దశపుత్రసమో ద్రుమః ll*


భావం: పది నూతులతో సమానమొక దిగుడు బావి; పది దిగుడు బావులతో సమానము ఒక చెఱువు; పది చెఱువులతో సాటి ఒక పుత్రుడు; పది మంది పుత్రులతో సమానమైనది ఒక్క మహా వృక్షము - అని పెద్దలు చెపుతారు.


*అశ్వత్థమేకం పిచుమందమేకం*

 *న్యగ్రోధమేకం దశతింత్రిణీకం l*

*కపిత్థబిల్వాామలకత్రయం చ*

*పంచామ్రవాపీ నరకం న పశ్యేత్ ll*


భావం: ఒక రావి చెట్టు, ఒక పిచుమంద వృక్షము, ఒక మర్రివృక్షము, పది చింతచెట్లు, వెలగ చెట్లు మూడు, మారేడులు మూడు, పెద్ద ఉసిరిక చెట్లు మూడు, ఐదు మామిళ్లు గల తోటను పెంచి, దానిలో నొక దిగుడుబావిని నిర్మించినవారు నరకమును చూడరు. అనగా స్వర్గమును చూరగొందురని భావము.

    వనములవల్ల సర్వజీవులకు కావలసినవన్నీ పుష్కలముగా లభించగలవనీ, వర్షమునకూ, భూసార పరిరక్షణకూ, ప్రజారోగ్యమునకూ చెట్లు ముఖ్యమనీ మన భారతీయులు, ఏనాడో గ్రహించి ఆచరణలో చూపించారు.🙏

      *వృక్షో రక్షతి రక్షితః*

కామెంట్‌లు లేవు: