13, ఆగస్టు 2023, ఆదివారం

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -18🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర  -18🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


ఒక రోజున ఆకాశరాజు సభకి నారదులవారు రాగా, రాజా మునిని పూజించి వారి ఆశీర్వాదం పొంది, పద్మావతికి తగిన వరునకై తాను చేస్తూన్న అన్వేషణ గూర్చి చెప్పి ‘‘స్వామీ నారదమునీ! మీరు మూడులోకాలూ సంచరిస్తూంటారు కదా! ఎక్కడైనా మా అమ్మాయి పద్మావతికి తగిన సంబందము చూద్దురూ. మీరు తలుచుకుంటే జరగని పని అంటూ వుండదుకదా’’ అన్నాడు. 


నారద మహర్షి ఆకాశ రాజు కు బృగు మహర్షి వృత్తాంతము,లక్ష్మి దేవి వైకుంఠము వెడలుట ,ఆమెను వెదుకుతూ శ్రీ మహావిష్ణువు భూలోకమున కు  వచ్చిన విధానం తెలిపి  ఇంకా ఆ వివరాలు ఈ విధంగా తెలిపారు


శ్రీనివాసుడు లక్ష్మీదేవి కొల్హాపురం నందు ఉన్నదని తెలుసుకుని అక్కడికి చేరగా ఆమె అక్కడి నుండి అంతర్ధానమై తిరుమల కొండలలో కల కపిల మహర్షి ఆశ్రమమునకు చేరినది


 శ్రీనివాసుడు మరల తీవ్ర మనోవేదనతో ఆశ్రమమునకు చేరగా ఆమె అక్కడి నుండి కూడా అదృశ్యమై పాతాళానికి వెళ్ళినది


లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి కపిల మహర్షి సూచనతో తిరుచానూరు పద్మసరోవరము చెంత సూర్య భగవానుని సాక్షిగా చేసుకొని లక్ష్మీదేవి కొరకై 12 సంవత్సరములు తపస్సు చేయగా. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై 


స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువపూదండలతో స్వామివారిని వరించింది. 


కనుక లక్ష్మీ దేవియే పద్మములో జనించిన పద్మావతి లేదా అలమేలు మంగ - (తమిళంలో "అలర్" అనగా పువ్వు. "మేల్" అనగా పైన. "మంగై" అనగా అందమైన స్త్రీ - "అలమేలు" అనగా "పద్మంలో ప్రకాశించున సుందరి")

ఆమె మేని కాంతికి సూర్య కిరణాల కాంతి కూడా చిన్న పోయినది 


ఆ అతిలోక సౌందర్యమును కాంచిన జగత్తు పులకించినది పిదప శ్రీనివాసుని మనో రథమును తీర్చుటకై  మరియు శాప వశమున భువిలో జన్మించిన నిన్ను ఉద్ధరించుట కై జగన్నాటక సూత్రధారి లీలా విశేషాలతో   యజ్ఞ ఫలము గా పసిపాప రూపములో నీకు దొరికినది


ఆమే వేదమాత

ఆమే మహా లక్ష్మి

 ఆమే వేదవతి .

ఆమే లోకమాత

ఆమే శ్రీనివాస హృదయేశ్వరి 


 ఆమెను వివాహము చేసుకొనుటకు అర్హత ఒక్క శ్రీ మహావిష్ణువునకే వున్నది. ఈమెను శ్రీమహావష్ణువు పెండ్లాడును, నమ్ముము.


ఆ శ్రీమహావిష్ణువు నీ కుమార్తెను వివాహమాడే ముహూర్తము త్వరలోనే వున్నది. ఇంక యీ విషయములో బెంగలేకుండా నిశ్చయంగా వుండు అంతా సవ్యంగా జరుగుతుంది’’ అని నారదుడు వెళ్ళిపోయాడు.


ఆశ్రిత రక్ష గోవిందా, అనంత వినుత గోవిందా, వేదాంత నిలయ గోవిందా, వేంకట రమణ గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.||18||

 

శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం..


*ఓం నమో వెంకటేశాయ*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: